అ
అంగడి నెవ్వరు నంటకురో యీ
దొంగలగూడిన ద్రోహులను// పల్లవి //
దోసము దోసము తొలరో శ్రీహరి
దాసానదాసుల దగ్గరక
ఆసలనాసల హరినెరుగక చెడి
వీసరపోయిన వెర్రులము //అంగడి//
పాపము పాపము పాయరో కర్మపు
దాపవువారము దగ్గరక
చేపట్టి వేదపు శ్రీహరి కథలు
యేపొద్దు విననిహీనులము //అంగడి//
పంకము పంకము పైకొనిరాకురో
కొంకుగొసరులకూళలము
వేంకటగిరిపై విభునిపుణ్యకథ
లంకెల విననియన్యులము //అంగడి//
అంగన నిన్నడిగి రమ్మనె నీమాట
సంగతిగ మరుమాట సరి నాన తీవయ్యా
చెలులచే నింతి నీకు చెప్పిపంపిన మాటలు
తలచుకొన్నాడవా దయతో నీవు
తొలుత గాను కంపిన దొడ్డ పూవుల బంతి
లలిమించిన పరిమళము గొంటివా // అంగన //
చాయల నాసతో నాపె సారె జూచిన చూపులు
ఆయములు గరచేనా అంటుకొనెనా
చేయెత్తి సిగ్గుతోడ చేరి మొక్కిన మొక్కులు
ఆయనా నీకు శలవు అందరిలోనా // అంగన //
బెరసి తెరమాటున బెట్టిన నీపై సేసలు
శిరసుపై నిండెనా చిందెనా నీపై
అరుదై శ్రీ వేంకటేశ అలమేలుమంగ యీకె
గరిమ నిన్ను గూడి గద్దెపై గూచున్నది // అంగన //
అంగన యెట్టుండినా నమరుగాక
సంగతే నీకు నాపె సాటికి బెనగను
తనకు బోదైనచోట తగిలి మాటాడకున్న
మనుజుడావాడు పెద్ద మాకు గాక
చనవున బెనగగా సమ్మతించకుండితేను
ఘనత యేది చులకదనమే గాక // అంగన //
చెల్లుబడి గలచోట సిగ్గులు విడువకున్న
బల్లిదుడా వాడూ కడు పందగాక
వెల్లివిరి నవ్వగాను వీడు దోళ్ళాడకున్న
చల్లేటి వలపులేవి సటలింతే కాక // అంగన //
తారుకాణలైన చీట తమకించి కూడకున్న
చేరగ జాణడా గోడచేరుపు గాక
యీ రీతి శ్రీ వేంకటేశ యిట్టె రఘునాథుడవై
కూరిమి గూడితివిది కొత్తలింతే కాక //అంగన//
అంగనలీరే హారతులు
అంగజగురునకు నారతులు ||
శ్రీదేవి తోడుత జెలగుచు నవ్వే
ఆదిమ పురుషుని కారతులు
మేదినీ రమణి మేలము లాడేటి
ఆదిత్య తేజున కారతులు ||
సురలకు నమౄతము సొరది నొసంగిన
హరి కివో పసిడారతులు
తరమిది దుష్టుల దనుజుల నడచిన
అరి భయంకరున కారతులు ||
నిచ్చలు కల్యాణ నిధియై యేగేటి
అచ్యుతునకు నివె యారతులు
చొచ్చి శ్రీ వేంకటేశుడు నలమేల్మంగ
యచ్చుగ నిలిచిరి యారతులు ||
అంగనకు నీవె అఖిలసామ్రాజ్యము
శ్రింగారరాయఁడ నీకు శ్రీసతినిధానము // పల్లవి //
కమలాలపానుపు కాంతకు నీవురము
ప్రమదపు నీమనసు పాలజలధి
అమరు నీభుజాంతర మట్టె తీగెపొదరిల్లు
రమణీయ హారాలు రత్నాలమేడలు // అంగ //
సతికి నీమెడ రతిసాము సేసేకంబము
ప్రతిలేని వయ్యాళి బయలు నీవు
మతించిన కౌస్తుభమణి నిలువుటద్దము
మితిలేని శ్రీవత్సము మించుబండారుముద్ర // అంగ //
నెమ్మి నలమేల్‌మంగ నీకాఁగిలి పెండ్లిపీఁట
చిమ్ముల చందనచర్చ సేసపాలు
వుమ్మడి మెడనూళ్ళు వుయ్యాలసరపణులు
పమ్మి శ్రీవేంకటేశ నీభావమే భాగ్యము // అంగ //
అంగనలాల మనచే నాడించుకొనెగాని
సంగతెఱిగిననెరజాణ డితడే
వొడలులేనివాని కొక్కడే తండ్రాయగాని
తడయక పురుషోత్తము డితడే
బడబాగ్నిజలధికి బాయకల్లుడాయగాని
వెడలించె నమృతము విష్ణుడితడే //అంగనలాల//
పులిగూడుదిన్నవానిపొం దొక్కటే సేసెగాని
నలువంక లక్ష్మీనాథు డితడే
చలికి గోవరివానివరుస బావాయగాని
పలుదేవతలకెల్ల ప్రాణబంధు డితడే //అంగనలాల//
యెక్కడో గొల్లసతుల కింటిమగడాయగాని
తక్కకవెదకేపరతత్త్వ మితడే
మిక్కిలి శ్రీవేంకటాద్రిమీద మమ్ము నేలెగాని
తక్కక వేదముచెప్పేదైవమీతడే //అంగనలాల//
అంచిత పుణ్యులకైతే హరి దైవమవుగాక
పంచమహాపాతకులభ్రమ వాపవశమా
కాననియజ్ఞానులకు కర్మమే దైవము
ఆనినబద్ధులకు దేహమే దైవము
మాననికాముకులకు మగువలే దైవము
పానిపట్టి వారివారిభ్రమ మాన్పవశమా
యేమీ నెఱుగనివారి కింద్రియములు దైవము
దోమటిసంసారి కూరదొర దైవము
తామసులకెల్లాను ధనమే దైవము
పామరుల బట్టినట్టిభ్రమ బాపవశమా
ధన నహంకరులకు తాదానే దైవము
దరిద్రుడైనవానికి దాత దైవము
యిరవై మాకు శ్రీవేంకటేశుడే దైవము
పరులముంచినయట్టి భ్రమ బాపవశమా
ఆంజనేయ అనిలజ హనుమంతా నీ
రంజకపు చేతలు సురలకెంత వశమా
తేరిమీద నీ రూపు తెచ్చిపెత్తి ఆర్జునుడు
కౌరవుల గెలిచే సంగర భూమిని
సారెకు భీముడు పురుషామృగము తెచ్చు చోట
నీరోమములు కావా నిఖిల కారణము
నీ మూలమునగాదే నెలవై సుగ్రీవుడు
రాముని గొలిచి కపిరాజాయెను
రాముడు నీ వంకనేపో రమణి సీతా దేవి
ప్రేమముతో మగువ పెండ్లాడెను
బలుదైత్యులను దుంచ బంటు తనము మించ
కలకాలమునునెంచ కలిగితిగా
అల శ్రీవేంకటపతి అండనె మంగాంబుధి
నిలయపు హనుమంత నెగడితిగా
అంటబారి పట్టుకోరే అమ్మలాల యిదె
వెంటబారనీదు నన్ను వెడమాయతురుము
కాగెడుపెరుగుచాడె కవ్వముతో బొడిచి
లేగల దోలుకొని అలిగిపోయీని
రాగతనమున వాడె రాతిరి నారగించడు
ఆగి నన్ను గూడడిగె నయ్యో ఇందాకను // అంటబారి //
కొలదిగానిపెరుగు కొసరికొసరి పోరి
కలవూరుగాయలెల్ల గలచిపెట్టె
పలుకడు చేతిచట్టి పారవేసి పోయీనదె
చెలగుచు మూటగట్టె జెల్లబో యిందాకను // అంటబారి //
మట్టుపడకిటు నూరుమారులైనా నారగించు
ఇట్టె యిందరిలోన నిన్నాళ్ళును
వెట్టికి నాకొరకుగా వేంకటేశు డారగించె
యెట్టు నేడాకట ధరియించెనో యిందాకను // అంటబారి //
అంతటనే వచ్చికాచు నాపద్భంధుడు హరి
వంతుకు వాసికి నతనివాడనంటేజాలు ||పల్లవి||
బంతిగట్టినురిపేటి పసురము లెడనెడ
బొంత నొక్కొక్క గవుక వుచ్చుకొన్నట్టు
చెంతల సంసారముసేయునరు డందులోనె
కొంతగొంత హరినాత్మ గొలుచుటే చాలు ||అంత||
వరుస జేదుదినేవాడు యెడ నెడ గొంత
సరవితోడుత దీపు చవిగొన్నట్టు
దురితవిధులు సేసి దుఃఖించుమానవుడు
తరువాత హరిపేరు దలచుటే చాలు ||అంత||
కడు బేదైనవాడు కాలకర్మవశమున
అడుగులోనే నిధాన మటు గన్నట్టు
యెడసి శ్రీవేంకటేశు నెరగక గురువాజ్ఞ
పొడగన్నవానిభక్తి పొడముటే చాలు ||అంత|||
అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీరఘురామ
కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలపును
నీవే ధరణీధర నా నెలవును నీవే నీరజనాభ
తనువును నీవే దామోదర నా మనికియు నీవే మధుసూదన వినికియు
నీవే విట్ఠలుడా నా వెనకముందు నీవే విష్ణు దేవుడా
పుట్టుగు నీవే పురుషోత్తమ కొన నట్టనడుము నీవే నారాయణ ఇట్టే
శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే
అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించుకుంటె
వింతవింత విధముల వీడునా బంధములు
మనుజుడై ఫలమేది మరిజ్ఞాని యౌదాకా
తనువెత్తి ఫలమేది దయగలుగుదాకా
ధనికుడై ఫలమేది ధర్మము సేయుదాకా
పనిమాలి ముదిసితే పాసెనా భవము // అంతరంగమెల్ల //
చదివియు ఫలమేది శాంతము కలుగుదాకా
పెదవెత్తి ఫలమేది ప్రియమాడు దాకా
మదిగల్గి ఫలమేది మాధవుదలచు దాకా
ఎదుట తాను రాజైతే ఏలెనాపరము // అంతరంగమెల్ల //
పావనుడై ఫలమేది భక్తి కలిగినదాకా
జీవించి ఫలమేది చింత దీరుదాకా
వేవేల ఫలమేది వేంకటేశు గన్నదాకా
భావించితా దేవుడైతే ప్రత్యక్షమౌనా // అంతరంగమెల్ల //
అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటె వింతవింత విధముల వీడునా బంధములు
మనుజుడై ఫలమేది మరిజ్ఞాని యౌదాకా తనువెత్తి ఫలమేది దయగలుగుదాకా
ధనికుడై ఫలమేది ధర్మము సేయుదాకా పనిమాలి ముదిసితే పాసెనా భవము
చదివియు ఫలమేది శాంతము కలుగుదాకా పెదవెత్తి ఫలమేది ప్రియమాడు దాకా
మదిగల్గి ఫలమేది మాధవుదలచు దాకా యెదుట తాను రాజైతే ఏలేనాపరము
పావనుడై ఫలమేది భక్తి కలిగిన దాకా జీవించి ఫలమేది చింత దీరుదాకా
వేవేల ఫలమేది వేంకటేశుగన్నదాక భావించితా దేవుడైతే ప్రత్యక్షమౌనా
అంతరుమాలినయట్టి అధములాల
పొంత సంతకూటమి పొరిచూపు గాదా
కనక మిత్తడితోడ కలయ సరిదూచితే
అనువవునా అది దోష మవుగాక
ఘనుడైనహరితో గడుహీనదేవతల
ననిచి సరివేట్టితే నయ మవునా భువిని // అంతరుమాలినయట్టి //
పట్టభద్రుడు గూర్చుండేబలుసింహాసనముపై
వెట్టిబంటు బెట్టేవారు వెఱ్ఱులేకారా
గట్టిగా శ్రీహరితోడ కలగంపదేవతల
బెట్టి కొలుచుట విందువెట్టి పగగాదా // అంతరుమాలినయట్టి //
కొంచక సింహముండేటిగుహ నుండవచ్చునా
పొంచి నక్కలకెల్ల బొక్కలేకాక
అంచెల శ్రీవేంకటేశు డాత్మలోనే వుండగాను
కొంచెపుదైవాల పలువంచలనేకాక // అంతరుమాలినయట్టి //
అంతర్యామి అలసితి సొలసితి
ఇంతట నీ శరణిదె జొచ్చితిని
కోరిన కోర్కులు కోయని కట్లు
తీరవు నీవవి తెంచక
భారపు బగ్గాలు పాప పుణ్యములు
నేరుపుల బోనీవు నీవు వద్దనక // అంతర్యామి //
జనుల సంగముల జక్క రోగములు
విను విడువవు నీవు విడిపించక
వినయపు దైన్యము విడువని కర్మము
చనదది నీవిటు శాంతపరచక // అంతర్యామి //
మదిలో చింతలు మైలలు మణుగులు
వదలవు నీవవి వద్దనక
ఎదుటనె శ్రీ వెంకటేశ్వర నీవదె
అదన గాచితివి అట్టిట్టనక // అంతర్యామి //
అందరి బ్రదుకులు నాతనివే
కందువెల్ల శ్రీకాంతునిదే
వేమరు జదివెడి విప్రుల వేదము
సోమకవైరి యశో విభవం
శ్రీమించు నమరుల జీవనమెల్ల సు
ధామ ధనుని సంతత కరుణే
హితవగు నిలలో నీసుఖమెల్లను
దితి సుత దమనుడు దెచ్చినదే
తతి తల్లి దండ్రి తానై కాచిన
రతి ప్రహ్లాద వరదుని కృపే
అలరిన యమరేంద్రాదుల బ్రదుకులు
బలి బంధను కృప బరగినవే
బలసి మునుల యాపదలు వాపుటకు
బలునృప భంజను పరిణతలే
పూని యనాథుల పొందుగ గాచిన
జానకీ విభుని సరసతలే
నానా భూభరణంబులు నందుని
సూనుడు చేసిన సుకృతములే
తలకొని ధర్మము తానై నిలుపుట
కలుష విదూరుని గర్వములే
నిలిచి లోకములు నిలిపిన ఘనుడగు
కలియుగమున వేంకటపతివే
అందరి వసమా హరినెరుఁగ
కందువగ నొకఁడుగాని యెరఁగఁడు // పల్లవి //
లలితపు పదిగోట్లనొకఁడుగాని
కలుగఁడు శ్రీహరిఁ గని మనఁగ
ఒలిసి తెలియు పుణ్యులకోట్లలో
ఇలనొకఁడుగాని యెరఁగడు హరిని // అందరి //
శ్రుతి చదివిన భూసురకోట్లలో
గతియును హరినె యొకానొకఁడు
అతిఘనులట్టి మహాత్మకోటిలో
తతి నొకఁడుగాని తలఁచఁడు హరిని // అందరి //
తుదకెక్కిన నిత్యుల కోట్లలో
పొదుగునొకఁడు తలఁపున హరిని
గుదిగొను హరిభక్తుల కోట్లలో
వెదకు నొకఁడు శ్రీవేంకటపతిని // అందరి //
అందరికాధారమైన ఆది పురుషుడీతడు
విందై మున్నారగించె విదురునికడ నీతుడు
సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు
వనజ భవాదులకును దైవంబై నతడీతడు
ఇనమండలమున జెలగేటిహితవై భవుడితడు
మునుపుట్టిన దేవతలకు మూలభూతి యీతడు // అందరికాధారమైన //
సిరులొసగి యశోదయింట శిశువైనత డీతడు
ధరనావుల మందలలో తగ జరించె నీతడు
సరసతలను గొల్లెతలకు జనవులొసగె నీతడు
ఆరసి కుచేలుని యడుకులు ఆరగించెనీతడు // అందరికాధారమైన //
పంకజభవునకును బ్రహ్మ పద మొసగెను యీతుడు
సంకీర్తన లాద్యులచే జట్టి గొనియెనీతడు
తెంకిగ నేకాలము పరదేవుడైన యీతడు
వేంకటగిరి మీద ప్రభల వెలసిన ఘనుడీతడు // అందరికాధారమైన //
అందరికి నెక్కుడైన హనుమంతుడు
అందుకొనె సూర్యఫలమని హనుమంతుడు
బల్లిదుడై లంకజొచ్చి బలురాకాసుల గొట్టి
హల్లకల్లోలము చేసె హనుమంతుడు
వొల్లనె రాముల ముద్దుటుంగరము సీత కిచ్చె
అల్లదె నిలుచున్నాడు హనుమంతుడు
దాకొని యాకెముందర తనగుఱు తెరుగించి
ఆకారమటు చూపె హనుమంతుడు
చేకొని శిరోమణి చేతబట్టి జలనిధి
ఆకసాన దాటివచ్చె హనుమంతుడు
కొంకకిట్టె సంజీవి కొండ దెచ్చి రిపులకు
నంకకాడై నిలిచెను హనుమంతుడు
తెంకినే శ్రీవెంకటాద్రి దేవుని మెప్పించినాడు
అంకె కలశాపురపు హనుమంతుడు
అందరికి సులభుడై అంతరాత్మ యున్నవాడు
యిందునే శేషగిరిని యిరవై విష్ణుడు
యోగీశ్వరుల మతినుండేటి దేవుడు క్షీర –
సాగరశాయియైన సర్వేశుడు
భాగవతాధీనుడైన పరమపురుషుడు
ఆగమోక్తవిధులందు నలరిననిత్యుడు
వైకుంఠమందునున్న వనజనాభుడు పర-
మాకారమందునున్న ఆదిమూరితి
ఆకడసూర్యకోట్లందునున్న పరంజ్యోతి
దాకొన బ్రహ్మాండాలు ధరించిన బ్రహ్మము
నిండువిస్వరూపమై నిలిచినమాధవుడు
దండివేదంతములు వెదకే ధనము
పండిన కర్మఫలము పాలికివచ్చినరాసి
అండనే శ్రీవేంకటేశుడైన లోకబంధుడు
అందరివలెనే వున్నాడాతడా వీడు
యిందుముఖుల గూడినా డీతడా నాడు
యిందరూ నేటేట జేసేయింద్రయాగపు ముద్దలు
అందుకొని యారగించినాతడా వీడు
చెంది మునులసతులసత దెప్పించుక మంచి
విందులారగించినాడు వీడానాడు // అందరివలెనే //
తొలుత బ్రహ్మదాచిన దూడలకు బాలులకు
అలరి మారుగడించినాతడా వీడు
నిలుచుండేడుదినాలు నెమ్మది వేలగొండెత్తి
యిల నావుల గాచినా డీతడా నాడు // అందరివలెనే //
బాలుడై పూతనాదుల బలురక్కసుల జంపి
అలరియాటలాడిన యాతడా వీడు
యీలీల శ్రీవేంకటాద్రి యెక్కినాడు తొలుతే
యేలెను బ్రహ్మాదుల నీతడానాడు // అందరివలెనే //
అందరు మాలినయట్టిఆధమూలాల
పొంత సంతకూటమి పొరిచూపు గాదా
కనక మిత్తడితోడ కలయ సరిదూచితే
అనువనువునా అది దోషమవుగాక
ఘనుడైనహరితో గడుహీనదేవతల
నవిచి సరివెట్టితే నయ మవునా భువిని
పట్టభద్రుడు గూర్చుండేబలుసింహాసనముపై
వెట్టింబంటు బెట్టేవారు వెఱ్రులేకారా
గట్టిగా శ్రీహరితోడ కలగంపదేవతల
బెట్టి కొలుచుట విందువెట్టి పగగాదా
కొంచక సింహముండేటిగుహ నుండవచ్చునా
పొంచి నక్కలకెల్ల బొక్కలేకాక
అంచెల శ్రీవేంకటేశుడాత్మలోనే వుండగాను
కొంచపుదైవాల పలువంచలనేకాక
అందాకదాదానే అంతుకెక్కుడు గాదు
ముందువెనుకంచేనా ముఖ్యుడే యతడు
చిత్తమంతర్ముఖము సేసుకొన నేర్చెనా
అత్తలనతడు యోగియనబడును
సత్తసత్తనెడి సువిచారంబు గలిగెనా
వుత్తమ వివేకియని వూహింపబడును // అందాకదాదానే //
భావము నబావమును పరికించి తెలిసెనా
కైవల్యనిలయుడని కానబడును
దైవముదన్నుమతిదలపోయెనేర్చెనా
జీవన్ముక్తుడని చెప్పబడునతడు // అందాకదాదానే //
అడరి వైరాగ్యధనమార్జించనోపెనా
దిడువై జితేంద్రియ స్థిరుడాతడు
జడియు శ్రీవేంకటేశ్వరుదాసుడాయనా
బడిబడిదుదబర బ్రహ్మమేయతడు // అందాకదాదానే //
అందాకా నమ్మలేక అనుమానపడు దేహి
అంది నీసొమ్ముగనక అదియు దీరుతువు
నీదాసుడననేటినిజబుద్ది గలిగితే
అదెస నప్పుడే పుణ్యుడాయ నతడు
వేదతొ వొక్కొక్క వేళ వెలుతులు గలిగితే
నిదయవెట్టి వెనక నీవే తీరుతువు
తొలుత నీశరణము దొరకుటొకటేకాని
చెలగి యాజీవునికి జేటు లేదు
కలగి నడుమంత్రాన గతిదప్పనడచిన
నెలకొని వంకలొత్తనీవే నేరుతువు
నీ వల్ల గొరత లేదు నీపేరు నొడిగితే
శ్రీవేంకటేశ యిట్టె చేరి కాతువు
భావించలేకుండగాను భారము నీదంటే జాలు
నీవారి రక్షించ నీవె దిక్కౌదువు
అందిచూడఁగ నీకు నవతారమొకటే
యెందువాఁడవై తివి యేఁటిదయ్యా // పల్లవి //
నవనీతచోరా నాగపర్యంకా
సవనరక్షక హరీ చక్రాయుధా
అవల దేవకిపట్టివని యశోదకు నిన్ను
నివలఁ గొడుకవనేదిది యేఁటిదయ్యా // అంది //
పట్టపు శ్రీరమణా భవరోగవైద్య
జట్టిమాయలతోడిశౌరి కృష్ణ
పుట్టినచో టొకటి పొదలెడిచో టొకటి
యెట్టని నమ్మవచ్చు నిదియేఁటిదయ్యా // అంది //
వేదాంతనిలయా వివిధాచరణా
ఆదిదేవ వేంకటాచలేశ
సోదించి తలఁచినచోట నీ వుందువట
యేదెస నీ మహిమ యిదేఁటిదయ్యా // అంది //
అందులోనె వున్నావాడు ఆది మూరితి
అందరాని పదవియైన నందిచ్చు నతడు
ఘనులిండ్ల వాకిళ్ళు కావ బొయ్యే జీవుడా
కని ణీ యాత్మ వాకిలి కావరాదా
యెనసి పరుల రాజ్య మేలబొయ్యే జీవుడా
అనిశము నీ మనో రాజ్యము నేలరాదా // అందులోనె //
చెలుల రూపము లెల్ల చింతించే జీవుడా
చెలగి నీ రూప మేదో చింతించ రాదా
కెలన సుఖములు భోగించేటి జీవుడా
పొలసి సుజ్ఞానము భోగించరాదా // అందులోనె //
చేవ సంసారాన బలిసిన యట్టి జీవుడా
భావపు టానందాన బలియ రాదా
కోవరపు సంపదల కోరేటి జీవుడా
శ్రీ వేంకటేశుని సేవగోర రాదా // అందులోనె //
అక్కటా రావణు బ్రహ్మ హత్య నీకు నేడది
పుక్కిట పురాణ లింగ పూజ నీకు నేడది
గురు హత్య బ్రహ్మ హత్యన్ గూడి ద్రోణాచార్యు వంక
హరి నీ క్రుప నర్జునుకవి లేవాయ
యెరవుగా గల్లలాడి యేచిన ధర్మ రాజునకు
పరగ నీ యనుమతిన్ పాపము లేదాయను
అదివో రుద్రుని బ్రహ్మ హత్య బాయన్ గాసి ఇచ్చి
పొదలిన నీవతని బూజింతువా
అదనన్ పార్వతీదేవి కాతండే నీ మంత్రమిచ్చె
వదరు మాటల మాయా వచనాలేమిటికి
తగిలిన నీ నామమే తారక బ్రహ్మమై
జగము వారి పాపాలు సంతతమూ బాపన్ గాను
మిగుల శ్రీ వేంకటేశ నేడ మీకు పాతకాలు
నగున్ బాటు లింతే కాక నానా దేశముల
అక్కడ నాపాట్లువడి యిక్కడ నీపాటు పడి
కుక్కనోరికళాసమై కొల్లబోయ బతుకు
ఎండచేత నీడచేత నెల్లవాడు నిట్లానే
బండుబండై యెందు గడపల గానక
వుండగిలి నరకాల నుడుకబోయెద మింక
వండదరిగిన కూరవలెనాయ బతుకు // అక్కడ నాపాట్లువడి //
పంచమహాపాతకాలబారి బడి భవముల
దెంచి తెంచి ముడివేయ దీదీపులై
పొంచినయాసలవెంట బొరలబోయెద మింక
దంచనున్న రోలిపిండితలపాయ బతుకు // అక్కడ నాపాట్లువడి //
యీదచేత వానచేత నెల్లనాడు బాయని
బాదచేత మేలెల్ల బట్టబయలై
గాదిలి వేంకటపతి గానగబోయెద మింక
బీదగరచినబూరె ప్రియమాయ బ్రదుకు // అక్కడ నాపాట్లువడి //
అక్కరకొదగనియట్టియర్థము
లెక్క లెన్నియైనా నేమి లేకున్న నేమిరే
దండితో దనకుగానిధరణీశురాజ్యంబు
యెండెనేమి యది పండెనేమిరే
బెండుపడ గేశవుని బేరుకొననినాలికె
వుండెనేమి వుండకుండెనేమిరే // అక్కరకొదగని //
యెదిరి దన్ను గాననియెడపులగుడ్డికన్ను
మొదల దెఱచెనేమి మూసెనేమిరే
వెదకి శ్రీపతిసేవ వేడుక జేయనివాడు
చదివెనేమి చదువు చాలించెనేమిరే // అక్కరకొదగని //
ఆవల నెవ్వరులేని అడవిలోనివెన్నెల
కావిరి గాసెనేమి కాయకున్ననేమిరే
శ్రీవేంకటేశ్వరు జేరనిధర్మములెల్ల
తోవల నుండెనేమి తొలగిననేమిరే // అక్కరకొదగని //
అక్కలాల చూడుడందరును
నిక్కివారవట్టీ నేడు గృష్ణుడు
ఆనవాలవుట్టి అడకులవుట్టి
పానకపుటుట్టి బలిమినే
ఆనుక కోలలనందియంది కొట్టి
తేనెవుట్టి గొట్టి దేవకిసుతుడు // అక్కలాల //
పెరుగువుట్టి మంచిపేరిన నేతివుట్టి
సరివెన్నవుట్టి చక్కెరవుట్టి
వెరవుతో గొట్టి వెసబాలులతో
బొరుగువుట్టి గొట్టీపొంచి రాముడు // అక్కలాల //
మక్కువ నలమేలుమంగగూడి నేడు
చొక్కి శ్రీవేంకటేశుడు వీధుల
నిక్కి వుట్లెల్లా నిండా గొట్టివుట్టి
చక్కిలాలు గొట్టీ జగతీశుడు // అక్కలాల //
అచ్చపు రాల యమునలోపల
ఇచ్చగించి భుజియించితి కృష్ణ // పల్లవి //
ఊరుఁగాయలును నొద్దికచద్దులు
నారగింపుచు నందరిలో
సారె బాలుల సరసాలతోడ
కోరి చవులు గొంటివి కృష్ణా // అచ్చ //
ఆకసంబున కాపుర ముఖ్యులు
నాకలోకపు నాందులును
కైకొని యజ్ఞకర్త యాతఁడని
జోకఁ గొనియాడఁ జొక్కితి కృష్ణా // అచ్చ //
పేయలు లేవు పిలువుఁడనుచు
కోయని నోరఁ గూతఁలను
మాయల బ్రహ్మము మతము మెచ్చుచు
చేయని మాయలు సేసితి కృష్ణా // అచ్చ //
అచ్చుత మిమ్ముదలచేయంతపని వలెనా యిచ్చల మీవారే మాకు నిహపరా లియ్యగా
మిమ్ము నెఱిగినయట్టిమీదాసుల నెఱిగే_ సమ్మవిజ్ఞానమే చాలదా నాకు వుమ్మడి మీసేవ సేసుకుండేటివైష్ణవుల_ సమ్ముఖాన సేవించుటే చాలదా నాకు।
నిరతి నీకు మొక్కేనీడింగరీలకు సరవితో మొక్కుటే చాలదా నాకు పరగ నిన్ను బూజించే ప్రసన్నుల బూజించే_ సరిలేనిభాగ్యము చాలదా నాకు।
అంది నీకు భక్తులై నయలమహానుభావుల_ చందపువారిపై భక్తి చాలదా నాకు కందువ శ్రీ వేంకటేశ కడు నీబంటుబంటుకు సందడిబంటనవుటే చాలదా నాకు ।
అచ్చుతుశరణమే అన్నిటికిని గురి
హెచ్చుకుందు మరి యెంచఁగనేది // పల్లవి //
యోనిజనకమగు యొడ లిది
యే నెల వైనా నేఁటి కులము
తానును మలమూత్రపుఁ జెలమ
నానాచారము నడచీనా // అచ్చు //
పాపపుణ్యముల బదుకిది
యేపొద్దు మోక్షం బెటువలె దొరకు
దీపనబాధల దినములివి
చూపట్టి వెదకఁగ సుఖ మిందేది // అచ్చు //
మరిగినతెరువల మనసుయిది
సరవినెన్న విజ్ఞానంబేది
యిరవుగ శ్రీవేంకటేశ్వరుఁడే
వెరవని కంటే వెలితిఁక నేది // అచ్చు //
అటు గుడువు మనస నీ వన్నిలాగుల బొరలి
ఇటు గలిగె నీకు నైహికవిచారములు // పల్లవి //
కోరికలకును గలిగె ఘోరపరితాపంబు
కూరిమికి గలిగె ననుకూలదుఃఖములు
తారతమ్యములేని తలపోతలకు గలిగె
భారమైనట్టి లంపటమనెడిమోపు // అటు గుడువు //
తనువునకు గలిగె సంతతమైనతిమ్మటలు
మనువునకు గలిగె నామవికారములు
పనిలేని సంసార బంధంబునకు గలిగె
ఘనమైన దురిత సంగతితోడి చెలిమి // అటు గుడువు //
దేహికిని గలిగె నింద్రియములను బోధింప
దేహంబునకు గలిగె తెగనిసంశయము
దేహాత్మకుండయిన తిరువేంకటేశునకు
దేహిదేహాంతరస్థితి జూడగలిగె // అటు గుడువు //
అటుగన రోయగ దగవా
నటనల శ్రీహరి నటమింతే // పల్లవి //
చిడుముడి మూగినజీవులలోపల
కడగి నే నొక్కడ నింతే
నిడువక పక్షులు వృక్షము లిలపై
వెడగుభోగముల వెదకీనా // అటుగన //
తనువులు మోచినతగుప్రాణులలో
గనుగొని నొకమశకమ నింతే
మునుకొని కీటకములు జీమలు నిల
చెనకి దొరతనము సేసీనా // అటుగన //
శ్రీవేంకటపతిసేవవారిలో
సోవల నొకదాసుడ నేను
భావించి సురలు బ్రహ్మాదు లతని
దైవపుమాయలు దాటేరా // అటుగన //
అటుచూడు సతినేర్పు లవుభళేశ
అటుమటములు గావు అవుభళేశ // పల్లవి //
యెదురు గొండల మీద నెక్కినట్టి లకిమమ్మ
అదివో నీ తొడ యెక్కినౌభళేశ
వుదుటున నంతలోనే వురముపై నెలకొని
అదిమీ జన్నుల నిన్ను నౌభళేశ // యెదురు గొండల //
ముంగోపముతోడను మొక్కలీడవైన నిన్ను
నంగన గద్దెపై బెట్టె నౌభళేశ
కంగక వేదాద్రి నిన్ను గరుడాద్రికి దీసె
అంగా లంటె నింటిలోన నౌభళేశ // యెదురు గొండల //
చేరి నీవు నవ నారసింహరూపులైతే జెలి
ఆ రీతుల నిన్ను గూడె నౌభళేశ
గారవాన నీవు శ్రీ వేంకటముపై నుండగాను
అరసి రతి మెప్పించె నౌభళేశ // యెదురు గొండల //
అటువంటి వైభవము లమర జేసిన దైవ
మిటువంటి యోగంబు లిన్నియును జేసి // పల్లవి //
జలజాక్షి లావణ్య జలధినుప్పొంగిన
నలివేణి ముఖచంద్రు డభ్యుదయ మాయె
కలికి వలరాయడను కాలకూటంబుతో
దలకొన్న యధరామృతంబు జన్మించె // అటువంటి //
వనిత సౌభాగ్యంబు వనధిలోపల దోచె
గొనకొన్న గుఱుతైన కుచపర్వతములు
తనివోని కోరికల తగు తురంగములతో
ననువైన విరహ బడబానలము గలిగె // అటువంటి //
భామయవ్వన మనెడి పాలజలధిలోన
వామాక్షి యైన యవ్వన లక్ష్మి గలిగె
యీ మంచి తిరువేంకటేశ్వరుం డిందులో
బ్రేమమున సుఖియించి పెంపొందగలిగె // అటువంటి //
అటువంటివాడువో హరిదాసుడు
ఆటమాటలు విడిచినాతడే సుఖి // పల్లవి //
తిట్టేటిమాటలును దీవించేమాటలును
అట్టే సరెయని తలచినాతడే సుఖి
పట్టిచంపేవేళను పట్టముగట్టేవేళ
అట్టునిట్టు చలించని యాతడే సుఖి // అటువంటివాడువో //
చేరి పంచదారిడిన జేదు దెచ్చిపెట్టినాను
ఆరగించి తనివొందే యతడే సుఖి
తేరకాండ్ల జూచిన తెగరానిచుట్టముల
నారయ సరిగాజూచే యాతడే సుఖి // అటువంటివాడువో //
పొంది పుణ్యము వచ్చిన పొరి బాపము వచ్చిన
నందలి ఫలమొల్లని యాతడే సుఖి
విందుగా శ్రీవేంకటాద్రి విభునిదాసుల జేరి
అందరానిపద మందిన నాతడే సుఖి // అటువంటివాడువో //
అట్టివేళ గలగనీ దదివో వివేకము
ముట్టువడితే శాంతము మరి యేలా // పల్లవి //
జడధులు వొంగినట్టు సందడించు నింద్రియములు
వొడలిలో జీవునికి నొక్కొకవేళ
బడబాగ్ని రేగినట్లు పైకొనీ ముంగోపము
వుడికించు మననెల్ల నొక్కొకవేళా // అట్టివేళ //
అరయ గొండయెత్తినట్టు వేగౌ సంసారము
వూరక కలిమిలేము లొక్కొకవేళ
మేరలేనిచీకటియై మించును దుఃఖములెల్లా
వూరటలేనికర్మికి నొక్కొకవేళా // అట్టివేళ //
పెనుగాలి వీచినట్టు పెక్కుకోరికలు ముంచు
వొనర నజ్ఞానికి నొక్కొకవేళా
యెనయగ శ్రీవేంకటేశుదాసుడైనదాకా
వునికి బాయవన్నియు నొక్కొకవేళా // అట్టివేళ //
అడుగరే చెలులాల అతనినే యీ మాట
వుడివోని తమకాన నుండ బోలు తాను
వేడుక గలప్పుడే వెస నవ్వు వచ్చు గాక
వాడి వున్నప్పుడు తలవంపులే కావా
యేడనో సతుల చేత యేపులబడి రాబోలు
యీడ నే జెనక గాను యిటులా నుండునా // అడుగరే //
ఆసల గూడినప్పుడె ఆయాలు గరగు గాక
పాసి వున్నప్పుడు తడబాటులే కావా
బేసబెల్లి వలపుల పిరి వీకై రాబోలు
వేన నే బెట్టగాను సిగ్గువడి వుండునా // అడుగరే //
సరస మాడి నప్పుడె చవులెల్లా బుట్టు గాక
గొరబైన యప్పుడు కొరతలే కావా
యిరవై శ్రీ వేంకటేశు డింతలోనె నన్ను గూడె
వరుస నిందాకా నిటువలె జొక్కకుండునా // అడుగరే //
అడుగరే యాతనినే అంగనలాలా
గుడిగొని తానే వట్టి గొరబాయగాక
యెదురాడేదాననా యెంతటి పనికినైనా
పదరి తానే మారువలికీ గాక
తుదమీఱేదాననా దూరైయంత దిరిగినా
ముదమునదానే మారుమలసీగాక // అడుగరే //
కక్కసించే దాననా కడలెంత దొక్కినాను
వెక్కసీడై తానై యిటు వెలసీగాక
మొక్కలపుదాననా ముందు వెనకెంచితేను
పక్కనె దానె ముంచి పంతమాడీగాక // అడుగరే //
తడబడేదాననా తనరతి వేళను
బడిబడి దానే చొక్కి భ్రమసీగాక
అడిగేటి దాననా అందరిలో నన్నుగూడి
అడరి శ్రీవేంకటేశు డాదరించీగాక // అడుగరే //
అడుగరే యీమాట అతని మీరందరును
యెడయనిచోటను ఇగిరించుఁ బ్రియము // పల్లవి //
పొరపొచ్చమగుచోట పొసఁగవు మాటలు
గరిమ నొరసితేను కలఁగు మతి
సరవులు లేనిచోట చలము వెగ్గళమవును
నొరసి పెనఁగేచోట నుమ్మగిలు వలపు // అడు //
వొలసీనొల్లనిచోట వొనరవు నగవులు
బలిమి చేసేచోట పంతమురాదు
అలుకచూపేచోట అమరదు వినయము
చలివాసివుండేచోట చండిపడుఁ బనులు // అడు //
ననుపులేనిచోట నమ్మికచాలదు పొందు
అనుమానమైనచోట నంటదు రతి
యెనసినాఁడు వేంకటేశుఁడు నన్నింతలోనె
తనివిలేనిచోట దైవారుఁ గోర్కులు // అడు //
అడుగవయ్యా వరములాపె నేమైనా నీవు
బడిబడి నిదివో ప్రత్యక్షమాయ నీకు
చెలయపేరే నీకు సేసే జపమంతములు
కలసేటి సన్నలే యంగన్యాసాలు
ములువాడి కొనగోరి మోపులే నానాముద్రలు
ఫలియించెదపమాపె ప్రత్యక్షమాయ నీకు // అడుగవయ్యా //
ఆపెపైజల్లేవలపదే తర్పణజలము
దీపించు నవ్వు పాయస దివ్యహోమము
దాపగు నీయథరామృతమే మంచిభోజనము
నీపాలబ్రత్యక్షమాయ నెలతె యిదె నీకు // అడుగవయ్యా //
పొందులకాగిటి రతి పురశ్చరణ ఫలము
అందియాపె చక్కని రూపది యంత్రము
యిందునె శ్రీవేంకటేశ యిటు నన్నుగూడితివి
అందమై ప్రత్యక్షమాయ నప్పటిదానె నీకు // అడుగవయ్యా //
అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాదిసిరి అంజనాద్రిమీది రూపము
వేదాంతవేత్తలెల్ల వెదకేటిరూపము
ఆదినంత్యము లేని యారూపము
పాదు యోగీంద్రులు భావించురూపము
యీదెస నిదివో కోనేటిదరి రూపము
పాలజలనిధిలోన (బవళించేరూపము
కాల సూర్యచంద్రాగ్నిగల రూపము
మేలిమి వైకుంఠాన మెరసిన రూపము
కీలైనదిదె శేషగిరిమీదిరూపము
ముంచినబ్రహ్మాదులకు మూలమైనరూపము
కొంచని మఱ్ఱాకుమీది కొనరూపము
మంచి పరబ్రహ్మమై మమ్మునేలిన రూపము
యెంచగ శ్రీవేంకటాద్రి నిదె రూపము
అణురేణుపరిపూర్ణుడైన శ్రీవల్లభుని
బ్రణుతించువారువో బ్రాహ్మలు // పల్లవి //
హరినామములనె సంధ్యాదివిధు లొనరించు
పరిపూర్ణమతులువో బ్రాహ్మలు
హరిమంత్ర వేదపారాయణులు హరిభక్తి
పరులైన వారువో బ్రాహ్మలు // అణురేణుపరిపూర్ణుడైన //
ఏవిచూచినను హరి యిన్నిటా గలడనుచు
భావించువారువో బ్రాహ్మలు
దేవకీనందనుడె దేవుడని మతిదెలియు
పావనులు వారువో బ్రాహ్మలు // అణురేణుపరిపూర్ణుడైన //
ఆదినారాయణుని ననయంబు దమయాత్మ
బాదుకొలిపనవారు బ్రాహ్మలు
వేదరక్షకుడైన వేంకటగిరీశ్వరుని
పాదసేవకులువో బ్రాహ్మలు // అణురేణుపరిపూర్ణుడైన //
అతఁడే రక్షకుఁ డందరి కతఁడే
పతి యుండఁగ భయపడఁ జోటేది // పల్లవి //
అనంతకరము లనంతాయుధము –
లనంతుఁడు ధరించెలరఁగను
కనుఁగొని శరణాగతులకు మనకును
పనివడి యిఁక భయపడఁజోటేది // అతఁడే //
ధరణి నభయహస్తముతో నెప్పుడు
హరి రక్షకుఁడై యలరఁగను
నరహరికరుణే నమ్మినవారికి
పరఁదున నిఁక భయపడఁజోటేది // అతఁడే //
శ్రీ వేంకటమున జీవులఁ గాచుచు
నావల నీవల నలరఁగను
దైవశిఖామణి దాపగు మాకును
భావింపఁగ భయపడఁజోటేది // అతఁడే //
అతడు భక్తసులభు డచ్యుతుడు
రాతిగుండెవాడు గాడు రంతు మాను డికను
జీవుడా వేసరకు చిత్తమా జడియకు
దైవము గరుణించ దడవుగాదు
తోవచూపె మనకుతొల్లే ఆచార్యుడు
కావలసినట్లయ్యీ గలగకు డికను // అతడు భక్తసులభు //
కాలమా వేగిరించకు కర్మమా నన్ను మీరకు
పాలించ దైవానకు నే భార మికను
ఆలించి తిరుమంత్రమే ఆతని నన్ను గూరిచె
వేలగానిఅందాకా వేసరకు డికను // అతడు భక్తసులభు //
వెరవకు దేహమా వేసరకు ధ్యానమా
యెరిగి శ్రీవేంకటేశు డెడసిపోడు
తరి నిహపరము లితనిదాసు లిచ్చిరి
గురియైతి నిన్నిటికి గొంకకుడీ ఇకను // అతడు భక్తసులభు //
అతడెవ్వాడు చూపరే అమ్మలాల
ఏతుల నాడేటి క్రిశ్ణుడీతడే కాడుగదా ||
కందువ దేవకి బిడ్డగనె నట నడురేయి
అందియ్శోదకు గొడుకైనాడుట
నందడించి పూతకిచంటి పాలుదాగెనట
మందల ఆవులగాచి మలసెనట // అతడెవ్వాడు //
మంచిబండి దన్నెనట ముద్దులు విరిచెనట
ఇంచుకంతవేల గొండయెత్తి నాడుట
మంచాలపై గొల్లెతలమానాలు చేకొనెనట
మించుల బిల్ల గోలివట్టి మెరసెనట // అతడెవ్వాడు //
కాళింగుని మెట్టెనట కంసుబొరిగొనెనట
పాలించి సురల జేపట్టెనట
యీలీల వేంకటాద్రి నిరవైనదేవుడట
యేలెనట పదారు వేలింతుల నిందరిని // అతడెవ్వాడు //
ప. అతడే పరబ్రహ్మం అతడే లోకనాయకుడు
అతనికంటే మరి అధికులు లేరయ్యా
చ|| కమలవాసిని లక్ష్మి కలదా యెవ్వరికైనా?
కమలనాభునికి ఒక్కనికే కాక
కమలజుడైన బ్రహ్మ కలడా యెవ్వని నాభిన్
అమర వంద్యుడు మాహరికే కాక
చ|| అందరునుండెది భూమి అన్యులకు కలదా
అందపు గోవిందునికే ఆలాయగాక
చెందిన శ్రీభాగీరథి శ్రీపాదాల గలదా
మంధరధరుడైన మాధవునికే(కి) గాక
చ|| నిచ్చలు అభయమిచ్చే నేరుపు యెందుగలదా
అచ్చుగా నారాయణునియందే గాక
రచ్చల శరణాగతరక్షణమెందు గలదా
తచ్చిన శ్రీవేంకటాద్రి దైవానికేగాక
అతడే యెరుగును మముబుట్టించిన యంతరాత్మయగు నీశ్వరుడు
అతికీనతుకదు చిత్తశాంతి యిదె ఆత్మవిహారంబిక నేదో
కనుచున్నారము సూర్యచంద్రులకు ఘన వుదయాస్తమయములు
వినుచున్నారము తొల్లిటివారల విశ్వములోపలి కథలెల్లా
మనుచున్నారము నానాటికి మాయల సంసారములోన
తనిసీ దనియము తెలిసీ దెలియము తరువాతి పనులిక నేవో // అతడే యెరుగును //
తిరిగెదమిదివో ఆసలనాసల దిక్కుల నర్ధార్జన కొరకు
పొరలెదమిదివో పుణ్యపాపముల భోగములందే మత్తులమై
పెరిగెదమిదివో చచ్చెడి పుట్టెడి భీతుగలుగు దేహములలోనే
విరసము లెరగము మరచీ మరవము వెనకటి కాలము విధియేదో // అతడే యెరుగును //
అట్లైనారము హరినుతిచే నాఱడి (బోవక) గురువనుమతిని
పట్టినారమిదె భక్తిమార్గమిదె (మును) బలువగు విజ్ఞానముచేత
గట్టిగ శ్రీవేంకటపతి శరణని కంటిమిదివొ మోక్షము తెరువు
ముట్టీముట్టము పట్టీపట్టము ముందటి కైంకర్యంబేదో // అతడే యెరుగును //
అతడే సకలము అని భావింపుచు
నీతితో నడవక నిలుకడ యేది.
యెందును జూచిన యీశ్వరుడుండగ
విందుల మనసుకు వెలితేది
సందడించేహరిచైతన్య మిదివో
కందువలిక వెదకగ నేది.
అంతరాత్ముడై హరి పొడచూపగ
పంతపుకర్శపుభయ మేది
సంతత మాతడే స్వతంత్రుడిదివో
కొంత గొంత మరి కోరేది లేదు,
శ్రీ వేంకటపతి జీవుని నేలగ
యీవల సందేహ మిక నేది
భావం బీతడు ప్రపంచ మీతడు
వేవేలుగ మరి వెదకెడిదేది.
అతని కొక్కతెవే వాలు నైతివా
సతులందరును నీసాటివారే కారా ||
గాదె బోసుకొనే వేమే గంపముంచి వలపులు
పోదిసేసి రమణుని పొంతనీవుండి
పాదుసేసి విత్తేవేమే పద నుతోనీసిగ్గులు
అదిగొని చన్నులు పయ్యద గప్పికప్పి ||
నెదజల్లేవేమే వెన్నెలవంటి నవ్వులు
కొదదీర నీతని కొలువునను
తుద బచరించేవేమే తొంగి తొంగినీ చూపులు
చెదరిన నీ కొప్పు చేత దెట్టుకొంటాను ||
వొడిగట్టు కొనేవేమే వుబ్బరి సంతోసాలు
కడగి శ్రీవేంకటేశు కౌగిటగూడి
నడుమ నీవది యేమే నన్ను నీతండిపుడేలె
అడరియలమేల్మంగనౌతనీ వెఅగవానీ ||
అతని గూడినప్పుడే అన్నియు సాధించవమ్మా
రాతిరాయ నికనైన రమ్మనవమ్మా
అంపినమాట కుత్తర మానతియ్యవమ్మా
వంపుమోముతో నలుక వలదమ్మా
పంపుడు చెలులమిదే పలుక విదేమమ్మా
చెంప జారిన తురుము చెరుగుకోవమ్మా
తమకించే పతితో నీతలపు లేమందుమమ్మా
కొమరు చూపుల లోన కోపమేలమ్మా
జమళినిద్దరి గూడి గములవారమమ్మా
చెమరించె మేనెల్లా చిన్నబోకువమ్మా
యెదురుగా వచ్చు నాతడిట్టె మమ్మంపవమ్మా
కదిసితి వికనీకు కడుమేలమ్మా
యెదుట శ్రీవేంకటేశు డేగివచ్చి నిన్నుగూడె
వదలడు దినమిట్టె వచ్చీ నోయమ్మా
అతని దోడితెచ్చినందాకా
హిత బుద్దుల చెలియేమరకు మీ ||
వెలది విరహముల వేసవికాలమిది
యెలమి మోవి చిగురెండనీకు మీ
కలికి నిట్టూర్పుల గాలికాద మదె
తేలివలపుపదని తియ్యనీకుమీ ||
వనిత పెంజెమట వానకాల మదె
మొనపులకననలు ముంచనీకిమీ
మనవుల సిగ్గుల ముంచుగాలమదె
ఘనకుచగిరులను గప్పనీకు మీ ||
వెసగాంత నవ్వు వెన్నెల కాలము
ససి గొప్పు చీకటి జారనీకు మీ
పసగా శ్రీవేంకటపతి విచ్చెసి కూడె
వసంతకాల మిదె వదలనీకు మీ ||
అతని పాడెదను అది వ్రతము
చతురుని శేషాచల నివాసుని // పల్లవి //
సనకాదులు ఏ సర్వేశు గొలిచిరి
అనిశము శుకుడెవ్వని దలచె
మును ధ్రువు డేదేవుని సన్నుతించె
ఘన నారదు డేఘనుని పొగడెను // అతని పాడెదను //
ఎలమి విభీషణు డేదేవుని శరణని
తలచె భీష్ముడే దైవమును
బలు ప్రహ్లాదుని ప్రాణేశు డెవ్వడు
ఇలలో వశిష్ఠు డేమూర్తి దెలిసె // అతని పాడెదను //
పురిగొని వ్యాసు డేపురుషుని చెప్పెను
తిరముగ అర్జునుని దిక్కెవ్వడు
మరిగిన అలమేలమంగపతి ఎవ్వడు
గరిమల శ్రీవేంకటేశు డీతడు // అతని పాడెదను //
అతనికెట్ల సతమైతినో కడు
హితవో పొందులహితవో యెఱగ // పల్లవి //
హృదయము తలపున నిరవయినగదా
పదిలమౌను లోపలిమాట
వెదకినచిత్తము వెర వెఱుగదు నే
నెదిరి నెఱగ నే నేమియు నెఱగ // అతనికెట్ల //
కాలూద మనసుగలిగినకదా నా
తాలిమి మతిలో దగులౌట
మేలిమిపతితో మెలగుటేదో నే
నేలో నే నిపుడెక్కడో యెఱగ // అతనికెట్ల //
నేడని రేపని నే నెఱిగికదా
పోడిమి మతిలో పొలుపౌట
వాడే వేంకటేశ్వరుడు రాగలిగె
ఆడుజన్మ మేనౌటిది యెఱగ // అతనికెట్ల //
అతను సంపద కంటెన సదా చెలిరూపు
మతి చింత చేత వేమరు నలగె గాక // పల్లవి //
తగు జందురుని నణచ దగదా చెలిమోము
వగలచే నొకయింత వాడెగాక
పగటు గోవెల మించి పాఱదా సతి పలుకు
జగడమున బతి బాసి సన్నగిలె గాక // అతను సంపద //
కదలు గందపు గాలి గావదా చెలియూర్పు
కదిమేటి మదనాగ్ని గ్రాగె గాక
కొదకు తుమ్మెద గమికి గొఱతా చెలి తురుము
చెదరి మరు బాణముల చేజాఱె గాక // అతను సంపద //
లీల బన్నీటికిని లేతా చెలి చెమట
లోలి బూబానుపున నుడికె గాక
యేల చిగురున కంటె నెరవా చెలి మోవి
గేళి వేంకట విభుడు గీలించెగాక // అతను సంపద //
అతి సులభం బిదె శ్రీపతి శరణము అందుకు నారదాదులు సాక్షి
ప్రతిలే దిదియే నిత్యానందము బహువేదంబులె యివే సాక్షి
వేసరకుమీ జీవుడా వెదకివెదకి దైవమును
ఆసపాటుగా హరి యున్నా డిదె అందుకు ప్రహ్లాదుడు సాక్షి
మోసపోకుమీ జన్మమా ముమ్చినయనుమానములను
సేసినభక్తికి జేటు లేదు యీనేత కెల్ల ధ్రువుడే సాక్షి // అతి సులభం బిదె //
తమకించకుమీ దేహమా తగుసుఖదు:ఖంబుల నలసి
అమితము నరహరికరుణ నమ్మితే నందుకు నర్జునుడే సాక్షి
భ్రమయకుమీ వివేకమా బహుకాలంబులు యీదీది
తమితో దాస్యము తను రక్షించును దానికి బలీంద్రుడే సాక్షి // అతి సులభం బిదె //
మరిగివుండుమీ వోజిహ్వా మరి శ్రీవేంకటపతిసుతులు
అరయగ నిదియే యీడేరించును అందుకు వ్యాసాదులె సాక్షి
తిరుగకుమీ విజ్ఞానమా ద్రిష్టపుమాయలకును లోగి
సరిలే దితనిపాదసేవకును సనకాదులబ్రదుకే సాక్షి // అతి సులభం బిదె //
అతిదుష్టుడ నే నలసుడను
యితరవివేకం బికనేల // పల్లవి //
ఎక్కడ నెన్నిట యేమి సేసితినొ
నిక్కపుదప్పులు నేరములు
గక్కన నిన్నిట కలిగిననీవే
దిక్కుగాక మరి దిక్కేది // అతిదుష్టుడ //
ఘోరపుబాపము కోట్లసంఖ్యలు
చేరువ నివె నాచేసినివి
నీరసునకు నిటు నీకృప నాకిక
కూరిమి నా యెడ గుణమేది // అతిదుష్టుడ //
యెఱిగి చేసినది యెఱుగక చేసిన
కొఱతలు నాయెడ గోటులివే
వెఱపు దీర్చి శ్రీవేంకటేశ కావు
మఱవక నాగతి మఱి యేది // అతిదుష్టుడ //
అతివ జవ్వనము రాయలకు బెట్టిన కోట
పతిమదన సుఖ్హరాజ్య భారంబు నిలువ ||
కంతకనుచూపు మేఘ్హంబులోపలి మెఋగు
కాంతుని మనంబు చీకటి వాపను
ఇంతిచక్కని వదన మిందుబింబము విభుని
వంత కనుదోయి కలువల జొక్కజేయు ||
అలివేణి ధమ్మిల్ల మంధకారపు భూమి
కలికి రమణునకు నేకతమొసగును
పొలతికి బాహువులు పూవు దీగల కొనలు
పొలసి ప్రాణేశు వలపుల లతల బెనచ ||
పంకజానన రూపు బంగారులో నిగ్గు
వేంకటేశ్వరు సిరులు వెదచల్లగా
చింకచూపుల చెలియచేత మదనునిచేత
యింకా నతనినె మోహించజేయగను ||
అతిశయమగు సౌఖ్య మనుభవింపుమన్న
హితవు చేకొన నొల్లరిందరు
కడలేని విజ్ఞానగతికి దోడుగారు
యెడపులవారలె యిందరు
అడరిన మోక్ష సహాయు లెవ్వరు లేరు
ఇడుమపాట్ల వారె యిందరు // అతిశయమగు //
తిరమైన పుణ్యము బోధించేవారు లేరు
యెరవులవారే యిందరు
తిరువేంకటాచలాధిపుని మీదిచిత్త
మిరవు సేయక పోయిరిందరు // అతిశయమగు //
అతిశోభితేయం రాధా
సతతవిలాసవశా రాధా // పల్లవి //
దర్పకబలభోధా రాధా
తర్పణగంధవిధా రాధా
దర్పయుతక్రోధా రాధా
దర్పకరసవేధా రాధా // అతి //
తారితావరోధా రాధా
తారుణ్యోద్బోధా రాధా
ధారితానురోధా రాధా
దారితాపరాధా రాధా // అతి //
తరుణీమరుగాథా రాధా
ధరసమకుచబాధా రాధా
తరుణసదనుబోధా రాధా
ధరణిదుస్సాధా రాధా // అతి //
తనుభవగురుగాధా రాధా
స్తనకృతగిరిరోధా రాధా
తనువరవచనసుధా రాధా
ధ్వనిజితపికమేధా రాధా // అతి //
తరుణసఖీసవిధా రాధా
దరశశిరుచిసౌధా రాధా
తరళితతటిద్విధా రాధా
దరహసనవరోధా రాధా // అతి //
ధనగర్వనిషేధా రాధా
స్తవతత్పర విబుధా రాధా
ద్రవధునీకృతసుధా రాధా
దవమదనవ్యాధా రాధా // అతి //
తరుణత్వ పురోధా రాధా
తరుణస్మరయోధా రాధా
తరుపశుమణిగుణధారక బహుల వి
తరణపరా బహుధా రాధా
దైవికసుఖోపధా రాధా
ద్రావకనిజాభిధా రాధా
శ్రీవేంకటగిరిదేవకృపాము
ద్రావైభవ నాథా రాధా // అతి //
అతిసులభం బిది యందరిపాలికి
గతియిది శ్రీపతికైంకర్యంబు
పాలసముద్రము బలిమి దచ్చికొని-
రాలరిదేవత లమృతమును
నాలుక నిదె హరినామపుటమృతము
యేల కానరో యిహపరము అతి||
అడరి బాతిపడి యవని దేవతలు
బడివాయరు యఙ్న భాగాలకు
విడువక చేతిలో విష్ణుప్రసాదము
కడిగడియైనది కానరుగాని అతి||
యెక్కుదురు దిగుదు రేడులోకములు
పక్కన దపముల బడలుచును
చిక్కినాడు మతి శ్రీవేంకటేశ్వరు
డిక్కడితుదిపద మెఱగరుగాని అతి||
అది నాయపరాధ మిది నాయపరాధ
మదియు నిదియు నాయపరాధము // పల్లవి //
నెరయ రూపములెల్ల నీరూపమేకా
నరయనియది నాయపరాధము
పరిపూర్ణుడగునిన్ను బరిచ్ఛిన్నునిగా
నరయుట యది నాయపరాధము // నెరయ //
జీవాత్మునిగా జింతింప దలచుట
యావంక నది నాయపరాధము
సేవించి నిను నాత్మ జింతింపకుండుట
ఆవల నిది నాయపరాధము // నెరయ //
ఈడెరగక వేంకటేశుడ నిను గొని
యాడుట యది నాయపరాధము
యేడ జూచిన నాయెదుర నుండగ నిన్ను
నాడనీడ వెదకుటపరాధము // నెరయ //
అది బ్రహ్మాణ్డంబిది పిణ్డాణ్డంబు
దుటు జీవులము వున్నారమిదివో // పల్లవి //
ఉదయాస్త మయము లొనరిన వలెనే
నిదురలు మేల్కను నిమయములు
కదిసి తిరిసంధ్యా కాలంబులవలె
గుదిగొను దేహికి గుణత్రయములు // అది బ్రహ్మాణ్డంబిది //
పుడమి సస్యములు పొదలిన వలెనే
వొడలి రోగములన్నవివే
ఉడుగని వెలుపటి వుద్యోగమువలె
కొడిసాగెడి మితి కోరికలు // అది బ్రహ్మాణ్డంబిది //
వెలుపలగల శ్రీ వేంకట విభుడే
కలడాతుమలో ఘనుడితడే
చలమున నీతని శరణాగతియే
ఫలమును భాగ్యము బహు సంపదలు // అది బ్రహ్మాణ్డంబిది //
అదిగాక నిజమతంబది గాక యాజకం
బదిగాక హృదయసుఖ మదిగాక పరము // పల్లవి //
అమలమగు విజ్ఞానమను మహాధ్వరమునకు
నమరినది సంకల్పమను మహాపశువు
ప్రమదమను యూపగంబమున వికసింపించి
విమలేంద్రియాహుతులు వేల్పంగవలదా // అదిగాక //
అరయ నిర్మమకార మాచార్యుడై చెలగ
వరుసతో ధర్మదేవత బ్రహ్మ గాగ
దొరకొన్న శమదమాదులు దానధర్మ
భాస్వరగుణాదులు విప్రసమితి గావలదా // అదిగాక //
తిరువేంకటాచలాధిపు నిజధ్యానంబు
నరులకును సోమపానంబు గావలదా
పరగ నాతనికృపా పరిపూర్ణజలధిలో
నర్హులై యపబృథం బాడంగవలదా // అదిగాక //
అదిగాక సౌభాగ్యమదిగాక వలపు
అదిగాక సుఖ్హమింక నందరికి గలదా ||
ప్రాణవల్లభుని బెడబాసి మరుబాణముల
ప్రాణబాధల నెగులుపడుటేటి వలపే
ప్రాణేశ్వరుదు దన్ను బాయజూచిన యపుడు
ప్రాణంబు మేనిలో బాయంగవలదా ||
ఒద్దికై ప్రియునితో నొడగూడి యుండినపు
డిద్దరై విహరించు టిదియేటి వలపే
పొద్దుపోకలకు దమ పొలయలుకకూటముల
బుద్దిలో బరవశము పొందంగ వలదా ||
చిత్తంబులోపలను శ్రీ వేంకటేశ్వరుని
హత్తించి నాడుదాన ఈ యుండవలదా
కొత్తైన ఈటువంటి కొదలేని సంగతుల
తత్తరము మున్నడి తగులంగవలదా ||
అదిగో కొలువై వున్నాడు
అలమేలు మంగపతి
పదివేల విధములను
పారు పత్తెము చేయుచు
రంగ మండపములో
రత్న సింహాసనముపై
అంగనామణులతొ
అమరవేంచేసి
బంగారు పావడలు పసరించి యిరుగడల
శృంగారముగ సురలు సేవ సేయగను
వెండి పైడి గుదియలను నేత్రహస్తులు పొగడ
నిండు వెన్నెల పూల దండలు అమర
గుండిగలు కానుకలను పొనర లెక్కలు చేయ
దండిమీరగ నిపుడు దేవరాయడు చెలగి
అంగ రంగ వైభవముల రంగుగా చేకొనుచు
మంగళ హారతుల మహిమ వెలసీ
శృంగార మైనట్టిమా శ్రీవేంకటాధిపుడు
అంగనలు కొలువగాను యిపుడు వేంచేసి
అదినీకు దారుకాణము అవునో కాదోకాని
కదిసి చెప్పగబోతే కతలయ్యీగాని // పల్లవి //
కలలోన నీరూపు కన్నుల గన్నట్లయ్యీ
చెలగి ఆసుద్ది చెప్ప జింతయ్యీగాని
వెలయ నీపలుకులు వీనుల విన్నట్లయ్యీ
సెలవి గమ్మర జెప్ప సిగ్గయ్యీగాని // అదినీకు దారుకాణము //
మంతనాన నీతో మాటలాడి నట్లయ్యా
అంతట జూచితే వెరగయ్యీగాని
కంతు సమరతి నిన్ను గాగలించినట్లయ్యీ
పంతాన నేమనినాను పచ్చిదేరీగాని // అదినీకు దారుకాణము //
వరుస నీమోవితేనె చవిగొన్న అట్లనయీ
వొరసి చూపబోతే గోరొత్తీగాని
ఇరవయిన శ్రీ వేంకటేశ నీవు ద్రిష్టముగా
సరుగ గూడిన నదె చాలాయగాని // అదినీకు దారుకాణము //
అదినే నెఱగనా అంతలో భ్రమతు(గాక
మదనజనక నాకు మంచిబుధ్ధి యియ్యవే // పల్లవి //
యెంత లోకానుభవము అంతయు వ్రిథా నష్టి
కొంతైన బ్రహ్మచింత కోటిలాభము
వింతైన జనులతోడి వినోదము నిష్ఫలము
చెంత సజ్జన సంగతి చేరిన యాదాయము // అదినే నెఱగనా //
నానాదేశ వార్తలు జింతామూలము
పూనిన పురాణ గోష్ఠి పుణ్యమూలము
ఆనినకృషివాణిజ్యాలన్నియు( దీరని వెట్టి
మానని యాచార మాత్మకు( బడ్దపాటు // అదినే నెఱగనా //
పలు చుట్టరికములు బట్టబయలు తగుళ్ళు
చెలగు నాచార్య సేవ జీవన్ముక్తి
బలిమి శ్రీవేంకటేశ పరగ రెండు విధాలు
నిలుకడయినవాడవు నీవే యిన్నిటికి // అదినే నెఱగనా //
అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము॥
అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు
అదె చూడుడదె మ్రొక్కుడానందమయము॥
చెంగట నల్లదివో శేషాచలము
నింగి నున్నదేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్నధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము॥
కైవల్యపదము వేంకటనగమదివో
శ్రీ వేంకటపతికి సిరులైనవి
భావింప సకలసంపదరూపమదివో
పావనములకెల్ల పావనమయము॥
అదివో కనుగొను మది యొకతె
యెదుటనె నెలకొనె నిది యొకతె
తేటల మాటల తెరలదె కట్టీ
గాటుకకన్నుల కలికొకతె
జూటరిచూపులఁ జొక్కులు చల్లీ
నీటుగర్వముల నెలతొకతె
ముసిముసినవ్వుల మోపులుగట్టీ
రసికుడ నీపై రమణొకతె
కొసరుల కుచములఁ గోటలు వెట్టీ
మిసమిస మెఱుగుల మెలుతొకతె
కాయజకేలికి కందువ చెప్పీ
చాయలసన్నల సతి యొకతె
యీయెడ శ్రీవేంకటేశ కూడి నిను
వోయని మెచ్చీ నొకతొకతె
అదివో చూడరో అందరు మొక్కరో
గుదిగొను బ్రహ్మము కోనేటిదరిని
రవిమండలమున రంజిల్లు తేజము
దివి చంద్రునిలోని తేజము
భువిననలంబున బొడమిన తేజము
వివిధంబులైన విశ్వతేజము
క్షీరంబుధిలో చెలగు సాకారము
సారె వైకుంఠపు సాకారము
యీరీతి యోగీంద్రులెంచు సాకారము
సారెకు జగముల సాకారము
పొలసినయాగంబులలో ఫలమును
పలుతపములలో ఫలమును
తలచిన తలపుల దానఫలంబును
బలిమి శ్రీవేంకటపతియే ఫలము
అదివో నిత్యసూరులు అచ్యుత నీదాసులు
యెదురులేనివారు యేకాంగవీరులు ॥పల్లవి॥
రచ్చల సంసారమనేరణరంగములోన
తచ్చి కామక్రోధాలతలలు గొట్టి
అచ్చపుతిరుమంత్రపుటారువుబొబ్బలతోడ
యిచ్చలనే తిరిగేరు యేకాంగ వీరులు ॥అది॥
మొరసి పుట్టుగులనేముచ్చు బౌజుల కురికి
తెరలి నడుములకు దెగవేసి
పొరి గర్మము బొడిచి పోటుగంటుల దూరి
యెరగొని తిరిగేరు యేకాంగవీరులు ॥అది॥
వొడ్డినదేహములనేవూళ్ళలోపల చొచ్చి
చెడ్డయహంకారమును చెఱలు పట్టి
అడ్డమై శ్రీవేంకటేశు నుండనుండి లోకులనే
యెడ్డల జూచి నవ్వేరు యేకాంగవీరులు ॥అది॥
అదె చూడరే మోహన రూపం
పది కోట్లు గల భావజరూపం // పల్లవి //
వెలయగ పదారువేల మగువలను
అలమిన ఘన మోహనరూపం
వలచిన నందవ్రజము గొల్లెతల
కులుకు చూపులకు గురియగురూపం // అదె చూడరే //
ఇందిరా వనితనెప్పుడు తనవుర
మందు నిలిపిన మోహనరూపం
కందువ భూసతి కాగిట సొంపుల
విందులు మరిగిన వేడుకరూపం // అదె చూడరే //
త్రిపుర సతుల బోధించి రమించిన
అపురూపపు మోహనరూపం
కపురుల శ్రీ వేంకటపతియై ఇల
ఉపమించగ రాని వున్నతరూపం // అదె చూడరే //
ప|| అదె వచ్చె నిదె వచ్చె నచ్యుతుసేనాపతి
పదిదిక్కులకు నిట్టె పారరో యసురలు
చ1|| గరుడధ్వజంబదె ఘనశంఖరవమదె
సరుసనే విష్ణుదేవచక్రమదే
మురవైరిపంపులవె ముందరిసేనలవె
పరచి గగ్గుల కారై పారరో దానవులు //పల్లవి//
చ2|| తెల్లని గొడుగులవె దేవదుందుభులునవె
యెల్లదేవతల రథాలింతటానవె
కెల్లురేగీ నిక్కి హరికీర్తి భుజములవె
పల్లపు పాతాళాన బడరో దనుజులు //పల్లవి//
చ3|| వెండిపైడి గుదెలవె వెంజామరములవె
మెండగు కైవారాలు మించినవవె
దండి శ్రీవేంకటపతి దాడిముట్టె నదెయిదె
బడుబండై జజ్జరించి పారరో దైతేయులు //పల్లవి//
అదె వాడె యిదె వీడె అందు నిందు నేగీని
వెదకి వెదకి తిరువీధులందు దేవుడు // పల్లవి //
అలసూర్యవీధి నేగీ నాదిత్యునితేరిమిద
కలికికమలానందకరుడుగాన
తలపోసి అదియును దవ్వు చుట్టరికమని
యిల దేరిమీద నేగీ నిందిరావిభుడు // అదె వాడె యిదె //
చక్క సోమవీధి నేగీ జందురునితేరిమీద
యెక్కువైనకువలయహితుడుగాన
చుక్కలుమోచినదవ్వుచుట్టరిక మిదియని
యిక్కువతో వీధి నేగీ నెన్నికైనదేవుడు // అదె వాడె యిదె //
యింతులమనోవీధి నేగీ మరుతేరిమీద
నంతటా రతిప్రియు డటుగాన
రంతుల నదియు గానరానిచుట్టరికమని
వింతరీతి నేగీ శ్రీవేంకటాద్రిదేవుడు // అదె వాడె యిదె //
అదె శిరశ్చక్రములేనట్టిదేవర లేదు
యిదె హరిముద్రాంకిత మిందే తెలియరో // పల్లవి //
“అనాయుధాసో అసురా అదేవా” యని
వినోదముగ ఋగ్వేదముదెలిపెడి
సనాతనము విష్ణుచక్రధారునకును
అనాది ప్రమాణమందే తెలియరో // అదె శిరశ్చక్రములేనట్టిదేవర //
“యచ్చ యింద్రే” యని “యచ్చ సూర్యే” యని
అచ్చుగ తుదకెక్క నదె పొగడీ శ్రుతి
ముచ్చట గోవిందుని ముద్రధారణకు
అచ్చమయిన ప్రమాణమందే తెలియరో // అదె శిరశ్చక్రములేనట్టిదేవర //
మును “నేమినా తప్త ముద్రాం ధారయే” త్తని
వెనువేంకటశ్రుతి యదె వెల్లవిరిసేసీని
మొనసి శ్రీవేంకటేశు ముద్రధారణకు
అనువుగ బ్రమాణమందే తెలియరో // అదె శిరశ్చక్రములేనట్టిదేవర //
అదె శ్రీవేంకటపతి అలమేలుమంగయును
కదిసి యున్నారు తమకమున పెండ్లికిని
బాసికములు కట్టరో పైపై దంపతులకు
శేసపాలందియ్యరో చేతులకును
సూసకాల పేరంటాండ్లు సోబనాలు పాడరో
మోసపోక యిట్టే ముహూర్తమడుగరో
గక్కునను మంగలాష్టకములు చదువురో
తక్కట జేగట (జేగంట?) వేసి తప్పకుండాను
నిక్కినిక్కి చూచేరదె నెరి(దెర తీయరో
వొక్కటైరి కొంగుముళ్ళు వొనరగ వేయరో
కంకణ దారములను కట్టరో యిద్దరికిని
సుంకుల పెండ్లిపీట కూర్చుండబెట్టరో
లంకె శ్రీవేంకటేశు నలమేల్ మంగను దీవించి
అంకెల పానుపుమీద అమరించరో
అదెచూడు తిరువేంకటాద్రి నాలుగుయుగము
లందు వెలుగొందీ ప్రభమీరగాను // పల్లవి //
తగ నూటయిరువై యెనిమిదితిరుపతుల గల
స్థానికులును చక్రవర్తిపీఠకమలములును
అగణితంబైన దేశాంత్రులమఠంబులును
నధికమై చెలువొందగాను
మిగులనున్నతములగుమేడలును మాడుగులు
మితిలేనిదివ్యతపస్సులున్న గృహములును
వొగి నొరగు బెరుమాళ్ళ వునికిపట్టయి వెలయు
దిగువ తిరుపతి గడవగాను // అదెచూడు //
పొదలి యరయోజనముపొడవునను బొలుపొంది
పదినొండుయోజనంబులపరపునను బరగి
చెదర కేవంకచూచిన మహాభూజములు
సింహశార్దూలములును
కదిసి సురవరులు కిన్నరులు కింపురుషులును
గరుడగంధర్వయక్షులును విద్యాధరులు
విదితమై విహరించువిశ్రాంతదేశముల
వేడుకలు దైవారగాను // అదెచూడు //
యెక్కువలకెక్కువై యెసగి వెలసినపెద్ద
యెక్కు డతిశయముగా నెక్కినంతటిమీద
అకజంబైన పల్లవరాయనిమటము
అల్లయేట్ల పేడ గడవన్
చక్కనేగుచు నవ్వచరి గడచి హరి దలచి
మ్రొక్కుచును మోకాళ్ళముడుగు గడచినమీద
నక్కడక్కడ వేంకటాద్రీశుసంపదలు
అంతంత గానరాగాను // అదెచూడు //
బుగులుకొనుపరిమళంబుల పూవుదోటలును
పొందైన నానావిధంబుల వనంబులును
నిగడి కిక్కిరిసి పండినమహావృక్షముల
నీడలను నిలిచి నిలిచి
గగనంబుదాకి శృంగార రసభరితమై
కనకమయమైన గోపురములను జెలువొంది
జగతీధరుని దివ్యసంపదలు గలనగరు
సరుగనను గానరాగాను // అదెచూడు //
ప్రాకటంబైన పాపవినాశనములోని
భరితమగుదురితములు పగిలి పారుచునుండ
ఆకాశగంగతోయములు సోకిన భవము
లంతంత వీడి పారగను
యీకడను గోనేట యతులు బాశుపతుల్ మును
లెన్న నగ్గలమైవున్న వైష్ణవులలో
యేకమై తిరువేంకటాద్రీశు డాదరిని
యేప్రొద్దు విహరించగాను // అదెచూడు //
అద్దిగా వోయయ్య నే నంతవాడనా! వొక
కొద్ది నీదాసులసేవ కోరగలగాక
హరి నీమాయలకు నే నడ్డము చెప్పేవాడనా
అరిదైన దదియు రాచాజ్ఞ గనక
పరమ పదాన కానపడుటయు ద్రోహము
సొరిది నీభండారము సొమ్ముగనక
పంచేద్రియముల నే బారదోలేవాడనా
ముంచి నీవు వెట్టినట్టి ముద్ర కర్తలు
అంచల నావిజ్ఞాన మది దహించవచ్చునా
నించి నీవు పాతినట్టినిధాన మది
వొట్టి సంసారపు మోపు నోపననేవాడనా
వెట్టి మమ్ము జేయించేటివేడుక నీది
గట్టిగా శృఈవేంకటేశ కదిసి నీశరణంటి
ఱట్టుగ నే జెప్పేనా మీఱగ నీరహస్యము
అన నింకే మున్నది అలుగ నేమున్నది
కనుగొనలనే చూచి కరగుట గాక // పల్లవి //
నవ్వూ నవ్వా జెల్లును నాలి సెయ జెల్లు నీకు
రవ్వగా నే మోహించి రాపైన యందుకు
యెవ్వరితో దగవూ లిక నాడే నేను
జవ్వనాన నొంటి నేను జడియుట గాక // అన నింకే //
బిగియూ నమరునూ బీరాలు నమరునూ
తగవు లెంచక నిన్ను దగ్గరిన యందుకు
జగడమూ జెల్లదూ సాదించ జెల్లదూ
మొగమోటమున నేనే ములుగుట గాక // అన నింకే //
సరసము దక్కెనూ చనవెలా నెక్కెనూ
మరగి నీ కౌగిట నేను మఱచిన యందుకు
తెరయెత్త బనిలేదు దిష్టము శ్రీ వేంకటేశ
సరుగ నీ రతిజిక్కి సత మౌట గాక // అన నింకే //
అనంతమహిముడవు అనంతశక్తివి నీవు
యెనలేనిదైవమా నిన్నేమని నుతింతును. // పల్లవి //
అన్నిలోకములు నీయందు నున్న వందురు నీ
వున్న లోక మిట్టిదని వూహించరాదు
యెన్న నీవు రక్షకుడ విందరిపాలిటికి
నిన్ను రక్షించేటివారి నేనెవ్వరి నందును. // అనంతమహిముడవు //
తల్లివి దండ్రివి నీవు తగుబ్రహ్మాదులకు
యెల్లగా నీతల్లిదండ్రులెవ్వరందును
యిల్లిదె వరములు నీ విత్తువిందరికిని
చెల్లబో నీకొకదాత చెప్పగ జోటేది. // అనంతమహిముడవు //
జూవుల కేలికవు శ్రీవేంకటేశుడవు నీ_
వేవల జూచిన నీ కేయేలికే లేడు
వేవేలు మునులును వెదకేరు నిన్నును
నీ వెవ్వరి వెదకేవు నిర్మలమూరితివి. // అనంతమహిముడవు //
అనరాదు వినరాదు ఆతని మాయలు నేడు
దినదిన క్రొత్తలాయ ద్రిష్టమిదే మాకు // పల్లవి //
ఆడెడి బాలుల హరి అంగలి చూపుమని
తోడనే వాండ్ల నోర దుమ్ములు చల్లి
యీడమాతో చెప్పగాను యిందరము గూడిపోయి
చూడపోతే పంచదారై చోద్యమాయనమ్మా // అనరాదు //
తీట తీగెలు సొమ్మంటూ దేహము నిండ గట్టె
తీటకుగాక బాలులు తెగి వాపోగా
పాటించి యీసుద్దివిని పారితెంచి చూచితేను
కోటికోటి సొమ్ములాయ కొత్తలోయమ్మా // అనరాదు //
కాకి జున్ను జున్నులంటా గంపెడేసి తినిపించి
వాకొలిపి బాలులెల్ల వాపోగా
ఆకడ శ్రీవేంకటేశుడా బాలుల కంటి నీరు
జోకగ ముత్యాలుసేసె జూడగానే నేము // అనరాదు //
అనాది జగమునకౌ భళము
అనేకాద్భుతంబౌ భళము // పల్లవి //
హరి నివాస మీయౌ భళము
అరిది పరమ పదమౌ భళము
అరిదైత్యాంతకమౌ భళము
హరముఖ సేవితమౌ భళము // అనాది //
అమలరమాకరమౌ భళము
అమితమునీంద్రంబౌ భళము
అమరవందితంబౌ భళము
అమరె బుణ్యములనౌ భళము // అనాది //
అగరాజంబీ యౌ భళము
అగణిత తీర్థంబౌ భళము
తగు శ్రీవేంకట ధామ విహారం
బగు శుభాంచితంబౌ భళము // అనాది //
అనాది జగములు అనాది దేవుడు
వినోదములు గని విసుకదు మాయ
పుట్టేటి జీవులు పోయిన జీవులు
(పు)వొట్టిన జీవులు ఉన్నారు
చుట్టేరు దినములు సూర్యచంద్రాదులు
తెట్టా( దెరువుననె తేగడు కాలము
కలడు బ్రహ్మయును కలరింద్రాదులు
కలవనేకములు కార్యములు
ఫలభోగంబులు పైపైనున్నవి
కలియు( గర్మము (గడవగ లేదూ
శ్రీవేంకటేశుడు చిత్తములో వేడె
భావము లోపల భక్తి యిదే
భావించి బ్రతుకుట ప్రపన్నులు వీరిదె
యేవల జూచిన యిహమే పరము
అని యానతిచ్చెఁ గృష్ణుఁ డర్జునునితో
విని యాతని భజించు వివేకమా // పల్లవి //
భూమిలోను చొచ్చి సర్వభూతప్రాణులనెల్ల
దీమసాన మోచేటిదేవుఁడ నేను
కామించి సస్యములు గలిగించి చంద్రుఁడనై
తేమల బండించేటిదేవుఁడ నేను // అని //
దీపనాగ్నినై జీవదేహములయన్నములు
తీపుల నరగించేటిదేవుఁడ నేను
యేపున నిందరిలోనిహృదయములోన నుందు
దీపింతుఁ దలఁపుమరపై దేవుఁడ నేను // అని //
వేదములన్నిటిచేతా వేదాంతవేత్తలచే
ఆది నే నెరఁగఁదగినయాదేవుఁడను
శ్రీదేవితోఁ గూడి శ్రీవేంకటాద్రిమీఁద
పాదైనదేవుడఁను భావించ నేను // అని //
అని రావణుతల లట్టలు బొందించి
చెనకి భూతములు చెప్పె బుద్ది // పల్లవి //
కట్టిరి జలనిధి కపిసేన లవిగో
చుట్టు లంక కంచుల విడిసె
కొట్టిరి దానవకోట్లతల లదే
కట్టిడిరావణ గతియో నీకు // అని రావణుతల //
యెక్కిరి కోటలు యిందరు నొకపరి
చిక్కిరి కలిగినచెరయెల్ల
పక్కన సీతకు బరిణామమాయ
నిక్కము రావణ నీకో బ్రదుకు // అని రావణుతల //
పరగ విభీషణు బట్టము గట్టెను
తొరలి లంకకును తొలుదొలుతే
గరిమెల శ్రీవేంకటగిరి రాముడు
మెరసెను రావణ మేలాయ బనులు // అని రావణుతల //
అనిశము దలచరో అహోబలం
అనంత ఫలదం అహోబిలం // పల్లవి //
హరి నిజనిలయం అహోబలం
హరివిరించి నుత మహోబలం
అరుణ మణి శిఖర మహోబలం
అరిదైత్యహరణ మహోబలం // అనిశము //
అతిశయ శుభదం అహోబలం
అతుల మనోహర మహోబలం
హత దురితచయం అహోబలం
యతి మత సిద్ధం అహోబలం // అనిశము //
అగు శ్రీవేంకట మహోబలం
అగమ్య మసురుల కహోబలం
అగపడు పుణ్యుల కహోబలం
అగకుల రాజం అహోబలం // అనిశము //
అనుచు దేవ గంధర్వాదులు పలికేరు
కనక కశిపు నీవు ఖండించేవేళను
నరసింహా నరసింహా ననుగావు ననుగావు
హరి హరి నాకు నాకు నభయమీవే
కరిరక్ష కరిరక్ష గతమైరి దనుజులు
సురనాథ సురనాథ చూడు మమ్ము కృపను
దేవదేవ వాసుదేవ దిక్కు నీవే మాకు మాకు
శ్రీవక్ష శ్రీవక్ష సేవకులము
భూవనిత నాథ నాథ పొడమె నీప్రతాపము
పావన పావన మమ్ము పాలించవే
జయ జయ గోవింద శరణుచొచ్చేము నీకు
భయహర భయహర పాపమడగె
దయతో శ్రీవేంకటేశ తగిలి కాచితి మమ్ము
దయజూడు దయజూడు దాసులము నేము
అనుచు నిద్దరునాడే రమడవలెనే
మొనసి యివెల్లా జూచి మ్రొక్కిరి బ్రహ్మాదులు // పల్లవి //
రాముడ పండ్లు నాకు రండు వెట్టరా
యేమిరా యిట్లానె నాకు యిత్తువా నీవు
ప్రేమపుతమ్ముడగాన పిన్ననే నీకు
యీమాట మఱవకు యిందరా కృష్ణుడా // అనుచు //
యెక్కిన పుట్టిపై నన్ను నెక్కించరా వోరి
వుక్కున బడేవు రాకు వద్దురా నీవు
పక్కున మొక్కేరా నీపయిడికాళ్ళకు వోరి
అక్కతో జెప్పేగాని అందుకొనే రారా // అనుచు //
యెవ్వరు వొడవో సరి నిటు నిలుతమురా వోరి
నివ్వటిల్ల నీ వింత నిక్కవొద్దురా
రవ్వల శ్రీవేంకటాద్రిరాయడనేరా, అయితే
యివ్వల నీకంటే బెద్ద యిది నీ వెఱగవా // అనుచు //
అనుచు మునులు ఋషు లంతనింత నాడఁగాను
వినియు విననియట్టె వీడె యాడీఁగాని // పల్లవి //
ముకుందుఁ డితఁడు మురహరుఁ డితఁడు
అకటా నందునికొడుకాయఁగాని
శకుంతగమనుఁ డితఁడు సర్వేశుఁ డితఁడు
వెకలి రేపల్లెవీధి విహరించీఁగాని // అను //
వేదమూరితి ఇతఁడు విష్ణుదేవుఁ డితఁడు
కాదనలేక పసులఁ గాచీఁగాని
ఆదిమూల మితఁడు యమరవంద్యుఁ డితఁడు
గాదిలిచేఁతల రోలఁ గట్టువడెఁగాని // అను //
పరమాత్ముఁ డితఁడే బాలుఁడై వున్నాఁడుగాని
హరి యీతఁడే వెన్నముచ్చాయఁగాని
పరగ శ్రీవేంకటాద్రిపతియును నీతఁడె
తిరమై గొల్లెతలచేఁ దిట్టువడీఁగాని // అను //
అనుచు లోకములెల్ల నదె జయవెట్టేరు
నినుఁ గొల్చితిఁ గావవే నీరజాక్షుఁడా // పల్లవి //
అదివో కోనేటిలోన నదివో సర్వతీర్థములు
అదివో పైఁడిమేడలహరినగరు
పొదలి పరుషలెల్లా పొదిగి సేవించేరు
యిదివో వరము లిచ్చె నిందిరానాథుఁడు // అను //
అదివో వేదఘోషము అదివో సురలమూఁక
అదివో విశ్వరూపము అద్భుతమందె
గుదిగొనెఁ బుణ్యములు కోట్లసంఖ్యలు చేరె
యిదివో దయదలఁచె నీశ్వరేశ్వరుఁడు // అను //
అదివో శ్రీవేంకటేశుఁ డక్కున నలమేల్‍మంగ
అదివో నిత్య శూరులు ఆళువారలు
నిదులశేషాచలము నిక్కి పైఁ బొడచూపె
యిదివో కొలువున్నాఁడు హృదయాంతరాత్ముఁడు // అను //
అనుమానపుబ్రదుకు కది రోతా తన
మనసెనయనికూటమి మరి రోతా // పల్లవి //
అపకీర్తులబడి ఆడికెలోనై
అపవాదియౌట అది రోత
వుపమ గెలిచెనని వొరు జెరుచుటలు
విపరీతపుగుణ విధమొక రోతా // అనుమానపుబ్రదుకు //
తనగుట్టెల్లా నెరిగిన వారలముందట
తనయెమ్మెలు చెప్పుకొనుట రోత
వనితలముందట వదరుచు వదరుచు
కనుగవ గావనిగర్వము రోత // అనుమానపుబ్రదుకు //
భువి హరిగతియని బుద్ధిదలంచని
యవమానపుమన నది రోత
భవసంహరుడై పరగు వేంకటపతి
నవిరళముగ గొలువని దది రోత // అనుమానపుబ్రదుకు //
అన్నలంటా తమ్ములంటా ఆండ్లంటా బిడ్డలంటా
వన్నెల నప్పులు గొన్న వారువో వీరు // పల్లవి //
తెగనీక అప్పులెల్లా దీసి తీసి వారు
తగిలిన బెట్టలేక దాగిదాగి
వెగటున బారిపోగా వెంట వెంట పెక్కు
వగల నప్పులు గొన్న వారువో వీరు // అన్నలంటా //
సేయరాని పనులెల్ల చేసి చేసి తమ
రాయడికి లోలోనె రాసి రాసి
కాయములో చొచ్చి చొచ్చి కాచి కాచి మున్ను
వ్రాయని పత్రాలకాగే వారువో వీరు // అన్నలంటా //
దొరయై యప్పుల వారి దోసి తోసి యీ
పరిభవములనెల్ల బాసి పాసి
సిరుల వేంకటపతి జేరి చేరి యిట్టి
వరుసనే గెలిచిన వారువో వీరు // అన్నలంటా //
అన్ని మంత్రములు ఇందె ఆవహించెను
వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము
నారదుడు జపియించె నారాయణ మంత్రము
చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము
కోరి విభీషణుడు చేకొనె రామ మంత్రము
వేరెనాకు గలిగె వేంకటేశు మంత్రము
రంగగు వాసుదేవ మంత్రము ధృవుండు జపించె
అంగవించె కృష్ణ మంత్రము అర్జునుడు
ముంగిట విష్ణు మంత్రము మొగిశుకుడు పఠించె
వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము
ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరనాథుడె గుఱి
పన్నిన దిదియే పరబ్రహ్మ మంత్రము
నన్ను గావగలిగేబో నాకు గురుడియ్యగాను
వెన్నెల వంటిది శ్రీవేంకటేశు మంత్రము
అన్నిచోట్ల బరమాత్మవు నీవు
యిన్నిరూపుల భ్రమయింతువుగా // పల్లవి //
పాలజలధి నుండి బదరీవనాన నుండి
ఆలయమై గయలో బ్రయాగ నుండి
భూలోకనిధివై పురుషోత్తమాన నుండి
వేలసంఖ్యలరూపై విచ్చేతుగా // అన్నిచోట్ల //
వుత్తరమధురలో నయోధ్యలోపల నుండి
సత్తైననందవ్రజాన నుండి
చిత్తగించి పంచవటి సింహాద్రిలోన నుండి
వత్తుగా లోకములు పావనము సేయగను// అన్నిచోట్ల //
కైవల్యమున నుండి కమలజలోకాన
మోవగ శ్రీరంగమున నుండి
యీవల నావల నుండి యీవేంకటాద్రిపై
నీవే నీవే వచ్చి నెలకొంటిగా // అన్నిచోట్ల //
అన్నిజాతులు దానెయైవున్నది
కన్నుల కలికి మాయగరచెనోయనగ ||
కన్నె శంకిణిజాతిగాబోలు వీపునను
సన్నపుమదనాంకములు జడిగొన్నవి
వన్నెలుగ వలరాజు వలపు తలకెక్కించ
పన్నినటువంటి సోపానములో యనగా ||
తెఅవ దలపోయ చిత్తిణిజాతి గాబోలు
నెఋలు విచ్చుచు వీధి నిలుచున్నది
నెఅతనము మరుడు తనునిండనేసిన యంప
గరులిన్ని యనుచు రెక్కలు వెట్టుగతిని ||
కాంత హస్తిణిజాతి గాబోలు కరమూలము
లంతకంతకు నలుపులై యున్నవి
పమ్తంపు మరుడు తన భండార మిండ్లకును
దొంతిగా నిదిన కస్తూరి ముద్రలనగా ||
ఘనత పద్మిణిజాతి గాబోలు నీ లలన
తనువెల్ల పద్మ గంధంబైనది
మినుకుగా మరుడు తామెర లమ్ములనె మేను
కనలించి వడి బువ్వగట్టెనో యనగా ||
ఇదియు జగదేక మొహిణి దానె కాబోలు
కదలు కనుగవకెంపు గతిగున్నది
చెదరి చెలికనుగొనల జిందెనోయనగా ||
అన్నిట నీ వంతర్యామివి అవుట ధర్మమే అయినాను
యెన్నగ నీవొక్కడవేగతియని యెంచికొలుచుటే ప్రపన్న సంగతి // పల్లవి //
ఏకాంతంబున నుండినపతివి యెనసిరమించుటే సతిధర్మంబు
లోకమురచ్చలోనుండినపతి లోగొని పైకొనరానట్లు
యీకొలదులనే సర్వదేవతలయిన్నిరూపులై నీవున్నప్పుడు
కైకొని నిను బహుముఖముల గొలుచుట గాదు పతివ్రత ధర్మంబు // అన్నిట //
పూనినబ్రాహ్మాణులలోపలనే నిను బూజించుట వేదోక్తధర్మము
శ్వానకుక్కుటాదులలోపల నిను సరి బూజించగరానట్లు
యీనియమములనె ప్రాకృతజనులను యీశ్వర నీశరణాగతజనులను
కానక, వొక్కట సరిగాజూచుట కాద వివేకధర్మంబు // అన్నిట //
శ్రీవేంకటపతి గురువనుమతినే సేవే నాకును శిష్యధర్మము
ఆవలనీవల నితరమార్గముల యాత్మలోన రుచిగానట్లు
భావింపగ సకలప్రపంచమును బ్రహ్మం సత్యజ్ఞానమనంతము
కైవశమై యిన్నిటా వెనుతగులు కాద వివేకధర్మంబు // అన్నిట //
అన్నిట నేరుపరిగా అలమేలు మంగ నీకు
చిన్నచిన్న ముద్దులనే విడిపించెను // పల్లవి //
చనవు మెరసి నిన్ను సారెసారె చేరుకుని
మనసు దనియ నాపె మాటలాడెను
కనుసన్న చూపులనె కప్పుర విడెములిచ్చె
దనువు దనియ నీపై తలబాలు వోసెను // చనవు //
పన్నుగడ తొడనే పానుపు చేరువనే
కన్నులు దనియగ దగ్గర నిలచెను
మన్ననలు దైవార మచ్చికలు పెడరేచి
విన్నవీనుల దనియ విన్నపాలు సేసెను // చనవు //
మాగిన మోవి యిచ్చి మనసు గరచి యిట్టే
కౌగిలి దనియ నీకు కప్పె పయ్యెద
వీగక శ్రీ వేంకటేశు వెలది గూడితివిట్టె
రాగి వయసి దనియ రతి కేళి సేసెను // చనవు //
అన్నిటా జాణ వౌదువు ఓభళేశ్వర
యెన్ని చూచుకొంటేను ఇట్టుండు మోహము // పల్లవి //
మరు గొండలపైన నుండి మగువ బాయగ లేక
కోరివచ్చితి విందిర గుడిలోనికి
ఆరితేరిన దేవుడ వగ్గళ్ళురుకుదురా
యేరీతి వారికైనా నిట్టుండు మోహము // అన్నిటా //
నడుమను భవనాశినిది వారుచుండగాను
కడు దాటి వచ్చితివి కాంతయింటికి
వడి బారగానేరీది వత్తురా సాహసమున
యెడయ కెవ్వరికైనా నిట్టుండు మోహము // అన్నిటా //
అన్నిటా జాణడు అలమేలుమంగపతి
పన్ని నీకు మేలువాడై పరగివున్నాడు
పట్టినదే పంతమా పతితోడ నీకిప్పుడు
యిట్టె నిన్ను వేడుకోగా నియ్యకోరాదా
వొట్టి యప్పటినుండి నీవొడి వట్టుకొన్నవాడు
గట్టువాయ తనమేల కరగవే మనసు
చలములే సాదింతురా సారెసారెనాతనితో
బలిమి బిలువగాను పలుకరాదా
కలపుకోలు సేసుక కాగిలించుకున్నవాడు
పులుచుదనములేల పెనగవే రతిని
చేరి ఇట్టె బిగుతురా శ్రీవేంకటేశ్వరునితో
మేరతో నిన్నేలగాను మెచ్చగరాదా
యీరీతి నిన్ను పెండ్లాడె యెడయెక వున్నవాడు
వీరిడితనకులేల వెలయవే మరిగి
అన్నిటా నాపాలిటికి హరి యాతడే కలడు
యెన్నికగా దుధిపద మెక్కితిమి మేలు // పల్లవి //
కొందరు జీవులు నన్ను గోపగించినా మేలు
చెంది కొందరట్టె సంతసించినా మేలు
నిందించి కొందరు నన్ను నేడే రోసినా మేలు
పొందుగ కొందరు నన్ను బొగడినా మేలు // అన్నిటా //
కోరి నన్ను బెద్దసేసి కొందరు మొక్కినా మేలు
వేరే హీనుడని భావించినా మేలు
కూరిమి గోదరు నన్ను గూడుకుండినా మేలు
మేరతో విడిచి నన్ను మెచ్చకున్నా మేలు // అన్నిటా //
యిప్పటికిగలపాటి యెంతపేదయినా మేలు
వుప్పతిల్లుసంపద నాకుండినా మేలు
యెప్పుడు శ్రీవేంకటేశు కేనిచ్చినజన్మ మిది
తప్పు లే దాతనితోడితగులమే మేలు // అన్నిటా //
అన్నిటా నేరుపరి హనుమంతుడు
పిన్ననాడే రవినంటె పెద్ద హనుమంతుడు // పల్లవి //
ముట్టిన ప్రతాపపు రాముని సేనలోన
అట్టె బిరుదు బంటు హనుమంతుడు
చుట్టిరానుండినట్టి సుగ్రీవు ప్రధానులలో
గట్టియైనలావరి చొక్కవు హనుమంతుడు // అన్నిటా //
వదలక కూడినట్టి వనచర బలములో
నదె యేకాంగ వీరుడు హనుమంతుడు
చెదరక కుంభకర్ణు చేతి శూల మందరిలో
సదరాన విరిచె భీషణ హనుమంతుడు // అన్నిటా //
త్రిజగముల లోపల దేవతా సంఘములోన
అజుని పట్టాన నిలిచె హనుమంతుడు
విజయనగరాన శ్రీ వేంకటేశు సేవకుడై
భుజబలుడై యున్నాడిపుడు హనుమంతుడు // అన్నిటా //
అన్నిటా భాగ్యవంతుడవుదువయ్యా
పన్నినందుకల్లా వచ్చు భామ నీకు నిపుడు // పల్లవి //
పడాతి మోహరసము పన్నీటి మజ్జనము
కడలేని యాపెసిగ్గు కప్పురకాపు
నిడుద కన్ను చూపులు నించిన తట్టు పునుగు
తొడిబడ సులభాన దొరకె నీకిపుడు // పడాతి //
కామిని కెమ్మోవికాంతి కట్టుకొనే చంద్రగావి
ఆముకొన్న మోహకళలాభరణాలు
దోమటి మాటల విందు ధూప దీప నైవేద్యాలు
కామించి నటువలెనె కలిగె నీకిపుడు // పడాతి //
అలమేలుమంగ నవ్వులంగపు నవ్వు దండలు
కలసి వురాన నీకే కట్టిన తాళి
చలపట్టి యీకె రతి సకల సంపదలు
యిలవచ్చె శ్రీవేంకటేశ నీకు నిపుడు // పడాతి //
అన్నిటా శాంతుడైతే హరిదాసుడు దానే
సన్నుతి దానేపో సర్వదేవమయుడు // పల్లవి //
అత్తల మనసు యింద్రియాధీనమైతేను
చిత్తజుడనెడివాడు జీవుడు దానే
కొత్తగా తనమనసే కోపాన కాధీనమైతే
తత్తరపు రుద్రుడును దానే తానే // అన్నిటా //
భావము వుద్యోగములప్రపంచాధీనమైతే
జీవుడు బ్రహ్మాంశమై చెలగు దానే
కావిరి రేయిబగలు కన్నుల కాధీనమైతే
ఆవల జంద్రసూర్యాత్మకుడుదానే // అన్నిటా //
కోరిక దనబ్రదుకు గురువాక్యాధీనమైతే
మోరతోపులేని నిత్యముక్తుడు దానే
ఆరయ శ్రీవేంకటేశు డాతుమ ఆధీనమైతే
ధారుణిలో దివ్యయోగి తానే తానే // అన్నిటా //
అన్నిటా శ్రీహరిదాసుడగువానికి
కొన్నిదైవముల గొలువగ దగునా // పల్లవి //
విహితకర్మముసేసి వెదకేటిహరి నిట్టె
సహజమై కొలచేతిసరసునికి
గహనపుగర్మాలు కడమలైన నేమి
మహి గనకాద్రికి మరి పైడి వలెనా // అన్నిటా //
పలుదానములకెల్ల బలమైనహరి నిట్టె
బలువుగ జేకొన్న భక్తునికిని
నెలకొని యాత డన్నియును జేసినవాడె
తెలిసి సూర్యుని జూడ దీపాలు వలెనా // అన్నిటా //
వేదవేద్యుడు శ్రీవేంకటపతి రామ
మాదిగా బఠియించే యధికునికి
ఆదైవచదువులు అఱచేతి వతనికి
మేదిని దిరుగాడ మెట్లు వలెనా // అన్నిటా //
అన్నిటాను హరిదాసు లధికులు
కన్నులవంటివారు కమలజాదులకు // పల్లవి //
అందరును సమమైతే నరుహానరుహము లేదా
అందరిలో హరియైతే నౌగాక
బొందితో విప్రునిదెచ్చి పూజించినట్టు వేరే
పొందుగానిశునకము బూజింపదగునా // అందరును //
అన్నిమతములు సరియైతేను వాసిలేదా
చెన్నగుబురాణాలు చెప్పుగాక
యెన్నగ సొర్ణాటంక మింతటాను జెల్లినట్లు
సన్నపుదోలుబిళ్ళలు సరిగా జెల్లునా // అందరును //
గక్కున బైరు విత్తగా గాదము మొరచినట్లు
చిక్కినకర్మములెల్లా జెలగెగాక
తక్కక శ్రీవేంకటేశు దాస్యమెక్కుడైనట్టు
యెక్కడా మోక్షోపాయమిక జెప్పనున్నదా // అందరును //
అన్నిటి కెక్కుడుయీవి హరియిచ్చేది
మన్నించునాతనికంటే మఱి లేరు దొరలు // పల్లవి //
తగుబ్రహ్మలోకముదాకా నెక్కిచూచిన
మగుడ బుట్టేలోకాలే మనుజులకు
తెగియిచ్చే యింద్రాదిదేవతలవరములు
యెగుఅదిగువలను యీసందివే // అన్నిటి //
మాయలోన బుట్టేది మాయలోన బెరిగేది
కాయదారులుకు నెల్లా గలిగినదే
నేయరానిపుణ్యమెల్లా జేసి గండించుకొనేది
చాయల బహురూప సంసారమే // అన్నిటి //
చెడనివై కుంఠ మిచ్చు జేటులేనిపరమిచ్చు
వెడమాయ బెడబాపు విష్ణు డీతడే
యెడయక శ్రీ వేంకటేశుడై వున్నాడు వీడె
జడియ కితడే కాచు శరణంటే జాలును // అన్నిటి //
అన్నిటికి నిదె పరమౌషధము
వెన్నుని నామము విమలౌషధము // పల్లవి //
చిత్త శాంతికిని శ్రీపతి నామమె
హత్తిన నిజ దివ్యౌషధము
మొత్తపు బంధ విమోచనంబునకు
చిత్తజ గురుడే సిద్ధౌషధము // అన్నిటికి //
పరిపరి విధముల భవరోగములకు
హరి పాద జలమె యౌషధము
దురిత కర్మముల దొలగించుటకును
మురహరు పూజే ముఖ్యౌషధము // అన్నిటికి //
ఇల నిహ పరముల నిందిరా విభుని
నలరి భజింపుటె యౌషధము
కలిగిన శ్రీ వేంకటపతి శరణమె
నిలిచిన మాకిది నిత్యౌషధము // అన్నిటికి //
అన్నిటికి నొడయుడవైనశ్రీపతివి నీవు
యెన్నరాదు మాబలగ మెంచుకో మాపౌజు // పల్లవి //
జ్ఞానేంద్రియము లైదు శరీరిలొపల
ఆనక కర్మేంద్రియము లైదు
తానకపుకామక్రోధాలవర్గములారు
యీనెలవు పంచభూతా లెంచు మాపౌజు // అన్నిటికి //
తప్పని గుణాలు మూడు తనువికారములారు
అప్పటి మనోబుద్ద్యహంకారాలు
వుప్పతిల్లువిషయము లుడివోని వొకాయిదు
యిప్పటి మించేకోపము యెంచుకో మాపౌజు // అన్నిటికి //
ఆకలి దప్పియును మానావమానములును
సోకినశీతోష్ణాలు సుఖదు:ఖాలు
మూకగమికాడ నేను మొక్కెద శ్రీవేంకటేశ
యేకటారగడసేవా నెంచుకో మాపౌజు // అన్నిటికి //
అన్నియు నీతనిమూల మాతడే మాపలజిక్కె
కన్నుల మావేడుకకు కడయేది యికను // పల్లవి //
కామధేనువు గలిగితే గర్వించు నొక్కరుడు
భూమి యేలితే నొకడు పొదలుచుండు
కామించి నిధి గంటె కళలమించు నొకడు
శ్రీమంతుడగుహరి చిక్కె మాకు నిదివో // అన్నియు //
పరుసవేదిగలిగితే పంతములాడు నొకడు
ధర జింతామణబ్బితే దాటు నొకడు
సురలోక మబ్బితేను చొక్కుచునుండు నొకడు
పరమాత్ముడే మాపాలజిక్కెనిదివో // అన్నియు //
అమృతపానముసేసి యానందించు నొకడు
భ్రమసు దేహసిద్ది బరగొకడు
తమి శ్రీవేంకటేశుడే దాచినధనమై మాకు
అమరి నామతి జిక్కె నడ్డాములే దిదివో // అన్నియు //
అన్నియును దన ఆచార్యాధీనము
చెన్నుమీఱ హరిపాదసేవసేయు మనసా // పల్లవి //
దైవమా గొంచము గాడు తానూ గొంచము గాడు
భావించికొలచేవారిపరిపాటి
చేవల బత్తిముదుగు చేనిముదుగూ లేదు
వావిరి బోగెత్తెటివారివారినేరుపు // అన్నియును //
కాలము కడమలేదు కర్మము కడమలేదు
కేలి విశ్వాసముగలిగినపాటి
వ్రాలకి ముదిమీ లేదు వక్కణ ముదిమీ లేదు
పోలించేటివిద్వాంసులబుద్ధిలోనినేరుపు // అన్నియును //
జ్ఞానానకు దప్పు లెదు జన్మానకు దప్పు లేదు
నానాటికి వివేకించి నడచేపాటి
పానిపట్టి శ్రీవేంకటపతి యింతకు మూలము
ఆనుక యీతని శరణనేవారినేరుపు // అన్నియును //
అన్నియును నతనికృత్యములే
ఎన్నియైనా నవు నతడేమి సేసినను // పల్లవి //
అణురేణు పరిపూర్ణుడవలి మోమైతేను
అణువౌను కమలభవాండమైన
ఫణిశయనుని కృపాపరిపూర్ణ మైతే
తృణమైన మేరువౌ స్థిరముగా నపుడే // అన్నియును //
పురుషోత్తముని భక్తి పొరపొచ్చమైతే
ఎరవులౌ నిజసిరులు ఎన్నైనను
హరిమీదిచింత పాయక నిజంబైతే
నిరతి బట్టినవెల్లా నిధానములే // అన్నియును //
మదనగురునిసేవ మదికి వెగటైతేను
పదివేలు పుణ్యములు పాపంబులే
పదిలమై వేంకటపతిభక్తి గలిగితేను
తుదిపదంబునకెల్ల దొడవవు నపుడే // అన్నియును //
అన్నియును హరినేనేయటమటాలే యివి
పన్నిన సుజ్ఞానికి బయలై తోచును // పల్లవి //
తిరుపై యవ్వలవ్వల దిరుగుచుండేటివేళ
దిరిగినట్ల నుండు దిక్కులెల్లాను
సిరులసంసారభ్రమ జిక్కినజీవునికిని
సరిగ నైహికము పరమై తోచు // అన్నియును //
సొగిసి యద్దమునీడ చూచినవేళ దనకు
మగుడ వేఱొకరూపు మతి దోచును
తగిలి యిట్లానేపో తనుదా నెఱగకున్న
నిగిడినపుట్టువులు నిజమై తోచు // అన్నియును //
కదిసినసకలాంధకార మంతటా గప్పి
వుదయమైతే నన్నీ నొదిగినట్టు
హృదయపుశ్రీవేంకటేశుడు వెల్లవిరైతే
మదిలో నజ్ఞానము మాయమై తోచు // అన్నియును //
అన్నిరాసుల యునికి యింతి చెలువపు రాశి
కన్నె నీ రాశి కూటమి గలిగిన రాశి // పల్లవి //
కలికి బొమ విండ్లుగల కాంతకును ధనురాశి
మెలయు మినాక్షికిని మీనరాశి
కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి
చెలగు హరిమధ్యకును సింహరాశి // అన్నిరాసుల //
చిన్నిమకరంకపు బయ్యెద చేడెకు మకరరాశి
కన్నె పాయపు సతికి కన్నెరాశి
వన్నెమై పైడి తులదూగు వనితకు దులారాశి
తిన్నని వాడి గోళ్ళ సతికి వృశ్చికరాశి // అన్నిరాసుల //
ఆముకొని నొరపుల మెరయు నతివకు వృషభరాశి
గామిడి గుట్టుమూల సతి కర్కాటకరాశి
కోమలపు చిగురుమోవి కొమలికి మేషరాశి
ప్రేమ వేంకటపతి గలిసె ప్రియ మిథునరాశి // అన్నిరాసుల //
అన్నివిభవముల అతడితడు
కన్నులువేవేలు గల ఘనుడితడు // పల్లవి //
వేదాంత కోటుల విభుడితడు
నాదబ్రహ్మపు నడుమితడు
ఆదియంత్యముల కరుదితడు
శ్రీదేవుడు సరసిజనాభుడితడు // పల్లవి //
భవములణచు యదుపతి యితడు
భువనము లన్నిటికి పొడ వితడు
దివికి దివమైన తిరమితడు
పవనసుతు నేలిన పతి యితడు // పల్లవి //
గరుడుని మీదటి ఘనుడితడు
సిరు లిందరి కిచ్చే చెలువితడు
తిరు వేంకట నగము దేవుడితడు
పరమ పదమునకు ప్రభువితడు // పల్లవి //
అపరాధిని నే నై నాను
కృపగలవారికిఁ గపటము లేదు // పల్లవి //
సనాతనా అచ్యుతా సర్వేశ్వరా
అనాదికారణ అనంతా
జనార్దనా అచల సకలలోకేశ్వరా
నిను మరచియున్నాఁడ ననుఁ దెలుపవయా // అపరాధిని //
పురాణపురుషా పురుషోత్తమా
చరాచరాత్మక జగదీశా
పరాత్పరా హరి బ్రహ్మాండనాయకా
యిరవు నీవేయట యెఱిఁగించఁగదే // అపరాధిని //
దేవోత్తమా శశిదినకరనయనా
పావనచరితా పరమాత్మా
శ్రీవేంకటేశా జీవాంతరంగా
సేవకుఁడను బుధ్ధిచెప్పఁగవలయు // అపరాధిని //
అపుడేమనె నేమనుమనెను
తపమే విరహపు తాపమనె
పవనజ యేమనె పడతిమరేమనె
అవనిజ నిను నేమను మనెను
రవికులేంద్ర భారము ప్రాణంబనె
ఇవల నెట్ల ధరియించే ననె
యింకా నేమనె యింతి మరేమనె
కొంకక యేమని కొసరుమనె
బొంకుల దేహము పోదిది వేగనె
చింక వేట ఇటు చేసెననె
నను నేమనె ప్రాణము మన కొకటనె
తనకు నా వలెనె తాపమనె
మను కులేశ ప్రేమపు మనకూటమి
ఘనవేంకటగిరి గంటిననె
అపురూపమైన మొహముదాచి యిటువంటి
కపటపు నటనలు గడించనేలే ||
కిన్నెర కాయలబోలు కిక్కిరిసినట్టి
చన్నులపై నునుగొంగు జారగా
కిన్నెరమీటుచు మంచి నన్నపునడపుతో
కన్నులు దేలగ మేను కదిలించేవేలే ||
౧। అప్ప డుండే కొండలోన ఇప్పపూల ఏరబోతే
ఇప్పపూలు కప్పలాయెరా ఓ వేంకటేశ
అప్పలుగల వాని వలనే ఓ వేంకటేశ।
౨। ఆకాశాన పొయ్యేకాకి మూకజూచి కేకవేశే
మూక మూడు విధము లాయరా – ఓ వేంకటేశ
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశ।
౩। అహోబిలయ్య గుంటలోన వొల్వలు ఉదుక పోతే
వొల్వలెల్ల మల్ల్యెలాయే – ఓ వేంకటేశా
దీనిభావము నీకే తెలుసురా ఓ వేంకటేశా।
౪। అహోబిలాన చెట్టు బుట్టే భూమి యెల్ల తీగపారే
కంచిలోన కాయ కాచేరా ఓ వేంకటేశా
శ్రీరంగాన పండు పండేరా ఓ వేంకటేశా।
౫। పుట్టామీద చెట్టు బుట్టే భూమియెల్ల తీగపారే
పర్వతాన పండు పండేరా ఓ వేంకటేశా
అందవచ్చు కోయరాదురా – ఓ వేంకటేశా।
౬। చేయిలేనివాడుకోశే నెత్తిలేని వాడుమేశే
కాళ్ళులేని వాడు నడచే ఓ వేంకటేశా
పెదవిలేనివాడు చిలుక తినేరా ఓ వేంకటేశా।
౭। గుంట యెండి పండు పండే – పండుకోశి కుప్పవేశే
కుప్పకాలి యప్పు తీరేరా – ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా।
౮। సందెకాడ తలవ్రాలు సంధిదీరి వేంకటరాయా!
తెల్లవారనాయనీడరా ఓ వేంకటేశ!
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశ!
౯। ముత్యాల పందిటిలోన ముగ్గురు వేంచేసి రాగ
ముక్కంటి దేవుని జూచేరు ఓ వేంకటేశా!
దీని భావము నీకే తెలుసురా! ఓ వేంకటేశా!
౧౦। ఏటిలోన వలవేశే తాటిమాను నీడలాయె
దూరపోతే చోటులేదురా ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా।
౧౧। ముందు కూతు రాలు ఆమె ముందు ఆలు కూతురాయె
పొందుగా పెండ్లాము తానాయె ఓ వేంకటేశ
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా।
౧౨। ఆకులేని అడవిలోన మూడుతోకల పెద్దపులిని
మేక యొకటి యెత్తి మింగేరా ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఒ వేంకటేశా।
౧౩। పున్నమ వెన్నెలలోన వన్న్యలాడితోను గూడి
కిన్నెర మీటుచు పొయ్యేవు ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా।
౧౪। అర్థరాత్రివేళలోని రుద్రవీణ నెత్తుకొని
నిద్రించిన నిన్ను పాడగ – ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా – ఓ వేంకటేశా।
తాళ్ళపాక పదసాహిత్యము సంపుటము ౨౭
శృంగార సంకీర్తనలు నుండి
అప్పటికప్పుడే కాక అంత యేటికి
యెప్పుడూ మనకు బోదు ఇందవయ్య విడెము // పల్లవి //
తక్కి మాటున నున్నంత తడవు నిను దూరితి
నిక్కిచూడ బోతేను నీవే నేను
కక్కసించనిక నిన్ను కడు నాసవెట్టకిక
యిక్కువలు గరగేను ఇందవయ్య విడెము // అప్పటికప్పుడే //
గుట్టుతో నూరకుండగా గుణము వెరపులాయ
నెట్టుకొని మాటాడితే నీవే నేను
పెట్టను రట్ల నిన్ను పెనగకుమిక నీవు
ఇట్టే నీమాటలు వింటి నిందవయ్య విడెము // అప్పటికప్పుడే //
అరయ దూరకున్నందు కటునిటు బిగిసితి
నేరిచి పొందు సేసితే నీవే నేను
కోరి శ్రీ వేంకటేశుడ కూడితి మిద్దరమును
యీరీతి బాయకుందము ఇందవయ్య విడెము // అప్పటికప్పుడే //
అప్పడు దైవాలరాయ డాదిమూలమీతడు
యిప్పు డిట్టిమహినుల నెక్కుడాయ నీతడు // పల్లవి //
చేకొని తొలికొలితే చేసినపన్నీరు కాపు
జోక గాలువలై సొరిది జార
సైకపునీలాద్రినుండి జలజలబారేటి
కేకలసెలయేరులరీతి నున్న దిదివో // అప్పడు //
తెప్పలుగా గుప్పినట్టితెల్లనికప్పురకాపు
చిప్పిలుచు వెన్నెలలై చిందగాను
పుప్పొడిదోగినకల్ప భూజము నిలుచున్న
చొప్పున నున్నాడిదివో సొంపులు మీరుచును // అప్పడు //
పొందుగ నంతటిమీద జూసినపునుగుకాపు
కందువ మాణిక్యముల గనియైనట్టు
అంది శ్రీవేంకటేశ్వరు కదె యలమేలుమంగ
చెంది యరత గట్టగా శ్రీవిభుడై నిలిచె // అప్పడు //
అప్పణిచ్చేనిదె నీకు ననుమానించకు మిక
చిప్పిల మోహించిన నీ చేతిలోని దానను // పల్లవి //
యెంత నవ్వినా మేలే యెరిగిన విభుడవు
చెంత నుండి మరియేమి సేసినా మేలే
యింతమాత్రమునకే యెగ్గులెంచ తప్పులెంచ
సంతోసాన నీకులోనై సమ్మతించే దానను // అప్పణిచ్చేనిదె //
అలయించినా మేలే ఆయము లెరుగుదువు
కొలువు యిట్టే సేయించు కొన్నామేలే
మలసిన మాత్రానకే మచ్చరించ నెచ్చరించ
చెలగుదు నీపాదాల సేవచేసేదానను // అప్పణిచ్చేనిదె //
చేరి కూడితివి మేలే శ్రీవేంకటేశుడవు
యీరీతి నలమేల్మంగ నేమన్నా మేలే
సారె యీమాత్రానకే జంకించ బొంకించ
మేరతో నుండుదు నిన్ను మెచ్చేటిదానను // అప్పణిచ్చేనిదె //
అప్పుడువో నిను గొలువగ నరుహము గలుగుట ప్రాణికి
కప్పినదియు గప్పనిదియు గనుగొన గలనాడు
ఆపదలకు సంపదలకు నడ్డముచెప్పనినాడు
పాపములకు పుణ్యములకు బనిదొలగిననాడు
కోపములకు శాంతములకు గూటమి మానిననాడు
లోపల వెలుపల తనమతిలో దెలిసిననాడు
తనవారల బెరవారల దా దెలిసిననాడు
మనసున జైతన్యంబును మరపందిననాడు
పనివడి తిరువేంకగిరిపతి నీదాసులదాసుల
గనుగొని నీభావముగా గనువిచ్చిననాడు
అప్పుడెట్టుండెనో చిత్తమయ్యో యెఱగనైతి
చెప్పుడుమాటలకే నే జేరనైతిగా
కొసరికొసరి నీపై కోపమున నుంటిగాని
అసమిచ్చి నీతో మాటలాడనైతిగా
పసలేని సిగ్గుతోడి పంతాననే వుంటిగాని
ముసిముసి నవ్వు మోవి మోపనైతిగా
విరహపు కాకల నావిసుపే చూపితిగాని
సరిబిల్చితే నూకొన జాలనైతిగా
వరుసవంతులకై నే వాదులాడితి గాని
మురిపేన మొక్కితే నే మొక్కనైతిగా
వేగమే నీవు గూడితే వెస భ్రమసితిగాని
చేగలనీమేను పచ్చిసేయనైతిగా
భోగపు శ్రీవేంకటేశ పోట్లదొరతిలోన
నీగతి చెన్నుడవైతే నెనసితిగా
అప్పులవారే అందరును
కప్పగ దిప్పగ గర్తలు వేరీ // పల్లవి //
ఎక్కడ చూచిన నీ ప్రపంచమున
జిక్కులు సిలుగులు జింతలునే
దిక్కెవ్వరు ఈతిదీపులలో
దిక్కుముక్కులకు దేవుడేగాక // అప్పులవారే //
ఏది తలంచిన నేకాలంబును
సూదుల మూటల సుఖము లివి
కాదన నౌనన గడ గనిపించగ
పోదికాడు తలపున గల డొకడే // అప్పులవారే //
ఎన్నడు వీడీ నెప్పుడు వాసీ
బన్నిన తమ తమ బంధములు
ఉన్నతి సేయగ వొప్పులు నెరపగ
వెన్నుడు వేంకట విభుడే కలడు // అప్పులవారే //
అప్పులేని సంసార మైనపాటే చాలు
తప్పులేని జీతమొక్క తారమైన జాలు // పల్లవి //
కంతలేని గుడిసొక్క గంపంతైన జాలు
చింతలేని యంబలొక్క చేరెడే చాలు
జంతగాని తరుణి యేజాతైన నాదె చాలు
వింతలేని సంపదొక్క వీసమే చాలు // అప్పులేని //
తిట్టులేని బ్రదుకొక్క దినమైన నదే చాలు
ముట్టులేని కూడొక్క ముద్దడే చాలు
గుట్టుచెడి మనుకంటే కొంచెపు మేలైన చాలు
వట్టిజాలి బడుకంటే వచ్చినంతే చాలు // అప్పులేని //
లంపటపడని మేలు లవలేసమే చాలు
రొంపికంబమౌకంటె రోయుటే చాలు
రంపపు గోరికకంటే రతి వేంకటపతి
పంపున నాతని జేరే భవమే చాలు // అప్పులేని //
అబ్బురంపు శిశువు ఆకుమీది శిశువు
దొబ్బుడు రోల శిశువు త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి
పుట్టు శంఖు చక్రముల( బుట్టిన యా శిశువు
పుట్టక తోల్లే మారుపుట్టువైన శిసువు
వొట్టుక పాలువెన్నలు నోలలాడు శిశువు
తొట్టెలలోన శిశువు త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి
నిండిన బండి తన్నిన చిన్ని శిశువు
అండవారి మదమెల్ల నణచిన శిశువు
కొండలంతేశసురుల( గొట్టిన యా శిశువు
దుండగంపు శిశువు త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి
వే(గైన వేంకటగిరి వెలసిన శిశువు
కౌగిటి యిందిర దొలగని శిశువు
ఆగి పాలజలధిలో నందమైన పెను(బాము
తూగుమంచము శిశువు త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి
అభయదాయకుడ వదె నీవేగతి
ఇభరక్షకా నన్నిపుడు కావవే || పల్లవి ||
భయహరదైత్యేయ భంజనకేశవ
జయజయ నృసింహ సర్వేశ్వరా
నియతము మాకిదె నీపాదములే గతి
క్రియగా మమ్మేలి కింకలుడుపవే ||అభయ||
బంధవిమోచన పాపవినాశన
సింధురవరదా శ్రితరక్షా
కంధర వర్ణుడ గతి నీనామమె
అంధకారముల నణచి మనుపవే ||అభయ||
దైవశిఖామణి తతచక్రాయుధ
శ్రీవేంకటగిరి శ్రీరమణా
సావధాన నీశరణ్యమే గతి
వేవేలకు నా విన్నపమిదియే ||అభయ||
అభయము అభయమో హరి నీవు
విభుడ వింతటికి వెర వికనేది // పల్లవి //
జడిగొని మదిలో శాంతము నిలువదు
కడుగడు దుస్సంగతి వలన
ఇడుమలేని సుఖ మించుక గానము
ఆడియాసల నా-యలమట వలన // అభయము //
తలపులోన నీ తత్వము నిలువదు
పలులంపటముల భ్రమ వలన
కలిగిన విజ్ఞాన గతియును దాగెను
వెలి విషయపు సిరివీకుల వలన // అభయము //
పక్కన పాపపు బంధము లూడెను
చిక్కక నిను దలచిన వలన
చిక్కులు వాసెను శ్రీ వేంకటపతి
నిక్కము నాకిదే నీ కృప వలన // అభయము //
అమరాంగనలదె ఆడేరు
ప్రమదంబుననదె పాడేరు
గరుడవాహనుడు కనక రథముపై
ఇరవుగ వీధుల నేగేని
సురలును మునులును సొంపుగ మోకులు
తెరలిచి తెరలిచి తీసేరు
ఇలధరుడదివో ఇంధ్రరథముపై
కెలయుచు దిక్కులు గెలిచీని
బలు శేషాదులు బ్రహ్మశివాదులు
చెలగి సేవలటు సేసేరు
అలమేల్మంగతో నటు శ్రీవేంకట
నిలయుడరదమున నెగడేని
నలుగడ ముక్తులు నారదాదులును
పొలుపు మీరకడు పొగడేరు
అమరెగదె నేడు అన్ని సొబగులును
సమరతి చిన్నలు సతి నీమేన // పల్లవి //
చెలపల చెమటలు చెక్కిళ్ళ
మొలకల నవ్వులు మొక్కిళ్ళ
సొలపుల వేడుక చొకిళ్ళ
తొలగని యాసలు తొక్కిళ్ళ // అమరెగదె నేడు //
నెరవగు చూపులు నిక్కిళ్ళ
మెఱసెను తమకము మిక్కిళ్ళ
గుఱుతగు నధరము గుక్కిళ్ళ
తఱచగు వలపుల దక్కిళ్ళ // అమరెగదె నేడు //
ననుగోరికొనలు నొక్కిళ్ళ
పొనుగని తములము పుక్కిళ్ళ
ఘనుడగు శ్రీ వేంకటపతి కౌగిట
ఎనసెను పంతము వెక్కిళ్ళ // అమరెగదె నేడు //
అమీదినిజసుఖ మరయలేము
పామరపుచాయలకే భ్రమసితిమయ్యా // పల్లవి //
మనసున బాలు దాగి మదియించివున్నట్టు
ననిచి గిలిగింతకు నవ్వినయట్టు
ననిచి గిలిగింతకు నవ్వినయట్టు
యెనసి సంసారసుఖ మిది నిజము సేసుక
తనివోది యిందులోనే తడబడేమయ్యా // అమీదినిజసుఖ //
బొమ్మలాట నిజమటా బూచి చూచి మెచ్చినట్టు
తెమ్మగా శివమాడి తా దేఅరైనట్టు
కిమ్ముల యీజన్మదు కిందుమీదు నేఱక
పమ్మి భోగములనేతెప్పల దేలేమయ్యా // అమీదినిజసుఖ //
బాలులు యిసుకగుళ్ళు పస గట్టు కాడినట్టు
వీలి వెఱ్రివాడు గంతువేసినయట్టు
మేలిమి శ్రీవేంకటేశ మిమ్ము గొలువక నేము
కాల మూరకే యిన్నాళ్ళు గడపితిమయ్యా // అమీదినిజసుఖ //
అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ
తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ // పల్లవి //
నీరిలోన తల్లడించి నీకే తలవంచీ
నీరికింద పులకించీ నీరమణుండు
గోరికొన చెమరించీ కోపమే పచరించీ
సారెకు నీయలుక ఇట్టె చాలించవమ్మ // అమ్మమ్మ ఏమమ్మ //
నీకుగానే చెయ్యిచాచీ నిండాకోపమురేచీ
మేకొని నీవిరహాన మేను వెంచీని
ఈకడాకడి సతుల హృదయమే పెరరేచీ
ఆకు మడిచియ్యనైన ఆనతియ్యవమ్మా // అమ్మమ్మ ఏమమ్మ //
చక్కదనములె పెంచీ సకలము గాదలంచి
నిక్కపు వేంకటేశుడు నీకే పొంచీని
మక్కువతో అలమేల్మంగ నాంచారమ్మ
అక్కున నాతని నిట్టే అలరించవమ్మ // అమ్మమ్మ ఏమమ్మ //
అమ్మెడి దొకటి అసిమలోదొకటి
బిమ్మిటి నిందేటిపెద్దలమయ్యా // పల్లవి //
సంగము మానక శాంతియు గలుగదు
సంగలంపటము సంసారము
యెంగిలిదేహం బింతకు మూలము
బెంగల మిందేటిపెద్దలమయ్యా // అమ్మెడి//
కోరికె లుడుగక కోపం బుడుగదు
కోరకుండ దిక్కువమనసు
క్రూరత్వమునకు కుదువ యీబ్రదుకు
పేరడి నేమిటిపెద్దలమయ్యా // అమ్మెడి//
ఫలము లందితే బంధము వీడదు
ఫలములో తగులు ప్రపంచము
యిలలో శ్రీవేంకటేశుదాసులము
పిలువగ నేమిటిపెద్దలమయ్యా // అమ్మెడి//
అయనాయ వెంగెమేలే అతివా ! నీ-
ఆయమే తాఁకీ మాఁట లందుకేమి సేతురా // పల్లవి //
కప్పురమిందవే వోకలికీ ! మాకు –
నుప్పులవు నీకప్పురా లొల్లము పోరా
తప్పనాడే వదియేమే తరుణీ ! వోరి
తప్పులెవ్వ రెందున్నవో తలఁచుకో నీవు // అయ //
నిమ్మ పండిందవే వో నెలఁతా ! ఆ –
నిమ్మపండే పాఁపరమును నే నొల్లరా
చిమ్మేవు సట లిదేమే చెలియ మేన
చిమ్మురేఖ లెవ్వరందో చిత్తగించు నీవు // అయ //
కుంకుమపూ విందవే వో కోమలీ ! నీ –
కుంకుమలే పుప్పుడౌను కూడుకొంటేను
యింకనేలే కలసితి నింతీ ! వోరి
యింకపు శ్రీవేంకటేశ యిద్దరిచెమటలు // అయ //
అయమేవ అయమేవ ఆదిపురుషో
జయకరం తమహం శరణం భజామి // పల్లవి //
అయమేవ ఖలుపురా అవనీధరస్తుసో
వ్యయమేవ వటదళాగ్రాధీశయనః
అయమేవ దశవిట్ట రవతార రూపై చ్య
నయమార్గ భువిరక్షణం కరోతి // అయమేవ //
అయమేవ సతతం శ్రియఃపతి దేవేషు
అయమేవ దుష్టదైత్యాంత కస్తు
అయమేవ సకల భూతాంతరేష్ణు క్రమ్య
ప్రియభక్తపోషణం పిదృతృనోతు // అయమేవ //
అయమేవ శ్రీవేంకటాద్రి విరాజితే
అయమేవ వరదోప్యాచకానా
అయమేవ వేదవేదాంతశ్చ సూచితో
అయమేవ వైకుంఠాధీశ్వరస్తు // అయమేవ //
అయ్యో నానేరమికే అట్టే యేమని వగతు
ముయ్యంచుచంచలాన మోసపోతిగాక // పల్లవి //
కాననా నావంటివారే కారా యీజంతువులు
నానా యోనుల బుట్టి నడచేవారు
మానక నాగర్వమున మదాంధమున ముందు
గానక భయపడినకర్మి నింతేకాక // అయ్యో నానేరమికే //
చదువనా నేదొల్లి జన్మజన్మాంతరముల
ఇది పుణ్య మిది పాప మింతంతని
వదలక నాభోగవాంఛలే పెంచి పెంచి
తుదకెక్క వెదకనిదుషుడనేను // అయ్యో నానేరమికే //
వినవా నే బురాణాల వెనకటివారినెల్ల
మనెడిభాగవతులమహిమలెల్లా
యెనయుచు శ్రీవేంకటేశుకృపచేత నేడు
ఘనుడ నయితిగాక కష్టుడగానా // అయ్యో నానేరమికే //
అయ్యో నేనేకా అన్నిటికంటె దీలు
గయ్యాళినై వ్రిధా గర్వింతుగాని // పల్లవి //
తడిపివుదికినట్టిధౌతవస్త్రములు నా
యొడలు మోచినమీద యోగ్యము గావు
వుడివోక వనములో వొప్పైనవిరులు నే
ముడిచివేసినంతనే ముట్టరాదాయను // అయ్యో నేనేకా //
వెక్కసపురచనలవేవేలురుచులు నా
వొకనాలు కంటితేనే యోగ్యముగావు
పక్కనదేవార్హపుబరిమళ గంధములు నా
ముక్కుసోకినంతలోనే ముట్టరాదాయను // అయ్యో నేనేకా //
గగనానుండి వచ్చేగంగాజలములైన
వొగి నాగోరంటితేనె యోగ్యము గావు
నగుశ్రీవేంకటపతి నన్నే రక్షించినదాక
మొగడై యెరుకతుది ముట్టరాదాయను // అయ్యో నేనేకా //
అయ్యో మానుపగదవయ్య మనుజుడు తన
కయ్యపుగంట గానడు // పల్లవి //
పాపపుణ్యలంపటుడైనా దుష్ట
రూపుడూ జన్మరోగి యటుగాన
పైపైనే ద్రవ్యతాపజ్వరము వుట్టి
యేపొద్దు వొడలెరగడు // అయ్యో //
నరకభవనపరిణతుడైనా కర్మ
పురుషుడు హేయభోగి యటుగాన
దురితపుణ్యత్రిదోషజ్వరము వట్టి
అరవెరమాట లాడీనీ // అయ్యో //
దేహమోహసుస్థిరుడై నా ని
ర్వాహుడు తర్కవాది యటుగాన
శ్రీహరి వేంకటశ్రీకాంతుని గని
వూహల జేరనొల్లడు // అయ్యో //
అయ్యో మాయల బొంది అందు నిండు నున్నవారు
యియ్యగొన గర్తలుగా రెఱగరు జడులు // పల్లవి //
చుక్కలై యుండినవారు సురలై యుండినవారు
యిక్కడనుండిపోయినయీజీవులే
దిక్కుల వారి నిందరు దేవతలంటా మొక్కేరు
యెక్కుడైనహరి నాత్మ నెఱగరు జడులు // అయ్యో మాయల //
పాతాళవాసులును పలులోకవాసులును
యీతరవాతనుండినయీజీవులే
కాతరాన వారిపుణ్యకతలె వినేరుగాని
యీతల శ్రీహరికత లెఱగరు జడులు // అయ్యో మాయల //
యిరవెఱిగినముక్తులెఱగని బద్దులు
యిరవై మనలోనున్న యీజీవులే
సిరుల మించినవాడు శ్రీవేంకటేశ్వరుడే
శరణాగతులు దక్క చక్కగారు జడులు // అయ్యో మాయల //
అయ్యో యేమరి నే నఁ ప్పుడేమై వుంటినో
అయ్యడ నీ దాసి నైతే ఆదరింతుగా // పల్లవి //
అల్లనాఁడు బాలుఁడవై ఆవులఁగాచేవేళ
చిల్లర దూడనైతే చేరి కాతువుగా
వల్లెగా విటుఁడవై రేపల్లెలో నుండే నాఁడు
గొల్లెత నయినా నన్ను కూడుకొందుగా // అయ్యో //
మేలిమి రామావతారవేళ రాయి రప్ప నైనా
కాలు మోపి బదికించి కాతువుగా
వాలి సుగ్రీవుల వద్ద వానరమై వుండినాను
యేలి నన్నుఁ బనిగొని యీడేర్తువుగా // అయ్యో //
వారిధిలో మచ్చ కూర్మావతారములైన నాఁడు
నీరులో జంతువునైనా నీవు గాతువుగా
యీరీతి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టే
మోరతోపున నిన్నాళ్ళు మోసపోతిఁగా // అయ్యో //
అయ్యో వారిభాగ్య మంతేకాక
నెయ్యపువెన్న వట్టుక నెయ్యి వెదకేరు // పల్లవి //
దేవుడు వెల్లవిరై దిక్కులెల్లా నిండుండగా
సోవల నాస్తికునకు శూన్యమై తోచు
యీవల వాన గురిసి యేరెంతబంటి వారినా
కావరపుజీవునకు గతుగతుకే // అయ్యో వారిభాగ్య //
హరి శరణంటే గాచేఅట్టియుపాయమే వుండగ
విరసానకు గర్మమే వెగాళమాయ
పరగ నరులకెల్లా బట్టపగలై యుండగా
అరయ గొన్నిజంతుల కంధకారమాయను // అయ్యో వారిభాగ్య //
యిక్కడ శ్రీవేంకటేశు డెదుటనే వుండగాను
అక్కటా మూడున కెందు ననుమానమే
మక్కువ నింతా నమృతమయమైన గోడికి
తెక్కుల దవ్వ బోయ్యేది తిప్పపెంటలే // అయ్యో వారిభాగ్య //
అయ్యో వికల్పవాదులంతటా సిగ్గువడరు
యియ్యెడ నెట్టుగలిగె నీయసురమతము. // పల్లవి //
నీముద్రలూ నొల్లరు నీదాసోహము నొల్లరు
కామించి నీమీదిభక్తి కడు నొల్లరు
నామమంత్రము నొల్లరనామయుండ వనెందురు
తాము వైష్ణవుల మంటా దర్కింతురు. // అయ్యో //
పైకృతవేళ నీప్రసాదమూ నొల్లరు
ఘాతలనూర్ధ్వపుండ్రము గాదందురు
ఝాతరదైవాల నిన్ను సరిగా బూజింతురు
ఆఅతల వైష్ణవులు దామనుకొందురు // అయ్యో //
శ్రీవైష్ణవుల గంటే జేతులెత్తి మొక్కరు
భావింతురు పగ వారిబలె గన్నట్టు
ఆఅవల వైకుంఠమూ ననిత్యమందురు
కావించి వైష్ణవులము కామా నే మందురు. // అయ్యో //
వరుస రావణాదులవలె నెజ్ఞాలు సేతురు
శరుస నట్టే వేదమూ జదువుదురు
ణిరతి శ్రీవేంకటేశ నీమహిమ లెరగక
ఆరిది వైష్ణవులమే యని యాడుకొందురు. // అయ్యో //
అయ్యో పోయఁ బ్రాయముఁ గాలము
ముయ్యంచుమనసున నే మోహమతి నైతి // పల్లవి //
చుట్టంబులా తనకు సుతులుఁగాంతలుఁ జెలులు
వట్టియాసలఁ బెట్టువారేకాక
నెట్టుకొని వీరు గడునిజమనుచు హరి నాత్మఁ
బెట్టనేరక వృథా పిరివీకులైతి // అయ్యో //
తగుబంధులా తనకుఁ దల్లులునుఁ దండ్రులును
వగలఁ బెట్టుచుఁ దిరుగువారేకాక
మిగుల వీరలపొందు మేలనుచు హరి నాత్మఁ
దగిలించలేక చింతాపరుఁడనైతి // అయ్యో //
అంతహితులా తనకు నన్నలునుఁ దమ్ములును
వంతువాసికిఁ బెనఁగువారేకాక
అంతరాత్ముఁడు వేంకటాద్రీశుఁ గొలువ కిటు
సంతకూటములయలజడికి లోనైతి // అయ్యో //
అరయశ్రావణ బహుళాష్టమి చంద్రోదయాన
సిరులతో నుదయించె శ్రీకృష్ణుడిదివో // పల్లవి //
వసుదేవుని పాలిట వర తపోధనము
యెసగి దెవకీదెవి యెదపై సొమ్ము
సురాసుర గొల్లెతల సొంపు మంగళసూత్రము
శిరులై వుదయించె శ్రీకృష్ణుడిదివో // అరయశ్రావణ //
నంద గోపుడుగన్న నమ్మిన నిధానము
పొందగు యశోదకు పూజదైవము
మందల యావులకును మంచి వజ్రపంజరము
చెంది యుదయించినాడు శ్రీకృష్ణుడిదివో // అరయశ్రావణ //
సేవ సేసే దాసుల చేతిలోని మాణికము
శ్రీవేంకటాద్రినేచిన బ్రహ్మాము
వోవరి నలమేల్మంగ నురముపై బెట్టుగొని
చేవ దేర నుదయించె శ్రీకృష్ణుడిదివో // అరయశ్రావణ //
అరసినన్ను గాచినాతనికి శరణు
పరము నిహము నేలే పతికిని శరణు
వేదములు దెచ్చినట్టివిభునికి శరణు
ఆదిమూలమంటే వచ్చినతనికి శరణు
యేదెసా తానైయున్న యీతనికి శరణు
శ్రీదేవి మగడైన శ్రీపతికి శరణు
అందరికి ప్రాణమైన ఆతనికి శరణు
ముందు మూడు మూర్తుల మూర్తికి శరణు
దిందుపడి దేవతల దేవునికి శరణు
అంది మిన్ను నేలనేకమైనతనికి శరణు
తానే చైతన్యమైన దైవానకు శరణు
నానా బ్రహ్మాండాలనాథునికి శరణు
ఆనుక శ్రీవేంకటాద్రి యందునుండి వరములు
దీనుల కిందరి కిచ్చే దేవునికి శరణు
అరిదిసేతలే చేసి తల్లాడ నిల్లాడ
సరిలేక వుండితివి జలరాశికాడ // పల్లవి //
పొలియంబీర్చితి వొకతి బురిటిమంచముకాడ
నలచితి వొకని గగనంబుకాడ
బలిమి దన్నితి వొకని బండిపోతులకాడ
దులిమితివి యేడుగుర దోలి మందకాడ // అరిదిసేతలే //
తడవి మోదితి వొకని తాటిమాకులకాడ
నడిచితి వొకని బేయలకాడను
పిడిచివేసితి వొకని బృందావనముకాడ
వొడిసితివి వొకని నావులమందకాడ // అరిదిసేతలే //
పటపటన దిక్కులు పగుల బగతుల దునిమి
నటియించితివి మామనగరికాడ
కుటిలబాహు దైత్యాంతకుడవు వేంకటరాయ
పుటమెగసితి జగంబుల యింటికాడ // అరిదిసేతలే //
అరుదరుదీగతి అహోబలేశ్వర
పొరి(బొరి దాసుల పొగడుట యెట్టు
యెదుట( జించితివి హిరణ్యకశిపుని
అదె ప్రహ్లాదుడు బంటగుటెట్లు
కదిసిన రుద్రుని గర్వ మడచితివి
గుదిగొని దివిజులు కొలుచుట యెట్టు
ఘనసింహాకృతి గైకొనివుంటివి
యనయంగ కరి గాచినదెట్లు
పనివడి కంబము పగుల వెడలితివి
మనుజులు పూజించి మరుగుట యెట్టు
సరవితో వీరరసమున మించితివి
అరయంగ శృంగారి వౌటెట్టు
సిరివుర మెక్కెను శ్రీవేంకటాద్రిని
యిరవుగ నీతొడ యెక్కుట యెట్టు
అరుదరుదు నీమాయ హరిహరీ
అరసి తెలియరాదు హరిహరీ // పల్లవి //
అనంత బ్రహ్మాడములవె రోమకూపముల
అనంతములై వున్నవి హరిహరీ
పొనిగి కుంగినవొక్కభూమి నీవెత్తినది యే
మని నుతింతు నిన్ను హరిహరీ // అరుదరుదు //
పొదిగి బ్రహ్మాదులు నీబొడ్డున నేకాలము
అదివో పుట్టుచున్నారు హరిహరీ
పొదలి యీజీవుడు పుట్టించే యీసామర్ధ్యము
అదన నేమనిచెప్పే హరిహరీ // అరుదరుదు //
పావన వైకుంఠము నీపాద మూలమందున్నది
ఆవహించే భక్తిచేత హరిహరీ
శ్రీవేంకాటాద్రి మీదచేరి నీవిట్టె వుండగా
నావల వెదకనేల హరిహరీ // అరుదరుదు //
అఱిముఱి హనుమంతుడు అట్టి బంటు
వెఱపులేని రఘువీరునికి బంటు
యేలికను దైవముగా నెంచి కొలెచేవాడే బంటు
తాలిమిగలిగినయాతడే బంటు
పాలుమాలక యేపొద్దు పనిసేయువాడే బంటు
వేళ గాచుకవుండేటి వెరవరే బంటు
తను మనోవంచన లెంతటా లేనివాడే బంటు
ధనముపట్టున శుధ్ధాత్మకుడే బంటు
అనిశము నెదురు మాటాడనివాడే బంటు
అనిమొన తిరుగనియతడే బంటు
చెప్పినట్లనే నడాచినయాతడే బంటు
తప్పులేక హితుడైనాతడే బంటు
మెప్పించుక విశ్వాసాన మెలగువాడే బంటు
యెప్పుడును ద్రోహిగాని హితుడే బంటు
అలపు దీర్చుకోరాద అన్నీనయ్యీ గని
నిలువెల్లా జెమరించి నీళ్ళు గారీని // పల్లవి //
వీడెమందుకొనరాదా వెనక విచ్చేతుగాని
బీడై నీకెమ్మోవి పిప్పిగట్టెను
చూడరాదా మమ్ముగొంత చొక్కి కన్నుమూతుగాని
ఆడ నీడా నుమ్మదాకి యలపుదేరీని // అలపు //
పాదమొత్తించుకోరాదా ప్రక్కన నవ్వుదుగాని
వీధులెల్లా దిరుగాడి విసిగినది
జూదమైనా నాడరాదా సొంట్లు సోదింతుగాని
ఆదిగొని కోరికలు అంకెకు దీసీని // అలపు //
పవళించివుండరాదా పానుపుపై నికనైనా
జవళి బులకలు మైజడిపీని
యివల శ్రీవేంకటేశ యిట్టె నన్నుగూడితివి
సవతులదేకుమీ చలమెక్కీని // అలపు //
అలమేలు మంగవు నీ వన్నిటా నేరుపరివి
చలము లేటికి నిక సమ్మతించవే // పల్లవి //
విడియము చేతికిచ్చి విభుడు వేడుకపడి
వొడివట్టి పెనగగా నొద్దనకువే
వుడివోని వేడుకతో నుంగరము చేతికిచ్చి
యెడయక వేడుకొనగా నియ్యకొనవే // అలమేలు //
చిప్పిలు వలపుతోడ చెక్కులు నొక్కుచు మోవి
గప్పుర మందియ్యగాను కాదనకువే
కొప్పుదువ్వి బుజ్జగించి కొసరి మాటలాడి
అప్పసము నవ్వగాను అట్టె కానిమ్మనవే // అలమేలు //
యిచ్చగించి శ్రీవేంకటేశ్వరుడు నిన్నుగూడి
మచ్చిక గాగిలించగాను మారాడకువే
పచ్చడము మీద గప్పి పట్టపు దేవులజేసి
నిచ్చలాన నేలుకొనె నీవూ గైకొనవే // అలమేలు //
అలమేలుమంగనీ అభినవరూపము
జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మ // పల్లవి //
గరుడాచలాధీశు ఘనవక్షముననుండి
పరమానంద సంభరతవై
నెరతనములు జూపి నిరంతరమునాథుని
హరుషింపగ జేసి తిగదవమ్మ // అలమేలుమంగనీ //
శశికిరణములకు చలువలచూపులు
విశదముగా మీద వెదజల్లుచు
రసికత పెంపున కరగించి ఎప్పుడు నీ
వశముజేసుకొంటి వల్లభునోయమ్మ // అలమేలుమంగనీ //
రట్టడి శ్రీవేంకటరాయనికి నీవు
పట్టపురాణివై పరగుచు
వట్టిమాకులిగిరించు వలపుమాటలవిభు
జట్టిగొని వురమునసతమైతివమ్మ // అలమేలుమంగనీ //
అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భవంబు దెలిపె నీ వుయ్యాల||
ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల
పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచె వుయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల||
మేలు కట్లయి మీకు మేఘమణ్డలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల
నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల
పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల
వోలి బ్రహ్మాణ్డములు వొరగువో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల||
కమలకును భూసతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల
అమరాంగనలకు నీ హాస భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల
కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల||
ఆ
ఆ రూపమునకే హరి నేను మొక్కెదను
చేరి బిభీషణుని శరణాగతుడని చేకొని సరిగాచితివి
ఫాలలోచనుడు బ్రహ్మయు నింద్రుడు
సోలి నగ్నియును సూర్యచంద్రులును
నీలోనుండగ నెరి గనె కిరీటి
మూల భూతివగు మూర్తివి గాన
అనంత శిరసుల ననంతపదముల
ననంతనయనము లనంతకరముల
ఘన నీరూపము కనుగొనె కిరీటి
అనంతమూరితి వన్నిట గాన
జగములిన్నియును సకల మునీంద్రులు
నగు శ్రీవేంకటనాధుడ నిన్నే
పొగడగ కిరీటి పొడగనె నీరూపు
అగణిత మహిముడ వన్నిట గాన
ఆకటి వేళల అలపైన వేళల
తేకువ హరినామమే దిక్కు మరి లేదు
కొఱమారియున్న వేళ కులము చెడిన వేళ
చెఱవడి వొరుల చేజిక్కినవేళ
వొఱపైన హరినామమొక్కటే గతి గాక
మఱచి తప్పిననైన మఱి లేదు తెరగు
ఆపద వచ్చిన వేళ ఆరడి బడిన వేళ
పాపపు వేళల భయపడిన వేళ
వోపినంత హరినామ మొక్కటే గతి గాక
మాపు దాకా పొరలిన మరిలేదు తెరగు
సంకెల బెట్టిన వేళ చంప బిలిచిన వేళ
అంకిలిగా నప్పుల వారాగిన వేళ
వేంకటేశు నామమే విడిపించ గతినాక
మంకు బుద్ది పొరలిన మరిలేదు తెరగు
ఆకెవో నాప్రాణ మోహనపు రాణి
దాకొని వేవేలు కాంతలలోన నున్నది
ముదిత కురులనెల్లా ముత్యములు మాణిక్యాలు
గుదిగుచ్చి కలుగంటు గొన్నది
సదరపు పసిడి వజ్రాలచనుకట్టుది
అదె పైడి పూవుల పయ్యద వల్లెవాటుది
పచ్చలు దాచిన యట్టి పాదుకలు మెట్టినది
లచ్చన మొగవుల మొలనూళ్ళది
అచ్చపు టుంగరముల అందెలు బాయవట్టాలు
గుచ్చుల ముంజేతుల కంకణ సూడిగేలది
నానాభూషణముల నానా సింగరాల
పానిపట్టి నాదిక్కెతప్పక చూచేది
ఆనకపుశ్రీ వేంకటాద్రి పతినైన నన్ను
తానె వచ్చి కూడి నాదగ్గరనె వున్నది
ఆచారవిచారా లవియు నే నెరఁగ
వాచామగోచరపువరదుఁడ నీవు // పల్లవి //
తపమొక్కటే నాకుఁ దగునీశరణనుట
జపమొక్కటే నిన్ను సారెకు నుతించుట
వుపమొక్కటే నీవె వున్నతుఁడవంట
విపరీతవిఙ్ఞానవిధులేమి నెరఁగ // ఆచార //
కర్మమొక్కటే నీ కైంకర్యగతి నాకు
ధర్మమొక్కటే నీ దాసానుదాస్యము
మర్మమొక్కటే నామతి నిన్నుఁ దలఁచుట
అర్మిలి నింతకంటే నవల నే నెరఁగ // ఆచార //
బలిమియొక్కటే నాకు భక్తి నీపైఁ గలుగుట
కలిమియొక్కటే నీవు గలవని నమ్ముట
యెలమితో శ్రీవేంకటేశ నీవు గతిదక్క
పలుబుధ్ధుల నేఁబొరలు భావనలేనెరఁగ // ఆచార //
ఆటవారి గూడితౌరా // పల్లవి //
ఆటవారిగూడి అన్నిచోట్ల బొమ్మ
లాట లాడించ నధికుండవైతివి // అనుపల్లవి // //
గురుతరమగు పెద్ద కొట్టాములోపల
తిరుమైన పెనుమాయ దెరగట్టి
అరయ నజ్ఞానములవి యడ్డముగజేసి
పరగ సుజ్ఞానదీపములు ముట్టించి // ఆటవారి //
తోలుబొమ్మల దొరకొని గడియించి
గాలిచేత వాని గదలించి
తూలేటి రసములు తొమ్మిది గడియించి
నాలుగుముఖముల నలువున నాడించ // ఆటవారి //
నిన్నే మెత్తురుగాని నీకేమి నీలేరు
మన్నించుదాతలు మరి లేరు
యెన్నగ దిరువేంకటేశ్వర నీదాసు
లున్నతులై నిన్ను నుబ్బించి పొగడగ // ఆటవారి //
ఆడరమ్మ పాడరమ్మ అంగనలు చూడరమ్మ
వేడుక పరషులెల్ల వీధి చూడరమ్మ
అల్లదివో ఓగునూతుల ఔభళేశు పెద్దకోన
వెల్లిపాల నీటి జాలు వెడలే సోన
చల్లని మాకుల నీడ సంగడి మేడలవాడ
ఎల్లగాగ నరసింహుడేగీ నింతితోడ
సింగారపు మండపాల సింహాల మునిమందలు
అంగపు తెల్లగోపురము అదె మిన్నంద
చెంగట నాళువార్లు చేరి పన్నిద్దరు గొల్వ
సంగతి తా కొలువిచ్చీ జయనరసింహము
కందువ శ్రీవేంకటేశు కల్యాణముల వేది
అందమై భూమికెల్ల ఆదికి అనాది
మందల పాల కొండ మలకు నట్టనడుమ
విందగు దాసుల తోడ విహరించీ దేవుడు
ఆడరానిమా టది గుఱుతు
వేడుకతోనే విచ్చేయుమనవే // పల్లవి //
కాయజకేలికిఁ గడుఁ దమకించఁగ
ఆయము లంటిన దది గుఱుతు
పాయపుఁబతికినిఁ బరిణాము చెప్పి
మోయుచుఁ దన కిటు మొక్కితిననవే // ఆడ //
దప్పిమోవితో తా ననుఁ దిట్టఁగ –
నప్పుడు నవ్విన దది గుఱుతు
యిప్పుడు దనరూ పిటు దలఁచి బయలు
చిప్పిలఁ గాఁగిటఁ జేర్చితిననవే // ఆడ //
పరిపరివిధములఁ బలుకులు గులుకఁగ
అరమరచి చొక్కిన దది గుఱుతు
పరగ శ్రీవేంకటపతి కడపలోన
సరవిఁగూడె నిఁక సమ్మతియనవే // ఆడ //
ఆడరో పాడరో అప్సరోగణము
వీడెము లిందరో విభవము నేడు
కమలారమణుని కళ్యాణమునకు
తమినదె గరుడాధ్వజ మెసగె
తెమలుచు మ్రోసెను దివ్యదుందుభులు
గమనించరో దివిగల దేవతలు
వెలయగ లక్ష్మీవిభుని పెండ్లికిని
బలసి అంకురార్పణ మదివో
కలగొన నిచ్చేరు గంధాక్షతలచే
చెలగి కైకొనరో శ్రీవైష్ణవులు
బడి శ్రీ వేంకటపతికి శ్రీసతికి
అడరిన తలబాలందె నదె
నడచి పరుషలు నానా ముఖముల
ముడుపులు చదువరో ముయిగా నరులు
ఆడరో పాడరో ఆనందించరో
వేడుక మొక్కరో విఙ్ఞానులు // పల్లవి //
హరి రక్షకుఁడై యందరి కుండఁగ
పరగఁగ బదికేరు బ్రహ్మాదులు
గరిమ నతఁడే చక్రము చేఁబట్టఁగ
సురిగి పారి రదె చూడుఁడు సురలు // ఆడ //
పదిలపువిష్ణుఁడె ప్రాణమై యుండఁగ
యిదివో మెలఁగేరు యీజీవులు
మొదలు యితఁడే మూలమై యుండఁగ
పొదలె నీతనిపంపున లోకములు // ఆడ //
శ్రీ వేంకటాద్రిని శ్రీపతి యుండఁగ
తావుల నిలిచెను ధర్మములు
యీవల నితఁడే యిచ్చేటివరముల
పావనులై రిదే ప్రపన్నులు // ఆడ //
ఆడుతా పాడుతా అట్టె ముద్దుగునుసుతా
వోడక నీదండ చేరి వున్నారమయ్యా
ఆస తల్లిదండ్రిమోము అట్టె చూచి శిశువులు
యే సుఖదుఃఖములు తామెరగనట్టు
వాసుల శ్రీపతి మిమ్ము పడి నాత్మ దలచుక
యీసుల పుణ్య పాపము లెరగమయ్యా
యేలినవారు వెట్టగా నేపున దొత్తులు బంట్లు
ఆలకించి పరులబోయడుగనట్టు
తాలిమి శ్రీపతి మీరు తగ మమ్ము రక్షించగా
యేలని యేమియు గోర నెరగమయ్యా
చేత జిక్కి నిధానము చేరి యింటగలవాడు
యేతుల గలిమిలేములు లెరుగనట్టు
ఆతుమలో శ్రీవేంకటాధిప నీవుండగాను
యీతల నేవెలుతులు నెరగమయ్యా
ఆడువారు కడుగోపులవుట నీ వెరగవా
నేడు గొత్తలుగా భూమి నేర్పుక వచ్చేరా
వలచిన యాడువారు వాదులాటకు వచ్చిన
చలము సాధించువాడు జాణడా వాడు
కలయని కాకతోడ కమ్మటి నలిగిపోగా
పిలిచి మాటాడకున్న ప్రియుడా వాడు // ఆడువారు //
చనవుగలుగువారు సణగులదిట్టగాను
కనలియెగ్గువట్టితే ఘనుడా వాడు
గునిసి సవతులపై కోపాన పతి నంటేను
విని నవ్వకుండేవాడు విభుడా వాడు // ఆడువారు //
పాయరానియటివారు బలుములు చూపితేను
నాయాలబెట్టెడివాడు నాథుడా వాడు
యీయెడ శ్రీవేమ్కటేశ యింతినిట్టె గూడితివి
చాయకు రాకుండువాడు సరసుడా వాడు // ఆడువారు //
ఆణికాడవట యంతటికి
జాణవు తెలియము సరిగొనవయ్యా
ముంగిట చెమటల ముత్యపు పూసలు
అంగన లోలో నమ్మీనదె
ఇంగితంపువెల లెరుగుదువటవో
యంగడి బేహారి యవి గొనవయ్యా
మొల్లమి మాచెలిమోవిమాణికము
అల్లవెలకు నీ కమ్మీనదె
తొల్లి నీవు సూదులవాట్లచే
కొల్ల లడిగితట కొనవయ్యా
నిడుదల చూపుల నీలంబులు నీ-
వడిగినంతకే యమ్మీనదే
పడతిదె శ్రీవేంకటపతి నీ వదె
యెడయని కాగిట నిటు గొనవయ్యా
ఆతఁ డితఁడా వెన్న లంతట దొంగిలినాఁడు
యేతులకు మద్దులు రెండిలఁ దోసినాఁడు // పల్లవి //
యీతఁడా దేవకిగన్నయింద్రనీలమాణికము
పూతకిచన్ను దాగి పొదలినాఁడు
యీతఁడా వసుదేవునియింటిలో నిధానము
చేతనే కంసునిఁ బుట్టచెండుసేసినాఁడు // ఆతఁ //
మేటియైనగొంతిదేవిమేనల్లుఁ డీతఁడా
కోటికిఁ బడెగెగాను కొండ యెత్తెను
పాటించి పెంచేయశోదపాలి భాగ్య మీతఁడా
వాటమై గొల్లెతలను వలపించినాఁడు // ఆతఁ //
ముగురువేలుపులకు మూలభూతి యీతఁడా
జిగి నావులఁ బేయలఁ జేరి కాచెను
మిగుల శ్రీవేంకటాద్రిమీఁదిదైవ మితడా
తగి రామకృష్ణావతార మందె నిప్పుడు // ఆతఁ //
ఆతడదె మీరదె అప్పగించితిమి మేము
మీతల పుదాన నేను మీకేలే చింత ||
నన్ను నేల అడిగేరే నాటి నేటి సుద్దులు
అన్నియును నడుగరే ఆతనిని
పన్నిన వారిద్దరికి పైపై మీరే కారా
వెన్నచేత బట్టుకొని నేడ నేలే నెయ్యి ||
యేలకొడ బర చేరే యింతలోనే నన్నును
చాలు నొడ బరచరే చాలు నాతని
పోలిమితో నింతేసి బుద్ది మీరెరగనిదా
తాలము చేత బట్టుకొని దాటణేలే వాకిలి ||
అనలేల పెట్టేరే ఆతనితో గూడుమని
పేనియాన లతనికే పెట్టరాదా
ఆనుక శ్రీవేంకటేశు డాతడే నన్ను గూడె
తేనెలు వంటి చెలులు తీపులు మీకేలే ||
ఆతడెవ్వాడు చూపరే అమ్మలాల
ఏతుల నాడేటిక్రిష్ణుడీతడే కాడుగదా
కందువ దేవకి బిడ్డ గనెనట నడురేయి
అంది యశోదకు కొడుకైనాడట
సందడించి పూతకి చంటిపాలు తాగెనట
మందల ఆవుల గాచి మలసెనట
మంచిబండి దన్నెనట మద్దులు విరిచెనట
ఇంచుకంతవేల కొండయెత్తినాడట
మంచాలపై గొల్లెతలమానాలు చేకొనెనట
మించుల పిల్లగోవివట్టి మెరసెనటా
కాళింగుని మెట్టెనట కంసు( బొరిగొనెనట
పాలించి సురల చేపట్టెనట
యీలీల శ్రీవేంకటాద్రి నిరవైనదేవుడట
యేలెనట పదారువేల ఇంతుల నిందరిని
ఆతడే బ్రహ్మణ్యదైవము ఆది మూలమైన వాడు
ఆతని మానుటలెల్ల అవిథిపూర్వకము
ఎవ్వని పేర పిలుతురు ఇల పుట్టిన జీవుల
నవ్వుచు మాస నక్షత్ర నామముల
అవ్వల ఎవ్వని కేశవాది నామములే
రవ్వగా ఆచమనాలు రచియింతురు
అచ్చ మేదేవుని నారాయణ నామమే గతి
చచ్చేటి వారికి సన్యాసము వారికి
ఇచ్చ నెవ్వరి తలచి యిత్తురు పితాళ్ళాకు
ముచ్చట నెవ్వని నామములనే సంకల్పము
నారదుదు తలచేటినామ మది యెవ్వనిది
గౌరినుడిగేటినామకథ యేడది
తారకమై బ్రహ్మరుద్రతతి కెవ్వరి నామకు
యీరీతి శ్రీవేంకటాద్రి నెవ్వడిచ్చీ వరము
ఆతడే సకలవ్యాపకు డతడే యాతురబంధువు
డతడు దలపులముంగిట నబ్బుట యెన్నడొకో
సారెకు సంసారంబనుజలనిధు లీదుచు నలసిన
వారికి నొకదరిదాపగువా డిక నెవ్వడొకో
పేరినయజ్ఞానంబను పెనుజీకటి తనుగప్పిన
చేరువవెలుగై తోపెడిచెలి యిక నెవ్వడొకో // ఆతడే సకలవ్యాపకు //
దురితపుకాననములో త్రోవదప్పినవారికి
తెరువిదె కొమ్మని చూపెడిదేవు డిదెవ్వడొకో
పెరిగినయాశాపాశము పెడగేలుగ దనుగట్టిన
వెరవకుమని విడిపించేటివిభు డిక నెవ్వడొకో // ఆతడే సకలవ్యాపకు //
తగిలినయాపదలనియెడిదావానలములు చుట్టిన
బెగడకుమని వడివార్చెడిబిరు దిక నెవ్వడొకో
తెగువయు దెంపునుగలిగినతిరువేంకటవిభు డొక్కడే
సొగిసి తలంచినవారికి సురతరువగువాడు // ఆతడే సకలవ్యాపకు //
ఆతనినే నే కొలిచి నే నందితి బో నిజసుఖము
శ్రీతరుణీపతి మాయాధవుడు సృష్టియింతయును హరి మూలము // పల్లవి //
కోరుదుమా దుఃఖములు కోర కేతెంచు తముదామే
ఆరీతులనే సుఖములు యేతెంచు నందును విచార మంతేల
సారెకు దైవాధీనము లివి రెండు స్వయత్నములుగా వెవ్వరికి
కోరేటి దొకటే హరిశరణాగతి గోవిందుడే యింతకు మూలము // ఆతనినే నే కొలిచి //
కమ్మంటిమా ప్రపంచము ప్రపంచము గలిగీ స్వభావము అందుకది
యిమ్ముల మోక్షము యీరీతులనే యీశ్వరుడిచ్చిన యిది గలుగు
కమ్మి అంతర్యామికల్పితంబు లివి కాదనవుననరా దెవ్వరికి
సమ్మతించి ఆసపడియెడి దొకటే సర్వలోకపతి నిజదాస్యము // ఆతనినే నే కొలిచి //
సరి నెఱగుదుమా పోయినజన్మము సారెకు నేమేమి చేసితిమో
యిరవుగ నట్లా మీదటిజన్మముయెఱుకలు మఱపులు యికనేలా
నిరతమై శ్రీవేంకటేశుడు తనయిచ్చ నిర్మించిన దిది యీదేహము
గరిమెల నాతనికైంకర్యమెపో కలకాలము మాకు కాణాచి // ఆతనినే నే కొలిచి //
ఆతనిమూలమే జగమంతా నిది
ఆతుమలో హరి కీలుఅయివుండుఁగాని // పల్లవి //
మచ్చరము లేకున్నను మననే రామరాజ్యము
వచ్చినట్టె వచ్చితేను వలపే చవి
యెచ్చు కుందు లేకున్న నెక్కడైనా సుఖమే
యిచ్చకుఁడై హరి తన కియ్యవలెఁగాని // ఆత //
నెట్టుకొని నడచితే నిజమే మూలధనము
పట్టినదే వ్రతమైతే భవమే మేలు
జట్టిగా వొనగూడితే సంసారమే ఫలము
యిట్టె హరి దనకు నియ్యవలెఁగాని // ఆత //
చెప్పినట్టు సేసితేను చేరి దేహమే చుట్టము
తప్పులు లేనిదియైతే ధర్మమే సొమ్ము
చొప్పునహరిదాసులు సోదించి చూచిన దిది
యెప్పుడు శ్రీవేంకటేశుఁ డియ్యవలెఁగాని // ఆత //
ఆతుమ సంతసపెట్టుటది యెఱుక తా
నేతెరువు నొల్లకుండు టదియే యెఱుక
ముంచినబంధములలో ముణుగుడువడక తా
నంచల విడదన్నుటిది యెఱుక
చంచలపువిషయాల సగ్గుడుమగ్గుడుగాక
యెంచి హరిదలపోయు టిదియే యెఱుక // ఆతుమ సంతసపెట్టుటది //
పాయనియర్థములకు బంటుబంటై తిరుగక
ఆయతమై మోసపోని దది యెఱుక
పాయపుగామినలతో బలుమారు జేయుపొందు
హేయమనితలపోయు టిదియే యెఱుక // ఆతుమ సంతసపెట్టుటది //
ధరమీదగలప్రాణితతుల నొప్పించక
అరయగ సముడగు టది యెఱుక
గరిమల శ్రీవేంకటపతిదాసుడై
యిరవొంద సుఖియంటదియే యెఱుక // ఆతుమ సంతసపెట్టుటది //
ఆది మునుల సిద్ధాంజనము
యేదెస చూచిన నిదివో వీడే
నగినసెలవి బడు నాలుగు
జగములు మొగమున జూపే మోహనము
కనుదెరచిన నలుగడ నమృతములటు
అనువున గురిసీ నపారము
వనితలు నంద వ్రజమున జెలగగ
మనికిక నిరవై మలసీ వీడే
పరమునకును దా బరమై వెలసిన
పరిపూర్ణ పరాత్పరుడు
సరస రుక్మిణికి సత్య భమకును
వరుడగు వేంకట వరదుడే వీడు
ఆది దేవా పరమాత్మా
వేద వేదాంతవేద్య నమో నమో !!
పరాత్పరా భక్త భవభంజన
చరాచర లోక జనక నమో నమో !!
గదాధరా శ్రీ వేంకటగిరి నిలయా
సదానందా ప్రసన్న నమో నమో !!
ప|| ఆదిదేవ పరమాత్మా వేద | వేదాంత వేద్య నమో నమో ||
అనుప|| పరాత్పరా భక్త భవ భంజన | చరాచర లోక జనక నమో నమో ||
చ|| గదాధరా వేంకటగిరి నిలయా | సదానంద ప్రసన్న నమో నమో ||
ఆదిదేవుం డనంగ మొదల నవతరించి జలధి సొచ్చి
వేదములును శాస్త్రములను వెదకి తెచ్చె నితండు
వాలి తిరుగునట్టి దైత్యవరుల మోహవతులనెల్ల
మూలమూలం ద్రోసి ముసుగుపాలుసేసె నితండు
వేలసంఖ్యనైన సతుల వేడుక లలరంజేసి వొంటి
నాలిమగని రీతిగూడి యనుభవించె నితండు
కడుపులోని జగములనెల్ల గదలకుండం బాపరేని
పడకనొక్క మనసుతోడం బవ్వళించె నితండు
అడుగు క్రింద లోకమెల్ల నడంచదలంచి గురుతుమీర
పొడవు వెరిగి మిన్నుజలము పొడిచి తెచ్చి నితండు
కొండెవయసువాడు మంచి గోపసతుల మనములెల్ల
ఆడికెలకు నోపి కొల్లలాడి బ్రదికె నితండు
వేడుకలర వేంకటాద్రి వెలసి భూతకోటి దన్నుం
జాడుం డనుచు మోక్షపదము చూరవిడిచి నితండు
ఆదిదైవుడై అందరిపాలిటి
కీ దేవుడై వచ్చె నితడు
కోరినపరమయోగులచిత్తములలోన
యేరీతినుండెనో యీతడు
చేరవచ్చినయాశ్రితులనెల్ల బ్రోవ
యిరీతి నున్నవాడీతడు
కుటిలదానవుల కోటానుగోట్ల
యెటువలె ద్రుంచెనో యీతడు
ఘటియించి యిటువంటికారుణ్యరూపుడై
యిటువలె నున్నవా డితడు
తక్కక బ్రహ్మాండతతులెల్ల మోచి తా
నెక్కడ నుండెనో యీతడు
దిక్కుల వెలసినతిరువేంకటేశుడై
యిక్కడ నున్నవాడీతడు
ఆదిపురుషా అఖిలాంతరంగా
భూదేవతా రమణ భోగీంద్ర శయనా
భవ పాథోనిధి బాడబానల
భవజీముత ప్రభంజనా
భవపర్వత ప్రళయ భయద నిర్ఘాత దు
ర్భవ కాలకూటభవ బహువిశ్వరూప
భవ ఘోర తిమిర దుర్భవ కాల మార్తాణ్డ
భవ భద్రమాతంగ పంచానన
భవ కమలభవ మాధవరూప శేషాద్రి
భవ వేంకటనాథ భవరోగ వైద్య
ఆదిమ పురుషుడు అహోబలమను
వేదాద్రి గుహలో వెలసీవాడే
ఉదయించే నదిగో ఉక్కు కంబమున
చెదరక శ్రీ నరసింహుడు
కదిసి హిరణ్యుని ఖండించి ప్రహ్లాదు
నెదుట గద్దెపై నిరవై నిలిచే
పొడ చూపెనదిగో భువి దేవతలకు
చిడుముడి శ్రీ నరసింహుడు
అదర నందరికి నభయంబొసగుచు
నిడుకొనె తొడపైన తిరము
సేవలు గొన్నాడె చెలగి సురలచే
శ్రీవేంకట నరసింహుడు
దైవమై మమ్మేలి దాసుల రక్షించే
తావు కనగ నిటు దయతో జూచి
ఆదిమపూరుషు డచ్యుతు డచలు డనంతు డమలుడు
ఆదిదేవు డీతడేపో హరి వేంకటవిభుడు
ఏకార్ణవమై ఉదకములేచిన బ్రహ్మాండములో
బైకొనియుండగ నొకవటపత్రములోపలను
చేకొని పవళింపుచు నొకశిశువై వడి దేలాడిన
శ్రీకాంతు డీతడేపో శ్రీవేంకటవిభుడు
అరుదుగ బలిమద మడపగ నాకసమంటిన రూపము
సరగున భూమియంతయు నొకచరణంబున గొలిచి
పరగినపాదాంగుటమున బ్రహ్మాండము నదలించిన
పరమాత్ము డీతడేపో పతివేంకటవిభుడు
క్షీరపయోనిధిలోపల శేషుడు పర్యంకముగా
ధారుణియును సిరియును బాదము లొత్తగను
చేరువ దను బ్రహ్మాదులు సేవింపగ జెలువొందెడి
నారాయణుడితడే వున్నతవేంకటవిభుడు
ఆదిమూర్తి యీతడు ప్రహ్లాదవరదుడు
ఏదెస జూచినా తానె ఈతడిదె దేవుడు
నవ్వుల మోముతోడ నరసింహరూపుతోడ
జవ్వని తొడమీద సరసమాడ
పువ్వుల దండలు ఇరుబుజాలపై వేసుకొని
ఉవ్విళ్ళూర కొలువై వున్నాడు దేవుడు
సంకు చక్రములతోడ జమళికోరల తోడ
అంకెల కటి అభయహస్తాలెత్తి
కంకణాల హారాలతో ఘనకిరీటము వెట్టి
పొంకమైన ప్రతాపాన పొదలీని దేవుడు
నానా దేవతలతోడ నారదాదుల తోడ
గానములు వినుకొంటా గద్దెపై నుండి
ఆనుక శ్రీవేంకటాద్రి నహోబలము నందు
తానకమై వరాలిచ్చి దాసులకు దేవుడు
ఆదిమూలమే మాకు నంగరక్ష
శ్రీదేవుడే మాకు జీవరక్ష
భూమిదేవిపతియైన పురుషోత్తముడే మాకు
భూమిపై నేడనుండినా భూమిరక్ష
ఆమనిజలధిశాయి అయిన దేవుడే మాకు
సామీప్యముందున్న జలరక్ష
మ్రోయుచు నగ్నిలో యజ్ఞమూర్తియైన దేవుడే
ఆయములు దాకకుండా నగ్నిరక్ష
వాయుసుతు నేలినట్టి వనజనాభుడే మాకు
వాయువందు కందకుండా వాయురక్ష
పాదమాకసమునకు పారజాచే విష్ణువే
గాదిలియై మాకు నాకాశరక్ష
సాధించి శ్రీవేంకటాద్రి సర్వేస్వరుడే మాకు
సాదరము మీరినట్టి సర్వరక్ష
ఆదివిష్ణు వీతడే యటరమ్మ
ఆదిగొని భూభార మణచీనోయమ్మా
చందురునుదయవేళా సవరేతిరికాడ
కందువ దేవకి బిడ్డగనెనమ్మా
పొందుగ బ్రహ్మాదులు పురుటింటివాకిటను
చెంది బాలుని నుతులు సేసేరోయమ్మా
వసుదేవుని యెదుట వైకుంఠనాథుడు
సిసువై యవతరించీ చెలగీ నమ్మా
ముసిముసినవ్వులతో మునులకు ఋషులకు
యిసుమంతవాడభయమిచ్చీనమ్మా
కన్నతల్లిదండ్రులకు కర్మపాశము లూడిచి
అన్నిటా రాకాసిమూక లణచీనమ్మా
వున్నతి శ్రీవేంకటాద్రినుండి లక్ష్మీదేవితోడ
పన్ని నిచ్చకల్యాణాల(బరగీనమ్మా
ఆన పెట్టుదువు నీవప్పటి నానోరణఁచి వోరి
నీ నిజానకు నాతో నేఁడైన మానరా // పల్లవి //
పచ్చడాల జవ్వాది పరిమళమేడదిరా
పచ్చి సేతలు చెక్కిళ్ళపై నీకేడవిరా
గచ్చు మోవిమీఁదనున్న కసిగాటులేడవిరా
యిచ్చకుఁడ కనుఁగెంపులేడవి గలిగెరా // ఆన //
ముద్దుల చక్కని నీదు మోముకళలేడవిరా
కొద్దిగాని సందొత్తుగోరేడదిరా
గద్దరీఁడ యీ చిట్లు గందము నీకేడదిరా
తిద్దెను గస్తూరిబొట్టు దిమ్మరి యెవ్వతెరా // ఆన //
భీతిలో నీవాడేటి తబ్బిబ్బుమాటలేడవిరా
రాతిరేడ నుండితి వెరవక చెప్పరా
యేతరీఁడ తిరువేంకటేశ నన్ను నేలితివి
యేతులతో వలపించ నెంత కలికివిరా // ఆన //
ఆనంద నిలయ ప్రహ్లాద వరదా
భాను శశి నేత్ర జయ ప్రహ్లాద వరదా
పరమ పురుష నిత్య ప్రహ్లాద వరదా
హరి అచ్యుతానంద ప్రహ్లాద వరదా
పరిపూర్ణ గోవింద ప్రహ్లాద వరదా
భరిత కల్యాణగుణ ప్రహ్లాద వరదా
భవరోగ సంహరణ ప్రహ్లాద వరదా
అవిరళ కేశవ ప్రహ్లాద వరదా
పవమాన నుత కీర్తి ప్రహ్లాద వరదా
భవ పితామహ వంద్య ప్రహ్లాద వరదా
బల యుక్త నరసింహ ప్రహ్లాద వరదా
లలిత శ్రీ వేంకటాద్రి ప్రహ్లాద వరదా
ఫలిత కరుణారస ప్రహ్లాద వరదా
బలి వంశ కారణ ప్రహ్లాద వరదా
ఆనతియ్యఁగదవే అందుకే కాచుకున్నాఁడను
పూనుక నీ వెంతనేర్పరివైనా భువి మనసు పేదను నేను // పల్లవి //
కొలిచేమనేబంట్లు నీకుఁ గోటానఁగోట్లు గలరు నిన్నుఁ
దెలిసేమనేజ్ఞానులు తెందేప లున్నారు
తలఁచే వరములడిగేవారలు తలవెంట్రుకలందరు వారె
యిల సందడిలో నాకొలువు యెటువలె నెక్కీనో // ఆనతి //
పనులకుఁ బాల్పడినవారు బ్రహ్మాదిదేవతలట
వినుతులు సేయఁ దొడంగినవె వేదరాసులట
మునుకొని ధ్యానించువారు మునులెందరైనాఁ గలరు
వినయపునామవిసనవులకు వేళ లెపుడు గలిగీనో // ఆనతి //
వున్నతితోడుత నిన్ను మోఁచుటకు వున్నారు గరుఁడఁడు శేషుఁడు నీకు
అన్నిటాను నీకౌఁగిటిలోపల వలరీ నలమేల్మంగ
యెన్నఁగ శ్రీవేంకటేశా నన్నును యేలితి వింతటిలో
పన్నిననామొక్కులు నీ కేబాగులఁ జేరీనో // ఆనతి //
ఆపదల సంపదల నలయుటేమిట మాను
రూపింప నిన్నిటను రోసినను గాక
కడలేని దేహ రోగంబులేమిట మాను
జడను విడిపించు నౌషధ సేవగాక
విడవ కడియాస తను వేచుటేమిట మాను
వొడలి కలగుణమెల్ల నుడిగినను గాక
దురిత సంగ్రహమైన దుఃఖమేమిట మాను
సరిలేని సౌఖ్యంబు చవికొన్న గాక
కరుకైన మోహాంధకార మేమిటి మాను
అరిది తేజోమార్గ మలవడిన గాక
చావులో బెనగొన్న జన్మ మేమిటి మాను
యీవలావలి కర్మమెడసిన గాక
భావింప నరుదైన బంధమేమిటి మాను
శ్రీ వేంకటేశ్వరుని సేవచే గాక
ఆపద్బంధుడు హరి మాకు గలడు
దూపిలి తలచినా దోషహరము
గరుడనినెక్కినఘనరేవంతుడు
గరుడకేతనముగలరథుడు
గరుడడే తనకును గరియగుబాణము
గరిమె నీతడేపో ఘనగారుడము
పాముపరపై బండినసిద్ధుడు
పాముపాశములపరిహరము
పామున నమృతముపడదచ్చినతడు
వేమరు నీతడే విషహరము
కమలాక్షు డీతడు కమలనాథుడును
కమలాదేవికి గైవశము
అమరిన శ్రీవేంకటాధిపు డితడే
మమతల మా కిదే మంత్రౌషధము
ఆపన్నుల పాలి దైవమాతడే గతి తక్క
ఏ ప్రొద్దును భజియించక నితరుడు మరి కలడా
నిరుపాధిక నిజ బంధుడు నిరతిశయానందుడు
కరి వరదుడితడే కాక ఘనుడధికుడు కలడా
సంతత గుణ సంపన్నుడు సాధులకు బ్రసన్నుడు
అంతర్యామితడే కాక అధికుడు మరి కలడా
పరమాత్ముడు పరమ పురుషుడు పరికింపగ గృపాలుడు
తిరువేంకట విభుడే కాక దేవుడు మరి కలడా
ఆమీదినిజసుఖ మరయలేము
పామరపుచాయలకే భ్రమసితిమయ్యా
మనసున బాలు దాగి మదియించివున్నయట్టు
ననిచి గిలిగింతకు నవ్వినయట్టు
యెనసి సంసారసుఖ మిది నిజముసేసుక
తవివొంది యిందులోనే తడబడేమయ్యా
బొమ్మలాట నిజమంటా బూచి చూచి మెచ్చినట్టు
తెమ్మగా శివమాడి తా దేవరైనట్టు
కిమ్ముల యీజన్మమందు కిందుమీదు నేఱక
పమ్మి భోగములనేతెప్పల దేలేమయ్యా
బాలులు యిసుకగుళ్ళు పస గట్టు కాడినట్టు
వీలి వెఱ్ఱివాడు గంతువేసినయట్టు
మేలిమి శ్రీవేంకటేశ మిమ్ము గొలువక నేము
కాల మూరకే యిన్నాళ్ళు గడిపితిమయ్యా
ఆముస్వతంత్రులు గారు ‘దాసోహము’ నన లేరు
పామరపుదేహులకు పట్టరాదు గర్వము
పరగుబ్రహ్మాదులు బ్రహ్మమే తా మనలేరు
హరికే మొరవెట్టేరు ఆపదైతేను
ధరలో మనుజులింతే తామే దయివమనేరు
పొరి దాము చచ్చిపుట్టే పొద్దెరగరు
పండినవ్యాసాదులు ప్రపంచము కల్లనరు
కొండలుగా బురాణాల గొనియాడేరు
అండనే తిరిపెములై అందరినడిగి తా_
ముందుండి లేదనుకొనే రొప్పదన్నా మానరు
సనకాదియోగులు శౌరిభక్తి సేసేరు దు_
ర్జనులు భక్తి వొల్లరు జ్ఞానులమంటా
నినుపయి శ్రీవేంకటేశ నిను జేరి మొక్కుతానె
అనిశము నిరాకారమనేరు యీద్రోహులు
ఆరగించి కూచున్నా డల్లవాడె
చేరువనే చూడరె లక్ష్మీనారసింహుడు॥
ఇందిరను తొడమీద నిడుకొని కొలువిచ్చీ
అందపు నవ్వులు చల్లీ నల్లవాడె
చెందిన మాణికముల శేషుని పడగమీద
చెంది వరాలిచ్చీ లక్ష్మీనారసింహుడు॥
బంగారు మేడలోన పచ్చల గద్దియల మీద
అంగనల ఆట చూచీ నల్లవాడె
రంగగు సొమ్ముల తోడ రాజసపు విభవాల
చెంగట నున్నాడు లక్ష్మీనారసింగుడు॥
పెండెపు పాదము చాచిపెనచి ఒక పాదము
అండనే పూజలుగొనీ నల్లవాడె
కొండల శ్రీ వేంకటాద్రి కోరి అహోబలమున
మెండుగాను మెరసీ లక్ష్మీ నారసింగుడు॥
ఆరగింపవో మాయప్ప యివే
పేరిన నేతులు పెరుగులును // పల్లవి //
తేనెలు జున్నులు తెంకాయ పాలును
ఆనవాలు వెన్నట్లును
నూనె బూరెలును నురుగులు వడలును
పానకములు బహుఫలములును // ఆరగింపవో //
పరమాన్నంబులు పంచదారలును
అరిసెలు గారెలు నవుగులును
కరజికాయలును ఖండమండెఁగలు
పరిపరివిధముల భక్ష్యములు // ఆరగింపవో //
కడుమధురంబగు కమ్మఁబూరణపుఁ
గుడుములు నిడ్డెన కుడుములను
సుడిగొనునప్పలు సుకినప్పాలును
పొడి బెల్లముతోఁ బొరఁటుచును // ఆరగింపవో //
కాయపు రుచులకు గనియగు మిరియపుఁ
గాయలు నేలకి కాయలును
పాయరానియంబాళపుఁగాయలు
నాయతమగు దధ్యన్నములు // ఆరగింపవో //
ఒడికపుఁగూరలు నొలుపుఁ బప్పులును
అడియాలపు రాజాన్నములు
బడిబడిఁ గనకపుఁ బళ్ళెరములతోఁ
గడువేడుక వేంకటరమణా // ఆరగింపవో //
ఆర్తుఁడ నేను నీకడ్డ మెందును లేదు
మూర్తిత్రయాత్మక మొగిఁ గరుణించవే // పల్లవి //
సర్వసాక్షివి నీవు సర్వాంతరంగుఁడవు
సర్వసర్వంసహాచక్రవర్తి
నిర్వాణమూర్తి నిగమాంతకీర్తి
సర్వాపరాధములు క్షమియింపవే // ఆర్తు //
పరమాత్ముఁడవు నీవు పరంజ్యోతివి నీవు
పరమ పరానంద పరమపురుషా
కరిరాజవరదా కారుణ్యనిలయా
శరణాగతుఁడ నన్ను సరిఁ గావవే // ఆర్తు //
అణువులోపలినీవు ఆదిమహత్తును నీవు
ప్రణుతశ్రీవేంకటప్రచురనిలయా
అణిమాదివిభవా ఆద్యంతరహితా
గణుతించి నాపాలఁ గలుగవే నీవు // ఆర్తు
ఆఱడిఁబెట్టఁగనేల అతని నింతేసి నీవు
మీఱక బంగారుపీఁటమీఁదఁ గూచుండవే // పల్లవి //
కొంగువట్టి తియ్యనేలే కొసర నేమిటికే
సంగతెఱిఁగిననెరజాణవిభుని
ముంగిట నున్నాఁ డతఁడు మొక్కితే నెఱుకగాదా
రంగుగాఁ దానే వచ్చీ రావే లోపలికి // ఆఱడి //
విన్నపము సేయనేలే వేఁడుకొన నింత యేలే
సన్న దెలిసినయట్టిసరసునికి
కన్నాఁడు నీగుట్టు వేళగాచుటే తగులుగాదా
పన్ని నిన్ను నేలీఁగాని పఱవవే పానుపు // ఆఱడి //
చనవునఁ దిట్టనేలే చవులు చూపఁగనేలే
యెనసినశ్రీ వేంకటేశునెదుట
ననిచి వున్నాఁ డితఁడు నగుటే వుంకువగాదా
తనివి నొందించి యింకాఁ దడవవే కాఁగిట // ఆఱడి //
ఆలాగు పొందులును అటువంటికూటములు
ఈలాగులౌట నేడిదె చూడనైతి
అడియాస చూపులకు నాసగించితిగాని
వెడమాయలని లోను వెదకలేనైతి
కడువేడుకల దగిలి గాసి పొందితిగాని
యెడలేని పరితాప మేరుగలేనైతి
చిరునగవుమాటలకు చిత్తగించితిగాని
తరితీపులని లోను తలపలేనైతి
వరుస మోహపు బసలవలల చిక్కితిగాని
గరువంపు పొలయలుక గానలేనతి
శ్రీ వేంకటేశ్వరుని చింతజేసితిగాని
దేవోత్తమునిలాగు తెలియలేనైతి
ఈ వైభవముపై నిచ్చగించితి గాని
యీ వైభవానంద మిది పొందనైతి
ఆలాగు పొందులును అటువంటి కూటములు యీలాగు లౌటనేడిదె చూడనైతి
అడియాస చూపులకు నాసగించితిగాని వెడమాయలనిలోను వెదకలేనైతి కడువేడుకల దగిలి గాసిబొందితిగాని యెడలేని పరితాప మెఱగలేనైతి
చిరునగవుమాటలకు చిత్తగించితిగాని తరితీపులని లోను తలుపలేనైతి వరుసమోహపు బసలవలల చిక్కితిగాని గరువంపు పొలయలుక గానలేనైతి
శ్రీ వేంకటేశ్వరుని చింతజేసితిగాని దేవోత్తమునిలాగు తెలియలేనైతి యీ వైభవముపై నిచ్చగించితి గాని యీ వైభవానంద మిది పొందనైతి
ఆలించు పాలించు ఆదిమ పురుషా
జాలిదీర నీకే శరణుజొచ్చితిమి ॥
గతినీవె మతినీవె కర్తవుభర్తవు నీవె
పతివినీవె ఏ పట్టున మాకు
ఇతరము లెవ్వరున్నారెంచిచూడ నినుబోల
చతురుడా నిన్నునే శరణు జొచ్చితిమి॥
జననీ జనకులు శరణము నీవె
వునికి మనికి నీవె వుపమ నీవె
మనిసిచ్చె నీవె నన్ను మన్నించుకొంటేనె
చనవి మనవి నీకే శరణుజొచ్చితిమి॥
లోక సాక్షివి నీవె లోకబంధుడు నీవె
ఈకడ శ్రీవేంకటేశ యిదివో నీవె
నీ కంటె మరిలేరు నిఖిలమంతయు గావ
సాకారరూప నీకె శరణు జొచ్చితిమి॥
ఆలికి మగనికి నాఱడేటికి
కాలిమితోడ లోలో తనివందరాదా
దొంతిబెట్ట వలపులు తోరపుబూజగుండలా
పంతాలు సంగడి బార బండికండ్లా
యింతేసి మీ రిద్దరును యేటికి బెచ్చు రేగేరు
యెంతకెంత సేసేరు యెనసివుండరాదా
మమతలు పేరబెట్ట మందలపాలా యేమి
తమకము తలదూచ తాసు చిప్పలా
జమళి నిద్దరూనెంత సరులకు బెనగేరు
తిముర నేటికి మీలో దిండుపడరాదా
సరిబేసి మాటలాడ జంట జాజాలా యివి
సిరులతో బెనగగ జెట్టిసాదనా
గరిమె శ్రీ వేంకటేశ కాంతా నీవు గూడితిరి
గరువాలేటికి నింకా గలయగ రాదా
ఆశాబద్ధుడనై యలసి నిన్ను గడు
గాసి బేట్టినవాడ గాను
ఘనకర్మపరుడనై కర్మరూపుని జేయ
నిను దూరి భారము నీకు గట్టినవాడ గాను
పనిలేని దుఃఖలంపటుడనై దుఃఖము
గనుపించకుమని కడు వేడినవాడ గాను
శ్రీవేంకటగిరిదేవేశ నాకిది
గావలెననువాడ గాను
కావలసినయవి గదిసిన నవి నాకు
గావనుమనుజుండ గాను
ఆసమీద విసుపౌదాక యీ
గాసిబరచుతన కపటమే సుఖము
తిరమగుగర్మము దెగుదాక తన
గరిమసుఖము పొగడునందాక
పరమార్గం బగపడుదాక తన
పరితాపపులంపటమే సుఖము
కాయము గడపల గనుదాక యీ
మాయ దన్ను వెడమరచుదాక
రాయడిమదము గరగుదాక యీ
రోయదగిన తనరూపమే సుఖము
అంకెలబొరలి నలగుదాక యీ
యంకెలభవము లెరవౌదాక
వేంకటపతి దడవినదాక యీ
కింకుర్వాణపు గెలుపే సుఖము
ఆహా నమో నమో ఆదిపురుష నీకు
ఈహల నెంతవాడను ఎట్టుగాచితివి
లోకాలోకములు లోన నించుకొన్న నీవు
ఈకడ నా యాత్మలోన నెట్టణగితివి
ఆకడ వేదములకు నగోచరమైన నీవు
వాక్కుచే నీ నామముల వడి నెట్టణగితివి
అన్నిటా బ్రహ్మాదుల యజ़్జ భోక్తవైన నీవు
అన్న పానాదు లివి యెట్టారగించితివి
సన్నుతి పూర్ణుడవై జనియించిన నీవు
వున్నతి నా పుట్టుగలో వొకచో నెట్టుంటివి
దేవతలచే పూజ తివిరి గొనిన నీవు
ఈవల నాచే పూజ ఎట్టుగొంటివి
శ్రీ వేంకటాద్రి మీద సిరితో గూడిన నీవు
ఈ వీధి మా యింట ఇపుడెట్టు నిలిచితివి ||
ఇ
ఇంకనేల వెరపు యెదుటనే వున్నారము
వంకలొత్తకిక మరి వద్దువద్దు యిపుడు ||
వాపులు నీకెంచనేల వాడల గొల్లెతలకు
దేవరవు గావా తెలిసినదే
యీవలమావంక నిట్టె యేమి చూచేవు తప్పక
మోవ నాడితిమిదివో మొదలనే నేము ||
చందాలు చెప్పగనేల సతి నెత్తుక వచ్చితి
విందుకు రాజవు గావా యెరిగినదే
దిందుపడి మమ్మునేల తిట్టేవు పెదవులను
నిందవేసితి మిదివో నిన్ననే నేము ||
వెలినవ్వేల పదారువేల పెండ్లాడితివి
బలిమికాడవు గావా భావించినదే
చెలగి పులివిందల శ్రీ రంగదేవుడవని
కలసితిమిదె శ్రీ వేంకటరాయ నేము ||
ఇంకానేల చలము యేమిసేయగలము
అంకెకు వచ్చెను అధరామ్రుత ఫలము ||
కలికి వనాలనీడగడు నీకెదురుచూడ
కులుకు నవ్వులతోడ గొప్పువీడ
చెలులెల్లా జూచేరు జిగి గొఊనిలసియాడ
బలిమి జేకొనవయ్య బత్తితోగూడ ||
సతి నీపాదాలు మెట్ట చన్నుల నీవు ముట్ట
తతి నిన్ను నిదె దిట్టతనాల దిట్ట
అతివలు సొలసేరు అంగాల జెమటదొట్ట
సతతము మెచ్చవయ్యా జాణలు చేపట్ట ||
జలజాక్శి నీపక్క సరసముల వేచొక్క
తలపోసీ దనచక్కదనాలు నిక్క
లాలి శ్రీవేంకటేశ నీలలని నీకు మొక్క
కకాలమేలు మిక్కడరతికెక్క ||
ఇంత సేసెబో దైవ మింతలోననే అయ్యొ
సంతపాకలంజ దెచ్చి సన్యాసి జేసె ||
పరిగెలేరేటివాని బట్టపురాజుగా
బిరతభోగములిచ్చి నిలిపినట్లు
ధరలోన నతిపాతకుని నన్ను నిట్లు
అరయ నిత్తడి దెచ్చి యపరంజి జేసె ||
కుక్కలవండుకతినే కులహీనుని దెచ్చి
వెక్కసపుబాపని గావించినయట్లు
దిక్కులెఋఅగగ గష్టదేహిని నన్ను దెచ్చి
గక్కన దెలుకపిండి కస్తూరి సేసె ||
చెడుగైనదోమ దెచ్చి సింహపుగొదమగా
బెడిదంపు బ్రేమతోడ బెంచినయట్లు
కడునధముని వేంకటపతి నను నిటు
చిడిపిరాయి దెచ్చి చింతామణి సేసె ||
ఇంతకంటే ఘనమిక లేదు
సంతత సౌఖ్యము జనార్దననుడే ||
భయ నివారణము పరమాత్ముని స్తుతి
జయ కారణ మీశ్వర చింత
అయుత పుణ్యఫల మచ్యుతుని సేవ
క్రియతో నిజమెరిగిన వారికి ||
కర్మహరము శ్రీకాంతు దరిసనము
ధర్మరాసి మాధవు శరణు
అర్మిలి సంపద లనంతుని తగులు
నిర్మలముగ పూనిన దాసులకు ||
ఆగమోక్తమీ హరికైంకర్యము
భోగము విష్ణుని పూజ ఇది
యోగము శ్రీవేంకటోత్తముని కొలువు
బాగులు నేర్చిన ప్రపన్నులకు ||
ఇంతట: గావగదే ఇందిరానాయక నన్ను
పంతాన గాకాసురని బాలించినట్లు ||
దించని పంచభూతాల దేహము మోచితిగాన
నించిన యజ్గ్యానమున నిన్ను నెరగ
పంచేంద్రియములచే బట్టు వడ్డవాడ గాన
యెంచరాని సాపములే యిన్నియు జేసితిని ||
మిన్నువంటి జఠరాగ్ని మింగి వున్నవాడగాన
కన్నవెల్లా వేడివేడి కిశ్టపడితి
పన్నిన సంసారపుబ్రమ బడ్డవాడగాన
అన్నిటా దేవతలకు సరిగాపవైతి ||
ఆతుమలో నీ వుండే భాగ్యము గలవాడగాన
చైతన్యమున నీకు శరణంటిని
నీతితో శ్రీఎంకటేశ నీ పాలివాడగాన
బాతితో సర్వము నీ కొప్పనము సేసితిని ||
ఇంతయు నీమాయామయ మేగతి దెలియగవచ్చును
దొంతిబెట్టినకుండలు తొడరినజన్మములు ||
కలలోపలి సంభోగము ఘనమగు సంపదలిన్నియు
వలలోపలి విడిపరుపులు వన్నెల విభవములు
తలపున గలిగియు నిందునే తగులక పోదెవ్వరికిని
తెలిసిన దెలియదు యిదివో దేహరహస్యంబు ||
అద్దములోపలినీడలు అందరిదేహపు రూపులు
చద్దికివండిన వంటలు జంటగర్మములు
పొద్దొకవిధమయి తోచును భువి నజ్ఞానాంబుధిలో
నద్దినదిది దెలియగరా దంబుదముల మెఱిగు ||
మనసున దాగినపాలివి మదిగలకోరిక లిన్నియు
యిసుమున నిగిరిన నీళ్ళు యిల నాహారములు
పనివడి శ్రీ వేంకటగిరిపతి నీ దాసులివిన్నియు
కని మని విడిచిన మనుజుల కాయపుమర్మములు ||
ఇంతులాల చూడరమ్మ ఇద్దరు జాణలే వీరు
చెంత రమాదేవిగూడె శ్రీ నరసింహుడు ||
సరిగొండ లెక్కుకొని సరసములాడుకొంటూ
సొరిదిమోములు తొంగి చూచుకొంటాను
విరులచెండులగొని వేటులాడుకొంటాను
సిరితోడ విహరించీ శ్రీ నరసింహుడు ||
భవనాశిలోని నీరుపై జల్లులాడుకొంటాను
నవకపు సిరులను నవ్వుకొంటాను
జవళిగెమ్మోవులు సన్నలజూపుకొంటాను
చివన నిందరినంటె శ్రీ నరసింహుడు ||
వేమరు దొడలెక్కుక వీడుదోడులాడుకొంటా
ప్రేమమున గౌగిళ్ళ బెనగుకొంటా
ఆముక శ్రీ వేంకటాద్రి నౌభళాన నిలిచిరి
శ్రీ మహాలక్ష్మితోడ శ్రీ నరసింహుడు ||
ప|| ఇంతులాల చూడరమ్మ ఇద్దరు జాణలే వీరు | చెంత రమాదేవిగూడె శ్రీ నరసింహుడు ||
చ|| సరిగొండ లెక్కుకొని సరసములాడుకొంటూ | సొరిదిమోములు తొంగి చూచుకొంటాను | విరులచెండులగొని వేటులాడుకొంటాను | సిరితోడ విహరించీ శ్రీ నరసింహుడు ||
చ|| భవనాశిలోని నీరుపై జల్లులాడుకొంటాను | నవకపు సిరులను నవ్వుకొంటాను | జవళిగెమ్మోవులు సన్నలజూపుకొంటాను | చివన నిందరినంటె శ్రీ నరసింహుడు ||
చ|| వేమరు దొడలెక్కుక వీడుదోడులాడుకొంటా | ప్రేమమున గౌగిళ్ళ బెనగుకొంటా | ఆముక శ్రీ వేంకటాద్రి నౌభళాన నిలిచిరి | శ్రీ మహాలక్ష్మితోడ శ్రీ నరసింహుడు ||
ఇంతే మరేమిలేదు యిందుమీదను
దొంతులకర్మాలు దుమ్ముదూరుపెత్తుట ||
వుల్లములో నుండి దేహమొగి రక్షించేహారి
నొల్లకున్న తన్ను దానొల్లకుండుట
బల్లిదు డతని మానిపరుల వేడేదెల్లా
పొల్లకట్టు దంచిదంచి పోగుసేసుకొనుట ||
యెయ్యెడా బుణ్యఫలము లేమి గలిగిన హరి
కియ్యకున్న నది దైవమియ్యకుండుట
చెయ్యార నాతని కొప్పుసేయని భోగములెల్లా
చయ్యన జెరకుబిప్పి చవిగొనుట ||
శ్రీకాంతుడైనట్టి శ్రీవేంకటేశ్వరుని
జేకొంటె సిరులెల్లా జేకొనుట
మేకులశ్రీహరినామమే నోరనుడుగుట
కైకొన్న యమృతపుగందు వగుట ||
ఇంతేపో వారివారిహీనాధికములెల్ల
పంతాన తా మేపాతిభాగ్యము నాపాటే।
అందరిలో దేవుడుండు అందధికులు గొందరు
కొందరు హీనులై కుందుదు రింతే
చెంది వీచేగాలొకటే చేనిపంటా నొకటే
పొంది గట్టికొలుచుండి పొల్లు కడబడును।
పుట్టుగందరి కొకటే భూమిలో యేలికలును
వెట్టిబంట్లు గొందరై వీగుదు రింతే
చుట్టి వరి గురుమతో జొన్న గింజ సరిదూగు
తెట్టెలై మేలొకటికి తీలొకటికాయ
కోరి శ్రీవేంకటపతికుక్షిలోనే లోకములు
ఆరయ గిందెడు మీదెడై వున్నవింతే
యీరీతి నితనిదాసు లెక్కిరి పొడవులకు
తారి కిందికి దిగిరి దానవులై కొందరు
ఇంతేసి మతకాలు నే నెఱగనివా
పొంత నుండి నవ్వేవు పొద్దు వోదానీకు ||
తారుకాణాలంతే నేల తగవు నడపరాదా
గారావు నీ వెఱుగని కల్ల వున్నదా
కూరిమి సతులమూక కూరిచి తలవంచేవు
పోరులేల పెట్టేవు పొద్దు వోదా నీకు ||
వొడ బరచగనేల వూరకే వుండగరాదా
తడివితిమా నీవింతయు నేరవా
కడగడ లటుదొక్కి కమ్మినన్ను వేడుకొంటా
బుడికేవు నన్ను నీవు పొద్దు వోదా నీకు ||
నివ్వెరగంద నేల నిచ్చలాన నుండరాదా
జవ్వనపు నాచేత నీసలిగె కాదా
యివ్వల శ్రీ వేంకటేశ యిట్టె నిన్ను గూడితిని
పువ్వులనేల వేసేవు పొద్దు వోదా నీకు ||
ఇంతేసి సేవలు సేయ నెందాకా నోపు చెలి
కాంతుడవు మెచ్చి మెచ్చి కౌగలించవయ్యా ||
పయ్యదకొంగు జారగ పాలిండ్లు గదలగ
చయ్యన గుంచె వేసీని సతి నీకు
చెయ్యెల్ల బడలంగ జెక్కులు చెమరించగ
వొయ్యనే పాదా లొత్తీ నుల్లసాన నీకు ||
గరిమ దురుము వీడ గస్తూరి బేంట్లు రాల
పరగగ గాళాంజి పట్టీ నీకు
సరులు చిక్కువడగ సందడి నూర్పులు రేగ
సిరుల గందము పూసీ జెలరేగి నీకు ||
తనువు పులకించగ తమకములు ముంచగ
యెనచి యాకు మడచి యిచ్చీ నీకు
అనుగు శ్రీవేంకటేశ అలమేలుమంగ యీకె
చనవున గెమ్మోవి చవిచూసీ నీకు ||
ఇందరికీ అభయంబులిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి !!
వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి
చిలుకు గుబ్బలి క్రింద చేర్చు చేయి
కలికి యగు భూకాంత కౌగలించిన చేయి
వలనైన కొనగోళ్ళ వాడి చేయి !!
తనివోక బలి చేత దానమడిగిన చేయి
ఒనరంగ భూదాన మొసగు చేయి
మొనసి జలనిధి యమ్ముమొనకు దెచ్చిన చేయి
ఎనయ నాగేలు ధరియించు చేయి !!
పురసతుల మానములు పొల్లసేసిన చేయి
తురగంబు బరపెడి దొడ్డ చేయి
తిరువేంకటాచలా ధీశుడై మోక్షంబు
తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి !!
ఇందరివలె జూడకు యింకా నన్ను
మందలించి యెటువలె మన్నించినా మంచిదే
తత్తరించి నీ మీద తప్పులు మోపగ నోప
కొత్త కొత్త మాటలను కొసర నోప
బత్తి గల దాన నీతో బంతము లాడగ నోప
చిత్తగించి యేమి దయసేసి నాను మంచిదే
చేయి చాచి కొనగోర బెనకగ నే నోప
చాయల సన్నల నిన్ను జరయనోప
నీ యాధీనపు దానను నిన్ను వెంగెమాడ నోప
రాయడించ కెటువలె రక్షించినా మంచిదే
అట్టే కౌగిట గూడితి వలయించ నే నోప
వట్టి సట లాడి నీతో వాదించ నోప
ఇట్టే శ్రీ వేంకటేశ యెనసితి విటు నన్ను
పట్టముగట్టి నన్నెంత పాలార్చినా మంచిదే
ఇందాకా నెఱగనైతి నిక గపటములేల
చెంది యిట్టె నాతోడ జెప్పవయ్య మాటలు
మంతనానకు రాగాను మనసెల్లా నొక్కటాయ
పంతము నీ వియ్యగాను పాసెగోపము
అంతరంగము చెప్పగా ననుమానమింక నెంచ
రంతులు సేయక యిట్టె రావయ్య యింటికి
సరసము నీవాడగా చల్లనాయనా మేను
సరుస గూచుండగాను సమ్మతించితివి
యెరవులేక నవ్వగా నిరవాయ గూరిములు
బిరిదులెల్లా గంటి బెట్టవయ్య విడెము
గక్కన నీవు గూడగా కాతాళము లణగె
మిక్కిలి మన్నించగాను మెచ్చితి నేను
అక్కున శ్రీ వేంకటేశ అలమేలు మంగను నేను
వొక్కటై కూడితి విట్టె వుండవయ్య వొద్దను
ఇందిర వడ్డించ నింపుగను
చిందక యిట్లే భుజించవో స్వామి
అక్కాళపాళాలు నప్పాలు వడలు
పెక్కైనసయిదంపు పేణులును
సక్కెరరాసులు సద్యోఘృతములు
కిక్కిరియ నారగించవో స్వామి
మీరినకెళంగు మిరియపు దాళింపు
గూరలు కమ్మనికూరలును
సారంపుబచ్చళ్ళు చవులుగ నిట్టే
కూరిమితో జేకొనవో స్వామీ
పిండివంటలును బెరుగులు బాలు
మెండైన పాశాలు మెచ్చి మెచ్చి
కొండలపొడవు కోరి దివ్యాన్నాలు
వెండియు మెచ్చవే వేంకటస్వామీ
ఇందిరారమణు దెచ్చి యియ్యరో మా కిటువలె
పొంది యీతని పూజింప పొద్దాయనిపుడు !!
ధారుణి మైరావణు దండించి రాముదెచ్చి
నేరుపున మించిన అంజనీతనయా
ఘోర(తూల)నాగపాశముల కొట్టివేసి యీతని
కారుణ్యమందినట్టి ఖగరాజ గరుడా !!
నానాదేవతలకు నరసింహు కంభములో
పానిపట్టి చూపినట్టి ప్రహ్లాదుడా
మానవుడౌ కృష్ణ మహిమల విశ్వరూపు
పూని బండి నుంచుకొన్న పోటుబంట అర్జునా !!
శ్రీ వల్లభునకు అశేష కైంకర్యముల
శ్రీ వేంకటాద్రివైన శేషమూరితీ
కైవసమైనయట్టి కార్తవీర్యార్జునుడా
దేవుని నీవేళనిట్టె తెచ్చి మాకు నియ్యరే !!
ఇందిరాధిపునిసేవ యేమరకుండుటగాక
బొందితోడిజీవులకు బుద్ధు లేటిబుద్ధులు
రేయెల్లా మింగిమింగి రేపే వెళ్ళనిమియు
బాయట నిద్రాదేవి పలుమారును
చాయలకు నిచ్చానిచ్చా జచ్చిచచ్చి పొడమేటి
మాయజీవులకునెల్లా మని కేటిమనికి
కనురెప్ప మూసితేనే కడు సిష్టే చీకటౌను
కనురెప్ప దెరచితే క్రమ్మర బుట్టు
ఘనమై నిమిషమందే కలిమి లేమియు దోచె
యెనయుజీవుల కింక యెఱు కేటియెఱుక
వొప్పగుబ్రాణము లవి వూరుగాలివెంట
యెప్పుడు లోనివెలికి నెడతాకును
అప్పుడు శ్రీవేంకటేశు డంతరాత్ము డందరికి
తప్పక యాతడే కాచు తల పేటితలపు
ఇందిరానాథు డిన్నిటి కీత డింతే
బందెలకర్మములాల పట్టకురో మమ్మును ||
యెఱిగిసేసినవెల్లా నీతనిమహిమలే
యెఱుగక చేసినది యీతనిమాయే
తెఱగొప్ప రెంటికిని తెడ్డువంటివాడ నింతే
పఱచుగర్మములాల పట్టకురో మమ్మును ||
కాయములోపలివాడు ఘను డొక్కడితడే
కాయ మీతనిప్రకృతికల్పిత మింతే
తోయరాక రెంటికిని తోడునీడైతి నింతే
బాయటికర్మములాల పట్టకురో మమ్మును ||
యేలినవాడు శ్రీవేంకటేశు డిత డొక్కడింతే
యేలికసానై పెంచేది యీతనిసతే
పోలి నే వీరిగొలిచేసూత్రపు బొమ్మ నింతే
పాలుపుగర్మములాల పట్టకురో మమ్మును ||
ఇందిరానామ మిందరికి
కుందనపుముద్ద వోగోవింద ||
అచ్చుతనామము అనంతనామము
ఇచ్చినసంపద లిందరికి
నచ్చినసిరులు నాలుకతుదలు
కొచ్చికొచ్చీ నోగోవింద ||
వైకుంఠనామము వరదనామము
ఈకడనాకడ నిందరికి
నాకుదెరవులు వన్నెలు లోకాల
గూకులు వత్తులు నోగోవింద ||
పండరినామము పరమనామము
ఎండలునాపెడి దిందరికి
నిండునిధానమై నిలిచినపేరు
కొండల కోనేటివో గోవింద ||
ఇందిరానాయక యిదివో మాపాటు
చెంది నీవే గతి చేకొనవయ్యా ||
తీసీ గోరికతీదీపు లొకవంక
లాసీ సంసారలంపటము
మూసీ గర్మము మునుకొని పరచింత
సేసేదేమిక జెప్పేదేమి ||
వంచీ నాసలు వలసినచోటికి
పొంచీ దుర్గుణభోగములు
ముంచీ యౌవన మోహాంధకారము
యెంచేదేమి సోదించేదేమి ||
ఎరిగీ జిత్తము యించుకించుక నిన్ను
మరవని నీపైభక్తి మతినుండగా
నెరి శ్రీవేంకటపతి నీవే కాతువుగాక
వెరచి నేజేసే విన్నపమేమి ||
ఇందిరాపతిమాయలు యింతులు సుండీ
మందలించి హరి గొల్చి మనుదురుగాని ||
అతివలచూపులే ఆయాలు దాకీ జుండీ
జితమైనపులకల జిల్లులౌజుండీ
రతిపరవశములు రాగినమూర్ఛలు సుండీ
మతిలో దప్పించుక మనుదురుగాని ||
మెఱయించేచన్నులే మించుబెట్లగుండ్లు సుండీ
మెరగుమోపులే మచ్చుమేపులు సుండీ
మఱి మంచిమాటలు మాయపుటురులు సుండీ
మఱవక తప్పించుక మనుదురుగాని ||
బలుసంసారపుపొందు పాముతోడిపొత్తు సుండీ
వెలలేని వలపులు విషము సుండీ
యెలమితో శ్రీవేంకటేశ్వరుమఱుగు చొచ్చి
మలయుచు సొలయుచు మనుదురుగాని ||
ఇందు నుండి మీకెడలేదు
సందడి సేయక చనరో మీరు ||
నాలుక శ్రీహరి నామంబున్నది
తూలుచు బారరొ దురితముల
చాలి భుజంబున చక్రంబున్న
తారిమి భవబంధములటు తొలగరో ||
అంతర్యామై హరి వున్నాడిదె
చింతలు వాయరొ చిత్తమున
వింతలు జెవులను విష్ణుకథలివిగొ
పొంత గర్మములు పోరో మీరు ||
కాపయి శ్రీ వేంకటపతి పేరిదె
నాపై నున్నది నయమునను
కోప(పు) కామాది గుణములాల మీ
రేపున కడగడ నెందైన బోరొ ||
ఇందుకంటే మరి యికలేదు హితోపదేశము వోమనసా
అంది సర్వసంపన్నుడు దేవుడు అతనికంటే నేరుతుమా
కల దొకటే ధర్మము కల్పాంతమునకు నిలిచినది
తలకక మీశరణుచొచ్చి మీదాసుడ ననెడి దొకమాట
వలవనిజోలే యింతాను వడి నిదిగాక యేమిసేసినను
సులభ మిందునే తొల్లిటివారలు చూరలు గొని రదేమోక్షంబు
మొదలొకటే యిన్నిటికి ముందర వెనకా వచ్చేది
వొదుగుచు గోవిందునిదాసులకు నొక్కమాటే మొక్కినజాలు
తుదకెక్కనివే యితరములు దొరకొని మరేమిసేసినను
బదికి లిరిందునే పరమవైష్ణవులు పలుచదువులలో వినరాదా
తగులొకటే విడువరానిది తతి నెన్నటికిని జెడనిది
వొగి శ్రీవేంకటపతినామజపము వొకమాటే అబ్బిన జాలు
నగుబాటే యింతాను నానాటి కేమేమిసేసినను
తగునీబుద్దుల నడచిరి మున్నిటిదైవజ్ఞులు పూర్వాచార్యులును
ఇందుకుగా నాయెరగమి నేమని దూరుదును
అందియు నినునే దెలియక అయ్యోనేనిపుడు ||
ఆతుమ లోన నుండి యఖిలోపాయములు
చేతనునకు నీవే చింతించగాను
కాతుర పడి నేను కర్తననుచు బనులు
యాతల జెప్పగబూనే విస్సిరో ||
తనువిటు నీవొసగి తగుభాగ్యము నీవై
అనువుగ జీవునినీ యటు నీవేలగను
తనియక నేనొరులు దాతలనుచుబోయి
కనుగొని వేడగ దొడగేకటకటా ||
శ్రీ వేంకటాద్రిపై నుండి చేరి కన్నులెదుటను
సేవగొని యిటేకృపసేయ గాను
సేవలగన్న వారెల్ల జుట్టములంట నేను
జీవులతోబొందు సేసేజెల్లబో ||
ఇందుకేకాబోలు నీవు యిట్టే యవధరించేవు
కందువ లన్నియు నీమై గనియైనట్లుండె ||
హరి నీవు కప్పురకా పవధరించేవేళ
విరివిగా నిందరు భావించి చూచితే
తరుణులనవ్వులెల్లా దట్టమై నీమేనిమీద
పెరిగిపెరిగి యట్టే పేరినయట్లుండె ||
భువనేశ నీవు తట్టుపుణుగు చాతుకొనగ
యివల నీదాసులెల్లా నెంచిచూచితే
కవగూడి నీసతులకనుచూపులెల్లాను
తివిరి నీమేనిమీద తిరమైనట్లుండె ||
శ్రీవేంకటేశ నీచెలి యలమేల్మంగతో
తావున మెరసేది నే దలిచితేను
కోవరపుగొల్లెతల గుబ్బలకుంకుమనిగ్గు
వేవేలయి నీయందచ్చు వేసినయట్లుండె ||
ఇందుకేనా విభుడు నీయింట నెలకొన్నాడు
కందువెఱుగుదువు యీకత నీవే నేర్తువే ||
నయమెంత గలిగినా ననుపులకే మేలు
ప్రియమెంత గలిగినా పెనపులకే మేలు
జయమెంత గలిగినా చనవులకే మేలు
క్రియలెఱుగుదువు యీకీలు నీవే నేర్తువే ||
మొగమెంత చూచినా మోహానకే మూలము
తగవెంత నెరపినా తగులుకే మూలము
నగవెంత గలిగినాను నమ్మికలకు మూలము
పగటెరుగుదువు యీపాడి నీవే నేర్తువే ||
వూడిగ మెంతసేసినా వొద్దికలకే దాపు
వేడుకెంత నిలిపినా విఱ్ఱవీగుటకే దాపు
కూడితివిన్ని చందాల కోరిక శ్రీ వేంకటేశు
జాడెఱుగుదువు సరసము సరసము నీవే నేర్తువు ||
ఇందుకేపో వెరగయ్యీ నేమందును
కందులేనినీమహిమ కొనియాడగలనా
అటు దేవతలకెల్ల నమృతమిచ్చిననీవు
యిటు వెన్న దొంగిలుట కేమందును
పటుగతి బలీంద్రుని బంధించినట్టినీవు
నట రోలగట్టువడ్డచందాన కేమందును
కలిగి యాకరిరాజు గరుణ గాచిననీవు
యిల నావుల గాచుట కేమందును
తలవ బ్రహ్మాదిదేవతలకు జిక్కనినీవు
చెలులకాగిళ్ళకు జిక్కితి వేమందును
భావించ నన్నిటికంటే బరమమూర్తివి నీవు
యీవల బాలుడవైతి వేమందును
కావించి బ్రహ్మాండాలు కడుపున నిడుకొని
శ్రీవేంకటాద్రి నిలిచితి వేమందును
ఇందుకొరకె యిందరును నిట్లయిరి
కిందుపడి మరికాని గెలుపెరగరాదు ||
అటమటపు వేడుకల నలయించి మరికదా
ఘటియించు బరము తటుకన దైవము
ఇటుసేయు నీశ్వరున కీసు గలదా లేదు
కుటిలమతి గని కాని గురి గానరాదు ||
బెండుపడ నవగతుల బెనగించి మరికదా
కొండనుచు బరమొసంగును దైవము
బండుసేయగ హరికి బంతమా యటుగాదు
యెండదాకక నీడహిత వెరగరాదు ||
మునుప వేల్పులకెల్ల మ్రొక్కించి మరికదా
తనభక్తి యొసగు నంతట దైవము
ఘనవేంకటేశునకు గపటమా అటుగాదు
తినక చేదును దీపు తెలియనేరాదు ||
ఇందునందు దిరుగుచు నెవ్వరివాడవుగాక
బందెపసరమువైతి బాపు జీవుడా ||
తోలుబొక్కలోన జొచ్చి తూలేటియాకలిచేత
పాలుమాలి యిందరికి బంటుబంటవై
యేలినవాని గానక యేచినయాసలవెంట
కూలికిబో దొరకుంటి కూళజీవుడా ||
తీటమేనిలోన జొచ్చి దిమ్మరిదొంగలచేత
మూటగట్టించుక నీవు మూలదొరవై
గాటపువిభునిచేతిఘనత కోరికలకు
వేటకుక్కవైతివి వెర్రిజీవుడా ||
చీమలింటిలోన జొచ్చి చిక్కువడి అందరిలో
దోమకరకుట్లకు తోడిదొంగవై
యేమరి వేంకటవిభు నెరుగక జాడుజొప్ప
నాము మేయ దొరకొంటి నాలిజీవుడా ||
ఇందునుండ మీకెడ లేదు
సందడిసేయక చనరో మీరు ||
నాలుక శ్రీహరినామంబున్నది
తూలుచు బారరో దురితములు
చాలి భుజంబున చక్రంబున్నది
తాలిమి భవబంధము లటుదలరో ||
అంతర్యామై హరి వున్నాడిదె
చింతలు వాయరొ చిత్తమున
వింతల జెవులను విష్ణుకథ లివిగొ
పొంత గర్మములు పోరో మీరు ||
కాపయి శ్రీవేంకటపతి పేరిదె
నాపై నున్నది నయమునను
కోపపు కామాది గుణములాల మీ
రేపున కడగడ నెందైన బోరో ||
ఇందుమీద సతిభావ మెట్లౌనో యేమౌనో
విందుగా జెలువునికి విన్నవించరే ||
కోవిలకూతకుగానే గుండె జల్లురని చెలి
పూవక పూచిన యట్టు పులకించె
మావినుండి యంతలోనే మదన భూతముసోకె
పోవులైన పుప్పొడినే పోయరే బడిమి ||
కోమలి చందురుడనే కొరవిదయ్యము జూచి
దీమన మింతయు మాని దిగులందెను
తేమలైన వెన్నెలల దిమ్మువట్టి నిలువున
మైమఅచె గప్పురాన మంత్రించరే ||
ఇంతలో శ్రీవేంకటేశుడిందుకు విచ్చేయగాను
చింతదీర మేనెల్ల జెమరించెను
వింతలైన రతులలొ విరహపు సోకు వాసె
కంతు చిగురాకు రక్షగట్టరే యంగనకు ||
ఇందులో మొదలికర్త యెవ్వడు లేడుగాబొలు
ముందు కరివరదుడే ముఖ్యుడుగాబోలు
ఆడితిబో బహురూపా లన్ని యోనుల బుట్టి
తోడనె బ్రహ్మాదులనేదొరలెదుటా
జాడలు మెచ్చాలేరు చాలునన్న వారు లేరు
వేడుక నడవిగానేవెన్నెలాయ బ్రదుకు
అన్ని కర్మములు జేసి ఆటలో బ్రాహ్మణుడనైతి
నన్ని వేదములనేటియంగడివీధి
నన్ను జూచేవారు లేరు నవ్వేటివారు లేరు
వన్నెలసముద్రములో వానలాయ బ్రదుకు
సంసారపు నాటకసాలలో ప్రతిమనైతి
కంసారి శ్రీవేంకటపతిమాయలోన
యింసలెన్నియు దేరె నిందరు జుట్టములైరి
హంసచేతిపాలునీరునట్లాయ బ్రదుకు
ఇందులోనే కానవద్దా యితడు దైవమని
విందువలె నొంటిమెట్టవీరరఘరాముని ||
యెందు చొచ్చె బ్రహ్మవర మిల రావణుతలలు
కందువ రాఘవుడు ఖండించినాడు
ముందట జలధి యేమూల చొచ్చె గొండలచే
గొందిబడ గట్టివేసి కోపగించేనాడు ||
యేడనుండె మహిమలు యిందరి కితడు వచ్చి
వేడుకతో హరివిల్లు విఱిచేనాడు
వోడక యింద్రాదు లెందు నొదిగి రీతనిబంటు
కూడబట్టి సంజీవికొండ దెచ్చేనాడు ||
జము డెక్కడికి బోయ సరయవులో మోక్ష
మమర జీవుల కిచ్చె నల్లనాడు
తెమలి వానరులై యీదేవతలే బంట్లైరి
తిమిరి శ్రీవేంకటపతికి నేడు నాడు ||
ఇచ్చలో గోరేవల్లా ఇచ్చేధనము
అచ్చుతనామమెపో అధికపుధనము
నారదాదులువొగడేనాలుకపయిధనము
సారపువేదములలో చాటేధనము
కూరిమిమునులు దాచుకొన్నట్టిధనము
నారాయణనామ మిదే నమ్మినట్టిధనము
పరమపదవికి సంబళమైనధనము
యిరవై భక్తులకెల్లా నింటిధనము
పరగ నంతరంగాన పాతినట్టిధనము
హరినామ మిదియపో అరచేతిధనము
పొంచి శివుడు కాశిలో బోధించేధనము
ముంచినాఅచార్యుల మూలధనము
పంచి శ్రీ వేంకటపతి పాలించేధనము
నించి విష్ణునామ మదే నిత్యమైనధనము।
ఇట మీద కడమెల్లా నిక నీవు దీర్చవయ్యా
పటుకున జెలి నీకు బాలుపెట్టీ నిదిగో ||
నెలత మంచముపై కిన్నెర వాయించి వాయించి
తలకొని నీవురాగా దలవంచెను
సొలసి చెలులతోడ సుద్దులు దాజెప్పి చెప్పి
చెలగి నీమోము చూచి సిగ్గువడీ నిదిగో ||
పడతి నీమీది పాట పాడిపాడి అర్థము నీ
వడిగితే నవ్వలి మోమై నవ్వీని
అడియాలముల రూపు అద్దములో జూచి చూచి
కడు నీవు కొంగు వట్టగా భ్రమసీని ||
సతి యేకతాన నుండి జవ్వాది పూసి పూసి
రతి నీవు గూడగా సరసమాడీని
ఇతవైన శ్రీ వేంకటేశ నీవాపె గూడగా
పతి చూచి యిప్పుడిట్టె పక్కున నవ్వీని ||
ఇటు గరుడని నీ వెక్కినను
పటపట దిక్కులు బగ్గన బగిలె ||
ఎగసినగరుడని యేపున ’థా’యని
జిగిదొలకచబుకు చేసినను
నిగమాంతంబులు నిగమసంఘములు
గగనము జగములు గడ గడ వడకె ||
బిరుసుగ గరుడని పేరెము దోలుచు
బెరసి నీవు కోపించినను
సరుస నిఖిలములు జర్జరితములై
తెరుపున నలుగడ దిరదిర దిరిగె ||
పల్లించిననీపసిడిగరుడనిని
కెల్లున నీ వెక్కినయపుడు
ఝల్లనె రాక్షససమితి నీమహిమ
వెల్లి మునుగుదురు వేంకటరమణా ||
ప|| ఇటుగన సకలోపాయము లుడిగిన యీశ్వరుడే రక్షకుడు |
తటుకున స్వతంత్రముడిగినయాత్మకు తగునిశ్చింతయే పరమసుఖము ||
చ|| ఆకటి కడుగనిశిశువుకు దల్లి యడిచిపాలు ద్రాగించినరీతి |
యీకడ గోరికలుడిగినయోగికి నీశ్వరుడే రక్షకుడు |
చేకొని బుద్దెరిగినబిడ్డలపై జింతింపరు తొల్లిటివలె దల్లులు |
యీకొలదులనే స్వయత్నదేహుల కీశ్వరుడును వాత్సల్యము వదలు ||
చ|| తతిగరిరాజు గాచినయట్లు ద్రౌపదిమానము గాచినయట్లు |
హితమతి స్వతంత్రముడిగినయోగికి యీశ్వరుడే రక్షకుడు |
అతడును భస్మంబయ్యిననాడు అజునిశిరంబటు ద్రుంచిననాడు |
చతురుడు దానడ్డమురాడాయను స్వతంత్రముడుగని జీవుడుగాన ||
చ|| దిక్కని యనిశము జిత్తములోన జింతించేటి శరణాగతజనులకు |
యిక్కడనక్కడ శ్రీవేంకటాగిరియీశ్వరుడే రక్షకుడు |
మక్కువతో దనయంతర్యామిని మరచినస్వామిద్రోహులకెల్లా |
అక్కరతో బుట్టుగులే భోగ్యం బహంకారము విడువరుగాన ||
ఇటువంటి దాన నాకేటి యలుకే
గట కట తేరాగా గాదనేనా నేను ||
మాటలాడ కుండు గాని, మనసు లోపల నైతే
నాటినది తనమీద నా చిత్తము
కాటుక కన్నుల జూచి కసరుదుగాని నేను
వాటపు వలపు మీద వంతుబో లోలోనే ||
దగ్గరి రాకుందుగాని, తా నన్ను నంటినప్పుడే
వెగ్గళించి సిగ్గులెల్లా వీడ గలవే
యెగ్గువట్టి వుందుగాని, యేపాటి నవ్వించినాను
అగ్గలపు సరసము లాడుదుబో నేను ||
నివ్వెర గందితిగాని, నేడు నన్ను గూడగాను
పవ్వళించి నప్పుడే పో పరవశము
యివ్వల శ్రీ వేంకటేశుడేకతమాయ నాతోను
జవ్వన భారము చేత జడిసీబో తనువు ||
ఇటువంటివాడు తాను యెదురాడేనా నేను
చిటుకన జెప్పినట్టు సేసేనే తనకు ||
వినయము సేసే చోట వెంగెములాడగ రాదు
చనవిచ్చిన చోటును జరయరాదు
మనసొక్కటైన చోట మంకులు చూపగరాదు
ననువులు గలిగితే నమ్మకుండరాదూ ||
ప్రియము చెప్పేయప్పుడు బిగిసె ననగరాదు
క్రియగల పొందులు తగ్గించగరాదు
నయమిచ్చి మాటాడగా నవ్వక మానరాదు
దయతో దగులగాను దాగగరాదు ||
పచ్చిదేర గూడగాను పంతములుడుగరాదు
కచ్చుపెట్టి చెనకగా గాదనరాదు
ఇచ్చట శ్రీ వేంకటేశుడింతలోనే నన్నుగూడె
మెచ్చి సరస మాడగా మితిమీఱరాదు ||
ఇటువలెపో సకలము యించుకగన భావించిన
అటమటములసంతోషము ఆసలుసేయుటలు ||
పగగొనితిరుగేటిజన్మపుబాధలు తన కేకాలము
తగుసుఖ మెక్కడ నున్నది తడతాకులేకాక
పొగలోపల సెకగాసిన భుగభుగ గన్నుల నీళ్ళు
నిగిడినదుఃఖమేకాకిలు నిజసౌఖ్యము గలదా ||
పొలసినమాయపురూపులు పొలతులమచ్చికమాటలు
తలచిన తనకేమున్నది తలపోతలేకాక
బలుపున బారగ మోహపుపాశము తనమేడ దగిలిన
తలకిందుగ బడుటెల్లను తనకిది ప్రియమౌనా ||
చేతిపదార్థము దలచక చేరువనుండినవారల
చేతిపదార్థము గోరిన చేతికి లోనౌనా
ఆతుమగలవేంకటపతి నాత్మ దలచి సుఖింపక
యేతరిసుఖముల దిరిగిన నింపులు దనకౌనా ||
ఇట్టి జ్ఞానమాత్రమున నెవ్వరైనా ముక్తులే
పుట్టుగులు మరిలేవు పొందుదురు మొక్షము
అతిసూక్ష్మమీయాత్మ అందులో హరియున్నాడు
కతలే వినుటగాని కానరాదు
క్షితిదేహాలు ప్రకృతిజెందిన వికారములు
మతినిది దెలియుటే మహిత జ్ఞానము ||
లోకము శ్రీపతియాజ్ఞలో తత్త్వాలిరువదినాల్గు
కైకొని సేతలు సేసీగర్తలు లేరు
సాకిరింతే జీవుడు స్వతంత్రుడు దేవుడు
యీకొలది గని సుఖియించుటే సుజ్ఞానము ||
కాలము దైవము సృష్టి కలిమన్యుల భాగ్యము
వాలాయించి యెవ్వరికి వచింపరాదు
ఈలీలలు శ్రీవేంకటేశునివి ఆచార్యుడు
తాలిమి జెప్పగా విని తలంచుటే సుజ్ఞానము ||
ఇట్టి నాస్తికులమాట యేమని సమ్మెడి దిక
పట్టి సములమంటానే భక్తుల దూషింతురు
వేదములు చదువుతా విశ్వమెలా గల్లనేరు
ఆదెస తాము పుట్టుండి అదియును మాయనేరు
పాదగువిష్ణుడుండగ బయలు తత్వమనేరు
లేదు జీవతత్వమంటా లేమల బొందుదురు
తిరమై తమ ఇండ్ల దేవపూజలు సేసేరు
ధరలోన తముదామే దైవమనేరు
ఆరయగర్మమె బ్రహ్మమని యాచరించేరు
సరి నదే కాదని సన్యసించేరు
అందుక పురుషసూక్తమర్థము జెప్పుదురు
కందువ నప్పటి నిరాకారమందురు
యిందులో శ్రీవేంకటేశ యిటె నీ దాసులుగాక
మందపురాక్షసులాడేమతము నడతురు
ఇట్టి ప్రతాపముగల యీతని దాసులనెల్ల
కట్టునా కర్మములెల్ల గాలి బోబుగాక
యెలమి జక్రాయుధున కెదురా దానవులు
తొలగ కెందుచొచ్చిన దుండించుగాక
ఇల గరుడధ్వజుపై నెక్కునా విషములు
కలగి నీరై పారి గాలిబోబుగాక
గోవర్దనధరునిపై కొలువునా మాయలు
వేవేలుదునుకలై విరుగుగాక
కేవలుడచ్యుతునొద్ద గీడు చూపగలవా
కావరమై తా దానె గాలి బోవుగాక
వీరనారసింహునకు వెరపులు గలవా
దూరాన గగ్గులకాడై తొలగుగాక
కోరి యీ శ్రీవేంకటేశు గొలిచితి మిదివో
కారుకొన్నపగలెల్ల గాలి బోవుగాక
ఇట్టి భాగ్యము గంటిమి యిద్దరూ బదుకుదురయా
పట్టము గట్టుకొంటివి పచ్చిదేరెనయ్యా ||
చెలియతోడే నీకు సింహాసనపుగద్దె
అలరుజూపులె రత్నాభిషేకాలు
చలువైన నవ్వులే ఛత్రచామరములు
కలిగె నీకింక నేమి గావలెనయ్యా ||
చనుగవలే నీకు సామ్రాజ్య దుర్గములు
నినుపు మోవితేనెలు నిచ్చబోనాలు
వొనరిన కౌగిలే వుండెడి నీనగరు
యెనయ నచ్చె నీ భాగ్యమీడెర నయ్యా ||
రతి చెనకులే నీకు రవణపు సొమ్ములు
సతతపుగూటమే సర్వసంపద
యితవై శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
సతమాయ మమ్ము నేలి జాణవైతివయ్యా ||
ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు వాని
బట్టి తెచ్చి పొట్టనిండ బాలు వోయరే
గామిడై పారితెంచి కాగెడి వెన్నెలలోన
చేమ పూవు కడియాల చేయి పెట్టి
చీమ గుట్టెనని తన చెక్కిట గన్నీరు జార
వేమరు వాపోయే వాని వెడ్డు వెట్టరే
ముచ్చువలె వచ్చి తన ముంగ మురువుల చేయి
తచ్చెడి పెరుగులోన దగబెట్టి
నొచ్చెనని చేయిదీసి నోర నెల్ల జొల్లుగార
వొచ్చెలి వాపోవువాని నూరడించరే
ఎప్పుడు వచ్చెనో మా యిల్లు చొచ్చి పెట్టెలోని
చెప్పరాని వుంగరాల చేయి పెట్టి
అప్పడైన వేంకటాద్రి అసవాలకుడు గాన
తప్పకుండ బెట్టె (బట్టి) వాని తలకెత్తరే
ఇట్టి విందు గంటివా నీవెక్కదైనా
అట్టె ఆకెపొత్తున నీవారగించవయ్యా ||
కలికి కెమ్మోవితీపు కమ్మని తేనెలవిందు
చలువచూపులు నీకు జిక్కెరవిందు
సెలవి లేనవ్వులే చిలుపాలతోడి విందు
అలమేలుమంగ సేసి నారగించవయ్యా ||
కాంత గోరిచెనకులు కారపు గూరలవిందు
పంతపు మాటలే ఆవపచ్చడి విందు
వింతబొమ్మల జింకెనలే వేడి పడిదాల విందు
అంతసేసీ నీదేవి యారగించవయ్యా ||
అట్టడి సమరతి యాఅడి తరితీపువిందు
గట్టి సిగ్గు పెరుగు మీగడల విందు
గుట్టుతో మన్నించితివి కమ్మను శ్రీవేంకటేశ
అట్టె నీతనివిదీర నారగించవయ్యా ||
ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని
పట్టి తెచ్చి పొట్టనిండ పాలు వోయరే ||
కామిడై పారిదెంచి కాగెడి వెన్నలోన
చేమ పూవు కడియాల చేయి పెట్టి
చీమ గుట్టెనని చెక్కిట కన్నీరు జార
వేమరు వాపోయె వాని వెడ్డువెట్టరే ||
ముచ్చువలె వచ్చి తన ముంగిట మురువులచేయి
తచ్చెడి పెరుగులోన తగవెట్టి
నొచ్చెనని చేయిదీసి నోరినెల్ల జొల్లుగార
వొచ్చెలి వాపోవువాని నూరడించరే ||
ఎప్పుడు వచ్చెనో మా యిల్లు జొచ్చి పెట్టెలోని
చెప్పరాని వుంగరాల చేయి పెట్టి
అప్పడైన వేంకటేశుడా సపాలకుడు గాన
తప్పకుండ బెట్టెవాని తలకెత్తరే ||
ఇతడుచేసినసేత లెన్నిలేవిలమీద
యితడు జగదేకగర్వితుడౌనో కాడో ||
కుడువడా ప్రాణములుగొనుచు బూతకిచన్ను
తుడువడా కపటదైత్యులనొసలివ్రాలు
అడువడా నేలతో నలమి శకటాసురుని
వడువడా నెత్తురులు వసుధ కంసుని ||
పెట్టడా దనుజారిబిరుదు లోకమునమ్దు
కట్టడా బలిదైత్యు కర్మబంధముల
మెట్టడా కాళింగుమేటిశిరములు, నలియ
గొట్టడా దానవుల గోటానగోట్ల ||
మరవడా పుట్టువులు మరణములు బ్రాణులకు
పరపడా గంగ దనపాదకమలమున
చెరుపడా దురితములు శ్రీవేంకటేశుడిదె
నెరపడా లోకములనిండ దనకీర్తి ||
ఇతడే పరబ్రహ్మ మిదియె రామకథ
శతకోటి విస్తరము సర్వపుణ్య ఫలము ||
ధరలో రాముడు పుట్టె ధరణిజ బెండ్లాడె
అరణ్య వాసులకెల్ల నభయమిచ్చె
సొరిది ముక్కుజెవులు చుప్పనాతికిని గోసె
ఖరదూషణులను ఖండించి వేసె ||
కినిసి వాలి జంపి కిష్కింద సుగ్రీవుకిచ్చె
వనధి బంధించి దాటె వానరులతో
కవలి రావణ కుంభకర్ణాదులను జంపి
వనిత జేకొని మళ్ళివచ్చె నయోధ్యకును ||
సౌమిత్రియు భరతుడు శత్రుఘ్నుడు గొలువగ
భూమి యేలె కుశలవ పుత్రుల గాంచె
శ్రీమంతుడై నిలిచె శ్రీవేంకటాద్రి మీద
కామించి విభీషణు లంకకు బట్టముగట్టె ||
ఇతడొకడే సర్వేశ్వరుడు
సిత కమలాక్షుడు శ్రీ వేంకటేశుడు ||పరమ యోగులకు భావ నిధానము
అరయ నింద్రాదుల కైశ్వర్యము
గరిమ గొల్లెతల కౌగిట సౌఖ్యము
సిరులొసగేయీ శ్రీ వేంకటేశుడు ||కలికి యశోదకు కన్న మాణికము
తలచిన కరికిని తగుదిక్కు
అల ద్రౌపదికిని ఆపద్బంధుడు
చెలరేగిన యీ శ్రీ వేంకటేశుడు ||తగిలిన మునులకు తపము సత్ఫలము
ముగురు వేల్పులకు మూలమీతడే
వొగినలమేల్మంగ కొనరిన పతియితడు
జిగిమించిన యీ శ్రీవేంకటేశుడు ||
———————————————————————————————————————————–
ఇతనికంటె ఘనులిక లేరు
యిరర దేవతల యిందరిలోన॥
భూపతి ఈతడె పొదిగి కొలువరో
శ్రీపతి ఈతడే చేకొనరో
యేపున బలువుడు నీతడే చేరరో
పైపై వేంకటపతి యైనాడు॥
మరుగురుడితడే మతి నమ్మగదరో
పరమాత్ముడితడే భావించరో
కరివరదుడితడే గతియని తలచరో
పరగ శ్రీ వేంకటపతియైనాడు॥
తల్లియు నితడే తండ్రియు నితడే
వెల్లవిరై యిక విడువకురో
చల్లగా నితని శరణని బ్రతుకరో
అల్ల శ్రీ వేంకటహరి అయినాడు॥
ఇతనికంటే ఘనులు ఇకలేరు
ఇతరదేవతల ఇందరిలోన ||
భూపతి యితడే పొదిగి కొలువరో
శ్రీపతి యితడే చేకొనరో
ఏపున బలుపుడు నితడే చెరరో
పై పై వేంకట పతి యైనాడు ||
మరుగురు డితడే మతినమ్మగదరో
పరమాత్ము డితడే భావించరో
కరివరదు డితడే గతియని తలచరో
పరగ శ్రీవేంకట పతియై నాడు ||
తల్లియు నితడే తండ్రియు నితడే
వెల్లవియై యిక విడువరో
చల్లగా నితని శరణని బ్రతుకరో
అల్ల శ్రీ వేంకట హరి యయినాడు ||
ఇతనికంటే నుపాయ మిక లేదు
మతిలోననున్న వాడు మర్మ మిదే సుండీ.
ఇన్నిలోకసుఖములు ఇంద్రియప్రీతులే
తన్ను గనినతల్లిదండ్రి తనుపోషకులే
కన్ను లెదిటిధనాలు కారణార్థములే
వున్నతి నిష్టార్థసిద్ది కొక్కడే దేవుడు.
కలదేవత లిందరు కర్మఫలదాతలే
లలి విద్యలెల్ల ఖ్యాతిలాభపూజలకొరకే
పలుమంత్రములెల్లను బ్రహ్మలోక మీసందివె
వొలిసి ఇష్టార్థసిద్ది కొక్కడే దేవుడు.
అనుదినరాజసేవ లల్ప్రార్థహేతులే
కొనగల్పవృxఅమైన గోరినవిచ్చేటిదే
ఘన శ్రీవేంకటేశుడు కల్పించె జీవుని గావ_
వొనర నిష్టార్థసిద్ది కొక్కడే దేవుడు
ఇతర చింత లిక నేమిటికి
అతడే గతియై అరసేటివాడు
కర్మమూలమే కాయము నిజ
ధర్మమూలమే తనయాత్మ
అర్మిలి రెంటికి హరియొకడే
మర్మ మీతడే మనిపేటివాడు
బహుభోగమయము ప్రపంచము
నిహితజ్ఞానము నిజముక్తి
ఇహపరములకును యీశ్వరుడే
సహజపుకర్తై జరపేటివాడు
అతిదుఃఖకరము లానలు
సతతసుఖకరము సమవిరతి
గతి యలమేల్మంగతో శ్రీవేంకట
పతి యొకడిన్నిట బాలించువాడు
ఇతర దేవతల కిదిగలదా
ప్రతివేరి నీ ప్రభావమునకు ||
రతిరాజ జనక రవి చంద్ర నయన
అతిశయ శ్రీ వత్సాంకుడవు
పతగేంద్ర గమన పద్మావతి పతి
మతి నిను తలచిన మనోహరము ||
ఘన కిరీటధర కనకాంబర పా
వన క్షీరాంబుధి వాసుడవు
వనజ చక్రధర వసుధ వల్లభ
నిను పేరుకొనిన నిర్మలము ||
దేవ పితామహ త్రివిక్రమ హరి
జీవాంతరాత్మక చిన్మయుడా
శ్రీ వేంకటేశ్వర శ్రీకర గుణనిధి
నీవార మనుటే నిజ సుఖము ||
ఇతర ధర్మము లందు నిందు గలదా
మతి దలప పరము నీమతముననే కలిగె ||
విదురునకు బరలోకవిధి చేసెనట తొల్లి
అదె ధర్మసుతుడు వర్ణాశ్రమంబులు విడిచి
కదిసి నీదాసుడైన కతముననేకాదె యీ
యెదురనే తుదిపదం బిహముననే కలిగె ||
అంటరానిగద్దకుల మంటి జటాయువుకు నీ
వంటి పరలోకకృత్యములు సేసితివి మును
వెంట నీకైంకర్యవిధి కలిమినేకాదె
వొంటి నీహస్తమున యోగ్యమై నిలిచె ||
యిరవైనశబరిరుచు లివియె నైవేద్యమై
పరగెనట శేషమును బహువిధములనక
ధర దదీయప్రసాదపు విశేషమేకాదె
సిరుల శ్రీవేంకటేశ చెల్లుబడులాయె ||
ఇతరచింత లేక యేమిటికి
అతడే గతియై అరసేటివాడు ||
కర్మ మూలమే కాయము నిజ
ధర్మ మూలమే తన యాత్మ
అర్మిలి రెంటికి హరి యొకడే
మర్మ మీతడే మనిపేటి వాడు ||
బహుభోగ సమయము ప్రపంచము
విహిత జ్ఞానము నిజముక్తి
ఇహపరములకును ఈశ్వరుడే
సహజ కర్తయై జరిపేటి వాడు ||
అతి దుఃఖకరము లాసలు
సతత సుఖకరము సమవిరతి
గతి యలమేల్మంగతో శ్రీ వేంకట
పతి యొకడిన్నిట పాలించువాడు ||
ఇతరదేవతల కిది గలదా
ప్రతి వేరీ నీప్రభావమునకు
రతిరాజజనక రవిచంద్రనయన
అతిశయశ్రీవత్సాంకుడవు
పతగేంద్రగమన పద్మాసతీపతి
మతి నిను దలచిన మనోహరము
ఘనకిరీటధర కనకాంబర పా__
వన క్షీరాంబుధివాసుడవు
వనజచక్రధర వసుధావల్లభ
నిను బేరుకొనిన నిర్మలము
దేవపితామహ త్రివిక్రమ హరి
జీవాంతరాత్మక చిన్మయుడా
శ్రీవేంకటేశ్వర శ్రీకర గుణనిధి
నీవా మనుటే నిజసుఖమ
ఇతరము లిన్నియు నేమిటికి
మతిచంచలమే మానుట పరము ||
ఎక్కడిసురపుర మెక్కడివైభవ
మెక్కడి విన్నియు నేమిటికి
యిక్కడనే పరహితమును బుణ్యము
గక్కున జేయగ గల దిహపరము ||
యెవ్వరు చుట్టము లెవ్వరు బంధువు
లెవ్వరిందరును నేమిటికి
రవ్వగులక్ష్మీరమణుని దలపుచు
యివ్వల దా సుఖియించుట పరము ||
యెందరు దైవము లెందరు వేల్పులు
యెందరిందరును నేమిటికి
కందువెరిగి వేంకటగిరిరమణుని
చిందులేక కొలిచిన దిహపరము ||
ఇతరమెరుగ గతి ఇదియే శరణ్యము
సతత పూర్ణునికి శరణ్యము ||సకలలోకముల సాక్షియై గాచిన
సర్వేశ్వరునకు శరణ్యము
ఉర్వికి మింటికి ఒక్కట మెరిగిన
సార్వభౌమునకు శరణ్యము ||శ్రీకాంత నురము చెంగట నిలిపిన
సాకారునకును శరణ్యము
పైకొని వెలిగేటి పరంజ్యోతి యౌ
సౌకుమారునకు శరణ్యము ||తగ నిహ పరములు దాసుల కొసగెడి
జగదీశ్వరునకు శరణ్యము
నగు శ్రీ వేంకట నాథుడ నీకు
సుగుణమూర్తి యిదె శరణ్యము ||
—————————————————————————————————————————————————————————–
ఇతరు లేమెరుగుదు రేమని చెప్పగ వచ్చు
పతులకు సతులకు భావజుడే సాక్షి ||తలపు గలిగితేను దవ్వులేమి చేరువేమి
అలరు సమ్మతించితె నడ్డాకలేమి
కొలది మీరినప్పుడు కొంచెమేమి దొడ్డయేమి
సెలవిచ్చి యేకతాన జేసినది చేత ||యిచ్చకమె కలిగితే యెక్కువేమి తక్కువేమి
హెచ్చిన మోహములకు నెగ్గు సిగ్గేది
పచ్చియైన పనులకు పాడియాల పంతమేల
చెచ్చెర దమకు దాము చెప్పినది మాట ||అన్నిటా నొక్కటియైతే నైన దేమి కానిదేమి
యెన్నికల కెక్కితేను యీడు జోడేది
వున్నతి శ్రీ వేంకటేశు డొనగూడె నేర్పులివి
కన్నెలు దా గూడిన గతులే సంగతులు ||
——————————————————————————————————————————————————————————–
ఇతరులకు నిను నెరుగదరమా // పల్లవి //
సతతసత్యవ్రతులు సంపూర్ణమోహవిర
హితులెరుగుదురు నిను నిందిరారమణా //అను పల్లవి//
నారీకటాక్షపటునారాచభయరహిత
శూరులెరుగుదురు నిను జూచేటిచూపు
ఘొరసంసార సంకులపరిచ్ఛేదులగు
ధీరులెరుగుదురు నీదివ్యవిగ్రహము //ఇతరులకు నిను //
రాగభోగవిదూర రంజితాత్ములు మహా
భాగులెరుగుదురు నిను బ్రణుతించువిధము
ఆగమోక్తప్రకారాభిగమ్యులు మహా
యోగులెరుగుదురు నీవుండేటివునికి //ఇతరులకు నిను //
పరమభాగవత పదపద్మసేవానిజా
భరణు లెరుగుదురు నీపలికేటిపలుకు
పరగునిత్యానంద పరిపూర్ణమానస
స్థిరు లెరుగుదురు నిను దిరువేంకటేశ //ఇతరులకు నిను //ఇతరులకు నిను నెఱుగతరమా
సతత సత్యవ్రతులు సంపూర్ణ మోహ విర-
హితులెఱుగుదురు నిను నిందిరారమణా॥
నారీకటాక్ష పటు నారాచభయరహిత-
శూరులెఱుగుదురు నిను చూచేటిచూపు
ఘోరసంసార సంకులపరిచ్ఛేదులగు-
ధీరులెఱుగుదురు నీదివ్యవిగ్రహము॥
రాగభోగవిదూర రంజితాత్ములు మహా-
భాగులెరుగుదురు నిను ప్రణుతించు విధము
ఆగమోక్తప్రకారాభిగమ్యులు మహా-
యోగులెఱుగుదురు నీవుండేటి వునికి॥
పరమ భాగవత పదపద్మ సేవానిజా-
భరణు లెఱుగుదురు నీ పలికేటి పలుకు
పరగు నిత్యానంద పరిపూర్ణ మానస-
స్థిరులెఱుగుదురు నిను తిరువేంకటేశ॥
ఇత్తడి బంగారుసేయ నింతకు నేరుతునంటూ
కొత్తసేతలెల్ల దొరకొంటిగా నీవు ||
హీనులైనవారు నిన్ను నేచి కొలిచిన ఘన
మైనపదవుల బెట్టేయటువలెనే
మానక యెవ్వతెనైన మచ్చిక దగిలి నాతో
నానిపట్టి సరిసేసే వద్దిరా నీవూ ||
కడుబాతకులు నిన్ను గదిసి కొలిచేరంటా
నడరి పుణ్యులజేయునటువలెనే
కడగి యెవ్వతెనైన గాజు మాణికము సేసి
వడి నన్ను గెరలించవద్దురా నీవూ ||
దిందుపడ మాయసేసి దేవుడ నేగానంటా
నందరి భ్రమలబెట్టునటువలెనే
అందమైనతిరువేంకటాద్రీశ నీప్రేమ
చెంది నన్ను గూడి దాచజెల్లునా నీవూ ||
ఇదిగాక సౌభాగ్య మిదిగాక తపము మఱి
యిదిగాక వైభవం బిక నొకటి కలదాఅతివ జన్మము సఫలమై పరమయోగివలె
నితర మోహాపేక్ష లిన్నియును విడిచె
సతి కోరికలు మహాశాంతమై యిదె చూడ
సతత విజ్ఞాన వాసన వోలె నుండెతరుణి హృదయము కృతార్థత బొంది విభుమీది
పరవశానంద సంపదకు నిరవాయ
సరసిజానన మనో జయ మంది యింతలో
సరిలేక మనసు నిశ్చలభావమాయశ్రీ వేంకటేశ్వరుని జింతించి పరతత్త్వ
భావంబు నిజముగా బట్టె జెలియాత్మ
దేవోత్తముని కృపాధీనురాలై యిపుడు
లావణ్యవతికి నుల్లంబు దిరమాయ
———————————————————————————————————————————–
ఇదిగో మా యజ్ఞాన మెప్పుడును సహజమే
కదిసి నీవే కరుణించవయ్యా ||
తల్లిచంకనున్న బిడ్డ తమితో జన్నుదాగు తా
నొల్లడు తండ్రి యెత్తుకొన బోతేను
మల్లడి నీ మాయలో మరిగిన జీవముల
మెల్లనె మీసేవజేసి మిమ్ము జేరజాలము ||
రెక్కల మరుగుపక్షి రెక్కలక్రిందనే కాని
యెక్కడు వద్దనే మేడ యెంతవున్నను
ప్రక్కన జన్మమెత్తిన ప్రపంచపు జీవులము
యెక్కుడైన వైకుంఠ మిది గోరజాలము ||
నీరులో నుండేటి కప్ప నీటిలో వుండుగాని
వూరకే పరుపు మీద నుండదెంతైనను
అరయ సంసారములో అజ్ఞానపు జీవులము
బోరన శ్రీవేంకటేశ బుద్ధి చెప్పికావవె ||
ఇదియె నాకు మతము ఇదివ్రతము
వుదుటుల కర్మము వొల్లనింకను ||నిపుణత హరినే నిను శరణనుటే
తపములు జపములు ధర్మములు
నెపమున సకలము నీవే చేకొను
వుపమల పుణ్యము లొల్ల నే యింకను ||హరి నీదాసుడ ననుకొనుటే నా
పరమును ఇహమును భాగ్యమును
ధర నీ మాయల తప్పు తెరువులను
వొరగీ సుకృతము లొల్లనే ఇంకను ||నారాయణ నీ నామము దలచుట
సారపు చదువులు శాస్త్రములు
ఈరీతి శ్రీవేంకటేశ నిన్నుగొలిచితి
వూరక ఇతరము లొల్ల నే యింకను ||
———————————————————————————————————————————–
ఇదియే మర్మము హరి యిందుగాని లోనుగాడు
పదపడి జీవులాల బదుకరో ||
హరి గానలేరు అరసెందువెదికినా
హరిదాసు లెఱుగుదు రడుగరో
గరిమె బ్రత్యక్షము గాడు దేవు డెవ్వరికి
ధర బ్రత్యక్షము హరిదాసుల గొలువరో ||
చేత ముట్టి గోవిందుని శిరసు పూజించలేరు
చేతులార ప్రసన్నులసేవ సేయరో
జాతిగాగ విష్ణునిప్రపాద మేడ దొరకీని
ఆతల వారి బ్రసాద మడుగరో ||
అంతరంగమున నున్నాడందురు విష్ణుడు గాని
అంతటా నున్నారు వైష్ణవాధికులు
చెంతల దదియ్యులచేతియనుజ్ఞ వడసి
సంతతం శ్రీవెంకటేశుశరణము చొరరో ||
ఇదియే రమయోగ మిద్దరికి విభుడా
అదన ననిచన ద్రిస్శ్తాంత మాయనిపుడు ||వెలి మన మిద్దరము వేరై వుందుము గాని
తలపు లోపలను ఇద్దర మొకతే
వొలసి యుద్దములోన నొకరూపే రెండై
తెలిసినట్లనేపో ద్రిస్శ్తాంతమిపుడు ||పేరులిద్దరికి నిట్టె భేదమైతో చీగాని
తారుకాణ గుణము లిద్దరి కొకతే
కోరిన మాటొకటే కొండశలలో రెండవు
తేరి చూడనిది యేవో ద్రిస్శ్తాంతమిపుదు ||శ్రీ వేంకటేశ నీనా చేతవే వేరులుగాని
కేవలిద్దరికి కాగిలి వొకటే
పూవు గుత్తి వొకటే పూపలు వేరైనట్ట్లు
దేవ యిన్నిటికి నిదె ద్రిస్శ్తాంత మిపుడు ||
———————————————————————————————————————————–
ఇదియే వేదాంత మిందుకంటె లేదు
ఇదియే శ్రీవేంకటేశుని మతము ||విరతియే లాభము విరతియే సౌఖ్యము
విరతియేపో విజ్ఞానము
విరతిచే ఘనులైరి వెనుక వారెల్ల
విరతి బొందకున్న వీడదు భయము ||చిత్తమే పాపము చిత్తమే పుణ్యము
చిత్తమే మోక్షసిద్ధియును
చిత్తమువలనే శ్రీహరి నిలుచును
చిత్తశాంతిలేక చేరదు పరము ||ఎంత చదివినా యెంత వెదికినా
యింతకంటె మరియిక లేదు
ఇంతట శ్రీవేంకటేశు దాసులౌట
యెంతవారికైన యిదియే తెరవు ||
———————————————————————————————————————————–
ఇదియే సాధన మిహపరములకును
పదిలము మాపాలి పరమపు నామము ||
కలిదోష హరము కైవల్యకరము
అలరినమా శ్రీహరి నామము
సులభము సౌఖ్యము శోభన తిలకము
పలుమారు శ్రీపతి నామము ||
పాప నాశనము బంధ విమోక్షము
పై పై నిది భూపతి నామము
స్థాపిత ధనమిది సర్వ రక్షకరము
దాపుర మిది మాధవ నామము ||
నేమము దీమము నిత్యకర్మ మిది
దోమటి గోవిందుని నామము
హేమము శరణము ఇన్నిట మాకును
యే మేర శ్రీ వేంకటేశ్వరు నామము ||
ఇదియే సులభము ఇందరికి
కదియగ వశమా కరుణనె గాక
నగధరుందు పన్నగశయనుదు భూ
గగనాంతరిక్ష గాత్రుండు
అగణితుడితని నరసి తెలియగా
తగునా కనెడిది దాస్యమె గాక
కమలజ జనకుడు కాముని జనకుడు
కమలాసతిపతి ఘనగుణుడూ
విమలుండీ హరి వెదకి కావగను
అమరున శరణా గతి గాక
దేవుడు త్రిగుణాతీతుడనంతుడు
కైవల్యమొసగు ఘనుడితడు
శ్రి వేంకతాపతి జీవాంత రాత్ముడు
భావించ వశమా భక్తినె గాక
ఇదివొ సంసార మెంతసుఖమోకని
తుదలేనిదుఃఖమను తొడవు గడియించె ||పంచేంద్రియంబులను పాతకులు దనుదెచ్చి
కొంచెపుసుఖంబునకు గూర్పగాను
మించి కామంబనెడి మేటితనయుండు జని
యించి దురితధనమెల్ల గడియించె ||పాయమనియెడి మహాపాతకుడు తను దెచ్చి
మాయంపుసుఖమునకు మరువగాను
సోయగపు మోహమను సుతుడేచి గుణమెల్ల
బోయి యీనరకమను పురము గడియించె ||అతిశయుండగు వేంకటాధీశుడను మహా
హితుడు చిత్తములోన నెనయగాను
మతిలోపల విరక్తిమగువ జనియించి య
ప్రతియయి మోక్షసంపదలు గడియించె ||
———————————————————————————————————————————–
ఇదివో సుద్దులు యీరేపల్లెను
కదిసి యిందరివీ( గైకొనవయ్యా
పలచనిరెప్పల పగటులు నెరపుచు
సొలసి నిన్నొకతె చూచెనటా
తళుకులగోళ్ళ దండె మీటి యదె
పలికి నిన్నొకతె పాడెనటా
చనవులు నెరపుచు సన్న సేయుచును
ననుపున నొక్కతె నవ్వెనటా
చెనకి యొకతె యదె చిగురుగేద(గుల
వెనకనుండి నిను వేసెనటా
అదన నీవు నన్నలమిపట్ట(గా
కొదలి యొకతె గని గొణ(గెనటా
యెదురనె శ్రీవేంకటేశ యొకతె నీ
చెదరినయలకలు చెరిగెనటా
ఇదె నీ కన్నుల యెదిటికివచ్చితి
కదియుచు నెట్లైన గావక పోదు ||
పరమపురుష నీ భక్తి దొరకకనే
ఇరవగు జన్మము లెత్తితిని
హరి నీకరుణకు నరుహము లేకనే
దురితవిదుల సందుల బడితిని ||
జగదీశ్వర నీ శరణము లేకనే
వొగి సంసారపు వురి బడితి
భగవంతుడ నీ పదములు గనకనే
తెగని పాపముల తీదీపు లైతి ||
గోవిందుడ నిను కొలువగ నేరకనే
ధావతి యాసల తగిలితిని
శ్రీ వేంకటేశ్వర చేరి నీవు నా
దైవమవు కాగ ధన్నుడ నయితి ||
ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకె
అదనెరిగి తెచ్చితిని అవధరించవయ్యా
రామా నిను బాసి నీ రామా నే చూడగ ఆ
రామమున నిను పాడెను రామ రామ యనుచు
ఆ మెలుత సీతయని అపుడు నే తెలిసి
నీ ముద్ర ఉంగరము నేనిచ్చితిని
కమలాప్తకులుడా నీ కమలాక్షి నీ పాద
కమలములు తలపోసి కమలారిదూరె
నెమకి ఆలేమను నీ దేవియని తెలిసి
అమరంగ నీ సేమమటు విన్నవించితిని
దశరధాత్మజా నీవు దశశిరుని చంపి
ఆ దశనున్న చెలిగావు దశ దిశలు పొగడ
రసికుడ శ్రీ వెంకట రఘువీరుడా నీవు
శశిముఖి చేకొంటివి చక్కనాయె పనులు
ఇద్దరి కిద్దరే సరి యీడుకు జోడుకు దగు
గద్దరికన్నుల జూడ గలిగెగా మనకు ||
పంతపు చెలిచన్నుల పసిడి కాంతులకు
కాంతుని పీతాంబరపు కాంతులు సరి
దొంతల చెలినీలపుతురుము కాంతులకు
వంతుల మేనినీలవర్ణము సరి ||
జలజాక్షి వెలలేని జఘనచక్రమునకు
చలమరివల కేలిచక్రము సరి
కులికేటి యీయింతి కుత్తిక శంఖమునకు
చలివాయ రమణుని శంఖము సరి ||
కమలాక్షి శ్రీవేంకటపతి గూడుటకు
రమణుడంటిన సమరతులు సరి
తమితోడి నిద్దరికి తారుకాణలై నట్టి
సముకపు మోహముల సంతసములు సరి |
ఇద్దరి గూరిచితిమి యేము చెలికత్తెలము
పొద్దు కొకకొత్తలుగా భోగించరయ్యా
ప్రేమముతో సేసపాల పెండ్లికూతురురిదె వచ్చె
ఆముకొని సరసములాడవయ్యా
ఆమనిసిగ్గులతోడ నదె తెరలో నున్నది
చేముట్టి సేవలెల్లాఁ జేయించుకోవయ్యా
మక్కువతో నీ మేన మరదలిదివో వచ్చె
చక్కగా పాదాలీకపై జాచవయ్యా
వెక్కసాన తమకించి వేడుకటో నున్నది
గక్కననుఁ దప్పక మొగము చూడవయ్యా
అరుదై శ్రీవెంకటేశ అలమేలుమంగ వచ్చె
బెరసి రతులను నిట్టె పెనగవయ్యా
గరిమ వేళగాచి నీకౌగిటిలోనే నున్నది
సరికిబేసికి నీవు చనవియ్యవయ్యా
ఇద్దరి తమకము నిటువలెనె
పొద్దున నేమని బొంకుదమయ్యా
లలి నాకథరము లంచమియ్యగా
పలు సోకులయి పరగెనవే
పిలువగరాగా బెరసి నిందవడె
పొలతికి నేమని బొంకుదమయ్యా
అడుగుకొనుచు నిన్నంటి పెనగగా
తడయక నఖములు తాకెనవే
తొడుకొనిరాగా దూఱు మీదబడె
పొడవుగ నేమని బొంకుదమయ్యా
పెక్కులు చెవిలో ప్రియముగ చెప్పగ
ముక్కున జవ్వాది మోచె నిదే
యిక్కడ శ్రీవేంకటేశుడ సడివడె
పుక్కటి నేమని బొంకుదమయ్యా
ఇద్దరి భావములును యీడుజోళ్ళాయ నిదె
అడ్డుకొని తులదూగినట్టి చందమాయెను ||
తళుకున నీవిప్పుడు తరుణి జూచితేను
తొలకి చెక్కుచెమట దొరుగ జొచ్చె
లలి మీరి ఆమెరుపులకు యీ తురుము మేఘ
మలరి వాన గురిసినట్టి చందమాయెను ||
చదురుమాటల నీవు జలజాక్షి బిలిచితే
పొదిగొని నిలువెల్ల బులకించెను
కదిసి ఆమాటల గాలికి యీమైదీగె
అదనుగూడ ననిచినట్టి చందమాయెను ||
ననుపై శ్రీ వేంకటేశ నవ్వి నీవు గూడితేను
యెనసి కామిని చిత్తమెల్ల గరగె
వొనరి ఆ వెన్నెల కీ మనసనే చంద్రకాంత
మనువుగా గరగినయట్టి చందమాయెను ||
ఇద్దరు జాణలేమీరు యెంచి చూచితే
పొద్దులు గడుపుదురా పొరుగునను ||
దిగ్గన సరసమున దిట్టులెన్ని దిట్టినాను
యెగ్గులు వట్టుదురా యింతలోననే
వెగ్గళించి చనవున వెస మర్మము లంటితే
సిగ్గులు వడుదురా జిగిమించను ||
జవ్వనపాయముతోడ సారె సారె జెనకితే
నవ్వులు నవ్వుదురా నట్టనడుమ
నివ్వటిల్లు సన్నలెల్లా నెట్టుకొన జేసితేను
రవ్వలు సేయుదురా రచ్చలోనను ||
సమ్మతించి కాగిళ్ళను సమరతి బెనగితే
బొమ్మల జంకింతురా పూచిపట్టుక
యిమ్ముల శ్రీవేంకటేశ యిట్టె మీరు గూడితిరి
దొమ్ములు సేయుదురా తోడదోడను ||
ఇద్దరు నొకటే యెప్పుడును
బుద్ధులు చెప్పరే పొలతుకలూ ||
చలమున నూరకే సాదించీ జెలి
తలపు దెలియకే తన పతిని
కలి ముదిసి మేడిదె గాక తొలుతనె
కలక దేరుచరే కామినులు ||
విచ్చల విడిగా వెంగెము లాడి
గచ్చుల యలుకల కాంతుని
హెచ్చి గోరి రేక యేరుగా నెపుడే
మచ్చిక సేయరే మానినులు ||
పనివడి కూడుచు బంతము లాడి
ఘనుడగు శ్రీ వేంకటపతి విభుని
ననలే విరులై నాటకమునుపనె
పెనగి మొక్కించరే ప్రియ సఖులు ||
ఇన్నాళ్ళు నందునందు నేమిగంటిని
అన్నిటా శరణు చొచ్చి హరి నిను గంటిని
అంగనలపసఁజిక్కి అలయికలే కంటి
బంగారు వెంటఁ దగిలి భ్రమ గంటిని
ముంగిటి క్షేత్రాలంటి ముంచి వెట్టిసేయగంటి
అంగపునన్నే చూచి అంతరాత్మఁ గంటి
చుట్టాలఁ జేరి చూచి సుద్దులవావులు గంటి
మట్టిలేని వయసుతో మదము గంతి
వట్టి కామములు సేసి వరుస మాయలు గంటి
పట్టి నారాయణుని భక్తి నిన్ను గంటిని
వింతచదువులవల్ల వేవేలు మతాలు గంటి
సంతకర్మములవల్ల సాము గంటిని
యింతట శ్రీవేంకటేశ యిటు నాజీవభావము
చింతించి అందులోన నీశ్రీపాదాలు గంటి
ఇన్ని చేతలును దేవుడిచ్చినవే
ఉన్నవారి యీపులెల్ల నొద్దికయ్యీనా ||
తెగని యాపదలకు దేవుడే కలడుగాక
వగలుడుప బరుల వసమయ్యీనా
నొగలి యితరులకు నోళ్ళు దెరచిన
నగుబాటేకాక మానగ బొయ్యీనా ||
అగ్గలపు దురితాలు హరియే మానుపుగాక
బగ్గన నొక్కరు వచ్చి పాప బొయ్యేరా
తగ్గుమగ్గులైనవేళ తలచినవారెల్ల
సిగ్గుబాటేకాక తమ్ముజేరవచ్చేరా ||
ఎట్టుసేసినను వేంకటేశుడే నేరుచుగాక
కట్టకడ వారెల్ల గరుణించేరా
ఇట్టే యేమడిగిన నితడే యొసగుగాక
వుట్టివడి యెవ్వరైనా నూరడించేరా ||
ఇన్ని జన్మములేటికి హరిదాసు
లున్న వూర దానుండిన జాలు ||
హరిభక్తుల యింటి యన్నము గొనువారి
వరువుడై యుండవలెనన్న జాలు
పరమభాగవత భవనంబుల జెడ్డ
పురువు దానయి పొడమిన జాలు ||
వాసుదేవుని భక్తవరుల దాసులు మున్ను
రోసిన యెంగిలి రుచిగొన్న జాలు
శ్రీసతీశుని దలచినవారి దాసాను
దాసుడైవుండ దలచినజాలు ||
శ్రీవేంకటేశు జూచినవారి శ్రీపాద
సేవకుడై యండజేరిన జాలు
ఈ విభుదాసుల హితుల పాదధూళి
పావనమై సోకి బ్రదికిన జాలు ||
ఇన్ని దేహముల బుట్టి యేమిగంటిమి
పున్నతపుహరిదాస్యమొక్కటేకాక
హీనజంతువైననాడు యేనుగై పుట్టిననాడు
ఆనంద మొక్కటే అంగాలే వేరు
యీనేటియజ్ఞానము యీజీవుల కొక్కలాగే
జ్ఞానమే యెక్కుడుగాక సరిలేని దొకటే
నరలోక భోగానకు నరకానుభవానకు
సరేగాని ముగులదు చనెదొల్లె
గరిమ నేర్పడ నందు ఘనమేమి కొంచెమేమి
హరిదాసుడై బ్రదుకుటదియే లాభము
బాలుడైనయప్పుడూను పండి ముదిసినప్పుడు
కాలమొక్కటే బుద్ది కడు లేదు
ఆలకించి శ్రీవేంకటాధిపతి సేవించి
యేలికంటా మొక్కుచుండే దిదియే భాగ్యము.
ఇన్నిచదువనేల ఇంత వెదకనేల
కన్ను తెరచుటొకటి కనుమూయుటొకటి ||
వలెననేదొకమాట వలదనేదొక మాట
సిలుగులీ రెంటికిని చిత్తమే గురియౌను
వలెనంటె బంధము వలదంటె మోక్షము
తెలిసి విజ్ఞానులకు తెరువిది యొకటే ||
పుట్టెడిదొకటే పోయెడిదొకటే
తిట్టమై రెంటికిని దేహమే గురియౌను
పుట్టుట సంశయము పోవుట నిశ్చయము
వొట్టి విజ్ఞానులకు వుపమిది వొకటే ||
పరమనేదొకటే ప్రపంచమొకటే
సిరుల నీరెంటికిని జీవుడే గురియౌను
ఇరవు వేంకటేశుడిహ పరములకర్త
శరణాగతులకెల్ల సతమీతడొకడే ||
ఇన్నిట నింతట ఇరవొకటే
వెన్నుని నామమే వేదంబాయె ||
నళినదళాక్షుని నామ కీర్తనము
కలిగి లోకమున గల దొకటే
ఇల నిదియే భజియింపగ పుణ్యులు
చెలగి తలప సంజీవని యాయె ||
కోరిన నచ్యుత గోవిందా యని
ధీరులు తలపగ తెరువకటే
ఘోరదురితహర గోవర్ధన
నారాయణ యని నమ్మగ గలిగె ||
తిరువేంకటగిరి దేవుని నామము
ధర తలపగ నాధారమిదె
గరుడధ్వజుని సుఖప్రద నామము
నరులకెల్ల ప్రాణము తానాయె ||
ఇన్నిటా ఘనుడు దాను యేమి చెప్పేరే
యెన్నుకోనీ నా గుణము లేమి చెప్పేరే ||
చెంత దన చెప్పినట్టు సేసితినంటా నిదె
యేంత నన్ను బుజ్జగించీ నేమి చెప్పేరే
అంతటా దన కిచ్చక మాడితినంటా నిదె
ఇంతలో నన్ను బొగడీనేమి చెప్పేరే
వొట్టి తనపై పాటలు వొనర బాడితినంటా
ఇబ్డె విదెమిచ్చీని యేమి చెప్పేరే
జట్టిగా జన్నులతోడ సాము సేఇంచితి నంటా
యెట్టనెదుటనే మెచ్చీ నేమి చెప్పేరే ||
మనసు మర్మములంటా మంతన మాడితినంటా
యెనసి కౌగలించీ యేమి చెప్పేరే
చెనకి మొక్కితినంటా శ్రీ వేంకటేశ్వరుడు
ఇనుముడిగా మన్నించె నేమి చెప్పేరే ||
ఇన్నిటి మూలంబీశ్వరుడాతని
మన్నన కొలదినె మలయుట గాక
మాయ మయమై మనియెడి జగమిది
చాయల నిందు నిజము కలదా
కాయము సుఖ దూఃఖములకు పొత్తిది
రేయి పగలు ఒకరీతే కలదా
దైవాధీనము తగు సంసారము
వావిరి జీవుల వసమౌనా
ధావతి మనసిది తన కర్మ మూలము
వేవేలైనా విడువగ వశమా
పంచేంద్రియముల పరగేటి బ్రతుకిది
చంచలంబు నిశ్చల మౌనా
ఎంచగ శ్రీ వేంకటేశ్వరు కృప తో
సంచయ మైతే సతమౌ గాక
ఇన్నిటికి బ్రేరకుడు యీశ్వరుడింతే
పన్ని యీతని దెలిసి బ్రదుకుటే జ్ఞానము ||
మనసున బుట్టిన మంకుగామక్రోధాలు
పనిలేవు తనకంటే బాపమంటదు
పనివి తొడిమ నూడి పండు తీగె నంటదు
జనులకెల్లా బ్రకృతి సహజమింతే ||
చేతులార జేసికొన్న కర్మానకు
ఘాతల గర్త గానంటే కట్టువడడు
ఆతల నబక ముంచినట్టివేడి చెయ్యంటదు
జాతి దేహము మోచిన సహజమింతే ||
వాకుననాడినయట్టి వట్టిపల్లదాలనెల్లా
దాకొని పొరయనంటే తప్పులే లేవు
పైకొని శ్రీవేంకటేశు బంటుకు వళకులేదు
సైకమైన హరిభక్తి సహజమింతే ||
ఇన్నిటికి మూలము యీతనిరూపు
యెన్నగ నుపమలకు నిరవైనట్లుండె ||
కమలనాభునికి కప్పురకాపు మేన
సముచితముగ బైపై చాతినపుడు
అమృతముదచ్చేవేళ నట్టే మేన దుంపుర్లు
తమితోడ నిండుకొని దట్టమైనట్లుండె ||
దైవశిఖామణికి తట్టుపుణుగు మేనను
చేవమీర నించి సేవసేసేయప్పుడు
వేవేలుగా యమునతో వేమారు నీదులాడగా
కావిరి కాళిమ నిండాగప్పినయట్లుండె ||
అలమేలుమంగతోడ నట్టే శ్రీవేంకటపతి
కెలమితో సొమ్మువెట్టి యెంచినపుడు
కులికి గొల్లెతలను కూడగా గుబ్బలమీద
గలపసపెల్లా వచ్చి కమ్ముకొన్నట్లుండె ||
ఇన్నినేతలకు నిది యొకటే
కన్నా మన సిది కానదుగాని||
పాతకకోట్లు భవములు భస్మీ
భూతముసేయగ బొడవొకటే
శ్రీతరుణీపతిచింత, నిజముగా
యేతరి చిత్తం బెఱగదుగాని ||
మరణభయంబులు మదములు మలినీ
కరణము సేయగగల దొకటే
హరినామామృత మందుమీది రతి
నిరతము నాకిది నిలువదుగాని ||
కుతిలములును దుర్గుణములును దృణీ
కృతములు సేయగ గురుతొకటే
పతియగు వేంకటపతి సేవారతి,
గతియని మతిగని కానదుగాని ||
ఇన్నియు గలుగుటేజన్మమున నైన
జెన్నలర హరిసేవ సిద్ధించుకొరకు ||
అరయ వేదాధ్యనమది బ్రహ్మశుద్ధికొర
కిరవైన శాస్త్రంబులెరుక కొరక
తరి యజ్ఞములు ఋణోత్తారమయ్యెడి కొరకు
సరిలేని దానములు జన్మములకొరకు ||
మమకారదూరంబు మనసు గెలుచుటకొరకౌ
సమవివేకంబు శాంతములకొరకు
అమర శ్రీతిరువేంకటాద్రీశు మనసు నీ
జముగెలుచు బ్రహ్మ విజ్ఞానంబుకొరకు ||
ఇన్నియు ముగిసెను ఇటు నీలోననే
పన్ని పరుల చెప్పగ చోటేది ||
కుందని నీ రోమకూపంబులలో
గొందుల బ్రహ్మాండ కోట్లట
యెందరు బ్రహ్మలో యెంత ప్రపంచమో
యిందు పరులమని యెంచగ నేది ||
నీ కొన చూపున నెరి కోటి సూర్యు
లేకమగుచు నుదయించురట
నీ కాయమెంతో నీ వుని కేదో
నీకంటె పరులని నిక్కగ నేది ||
జీవకోటి నీ చిన్ని మాయలో
ప్రోవులగుచు నటు పొడమె నట
శ్రీవేంకటేశ్వర చెప్పగ నీవెంతో
ఆవల పరులకు ఆధిక్య మేది ||
ఇన్నిరాసుల యునికి యింతి చెలువపు రాశి
కన్నె నీ రాశి కూటమి గలిగిన రాశి ||
కలికి బొమ విండ్లుగల కాంతకును ధనురాశి
మెలయు మీనాక్షికిని మీనరాశి
కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి
చెలగు హరిమధ్యకును సింహరాశి ||
చిన్నిమకరాంకపు బయ్యెద చేడియకు మకరరాశి
కన్నెపాయపు సతికి కన్యరాశి
వన్నెమై పైడి తులదూగు వనితకు తులారాశి
తిన్నని వాడి గోళ్ళ సతికి వృశ్చికరాశి ||
ఆముకొను నొరపుల మెరయు నతివకు వృషభరాశి
గామిడి గుట్టుమాటల సతికి కర్కాటకరాశి
కోమలపు చిగురుమోవి కోమలికి మేషరాశి
ప్రేమ వేంకటపతి గలిసె ప్రియ మిథునరాశి ||
ఇన్నిలాగులచేత లివియపో కడు
నెన్నికకెక్కిన చేతులివియపో ||గునియుచు దనునెత్తికొమ్మని తల్లిపై
నెనయజాచిన చేతులివియపో
కినిసి గోవర్ధనగిరి వెల్లగించిన
యినుమువంటి చేతులివియపో ||పిసికి పూతకిచన్ను బిగియించిపట్టిన
యిసుమంతలు చేతులివియపో
పసుల గాచుచు గొల్లపడచుల యమునలో
యిసుకచల్లిన చేతులివియపో ||పరమచైతన్యమై ప్రాణులకెల్లను
యెరవులిచ్చిన చేతులివియపో
తిరువేంకటగిరి దేవుడై ముక్తికి
నిరవుచూపెడు చేతులివియపో ||
———————————————————————————————————————————-
ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు
అప్పడగు తిరువేంకటాద్రీశు గంటి
అతిశయంబైన శేషాద్రిశిఖరము గంటి
ప్రతిలేని గోపుర ప్రభలు గంటి
శతకోటి సూర్య తేజములు వెలుగగ గంటి
చతురాస్యు బొడగంటి చయ్యన మేల్కొంటి
కనకరత్న కవాట కాంతు లిరుగడగంటి
ఘనమైన దీపసంఘములు గంటి
అనుపమ మణీమయమ్మగు కిరీటము గంటి
కనకాంబరము గంటి గ్రక్కన మేల్కొంటి
అరుదైన శంఖ చక్రాదు లిరుగడ గంటి
సరిలేని యభయ హస్తము గంటి
తిరువేంకటాచలాధిపుని జూడగ గంటి
హరి గంటి గురు గంటి నంతట మేల్కంటి
ఇప్పుడిటు విభుబాసి యింతలోననె నేడు
తప్పు లోపలి తప్పు దైవమా చెలికి ||
నగవు లోపలి యలపు నంపైన పొలయలుక
పగటు లోపలి వెరగు పచ్చివేడి
మొగము కాంతుల మెఱపు ముంచు నలుకల చెదరు
పగలు చీకట్లాయె బాపురా చెలికి ||
బలిమి లోపలి భయము పలుకుదేనెల కనరు
చెలిమి లోపలి చేదు చింత చెలికి
బలుపు కుచములలోని బట్టబయలగు నడుము
కలిమి లోపలి లేమి కట కటా చెలికి ||
నిడుపు లోపలి కురుచ నీడ లోపలి యెండ
వడి మంచి తరువు వడువని తమకము
కడు వేంకటేశ్వరుని కౌగిటను పరవశము
మడుగు లోపలి మైల మాన దీచెలికి ||.
ఇయ్య కొంటి నీపనులు ఇంతా మేలే
చెయ్యి మీదాయ నాకు సిరులేమి బాతి ||
నయగారి వాడవు నాకు నీవు గలవు
ప్రియములేమి గడమ పెక్కుమారులు
క్రియ లెఱుగుదువు కేలు చాచేవు నా మీద
నియతాన నిందుకే నీ యాలనైతిని ||
చలపాది వాడవు సతమై వున్నాడవు
చిలిము యేమి గడమ పై పై నేడు
వలపించ నేరుతువు వంచేవు నాపై ననుపు
కలకాలమును నీకు గైవశమైతిని ||
శ్రీ వేంకటేశుడవు చేరి నన్నుగూడితివి
దైవిక మేమి గడమ తగులాయను
భావమెఱుగుదువు పచ్చిగా నవ్వేవు నాతో
వే వెలకును నీకే వెల్లివిరి యైతిని ||
ఇరవగువారికి యిహపర మిదియే
హరిసేవే సర్వాత్ములకు ||
దురితమోచనము దుఃఖపరిహరము
హరినామమెపో ఆత్మలకు
పరమపదంబును భవనిరుహరణము
పరమాత్ముచింతే ప్రపన్నులకు ||
సారము ధనములు సంతోషకరములు
శౌరికథలు సంసారులకు
కోరినకోర్కియు కొంగుబంగరువు
సారె విష్ణుదాస్యము లోకులకు ||
యిచ్చయగుసుఖము యిరవగుపట్టము
అచ్చుతుకృప మోక్షార్థులకు
అచ్చపుశ్రీవేంకటాధిపుశరణము
రచ్చల మాపాలి రాజ్యపుసుగతి ||
———————————————————————————————————————————–
ఇరవైనయట్టుండు యెఱగనీ దీమాయ
తెరమఱగుమెకమువలె తిరుగు నీబ్రదుకు ||
అనిశమును దేహమున కన్నపానము లిడిన
యినుము గుడిచిననీరు యెందుకెక్కినదో
గొనకొన్నమానినులకూటములసుఖము లివి
మనసుదాగినపాలు మట్టులేదెపుడు ||
వొదలబెట్టినసొమ్ము లొగి దనకు గానరా
వడవి గాసినవెన్నె లది కన్నులకును
వుడివోనిపరిమళము లొకనిమిషమాత్రమే
బెడిదంపుభ్రమతోడి పెనుగాలిమూట ||
చద్దిసంసారమున సరుస సుఖదుఃఖములు
యెద్దుయెనుపోతునై యేకంబు గాదు
వొద్దికై శ్రీవేంకటోత్తముడు యింతలో
అద్దంపునీడవలె నాత్మ బొడచూపె ||
ఇలయును నభమును నేకరూపమై
జలజల గోళ్ళు జళిపించితివి ||
ఎడసిన నలముక హిరణ్యకశిపుని
దొడికిపట్టి చేతుల బిగిసి
కెడసి తొడలపై గిరిగొన నదుముక
కడుపుచించి కహకహ నవ్వితివి ||
రొప్పుల నూర్పుల రొచ్చుల కసరులు
గుప్పుచు లాలలు గురియుచును
కప్పినబెబ్బులి కసరుహుంకృతుల
దెప్పరపసురల ధృతి యణచితివి ||
పెళపెళనార్చుచు బెడబొబ్బలిడుచు
థళథళ మెరవగ దంతములు
ఫళఫళ వీరవిభవరస రుధిరము
గుళగుళ దిక్కుల గురియించితివి ||
చాతినప్రేవుల జన్నిదములతో
వాతెరసింహపు వదనముతో
చేతులువేయిట జెలగి దితిసుతుని
పోతర మణపుచు భువి మెరసితివి ||
అహోబలమున నతిరౌద్రముతో
మహామహిమల మలయుచును
తహతహ మెదుపుచు దగువేంకటపతి
యిహము బరము మాకిపుడొసగితివి ||
ఇలువేల్పితడే ఇందరికిని మరి
పలువేల్పులతో పనియికనేలా
కమలారమణుని కరుణేకాదా
అమరులు గొనియెడియమృతము
అమితపు శ్రీహరియాధారముగాదా
నెమకేటి ప్రాణులు నిలిచిన భూమి
దనుజాంతకుని బొడ్డుతామెర కాదా
జననకారణము సర్వమునకు
మనికై హరిసతిమహిమే కాదా
నినుపైన భువిలో నిండినసిరులు
యితనికొడుకు రచనింతాఁగాదా
సతులపతుల సంసారరతి
గతి శ్రీవేంకటపతిలోకమె వు-
న్నతి వైకుంఠపు నగరపు ముక్తి
ప|| ఇవి సేయగ నేనలసుడ యెటువలె మోక్షంబడిగెదను |
వివరముతోడుత నీవు సులభూడవు విష్ణుడ నిన్నే కొలిచెదగాక ||
చ|| జపయజ్ఞదానకర్మంబులు యెంచగ జిరకాలఫలంబులు |
యెపుడు బుణ్యతీర్థస్నానములు యిల పాపవిమోచనములు |
అపరిమిత దేవతాంతరభజనలు ఆయాలోకప్రాప్తులు |
వుపవాసాది నియమవ్రతములు తపోనిష్ఠకు గారణంబులు ||
చ|| రవిచంద్ర గ్రహతారాబలములు భువిలో గామ్యఫలములు |
తవిలిన పంచేంద్రియ నిగ్రహంబులు తనుధరులకు దుర్లభములు |
అవిరళ ధర్మార్థ కామంబులు మఱియైశ్వర్యములకు మూలములు |
ఆవల గ్రహణకానాలుష్ఠానము లధికఫలంబులు ఆశామయము ||
చ|| పరగ సప్తసంతాన బ్రాహ్మణ తర్పణములు ఖ్యాతిసుకృతములు |
అరయ బుత్రదార క్షేత్రసంగ్రహ మందరికిని సంసారభోగము |
హరి నరహరి శ్రీవేంకటేశ్వరా అఖిలము నొసగెడిదాతవు |
సరగున నీవే దయతో రక్షించజాలుదు వేకాలమును మమ్ములను ||
ఇసుక పాతర యిందుకేది కడగురుతు
రసికుడ నన్ను నింత రవ్వ శాయ నేటికి ||
బయలు వలె నుండును పట్టరాదు వలపు
మొయిలి వలె నుండును ముద్దు శాయరాదు
నియతము లేదిందుకు నేరిచిన వారి సొమ్ము
క్రియ యెరుంగు తా నన్ను గెరలించ నేటికి ||
గాలివలె బారుచుండు కానరాదు మనసు
పాలవలె బొంగుచుండు పక్కన నణగదు
యేలీలా గెలువరాదు యెక్కితే యేనుగ గుజ్జు
లోలోనే మమ్ము నింత లోచి చూడనేటికి ||
వెన్నెలే కాయుచు నుండు వింతగాను వయసు
అన్నిటా వసంత ఋతువై యుండ బోదు
వున్నతి శ్రీ వేంకటేశుడుండ నుండ జవి బుట్ట
మన్నించె యింక మారు మాటలాడ నేటికి ||
ఇసుక పాతర యిందుకేది కడగురుతు
రసికుడ నన్ను నింత రవ్వ శాయ నేటికి ||
బయలు వలె నుండును పట్టరాదు వలపు
మొయిలి వలె నుండును ముద్దు శాయరాదు
నియతము లేదిందుకు నేరిచిన వారి సొమ్ము
క్రియ యెరుంగు తా నన్ను గెరలించ నేటికి ||
గాలివలె బారుచుండు కానరాదు మనసు
పాలవలె బొంగుచుండు పక్కన నణగదు
యేలీలా గెలువరాదు యెక్కితే యేనుగ గుజ్జు
లోలోనే మమ్ము నింత లోచి చూడనేటికి ||
వెన్నెలే కాయుచు నుండు వింతగాను వయసు
అన్నిటా వసంత ఋతువై యుండ బోదు
వున్నతి శ్రీ వేంకటేశుడుండ నుండ జవి బుట్ట
మన్నించె యింక మారు మాటలాడ నేటికి ||
ఇహపరములకును ఏలికవు
బహురూపంబుల ప్రహ్లాదవరదుడు ||
వేయికరంబుల వివిధాయుధంబుల
దాయల నడచిన దైవమవు
నీయందున్నవి నిఖిల జగంబులు
పాయక మమ్మేలు ప్రహ్లాదవరద ||
కదిమి దుష్టులను గతము చేసితివి
త్రిదశుల గాచిన దేవుడవు
వదల కిందరికి వరములొసంగగ
బ్రతికితి మిదివో ప్రహ్లాదవరద ||
శ్రీవల్లభుడవు చిత్తజగురుడవు
కావలసినచో కలుగుదువు
శ్రీవేంకటాద్రిని శ్రీ అహోబలాన
భావింతు నీమూర్తి ప్రహ్లద వరద ||
ఇహము బరము జిక్కె నీతనివంక
అహిశయనునిదాసులంతవారు వేరీ
సిరికలిగినవారు చింతలిన్నిటను బాసి
నిరతపువర్గముతో నిక్కేరటా
సిరికి మగడయిన శ్రీపతి యేలి మ__
మ్మరయుచునున్నాడు మాయంతవారు వెరి
బలవంతుడైనవాడు భయములిన్నిట బాసి
గెలిచి పేరువాడుచు గెరిలీనటా
బలదేవుడైన శ్రీపతి మా యింటిలోన
అలరివున్నాడు మాయంతవారు వేరి
భూములేలేటివాడు భోగములతో దనిసి
కామించి యానందమున గరగీనటా
సేమముతో భూపతైన శ్రీవేంకటేశుడు మాకు
ఆముకొనివుండగా మాయంతవారు వేరీ
ఇహమును బరమును యిందే వున్నవి
వహికెక్క దెలియువారలు లేరు ||
చట్టువంటి దీచంచలపుమనసు
కొట్టులబడేది గుఱిగాదు
దిట్ట వొరులు బోధించిన గరగదు
పట్టబోయితే పసలేదు ||
చిగురువంటి దీజీవశరీరము
తగుళ్ళు పెక్కులు తతిలేదు
తెగనిలంపటమే దినమును బెనచును
మొగము గల దిదే మొనయును లేదు ||
గనివంటిది యీఘనసంసారము
తనిసితన్పినా దగ లేదు
ఘనుడగు శ్రీవేంకటపతి గావగ
కొనమొద లేర్పడె కొంకే లేదు ||
ఇహమెట్టిదో పరమెట్టిదో ఇక నాకు
సహజమై హరియే శరణము నాకు ||
చిత్తమిది యొకటే చింత వేవేలసంఖ్య
పొత్తుల హరిదలచ బొద్దులేదు
జొత్తుల కన్నుల రెండు చూపులైతే ననంతాలు
తత్తరించి హరిరూపు దగ్గరి చూడలేదు ||
చేతులివియు రెండే చేష్టలు లక్షోపలక్ష
యీతల హరి బూజింప నిచ్చలేదు
జాతి నాలిక వొకటే చవులు కోటానగోటి
రీతి హరినామ ముచ్చరించ వేళలేదు ||
వీనులివి రెండే వినికి కొలదిలేదు
పూని హరిభక్తి విన బుద్ధి లేదు
యీనటన శ్రీవేంకటేశు డిటు చూచినను
తానే యేలె నిక దడబాటు లేదు ||
ఇహమేకాని యిక బరమేకాని
బహుళమై హరి నీపైభక్తే చాలు ||
యెందు జనించిన నేమి యెచ్చోటనున్ననేమి
కందువనీదాస్యము గలిగితే జాలు
అంది స్వర్గమేకాని అలనరకమేకాని
అందపునీనామము నాకబ్బుటే చాలు ||
దొరయైనజాలు గడు దుచ్ఛపుబంటైన జాలు
కరగి నిన్నుదలచగలితే జాలు
పరులుమెచ్చినమేలు పమ్మిదూషించినమేలు
హరినీసేవాపరుడౌటే చాలు ||
యిల జదువులురానీ యిటు రాకమాననీ
తలపు నీపాదములతగులే చాలు
యెలమి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
చలపట్టి నాకు నీశరణమేచాలు ||
ఈ
ఈ జీవునకు నేది గడపల తనకు
నేజాతియును లేక యిట్లున్నవాడు ||
బహుదేహ కవచముల బారవేసినవాడు
బహుస్వతంత్రముల నాపదనొందినాడు
బహుకాలముల మింగి పరవశంబైనవాడు
బహు యోనికూపములబడి వెడలినాడు ||
పెక్కుబాసలు నేర్చి పెంపుమిగిలినవాడు
పెక్కునామములచే బిలువబడినాడు
పెక్కుకాంతలతోడ పెక్కుపురుషులతోడ
పెక్కులాగుల బెనగి చెండుపడినాడు ||
ఉండనెన్నడు దనకు ఊరటెన్నడులేక
యెండలకు నీడలకు యెడతాకినాడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయని
యండ జేరెదననుచు నాసపడినాడు ||
ఈ పాదమే కదా ఇలయెల్ల గొలిచినది
ఈ పాదమే కదా ఇందిరా హస్తముల సితవైనది॥
ఈ పాదమే కదా ఇందరును మ్రొక్కెడిది
ఈ పాదమే కదా ఈ గగనగంగ పుట్టినది
ఈ పాదమే కదా యెలమి పెంపొందినది
ఈ పాదమే కదా ఇన్నిటికిని యెక్కుడైనది॥
ఈ పాదమే కదా యిభరాజు దలచినది
ఈ పాదమే కదా యింద్రాదులెల్ల వెదకినది
ఈ పాదమే కదా యీబ్రహ్మ కడిగినది
ఈ పాదమే కదా యెగసి బ్రహ్మాండమంటినది॥
ఈ పాదమే కదా ఇహపరము లొసగెడిది
ఈ పాదమే కదా ఇల నహల్యకు కోరికైనది
ఈ పాదమే కదా యీక్షింప దుర్లభము
ఈ పాదమే కదా ఈ వేంకటాద్రిపై నిరవైనది॥
ఈ మాట విని నిన్ను నిందుకే నవ్వితి నేను
నేమమెంత నేమెంత నీకరుణ యెంత.
సకలకర్మముచేత సాధ్యముగానినీవు
వొకైంచుకంతభక్తి కొగిలోనైతి
ప్రకటించి బహువేదపఠన జిక్కనినీవు
మొకరివై తిరుమంత్రమునకు జిక్కితివి.
కోటిదానములచేత కోరి లోనుగాని నీవు
పాటించి శరణంటేనే పట్టి లోనైతి
మేటి వుగ్రతపముల మెచ్చి కైకొననినీవు
గాటపుదాసు లైతేనే కైకొని మన్నించితి.
పెక్కు తీర్థములాడిన భేదించరానినీవు
చొక్కి నీముద్రవారికి సులభుడవు
గక్కన దేవతలకు గానరానినీవు మాకు
నిక్కడ శ్రీవేంకటాద్రి నిరవైతివి.
ఈ విశ్వాసంబు యెవ్వరికి దోప దిది
పావనులహ్రుదయమున బ్రభవించుగానిని ||
ఇమ్మయినపాపంబు లెన్నివలసిన బ్రాణి
సమ్మతంబున జేయజాలుగాకేమి
కుమ్మరికి నొకయేడు గుదియ కొకనాడువును
నమ్మితలచినవిష్ణునామంబుచేత ||
కొదలేనిదురితములు కొండలును గోట్లును
చెదర కెప్పుడు బ్రాణి చేయుగాకేమి
పొదరి గొరియలలోన పులిచొచ్చినట్లౌను
హ్రుదయంబు హరిమీద నుండినంతటను ||
సరిలేనిదుష్కర్మ సంఘములు రాసులై
పెరుగజేయుచు ప్రాణి పెంచుగాకేమి
బెరసి కొండలమీద బిడుగువడ్డట్లౌను
తిరువేంకటాచలాధిపుని దలచినను ||
ప|| ఈ విశ్వాసంబు యెవ్వరికి దోప దిదిది | పావనులహృదయమున బ్రభవించుగాని ||
చ|| ఇమ్మయినపాపంబు లెన్నివలసిన బ్రాణి | సమ్మతంబున జేయజాలుగాకేమి | కుమ్మరికి నొకయేడు గుదియు కొకనాడవును | నమ్మితలచిన విష్ణునామంబుచేత ||
చ|| కొదలేనిదురితములు కొండలును గోట్లును | చెదర కెప్పుడు బ్రాణి చేయుగాకేమి | పొదరి గొరియలలోన పులిచొచ్చినట్లౌను | హృదయంబు హరిమీద నుండినంతటను ||
చ|| సరిలేనిదుష్కర్మ సంఘములు రాసులై | పెరుగజేయుచు ప్రాణి పెంచుగాకేమి | బెరసి కొండలమీద బిడుగుపడ్డట్లౌను | తిరువేంకటాచలాధిపుని దలచినను ||
ఈకెకు నీకు దగు నీడు జోడులు
వాకుచ్చి మిమ్ము బొగడ వసమా యొరులకు ||
జట్టిగొన్న నీదేవులు చంద్రముఖి గనక
అట్టె నిన్ను రామచంద్రుడనదగును
చుట్టమై కృష్ణయ్యవు చూపుల యాపె గనక
చుట్టుకొని నిన్ను కృష్ణుడనదగును ||
చందమైన వామలోచని యాపెయౌగనక
అందరు నిన్ను వామనుడనదగును
చెంది యాకె యెప్పటికిని సింహ మధ్య గనక
అంది నిన్ను నరసింహుడని పిల్వదగును ||
చెలువమైన యాపె శ్రీదేవి యగుగనక
అల శ్రీవక్షుడవని యాడదగును
అలమేల్మంగ యహిరోమావళి గలదిగన
యిల శేషాద్రి శ్రీవేంకటేశు డనదగును ||
ఈకెకు నీకు దగు నీడు జోడులు
వాకుచ్చి మిమ్ము బొగడ వసమా యొరులకు ||
జట్టిగొన్న నీదేవులు చంద్రముఖి గనక
అట్టె నిన్ను రామచంద్రుడనదగును
చుట్టమై కృష్ణయ్యవు చూపుల యాపె గనక
చుట్టుకొని నిన్ను కృష్ణుడనదగును ||
చందమైన వామలోచని యాపెయౌగనక
అందరు నిన్ను వామనుడనదగును
చెంది యాకె యెప్పటికిని సింహ మధ్య గనక
అంది నిన్ను నరసింహుడని పిల్వదగును ||
చెలువమైన యాపె శ్రీదేవి యగుగనక
అల శ్రీవక్షుడవని యాడదగును
అలమేల్మంగ యహిరోమావళి గలదిగన
యిల శేషాద్రి శ్రీవేంకటేశు డనదగును ||
ఈడగుపెండ్లి ఇద్దరి చేసేము
చేడెలాల ఇది చెప్పరుగా ||
పచ్చికబయళ్ళ పడతి ఆడగ
ముచ్చట కృష్ణుడు మోహించి
వెచ్చపు పూదండ వేసి వచ్చెనట
గచ్చుల నాతని కానరుగ ||
మ్త్తెపు ముంగిట ముదిత నడువగ
ఉత్తముడే చెలి వురమునను
చిత్తరవు వ్రాసి చెలగివచ్చె నొక
జొత్తుమాని ఇటు జూపరుగా ||
కొత్తచవికెలో కొమ్మనిలిచితే
పొత్తున తలబాలు వోసెనట
ఇత్తల శ్రీవేంకటేశుడు నవ్వుచు
హత్తి సతిగూడె నని పాడరుగా ||
ఈడేర వలచితే యే పని సేయగ రాదు
యేడనైన యెగ్గు సిగ్గులెంచేరా భూమిని
వనిత చెప్పితే జాలు వారిదైనా ఈదేవు
అనువుగా గొండ మోవుమన్న మోచేవు
తనివోక బూమెల్లా దవ్వుమన్న దవ్వేవు
వొనర బహురూపాన నుండుమన్నా నుండేవు
ఇంతి చెప్పితే జాలు యెంతైనా గొంచపడేవు
అంతలో బగర జంపుమన్నా జంపేవు
చెంత నాపె తపములు సేయుమన్నా జేసేవు
కాంత తన పసులను గావుమన్నా గాసేవు
అతివ జూచి కల్లలాడుమన్నా నాడెవు
బతిమి బారాడుమన్న బారాడేవు
పతివైన కోసువాని పల్లె శ్రీవెంకటనాథ
గతియై కూడుండుమన్నా గాగిట నుండేవు
ఈతగవే నాకు నీకు నెంచి చూచితే
కాతరపుజీవులకు గలదా వివేకము
భారము నీదిగనక పలుమారు బాపములే
చేరి మొక్కలాన నే జేసితిని
పేరడి దల్లిదండ్రులు బిడ్డ లేమిసేసినాను
వోరుచుక ముద్దుసేసుకుందురు లోకమున
కాన నీవుగలవని కడదాకా నేరములే
వేవేలు సేసితిని వెఱవక
భావించుక యింటిదొర పసురము దెంచుకొని
యేవిధి బైరుమేసినా నెగ్గుసేయ డతడు
పుట్టించేవాడవు నీవు పొదలేవారము నేము
యెట్టుండినా నీకు బోదు యెన్నటికిని
వొట్టుక శ్రీవేంకటేశ వోడగట్టినదూలము
అటునిట్టు బొరలినా నండవాయ దెపుడు
ఈతడఖిలంబునకు నీశ్వరుడై సకల
భూతములలోన దా బొదలువాడితడు ||
గోపాంగనలమెరుగు గుబ్బచన్నులమీద
చూపట్టుకమ్మ గస్తురిపూత యితడు
తాపసోత్తముల చింతాసౌధములలోన
దీపించు సుజ్ఞానదీప మితడు ||
జలధికన్యాపాంగ లలితేక్షణములతో
కలసి వెలుగుచున్న కజ్జలంబితడు
జలజాసనుని వదనజలధి మధ్యమునందు
అలర వెలువడిన పరమామృతంబితడు ||
పరివోని సురతసంపదల నింపులచేత
వరవధూతతికి పరవశమైన యితడు
తిరువేంకటాచలాధిపుడు దానె యుండి
పరిపాలనముసేయు భారకుండితడు ||
ఈతడే ముక్తి దోవ యీతడే మాయాచార్యు
డితడు గలుగబట్టి యిందరు బదికిరి ||
అదివో తాళ్ళపాక అన్నమాచార్యులు
యిది వీడె శ్రీవేంకటేశు నెదుట
వెద వెట్టి లోకములో వేదము లన్నియు మంచి
పదములు సేసి పాడీ పావనము సెసెను ||
అలరుచు దాళ్ళపాక అన్నమాచార్యులు
నిలచి శ్రీవేంకట నిధియే తానై
కలిదోషములు వాప ఘన పురాణము లెల్ల
పలుకుల నించి పాడినాడు హరిని ||
అంగవించె దాళ్ళపాక అన్నమాచార్యులు
బంగారు శ్రీ వేంకటేశు పాదములందు
రంగుమీర శ్రీవేంకట రమణుని యలమేలు
మంగను యిద్దరిబాడి మమ్ము గరుణించెను ||
ఈతడే రఘురాముడీతడేకాంగవీరుడు
యీతడు చేసిన చేత లెన్నియైనా కలవు
ఖరదూషణాదులను ఖండతుండముల సేసె
అరుదుగా వాలి నొక్కయమ్మున నేసె
సరవి కొండలచేత సముద్రము బంధించె
ఇరవై విభీషణునికిచ్చె లంకారాజ్యము
కూడపెట్టె వానరుల, కుంభకర్ణాదిదైత్యుల
తోడనే రావణుజంపె దురము గెల్చె
వేడుకతో సీతాదేవి కూడెను పుష్పకమెక్కె
యీడు జోడై సింహాసన మేలె నయోధ్యలోన
పుడమియంతయు( గాచె పొందుగా తనంతలేసి-
కొడుకుల( గాంచెను కుశలవుల
యెడయక శ్రీవేంకటేశుడై వరములిచ్చె
అడరి తారకబ్రహ్మమై ఇదె వెలసె
ఈతని గొలిచితేనే యిన్ని గొలలును దీరు
చేతనబెట్టుపుణ్యాలు చేరువనే కలుగు
పట్టి కాళింగుని దోలి పాముకొల దీర్చినాడు
బట్టబాయిటనే రేపల్లెవారికి
అట్టె పూతన జంపి ఆడుగొల దీర్చినాడు
గట్టిగా గృష్ణుడు లోకమువారికెల్లను
బలురావణు జంపి బాపనకొల దీర్చినాడు
యిలమీద గలిగినఋషులకెల్లా
కొలదిమీరినయట్టికోతికొల దీర్చినాడు
సొలసి రాఘవుడదె సుగ్రీవునికిని
వొలిసి పురాలు చొచ్చి పూర గొల దీర్చినాడు
అల తనదాసులైన అమరులకు
సిలుగుగొలలు దీర్చి సేన వరా లిచ్చినాడు
చెలగి పరుషలకు శ్రీవేంకటేశుడు
ఈతని మహిమలు ఎంతని చెప్పెద
చేతుల మ్రొక్కెద చెలగుచు నేను ||
శ్రీ నరసింహుడు చిన్మయ మూరితి
నానా విధకర నఖరుడు
దానవ దైత్య విదారుడు విష్ణుడు
తానకమగు మా దైవంబితడు ||
అహోబలేశుడు ఆదిమపురుషుడు
బహు దేవతాసార్వ భౌముడు
సహజానందుడు సర్వరక్షకుడు
ఇహపరము లొసగు యేలిక యితడు ||
కేవలుడగు సుగ్రీవనృసింహుడు
భావించ సుజన పాలకుడితడు
శ్రీవేంకటేశుడు చిత్తజ జనకుడు
వేవేలకు వేల్పు ఇతడు ||
ఈతని మహిమలు ఎంతని చెప్పెద
చేతుల మ్రొక్కెద చెలగుచు నేను ||
శ్రీ నరసింహుడు చిన్మయ మూరితి
నానా విధకర నఖరుడు
దానవ దైత్య విదారుడు విష్ణుడు
తానకమగు మా దైవంబితడు ||
అహోబలేశుడు ఆదిమపురుషుడు
బహు దేవతాసార్వ భౌముడు
సహజానందుడు సర్వరక్షకుడు
ఇహపరము లొసగు యేలిక యితడు ||
కేవలుడగు సుగ్రీవనృసింహుడు
భావించ సుజన పాలకుడితడు
శ్రీవేంకటేశుడు చిత్తజ జనకుడు
వేవేలకు వేల్పు ఇతడు ||
ఈదేహ వికారమునకు నేదియు గడపల ఘనము
మోదమెరంగని మోహము ముందర గననీదు ||
నిత్యానిత్యవివేకము నీరసునకు నొనగూడదు
సత్యాలాపవిచారము జరగదు లోభికిని
హత్యావిరహిత కర్మము అంటదు క్రూరాత్మునకును
ప్రత్యక్షంబగు పాపము పాయదు కష్టునకు ||
సతతానందవికాసము సంధించదు తామసునకు
గతకల్మష భావము దొరకదు వ్యసనికిని
జితకాముడు దానవుటకు సిద్ధింపదు దుష్కర్మికి
అతులితగంభీర గుణంబలవడ దధమునకు ||
శ్రీవేంకటగిరి వల్లభుసేవా తత్పరభావము
ద్రోవ మహాలంపటులకు తోపదు తలపునకు
దేవోత్తముడగు నీతని దివ్యామృతమగు నామము
సేవింపగ నితరులకును చిత్తంబొడబడదు ||
ఈపెకు నితడు దగు నితనికీపె దగు
చూపులకు పండుగాయ శోభనము నేడు ||
పిలువరె పెండ్లి కూతుబెండ్లిపీటమీదకి
చెలగి తానెదురు చూచీ దేవుడు
బలువుగా నిద్దరికి బాసికములు గట్టరె
కలిమెల్ల మెరసి సింగారించరే ||
ఆతలదెచ్చి పెట్టరె ఆ పెండ్లి కూతురును
యీతడే జంట సోభన మిద్దరికిని
కాతరాన బువ్వానకు గక్కన బెట్టరె మీరు
రేతిట నుండియు వేగిరించేరు వీరు ||
పానుపు పరచరె బలునాగవల్లి నేడు
పూని తెరవేయరె పోలతులాల
ఆనుక శ్రీవేంకటేశుడలమేలుమంగయును
లోననె భూకాంతయును లోలువైరి తాము ||
ఈభవమునకు జూడ నేది గడపల తనదు
ప్రాభవం బెడలించి బాధ పెట్టించె ||
చెప్పించె బ్రియము వలసినవారలకునెల్ల
రప్పించె నెన్నడును రానిచోట్లకును
నొప్పించె నాసలకు వోరంత ప్రొద్దునను
తిప్పించె కోరికల తిరిగి నలుగడల ||
పుట్టించె హేయంపుభోగయోనులనెల్ల
కట్టించె సంసారకలితబంధముల
పెట్టించె ఆసలను పెడకొడముల దన్ను
తిట్టించె నిజద్రవ్యదీనకులచేత ||
బెదరించె దేహంబు పెనువేదనలచేత
చెదరించె శాంతంబు చెలగి చలమునను
విదళించె భవములను వేంకటేశ్వరు గొలిచి
పదిలించె నతనికృప పరమసౌఖ్యములు ||
ఈరూపమై వున్నాడు యీతడే పరబ్రహ్మము
శ్రీరమాదేవితోడ శ్రీవేంకటేశుడు ||
పొదలి మాయాదేవిపట్టిన సముద్రము
అదె పంచభూతాలుండే అశ్వత్థము
గుదిగొన్నబ్రహ్మాండాలగుడ్ల బెట్టెహంస
సదరపుబ్రహ్మలకు జలజమూలకందము ||
అనంతవేదాలుండేటిఅక్షయవటపత్రము
ఘనదేవతలకు శ్రీకరయజ్ఞము
కనలుదానవమత్తగజసంహరసింహము
మొనసి సంసారభారము దాల్చే వృషభము ||
సతతము జీవులకు చైతన్యసూత్రము
అతిశయభక్తులజ్ఞానామృతము
వ్రతమై శ్రీవెంకటాద్రి వరములచింతామణి
తతిగొన్న మోక్షపుతత్త్వరహస్యము||
ఈసుర లీమును లీచరాచరములు
యిసకలమంతయు నిది యెవ్వరు ||
ఎన్నిక నామము లిటు నీవై యుండగ
యిన్ని నామము లిటు నీవై యుండగ
వున్నచోటనే నీవు వుండుచుండుగ మరి
యిన్నిటా దిరుగువా రిది యెవ్వరు ||
వొక్కరూపై నీవు వుండుచుండగ మరి
తక్కిన యీరూపములు తామెవ్వరు
యిక్కడనక్కడ నీవు యిటు ఆత్మలలోనుండ
మక్కువ నుండువారు మరి యెవ్వరు ||
శ్రీవేంకటాద్రిపై చెలగి నీ వుండగా
దైవంబులనువారు తామెవ్వరు
కావలసినచోట కలిగి నీవుండగ
యీవిశ్వపరిపూణు లిది యెవ్వరు ||
ఈహీ శ్రీహరిగంటే యింత లేదుగా వట్టి
దాహపుటాసల వెఱ్రి దవ్వు టింతేకాకా
పలుమారు నిందరిని భంగపడి వేడేది
యిలపై దేహమువెంచేయిందు కింతేకా
కలికికాంతలచూపుఘాతలకు భ్రమనేది
చెలగి మైమఱచేటిచేత కింతేకా
పక్కన జన్మాలనెల్లా బాటువడేదెల్లాను
యెక్కడో సంసారాన కిందు కింతేకా
వొక్కరి గొలిచి తిట్టు కొడిగట్టే దెల్లాను
చక్కుముక్కునాలికెపైచవి కింతేకా
గారవాన ధనములు గడియించేదెల్లాను
ఆరయ నాదని వీగేయందు కింతేకా
చేరి శ్రీవేంకటపతి సేవకు జొరనిదెల్లా
భారపుగర్మపుభాద బట్టువడికా
ఉ
ఉండ బాసీనడవిలో నొకతెనేను
ఎండలు నీడలు గాసీ నేమి సేతురా ||
చిన్ని నానడుము చూచి సింహము దగ్గరెనంటా
ఉన్నతపు గుచముల కొరసెగరి
మున్నిటి వొందులు వైరమునుజేసె మ్రుగపతి
యిన్నిటికి నగ్గమైతి నేమిసేతురా ||
నిండు నానడపుచూచి నెమలి దగ్గరవచ్చె
బండు సేసి నారుసూచి పాయదు పాము
రెండు జూచి పగయు గూరిమి దోచెనింతలోనే
యిండె పట్టె నిన్నిటికి నేమి సేతురా ||
కోరి నా పలుకువిని కోవిల దగ్గరవచ్చె
చేరీ నా మోవికిదె చిలుకనేడు
గారవాన నిన్నియు వేంకటగిరి విభుడా
యేరా యిట్టె చేకొంటి వేమిసేతురా ||
ఉగ్గు వెట్టరే వోయమ్మా చె
య్యొగ్గీనిదె శిశు వోయమ్మా
కడుపులోని లోకమ్ములు గదలీ
నొడలూచకురే వోయమ్మా
తొడికెడి సరుగున దొలగ దీయరే
వుడికెడి పాలివి వోయమ్మా
చప్పలు వట్టుక సన్నపు బాలుని
నుప్పర మెత్తకు రోయమ్మా
అప్పుడె సకలము నదిమీనోరనె
వొప్పదు తియ్యరె వోయమ్మా
తొయ్యలు లిటు చేతుల నలగించక
వుయ్యల నిడరే వోయమ్మా
కొయ్య మాటలను కొండల తిమ్మని
నొయ్యన తిట్టకు రోరమ్మా
ఉదయాద్రి తెలుపాయె ఉడు రాజు కొలు వీడె |
అద నెరిగి రాడాయె నమ్మ నా విభుడు ||
చన్నులపై ముత్యాల సరులెల్ల జల్లనాయె |
కన్నులకు గప్పొదవె గాంత నా కిపుడు |
కన్నె కలువల జాతి కనుమోడ్చినది మీద |
వెన్నెల వేసంగి మొగ్గ వికసించె గదవె ||
పువ్వుల లోపలి కురులు బుగులు కొనగా నెర్కసె |
దవ్వుల దుమ్మెదగములు తరమి డాయగను |
రవ్వసేయ శుక పికము రాయడి కోర్వగ రాదు |
అవ్వలనెవ్వతె పసల కలరున్నవాడో ||
పన్నీట జలక మార్చి పచ్చకప్రము మెత్తి |
చెన్ను గంగొప్పున విరులు చెలువందురిమి |
ఎన్నంగల తిరువేంకటేశుం డిదె ననుంగూడి |
కన్నుల మనసునుం దనియం గరుణించెం గదవే ||
ఉన్న మాటలికనేల ఓ దేవా
యెన్నటికిదే మాట నింకా నింకా
కొంత నా కర్మ ఫలము కొంత నీ రక్షకత్వము
ఇంతలో రెండు గలవా ఏమో దేవా
అంతర్యామివి నీవు ఆడేటి బొమ్మను నేను
చెంతగాచుట నీపని, సేవసేయ నా పని
నేనపరాధినయ్యేది నీవూహించుకోనేది
తేనెపాలు రెండూనేలయేమో దేవా
మానక ఇట్లైతే నీ మహిమకు గురుతేది
నానీ చింతించేనందులకపకీర్తియనుచో
మెదలే నా యధమము నీఘనత ఎంచి కావు
ఇదియే నా విన్నపము యేమో దేవా
యెదుట శ్రీ వెంకటేశా ఇన్నిట నీ బంటు బంట
పదివేలూ నా నేరాలు పట్టకుమీ ఇకను
వినా వేంకటేశం ననాథో ననాథ..
సదా వెంకటేశం స్మరామి స్మరామి
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ
అజ్ఞానినామయాదోషాన్ అశేషాన్
క్షమస్సత్వం క్షమస్సత్వం శేషశైల శిఖామణే
ఉన్నచోనే మూడు లోకాలూహించి చూచితే నీవే
కన్నచోటనే వెదకి కానడింతే కాక.
యెక్కడ వొయ్యెడి జీవుడేది వైకుంఠము
యిక్కడ హరి యున్నాడు హృదయమందె
ముక్కున నూరుపు మోచి ముంచి పుణ్యపాపాల_
కక్కసాన జిక్కి తమ్ము గాన డింతే కాక.
యేమి విచారించీ దేహి యెందు దేవుని వెదకీ
కామించి యాత డిన్నిటా గలిగుండగా
దోమటి సంసారపుదొంతికర్మముల జిక్కి
కాముకుడై కిందుమీదు గాన డింతే కాక.
యేవిధులు తా జేసీ యెవ్వరి నాడగబోయీ
శ్రీవేంకటేశ్వరుసేవ చేతనుడగా
భావ మాతడుగాను బ్రతికె నిదవో నేడు
కావరాన నిన్నాళ్ళు కాన డింతే కాక
ఉన్నతోన్నతుడు ఒడయవరు
యెన్న ననంతుడే యీ ఒడయవరు
సర్వలోకముల శాస్త్రరహస్యము
లుర్వి( బొడమె నీ ఒడయవరు
పూర్వపు వేదాంత పుణ్యశాస్రములు
నిర్వహించె నన్నిటా నొడయవరు
వెక్కస(పు శ్రీవిష్ణుభక్తియే
వొక్కరూపమే ఒడయవరు
చక్కనైన సుజ్ఞానమున కిరవై
వుక్కు మీఱెనిదె నొడయవరు
కదినె మోక్షసాకారము దానై
వుదుటున నిలిచె నీ వుడయవరు
యిదిగో శ్రీవేంకటేశ్వరు యీ(నీ)డై
పొదలుచు నున్నాడు భువి నొడయవరు
ఉన్నమంత్రాలిందు సదా(రా) వొగివిచారించుకొంటే
విన్నకన్నవారికెల్ల విష్ణునామమంత్రము
పరగ పుచ్చకాయల పరసిపోదు మంత్రము
గరిమ ముట్టంటులేని ఘనమంత్రము
వరుస నెవ్వరు విన్నా వాడిచెడనిమంత్రము
అరయనిదొక్కటేపో హరినామమంత్రము
యేజాతినోరికైన నెంగిలి లేని మంత్రము
వోజదప్పితే జెడకవుండే మంత్రము
తేజాన నొకరికిస్తే తీరిపోనిమంత్రము
సాజమైన దిదెపో సత్యమైన మంత్రము
యిహము పరము తానే యియ్యజాలిన మంత్రము
సహజమై వేదాలసారమంత్రము
బహునారదాదులెల్ల పాటపాడినమంత్రము
విహితమయిన శ్రీవేంకటేశుమంత్రము
ఉన్నవిచారములేల వోహో సంసారులాల
యిన్నిటి కితడే రక్ష యిదే మీకు మనరో ||
తక్కక బ్రహ్మలగన్న తండ్రి గొలిచి మీరు
యెక్కువ సంతతిగల్గి యీడేరరో
అక్కున లక్ష్మీనారాయణుల దలచి మీరు
చొక్కి మీమీదంపతులు సుఖమున నుండరో ||
భవరోగవైద్యునిపాదములు సేవించి
భువి రోగముల బాసి పొదలరో
తవిలి పదిదిక్కులు తానైనవాని
గవిసి పొగడి దిక్కుగలిగి బ్రదుకరో ||
తల్లిదండ్రీ నీతడే తగ జుట్ట మీతడే
యెల్లగా బుట్టించి పెంచేయేలి కీతడే
చల్లగా శ్రీవేంకటేశు శరణంటి మిదె మేము
కొల్లగా మీరెల్లా మమ్ము గుఱిగా వర్ధిల్లరో ||
ఉప్పవడము గాకున్నారిందరు
యెప్పుడు రేయి నీకెప్పుడు పగలు ||
వున్నతి చంద్రుడును కమలమిత్రుడును
వున్నతి నివి నీకుండగను
వెన్నెలయెండలు వెలయగ మేల్కొను
టెన్నడు నిద్దుర యెన్నడు నీకు ||
కందువ సతికనుగలువలు ముఖార
విందము నిదివో వికసించె
ముందర నిద్దుర మొలవదు చూచిన
విందగు నీతెలివికి దుదయేది ||
తమము రాజసము తగుసాత్వికమును
నమరిన నీమాయారతులు
కమలాధిప వేంకటగిరీశ నిన్ను
ప్రమదము మఱపును బైకొనుటెట్లా ||
ప|| ఉమ్మడినే యేమనినా మారకుండను | అమ్మరో యెంతట గబ్బియనకు మీ నన్నను ||
చ|| మాటలు నీ వాడితేను మంచి తేనెలుగారీని | గాటమై నీ చేతవై తే కారమయ్యీని |
యీటు వెట్టితే జవి యిదొకటీ నదొకటీ | కూటమి కాననరాదు కోపగించరాదు ||
చ|| కన్నుల నీవు చూచితే కడు వెన్నెల గాసీని | యెన్నబోతే నీ సుద్దులు యెండగాసీని |
పన్నినవి నీ గుణాలు పచ్చియును వెచ్చియును | అన్నీ జేతబట్టరాదు అటు దోయరాదు ||
చ|| నీ వాసలు వెట్టితేను నిలువు నూరు వండీని | భావించి నీ సింగారాలు పాలుకొనీని |
యీవల శ్రీ వేంకటేశ యింతలో నన్నేలితివి | చేవదేరె ననరాదు చిగురనరాదు ||
ఉయ్యాల యూఁపులు ఓ ముద్దులయ్యా
వెయ్యారు గోపికలు వేడుక నూఁచెదరు // పల్లవి //
భోగీంద్ర తల్పుఁడా భువన విఖ్యాతా
గోగోపరక్షకా కువలయాధీశా
ఆగమసన్నుతా యచ్యుతానంతా
యోగనిద్ర పోవయ్య యోగీంద్రవంద్య // ఉయ్యా //
దెసలందు వెలిఁగెడి దేవర్షివరులు
ప్రసరించి బంగారు భవనంబులోన
కొసరక నిద్రించు గోవిందా యనుచు
పసమీర పాడెదరు పన్నగశయనా // ఉయ్యా //
సన్నుతించెదరయ్యా సద్భాగవతులు
పన్నుగా శ్రీభూమి వనితలు చేరి
ఉన్నతి పదముల నొత్తెదరు నిద్రించు
వెన్నుఁడా ప్రసన్న వేంకటరమణా // ఉయ్యా //
ఉయ్యాలా బాలునూచెదరు కడు
నొయ్య నొయ్య నొయ్యనుచు
బాలయవ్వనలు పసిడివుయ్యాల
బాలుని వద్ద పాడేరు
లాలి లాలి లాలి లాలెమ్మ
లాలి లాలి లాలి లాలనుచు
తమ్మిరేకు గనుదమ్ముల నవ్వుల
పమ్ము జూపుల బాడేరు
కొమ్మలు మట్టెల గునుకుల నడపుల
ధిమ్మి ధిమ్మి ధిమ్మి ధిమ్మనుచు
చల్లు జూపుల జవరాండ్లురే
పల్లె బాలుని బాడేరు
బల్లిదు వేంకటపతి జేరి యందెలు
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లనుచు
ఊ
ఊరకుండు మనవే వొడబాటులిక నేలే
కోరికలు గోరుకొంటా గొణగే గాని ||
ఆగపడితిమి తొల్లే ఆయను తన పొందు
యెగసెక్కే లాడక తానిక నెన్నడే
జగడింప నోపము జవ్వనము మోచుకొని
మొగము చూచి చూచి మూలిగే గాని ||
సేవలెల్లా జేసేము చెల్లుబడి గలవాడు
యీ వలనవ్వులు నవ్వకిక నెన్నడే
చేపట్టి తియ్యనేల సిగ్గులుపై వేసుకొని
దేవరంట మొక్కుకొంటా దీవించే గాక ||
కూడితిమి కౌగిటను గురుతు చన్నుల నంటె
యీడనే ప్రియాలు సేయకిక నెన్నడే
జోడై శ్రీ వేంకటేశు చుట్టరికపు దనాన
మేడెపు రతులలోన మెచ్చేము గాక ||
ఊరకున్న వారితోడ వూరునోప దెఱగవా
చేరినాతో ముద్దులెల్లా జెప్పేవు గాక ||
వద్దని నీతో నేను వాదులాడిచేనా
గద్దించి యప్పటి నిన్ను గాదనేనా
తిద్ది నీ గుణాలు నేడు తీరుచ వచ్చేనా
వొద్దనే నీ వెట్టుండినా మంటివి గాక ||
చలపట్టి నిను నేను సాధించ వచ్చేనా
కలవి లేనివి తారుకాణించేనా
నిలువుకు నిలువే న్నిను నేరాలెంచేనా
వెలివెంత నవ్వినా నవ్వితివి గాక ||
పంతమాడి సారెసారె బంగించ దొరకొనేనా
వంతులకు నంతేసి వాసి పట్టేనా
యింతలో శ్రీవేంకటేశ యెనసితి విటునన్ను
యెంత చనువిచ్చినాను ఇచ్చేవుగాక ||
ఊరకే దొరకునా వున్నతోన్నత సుఖము
సారంబు దెలిసెగా జయము చేకొనుట ||
తలపులోని చింత దాటినప్పుదు గదా
అలరిదైవంబు ప్రత్యక్షమౌట
కలుషంపు దుర్మదము గడచినప్పుడు గదా
తలకొన్న మోక్షంబు తనకు చేకొనుట ||
కర్మంబు కసటువో గడిగినప్పుడు గదా
నిర్మల జ్ఞానంబు నెరవేరుట
మర్మంబు శ్రీహరి నీమరగు జొచ్చినగదా
కూర్మి దనజన్మమెక్కుడు కెక్కుడౌట ||
తనశాంత మాత్మలో దగలినప్పుడు గదా
పనిగొన్న తనచదువు ఫలియించుట
యెనలేని శ్రీవేంకటేశ్వరుని దాస్యంబు
తనకు నబ్బినగదా దరిచేరిమనుట ||
ఊరకే నన్నిటు దూరి వుప్పతించేవు
యేరీతి తక్కరియౌటా యెఱఁగవు నీవు // పల్లవి //
అతఁడు వాసులెక్కించి ఆటకానకుఁ బెట్టితే
యేతులకుఁ గాఁతాళించి యేలచూచేవే
రాతిరిఁబగలుఁ దాను రచ్చ లెందోసేసి వచ్చి
యీతల సటలుసేసే దెఱఁగవు నీవు // ఊర //
తానే సన్నలు సేసి తగవులఁ బెట్టితేను
పేనిపట్టుక నీవేల పెనఁగాడేవే
ఆనుకొని వాడవారి నందరిఁ బెండ్లాడివచ్చి
యీనేరుపులు చూపేది యెఱఁగవు నీవు // ఊర //
శ్రీవేంకటేశ్వరుఁడు చేరి యిద్దరిఁ గూడితే
చేవమీర నీవేల సిగ్గువడేవే
వేవేలుసతులకు వేరేసేసవెట్టి వచ్చి
యీవిధాన మొఱఁగేది యెఱఁగవు నీవు // ఊర //
ఊరకే నీశరణని వుండుటే నాపనిగాక
యీరీతి నావుపాయము లేడ కెక్కీనయ్యా
ముందే అంతర్యామివై మొగి నాలో నుండగాను
చెంది నిన్ను లేనివానిజేసుక నామనసులో
గొంది నీయాకారముగా కొంత నే భావించుకొంటా
ఇందు గల్పిత ధ్యానము లెట్టు చేసేనయ్యా
కన్నులు జూచినందెల్ల కమ్మి నీవై యుందగాను
అన్నిటా బ్రత్యక్షమందు అభావన చేసుకొని
విన్ననై తెలియలేక వేరే యెందొ వెదకుచు
పన్నినప్రయాసాల బడనేటికయ్యా
శ్రీ వేంకటాద్రిమీద శ్రీపతివై కొలువుండి
ఆవటించి తలపులో నచ్చొత్తి నట్టుండగాను
దేవు డెట్టివాడంటా తెగనిచదువులందు
సోవలుగా నింకనేమి సోదించేనయ్యా
ఊరకే పోనియ్యరా నన్నుద్దండాన
చేరలంతేసి కన్నుల జెంగలించే విప్పుడు ||
జూదమాడ బిలిచేవు చూపులనే జంకించేవు
పేదవారి మేన సొమ్ము పెట్టనియ్యవా
కేదమున నోడి గెలిచితి నంటా నా
పాదమంటి తీసుకోరా బంగారు మట్టెలు ||
నెత్తమాడ బిలిచేవు నెఱవాది నంటాను
అత్తమామ గలవార మదేమిరా
ఒత్తి విన్నవించలేము ఓడితేను నీకు నాకు
రిత్తమాట వద్దు రేఖ రేఖ పందెమా ||
సొక్కటాలు నిన్ననాడి సోలి సత్యభామకు
మ్రొక్కితివి నేడు నాకు మ్రొక్కవలెగా
చక్కని వేంకటపతిస్వామి నన్నుంగూడితివి
మొక్కెద కర్పూర తాంబూలమీరా చాలును ||
ఊరకే వెదకనేల వున్నవి చదవనేల
చేరువనె వున్నదిదె చెప్పరాని ఫలము // పల్లవి //
కోపము విడిచితేనె పాపము దానే పోవు
దీపింప సుజ్ఞానముతెరు విదివో
లోపల మనిలుఁడై లోకముమెచ్చుకొరకు
పైపైఁగడిగితేను పావనుఁడౌనా // ఊర //
ముందరికోరిక వోతే ముంచిన బంధాలు వీడు
కందువ నాస మానితే కైవల్యము
బొందిలోన నొకటియు భూమిలోన నొకటియు
చిందు వందు చిత్తమైతే చేరునా వైకుంఠము // ఊర //
కాంతలపొం దొల్లకుంటే ఘనదుఃఖమే లేదు
అంతరాత్మ శ్రీవేంకటాద్రీశుఁడు
అంతట మాటలె యాడి హరి శరణనకుంటే
దొంతినున్నభవములు తొలఁగునా వివేకికి // ఊర //
ఊరికి బోయెడి వోతడ కడు
చేరువతెరు వేగి చెలగుమీ ||
ఎడమతెరువువంక కేగిన దొంగలు
తొడిబడ గోకలు దోచేరు
కుడితెరువున కేగి కొట్టువడక మంచి
నడిమితెరువుననే నడవుమీ ||
అడ్డపుదెరువుల నటునిటు జుట్టాలు
వెడ్డువెట్టుచు నిన్ను వేచేరు
గొడ్డేరేచిన్నదిడ్డితెరువు వోక
దొడ్డపుతెరువువంక తొలగుమీ ||
కొండతెరువు కేగి కొంచెపుసుఖముల
బండై తిరుగుచు బడలేవు
అండనుండెడి పరమాత్ముని తిరుమల
కొండతెరువు తేకువ నేగుమీ ||
.——————————————————————————————————————————-
ఊరులేని పొలిమేర పేరు పెంపులేని బ్రతుకు
గారవంబులేని ప్రియము కదియనేటికే ||
ఉండరాని విరహవేదన వుండని సురతసుఖమేల
యెండలేని నాటి నీడ యేమిసేయనే
దండిగలుగు తమకమనెడి దండలేని తాలిమేల
రెండు నొకటిగాని రచన ప్రియములేటికే ||
మెచ్చులేని చోట మంచిమేలు కలిగీనేమి సెలవు
మచ్చికలేని చోట మంచిమాట లేటికే
పెచ్చు పెరగలేని చోట ప్రియముగలిగి యేమి ఫలము
ఇచ్చలేనినాటి సొబగులేమి సేయనే ||
బొంకులేని చెలిమిగాని పొందులేల మనసులోన
శంకలేక కదియలేని చదువులేటికే
కొంకు గొసరులేని మంచికూటమలర నిట్లుగూడి
వేంకటాద్రి విభుడు లేని వేడుకేటికే ||
ఎ
ఎండగాని నీడగాని యేమైనగాని
కొండల రాయడె మాకులదైవము ||
తేలుగాని పాముగాని దేవపట్టయినగాని
గాలిగాని ధూళిగాని కానియేమైన
కాలకూటవిషమైనా గ్రక్కున మింగిన నాటి
నీలవర్ణుడేమా నిజదైవము ||
చీమగాని దోమగాని చెలది యేమైనగాని
గాముగాని నాముగాని కానియేమైన
పాములనిన్నిటి మ్రింగె బలుతేజిపై నెక్కు
ధూమకేతువేమో దొరదైవము ||
పిల్లిగాని నల్లిగాని పిన్న యెలుకైన గాని
కల్లగని నల్లిగాని కానియేమైన
బల్లిదుడై వేంకటాద్రి పైనున్న యాతడి
మమ్మెల్ల కాలము నేలేటి యింటిదైవము ||
ఎండలోనినీడ యీమనసు
పండుగాయ సేయబనిలేదు మనసు ||
వానచేతకములవలెనాయ మనసు
గోనెబట్టిన బంకగుణమాయ మనసు
మానజిక్కినకోలమతమాయ మనసు
తేనెలోపలి యీగతెరుగాయ మనసు ||
గడిరాజుబదుకాయ కడలేని మనసు
నడివీది పెసరాయ నయమైనమనసు
గడకుగట్టిన పాతగతిదోచె మనసు
అడసులోపలి కంబమై తోచెమనసు ||
తెరువుచూపినజాడ దిరుగు నీమనసు
మరుగుజేసినచోట మరుగు నీమనసు
తిరువెంకటేశుపై దిరమైన మనసు
సిరిగలిగినచోట జేరు నీమనసు ||
ఎంత చదివి చూచిన నీతడే ఘనముగాక
యింతయు నేలేటిదైవ మిక వేరే కలరా ||
మొదల జగములకు మూలమైనవాడు
తుద ప్రళయమునాడు తోచేవాడు
కదిసి నడుమ నిండి కలిగివుండెడివాడు
మదనగురుడేకాక మఱి వేరే కలరా ||
పరమాణువైనవాడు బ్రహ్మాండమైనవాడు
సురలకు నరులకు జోటయినవాడు
పరమైనవాడు ప్రపంచమైనవాడు
హరి యొక్కడేకాక అవ్వలను గలరా ||
పుట్టుగులయినవాడు భోగమోక్షాలైనవాడు
యెట్టనెదుర లోనను యిన్నిటివాడు
గట్టిగా శ్రీ వేంకటాద్రి కమలాదేవితోడి
పట్టపుదేవుడేకాక పరులిక గలరా ||
ఎంత చదివిన నేమి వినిన తన
చింత యేల మాను సిరులేల కలుగు ||
ఇతర దూషణములు ఎడసిన గాక
అతి కాముకుడు గాని యప్పుడు గాక
మతి చంచలము కొంత మానిన గాక
గతి యేల కలుగు దుర్గతులేల మాను ||
పర ధనముల యాస బాసిన గాక
అరిది నిందలు లేని యప్పుడు గాక
విరస వర్తనము విడచిన గాక
పర మేల కలుగు నాపద లేల మాను ||
వేంకటపతి నాత్మ వెదికిన గాక
కింక మనసున తొలగిన గాక
బొంకు మాటలెడసి పోయిన గాక
శంక యేల మాను జయమేల కలుగు ||
ఎంత జాణరో యీకలికి
కాంతుడ నీ భోగములకే తగునూ ||
చెలి నీ కౌగిట చెమటలజేసెను
చలువగ నిప్పుడు జలకేళి
అలరుచు గుచముల నదుముచు జేసెను
పలుమరు ముదముల బర్వతకేళి ||
పైపై బెనగుచు బాహులతలనే
వైపుగ జేసెను వనకేళి
చూపుల నీపయి సొలయుచు జేసెను
పూప వసంతము పూవులకేళి ||
అరుదుగ నట్టివి యధరామృతముల
సరిజేసెను భోజనకేళి
కరగుచు శ్రీవేంకటేశ సేసేను
పరగిన రతులనె పరిణయ కేళి |
ఎంత బాపనా సోద మింత గలదా
అంతయు నీమహిమే హరిభట్లూ
సూరిభ ట్లొకవంక చొరనిచోట్లు చొచ్చి
వారబియ్య మెత్తి యెత్తి వడదాకి
నీరువట్టుగొని భూమి నీళ్లెల్లా వారాట్టీ
కేరికేరి నగాయ్యా క్రిష్ణభట్లూ
దేవరొజ్ఝ లొకవంక దిక్కులలో బొలగూడు
దీవెనతో నారగించి తీవుమరిగి
యీవల బెట్టినవారి కేమైనా నొసగీని
వేవేలమాయలవిష్ణుభట్లూ
సోమయాదు లొకవంక సొరిది సురలకెల్లా-
నామనితో విందువెట్టీ ననుదినము
హోమపువిప్రులసొమ్ము లొడిసి తా బుచ్చుకొనీ
వేమరు శ్రీవేంకటాద్రివెన్నుభట్లూ
ఎంత బోధించి యేమిసేసిన దన
దొంతికర్మములు తొలగీనీ ||
సతతదురాచారజడునకు బుణ్యసం
గతి దలపోసిన గలిగీనా
అతిపాపకర్మబోధకుడై వెలయుదుష్టు
మతి దలపోసిన మరి కలిగీనా ||
బహుజీవహింసాపరుడైనవానికి
యిహపరములు దైవ మిచ్చీనీ
విహితకర్మములువిడిచినవానికి
సహజాచారము జరిగీనా ||
దేవదూషకుడై తిరిగేటివానికి
దేవతాంతరము దెలిసీనా
శ్రీవేంకటేశ్వరు జింతింపకుండిన
పావనమతియై బ్రతికీనా ||
ఎంత భక్తవత్సలుడ విట్టుండవలదా
వింతలు నీసుద్దులెల్లా వినబోతే నిట్టివే ||
యిల నసురారియనేయీబిరుదు చెల్లె నీకు
బలివిభీషణాదులపాలికే చెల్లదు
కెలసి అవులే నీవు గెలుతు వెందరినైనా
తలచి చూడ నీదాసుల కోడుదువు ||
ఇందరపాలిటికిని యీశ్వరుడ వేలికవు
పందవై యర్జునుబండిబంట వైతివి
వందనకు నౌలే దేవతలకే దొరవు
అందపునీదాసులకు నన్నిటా దాసుడవు ||
కడుపులో లోకముకన్నతండ్రి విన్నిటాను
కొడుకవు దేవకికి గోరినంతనే
తడవితే వేదములు తగిలేబ్రహ్మమవు
విడువనిమాకైతే శ్రీవేంకటాద్రిపతివి ||
ఎంత మానుమన్న జింతలేల మానునే
పంతపుమనసు హరిపై నుంటేగాక ||
తీరనిబంధాలు నేడే తెగుమంటే నేలతెగు
భారపుమమత బెడబాసినగాక
వూరటగా మమత నేనొల్లనంటే నేలమాను
వోరుపుతో లంపటము లొల్లకుంటేగాక ||
వేకపుగోపము నేడే విడుమంటే నేలవిడు
తోకచిచ్చయినయాస దుంచినగాక
ఆకట నానేలమాను అన్నిటాను యిందరికి
మాకుపడి తత్తరము మరచుంటేగాక ||
పెట్టనిది దైవమిట్టే పెట్టుమంటె నేలపెట్టు
యిట్టే వేంకటపతి యిచ్చినగాక
యిట్టునిట్టు నీతడు దానిందరికి నేలయిచ్చు
వొట్టినవిరక్తి నేమీ నొల్లకుంటేగాక ||
ఎంత మీదు కట్టెనో యింతి నీకు జవ్వనము
కాంతుడవేమి సేసితో కానుకలంపె చెలి ||
నిద్దరించవలసినా నీ కౌగిటనే కాని
వొద్ద నిన్ను బాసి వొంటినొల్లదు చెలి
కొద్దిగా మాటాడినాను కోరి నీతోనే కాని
ముద్దరించి పరులతో మోసమే చెలి ||
ఆరగించవలసినా అటు నీ పొత్తునగాని
వూరకే వేరెయైతే నొల్లదు చెలి
సారె విడెమిచ్చినాను సగమాకు నీకియ్యక
చేరి వేరే తమ్ములము చేయదు చెలి ||
కొమ్మ పయ్యద గప్పినా గూడ నీతోగాని
వుమ్మడి దనంతనైతే నొల్లదు చెలి
యిమ్ముల శ్రీ వేంకటేశ యింతలో గూడితిగాని
బమ్మర వెట్టినా నీకు బాయదు చెలి ||
ఎంత లేదు చిత్తమా యీతలేల మోతలేల
వంతులకు బారనేల వగరించనేలా ||
దక్కనివి గోరనేల తట్టుముట్టు పడనేల
చిక్కి నంతకే సంతసించ రాదా
ఒక్కమాటే వుప్పుదిని వుపదాప మందనేల
చక్క జూడ దగినంతే చవి గొనరాదా ||
పారి పారి వేడ నేల బడలిక పడనేల
మీరిదైన మిచ్చినంతే మెచ్చరాదా
వీరిడై పొడవెక్కి విరుగ బడగనేల
చేరి యుండినంతకే చేచాచరాదా ||
జీవులుగొలువనేల సిలుగుల బడనేల
శ్రీవేంకటేశుడాత్మ జిక్కి వుండగా
దావతి పడగనేల దప్పుల బొరలనేల
కైవశమైనందుకే గతి గూడ రాదా ||
ఎంత వనికోకాని యెఋగనేను
చెంతనే తెలుసుకో నేజెప్పితి నీ సుద్దులు ||
వదలే జారు దురుము వైపుగా ముడుచు కొంటా
కదలు గన్నుల చూపు కాడి పారగా
మదమువలెనే పెంజెమటలు చెక్కులగార
వెదకీ నెవ్వతో నిన్ను వీదుల వీదులను ||
అడచి చన్నులపై బయ్యద బిగిఇంచుకొంటా
కడలేని నిట్టూర్పులు కడుమగాను
తడబడ బెదవుల తమ్మబేంట్లు రాలగా
అడిగీ నీ వున్నచోటు అంగనల నెల్లాను ||
వుక్కుమీరి కరముల వొడిమీద బెట్టుకొని
మిక్కిలి నీ కాపెపొందు మీ దెత్తగా
ఇక్కడ శ్రీవేంకటేశ యిటు నన్ను గూడేవు
చొక్కుచు నీ మేడ దిక్కే చూచీ దానదివో ||
ఎంతగాలమొకదా యీదేహధారణము
చింతాపరంపరల జిక్కువడవలసె ||
వడిగొన్న మోహంబువలల దగులైకదా
కడలేని గర్భనరకము లీదవలసె
నడిమిసుఖములచేత ననువుసేయగగదా
తొడరి హేయపుదిడ్డి దూరాడవలసె ||
పాపపుంజములచే బట్టువడగాగదా
ఆపదలతోడిదేహము మోవవలసె
చూపులకులోనైన సుఖము గానకకదా
దీపనభ్రాంతిచే దిరిగాడవలసె ||
హితుడైనతిరువేంకటేశు గొలువకకదా
ప్రతిలేనినరక కూపమున బడవలసె
ఆతనికరుణారసం బబ్బకుండగగదా
బతిమాలి నలుగడల బారాడవలసె ||
ఎంతచుట్టమో నీకునిదివో ఆపె
సంతసపు వలపుల జడిసీ నాపె ||
తేనెగారే పెదవుల తేటమాటలాడీ నాపె
నానబెట్టి సెలవుల నవ్వీనాపె
సానబెట్టిన చూపులు జరిపించీ నీపైనానాపె
మోనముతో దొమ్ములను మొక్కినాపె ||
నిండుజెక్కుటద్దముల నీడలు చూపీనాపె
గండు దుమ్మిద కొప్పుతోగదిమీనాపె
కొండలవంటి చన్నులకొనలు దాకించీ నాపె
మెండుజిగురుచేతుల మెచ్చు మెచ్చీ నాపె ||
ఆయపు మెఋగు మేన ఆసలురేచీ నాపె
పాయపు సిగ్గులచేత భ్రమించీ నాపె
మోయరాని పిరుదుల మురిపెము చూసీనాపె
యీ యెడ శ్రీవేంకటేశ యెనసె నిన్నాపె ||
ఎంతచేసిన తనకేది తుద
చింత శ్రీహరిపై జిక్కుటే చాలు ||
ఎడపక పుణ్యాలెన్ని చేసినా
గడమే కాకిక గడయేది
తడబడ హరియే దైవమనుచు మది
విడువకవుండిన వెరవే చాలు ||
యెన్నితపములివి యెట్లజేసినా
అన్నువ కధికము అలవేది
వన్నెల గలగక వనజాక్షునిపై
వున్న చిత్తమది వొక్కటే చాలు ||
యిందరి వాదములెల్ల గెలిచినా
కందే గాకిక గరిమేది
యిందరినేలిన యీవేంకటపతి
పొందుగ మహిమల పొడవే చాలు ||
ఎంతటి వాడవు నిన్నేమని నుతింతును
వింతలు నీకమర కుండగ విచారించే ||
పాల సముద్రములోనం బవ్వళించి యుండే నీకు
బాలుండవై తేనెవెన్న బాతాయెనా
కాలమెల్లను శ్రీకాంత కౌగిట నుండ నీకు
గొల్లవైతే గొల్లతలం గూడ వేడుకాయెనా ||
పరమ పదమునందు బ్రహ్మమై వుండే
పెరిగీ రేపల్లెవాడ ప్రియమాయెనా
సురలనెల్ల గావగ సులభుండవైన నీకు
గరిమెతోడ పసులకావగ వేడుకాయె ||
ఏ ప్రొద్దు ముక్తుల నెనసి వుండే నీకు
గోపాలురతో గూడుండ కోరికాయెనా
బాపురె యలమేల్మంగపతి శ్రీ వేంకటేశ్వర
యే ప్రొద్దు నిట్టి లీలలే హితవాయెనా ||
ఎంతనేర్చెనే ఈ కలికి
ఇంతుల కేటకే ఇంతేసి పగటు ||
చలముల నెరపుచు సవతుల దూరుచు
సలిగెల పొరలీ జవరాలు
చెలువుని సొలయుచు చేతులు చాపుచు
కెలపుల నగవుల కెరలీని ||
సాటికి పెనగుచు సణగుచు రాల్చుచు
నీటున మురిసీ నెరజాణ
మాటల గునియుచు మదమున మొరయుచు
జూటుదనంబుల జూచీని ||
మంతన మాడుచు మలయుచు నవ్వుచు
పంతము లాడీ పసలాడీ
ఇంతలో శ్రీవేంకటేశుడు నన్నేలె
పొంతనుండి నను పొగడీని ||
ఎంతపాపకర్మమాయ యెంతవింతచింతలాయ
వింతవారితోడిపొందు వేసటాయ దైవమా ||
చూడజూడ గొత్తలాయ చుట్టమొకడు లేడాయ
వీడుబట్టు అలుచాయ వేడుక లుడివోయను
జోడుజోడు గూడదాయ చొక్కుదనము మానదాయ
యేడకేడ తలపోత యెంతసేసె దైవమా ||
నీరులేనియేరు దాటనేర దెంతేలోతాయ
మేరవెళ్ళ నీదడాయ మేటి జేరడాయను
తోరమైన ఆసలుబ్బి తోవ గానిపించదాయ
కోరి రాకపోకచేత కొల్లబోయ గాలము ||
తల్లిదండ్రి దాత గురువు తానెయైననాచారి
వల్లభుండు నాకు మేలువంటిదాయ జన్మము
కల్లగాదు వేంకటేశుఘనుని పాదసేవ నాకు
మొల్లమాయ నామనసు మోదమాయ దైవమా ||
ఎంతమాత్రమున నెవ్వరు దలచిన అంతమాత్రమే నీవు
అంతరాంతరములెంచిచూడ పిండంతేనిప్పటియన్నట్లు
కొలుతురు మిమువైష్ణవులు కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు తగినభక్తులను శివుడనుచు
అలరిపొగడుదురు కాపాలికులు ఆది భైరవుడవనుచు
సరినెన్నుదురు శాక్తేయులు శక్తిరూపు నీవనుచు
దరిశనములు మిము నానావిధులను తలపుల కొలదుల భజింతురు
సిరులమిమ్మునే యల్పబుద్ధి దలచిన వారికి నల్పంబవుదువు
గరిమల మిమునే ఘనమని తలచిన ఘనబుద్ధులకు ఘనుడవు
నీవలన గొరతేలేదు మరి నీరుకొలది తామెరవు
ఆవల భాగీరథిదరి బావుల ఆజలమే వూరినట్లు
శ్రీవేంకటపతి నీవైతే మము జేకొని వున్నదైవమని
యీవలనే నీశరణని యెదను యిదియే పరతత్త్వమునాకు
ఎంతమోహమో నీకీ ఇంతి మీదను
వింత వింత వేడుకల మీదను ||
తరుణిగుబ్బలు నీకు దలగడ బిల్లలుగా
నొరగు కొన్నాడవు వుబ్బున నీవు
దొరవై పయ్యెదకొంగు దోమతెర బాగుగ
సరుగ మాటుక సేసుక జాణవై వున్నాడవు ||
భామిని తొడలు నీకు పట్టెమంచము లాగున
నాముకొని పవ్వళించే వప్పటి నీవు
గోముతోడ పట్టుచీర కుచ్చెల వరపుగాగ
కామించి ఇట్టె కోడెకడవై వున్నాడవు ||
వనిత కాగిలి నీకు వాసన చప్పరముగ
నునికు సేసు కున్నాడ వొద్దికై నీవు
యెనసితివి శ్రీవేంకటేశ యలమేలుమంగను
అనిశము సింగారరాయడవై వున్నాడవు ||
ఎంతవిచారించుకొన్నా నిదియే తత్త్వము హరి
వంతుకు నీకృపగలవాడే యెరుగు హరి ||
నిన్నునమ్మినట్టివాడు నిఖిలవంద్యుడు హరి
నిన్నునొల్లనట్టివాడు నీరసాధముడు
మున్నుదేవతలు నీకుమొక్కి బదికిరి హరి
వున్నతి నసురలు నిన్నొల్లక చెడిరి హరి ||
యేపున నీపేరిటివాడిన్నిట ధన్యుడు హరి
నీపేరొల్లనివాడు నిర్భాగ్యుడే హరి
కైపులనిన్ను నుతించి గెలిచె నారదుడు హరి
పైపై నిన్నుదిట్టి శిశుపాలుడు వీగెను హరి ||
యిట్టె నీవిచ్చినవరమెన్నడు జెడదు హరి
గట్టిగా నీవియ్యనివి కపటములే హరి
అట్టె శ్రీ వేంకటేశ నీవంతరంగుడవు హరి
వుట్టిపడి కానకున్న దేహికి హరి ||
ఎంతవిభవము గలిగె నంతయును ఆపదని
చింతించినదిగదా చెడని జీవనము ||
చలము గోపంబు దను జంపేటిపగతులని
తెలిసినది యదిగదా తెలివి
తలకొన్న పరనింద తనపాలి మృత్యువని
తొలగినది యదిగదా తుదగన్నఫలము ||
మెరయువిషయములే తనమెడనున్న వురులుగా
యెరిగినది యదిగదా యెరుక
పరివోనియాశ తను బట్టుకొను భూతమని
వెరచినది యదిగదా విజ్ఞానమహిమ ||
యెనలేని తిరువేంకటేశుడే దైవమని
వినగలిగినదిగదా వినికి
అనయంబు నతని సేవానందపరులయి
మనగలిగినదిగదా మనుజులకు మనికి ||
ఎంతసేయగలేదు యిటువంటివిధి యభవు
నంతవానిని భిక్షమడుగుకొన జేసె ||
కోరిచంద్రుని బట్టి గురుతల్పగుని జేసె
కూరిమలరగ నింద్రు గోడి జేసె
ఘోరకుడువగ ద్రిశంకుని నంత్యజుని జేసె
వీరుడగునలు బట్టి విరూపుజేసె ||
అతివనొడ్డుగ జూదమాడ ధర్మజు జేసె
సతినమ్ముకొన హరిశ్చంద్రు జేసె
కుతిలపడ శూద్రకుని గొఱ్ఱెముచ్చుగ జేసె
మతిమాలి కురురాజు మడుగచొరజేసె ||
పడనిపాట్ల బరచి బ్రహ్మతల వోజేసె
తొడరి కాలునుకాలు దునియజేసె
అడర నీవిధికి విధియగు వేంకటేశుకృప
పడయకుండగ భంగపడకపోరాదు ||
ఎంతసేయగలేదు యిటువంటివిధి యభవు
నంతవానిని భిక్షమడుగుకొన జేసె ||
కోరిచంద్రుని బట్టి గురుతల్పగుని జేసె
కూరిమలరగ నింద్రు గోడి జేసె
ఘోరకుడువగ ద్రిశంకుని నంత్యజుని జేసె
వీరుడగునలు బట్టి విరూపుజేసె ||
అతివనొడ్డుగ జూదమాడ ధర్మజు జేసె
సతినమ్ముకొన హరిశ్చంద్రు జేసె
కుతిలపడ శూద్రకుని గొఱ్ఱెముచ్చుగ జేసె
మతిమాలి కురురాజు మడుగచొరజేసె ||
పడనిపాట్ల బరచి బ్రహ్మతల వోజేసె
తొడరి కాలునుకాలు దునియజేసె
అడర నీవిధికి విధియగు వేంకటేశుకృప
పడయకుండగ భంగపడకపోరాదు ||
ఎంతసేసినా నెడయకే పోయ
ముంతలోనినీట మునిగిలేచుట ||
ఉట్టిపై చెరలాట మూరబొత్తులకూడు
పట్టుచాలనికొమ్మ బహునాయకము
వెట్టిమోపరిలాగు వెర్రివోయినపోక
నట్టింటివైరంబు నగుబాటుబ్రదుకు ||
రాకపోకలచేత రాగినబెనుబుండు
వాకులేనివరము వలవనివలపు
యేకాలము వేంకటేశునికృపలేక
ఆకడీకడ నడయాడెడినడపు ||
ఎంతైన దొలగవై తేదైన నామతికి
వింతచవినేతుగా విషయబుద్ధి ||
ఎనసి జన్మముల నే నెట్లనుండిన బోక
వెనక దిరుగుదువుగా విషమబుద్ధి
అనువైన యనుభవన లనుభవించగజేసి
వెనక మఱపింతుగా విషయబుద్ధి ||
కెఱలి కాంతలు నేను గినిసినను బొలయలుక
విఱిచి కలపుదువుగా విషయబుద్ధి
తఱితోడ వావివర్తనదలంచిననన్ను
వెఱపు దెలుపుదువుగా విషయబుధి ||
యెడలేనియాపదల నెట్లువొరలిన నన్ను
విడిచిపోవైతిగా విషయబుద్ధి
సడిబెట్టి వేంకటస్వామికృపచే నిన్ను
విడిపించవలనెగా విషయబుద్ధి ||
ఎందరితో బెనగేను యెక్కడని పొరలేను
కందర్ప జనక నీవే గతిగాక మాకు
నిక్కి నాబలవంతాన నేనే గెలిచేనంటే__
నొక్కపంచేంద్రియముల కోపగలనా
తక్కినసంసారవార్ది దాటగలనో మరి
దిక్కుల కర్మబంధము తెంచివేయగలనో
పన్నుకొన్నపాయమున పరము సాధించేనంటే
యెన్న నీమాయ కుత్తర మియ్యగలనా
వన్నెలనామనసే పంచుకోగలనో మరి
కన్నట్టి యీప్రపంచమే కడవగగలనో
వుల్లములో నిన్ను ధ్యాన మొగి నేజేసేనంటే
తొల్లిటియజ్ఞానము తోయగలనా
ఇల్లిదే శ్రీవేంకటేశ యెదుటనే నీకు మొక్కి
బల్లిదుడ నౌదుగాక పంద నే గాగలనా
ఎందరివెంట నెట్ల దిరుగవచ్చు
కందువెఱిగి చీకటిదవ్వుకొనుగాక ||
తలరాయిగాగ నెందరికి మొక్కెడిని
తెలివిమాలినయట్టిదేహి
కొలదిమీరిన దేవకోట్లు దనలోన
కలవాని నొక్కనినే కొలుచుగాక ||
కాలీచపడగ నెక్కడికి నేగెడివి
పాలుమాలిన యట్టిప్రాణి
మేలిమిజగములు మేనిలో గలవాడు
పాలిటివాడై ప్రణుతికెక్కుగాక ||
నూరేండ్ల నెందరి నుతియింపగలవాడు
చేరదావులేని జీవి
శ్రీరమణుడు శ్రీవేంకటేశుని
కోరికె దలచి ముక్తి కొల్లగొనుటగాక ||
ఎందరు సతులో యెందరు సుతులో
యిందు నందు నెట్లెరిగే నేను ||
మలయుచు నాయభిమానములని నే
కెలన నిపుడు వెదకే నంటే
పలుయోనులలో పలుమారు బొడమిన
చలమరి నా తొలి జన్మంబులను ||
గరిమెల బాణి గ్రహణము సేసిన
సిరుల చెలుల గలనే నంటే
తరుణుల గురుతుల తలపున మరచితి
పరగిన బహు కల్పంబుల యందు ||
శ్రీ వేంకటగిరి చెలువుని యాజ్ఞల
భావించియె కరి చైకొంటి
తావుల జూడగ తగిలిన కోర్కుల
భావరతుల బెంబడి మనసందు ||
ఎందరైన గలరు నీ కింద్రచంద్రాదిసురలు
అందుర్లో నే నెవ్వడ నీ వాదరించే దెట్టో
పెక్కుబ్రహ్మాండములు నీపెనురోమకూపముల
గిక్కిరిశున్న వందొకకీటమ నేను
చక్కగా జీవరాసులసందడి బడున్నవాడ
ఇక్కువ నన్ను దలచి యెట్టు మన్నించేవో
కోటులైనవేదములు కొనాడీ నిన్నందులో నా_
నోటివిన్నపము లొక్క నువ్వు గింజంతే
మాటలు నేరక కొఱమాలి వాకిట నుండ
బాటగా నీదయ నాపై బారుటెట్టో
అచ్చపునీదాసులు అనంతము వారలకు
రిచ్చల నే నొకపాదరేణువ నింతే
ఇచ్చగించి శ్రీవేంకటేశ నిన్ను దలచుక
మచ్చిక గాచితి నన్ను మఱవనిదెట్టో
ఎందాక నేచిత్త మేతలపో
ముందుముందు వేసారితి ములిగి వేసరితి ||
ఏమిసేతు నేడచొత్తు నేమని బోధింతును
నామాట వినదిదే నావిహారము
యేమరినా దలపించీ నేమైనా గడించీ
సాముసేసి వేసారితీ జడిసి వేసారితి ||
యేడ చుట్టాలేడ పొందులెవ్వరూ
తోడైనవారు గారు దొంగలు గారు
కూడుచీరగానిచోటై కొరగానిపాటై
వాడివాడి వేసారితి వదిలి వేసారితి ||
యెందున నున్నాడేమిసేసీ నెక్కడ భోగించీని
విందులకువిందయిన వేంకటేశుడు
యిందరి హృదయములో నిరవై యున్నాడతడు
చెందినన్ను గాచుగాక చెనకి వేసారితి ||
ఎందు నీకు బ్రియమో యీతెప్పతిరునాళ్ళు
బిందువడె సిరులతో తెప్పతిరునాళ్ళు ||
పాలజలధిలో బవ్వళించి పాముతెప్ప
దేలుచున్న దది దెప్పతిరునాళ్ళు
వోలి నేకోదకమై వొక్కమఱ్ఱియాకుమీద
తేలుచున్న దది తెప్పతిరునాళ్ళు ||
అమృతము దచ్చువాడు అంబుధిలో మందరము
తెమల దేలించుతెప్పతిరునాళ్ళు
యమునలో కాళింగుసంగపుపడిగెమీద
తిమిరి తొక్కిన తెప్ప తిరునాళ్ళు ||
అప్పుడు పదారువేలు అంగనలచెమటల
తెప్పల దేలిన తెప్పతిరునాళ్ళు
వొప్పుగ శ్రీవేంకటాద్రి నున్నతి గోనేటిలోన
తెప్పిరిల్లె నేటనేట తెప్పతిరునాళ్ళు ||
ఎందు బొడమితిమో యెఱుగము మా
కందువ శ్రీహరికరుణేకాక ||
ఏటిజన్మమో యెఱగము పర
మేటిదో నే మెఱగము
గాటపుకమలజు గాచినయీ
నాటకుడే మానమ్మినవిభుడు ||
యెవ్వారు వేల్పులో యెఱుగము సుర
లెవ్వరో నే మెఱుగము
రవ్వగుశ్రీ సతిరమణుడు మా
కవ్వనజోదరు డంతరియామి ||
యింకానేటిదో యెఱగము యీ
యంకెలబాముల నలయము
జంకెల దనుజుల జదిపినతిరు
వేంకటేశుడు మావిడువనివిభుడు ||
ఎక్కగా రాగా రాగా యిందాకా దగులు
యిక్కువ శ్రీహరిమాయ నింకనెంతో తగులు
తెగనికర్మమునకు దేహము తగులు
తగినదేహమునకు తరుణితో తగులు
సొగిసి యీరెంటికి సుతు లొక్కతగులు
అగడాయ గనకము అన్నిటితో తగులు ||
యింతటిసంసారికి యిల్లొక్కతగులు
బంతికి నందు గలిగె పాడిపంట తగులు
చెంత నీలంపటానకు క్షేత్రము తగులు
సంతగూడేదాసదాసీజనులెల్లా ద్గులు ||
మొదల జీవుడొక్కడే మోపులాయ దగులు
వదలనిబంధములు వడ్డివారె దగులు
వుదుటిహము బరము నొక్కయందె తగులు
అదె శ్రీవేంకటపతి యంతరాత్మ తగులు ||
ఎక్కడ చూచిన వీరే యింటింటిముంగిటను
పెక్కుచేతలు సేసేరు పిలువరే బాలుల ||
పిన్నవాడు కృష్ణుడు పెద్దవాడు రాముడు
వన్నె నిద్ద రమడలవలె నున్నారు
వెన్నలు దొంగిలుదురు వీడు వాడు నొక్కటే
పన్నుగడై వచ్చినారు పట్టరే యీబాలుల ||
నల్లనివాడు కృష్ణుడు తెల్లనివాడు రాముడు
అల్లదివో జోడుకోడెలై వున్నారు
వెల్లవిరై తిరిగేరు వేరు లేదిద్దరికిని
పెల్లుగ యశోదవద్ద బెట్టరె యీబాలుల ||
రోల జిక్కె నొకడు రోకలి పట్టె నొకడు
పోలిక సరిబేనికి బొంచి వున్నారు
మేలిమి శ్రీవేంకటాద్రి మించిరి తానే తానై
ఆలించి నెవ్వరి నేమి ననకురే బాలుల ||
ఎక్కడ చొచ్చెడి దీభవమేదియు గడపల గానము
వుక్కున బరితాపాల మూదల మండెడి ||
హృదయవికారము మాన్పగ నేతెరగును సమకూడదు
మదనానందము చెరుపగ మందేమియు లేదు
పొదలినదేహగుణంబుల బోనడువగ గతి గానము
బ్రదికించినకోరికెలకు బ్రాయము దిరిగినది ||
కమలినయజ్ఞానం బిది కన్నులముందర గానదు
తిమిరము పొదిగొని చూడ్కికి దెరువేమియు లేదు
తెమలనియాశాపాశము తెంపగ సత్వము చాలదు
మమకారము వెడలింపగ మతి యెప్పుడు లేదు ||
దురితంబులు పుణ్యంబులు తొడిబడ నాత్మను బెనగొని
జరగగ శరీరధారికి సత్కర్మము లేదు
తిరువేంకటగిరిపతియగు దేవశిఖామణిపాదము
శరణని బ్రదుకుటదప్పను సన్మార్గము లేదు ||
ఎక్కడ నున్నారో సురలెవ్వరు భూమికి దిక్కో
తొక్కులవడె జీవుడు దుండగీలచేతను.
ఆసలనియెడివెర్రి యంగడివెంటా దిప్పె
దోసిలొగ్గించె దైన్యము దొరలెదుట
యీసుల నాకటి వెఇషమేమైనా దినిపించె
గాసిబడె జీవుడిదె కన్న వారిచేతను.
కడు గోపపు భూతము కాయమెల్లా మఱపించె
వడి నజ్ఞానపుటేరు వరతగొట్టె
నడుమ బాపపుచొక్కు నరకపుగుంటదోసె
గడుసాయ జీవుడిదె కన్న వారిచేతను.
భవము సంసారపుబందెలదొడ్డి బెట్టించె
తగిలింద్రియపుతాళ్ళు దామెన గట్టె
యివల శ్రీ వేంకటేశు డింతలో దిక్కయి కాచె
కవడువాసె జీవుడు కన్న వారిచేతను.
ఎక్కడనున్నా నీతడు
దిక్కులు మాదెస దిరిగీగాక ||
సరసుడు చతురుడు జగదేకగురుడు
పరమాత్ము డఖిలబంధువుడు
హరి లోకోత్తరు డతడే నామతి
సిరితో బాయక చెలగీగాక ||
ఉన్నతోన్నతు డుజ్జ్వలు డధికుడు
పన్నగశయనుడు భవహరుడు
యిన్నిటగలిగిన యిందిరరమణుడు
మన్ననతో మము మనిపీగాక ||
మమతల నలమేల్మంగకు సంతత
రమణుడు వేంకటరాయడు
జమళిసంపదల సరసవిభవముల
తమకంబున మము దనిపీగాక ||
ఎక్కడా నెఱుగమమ్మ యిటువంటి బత్తి
చిక్కంచే దెటువలెనే చేతిలోనికతని ||
మనసు నొచ్చీనంటా మాటలాడ వెరచేవు
చెనకే దెటువలెనే చెలువునిని
వనితరో పతి కొప్పొ వంగీనంటూ లోగేవు
పెనగే దెటువలెనే ప్రియమైన వేళను ||
వెంగెమవునో యనుచును వెస నవ్వజాల్వు
సంగతయ్యే దెటులనే సరసములు
యెంగిలయ్యీ నంటామోవి యించుకంతా నడుగవు
ముంగిట రతులనింక ముందెటువలెనే ||
సిగ్గువడీనో యంటా చెరగుపట్టి తియ్యపు
వెగ్గళించే దెట్టే శ్రీ వేంకటేశుని
యెగ్గు వట్టీనోయంటా నిట్టెగోరు దాకించేవు
వొగ్గి కూడితివి యిట్టే వుబ్బుతెలిసే దెట్టే
ఎక్కడి కంసుడు యిక నెక్కడి భూభారము
చిక్కువాప జనియించె శ్రీకృష్ణుడు ||
అదివో చంద్రోదయ మదివో రోహిణిపొద్దు
అదన శ్రీకృష్ణుడందె నవతారము
గదయు శంఖచక్రాలుగల నాలుగు చేతుల
నెదిరించియున్నాడు ఇదివో బాలుడు ||
వసుదేవుడల్ల వాడే వరుస దేవకి యదే
కొసరే బ్రహ్మాదుల కొండాట మదె
పొసగ బొత్తులమీద బురుటింటి లోపల
శిసువై మహిమ చూపె శ్రీకృష్ణుడు ||
పరంజ్యోతిరూప మిది పాండవుల బ్రదికించె
అరిది కౌరవుల సంహారమూ నిదె
హరికర్ఘ్యము లీరో జయంతి పండుగ సేయరో
కెరలి శ్రీవేంకటాద్రి కృష్ణుడితడు ||
ఎక్కడి నరకము ఎక్కడిమృత్యువు మాకు
దక్కి నీదివ్య నామామృతము చూరగొంటిమి ||
తమితో శ్రీపతి దాసుల చేరినప్పుడే
యమ కింకర భయము లణగి పోయె
జమళి నీ యాయుధ లాంఛనము మోచినప్పుడే
అమర కాలదండము లవియెల్ల బొలిసె ||
మును నీ నగరిత్రోవ మొగమైన యప్పుడే
ఘన యామ్య మార్గము కట్టువడియె
ఒనర నీ తిరుపతి నొకరాత్రి వున్నపుడే
కనలు కాలసూత్రాది ఘాతలెల్ల పూడె ||
యెడరై నీమంత్రజపము యెంచుకొన్న యపుడే
కడు చిత్రగుప్తుని లెక్కలుగ చే
వడిగా వేంకటేశ్వర మీశరణమనగ
అడరి వైకుంఠము మా యరచేత నిలిచె||
ఎక్కడి పరాకుననో యిందాకా నుండెగాక
మక్కువ నాపై బత్తి మానలేడె వాడు
పాయరాని వలపులు పక్కన దలచుకొంటే
రాయా మనసు గరగకేమే
వో యమ్మలాల నా వుంగరము చూపరమ్మ
వేయేల తానిప్పుడే విచ్చేసీ నీడకే
వూనినట్టి సరసాలు వూహించుకోంటేను
మానా దేహము తమకించకేమే
మానినులాలా వొక్కమాట విన్నవించరమ్మ
తానె వచ్చి నన్ను సంతస మందించీనే
సేదదేరే చనవులు చిత్తమున దగిలితే
దూదేవయ నేమి వూదితే బోను
ఆ దెస మండెమురాయడైన శ్రివెంకటనాథు
డాదరించి నన్ను గూడె నతి మోహముననూ
ఎక్కడి పాపము లెక్కడి పుణ్యము
లొక్కట గెలిచితి మోహో నేము ||
ప్రపన్నులెదుటను బడినయాతుమకు
చపలత మరి నాశము లేదు
ఉపమల గురుకృపనొనరిన మనసుకు
రపముల మరి నేరములే లేవు ||
ఘనతరద్వయాధికారగు దేహికి
మినుకుల భవభయమే లేదు
చనువుల హరిలాంఛన కాయమునకు
వెనుకొను కర్మపువెట్టియు లేదు ||
శ్రీవేంకటేశ్వరు జేరిన ధర్మికి
ఆవల మరి మాయలు లేవు
కైవశమాయను కైవల్య పదమును
జావు ముదిమితో నడ్డే లేదు ||
ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను ||
మరవను ఆహారంబును మరవను సంసార సుఖము
మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ
మరచెద సుజ్ఞానంబును మరచెద తత్త్వ రహస్యము
మరచెద గురువును దైవము మాధవ నీ మాయ ||
విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు
విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీమాయ
విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును
విడిచెద నాచారంబును విష్ణుడ నీమాయ ||
తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధముల
తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా
అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై
నగి నగి నను నీవేలితి నాకా యీమాయ ||
ఎక్కడిదురవస్థ లేటిదేహము లోన
జిక్కి జీవుడు మోక్షసిరి జెందలేడు ||
ఒడలు మాంసపూర మొక పూటయిన మీదు
గడుగకున్న గొరగాదు
కడలేనిమలమూత్రగర్హితమిది, లోను
గడుగరాదు యెంతగడిగిన బోదు ||
అలర చిత్తముచూడ నతిచంచలము దీన
గలసిన పెనుగాలి గనము
మెలపులేనిచిచ్చు మీదమిక్కిలి గొంత
నిలుపులేదు పట్టి నిలుపగరాదు ||
తిరువేంకటాచలాధిపుడు నిత్యానంద
కరుడు జీవునకు రక్షకుడు
కరుణించి యొకవేళ గాచినగాని మేను
చొరకమానెడుబుద్ధి చోక దెవ్వరికి ||
ఎక్కడిమతము లింక నేమి సోదించేము నేము
తక్కక శ్రీపతి నీవే దయజూతుగాక ||
కాదనగ నెట్టవచ్చు కన్నులెదుటి లోకము
లేదనగ నట్టవచ్చు లీలకర్మము
నీదాసుడ ననుచు నీమరుగు చొచ్చుకొంటే
యేదెసనైనా బెట్టి యీడేరింతుగాక ||
తోయ నెట్టవచ్చు మించి తొలకేటి నీమాయ
పాయనెట్టవచ్చు యీభవబంధాలు
చేయూర నిన్ను బూజించి చేరి నీముద్రలు మోచి
యీయెడ నీవే యీడేరింతుగాక ||
తెలియగ నెట్టవచ్చు ద్రిష్టమైననీమహిమ
తలచగ నెట్టవచ్చు తగునీరూపు
నెలవై శ్రీవేంకటేశ నీవు గలవనుండగా
యిలమీద మమ్ము నీవే యీడేరింతుగాక ||
ఎక్కువకులజుడైన హీనకులజుడైన
నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు ||
వేదములు చదివియు విముఖుడై హరిభక్తి
యాదరించలేని సోమయాజికంటె
యేదియునులేని కులహీనుడైనను విష్ణు
పాదములు సేవించు భక్తుడే ఘనుడు ||
పరమమగు వేదాంత పఠన దొరికియు సదా
హరిభక్తిలేని సన్యాసికంటె
సరవి మాలిన యంత్యజాతి కులజుడైన
నరసి విష్ణు వెదుకునాతడే ఘనుడు ||
వినియు జదివియును శ్రీవిభుని దాసుడుగాక
తనువు వేపుచునుండు తపసికంటె
ఎనలేని తిరువేంకటేశు ప్రసాదాన్న
మనుభవించిన యాతడప్పుడే ఘనుడు |
ఎచ్చోటి కేగిన యెప్పుడు దమలోని
మచ్చిక పెనుదెవులు మానకపోయె ||
పాయపుసతులగుబ్బలపెదపొట్లాల
కాయము వడి నొత్తి కాచగను
రాయుడిచే ఘనమాయగాని లోని
మాయపు పెను దెవులు మానకపోయె ||
అతివలమోహపుటధరామ్రుతములు
యితవుగ నోరి కందియ్యగను
అతిమోహమే ఘనమాయగాని లోని
మతకరిపెను దెవులు మానకపోయె ||
తరుణుల మేని మెత్తనిపరపులమీద
నిరవుగ నిటు సుఖించగను
తిరువేంకటాచలాధీశుక్రుపచేగాని
మరుచేతి పెనుదెవులు మానకపోయె ||
ఎటువంటి మచ్చికలో యెట్టి తరితీపులో
చిటుకన నే వినేను చెవుల పండుగలు||
చెలరేఁగి యాపె నీకుఁ జెప్పెనిందాఁక సుద్దులు
వెలలేని వేడుకతో వింటివి నీవు
తలఁపునఁ బట్టెనా తమి నీకుఁ బుట్టెనా
అలరి యా సంతోసము లానతియ్యవయ్య
పలుమారు నీయెదుటఁ బాడె నాపె పాటలు
తలయూఁచి మెచ్చితివి దానికి నీవు
కలిగెనా నీకు మేలు కలఁగెనా నీకు గుండె
ఎలుఁగెత్తి నాకుఁ గొంత యెరిఁగించవయ్య
ఎలమి నీతో నామె యేకతములెల్లా నాడె
వలపులు చల్లితివి వద్దనుండి
నిలిచి శ్రీవేంకటేశ నే నలమేల్మంగను
కలిసితి వెచ్చరించు కలవెల్లా నాకును
ఎటువంటి మోహమో ఏట్టి తమకమో గాని
తటుకునను దేహమంతయు మరచె చెలియ
పలుకుతేనెల కొసరి పసిడి కిన్నెర మీటి
పలుచనెలుగున నిన్ను పాడిపాడి
కలికి కన్నీరు బంగారు పయ్యెద నొలుక
తలయూచి తనలోనె తలవంచు చెలియ
పడతి నీవును తాను పవళించు పరపుపై
పొడము పరితాపమున పొరలి పొరలి
జడిగొన్న జవ్వాది జారు చెమటల దోగి
ఉడుకు నూరుపుల నుసురుసురాయె చెలియ
తావిజల్లేడి మోముదమ్మి కడు వికసించె
లో వెలితి నవ్వులను లోగి లోగి
శ్రీ వేంకటేశ లక్ష్మీకాంత నినుగలసి
ఈ వైభవము లందె ఇదివో చెలియ
ఎటువంటి రౌద్రమో యెటువంటి కోపమో
తటతట నిరువంక దాటీ వీడే ||
తోరంపు బెనుచేతుల మల్లచరచి
దారుణలీల బెదవు లపుడుకరచి
కారించి చాణూరు గడుభంగపరచి
వీరుడై యెముకలు విరచీ వీడే ||
పిడుగడచినయట్టు పెడచేత నడిచి
పడనీక పురములోపల జొరబొడిచి
తొడికి చాణూరు నెత్తుక దయవిడిచి
వడివెట్టి నెత్తురు వడిచి వీడే ||
బుసకొట్టుచును వూరువుల జెమరించి
మసిగాగ బెదపెదమల్లుల దంచీ
నెసగి శ్రీతిరువేంకటేశుడై మించి
ముసిముసినవ్వుల ముంచీ వీడీ ||
ఎటువంటి వలపో యెవ్వరి కొలది గాదు
ఘటనతో దమకించి గనుగొనవయ్యా ||
తళుకున నిన్నుజూచి తలవంచుకొని యింతి
తలపోసి నీరూపు తనలోననె
నిలువు జెమటతోడ నిట్టూరుపులతోడ
చెలరేగి గుబ్బతిలీ జిత్తగించవయ్యా ||
కోరినీపై నాసపడి గొబ్బునను సిగ్గుపడి
పెర బెట్టి మాటలాడీ బెదవులనె
సారపు తురుముతోడ జవ్వనభారము తోడ
ఆరీతి నివ్వెరగందీ నాదరించవయ్యా ||
కౌగిటికి జెయ్యి చాచి కన్నులనే నీకుమొక్కి
మాగినమోవి యిచ్చీ మతకాననె
చేగదేర నిన్నుగూడె శ్రీవేంకటేశుడ
వీగదలమేలు మంగ వినోదించవయ్యా ||
ఎటువంటి విలాసిని యెంతజాణ యీ చెలువ
తటుకన నీకు దక్క దైవార జూడవయ్యా ||
మగువ మాటాడితేను మాణికాలు నిండుకొనీ
పగడాలు పెదవుల బచ్చిదేరీని
మగడి చూచితేను మంచినీలాలుప్పతిలీ
తగు నీకు నీ పెదిక్కు తప్పకచూడవయ్యా ||
పడతి జవ్వనమున బచ్చలు గమ్ముకొనీని
నడచితే వైడూర్యా లెడలీ గోళ్ళ
తొడిబడ నవ్వితేను తొరిగీని వజ్రాలు
వొడికమైనది యీపె వొరపు చూడవయ్యా ||
కొమ్మ ప్రియాల తేనెల గురిసీ బుశ్యరాగాలు
కుమ్మరించీ జెనకుల గోమేధికాలు
మమ్మరపు జెమటల ముత్తెపుసరాలి నిండీ
నెమ్మది శ్రీవేంకటేశ నీదేవి జూడవయ్యా ||
ఎట్టయినా జేయుము యిక నీచిత్తము
కిట్టిన నీ సంకీర్తనపరుడ ||
కొందరు జ్ఞానులు కొందరు భక్తులు
కొందరు వైరాగ్య కోవిదులు
యిందరిలో నే నెవ్వడ గానిదె
సందడి హరి నీశరణాగతుడ ||
జపితలు గొందరు శాస్త్రులు గొందరు
ప్రపత్తి గొందరు బలువులు
వుపమించగ నిన్నొకడా గానిందు
కపురుల నీడింగరీడ నేను ||
ఆచార్యపురుషులు అవ్వల గొందరు
యేచినసమయులై యేర్పడిరి
కాచేటి శ్రీవేంకటపతి నేనైతే
తాచి నీదాసుల దాసుడను ||
ఎట్టయినా జేసుకో ఇక నీ చిత్తము నన్ను
పట్టిచ్చె మాగురుడు నీపాదాలు విడువను
పోడిమి నా నామములు పొద్దువొద్దు నుడిగీని
వీడేమడుగునోయని వెఱవకుమీ
నాడే నాయాచార్యుడు నాకు నన్నీ యిచ్చినాడు
నే డి దేలంటే నతని నేమము నే మానను
ప్రేమతో వీడు నన్నింట బెట్టుక పూజించీని
యేమిగారణమోయని యెంచుకోకుమీ
కామించి యాచార్యుడే కారణము నీకు నాకు
యీ మరులేలంటే నాతడిచ్చిన సొమ్మే నేను
పలుమారు వీడు నాపై వత్తిచేసీ నేటికని
వెలయ శ్రీవేంకటేశ వేసరతుమీ
యెలమి నాచార్యు డిదేపని చేసినాడు
నిలిచె గలకాలము నీకు నాకు బోదు
ఎట్టివారికినెల్ల నిట్టికర్మములు మా
యెట్టివారికి నింక నేది తోవయ్య ||
పాము జంపినయట్టిపాతకమున బెద్ద
పాముమీద నీకు బవళించవలసె
కోమలి జంపినకొరతవల్ల నొక్క
కోమలి నెదబెట్టుకొని యుండవలసె ||
బండి విరిచినట్టిపాతకమున బెద్ద
బండిబోయిడవై పనిసేయవలసె
కొండవెరికినట్టిగుణమున దిరుమల
కొండమీద నీకు గూచుండవలసె ||
ఎట్టు గూడె బెండ్లి యోగమిద్దరికి నీవేళ
అట్టు లక్ష్మీనారాయణ యోగము ||
నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు
పొలతి నీకు గూడె పొంతనాలు
వలుద చక్రవాకాలు వనితకు చాలు నీకు
యెలమి జక్రాయుధుడ నిద్దరికి దగును ||
తరుణి నీలకుంతల తగునీల వర్ణుడవు
సరుస మీకే తగు సమ్మంధము
నిరతి హేమవర్ణకె నీవు పీతాంబరుడవు
పరవి నిద్దరకొక్క జాతియ్యము ||
పాలవెల్లి బుట్టె నాకె పాలవెల్లి యిల్లు నీకు
మేలు మేలు యిద్దరికి మేనవావి
యీలీల శ్రీ వేంకటేశ యింతి నీవు గూడితివి
పోలి మాకు పెట్టరాదా సోబన విడేలు ||
ఎట్టు గెలుతు బంచేంద్రియముల నే
బట్టరానిఘనబలవంతములు
కడునిసుమంతలు కన్నులచూపులు
ముడుగక మిన్నులు ముట్టెడిని
విడువక సూక్ష్మపువీనులు యివిగో
బడిబడి నాదబ్రహ్మము మోచె
అదె తిలపుష్పంబంతనాసికము
కదిసి గాలి ముడెగట్టెడని
పొదిగి నల్లెడే పొంచుక నాలికె
మొదలుచు సర్వము మింగెడిని
బచ్చెనదేహపుపైపొర సుఖమే
యిచ్చ బ్రపంచం బీనెడిని
చెచ్చెర మనసిది శ్రీవేంకటేశ్వరు
దచ్చి తలచగా దరిచెరెడిని
ఎట్టు దరించీ నిదె యీజీవుడు
బట్టబయలుగా బరచీ నొకటి ||
చెడనిమట్టిలో జేసినముద్దే
నడుమ ముంచుకొన్నది నొకటి
తడియనినీరై తడివొడమింపుచు
పడిసీని వేవుర వడితో నొకటి ||
పాయనితనుదీపనములుగా నటు
చేయుచు మది వేచీ నొకటి
కాయపుచుట్టరికమ్ములు చేయుచు
రేయిబగలు విహరించీ నొకటి ||
ఇన్నియు దానే యేచి కపటములు
పన్నీ నిదె లోపల నొకటి
వెన్నెలచూపుల వేంకటేశ నిను
యెన్నికతో గడు నెదిరీ నొకటి ||
ఎట్టు దొరికెనె చెలియ యిద్దరికి నిటువంటి
పట్టి నిలుపగరాని బరువైన వలపు ||
నిడివి తమకములచే నిట్టూర్పులివె నీకు
అడియాస తమకంబు లాతనికిని
కడలేని వేదనల కన్నీళ్ళివే నీకు
అడలు బరితాపంబు లాతనికిని ||
గుఱుతైన యతనిపై గోరాట లదె నీకు
అరుదైన ప్రియమాన మాతనికిని
పురిగొన్న విరహమున బొరలాటలవె నీకు
అరమరపు బరవశము లాతనికిని ||
ఎనసి యాతనిరాక కెదురు చూచుట నీకు
అనుకూలుడై కలయు టాతనికిని
అనయంబు తిరువేంకటాధీశుడిదె నీకు
అనుభవము కెల్ల నీ వాతనికిని ||
ఎట్టు నమ్మవచ్చునే ఇంతి మనసు నేడు
వొట్టి యొక వేళ బుద్ధి యొకవేళా వచ్చునా ||
వెన్నెల బయట నుండి వేడి బడి యిందాకా
సన్నల నీ పతి గూడి చల్లనైతివి
వున్నతపు జందురు డొక్కడే వెన్నెలొక్కటే
కన్నె భావాలు రెండుగతులాయ నివిగో ||
కోయిల కూతలకే గుండె బెదరి యిందాకా
యీ యెడ నీ పతి గూడి యిచ్చగించేవు
ఆ యెడా బలు కొక్కటే అప్పటి నీవు నీవే
రాయడి నీ గుణములే రెండుదెఱుగులాయ ||
వేడుక చల్లగాలి విసిగితి విందాకా
కూడి శ్రీ వేంకటేశుతో కోరే వదియే
ఆడనే యాల వట్ట మదియును నొకటే
యీడా నాడా దలపోత లివియే వేరు ||
ఎట్టు నేరిచితివయ్య యిన్నివాహనములెక్క
గట్టిగా నిందుకే హరి కడుమెచ్చేమయ్యా // పల్లవి //
గరుడునిమీఁదెక్కి గమనించితివి నాఁడు
అరుదైన పారిజాతహరణానకు
గరిమతో రథమెక్కి కదలితి వల్లనాఁడు
సొరిది బ్రాహ్మణపడుచుల నుద్ధరించను // ఎట్టు //
చక్కఁగాఁ గుబేరుని పుష్పక మెక్కి కదలితి
మక్కువ సీతాదేవి మరలించను
తక్కక వాయుజు నెక్కి దాడివెటితివి నాఁడు
చొక్కపువానరులపౌఁజులు చూడను // ఎట్టు //
కొట్టఁగొన నీవు రాతిగుఱ్ఱము నెక్కి తోలితి –
పట్టియెడ నధర్మము నడఁచఁగను
మెట్టుక శ్రీవేంకటేశమీఁదఁ బల్లకి యెక్కితి –
విట్టె యిందిరఁ గూడి యేఁగుఁబెండ్లి యేఁగును // ఎట్టు //
ఎట్టు మోసపోతి నేను యివియెల్ల నిజమని
నెట్టాన హరినే నమ్మనేర నయితిగా
దేహమిది నాదని తెలిసి నమ్మివుండితే
ఆహా నే నొల్లనన్నా నటే ముదిసె
వూహల నాభోగమెల్లా వొళ్ళబట్టెనంటా నుంటే
దాహముతోడ నినుముదాగిననీరాయగా
మనసు నాదని నమ్మి మది మది నే పెంచితి__
ననుగుబంచేంద్రియములందు గూడెను
యెనసి ప్రాణవాయువు లివి సొమ్మని నమ్మితి
మెనసి లోను వెలినై ముక్కు వాత నున్నవి
ఇందుకొరకె నేను ఇన్నాళ్ళు పాటువడితి
ముందు వెనకెంచక నే మూఢుడ నైతి
అంది శ్రీవేంకటేశ్వరు డంతటా నుండి నా_
చందము చూచి కావగ జన్మమే యీడేరె
ఎట్టు వలసినా జేయు మేటి విన్నపము లిక
కట్టుకో పుణ్యమైనాగాక మరేమైనాను
నన్ను నెంచి కాచెనంటేనా యవగుణి నేను
నిన్ను నెంచి కాచేనంటే నీవు లక్ష్మీపతివి
యిన్నిటా నాకంటే హీనుడిక మరెవ్వడూ లేడు
వున్నతి నీకంటే ఘను లొకరూ లేరు
నిలువెల్లా నెంచుకొంటే నివ్వరిముల్లంత లేను
బలువుడ నీవైతే బ్రహ్మాండము
యెలమి నే నుపకార మెవ్వరికి జేయలేను
మెలగి నీవే తృణము మేరువు సేయుదువు
భావించ నీ వేలికవు బంటుమాత్రమింతే నేను
నీవు సర్వాంతరాత్మవు నే నొకడను
సావధానమున నేను సర్వభక్షకుండ నింతే
శ్రీవేంకటేశ నీవు జీవరక్షకుడవు
ఎట్టు వేగించే దిందుకేగురే సితరకాండ్లు
వెట్టివేమి సేయుమంటా వెన్నడించే ||
వొంటికాల గుంటికుంటి వూరిబందెలకు జిక్కి
పంటదాక దున్నె నొక్కపసురము
గంటుగంటులాక లొత్తి కల్లలనడిమిపంట
కుంటివాడు గావలుండి కుప్ప లేరుపరచె ||
కలది కుక్కిమంచము కన్నవారెల్లా బండేరు
తలెతో దొగ్గినంబలి దావకూళ్ళు
వెలిగంతలకొంపలు వీడుబట్లు చూపేరు
తలవరులెందులోనా దప్పు వెదకేరు ||
వొళ్ళుచెడ్డవా డొకడు వుభయమార్గము గొని
కల్లదొరపుట్టుబడి కడుగట్టీని
చల్లనిశ్రీ వేంకటేశ సకలలోకపతివి
యిల్లిదె నీశరణంటి మిందరిని గావవే ||
ఎట్టు సేసినా జేయి యెదురాడను
నెట్టుకొని చూచేవి నీ మహిమలికను ||
మొగము నీవు చూచితే మొక్కుచును సంతోసింతు
నగితేనే నీ మేలు నమ్ముదు నేను
బిగి వీడెమిచ్చితేనే చెప్పుకొందు జెలులతో
పగటు నీ చిత్తము నా భాగ్యమికను ||
మాటలు నీ వాడితేనే మనసు గరుగుదును
గాటాన చేయి వేసితే గడు మెత్తును
పాటించి గోరనంటితే పలుమారు జెలగుదు
కోటికి నీ కరుణే కోరితి నేనికను ||
పచ్చడము గప్పితేను పలుమారు నిన్ను మెత్తు
మచ్చిక నీవు చూపితే మరుగుదును
ఇచ్చకుడ శ్రీ వేంకటేశ నన్ను గూడితివి
సచ్చియైన నీ మన్ననే బతుకు నా కికను ||
ఎట్టుచేసిన జేసె నేమిసేయగవచ్చు
చుట్టపువిరోధంబు సూనాస్త్రుచెలిమి ||
ఒడలిలోపలిరోగ మొనర బరితాపంబు
కడుపులోపలిపుండు కడలేనియాస
తడిపాతమెడగోత తలపువిషయాసక్తి
గుడిమీదితరువు అలుగులము ప్రాణులకు ||
నీడలోపలయెండ నెలకొన్నబంధంబు
గోడపైసున్నంబు కొదలేనియెఱుక
పాడూరిలో బ్రదుకు పాపకర్మబుద్ధి
తాడుపైతపసు తమధనము ప్రాణులకు ||
మంటజేసినబొమ్మమనికి సంసారంబు
రెంటికినిగానివీరిడికొలువు బ్రదుకు
యింటివేలుపు వేంకటేశు గొలువక పరుల
వెంట దిరుగుట వోడవిడిచి వదరిడుట ||
ఎట్టున్నదో నీమనసు యేమి సేతురా
యెట్టనెదుట బాయలే నేమి సేతురా ||
చూచుదాకా వేగిరింత సొంపుగా విభుడ నీతో
దాచి మాటాడిన దాక దమకింతును
చెచేత దమకింతు చేరువ దాకానిట్లనె
యేచి తమకమేనిండె నేమి సేతురా ||
అట్టె నీ చెనకులకు నాసగింతు దనివోక
ముట్టి యాసగింతు నీమోవి తేనెకు
గట్టిగా నంతటి మీద కౌగిటికి నాసగింతు
యెట్లైనా నాసలే నిండె నేమిసేతురా ||
ఆదన నీమేనంటి అట్టె పరవశమవుదు
వదలక కూడి పరవశమవుదును
పొదలి శ్రీ వేంకటేశ పొందితివి నన్ను నిట్టే
యెదిరించె బరవశాలేమి సేతురా ||
ఎడమపురివెట్టె పరహితవివేకము, లోన
గుడుసువడె జదువు, మెరుగులవారె జలము ||
లంపు మేయగదొణగె లలితంపుమతి లోనె,
తెంపు దిగవిడిచె యెడతెగనిమానంబు,
చంప దొరకొనియె వేసటలేనితమకంబు,
యింపు ఘనమాయ నె నికనేమి సేతు ||
బయలువందిలివెట్టె పనిలేనిలంపటము,
దయ విడువదొడగె చిత్తములోనికాంక్ష,
పయికొన్న మోహంబు పడనిపాట్ల బరచె,
లయమాయ శాంతి మెల్లనె తీరె నెరుక ||
చావుబుట్టువు మఱచె సంసారబంధంబు,
దైవమును విడిచెనే తరికంపుబ్రియము
శ్రీవేంకటేశ్వరుడు చిత్తరంజకుడు యిక
గావలసినది యతనికరుణ ప్రాణులకు ||
ఎత్తరే ఆరతులీపై కింతులాల
హత్తెను శ్రీవేంకటేశు కలమేలుమంగ ||
హరి వురముపై సొమ్ము అరతగట్టిన తాళి
సరిలేని దేవుని సంసార ఫలము
సిరులకు బుట్టినిల్లు సింగారముల విత్తు
మెరగుబోడి యలమేలుమంగ ||
పరమాత్మునికి నాత్మభావములో కీలుబొమ్మ
కెరలుచు నితడు భోగించే మేడ
సరసపు సముద్రము సతమైన కొంగుపైడి
అరిది సంపదలది యలమేలుమంగ ||
శ్రీవేంకటేశుని దేవి చిత్తజుగన్నతల్లి
యీవిభుని కాగిటిలో యేచినకళ
బూవపు పెండ్లి మేలు పొందిన నిధానము
ఆవల నీవల నీపె యలమేలుమంగ ||
ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే
వదలక హరిదాసవర్గమైనవారికి ||
ముంచిన నారాయణమూర్తులే యీజగమెల్ల
అంచితనామములే యీయక్షరాలెల్లా
పంచుకొన్న శ్రీహరిప్రసాద మీరుచులెల్లా
తెంచివేసి మేలు దా దెలిసేటివారికి ||
చేరి పారేటినదులు శ్రీపాదతీర్థమే
భారపుయీ భూమితని పాదరేణువే
సారపుగర్మములు కేశవుని కైంకర్యములే
ధీరులై వివేకించి తెలిసేటివారికి ||
చిత్తములో భావమెల్లా శ్రీవేంకటేశుడే
హత్తినప్రకృతి యెల్లా నాతనిమాయే
మత్తిలి యీతనికంటే మరి లేదితరములు
తిత్తిదేహపుబ్రదుకు తెలిసేటివారికి ||
ఎదుటనున్నాడు వీడె ఈ బాలుడు
మదిదెలియమమ్మ ఏమరులోగాని ||
పరమ పురుషుడట పసులగాచెనట
సరవులెంచిన విన సంగతా యిది
హరియె తానట ముద్దులందరికి జేసెనట
యిరవాయ నమ్మ సుద్దులేటివోగాని ||
వేదాల కొడయడట వెన్నలు దొమ్గిలెనట
నాదాన్ని విన్నవారికి నమ్మికాయిది
ఆదిమూల మితడట ఆడికెల చాతలట
కాదమ్మ యీ సుద్దులెట్టికతలో గాని ||
అల బ్రహ్మ తండ్రియట యశోదకు బిడ్డడట
కొలదొకరికి చెప్ప కూడునా యిది
తెలిసి శ్రీ వేంకటాద్రి దేవుడై విలిచెనట
కలదమ్మ తనకెంత కరుణోగాని ||
ఎదుటినిధానమ వెటుజూచిన నీ
వదె వేంకటగిరియనంతుడా ||
సొగిసి భాద్రపదశుద్ధచతుర్దశి
తగువేడుక నిందరు గొలువ
పగటుసంపదలు బహుళమొసగు నీ
వగు వేంకటగిరియనంతుడా ||
తొలుత సుశీలకు దుశ్శీలవలన
వెలయు సంపదల విముఖుడవై
వలెనని కొలిచిన వడి గాచినమా
యలవేంకటగిరియనంతుడా ||
కరుణ గాచితివి కౌండిన్యుని మును
పరగినవృద్ధబ్రాహ్మడవై
దొరవులు మావులు ధృవముగ గాచిన
హరి వేంకటగిరియనంతుడా ||
ఎదురు గుదురుగాను మేల నవ్వీనే
యెదుగా తడవునుండి యేల నవ్వీనే ||
వరుసలు వంతులును వనితల మాదుకోగా
యిరవైన విభుడు తానేల నవ్వీనే
తరమిడి నిద్దరము తన్ను దగ వడిగితే
యెరవులు సేసుకొని యేల నవ్వీనే ||
వొక్కరొక్కరము సొమ్ములొనరగ సిరిచూడగ
యిక్కువైన రమణుడు యేల నవ్వీనీ
చకగామాలోనే మమ్ము సంతసముసేయమంటాను
యిక్కడా మామోము చూచి యేల నవ్వీనే ||
మోవిమీద గుఱుతులు మూసుకొనే మమ్ముజూచి
యీవేళ శ్రీవేంకటేశుడేల నవ్వీనే
భావించి మమ్మేలితివి పాడి దిద్దుమంటేను
యే వెలదులతోనైన నేల నవ్వీనే ||
ఎదురుబడి కాగిళ్ళు యేరులాయ మీ వలపు
అదను బదనుగూడి అడుసాయె వలపు ||
చిక్కని చెమటలను చిప్పిలీని వలపు
చొక్కపు కరగులను జొబ్బిలీని వలపు
చక్కని సరసముల జాలు వాలీ వలపు
తెక్కుల మచ్చికలచే దీగె వారీ వలపు ||
జవ్వనము కళల రసములబ్బీ వలపు
నివ్వటిట్లు కోరికల నీరుకమ్మీ వలపు
రవ్వల తమకముల వువ్విళ్ళూరీ వలపు
చివ్వన దరితీపుల జిడ్డుకట్టీ వలపు ||
పంతపు రతులనే పాలుగారీ వలపు
బంతి మోవులనే కడు బచ్చిదేరీ వలపు
ఇంతలో శ్రీ వేంకటేశ యెనసి మీరుండగాను
దొంతరచుట్టరికాన దొప్పదోగీ వలపు ||
ఎదురేది యెంచిచూడ నితని ప్రతాపానకు
పదిదిక్కులను భంగపడిరి దానవులు
యెక్కువగా వినోదాన కితడు తేరెక్కితేను
యెక్కిరిదైత్యులు కొర్రు లిందరు గూడి
చక్కగా నితడు చేత చక్రమెత్తినమాత్రాన
దిక్కుల బరువెత్తిరి దిమ్మరిఅసురలు
దట్టమై యీతనిభేరి దగ నాదుపుట్టితేను
పుట్టె నుత్పాతాలు వైరిపురములందు
అట్టె గరుడధ్వజ మటు మిన్నుముట్టితేను
కిట్టిదనుజుల కపకీర్తి తుదముట్టెను
అలిమేలుమంగవిభు డటు వీధు లేగితేమ
ఖలు లేగిర యమునికట్టెదిరికి
యెలమి శ్రీ వేంకటేశు డేపుమీర జొచ్చితేను
ములిగి దైత్యసతులు మూలమూల చొచ్చిరి
ఎను పోతుతో నెద్దు నేరుగట్టిన యత్లు
యెనసి ముందర సాగదేటి బ్రదుకు ||
కడలేని యాసచే కరగి కరగి చిత్త
మెడమ వంకకు వచ్చె నేటి బ్రదుకు
పొడవైన సమతతో బొదల బొదల మాస
మిడుమపాట్లు బడనేటి బ్రదుకు ||
తెగదెంపులేని భ్రాంతికిజిక్కి యాచార
మెగసి గొందులు దూరె నేటి బ్రదుకు
వగగొన్న మోహతాపము వేరుగ విజ్గ్యాన
మిగురువెట్టక మానె నేటి బ్రదుకు ||
భావింప రోత లోబడి పొరలెడి సొఊఖ్హ్య
మేవగింపడు జీవుడేటి బ్రదుకు
శ్రీవేంకటేశుపై చిత్త మొక్కటెకాని
యేవంక సుఖ్హము లే దేటిబ్రదుకు ||
ఎనుపోతుతో నెద్దు నేరుగట్టినయట్లు
యెనసి ముందర సాగదేటిబ్రదుకు ||
కడలేనియాసతో కరగికరగి చిత్త
మెడమవంకకు వచ్చె నేటిబ్రదుకు
పొడవైనమమతతో బొదల బొదల మాన
మిడుమపాట్ల బడె నేటిబ్రదుకు ||
తెగదెంపులేని భ్రాంతికి జిక్కి యాచార
మెగసి గొందులు దూరె నేటిబ్రదుకు
పగగొన్న మోహతాపము వేరుగ విజ్ఞాన
మిగురువెట్టక మానె నేటిబ్రదుకు ||
భావింప రోతలోబడి పొరలెడిసౌఖ్య
మేవగింపడు జీవుడేటిబ్రదుకు
శ్రీవేంకటేశుపై చిత్తమొక్కటె కాని
యేవంక సుఖము లేదేటిబ్రదుకు ||
ఎన్నగలుగుభూతకోటినెల్ల జేసినట్టిచేత
నిన్ను జేసుకొనుటగాక నీకు దొలగవచ్చునా ||
గుట్టుచెరిచి లోకమెల్ల ఘోరసంసారమందు
కట్టివేసినట్టిపాపకర్మ మేలతీరును
పట్టితెచ్చి నిన్ను రోలగట్టివేసి లోకమెఱగ
రట్టుసేసుగాక నిన్ను రాజనన్న విడుచునా ||
మిఱ్ఱుపల్లములకు దెచ్చి మెరసి భూతజాలములకు
దొఱ్ఱపెసలు గొలచినట్టి దోసమేల పాయును
అఱ్ఱుసాచి గోపసతుల నలమి వెంటవెంట దిరుగ
వెఱ్ఱి జేయుగాక నీవు విభుడనన్న విడుచునా ||
పరుల ఇంటికేగు పరులపరుల వేడజేసినట్టి
యెఱికమాలినట్టిచేత లేలనిన్ను విడుచును
వెరవుమిగిలి వేంకటాద్రివిభుడననుచు జనులచేత
నరులుగొనగ జేయుగాక ఆస నిన్ను విడుచునా ||
ఎన్నటి చుట్టమో యాకె నెరుగ నేను
అన్నిటా నేనే నీకు నాలనంటా నుందును ||
నెలత యెవ్వతో కాని నిన్ను బొడగనవచ్చే
చెలప చెమటలతో సిగ్గులతోడ
చెలుల చెప్పుమనుచుచు జేరి వాకిటనున్నది
తొలుత నీవాపె మోము తోగి చూడవయ్యా ||
వాని నీకేమౌనో కాని, వలపుల మాటలాడి
వేవేగ దురుము జార విరులరాల
దేవులవలె దలుపుదెరచి లోనికేతెంచె
భావించి యాపెగురుతు పరికించివయ్యా ||
యెంత పనికోగాని యేకతము గద్దనీను
సంతసాలు గడునిండ జవులురేగ
యింతలో శ్రీ వేంకటేశ యే నలమేలుమంగను
చెంత నన్నేలితి వాకె జిత్తగించవయ్యా ||
ఎన్నడు జెడని యీవులిచ్చీని మాధవుడు
పన్నిన యాస లితనిపైపై నిలుపవో ||
కొననాలుకా! హరిగుణములే నుడుగవో
మనసా! ఆతని దివ్య మహిమెంచవో
తనువా! శ్రీపతి తీర్థదాహమే కోరవో
యెనలేని అడియాస లేటికి నీకికను ||
వీనులారా! యేపొద్దు విష్ణుకథలే వినరో
ఆనినచేతు లితనికంది మొక్కరో
కానుక చూపులాల కమలాక్షు జూడరో
యీ నేటి పాపాల బారినేల పడేరికను ||
నలిబాదాలాల! హరి నగరికే నడవరో
కలభక్తి యాతనిపై ఘటియించరో
చలమా! శ్రీవేంకటేశు సంగతినే వుండవో
యెలయింపు గోరికలకేల పారేవికను ||
ఎన్నడు జెడని యీవులిచ్చీని మాధవుడు
పన్నిన యాస లితనిపైపై నిలుపవో ||
కొననాలుకా! హరిగుణములే నుడుగవో
మనసా! ఆతని దివ్య మహిమెంచవో
తనువా! శ్రీపతి తీర్థదాహమే కోరవో
యెనలేని అడియాస లేటికి నీకికను ||
వీనులారా! యేపొద్దు విష్ణుకథలే వినరో
ఆనినచేతు లితనికంది మొక్కరో
కానుక చూపులాల కమలాక్షు జూడరో
యీ నేటి పాపాల బారినేల పడేరికను ||
నలిబాదాలాల! హరి నగరికే నడవరో
కలభక్తి యాతనిపై ఘటియించరో
చలమా! శ్రీవేంకటేశు సంగతినే వుండవో
యెలయింపు గోరికలకేల పారేవికను ||
ఎన్నడు దీరీ నీతెందేపలు (?)
పన్నిన జీవులబంధములు.
భారపుజిత్తము ప్రవాహరూపము
వూరెటిమదములు వీటెత్తె
తీర వింద్రయపుదేహభ్రాంతులు
కోరేటికోర్కుల గొండలు వెరిగె
ఉడికేటిపాపము లుగ్రనరకములు
తొడికేటికర్మము తోడంటు
విడువవు భవములు వెంటవెంటనే
చిడుముడి జిత్తము చీకటి వడెను.
రపణపుభవములు రాట్నపుగుండ్రలు
చపలపుబుద్దులు జలనిధులు
ఇపుడిదె శ్రీవేంకటేశుడ నీవే
కపటమువాయగ గరుణించితివి.
ఎన్నడు పక్వము గా దిదె యింద్రియభోగంబులచే
సన్నము దొడ్డును దోచీ సంసారఫలంబు ||
తిత్తితో నూరేండ్లకును దేహము పండగబండగ
చిత్తంబెన్నడు పండక చిక్కెను కసుగాయై
పొత్తులపుణ్యముబాపము పులుసును తీపై రసమున
సత్తు నసత్తును దోచీ సంసారఫలంబు ||
వెదవడి పుత్రులుపౌత్రులే విత్తులు లోలో మొలచియు
పొది గర్మపుపూ మారదు పూపిందెయిన దిదే
తుదనిదె సుఖమును దుఃఖము తోలును గింజయు ముదురుక
చదురము వలయము తోచీ సంసారఫలంబు ||
వినుకలిచదువుల సదలో వేమరు మాగగ బెట్టిన
ఘనకర్మపుటొగ రుడుగదు కమ్మర పులిగాయై
మనుమని శ్రీవేంకటేశుకు మహినాచార్యుడు కానుక
చనవున నియ్యగ వెలసెను సంసారఫలంబు ||.
ఎన్నడు మంచివాడ నయ్యేను నేను
నన్ను నీవే మన్నించి నడుపవే దయివమా
వేపమానికిని చేదు విడువక వుండేది
యేపొద్దు సహజమే యెంతైనాను
పాపపుణ్యలంపటాన బరగింవుండేటినేను
చాపలదుర్గుణినౌట సహజమే
పాముకు విష మెప్పుడు పండ్ల బెట్టుకుండేది
భూమిలో సహజమే పొరి నెంతైనా
కామక్రోధుడ నాకు గరుణ యించుక లేక
సామజపుదుర్మదము సహజమే,
అటుగాన శృఈవేంకటాధిప నాకిక వేరే
తటుకన నేడు శాంతము వచ్చీనా
ఘటన నీకృపయందుగలిగిన మేలు నాపై
తటుకన ముంచి నన్ను దరిచేర్పవే.
ఎన్నడు విజ్ఞానమిక నాకు
విన్నపమిదె శ్రీ వేంకటనాథా ||
బాసిన బాయవు బంధములు
ఆస దేహమున్నన్నాళ్ళు
కోసిన తొలగవు కోరికలు
గాసిలి చిత్తము కలిగినన్నాళ్ళు ||
కొచ్చిన కొరయవు కోపములు
గచ్చుల గుణములు గలిగినన్న్నాళ్ళు
తచ్చిన తగలవు తహ తహలు
రచ్చల విషయపు రతులన్నాళ్ళు ||
ఒకటి కొకటికిని ఒడబడవు
అకట శ్రీవేంకటాధిపుడా
సకలము నీవే శరణంటే ఇక
వికటము లణగెను వేడుక నాళ్ళు ||
ఎన్నడొకో నే దెలిసి యెక్కుడయి బ్రదికేది
పన్నిననాగుణమెల్లా భ్రమత పాలాయ।
ధనమద మిదె నన్ను దైవము నెఱ గనీదు
తనుమద మెంతయిన తపము జేయనీదు
ఘన సంసారమదము కలుషము బాయనీదు
మవెడినామనువెల్ల మదముపాలాయ।
పొంచి కామాంధకారము పుణ్యము గానగనీదు
కంచపుజన్మపుచిక్కు గతి చూపదు
పెంచి యజ్ఞానతనము పెద్దల నెరగనీదు
చించరానినాబుద్ది చీకటిపాలాయ।
శ్రీ వేంకటేశ్వరమాయ చిత్తము దేరనీదు
యేవంకా నీతడే గతి యిన్నిటా మాకు
యేవుపాయమును లేక యీతని మఱగు చొచ్చి
దేవుడంతర్యామి యని తేజము బొందితిమి।
ఎన్నాళ్ళదాక దానిట్టె వుండుట బుద్ధి
కన్నపోవుట పూర్వకర్మశేషం
కలకాలమెల్ల దుఃఖమెకాగ బ్రాణికిని
వలదా సుఖము గొంతవడియైనను
కలుషబుద్ధుల బ్రజ్ఞగల దింతయును మంట
గలసిపోవుటే పూర్వకర్మశేషం ||
జాలి తొల్లియుబడ్డజాలె నేడునుగాక
మేలు వొద్దా యేమిటినై నాను
తాలిమిలో హరి దలచక యెఱుకెల్ల
గాలిబోవుట పూర్వకర్మశేషం ||
తరగనినరకపుబాధయు నేడునుగాక
దరి చేరవలదా యింతటనైనను
తిరువేంకటాద్రిపైదేవుని గొలువక
గరివడే భవమెల్ల కర్మశేషం ||
ఎన్నాళ్ళున్నా నిట్టె కదా
విన్నని వెరగులె వేడుకలాయె ||
భువి నెట్టున్నా బోయేదే కా
చవులకు జవియగు శరీరము
ధ్రువమని యీ సుఖ దుఃఖ రోగములు
భవముల కిదియే బందములాయె ||
ఎంత వొరలినా నిదే తాగద
కంతల కంతల కాయమిది
బొంత దగలుచుక పొరలగ బొరలగ
సంత కూటములె సరసములాయె ||
కైపుసేసినా ఘనమౌనే కా
పాపము బుణ్యము బైపై నే
యీ పుట్టుగునకు ఈ వేంకటపతి
దీపించగ బెను దెరువొకటాయె ||
ఎన్నాళ్ళున్నా నిట్టె కదా
విన్నని వెరగులె వేడుకలాయె ||
భువి నెట్టున్నా బోయేదే కా
చవులకు జవియగు శరీరము
ధ్రువమని యీ సుఖ దుఃఖ రోగములు
భవముల కిదియే బందములాయె ||
ఎంత వొరలినా నిదే తాగద
కంతల కంతల కాయమిది
బొంత దగలుచుక పొరలగ బొరలగ
సంత కూటములె సరసములాయె ||
కైపుసేసినా ఘనమౌనే కా
పాపము బుణ్యము బైపై నే
యీ పుట్టుగునకు ఈ వేంకటపతి
దీపించగ బెను దెరువొకటాయె ||
ఎన్ని చందములనెట్లైన నుతింతు
కన్నుల నిన్నే కనుగొంటి గాన ||
గోవిందా యని కొలిచిన నిన్నే
శ్రీ వల్లభుడని చింతింతును
భూవిభుడవు యిది పునరుక్తనకు మీ
దైవ మొకడవే ధరణికి గాన ||
ఎన్ని మహిమల వాడే ఈ దేవుడు
కనుల పండువులెల్ల గదిసినట్లుండె ||
పోలింపు కర్పూర కాపు పురుషోత్తమునికి
ఏలీల నుండె నని యెంచి చూచితే
పాల జలధిలోన పవళింపగా మేన
మేలిమి మీగ డంటిన మెలుపుతో నుండె ||
తట్టు పునుగు కాపు దైవ శిఖామణికి
ఎట్టుండెనని మది నెంచి చూచితే
చిట్టకాన రేపల్లెలో చీకటి తప్పు సేయగా
అట్టె రాత్రులు మేన నంటి నట్లుండె ||
అలమేలు మంగతో అట్టె సొమ్ము ధరించి
ఎలమి శ్రీ వేంకటేశు నెంచి చూచితే
కలిమిగల ఈ కాంత కౌగిట పెనగగాను
నిలువెల్ల సిరులై నిండినట్లుండె ||
ఎన్నిచేత లెన్నిగుణాలెన్ని భావాలు ||
యేమి లీలలు నటియించే వేమయ్య దేవుడా
భూమిలో జీవులనెల్ల బుట్టింపుచు
ప్రేమతో మాటలాడే పిన్నవాడవూ గావు
నీ మహిమ లిన్నియూ నీకె తెలుసు ||
యెంతని వదరుకొనే విందిరా నాథుడా
అంతరంగముల నుండె అందరిలోన
వింతలు లేవు నీకు వెఱ్ఱివాడవు గావు
యింతేసి విచారాలు యివి నీకె తెలుసు ||
చెలగి వరాలిచ్చేవు శ్రీ వేంకట నాథుడా
తలకక నిన్ను గొల్చే దాసులకు
అలరి నీవైతేను అశక్తుడవు గావు
నెలవైన నీ సుద్దులు నీకె తెలుసు ||
ప|| ఎన్నిబాధలబెట్టి యేచెదవు నీవింక యెంతకాలముదాక కర్మమా|
మన్నించుమనుచు నీమరుగు జొచ్చితిమి మామాటాలకించవో కర్మమా ||
చ|| ప్రతిలేని దురితముల పాలుసేయక నన్ను పాలించవైతివో కర్మమా |
తతితోడ నాత్మపరితాపంబు తోడుతను తగులేల చేసితివో కర్మమా |
జితకాములకుగాని చేతికిని లోనయి చిక్కవేకాలంబు కర్మమా |
మతిహీనులైనట్టి మాకునొక పరిపాటి మార్గంబు చూపవో కర్మమా ||
చ|| ఆసలనియెడి తాళ్ళ నంటగట్టుక విధికి నప్పగించితివిగదె కర్మమా |
వాసి విడిచితిమి నీవారమైతిమి మమ్ము వన్నె చెడనీకువో కర్మమా |
కాసుకును గొరగాని గతిలేని పనికిగా కాలూదనీవేల కర్మమా |
ఓసరించొక మారు వొయ్యనే వొకరీతి నొల్లనని తలగుమీ కర్మమా ||
చ|| తిరువేంకటాచలాధిపుని మాయలచేత దెసల దిరిగినయట్టి కర్మమా |
హరిదాసులగువారి నాదరింతువుగాక అంత నొప్పింతువా కర్మమా |
వరుస నేనుగుమీదివాని సున్నంబడుగ వచ్చునా నీకిట్ల కర్మమా |
పరమపురుషోత్తముని భ్రమతబడి నీవిట్ల బట్టబయలైతిగా కర్మమా |
ఎన్నిలేవు నాకిటువంటివి
కన్నులెదుట నిన్ను గనుగొనలేనైతి ||
అరయ నేజేసినయపరాధములు చూచి
కరుణించి వొకడైన గాచునా
కరచరణాదులు కలిగించిననిన్ను
బరికించి నీసేవాపరుడ గాలేనైతి ||
ఏతరినై నే నెరిగి సేసినయట్టి
పాతక మొకడైనా బాపునా
ఆతుమలోనుండి యలరి నోవొసగిన
చేతనమున నిన్ను జెలగి చేరనైతి ||
శ్రీవేంకటేశ నే జెసినయితరుల
సేవ కొకడు దయసేయునా
నీవే యిచ్చినయట్టి నే నీశరీరముతోడ
నీవాడ ననుబుద్ధి నిలుపనేరనైతి ||
ఎపుడు గానిరాడో యెంత దడవాయ కాని
చప్పుడాలకించి మతి జల్లురనెనమ్మా ||
ఇద్దర మదరిపాటు ఏకాంతాన నాడుకొన్న
సుద్దులు దలచి మేను చురుకనెనమ్మా
పెద్దగా గస్తూరి బొట్టూ పెట్టిన నాతడు గోర
తిద్దుట దలచి మేను దిగులనేనమ్మా||
పాయక యతడూ నేను బవ్వళించే యింటి వంక
బోయపోయి కడు జిన్నబోతినే యమ్మ
తోయపు గుబ్బల చన్నుదోయి మీద వాడొత్తిన
పాయపుజంద్రులజూచి భ్రమసితినమ్మా ||
కూడిన సౌఖ్యములందు కొదలేని వానినా
వేడుక మతి దలచి వెరగాయనమ్మా
యీడులేని తిరు వేంకటేశుడిదె నాతోడ
నాడినట్టే నాచిత్త మలరించెనమ్మా ||
ఎప్పుడును గుట్టుతోడి యిల్లాండ్లము నేము
వొప్పుగ సిగ్గు విడువనోజగాదు మాకును ||
మాట మాటలను నీకు మనసిచ్చి మెచ్చి యాపె
కాటుక కన్నుల జూచి కరగించీని
తేటలు నేరుచునాపె తేలించనోపు నాపె
యేటికి యవ్వరిపొందులేమి బాతి యికను ||
చేయివేసి చేయివేసి చెక్కునొక్కి చేత మొక్కి
మాయపు నవ్వులు నవ్వి మరగించీని
చాయలకు వచ్చునాపె సరసములాడు నాపె
ఆయనాయ వున్నసుద్దులాడ నేల యికను ||
వలపులు చల్లి చల్లి వాడికెగా నిన్ను గూడి
వెలయించ నేర్చునాపె యిన్నిటా నాపె
అలరి శ్రీ వేంకటేశ అప్పటి నన్ను గూడితి
తొలుతటి సద్దులేల దొమ్ములేల యికను ||
ఎఱుక గలుగునా డెఱుగడటా
మఱచినమేనితొ మరి యెఱిగీనా ||
పటువైభవముల బరగేటినాడె
తటుకున శ్రీహరి దలచడటా
కుటిలదేహియై కుత్తిక బ్రాణము
తటతటనదరగ దలచీనా ||
ఆలుబిడ్డలతో మహాసుఖ మందుచు
తాలిమితో హరి దలచడటా
వాలినకాలునివసమైనప్పుడు
దాళి వేడగా దలచీనా ||
కొఱతలేని తేకువ దానుండేటి
తఱి వేంకటపతి దలచడటా
మరులు దేహియై మఱచివున్నయడ
తఱచుటూరుపుల దలచీనా ||
ఎఱుగనైతి నిందాకా నేటిదో యంటానుంటి
నెఱి దొరలనాడీని నేనే మందు నికను ||
కొండలలో నెలకొన్న కోన చెన్నరాయడిదే
బొండు మల్లెల వేసెనేపూచి నన్నును
పండుముత్తేల సొమ్ములప్పటి నామెడ బెట్టి
దుండగము సేసె నేమందు నేనికను ||
గొప్పయైన యేటిదరి గోన చెన్నరాయడిదే
దప్పికి గప్పురదుంపె దరుణి చేత
చెప్పరాని మాటలెల్ల జెవిలో దానే చెప్పి
దుప్పటి గప్పీ నేమందు నికను ||
గుఱితో శ్రీ వేంకటాద్రి కోన చెన్నరాయడిదే
చెరుగు పట్టి ప్రియురాలు చెప్పికూడెను
జఱయుచు వచ్చి వచ్చి చనవు లెల్లా నొసగి
మెఱసి తొరల నాడి మఱే మందు నికను ||
ఎఱుగుదురిందరు నెఱిగీనెఱుగరు
హరి దానే నిజపరమాతుమని ||
నలినాసనుడెఱుగు నారదుడెఱుగు
కొలది శివుడెఱుగు గుహుడెఱుగు
యిల గపిలుడెఱుగు నింతా మనువెఱుగు
తలప విష్ణుడే పరతత్త్వమని ||
బెరసి ప్రహ్లాదుడు భీష్ముడు జనకుడు
గురుతుగ బలియు శుకుడు గాలుడు
వరుస నెఱుగుదురు వడి రహస్యముగ
హరి యితడే పరమాత్ముడని ||
తెలియదగిన దిది తెలియరాని దిది
తెలిసినాను మది దెలియ దిది
యిల నిందరు దెలిసిరిదే పరమమని
కలవెల్ల దెలిపె వేంకటరాయడు ||
ఎవ్వడోకాని యెరుగరాదు కడు
దవ్వులనే వుండు తలపులో నుండు ||
యెదయవు తనరెక్క లెగసి పోలేడు
కడు దాగుగాని దొంగయు గాడు
వడి గిందుపడును సేవకుడునుగాడు
వెడగుగోళ్ళు వెంచు విటుడును గాడు ||
మిగుల బొట్టివాడు మింటికిని బొడవు
జగడాలు తపసి వేషములును
మగువకై పోరాడు మరి విరక్తుండును
తగు గాపుబనులు నెంతయు దెల్లదనము ||
తరుణుల వలపించు దగిలి పైకొనడు
తురగము దోలు రౌతునుగాడు
తిరువేంకటాద్రిపై పరగు నెప్పుడును
పరమమూర్తియై పరగు నీఘనుడు ||
ఎవ్వరి గాదన్న నిది నిన్ను గాదంట
యెవ్వరి గొలిచిన నిది నీకొలువు ||
అవయవములలో నది గాదిది గా
దవి మేలివి మేలన నేలా
భువియు బాతాళము దివియు నందలి జంతు
నివహ మింతయునూ నీదేహమేకాన ||
నీవు లేనిచోటు నిజముగ దెలిసిన
ఆవల నది గాదనవచ్చును
శ్రీవేంకటగిరి శ్రీనాథ సకలము
భావింప నీవే పరిపూర్ణుడవుగాన ||
ఎవ్వరికిగలదమ్మ యింత సౌభాగ్యము
యివ్వల నీతో సరి యెంచరాదే నొరుల ||
వీడిన తురముతోడ విరుల పైపై రాల
వాడిక కన్నులతోడ వచ్చేనేమి
వడియు జెమటతోడ వత్తివంటి మోవితోడా
నడపు మురిపెములతోడ నవ్వేవేమే ||
నిద్దుర కన్నులతోడ నిండుబులకలతోడ
ముద్దుగారే మోముతోడ మురిసేవేమే
వొద్దనే శ్రీవేంకటేశుడొగిగూడు తెరుగమే
ముద్దురాల నేడు నీ మోహ మెంచరాదే ||
ఎవ్వరికైనను యివ్రాత నను
నవ్వులు సేసెబో నావ్రాత ||
తొలిజన్మంబున దోషకారియై
నలుగడ దిప్పెను నావ్రాత
యిల దుర్గుణముల కీజన్మంబున
నలకువ సేసెబో నావ్రాత ||
పురుషుని జేసల్పుని ననిపించుట
నరజన్మమునకు నావ్రాత
తరుచయ్యినైపాతక మరుపెట్టుక
నరకము చూపెబో నావ్రాత ||
పామఱితనమున బహువేదనలను
నామ సెనసెబో నావ్రాత
కామితఫలు వేంకటపతిని గొలిచి
నామతి దెలిపెబో నావ్రాత ||
ఎవ్వరిభాగ్యం బెట్టున్నదో
దవ్వు చేరువకు తానె గురుతు
పరమమంగళము భగవన్నామము
సురలకు నరులకు శుభకరము
యిరవుగ నెఱిగిన యెదుటనె వున్నది
వరుసల మఱచినవారికి మాయ
వేదాంతసారము విష్ణుభక్తి యిది
అదిమునులమత మయినది
సాదించువారికి సర్వసాధనము
కాదని తొలగిన గడుశూన్యంబు
చేతినిదానము శ్రీవేంకటపతి
యేతల జూచిన నిందరికి
నీతియు నిదియే నిజఏవకులకు
పాఠకులకు నది భవసాగరము
ఎవ్వరివాడో ఈ దేహి
యివ్వల నవ్వల నీ దేహి ||
కామించు నూరకే కలవియు లేనివి
యేమిగట్టుకొనె నీ దేహి
వాములాయ నిరువదియొక వావులు
యేమని తెలిసెనో యీ దేహి ||
కందువ నిజములు గల్లలునడపి
యెందుకు నెక్కెనో యీ దేహి
ముందర నున్నవి మొగిదనపాట్లు
యిందె భ్రమసీ నీ దేహి ||
పంచేంద్రియముల పాలాయ జన్మము
యించుక యెరుగడు యీదేహి
అంచెల శ్రీ వేంకటాధీశ నీకృప
వంచగ గెలిచెను వడి నీ దేహి ||
ఎవ్వరివాడో యెఱుగరాదు
అవ్వలివ్వలిజీవు డాటలో పతిమే ||
ధర జనించకతొలుత తను గానరాదు
మరణమందినవెనుక మఱి కానరాదు
వురువడిదేహముతో నుందినయన్నాళ్ళే
మరలుజీవునిబదుకు మాయవో చూడ ||
యిహములో భోగించు నిందు గొన్నాళ్ళు
మహిమ పరలోకమున మలయు గొన్నాళ్ళు
తహతహల గర్మబంధముల దగిలినయపుడే
అహహ దేహికి బడుచులాటవో బదుకు ||
సంతానరూపమై సాగు ముందరికి
కొంత వెనకటిఫలము గుడువ దా దిరుగు
యింతటికి శ్రీవేంకటేశు డంతర్యామి
అంతి నితనిగన్నబదుకువో బదుకు ||
ఎవ్వరు గర్తలుగారు యిందిరానాథుడే కర్త
నివ్వటిల్లాతనివారై నేమము దప్పకురో ||
కర్మమే కర్తయితే కడకు మోక్షము లేదు
అర్మిలి జీవుడు గర్తయైతే బుట్టుగేలేదు
మర్మపుమాయ గర్తయితే మరి విజ్ఞానమేలేదు
నిర్మితము హరిదింతే నిజమిదెరుగరో ||
ప్రపంచమే కర్తయితే పాపపుణ్యములు లేవు
వుపమ మనసు గర్తైయుంటే నాచారమేలేదు
కపటపు దెహములే కర్తలయితే చావులేదు
నెపము శ్రీహరిదింతే నేరిచి బ్రదుకరో ||
పలుశ్రుతులు గర్తలై పరగితే మేరలేదు
అల బట్టబయలు గర్తైతే నాధారము లేదు
యెలమి నిందరికి గర్త యిదివో శ్రీవేంకటాద్రి
నిలయపుహరి యింతే నేడే కొలువరో ||
ఎవ్వరు దిక్కింక నాకు నేది బుద్ది
యివ్వల విచారించవే ఇందిరారమణా.
వెంటబెట్టి కామక్రోధవితతులు చుట్టి నన్ను
తొంటి మీసేవకు నన్ను దూరము సేసె
కంటకపుటింద్రియాలు కడుహితశత్రులై
అంటిన మోxఅముత్రోవ నంటకుండా జేసెను.
తిప్పి తిప్పి నాయాసలు తెగీ వైష్ణవధర్మాన
దెప్పల దేలకుండాను తీదీపు సేసె
వొప్పగుంసంసార మిది వున్నతి నాచార్యసేవ
చొపు మాపి పుణ్వాసకు జొరకుండాజేసెను.
మచ్చరపు దేహ మిది మనసిట్టె పండనిక
తచ్చి యజ్ఞానమునకు దావుసేసె
ఇచ్చల శృఈవేంకటేశ ఇంతలో నన్ను నేలగ
నిచ్చలు నీకృపే నన్ను నిర్మలము సేసెను.
ఎవ్వరు లేరూ హితవుచెప్పగ వట్టీ
నొవ్వుల బడి నేము నొగిలేమయ్యా ||
అడవి బడినవాడు వెడల జోటులేక
తొడరి కంపలకిందు దూరినట్లు
నడుమ దురిత కాననములతరి బడి
వెడలలేక నేము విసిగేమయ్యా ||
తెవులువడినవాడు తినబోయి మధురము
చవిగాక పులుసులు చవిగోరినట్లు
భవరోగముల బడి పరమామృతము నోర
జవిగాక భవములు చవులాయనయ్యా ||
తనవారి విడిచి యితరమైనవారి
వెనక దిరిగి తావెర్రైనట్లు
అనయము తిరువేంకటాధీశు గొల్వక
మనసులోనివాని మరచేమయ్యా ||
ఎవ్వరుగలరమ్మా యిక నాకు
నెవ్వగలలో జిత్తము నెలకొన్నదిపుడు ||
మనసుకోరిక దీని మానిపెదనంటినా
వొనగూడి మనసు నావొదలేదు
పెనగి తమకము వాపెదనంటినా మేన
అనయము వెరపు దానై యున్నధివుడు ||
చింత తాలిముల ముంచెదనంటినా మేన
సంతావముల సేయ జలపట్టెను
అంతరంగము నాది యంటినా నెవున
సంతతము నాతడే జట్టిగొనెనిపుడు ||
సింగారపు మెను నా చేతికి లోనంటినా
అంగవించి పరవశమై యున్నది
యింగితమెరిగి వేంకటేశుడు నాకంటినా
కంగినన్ను గారించి కలసెనిపుడు ||
ఎవ్వరెవ్వరివాడో యీజీవుడు చూడ
నెవ్వరికి నేమౌనో యీజీవుడు ||
ఎందరికి గొడుకుగా డీజీవుడు వెనుక
కెందరికి దోబుట్ట డీజీవుడు
యెందరిని భ్రమయించ డీజీవుడు దుఃఖ
మెందరికి గావింప డీజీవుడు ||
ఎక్కడెక్కడ దిరుగ డీజీవుడు వెనుక
కెక్కడో తనజన్మ మీజీవుడు
యెక్కడి చుట్టము దనకు నీజీవుడు యెప్పు
డెక్కడికి నేగునో యీజీవుడు ||
ఎన్నడును జేటులేనీజీవుడు వెనుక
కెన్నిదనువులు మోవ డీజీవుడు
యెన్నగల తిరువేంకటేశు మాయల దగిలి
యెన్నిపదవుల బొంద డీజీవుడు ||
ఏ
ఏ కులజుడైననేమి యెవ్వడైననేమి
ఆకడ నాతడె హరినెఱిగినవాడు
పరగిన సత్యసంపన్నుడైన వాడే
పరనిందసేయ దత్పరుడు గాని వాడు
అరుదైన భూతదయానిధి యగువాడే
పరులదానే యని భావించువాడు
నిర్మలుడై యాత్మనియతి గలుగువాడే
ధర్మతత్పరబుధ్ధి దలిగిన వాడు
కర్మమార్గములు తడవనివాడే
మర్మమై హరిభక్తి మఱవనివాడు
జగతి పై హితముగా జరియించువాడే
పగలేక మతిలోన బ్రదికినవాడు
తెగి సకలము నాత్మ దెలిసినవాడే
తగిలి వెంకటేశు దాసుడయినవాడు
ఏ నిన్నుదూరక నెవ్వరి దూరుదు నీ
వాని నన్నొకయింత వదలక నను నేలవలదా ||
అపరాధిగనక నన్నరసి కావుమని
అపరిమితపు భయమంది నీకు శరణంటిగాక
నెపములేక నన్ను నీకు గావగనేల
అపవర్గరూప దయాంబుధి తిరువేంకటాధిపా ||
ఘనపాపి గనక నీకరుణ గోరి నీ
వనవరతము నాయాతుమను విహరించుమంటిగాక
యెనసి నన్ను గాచుటేమి యరుదు నీకు
ననఘుడ పరమతత్త్వానంద తిరువేంకటాధిప ||
ప|| ఏ పురాణముల నెంత వెదికినా | శ్రీపతి దాసులు చెడరెన్నడును ||
చ|| హరి విరహితములు అవిగొన్నాళ్ళకు | విరసంబులు మరి విఫలములు |
నరహరి గొలిచిటు నమ్మిన వరములు | నిరతము లెన్నడు నెలవులు చెడవు ||
చ|| కమలాక్షుని మతిగానని చదువులు | కుమతంబులు బహు కుపథములు |
జమళి నచ్యుతుని సమారాధనలు | విమలములేకాని వితథముగావు ||
చ|| శ్రీవల్లభుగతి జేరనిపదవులు | దావతులు కపట ధర్మములు |
శ్రీవేంకటపతి సేవించు సేవలు | పావనము లధిక భాగ్యపు సిరులు ||
ఏకతాన వున్నవాడు యిదివో వీడె
చేకొని మొక్కరో మీరు చేతులెత్తి యిపుడు
మంచిమంచిపన్నీట మజ్జన మవధరించి
పంచమహావాద్యాలతో పరమాత్ముడు
అంచల గప్పురకాపు అంగముల మెత్తుకొని
కొంచక నిలుచున్నాడు గోణాముతోడను
తట్టపుణుగామీద దట్టముగ నించుకొని
తెట్టలై వేదనాదాల దేవదేవుడు
గుట్టుతోడ సొమ్ములెల్లా గుచ్చి కుచ్చి కట్టుకొని
వెట్టదీర సురట్ల విసరించుకొంటాను
తనిసి యలమేల్మంగ దాళిగా గట్టుకొనె
వెనుకొని యిదివో శ్రీవేంకటేశుడు
మునుకొని యారగించి మూడులోకములు మెచ్చ
చనవరిసతులతో సరసమాడుతాను
ఏకాత్మవాదులాల యిందుకేది వుత్తరము
మీకు లొకవిరోధ మేమిట బాసీ నయ్యలాల
పాపమొక్కడు సేసితే పాపులే యిందరు గావలదా
యేపున వొకరిపుణ్య మిందరికి రావలదా
కోపించి యొక్కడసురైతే కోరి యిందరు గావలదా
చూప దేవుడొక్కడైతే సురలిందరు గావలదా
వొకడపవిత్రుడైతే నొగి నిందరు గావలదా
వొకడు శుచైవుండితె వోడకిందరు గావలదా
వొకనిరతి సుఖమంటి యిందరును వొనర బొందవలదా
వొకని దుఃఖమందరు వూర బంచుకోవలదా
ఆకడ నొకడు ముక్తుడయితే నందరును గావలదా
దీకొని యొకడు బద్ధుడైతే యిందరు గావలదా
చేకొని శ్రీవేంకటేశు జేరి దాసులయి యుండేటి
లోకపుమునులను దెలుసుకోవలదా
ఏగతి నుద్దరించేవో యింతటిమీదట మమ్ము
భోగపుగొరింకలచే బొలిసెబో పనులు
పరగి నాలుకసొమ్పు వరసిపొయ
పరులనే నుతియించి పలుమారును
విరసపు బాపములవినికిచే వీనులెల్లా
గొరమాలె మాకు నేటికులాచారములు
మొక్కలాన బంధనమునకు జాచి చాచి
యెక్కువ జేతులమహి మెందో పొయ
తక్కక పరస్త్రీల దలచి మనసు బుద్ది
ముక్కపొయ మాకు నేటిముందరిపుణ్యములు
యెప్పుడు నీచుల ఇండ్ల కెడ తాకి పాదములు
తప్పనితపములెల్లా దలగిపోయ
యిప్పుడే శ్రీవేంకటేశ యిటు నిన్ను గొలువగా
నెప్పున నే జేసినట్టి నేరమెల్లా నడగె
ఏటి సుఖము మరి ఏటి సుఖము
ఒకమాట మాత్రము నటమటమైన సుఖము
కొనసాగు దురితములె కూడైన సుఖము
తను విచారములలో దాకొన్న సుఖము
పనిలేని యాసలకు బట్టయిన సుఖము
వెనక ముందర జూడ వెరగైన సుఖము
నిందలకులోనైన నీరసపు సుఖము
బొందికిని లంచంబు పుణికేటి సుఖము
కిందుపడి పరులముంగిలి గాచు సుఖము
పందివలె తనుదానె బ్రతికేటి సుఖము
ధృతిమాలి యిందరికి దీనుడగు సుఖము
మతిమాలి భంగములు మరపించు సుఖము
పతి వేంకటేశు కృప పడసినది సుఖము
యితరంబులన్నియును నీ పాటి సుఖము
ఏటికి దలకెద రిందరును
గాటపుసిరులివి కానరొ ప్రజలు ||
ఎండల బొరలక యేచినచలిలో
నుండక చరిలో నుడుకక
అండనున్నహరి నాత్మదలచిన
పండినపసిడే బ్రతుకరొ ప్రజలు ||
అడవుల నలయక ఆకునలము దిని
కడుపులు గాలగ గరగక
బడిబడి లక్ష్మీపతికి దాసులై
పొడవగుపదవుల బొందరొ ప్రజలు ||
పొక్కేటికాళ్ళ పుండ్లు రేగగ
దిక్కులనంతట దిరుగక
గక్కన తిరువేంకటగిరిపతి గని
వొక్కమనసుతో నుండరొ ప్రజలు ||
ఏటికి నెవ్వరిపొందు యిస్సిరో చీచీ
నాటకములాల చీచీ నమ్మితిగా మిమ్మును ||
జవ్వనమదమ చీచీ చక్కదనమరో చీచీ
రవ్వైన రాజసగర్వమరో చీచీ
కొవ్వినమదమ చీచీ కూరిమియాసరో చీచీ
నవ్వులదేహమ చీచీ నమ్మితిగా మిమ్మును ||
ముచ్చటమమత చీచీ ముచ్చుమురిపెమ చీచీ
బచ్చురవణములోనిబచ్చన చీచీ
తెచ్చుకోలు తాలిములదిట్టతనమరో చీచీ
పుచ్చినపోకరో చీచీ పోయగా మీకాలము ||
సిరులచీకటి చీచీ సిలుగుసంపద చీచీ
పరవిభవమ చీచీ వాసిరో చీచీ
కరుణించె దిరువేంకటగిరిపతి నన్ను
విరసవర్తన చీచీ వీడెగా మీభారము ||
ఏటికి సత్యాలు సేసేవెందాకా నీవు
గాటముగనింకా దారుకాణించవలెనా ||
చెలియిచ్చిన పువ్వుల చెండునీచేతనున్నది
మలసి నీచేతకది మచ్చముగాదా
కొలది మీరగ తొల్లె గొల్లెతల మగడవు
యెలమి నీ యెడ్డతనా లెంచి చూపవలెనా ||
రమణి చేముద్దుటుంగరము నీవేలనున్నది
కొమరై నీపొందు కది గురుతుకాదా
తమితోడ నీవుతొల్లి ధర్మరాజు మరిదివి
గములై నీ నిజాలకు కడగురుతున్నదా ||
అంగనకంటసరి నేడట్టె మెడనున్నది
సంగతిగా నీకదే లాంచనము గాదా
చెంగట నన్నేలితివి శ్రీవేంకటేశ్వర
అంగపు నీరీతులకు నొఊగాములున్నవా ||
ఏటికే యీ దోసము మీ రెఱుగరటే
ఆట దాననింతే నన్ను ఆఱడిబెట్టకురే ||
తామర మొగ్గలవంటి తగిన నా చన్నులివి
కాముని యమ్ములనేరు కాంతలదేమే
నా మగని కౌగిటలో ననిచే జక్క వలవి
ప్రేమమున మారుబేరు పెట్టుదురటే ||
చందురుని బోలేటి సరసపు నా మోము
అందపు బూబంతియంటా నాడు కోకురే
ముందు నా రమణునికి మోము చూచేటద్దమిది
కందువలేని నిందలు గడింతురటే ||
తీగెవంటి నామేను దిక్కుల మెఱుగనుచు
పోగులుగా సారె సారె బొగడకురే
బాగుగ శ్రీ వేంకటేశు పానుపుపై చిగురిది
మోగము గూడెను వేరే వుప్పటించ నేటికే ||
ఏటినేను యేటిబుద్ది యెక్కడిమాయ
వీటిబొయ్యే వెర్రి గాను వివేకి గాను
ఆరసి కర్మము సేసి అవినన్ను బొదిగితే
దూరుదు గర్మము గొంది దూరుచు నేను
నేరక లంపటములు నేనే కొన్ని గట్టుకొని
పేరడి బరుల నందు బెట్టరంటాను
యెక్కుడు నాదోషములు యెన్నైనా వుండగాను
వొక్కరిపాపము లెంతు వూరకే నేను
తిక్కవట్టి నాకునాకే దేవతల కెల్లా మొక్కి
వొక్కరివాడ గాకుందు వుస్సురనుకొంటాను
విరతి బొందుదు గొంత వేరే సంసారము జేతు
యెరవుల దాడనే యెప్పుడు నేను
అరిది శ్రీవేంకటేశు డంతలో నన్ను నేలగా
దొరనైతి నధముడ దొల్లే నేను
ఏటిబ్రదుకు యేటిబ్రదుకు వొక్క
మాటలోనే యటమటమైనబ్రదుకు ||
సంతకూటములే చవులయినబ్రతుకు
దొంతిభయములతోడిబ్రదుకు
ముంతనీళ్ళనే మునిగేటిబ్రదుకు
వంత బొరలి కడవల లేనిబ్రదుకు ||
మనసుచంచలమే మనువయినబ్రదుకు
దినదినగండాల దీరుబ్రదుకు
తనియ కాసలనె తగిలేటిబ్రదుకు
వెనకముందర చూడ వెరపయినబ్రదుకు ||
తెగి చేదె తీపయి తినియేటిబ్రదుకు
పగవారిపంచలపాలైన బ్రదుకు
తగువేంకటేశ్వరు దలచనిబ్రదుకు
పొగకు నోపక మంట బొగిలేటి బ్రదుకు ||
ఏటిమాట లివి విన నింపయ్యనా మది
నేటవెట్టి దాసుడౌ టిదిసరియా
జీవుడే దేవుడని చెప్పుదురు గొందరు
దైవముచేతలెల్లా దమ కున్నవా
ఆవల గొందరు కర్మ మది బ్రహ్మ మందురు
రావణాదు లవి సేసి రతికెక్కిరా।
మిగుల గొందరు దైవమే లేదనెందురు
తగ నీప్రపంచమెల్లా దనచేతలా
గగన మతడు నిరాకార మందురు గొంద
రెగువ బురుషసూక్త మెఱగరా తాము
యెనిమిదిగుణములే యితని వందురు గొంద-
రనయము మిగిలిన వవి దమనా
యెనయగ శ్రీవేంకటేశ్వరుదాసులై
మనుట నిత్యముగాక మరి యేమినేలా
ఏటివిజ్ఞాన మేటిచదువు
గూటబడి వెడలుగతిరుగుచు గనలేడు ||
ఏడుమడుకలచర్మ మింతయును దూంట్లై
గాడబెట్టుచు జీము గారగను
పాడైనయిందులో బ్రదుకుగోరే బ్రాణి
వీడదన్నుక చనెడివెరవు గనలేడు ||
కడుపునిండిన మహాకష్టంబు నలుగడల
వెడలుచును బెనుకురికి వేయగాను
యిడుమ బొందుచు సుఖంబిందుకే వెదికీని
వొడలు మోపగ జీవు డోపనలేడు ||
వుదయమగుకన్నులురికి యేమైన గని
మదవికారము మతికి మరుపగాను
యిది యెరిగి తిరువేంకటేశు గని జీవుడా
సదమలానందంబు చవిగానలేడు ||
ఏడ వలపేడ మచ్చిక ఏడ సుద్దులు
ఆడుకొన్నమాటలెల్లా నవి నిజాలా ||
తొలుకారుమెరుపులు తోచి పోవుగాక
నెలకొని మింట నవి నిలిచీనా
పొలతులవలపులు పొలసిపోవుగాక
కలకాలం బవి కడతేరీనా ||
యెండమావులు చూడ నేరులై పారుగాక
అండకుబోవ దాహ మణగీనా
నిండినట్టిమోహము నెలతలమది జూడ
వుండినట్టేవుండుగాక పూతయ్యీనా ||
కలలోనిసిరులెల్ల కనుకూర్కులేకాక
మెలకువ జూడ నవి మెరసీనా
అలివేణులమేలు ఆశపాటేకాక
తలపు వేంకటపతి దగిలీనా ||
ఏడ సుజ్ఞానమేడ తెలివి నాకు
బూడిదలో హోమమై పోయ గాలము ||
ఇదె మేలయ్యెడి నాకదె మేలయ్యెడి నని
కదిసియాసచే గడవలేక
యెదురు చూచిచూచి యెలయించి యెలయించి
పొదచాటు మృగమై పోయ గాలము ||
ఇంతట దీరెడి దుఃఖమంతట దీరెడినని
వింతవింత వగలచే వేగివేగి
చింతయు వేదనల జిక్కువడుచు నగ్ని
పొంతనున్న వెన్నయై పోయ గాలము ||
యిక్కడ సుఖము నాకక్కడ సుఖంబని
యెక్కడికైనా నూరి కేగియేగి
గక్కన శ్రీతిరువేంకటపతి గానక
పుక్కిటిపురాణమయి పోయ గాలము ||
ఏణనయనలచూపు లెంత సొబగైయుండు
ప్రాణసంకటములగుపనులు నట్లుండు ||
ఎడలేనిపరితాప మేరీతి దా నుండు
అడియాసకోరికెలు నటువలెనె యుండు
కడలేనిదు:ఖసంగతి యెట్ల దానుండు
అడరుసంసారంబు నట్లనే వుండు ||
చింతాపరంపరల జిత్తమది యెట్లుండు
వంత దొలగనిమొహవశము నట్లుండు
మంతనపుబనులపయి మనసు మరి యెట్లుండు
కంతుశరమార్గములగతి యట్ల నుండు ||
దేవుడొక్క డెయనెడి తెలివి దన కెట్లుండు
శ్రీవేంకటేశుక్రుపచేత లట్లుండు
భావగోచరమైనపరిణ తది యెట్లుండు
కైవల్యసొఊఖ్యసంగతులు నట్లుండు ||
ప : ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు
ఆదినారాయణుడీ అఖిల రక్షకుండు
చ : శునకము బతుకును సుఖమయ్యే తోచుకాని
తనకది హీనమని తలచుకోదు
మనసొడబడితేను మంచిదేమి కానిదేమి
తనువులో అంతరాత్మ దైవమగుట తప్పదు
చ : పుఱువుకుండే నెలవు భువనేశ్వరమైతోచు
పెరచోటి గుంటయైన ప్రియమైయుండు
ఇరవై వుండితే చాలు ఎగువేమి దిగువేమి
వరుస లోకములు సర్వం విష్ణుమయము
చ : అచ్చమైన ఙ్ఞానికి అంతా వైకుంఠమే
చెచ్చర తనతిమ్మటే జీవన్ముక్తి
కచ్చుపెట్టి శ్రీవేంకటపతికీ దాసుడైతే
హెచ్చుకుందేమిలేదు ఏలినవాడితడే
ఏది కడ దీనికేది మొదలు వట్టి
వేదనలు తన్ను విడుచు టెన్నడు ||
తొడరినహృదయమే తోడిదొంగయై
వడిగొని తన్ను వలబెట్టగాను
కడగి కర్మముల గడచు టెన్నడు
నిడివిబంధముల నీగు టెన్నడు ||
తతిగొన్న తలపులే దైవయోగమై
మతినుండి తన్ను మరగించగాను
ప్రతిలేనియాపద బాయు టెన్నడు
ధృతిమాలినయాస దీరు టెన్నడు ||
పొదలినమమతయే భూతమై తన్ను
బొదిగొని బుద్ధి బోధించగాను
కదిసి వేంకటపతి గనుట యెన్నడు
తుదిలేనిభవముల దొలగు టెన్నడు ||
ఏది చూచిన తమకు యిన్నియును నిటువలెనె
వేదు విడిచిన కూడు వెదికినను లేదు ||
ఏకాంత సౌఖ్యములు ఎక్కడివి ప్రాణులకు
పై కొన్న దుఃఖముల పాలుపడి గాకా
ఏకమగు పుణ్యంబు లేడగల విందరికి
గై కొన్న దురితములు కలపాటి గాక ||
హితవైన మమకార మెందుగల దిందరికి
ప్రతిలేని విరహ తాపము కొలది గాకా
మతిలోని వేడుకలు మరియేవి మనుజులకు
జితమైన దైవ మిచ్చిన పాటిగాక ||
ఇరవైన దైవ కృప ఏల దొరకును తమకు
పరమైన కర్మంబు పరిపాటి గాక
ఎరవైన పెను బంధమేల వీడును నాత్మ
తిరు వేంకటేశు కృప తిరమైన గాక ||
ఏది చూచిన నీవే యిన్ని యును మఋఇ నీవే
వేదవిరహితులకు వెఋఅతు మటుగాన ||
ఇరవుకొని రూపంబులిన్నిటాను గలనిన్ను
బరికించవలెగాని భజియింపరాదు
హరిమచెడి సత్సమాగంబు విడిచిన నీ
స్మరణ విగ్యానవాసన గాదుగాన ||
యిహదేవతాప్రభలనెల్ల వెలుగుట నీకు
సహజమనవలెగాని సరి గొలువరాదు
అహిమాంశుకిరణంబు లన్ని చోట్ల బరగు
గ్రహియింపరా దవగ్రాహములుగాన ||
యింతయును దిరువేంకటేశ నీవునికి దగ
జింతింపవలెగాని సేవింపరాదు
అంతయు ననరుహమును నరుహంబనగరాదు
అంతవానికి బరుల కలవడదుగాన ||
ఏది చూచినను గడు నిటువంటిసోయగములే
మేదినికి గిందుపడి మిన్నందనేలా ||
కరిరాజుగాంచిన కరుణానిధివి నీవు
అరిది నరసింహరూపైతివేలా
వురగేంద్రశయనమున నుండి నీవును సదా
గరుడవాహనౌడవై గమనించరాదా ||
పురుషోత్తమఖ్యాతి బొదలి యమృతము వంప
తరుణివై వుండ నిటు దైన్యమేలా
శరణాగతులకు రక్షకుడవై పాము నీ
చరణములకిందైన చలముకొననేలా ||
దేవతాధిపుడవై దీపించి యింద్రునకు
భావింప తమ్ముడన బరగితేలా
శ్రీవేంకటాచలస్థిరుడవై లోకముల
జీవకోట్లలోన జిక్కువడనేలా ||
ఏది తుద దీనికేది మొదలు
పాదుకొను హరిమాయ బరగు జీవునికి ||
ఎన్నిబాధలు దనకు నెన్ని లంపటములు
యెన్నివేదనలు మరియెన్ని దుఃఖములు
యెన్నిపరితాపంబు లెన్నిదలపోతలు
యెన్ని చూచిన మరియు నెన్నైనగలవు ||
యెన్నికొలువులు దనకు నెన్నియనుచరణలు
యెన్నియాసలు మరియు నెన్ని మోహములు
యెన్నిగర్వములు దనకెన్ని దైన్యంబులివి
యిన్నియును దలప మరి యెన్నైన గలవు ||
యెన్నిటికి జింతించు నెన్నటికి హర్షించు
నెన్నిటికి నాసించు నెన్నిటికి దిరుగు
యిన్నియును దిరువేంకటేశులీలలు గాగ
నెన్ని చూచినను దానెవ్వడును గాడు ||
ఏది నిజంబని యెటువలె నమ్ముదు
పోది తోడ నను బోధింపవే
సత్తు నసత్తని సర్వము నీవని
చిత్తగించి శ్రుతి చెప్పెడిని
వుత్తమమధ్యమ మొగి గలదని మరి
యిత్తల శాస్త్రము లేర్పరచీని ||ఏది||
నానారూపులు నరహరి నీపని
పూనినవిధు లిటు పొగడెడిని
మానక హేయము మరి వుపాధేయము
కానవచ్చి యిల గలిగియున్నవి ||ఏది||
భావాభావము పరమము నీవని
దైవజ్ఞులు నిను దలచెదరు
శ్రీవేంకటగిరి జెలగిననీవే
తావుగ మదిలో దగిలితివి ||ఏది||
ఏదియునులేని దేటిజన్మము
వేదాంతవిద్యావివేకి గావలెను ||
పరమమూర్తి ధ్యానపరుడు గావలె నొండె
పరమానంద సంపదలొందవలెను
పరమార్థముగ నాత్మభావింపవలె నొండె
పరమే తానై పరగుండవలెను ||
వేదశాస్త్రార్థకోవిదుడుగావలె నొండె
వేదాంతవిదుల సేవించవలెను
కాదనక పుణ్యసత్కర్మి గావలె నొండె
మోదమున హరిభక్తి మొగినుండవలెను ||
సతతభూతదయావిచారి గావలె నొండె
జితమైనయింద్రియస్థిరుడు గావలెను
అతిశయంబగు వేంకటాద్రీశు సేవకులై
గతియనుచు తనబుద్ధి గలిగుండవలెను||
ఏదెస మోము లేదు యెవ్వరికి ననేరు మీ_
వేదాంతశ్రవణము వెట్టికి జేసేరా.
అంతా బ్రహ్మమైతేనాతుమా వొక్కటియైతే
చింతింప గురుడు లేడు శిష్యుడూ లేడు
బంతినే ముక్తుడూ లేడు బద్ధుడూ లేడిట్లయితే
వంతుల సత్కర్మమెల్ల వఱతపాలాయంబో
యిహమెల్లా గల్ల నేరు యేటికి బుట్టినవారు
సహజమే యిదనేరు చావనేటికి
మహి మీకు బోధించిన మహాత్ము శంకరాచార్యు
డహరహ మేమైయున్నా నాతనికేది గతి?
కొందరికి సుఖమిది కొందరికి దుఃఖమది
యిందు జిక్కి బ్రహ్మమున కీఘోరమేలా
అందిన శ్రీవేంకటేశు డంతరాత్ముడొక్కదింతే
మందలించికొలువరు మంటికా మీజ్ఞానము.
ప|| ఏదైవము శ్రీపాదనఖమున బుట్టినగంగ
త్రిలోకపావనము చేయును త్రిపథగామిని ఆయను ||
అప|| ఏదైవము నాభినలినంబున జనియించిన అజుండు
అఖిలాండంబులు సృజియింప నధిపతి ఆయను ||
యేదైవము వురస్థలంబు దనకును మందిరమైన యిందిర
మాతయయ్యె యీజగంబులకెల్లను
యేదైవము అవలోకనమింద్రాది దివిజగణంబుల
కెల్లపుడును సుఖంబు లాపాదించును ||
యేదైవము దేహవస్తువని అనిమిషులందరు గూడి
శ్రీనారాయణ దేవుండని నమ్మియుందురు
ఆదేవుడే సిరులకనంత వరదుడు తిరువేంకట
గిరినాథుడుభయ విభూతినాథుడే నానాథుడు ||
ఏనోరువెట్టుక నిన్ను నేమని కావుమందును
నే నిన్ను దలచినది నిమిషమూ లేదు
పాయమెల్ల సంసారముపాలే పడితిగాని
చేయార నీసేవ నే జేసుట లేదు
కాయమెల్ల కాంతలకే కడుశేషమాయగాని
నీయవసరములందు నేనొదుగలేదు.
చిత్తము ఆసలపాలే సేసి బదికితి గాని
హత్తి నిన్ను ధ్యానము సేయగలేదు
సత్తెపునానాలుకెల్ల చవుల కమ్మితిగాని
మత్తిలి నీర్తనము మరపుటా లేదు.
పుట్టుగెల్లా నజ్ఞానముపొంతనే వుంటిగాని
వొట్టి నీవిజ్ఞానము నొల్లనైతిని
యెట్టు నన్ను మన్నించితి విందుకే పో వెరగయ్యీ
నెట్టన శ్రీవేంకటేశ నిన్నడుగా లేదు.
ప|| ఏపనులు సేసినా నిటువలెనేపో | యీపనికి జొరనిపని యేటిలోపైరు ||
చ|| హరికథలమీదిప్రియమబ్బేనా తొంటితమ- | పరిపక్వమగుదపఃఫలముగాక ||
గరిమె నివిలేకున్న గలకాలములు జేయు- | నిరతంపు దపమెల్ల నీటిపై వ్రాత ||
చ|| నారాయణునిభక్తి ననిచెనా ధనమెల్ల | బారజల్లిన దానఫల మదియపో |
కోరి యిది లేకున్న కోటిదానములైన | పేరుకొన వరతగలపినచింతపండు ||
చ|| వదలకిటు వేంకటేశ్వరుడే దైవంబనుచు | జదువగలిగిన మంచిచదు వదియపో |
పదిలముగ నీవిధము పట్టియ్యకుండినను | చదువు లసురలు మున్ను చదివేటిచదువు ||
ప|| ఏపురాణముల నెంత వెదికినా | శ్రీపతిదాసులు చెడ రెన్నడును ||
చ|| వారివిరహితములు అవి గొన్నాళ్ళకు | విరసంబులు మరి విఫలములు |
నరహరి గొలి చిటు నమ్మినవరములు | నిరతము లెన్నడు నెలవులు చెడవు ||
చ|| కమలాక్షుని మతిగాననిచదువులు | కుమతంబులు బహుకుపథములు |
జమళి నచ్యుతుని సమారాధనలు | విమలములే కాని వితథముగావు ||
చ|| శ్రీవల్లభుగతి జేరనిపదవులు | దావతులు కపటధర్మములు |
శ్రీవేంకటపతి సేవించునేవలు | పావనము లధికభాగ్యపుసిరులు ||
ప : ఏమంటి వేమంటి వెరగనేను – ఓ
కామిని నీకిప్పుడైన కానవచ్చెగా
చ : వేలతలుపు మీటిన విటుడెవ్వడే – ఓ
తాలిమి నేనే మాధవుడను
వాలిన మాధవుడవంటే వసంతుడవా – కాదే
గాలింపు చక్రముచేత కలవాడనే
చ : ధర చక్రివైతే కుమ్మరవాడవా – కాదే
సిరుల భూమి ధరించినవాడనే
శిరసున భూమిమోచే శేషుడవా – కాదే
అరయ నిన్నియునేలే హరినే నేను
చ : వంతులకు హరివైతే వానరమవా – నీ
మంతనపు లక్ష్మీ రమణుడనేను
ఇంతయేల శ్రీవేంకటేశుడ ననగరాదా – తొల్లి
అంతేపో నామారు నీవంటివిగదవే
ఏమందురు యీమాటకు నిందరూ నిన్ను
నీమాయ యెంతైనా నిన్ను మించవచ్చునా
నేను నిన్ను గొలిచితి నీవు నన్ను నేలితివి
పాని పంచేంద్రియాలేల పనిగొనీవి
కానిలేనిబంట్ల దేరకాండ్లు వెట్టిగొనగ
దానికి నీ కూరకుండ ధర్మమా సర్వేశ్వరా
పుట్టించినాడవు నీవు పుట్టినవాడను నేను
వట్టి కర్మమేల నన్ను బాధపెట్టీని
వొట్టినసొమ్ముకు వేరొకరు చేయిచాచితే
తట్టి నీవు వహించుకోదగదా సర్వేశ్వరా
యెదుట నీవు గలవు యిహములో నే గలను
చెదరినచిత్తమేల చిమ్మిరేచీని
అదన శ్రీవేంకటేశ ఆరితేరినట్టినన్ను
వదలక రక్షించుకో వన్నెగా సర్వేశ్వరా
ఏమని నుతించవచ్చు యీతని ప్రతాపము
కామించి యీరేడు లోకములెల్లా నిండెను ||
యీవల దేవుడు రథమెక్కితేను దైత్యులెల్ల
కావిరి జక్రవాళాద్రి కడ కెక్కిరి
భావించి చక్రమీతడు పట్టితే నసురలెల్ల
ధావతి తోడుతను పాతాళము వట్టిరి ||
గరుడధ్వజము హరి కట్టెదుర నెత్తించితే
పరువెత్తిరి దానవ బలమెల్లను
గరిమ నితేరి బండికండ్లు గదలితేను
ఖరమైన దైత్యసేన క్రక్కదలి విరిగె ||
ధృతి శ్రీ వేంకటేశుడు తిరువీధులేగితేను
కుతిలాన శత్రులు దిక్కుల కేగిరి
తతి నలమేల్మంగతో తన నగరు చొచ్చితే
సతమై బలిముఖ్యులు శరణము జొచ్చిరి ||
ఏమని పొగడుదు ఇట్టి నీగుణము
యీ మహిమకు ప్రతి యితరులు కలరా
నిండెను జగముల నీ ప్రతాపములు
చెండిన బాణునిచేతులతో
కొండలంతలై కుప్పలు వడియెను
వండ(దరగు రావణుతలలయి(లు?)
పూడెనుజలధులు పొరి(గోపించిన
తోడ బ్రహ్మాండము తూటాయ
చూడ పాతాళాము చొచ్చె బలీంద్రుడు
కూడిన కౌరవకులములు నడ(గె
యెత్తితివి జవము లీరేడు నొకపరి
యిత్తల నభయం బిచ్చితివి
హత్తిన శ్రీవేంకటాధిప నీకృప
నిత్తెమాయె నీనిజదాసులకు
ఏమని పొగదుడుమే యికనిను
ఆమని సొబగుల అలమేల్మంగ ||
తెలికన్నుల నీ తేటలే కదవే
వెలయగ విభునికి వెన్నెలలు
పులకల మొలకల పొదులివి గదవే
పలుమరు పువ్వుల పానుపులు ||
తియ్యపు నీమోవి తేనెలే కదవే
వియ్యపు రమణుని విందులివి
ముయ్యక మూసిన మొలక నవ్వు గదె
నెయ్యపు గప్పురపు నెరి బాగాలు ||
కైవసమగు నీ కౌగిలే కదవే
శ్రీ వేంకటేశ్వరు సిరి నగరు
తావు కొన్న మీ తమకములే కదే
కావించిన మీ కల్యాణములు ||
ఏమని పొగడేమిదె నీరమణిని
కోమలపు వయసు కోకిలవాణి ||
దొంతలు వెట్టీ తోడనె వలపులు
కొంతపు చూపుల కోమలి
సంతనసేసి సరసపు మాటల
వింత వేడుకల వెన్నెల పతిమ ||
విందులు చేసి వేమరు ప్రియములు
కందువ నవ్వులు కలకంఠి
బిందెల నించి పెకగు సిగ్గులు
మందె మేళముల మదనుని శరము ||
పైరులు విత్తీబలు తమకంబుల
మేరతో రతినలమేల్మంగ
ఈరీతి శ్రీవేంకటేశ నిన్నెనసె
సారెపు గుణముల జమళిమెరుంగుల ||
ప : ఏమని వర్ణించునుకో ఇంక పురాణములెల్ల
వేమారు కొత్తలాయె విశ్వలోకపతికి
చ : పాలజలనిధిలోన పలుమారు తేలగాను
నీలవర్ణమెల్లబోయి నిండు తెలుపైనట్టు
మేలిమి కప్పురకాపు మేననిండ నించగాను
పోలికె వేరొక్కటాయె పురుషోత్తమునికీ
చ : వేడుక కాళిందిలోన వేమారు నీదగాను
ఆడనే కమ్మర నలుపైనట్టు
తోడనే తట్టుపునుగు తొప్పదోగ నించగాను
జాడ వేరొక్కటాయె సర్వేశ్వరునికీ
చ : అలమేలుమంగ నుఱమందునే నిలుపగాను
అలరి బంగారు వర్ణమైనట్టు
నలుగడ సొమ్ములతో నానావర్ణములు
నిలిచె శ్రీవేంకటనిలయమూరితికీ
ఏమరక తలచరో యిదే చాలు
కామించినవియెల్ల గక్కున కలుగు ||
దురితములెల్ల దీరు దుఃఖములెల్ల నణుగు
హరియని వొకమాటు అన్నాజాలు
సురలు పూజింతురు సిరులెల్ల జేరును
మరుగురుని నామమటు పేరుకొన్నజాలు ||
భవములన్నియుబాయు పరము నిహముజేరు
ఆవల నారాయణ యన్నాజాలు
భువి యెల్లా దానేలు పుణ్యములన్నియు జేరు
తవిలి గోవిందునాత్మ దరచిన జాలు ||
ఆనందము గలుగు నజ్ఞానమెల్లబాయు
ఆనుక శ్రీ వేంకటేశ యన్నాజాలు
యీనెపాన నారదాదులిందరు నిందకు సాక్షి
దానవారి మంత్ర జపతపమే చాలు ||
ఏమి గలదిందు నెంతకాలంబైన
పామరపు భోగ మాపదవంటి దరయ
కొండవంటిది యాస, గోడవంటిది తగులు
బెండువంటిది లోని పెద్దతనము
పూండువంటిది మేను, పోలించినను మేడి-
పండువంటిది సరసభావమింతియును
కంచువంటిది మనసు, కలిమిగల దింతయును
మంచువంటిది, రతి భ్రమతవంటిది
మించువంటిది రూపు, మేలింతయును ముట్టు
పెంచువంటిది, దీనిప్రియ మేమిబ్రా(తి
ఆ(కవంటిది జన్మ అడవి వంటిది చింత
పాకువంటిది కర్మబంధమెల్ల
యేకటను తిరువేంకటేశు(దలచిన కోర్కి
కాక సౌఖ్యములున్న గనివంటి దరయ
ఏమి గలిగెను మాకిందువలన
వేమారు బొరలితిమి వెర్రిగొన్నట్లు ||
తటతటన నీటిమీదట నాలజాలంబు
లిటునటు జరించవా యీది యీది
అటువలెనెపో తమకమంది సంసారంపు
ఘటనకై తిరిగితిమి కడగానలేక ||
దట్టముగ బారావతములు మిన్నుల మోవ
కొట్టగొన కెక్కెనా కూడికూడి
వట్టియాసలనే యిటువలెనేపో యిన్నాళ్ళు
బట్టబయ లీదితిమి పనిలేనిపాట ||
బెరసి కుమ్మరపురువు పేడలోపలనెల్ల
పొరలదా పలుమారు బోయొపోయి
వరుస జన్మముల నటువలెనెపో పొరలితిమి
తిరువేంకటాచలాధిపు దలచలేక ||
ఏమి చేచే మిక నేము యెంతని దాచుకొందుము
నీమహిమ యింతంతననేరము నేమయ్యా
అంది నిన్ను నొకమాటు హరి యని నుడిగితే
పొందినపాతకమెల్లా బొలిసిపోయ
మందలించి మఱి యొక మాటు నుడిగినఫల
మందె నీ కప్పగించితి మదిగోవయ్యా
యిట్టె మీకు రెండుచేతులెత్తొకమాటు మొక్కితే
గట్టిగా నిహపరాలు గలిగె మాకు
దట్టముగ సాష్టాంగదండౌ వెట్టినఫల
మట్టె నీమీద నున్నది అదిగోవయ్యా
సరుగ నీకొక మాటు శరణన్న మాత్రమున
సిరుల బుణ్యుడ నైతి శ్రీవేంకటేశ
ధరలోన నే నీకు దాసుడనైనఫల
మరయ నీమీద నున్న దదిగోవయ్యా
ఏమి చేయుదు నింక నిందిరాధీశ్వరుడా
నీమఱగు చొచ్చితిని నెరవేర్తుగాక
కడి వోనిజవ్వనము కలిమిలేమెఱుగునా
బడినుండి మిగుల రుణపరచుగాక
అడియాసలెల్లా ఋణ్యముబాప మెఱుగునా
వెడగుదనలో దయ విడిపించుగాక
వలపువెఱ పెఱుగునా వాడిమొనలకు నైన
బలిమి దూరించ జలపట్టుగాక
చలనమందినమనసు జాతి నీ తెఱుగునా
కలిసి హేయమున కొడిగట్టించుగాక
యెలమి రతిపరవశము యెగ్గుసిగ్గెఱుగునా
బలిమి దిట్లకు నొడబఱచుగాక
యిలలోన శ్రీవేంకటేశ నీమాయ లివి
తలగించి యేలితివి దయసేతుగాక
ఏమి బాతి నేడిదె నీకు మము
గామించు సిరులింతే కదవయ్యా ||
వెనక ముందర వెలయగ ముందర
వెనక లింతే విభవాలు
వనితల పిఋదులు వాడి కుచములు కొప్పు
కనుగొన భ్రమలింతె కదవయ్యా ||
వెలుగు చీకటి నిరసాలు విభవాలు
కలిమి లే ములే కదవయ్యా
పలు వన్నె మాటలు పసని తేటలు నివి
కలవెంత కలలింతె కదవయ్యా ||
ఏమి వలసిన నిచ్చు నెప్పుడైనను
ఏమరుక కొలచిన నితడే దైవము ||
ఘనముగా నిందరికి గన్నులిచ్చు గాళ్ళిచ్చు
పనిసేయ జేతులిచ్చు బలియుడై
తనుగొలువమని చిత్తము లిచ్చు గరుణించి
వొనర లోకానకెల్ల నొక్కడే దైవము ||
మచ్చిక తనుగొలువ మనసిచ్చు మాటలిచ్చు
కుచ్చితములేని కొడుకుల నిచ్చును
చొచ్చినచోటే చొచ్చి శుభమిచ్చు సుఖమిచ్చు
నిచ్చలు లోకానకెల్ల నిజమైన దైవము ||
పంతమాడి కొలచిన బ్రాణమిచ్చు ప్రాయమిచ్చు
యెంతటి పదవులైన నిట్టె యిచ్చు
వింతవింత విభవాల వేంకటేశుడిదే మా
యంతరంగమున నుండే అరచేతిదైవము||
ఏమి వొరలేదు యేమి మరలేదు
యీమాయలంపటం బీదమోదనేకాని ||
సతులుగల దా సడిబొరలనేకాని
సతమైసౌఖ్యస్వస్థానంబు లేదు
హితులుగల మేలు తా నిడుమబొరలనెకాని
హితవివేకము నరుల కెంతైన లేదు ||
తనువులెత్తినమేలు తగులాయమేకాని
కనుగొనగ యోగభోగము గొంత లేదు
ఘనముగలమేలు తా గంధర్వమేకాని
ఘనుడైనశ్రీనాథు గనుగొనగ లేదు ||
చింతగలిగినమేలు చివుకబట్టనెకాని
చింత వేంకటవిభుని జింతించ లేదు
సంతుగలిగినమేలు సంసారమేకాని
సంతతము జెడనిసద్గతి జేర లేదు ||
ఏమి సేయగవచ్చు నీశ్వరాధీనంబు
తామసపుబుద్ధి కంతలు దూరవలనె ||
తెగి దురాపేక్షబడ తివియు గతిలేదుగన
పగగొన్న వగలకూపముల బడవలసె
తగుమోహసలిలంబు దాట మతిలేదుగన
మగుడబడి భవముతో మల్లాడవలసె ||
పాపకర్మముల జంపగ శక్తిలేదుగన
కోపబుద్ధులచేత కొరమాలవలసె
రూపములు బొడగాంచి రోయ దరిలేదుగన
తాపములచే బొరలి తగులుగావలసె ||
తిరువేంకటాచలాధిపు గొలువలేదుగన
గరిమిచెడి విషయకింకరుడు గావలనె
పరతత్త్వమూర్తి దలపగ బ్రొద్దులేదుగన
దొరతనం బుడిగి యాతురుడు గావలసె ||
ఏమి సేయవచ్చు గర్మమిచ్చినంతేకాని లేదు
తాము సేసినంత వట్టు తమకు బోరాదు ||
ఇట్టునట్టు మిట్టిపడ్డ యించుకంతా లేదు,వీపు
బట్టగట్ట మోపు మోచి పాటువడ్డా లేదు
తట్టువడ లోకమెల్ల దవ్వుకొనినా లేదు
తెట్టదెరువున నోరుదెరచినా లేదు ||
అడిగి పరులబదు కాసపడ్డా లేదు, భీతి
విడిచి నెత్తుటదోగి వీరుడైనా లేదు
అడవులెల్లాదిరిగి అలమటించిన లేదు
యిడుమపాటుకు జొచ్చి యియ్యకొన్నా లేదు ||
వచ్చివచ్చి వనితల వలపించుకొన్నా లేదు
మెచ్చులగుఋఋఅము నెక్కి మెరసినా లేదు
యెచ్చరిక దిరువేంకటేశు గొలువక వుంటే
యిచ్చటనచ్చట సుఖ మించుకంతా లేదు ||
ఏమి సేయుదు నింక నిందిరాధీశ్వరుడా
నీమఱగు చొచ్చితిని నెరవేర్తుగాక ||
కడి వోనిజవ్వనము కలిమిలేమెఱుగునా
బడినుండి మిగుల ఋణపరచుగాక
అడియాసలెల్లా బుణ్యముబాప మెఱుగునా
వెడగుదనలో దయ విడిపించుగాక ||
వలపువెఱ పెఱుగునా వాడిమొనలకు నైన
బలిమి దూరించ జలపట్టుగాక
చలనమందినమనసు జాతి నీ తెఱుగునా
కలిసి హేయమున కొడిగట్టించుగాక ||
యెలమి రతివశము యెగ్గుసిగ్గెఱుగునా
బలిమి దిట్లకు నొడబఱచుగాక
యిలలోన శ్రీవేంకటేశ నీమాయ లివి
తలగించి యేలితివి దయసేతుగాక ||
ఏమి సేసేమిక నేము యెంతని దాచుకొందుము
నీమహిమ యింతింతననేరము నేమయ్యా ||
అందు నిన్ను నొకమాటు హరి యను నుడిగితె
పొందినపాతకమెల్లా బొలిసిపోయ
మందలించి మఱి యొకమాటు నుడిగినఫల
మందె నీకప్పగించితి మదిగోవయ్యా ||
యిట్టె మీకు రెండుచేతులె త్తొకమాటు మొక్కితే
గట్టిగా నిహపరాలు గలిగె మాకు
దట్టముగ సాష్టాంగదండము వెట్టినఫల
మట్టె నీమీద నున్నది అదిగోవయ్యా ||
సరుగ నీకొకమాటు శరణన్నమాత్రమున
సిరుల బుణ్యుడ నైతి శ్రీవేంకటేశ
ధరలోన నే నీకు దాసుడనైనఫల
మరయ నీమీద నున్న దదిగోవయ్యా ||
ఏమి సేసేవిచ్చటను ఇంతి నిన్ను బిలిచీని
ప్రేమములు కణజాల బెట్టుకొందువు రావయ్యా ||
చెలియ చెమటలను చిత్తడివాన గురిసె
బలువుగా వలపుల పంటలు వండి
కలిమి మీరి చన్నులు కనకపురాసులాయ
కొంచికోరుగొందువు కొటారుకు రావయ్యా ||
వుడివోని తమనిపుతూర్పులనే తూరుపెత్తె
కడలేని యాసలగాదెలబోసె
యెడయని పయ్యెదనే ఇల్లారుగా బెట్టె
కడలేని రతుల కంగాణింతువు రావయ్యా ||
పొలప సిగ్గుల పాలపొంగలెగా బెట్టె
వెలియ గాగిలి నీకు విడిదిసెసె
అలమేలు మంగ పతివైన శ్రీవేంకటేశ్వర
కలిసితి విట్టె వచ్చి కాణాచాయ రావయ్యా ||
ఏమిగల దిందు నెంతపెనగిన వృథా
కాముకపుమనసునకు కడమొదలు లేదు ||
పత్తిలోపలి నూనెవంటిది జీవనము
విత్తుమీదటి పొల్లువిధము దేహంబు
బత్తిసేయుట యేమి పాసిపోవుట యేమి
పొత్తులసుఖంబులకు పొరలుటలుగాక ||
ఆకాశపాకాశ మరుదైనకూటంబు
లోకరంజకంబు తమలోని సమ్మతము
చాకిమణుగులజాడ చంచలపుసంపదలు
చేకొనిననేమి యివి చెదిరినను నేమి ||
గాదెపోసినకొలుచు కర్మిసంసారంబు
వేదువిడువనికూడు పెడమాయబదుకు
వేదనల నెడతెగుట వేంకటేశ్వరుకృపా
మోదంబు వడసినను మోక్షంబు గనుట ||
ఏమిటికి చలము యెందాక
నాముల తోడుత నగవే యికను ||
బలుము లేమిటికి బచరించేవే
వలచిన దానవు వనితవు
సొలయుచు రమణుని సోదింతురటే
అలరి ఇచ్చకములాడుట గాక ||
తగవులబెట్టగ తగునటవే యిక
మగనితోడ పలుమరు నిపుడు
అగడుసేతురా అతని నింతేసి
చిగురు మోవొసగి చెలగుట గాక ||
కూడిన వేళను గుట్టు సేతురా
యీడనె శ్రీ వేంకటేశునెడ
ఆడకు వెంగెము లలమేల్మంగవు
వీడెములందుక వెలయుట గాక ||
ఏమిఫలము దానిన్నియును దెలిసినను
సాముచేసినఫలము జయశీలుడౌటగాక ||
తానుగలిగినఫలము దయ సేయగలుగుట
మేనుగలిగినఫలము మేలెల్ల గనుట
మానుషముగలఫలము మంచివాడౌట తను
దానె తెలిసినఫలము తత్త్వపరుడౌటగాక ||
పదిలమగుకులముగలఫలము తాజదువుట
చదివినఫలం బర్థసారంబు గనుట
పొదలి శాస్త్రార్థంబు పొడగన్నఫలము మతి
దలకకిటు వేంకటేశుదాసుడౌటగాక ||
ఏమియు జేయగవద్దు యింతలోనె మోక్షము
దీమపువిజ్ఞానమే దివ్వెత్తుఫలము ||
పాపచింత మదిలోన బారకుండా నిలిపితే
చేపట్టి దానములెల్లా జేసినంతఫలము
కోపానలములోన కోరికలు వేల్చితేనే
యేపున యజ్ఞాలు సేసి యేచినంతఫలము ||
కనకముపై యాస కాదని పోదొబ్బితేనే
తనకు వేవేలు ఘోరతపములఫలము
వనితలమోహములవల బడకుండితేనే
దినము గోటితీర్థాలు దిరిగినఫలము ||
శ్రీవేంకటేశ్వరు జేరి కొలుచుటే
ధావతిలేనియట్టితనజన్మఫలము
భావించి యాచార్యపాదపద్మమూలమే
సావదానమున సర్వశాస్త్రఫలము ||
ప|| ఏమివలసిన నిచ్చు నెప్పుడైనను | యేమరిక కొలిచిన నీతడే దైవము ||
చ|| ఘనముగా నిందరికి గన్నులిచ్చు గాళ్ళిచ్చు | పనిసేయ జేతులిచ్చు బలియుడై |
తనుగొలువుమని చిత్తములిచ్చు గరుణించి | వొనర లోకానకెల్ల నొక్కడే దైవము ||
చ|| మచ్చిక తనుగొలువ మనసిచ్చు మాటలిచ్చు | కుచ్చితములేని కొడుకుల నిచ్చును |
చొచ్చినచోటే చొచ్చి శుభమిచ్చు సుఖమిచ్చు | నిచ్చలు లోకానకెల్ల నిజమైనదైవము ||
చ|| పంతమాడి కొలిచిన బ్రాణమిచ్చు ప్రాయమిచ్చు | యెంతటిపదవులైన నిట్టె యిచ్చు |
వింతవింతవిభవాల వేంకటేశుడిదె మా- | యంతరంగమున నుండే అరచేతిదైవము ||
ఏమిసేతు నమ్మలాల యెందుకౌను నాయకుడు
భూమిలో జెప్ప గొత్త యీ పురుష విరహము ||
తొయ్యలి రాకకు బతి తొంగిచూడ బోతేను
దయ్యమువలె జంద్రుడు తలచూపెను
చయ్యన నందు కతడు జడసి తలవంతే
నుయ్యివలెనే తోచె నూలుకొని మనసు ||
మగువ యెలుగు విన మతి నాలకించితేను
పగవాని వలనే పల్కెగోవిల
వెగటై యందు కతడు వీనులు మూసుకొంటే
మొగులు వలెనే కప్ప ముంచుక విరహము ||
నలినాక్షి రూపు మనసున దలచబోతే
చిలుకుగాలమై తోచెనుమరుడు
అలసె శ్రీవేంకటేశుడంతలోన సతిగూడె
నెలకొని కొండవలె నిలిచె సంతోసము ||
ఏమిసేతు నిందుకు మందేమైన బోయరాదా
సామజ గరుడ నీతో సంగమొల్లదేటికి ||
మాయల సంసారము మరిగిన కర్మము
యీయెడ నిను మరుగ దేటికో హరి
కాయజ కేలిపై దమి గలిగిన మనసు
కాయజుతండ్రి నీపై గలుగదేటికి ||
నాటకపు గనకము నమ్మినట్టి బదుకు
యేటికి నీ భక్తి నమ్మేదేల
గూట బడే పదవులు గోరేటి జీవుడు
కూటువైన నిజముక్తి గోరెడిది యేటికీ ||
పాప పుణ్యములకె పాలుపడ్డ నేను
యేపున నీపాల జిక్కనేలకో హరి
శ్రీపతి నాలోని శ్రీ వేంకటేశుడ
నేపేరి వాడ నాకు నిండు మాయలేటికి ||
ఏమిసేతునయ్య నీవు యింతటి నాయఖుండవు
మోముచూచి తొలినీకు మొహించిన దానను ||
వలపించవలె నొండె వశముగాకుండితేను
చెలరేగి ప్రియమైనం జెప్పవనిను
పిలువనంపంగవలె బిగిసి రాకుందితేను
కొలువుకు వచ్చి కొంత కొసరగావలెను ||
మెప్పించుకోవలె నొండె మించి కరగకుడితే
వుప్పతించ నోర్పుతోడ నుండవలెను
చిప్పిలబెనగంగ చేతికీ లోగాకుండతే
చెప్పినట్టిపూడిగాలు సేయంగవలెను ||
పంచుకొనవలె నొండె నవమానమున నుంటె
కొంచక పంతములిచ్చి కూడవలెను
యెంచంగ శ్రీ వేంకటేశ యేనలమేల్మంగను
పొంచి నన్నేలితివి పొగడంగవలెను ||
ఏమిసేతువు దేవదేవ యింతయును నీమాయ
కామినుల జూచిచూచి కామించె భవము ||
చంచలపు గనుదోయి సతులబారికి జిక్కి
చంచలమందెను నాదిచ్చరిమనసు
కంచుగుత్తికలవారి గానములజొక్కిచొక్కి
కంచుబెంచునాయబో నాకడలేనిగుణము ||
తీపులమాటల మించి తెరవలభ్రమ దరి
తీపులపాలాయబో నాతెలివెల్లాను
పూపలనవ్వులతోడి పొలతుల జూచిచూచి
పూపలుబిందెలునై పొల్లువోయ దపము ||
కూటమి సతులపొందు కోరికోరి కూడికూడి
కూటువ నావిరతెందో కొల్లబోయను
నీటున శ్రీవేంకటేశ నినుగని యింతలోనె
జూటరినై యింతలోనె సుజ్ఞానినైతి ||
ఏమిసేయువార మికను
ఆమనిచేలపచ్చలాయ బ్రదుకు ||
దీపనమనియెడి తీరనియాస
రేపుమాపు బెడరేచగా
తోపుసేయగరాక దురితపుతరవుల
కాపదలకు లోనాయ బ్రదుకు ||
వేడుకనెడి పెద్దవిడువనితరవు
వోడ కెపుడు వొద్దనుండగా
జోడు విడువరాక చులుకదనంబున
కాడికెలకు లోనాయ బ్రదుకు ||
మమకారమనియెడి మాయతరవు
తిమిర మెక్కించుక తియ్యగా
విమలమూరితియైన వేంకటగిరిపతి
అమర జేరక యెరువాయ బ్రదుకు ||
ఏమిసేసిన నీరుణ మెట్టు వాసును
కామితఫలద వోకరుణానిధి ||
చేరి కర్మములు నన్ను చెఱువట్టకుండగాను
పేరువాడి వచ్చి విడిపించుకొంటివి
సారె తగవట్టె కాదా శక్తిగలవారెల్లా
నారయదీనుల గంటే నడ్డమై కాతురు ||
అరులు పంచేంద్రియము లందు నిందు దియ్యగాను
వెరవుతోడ వెనక వేసుకొంటివి
పరగ నట్టేకాదా బలుపులైనవారు
అరయ బేదలకైన ఆపద మానుతురు ||
పలుజన్మములే నన్ను పరి అరికొట్టుకోగా
తొలగదోసి నాకు దోడైతివి
యెలమి శ్రీవేంకటేశ యిల శూరులైనవారు
బలుభయ మిందరికి బాపుచుందురు ||
ఏమి గలిగెను మాకిందువలన
వేమారు బొరలితిమి వెర్రిగొన్నట్లు ||
తటతటన నీటిమీదట నాలజాలంబు
లిటునటు జరించవా యీది యీది
అటువలెనెపో తమకమంది సంసారంపు
ఘటనకై తిరిగితిమి కడగానలేక ||
దట్టముగ బారావతములు మిన్నుల మోవ
కొట్టగొన కెక్కెనా కూడికూడి
వట్టియాసలనే యిటువలెనేపో యిన్నాళ్ళు
బట్టబయ లీదితిమి పనిలేనిపాట ||
బెరసి కుమ్మరపురువు పేడలోపలనెల్ల
పొరలదా పలుమారు బోయొపోయి
వరుస జన్మముల నటువలెనెపో పొరలితిమి
తిరువేంకటాచలాధిపు దలచలేక ||
ఏమీ నెఱగనినా కేడపుణ్యము
తామసుండజుమ్మీ ముందరనున్న దైవమా ||
పాతకపుజేతలనే పట్టి నిన్ను బూజించు
ఘాతకుడ నాకు నెక్కడిపుణ్యము
చేతనము బోదిసేయుచిత్తము నీదేకాన
రాతిబొమ్మజుమ్మీ భారము నీది దైవమా ||
పూనినయెంగిలినోర నొప్పగునిన్ను బొగడు
హీనజంతువునకు నా కేటిపుణ్యము
తేనెపూసి నీవిట్లా దిప్పగానే తిరిగేటి
మానిబొమ్మజుమ్మీ నామతిలోని దైవమా ||
జాలిబడి సంసారజలధిలో మునిగేటి
కూళడ నాకేటితేకువపుణ్యము
పాలువోసి పెంచిన నాపాలివేంకటేశ నే
తోలిబొమ్మజుమ్మీ కాతువుగాని దైవమా ||
ఏమీనెరుగనిమమ్ము నెక్కువసేసి
పామరుల దొడ్డజేసె భాష్యకారులు ||
గతచన్నవేదాలు కమలజునకు నిచ్చి
ఆతనికరుణచేత నన్నియుగని
గతిలేకపోయిన కలియుగమున వచ్చి
ప్రతిపాలించగలిగె భాష్యకారులు ||
లోకమెల్ల వెల్లిబోగ లోననే సురల గాచి
ఆకుమీద దేలినయతనికృప
కాకరిమతములెల్ల గాలిబుచ్చి పరమిట్టే
పైకొనగ గరుణించె భాష్యకారులు ||
పంకజపుజేయి చాచి పాదపుబరమిచ్చిన
వేంకటేశుకృపతోడ వెలయు దానే
తెంకినే వొడయవరై తిరుమంత్రద్వయాన
పంకమెల్ల బోగడిగె భాష్యకారులు ||
ఏమైనా నను యెదురాడనేను
దీమసంబుతో దెలిసితి నేను ||
యెక్కుడు మాట నేనేమని యాడిన
పెక్కసురాలని విసుగుదువు
యెక్కుచు నీ పాదములు చూచుక ఇటు
వొక్కట నూరకయుండెద నేను ||
పంతంబున నే బైకొని నవ్విన
అంతరట్టదని యాడుదువు
చెంత నూడిగముసేసుక నీ కిట్టి
చింతదీర కడు చెలగెద నేను ||
అలమి నిన్నురతి నలయించినను
బలిమితోదిదని పలుకుదువు
యెలమిని శ్రీవేంకటేశ్వర కూడితి
మొలగినట్లనే మెచ్చెద వేను ||
ఏమైనా నాడేవారి నేమందును
మోము చూచితే చెరువుముయ్య మూకుడున్నదా ||
అడియాలముగ నీవు ఆడేవి సత్యాలేకాక
కడు మావంటి వారితో గల్ల లాడేవా
అడిసి తొల్లి అసురసతులతో నేమోకాక
తడవితే నేటి వేళ తప్పు నీయందున్నదా ||
చిమ్మిరేగ నీ విన్నిటా జేసేవి పుణ్యాలేకాక
పమ్ము నీ వొళ్ళ నెంచితే పాపమున్నదా
కుమ్మరించి యీ సుద్దులు గొల్లతలందేమో కాక
నెమ్మది నీ పొద్దుకు నింద నీయందున్నదా ||
దగ్గరితే నీ వల్లను దయ దాక్షిణ్యాలేకాక
కగ్గిన నిష్టూర మించుకంత గలదా
వెగ్గళించి నన్నును శ్రీవేంకటేశ కూడితివి
వొగ్గి నిన్ను దూరబోతే వొచ్చము నీకున్నదా ||
ఏమొకో చిగురుటధరమున ఎడనెడకస్తూరి నిండెను
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా
కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపైతోచిన
చెలువంబిప్పుడిదేమో చింతింపరేచెలులు
నలువున ప్రాణేశ్వరునిపై నాటినయాకొనచూపులు
నిలువునపెరుకగనంటిన నెత్తురుకాదుకదా
పడతికి చనుగవమెరుగులు పైపై పయ్యెద వెలుపల
కడుమించిన విధమేమో కనుగొనరే చెలులు
వుడుగని వేడుకతో ప్రియుడొత్తిన నఖశశిరేఖలు
వెడలగవేసవికాలపు వెన్నెలకాదుకదా
ముద్దియ చెక్కులకెలకుల ముత్యపుజల్లుల చేర్పుల
వొద్దికలాగులివేమో ఊహింపరే చెలులు
గద్దరి తిరువేంకటపతి కొగిటియధరామృతముల
అద్దిన సురతపు చెమటల అందము కాదు కదా
ఏమో తెలిసెగాని యీజీవుడు
నేమంపునెరవిద్య నేరడాయ ||
కపటాలె నేరిచెగానీ జీవుడు
యెపుడైనా నిజసుఖ మెరుగడాయ
కపురులే చవిగొనెగానీ జీవుడు
అపరిమితామృత మానడాయ ||
కడలనే తిరిగీగానీ జీవుడు
నడుమ మొదలు జూచి నడవడాయ
కడుపుకూటికే పోయీగానీ జీవుడు
చెడనిజీతముపొంత జేరడాయ ||
కనియు గానకపోయగానీ జీవుడు
దివము వేంకటపతి దెలియడాయ
కనుమాయలనె చొక్కెగానీ జీవుడు
తనియ నిట్టే మంచిదరి జేరడాయ ||
ఏరీతి నెవ్వరు నిన్ను నెట్టు భావించినాను
వారి వారి పాలికి వరదుడ వౌదువు ||
చేరి కొల్చినవారికి జేపట్టు గుంచమవు
కోరి నుతించువారి కొంగుపైడివి
మేరతో దలచువారి మేటినిధానమవు
సారపు వివేకులకు సచ్చిదానందుడవు ||
కావలెనన్నవారికి కామధేనువు మరి
సేవ చేసేవారికి చింతామణివి
నీవే గతన్నవారికి నిఖిల రక్షకుడవు
వావిరి శరణు వేడే వారికి భాగ్యరాశివి ||
నిన్ను బూజించేవారి నిజ పరతత్త్వమవు
యిన్నిటా నీదాసులకు నేలికవు
యెన్నగ శ్రీవేంకటేశ యిహపరములకును
పన్ని కాచుకున్నవారి ఫలదాయకుడవు ||
ఏల పొద్దులు గడిపే వింతికడకు రావయ్యా
నాలిసేయ నిక వద్దు నమ్మియాపె వున్నది ||
చక్కని సతిమోమున చంద్రోదయంబాయ
వెక్కసపు నవ్వుల వెన్నెలగాసె
చొక్కపు కొప్పు విరుల చుక్కలుగానుపించె
పక్కన పెంచితే పట్టపగలు రేయొఊను ||
సతి కుచగిరులనే జిక్కవలు జోడుగూదె
తతి వికసించె గన్నుల దామరలు
మితిలేని రత్నకాంతి మించె సూర్యోదయము
మతి నెంచుకొంటేను మా పేరేపౌను ||
కలికి మెయి చెమటల గడియారపు నీరెక్కె
తెలిసిగ్గులనే పెండ్లి తెర వేసెను
అలమె శ్రీవేంకటేశ అంతలో నీవురాగాను
నెలవై యిట్టె వుండితే నిచ్చకళ్యాణమవును ||
ఏల పొరలేవులేవే యింత లోనిపనికి
మాలయింటి తోలుకప్పు మాయ లిటువంటివి ||
చిక్కులతమకముల చీకటిగప్పిననాడు
యెక్కువ వాసనలౌ హేయపుమేను
వెక్కసపు ప్రియమది విరిగితే రోతలౌ
లక్కపూతకపురు లీలాగు లిటువంటివి ||
మించినచిత్తములో మేలుగలిగిననాడు
యెంచరానిచవులౌ నెంగిలిమోవి
పెంచుకొంటే కష్టమౌ ప్రియముదీరిననాడు
చంచలపు చిత్తములచంద మిటువంటిది ||
వెల్లిగొనుసురతపువేళ మరపులయింపు
కొల్లలాడుటౌ కొనగోరితాకులు
నల్లితిండౌ మరి మీద మరగితే రోతలౌ
వుల్లమిచ్చేవేంకటేశువొద్ది కిటువంటిది ||
ఏల మోసపోయిరొకో యెంచి యాకాలపువారు
బాలకృష్ణునిబంట్లై బ్రదుకవద్దా ||
పసులగాచేవాని బ్రహ్మ నుతించెనంటేను
దెసలదేవుడేయని తెలియవద్దా
సిసువు గోవర్ధనాద్రి చేతబట్టి యెత్తెనంటే
కొసరీతని పాదాలే కొలువవద్దా ||
నరునికి విశ్వరూ పున్నతి జూపెనంటేను
నరహరి యితడని నమ్మవద్దా
పరగ జక్రముచేత బాణుని నఱకెనంటే
సొరి దీతని శరణుచొఱవద్దా ||
అందరుసురలలోన నగ్రపూజ గొన్నప్పుడే
చెంది యీతనికృపకు జేరవద్దా
అంది శ్రీవేంకటేశు డట్టె ద్రిష్టదైవమంటే
విందుల బరులసేవ విడువవద్దా ||
ఏల రాడమ్మా యింతిరో వా
డేలరాడమ్మా నన్నేలినవాడు ||
పచ్చని పులుగుల బండిమీద నుండు
పచ్చవింటి పిన్నబాలుని తండ్రి
పచ్చని చాయల బాయని బంగారు
పచ్చడముగట్టిన బాగైనవాడు ||
తెల్లని పులుగుపై తిరుగ మరిగినట్టి
తెల్లని సతిపాలి దేవరతండ్రి
తెల్లని పరపుపై తేలి పొరలువెట్టు
తెల్లని కన్నుల దెలివైనవాడు ||
కొండవింటివాని గుత్తగొనినయట్టి
కొండుకప్రాయపు గూతురుతండ్రి
కొండలరాయడు కోనేటి తిమ్మయ్య
కొండ తల నెత్తి గురుతైన వాడు ||
ఏల సమకొను సుకృత మెల్లవారికి మహా
మాలిన్యమున నాత్మ మాసినదిగాన ||
కలికాలదోషంబు కడావరానిదిగాన
తలపుదురితముల కాధారంబుగాన
బలుపూర్వకర్మములు పట్టరానివిగాన
మలమూత్రజన్మంబు మదకరముగాన ||
రాపైనగుణ వికారములు బహుళముగాన
ఆపరానివి యింద్రియంబు లటుగాన
దాపరంబగుమమత దయదలంపదుగాన
కాపురముచే నాస కప్పుకొనుగాన ||
హృదయంబు చంచలం బిరవుగానదుగాన
చదువు బహుమార్గముల జాటు నటుగాన
యెదరనుండెడు వేంకటేశ్వరుని నిజమైన
పదముపై కోరికలు పైకొనవుగాన ||
ఏల సిగ్గులు వడేవు యెదుటికి రాగదవే
సోలిగా నీసింగారాలు చూచుగాని యీతడు ||
కొప్పువెట్టుకొంటివిగా కుప్పెసవరము తోడ
కప్పితివిగా పయ్యద కడు బోలుగా
చిప్పిలబూసితివిగా చెంపలునిండా జవ్వాది
యిప్పుడె గక్కన బతినిక వలపించవే ||
కట్టుకొంటివిగా చీరకళబెళ మనగాను
వొట్టుకొంటివిగా సొమ్ములొళ్ళొ నిండాను
గట్టిగా నిడుకొంటివిగా కన్నులనుగాటుక
దట్టముగా నీతనికి తమిరేచగదవే ||
సేసితివిగా విడేలు చెంగావి మోవెల్లాగప్ప
వేసితివిగా మెడను విరిదండలు
వేసర కలమేల్మంగ విభుడు శ్రీవేంకటేశు
డసతో నన్నేల నీవూ నంటనే యీతని ||
ఏలవచ్చీ యేలపోయీ నెందుండీ బ్రాణి
తోలుతిత్తిలోన జొచ్చి దుంక దూరనా ||
పుట్టులేక నరకాలపుంగుడై తానుండక యీ
పుట్టుగున కేల వచ్చీ పోయీ బ్రాణి
పుట్టుచునే కన్నవారి బుట్టినవారి నాసల
బెట్టిపెట్టి దుఃఖముల బెడరేచనా ||
భూతమై యడవిలో బొక్కుచు దానుండక యీ
బూతుజన్మమేల మోచె బుచ్చినప్రాణి
రాతిరిబగలు ఘొరపుబాటు వడిపడి
పాతకాలు చేసి యమబాధబడనా ||
కీటమై వేంకటగిరి కిందనైన నుండక యీ
చేటువాటుకేల నోచె చెల్లబో ప్రాణి
గాటమైనసంపదల కడలేనిపుణ్యాల
కోటికి బడగెత్తక కొంచెపడనా ||
ఏలే యేలే మరదలా చాలుజాలు
చాలును చాలు నీతోడి సరసంబు బావ ||
గాటపు గుబ్బలు గదలగ గులికేవు
మాటల దేటల మరదలా
చీటికి మాటికి జెనకేవే వట్టి
బూటకాలు మానిపోవే బావ ||
అందిందె నన్ను నదలించి వేసేవు
మందమేలపు మరదలా
సందుకో దిరిగేవి సటకారివో బావ
పొందుగాదిక బోవే బావ ||
చొక్కపు గిలిగింతల చూపుల నన్ను
మక్కువ సేసిన మరదలా
గక్కున నను వేంకటపతి కూడితి
దక్కించుకొంటివి తగులైతి బావ ||
ఏలోకమందున్నా నేమీ లేదు
తాలిమి నందుకుదగ్గదావతేకాని ||
సురల కసురలకు సూడునుబాడునే కాని
పొరసి సుఖించగ బొద్దు లేదు
ధరలో ఋషులకును తపము సేయనేకాని
మరిగి భోగించగ మరి పొద్దు లేదు ||
గక్కన సిద్దులకైనా గంతయు బొంతయేకాని
చిక్కిపరుసము గలిగి నెలవులేదు
రెక్కలు గలపక్షికి రేసుతిమ్మటలేకాని
చక్క వైకుంఠాన కెగయ సత్తువ లేదు ||
సకల జంతువులకు జన్మాదులేకాని
అకటా నిత్యానంద మందలేదు
వెకలి శ్రీవేంకటేశు విష్ణుదాసులకే మంచి
సుకములెల్లా గలవు సుడివడలేదు ||
ఏలోకమున లేడు యింతటిదైవము మరి
జోలి దవ్వి తవ్వి యెంత సోదించినాను
మంచిరూపున నెంచితే మరునిగన్నతండ్రి
ఇంచుకంత సరిలేదు ఇతనికిని
మించుసంపదల నైతే మేటిలక్ష్మీకాంతుడు
పొంది యీతనికి నీడు పురుడించగలరా
తగ బ్రతాపమునను దానవాంతకు డితడు
తగుల నీతనిమారుదైవాలు లేరు
పొగరుమగతనాన బురుషోత్తము డితడు
వెగటై యీతనిపాటి వెదకిన లేరు
పట్టి మొదలెంచితేను బ్రహ్మగన్నతండ్రితడు
ఘట్టున నింతటివారు మరి వేరి
ఇట్టె శ్రీవేంకటేశుడీగికి వరదుడు
కొట్టగొన నితరుల గురిసేయగలరా
ఏవం శ్రుతిమత మిదమేవ త
ద్భావయితు మతఃపరం నాస్తి ||
అతులజన్మభోగాసక్తానాం
హితవైభవసుఖ మిదమేవ
సతతం శ్రీహరి సంకీర్తనం త
ద్వ్యతిరిక్తసుఖం వక్తుం నాస్తి||
బహుళమరణ పరిభవచిత్తానా
మిహపరసాధన మిదమేవ
అహిశయనమనోహరసేవా త
ద్విహరణంవినా విధిరపి నాస్తి ||
సంసారదురితజాడ్యపరాణాం
హింసావిరహిత మిదమేవ
కంసాంతకవేంకటగిరిపతేః ప్ర
శంసైనానాంపశ్చాదిహ నాస్తి ||
ఏవి నుపాయాలుగావు యెక్కువ భక్తేకాని
దావతి బడక యిది దక్కితే సులభము
ముంటిపై సుఖమందుట ముక్కున నూరుపునట్టి
దండవాయువు గెలువదలచేదెల్లా
చెంటికవట్టుక పోయి చెస గొండ వాకుట
వెంట గర్మ మార్గమున విష్ణుని సాధించుట
యేనుగుతో బెనగుట యిల నిరాహారియై
కాననిపంచేంద్రియాల గట్టబోవుట
నానిం చినుపగుగిళ్ళు నమలుట బలిమిని
ధ్యానించి మనసుబట్టి దైవము సాధించుట
దప్పికి నెండమావులు దాగ దగ్గరబోవుట
తప్పుజదువులలో దత్త్వము నెంచుట
పిప్పిచవి యడుగుట పెక్కుదైవాల గొలిచి
కప్పిన శ్రీవేంకటేశుకరుణ సాధించుట
ఐ
ఐనదయ్యీ గానిదెల్లా నటు గాకుండితే మానీ
మానుపరా దివి హరిమాయా మహిమలు
పుట్టేటి వెన్ని లేవు పోయేటి వెన్ని లేవు
వెట్టి దేహాలు మోచినవెడజీవులు
గట్టిగా దెలుసుకొంటే కలలోనివంటి దింతే
పట్టి ఇందుకుగా నేల బడలేమో నేము
కడచిన వెన్ని లేవు కాచుకున్న వెన్ని లేవు
సుడిగొన్న తనలోని సుఖదుఃఖాలు
యెడపుల నివి రెండు యెండనీడవంటి వింతే
కడనుండి నే మేలకరగేమో నేము
కోరినవి యెన్ని లేవు కోరగల వెన్ని లేవు
తీరనైసంపదలతో తెందేపలు
ధారుణి శృఈవేంకటేశుదాసులమై యిన్నియును
చేరి కైకొంటిమి యేమి సేసేమో నేము
ఒ
ఒకటి బోలిచిన వేరొకటి తోచీని
సకలము బోలిచేము సుదతి సింగారాలు ||
కలువలు జకోరాలు గండుమీలు దామరలు
చలిముతైపు జిప్పలు సతికన్నులు
అలలు నీలమణులంధకారము మేఘము
నలుపు రాశివో నలినాక్షి తురుము ||
జక్కవలు నిమ్మపండ్లు సరి బూగుత్తులు గొండ
లెక్కువ మరిమిద్దెలు యింతి చన్నులు
చుక్కలు సురవొన్నలు సూది వజ్రాల గోళ్ళు
అక్కర యేనుగ తోండాలరంట్లే తొడలు ||
సోగ తీగెలు తూండ్లు సుదతి బాహువులిదె
చేగ చిగురు లత్తిక చెలి పాదాలు
యీగతి శ్రీవేంకటేశ యింతి నీవురము మీద
బాగుగ నమరి పైడి పతిమ బోలినవి ||
ఒకటికొకటిగూడ దోయమ్మ నీయందే
సకలము నెటువలె సంతసేసితివే ||
తానకు నీ కుచాలు దంతికుంభల బోలితే
యీ నడుము సింహమునేల పోలెనే
అనివట్టి నీ కన్ను లంబుజాల బోలితేను
అననము చందురుని నదియేల పోలెనే ||
అతివ నీచేతులు బిసాంగముల బోలితేను
యితవై నడపు హంసనేల పోలెనే
చతురత నాసికము సంపెంగ జోలితేను
తతి నీకురులు తుమ్మెదలనేల పోలెనే ||
నేవళపు నీయారు నీలాహి బోలితేను
యీవల మేను మెరుపునేల పోలెనే
శ్రీ వేంకటేశు మొవి చిన్ని కెంపులంతించి
ఆవేళ దంతాలు వజ్రాలై యెట్టువోలెనే ||
ఒకపరి కొకపరి కొయ్యారమై
మొకమున కళలెల్ల మొలచినట్లుండె॥
జగదేకపతిమేన చల్లిన కర్పూరధూళి
జిగికొని నలువంక చిందగాను
మొగి చంద్రముఖి నురమున నిలిపెగాన
పొగరు వెన్నెల దిగబోసి నట్లుండె॥
పొరిమెరుగు చెక్కుల పూసిన తట్టుపునుగు
కరగి ఇరుదెసల కారగాను
కరిగమన విభుడు గనుక మోహమదము
తొరిగి సామజసిరి తొలికినట్లుండె॥
మెరయ శ్రీవేంకటేశుమేన సింగారముగాను
తరచైన సొమ్ములు ధరియించగా
మెరుగు బోడి అలమేలు మంగయు తాను
మెరుపు మేఘము గూడి మెరసినట్లుండె॥
పెద తిరుమలాచర్యుల రచన
ఒక్కడే అంతర్యామి వుపకారి చేపట్టు
తక్కినవి యిన్నియును తలపు రేచెడిని ||
యెఱుగుమీ జీవుడా యింద్రియాలు సొమ్ము గావు
గుఱియై మాయలలోన గూడించే వింతె
మఱవకు జీవుడా మనసు చుట్టము గాదు
తెఱగొప్ప ఆసలనే తిప్పెడి దింతె ||
తెలుసుకో జీవుడా దేహమును నమ్మరాదు
వలసితే నుండు బోవు వన్నెవంటిది
తలచుకో జీవుడా ధనము దనిచ్చ గాదు
పలులంపటములచే బరచెడి దింతె ||
సమ్మతించు జీవుడా సంసార మొకజాడ గాదు
బిమ్మటి పొద్దొకజాడ పెనచు నింతె
యిమ్ముల శ్రీవేంకటేశు డితనిమూలమే యింత
నెమ్మి దానే గతియంటే నిత్యమౌ నింతే ||
ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా
యెక్కడా హనుమంతుని కెదురా లోకము
ముందట నేలెడి పట్టమునకు బ్రహ్మయినాడు
అందరు దైత్యులచంపి హరిపేరైనాడు
అంది రుద్రవీర్యము తానై హరుడైనాడు
యెందునా హనుమంతుని కెదురా లోకము
చుక్కలు మోవ పెరిగి సూర్యుడు తానైనాడు
చిక్కు పాతాళము దూరి శేషుడైనాడు
గక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు
ఎక్కువ హనుమంతుని కెదురా లోకము
జలధి పుటమెగసి చంద్రుడు తానైనాడు
మలసి మేరుపుపొంత సింహమైనాడు
బలిమి శ్రీవేంకటేశు బంటై మంగాంబుధి
ఇల ఈ హనుమంతుని కెదురా లోకము
ఒప్పులై నొప్పులై వుండుగాన
అప్పటికి జూడ నదియేకా నిజము ||
కన్నుల కిన్నియు జూడ కలలై వలలై
వున్నతాలు నడ్డాలై వుండుగాన
చిన్నచిన్న చిటిపొటి చిమ్ముదొమ్ముదిమ్ములవి
వున్నవన్నియు జూడ నొకటేకా నిజము ||
సారెకు నోరికి జూడ చవులై నవ్వులై
వూరటమాటలై వుండుగాన
తారుమారు తాకుసోకు తప్పుదోపులన్నియు
వోరపారులేనివెల్ల నొక్కటేకా నిజము ||
మేనికి నిన్నియు జూడ మృదువై పొదువై
పూని సంపదలై వుండుగాన
తేనై తీపై తిరువేంకటేశ నిన్ను
కానవచినదే నొక్కటేకా నిజము ||
ఒరసి చూడబోతే నొకటీ నిజము లేదు
పొరల మేను ధరించి పొరలగ బట్టెను ||
పాతకములటకొన్ని బలు పుణ్యాలట కొన్ని
యీతల స్వర్గనరకాలిచ్చేనట
యేతుల నందుగొన్నాళ్ళు యిందు గొన్నాళ్ళు దేహికి
పోతరించి కాతరించి పొరలనే పట్టెను ||
పొలతులట కోందరు పురుషులట కొందరు
వెలుగును జీకట్లు విహారమట
కలవరింతలుగొంత ఘన సంసారము గొంత
పొలసి జీవులు రెంటా బొరలగ బట్టెను ||
ఒక్కవంక జ్ఞానమట వొక్కవంక గర్మమట
మొక్కి యిహపరాలకు మూలమిదట
తక్కక శ్రీ వేంకటేశు దాసులై గెలిచిరట
పుక్కిట నిన్నాళ్ళు రెంటా బొరలగ బట్టెను ||
ఒల్లడుగాక దేహి వుద్యోగించడుగాక
కొల్లలైనమేలు తనగుణములో నున్నది
తలచుకొంటేజాలు దైవమేమి దవ్వా
నిలుచుక తనలోనే నిండుకున్నాడు
చలపట్టితేజాలు సర్గ మేమి బాతా
చలివేడినాలికపై సత్యములో నున్నాడు
ఆయమెఱిగితే జాలు నాయుష్యము గరవా
కాయపుటూపిరిలోనే గని వున్నది
చేయబోతే పుణ్యుడుగా జీవునికి దడవా
చేయుర గర్మము తనచేతిలోనే వున్నది
మొక్క నేరిచితే జాలు మోక్షమేమి లేదో
యెక్కువశ్రీవేంకటేశుడిదె వున్నాడు
దక్కగొంటేజాలు పెద్దతనమేమి యరుదా
తక్కక శాంతముతోడిదయ లోన నున్నది
ఒసగితివిన్నియు ఒకమాటే
వెసనిక జేసే విన్నపమేది ||
నారాయణ నీ నామమె తలచిన
నీరాని వరము లిచ్చితివి
చేరి నిన్నిట సేవించిన నిక
కోరి పడయనిక కోరికలేవి ||
హరి నీ కొకమరి యటు శరణంటే
గరిమల నన్నిటు గాచితివి
నిరతముగా నిక నుతియింపుచు
అర గొరతని నిను అడిగేదో ||
శ్రీ వేంకటేశ్వర చేయెత్తి మ్రొక్కిన
భావమె నీవై పరగితివి
ఈ వరుసల నీవింతటి దాతవు
ఆవాలనిను కొనియాడేడి దేమి ||
ఓ
ఓ పవనాత్మజ ఓ ఘనుడా
బాపు బాపనగా పరిగితిగా ||
ఓ హనుమంతుడ ఉదయాచల ని-
ర్వాహక నిజ సర్వ ప్రబలా
దేహము మోచిన తెగువకు నిటువలె
సాహస మిటువలె చాటితిగా ||
ఓ రవి గ్రహణ ఓదనుజాంతక
మారులేక మతి మలసితిగా
దారుణపు వినతా తనయాదులు
గారవింప నిటు కలిగితిగా||
ఓ దశముఖ హర ఓ వేంకటపతి-
పాదసరోరుహ పాలకుడా
ఈ దేహముతో ఇన్నిలోకములు
నీదేహమెక్క నిలిచితిగా ||
ఓయమ్మా ఇంతయేల వొద్దనరే
నాయముగాదిందరిలో నగుబాటు తనకును
చెక్కునొక్కితిని సెలవి నవ్వితిని
మక్కువతో నెంతైనా మాటాడడు
మొక్కూ మొక్కితిని మోనాన నుండితిని
యెక్కుడు దిట్టితినంటా నెగ్గువట్టీ నితడు
ఇచ్చకము జేసితి ఇచ్చితి విడెమును
కచ్చుపెట్టి యెంతైనా కరగడు
ముచ్చటలాడితిని మోవిజూచితి తన్ను
బచ్చిగా జేసితినంటా పగచాటీ నితడు
కన్నులా జొక్కితిని కాగిటా నించితిని
మన్నించె రతినెంతైనా మానడు
సన్నల మెచ్చితిని చాయల హెచ్చితిని
ఇన్నిటా శ్రీవేంకటేశు డెంతజాణే ఇతడు
ఓరుచుకోవే యెట్టయినా వువిద నీవు
నేరుపరి నీ విభుడు నేడే వచ్చీ నీడకు ||
కలువల వేసితేనే కాముడు చుట్టము గాడా
వెలయు విరహులకు వెగటు గాక
చలివెన్నెల గాసితే చందురుడు పగవాడా
పొలయలు కలవారే పొగడరుగాక ||
కొసరుచు బాడితేనే కోయిల గుండె బెదరా
అసదు విరహులు కాదందురు గాక
ముసరితే దుమ్మిద మూకలు దయలేనివా
విసిగిన కాముకులే వినలేరు గాక ||
వనము సింగారించితే వసంతుడు కౄరుడా
వొనరని విరహుల కొంటదుగాక
యెనసి శ్రీ వేంకటేశుడేలె నిన్ను చిలుకలు
కినిసేనా పాంథులకు కేరడముగాక ||
ఓరుపే నేరుపు సుమ్మీ వువిదలకు
మారుకోకు మగవాని మనసు మెత్తనిది ||
చలము సంపాదించవద్దు చనవే మెఱయవే
చెలువుడాతడే నీచేత జిక్కీని
బలములు చూపవద్దు పకపక నగవే
అలరిన జాణతనమందులోనే వున్నది ||
పగలు చాటగవద్దు పైకొని మెలగవే
సొగసి ఆతడే నీ సొమ్మై వుండీనీ
తగవుల బెట్టవద్దు తమకము చూపవే
అగపడ్డ నీ పంతములందులోనే వున్నవి ||
మొక్కల మేమియు నొద్దు మోహములు చల్లవే
నిక్కి శ్రీ వేంకటేశుడు నిన్ను గూడెను
తక్కల బెట్టగవొద్దు దయలు దలచవే
అక్కజపు నీ రతులు అందులోనే వున్నవి ||
ఓహో డేండేం వొగి బ్రహ్మ మిదియని
సాహసమున శ్రుతి దాటెడిని ||
పరమున నరము బ్రకృతియు ననగా
వెరవుదెలియుటే వివేకము
పరము దేవుడును అపరము జీవుడు
తిరమైన ప్రకృతియె దేహము ||
జ్ఞానము జ్ఞేయము జ్ఞానగమ్యమును
పూని తెలియుటే యోగము
జ్ఞానము దేహాత్మ, జ్ఞేయము పరమాత్మ
జ్ఞానగమ్యమే సాధించుమనసు ||
క్షరము నక్షరమును సాక్షి పురుషుడని
సరవి దెలియుటే సాత్వికము
క్షరము ప్రపంచ, మక్షరము కూటస్థుడు
సిరిపురుషోత్తముడే శ్రీ వేంకటేశుడు ||
ఔ
ఔనయ్య జాణడువు ప్రహ్లాద వరద
ఆసలు వెట్టకుము ప్రహ్లాదవరద ||
వేసరక శ్రీసతితో వేడుక నవ్వులు నవ్వి
ఆసలు చూపేవు ప్రహ్లాద వరద
సేస వెట్టిన చేతుల చెరగు వట్టి తిసేవు
ఆ సుద్దులె చెప్పేను ప్రహ్లాద వరద ||
నంటున తొడమీదను నలినాక్షి నెక్కించుక
అంటేవు సిగ్గులు ప్రహ్లాదవరద
గెంటుక ఏ పొద్దును కేలుకేలు కీలించుక
అంటువాయ వదివో ప్రహ్లాద వరద ||
కందువతో కాగిలించి కైవసము సేసుకొంటి
వందముగ నీకెను ప్రహ్లాద వరద
పొంది శ్రీవేంకటమున పొంచి ఔభళములోన
అంది వరాలిచ్చేవు ప్రహ్లాద వరద ||
క
కంచూగాదు పెంచూగాదు కడుబెలుచు మనసు
యెంచరాదు పంచరాదు యెట్టిదో యీమనసు ||
పట్ట బసలేదు చూడ బయలుగా దీమనసు
నెట్టన బారుచునుండు నీరుగా దీమనసు
చుట్టి చుట్టి పాయకుండు జుటమూగా దీమనసు
యెట్టనెదుటనే వుండు నేటిదో యీమనసు ||
రుచులెల్లా గానుపించు రూపు లేదు మనసు
పచరించు నాసలెల్లా బసిడిగా దీమనసు
యెచటా గరగదు రాయీగాదు మనసు
యిచటా నచటా దానే యేటిదో యీమనసు ||
తప్పక నాలో నుండు దైవము గాదు మనసు
కప్పి మూటగట్టరాదు గాలీ గాదు మనసు
చెప్పరానిమహిమలశ్రీవేంకటేశు దలచి
యిప్పుడిన్నిటా గెలిచె నేటిదో యీమనసు ||
కంటి నఖిలాండ కర్తనధికుని గంటి
కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి ||
మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి
బహు విభవముల మంటపములు గంటి
సహజ నవరత్న కాంచన వేదికలు గంటి
రహి వహించిన గోపురంబులవె కంటి ||
పావనంబైన పాపవినాశనము గంటి
కైవశంబగు గగన గంగ గంటి
దైవికపు పుణ్యతీర్థములెల్ల బొడగంటి
కోవిదులు గొనియాడు కోనేరి గంటి ||
పరమ యోగీంద్రులకు భావగోచరమైన
సరిలేని పాదాంబుజముల గంటి
తిరమైన గిరిచూపు దివ్యహస్తము గంటి
తిరు వేంకటాచలాధిపు జూడగంటి ||
కంటి నిదే యర్థము ఘనశాస్త్రములు దవ్వి
నంటున నిందుకంటెను నాణె మెందూ లేదు ||
మేటివైరాగ్యముకంటే మిక్కిలి లాభము లేదు
గాటపువిజ్ఞానముకంటే సుఖము లేదు
మీటైనగురువుకంటే మీద రక్షకుడు లేడు
బాటసంసారముకంటే పగ లేదు ||
పరపీడసేయుకంటే పాపము మరెందు లేదు
పరోపకారముకంటే బహుపుణ్యము లేదు
నిరతశాంతముకంటే నిజధర్మ మెందు లేదు
హరిదాసుడౌకంటే నట గతి లేదు ||
కర్మసంగము మానుకంటే దేజము లేదు
అర్మిలి గోరికమానేయంతకంటే బుద్ధి లేదు
ధర్మపు శ్రీవేంకటేశు దగిలి శరణుజొచ్చి
నిర్మలాస నుండుకంటే నిశ్చయము లేదు ||
కంటి శుక్రవారము గడియ లేడింట
అంటి అలమేల్మంగ అండ నుండే స్వామిని॥
సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణముగట్టి
కమ్మని కదంబము కప్పు పన్నీరు
చెమ్మతోన వేష్టువలు రొమ్ముతల మొలచుట్టి
తుమ్మెద యైచాయతోన నెమ్మది నుండే స్వామిని॥
పచ్చకప్పురమె నూఱి పసిడి గిన్నెల నించి
తెచ్చి శిరసాదిగ దిగనలది
అచ్చెరపడి చూడ అందరి కన్నులకింపై
నిచ్చెమల్లెపూవు నలె నిటుతానుండే స్వామిని॥
తట్టు పునుగే కూరిచి చట్టలు చేరిచినిప్పు
పట్టి కరగించి వెండి పళ్యాల నించి
దట్టముగ మేనునిండ పట్టించి దిద్ది
బిట్టు వేడుక మురియు చుండే బిత్తరి స్వామిని॥
కంటిమి నేడిదె గరుడాచలపతి
ఇంటి వేలుపగు యీశ్వరుండు ||
శ్రీనరసింహుడు చిన్మయకాంతుడు
దానవాంతకుడు దయానిధి
నానా మహిమల నమ్మిన వారిని
పూనుకు కాచె పోషకుడితడు ||
దేవాది దేవుడు దినకర తేజుడు
జీవాంత రంగుడు శ్రీవిభుడు
దైవ శిఖామణి తలచిన వారిని
సేవలు గొనికాచె విభుడితడు ||
పరమమూర్తి హరి ప్రహ్లాద వరదుడు
కరుణానిధి బుధకల్పకము
పరగు శ్రీవేంకట పతి తనదాసుల
నరదుగ గాచేయన ఘనుండితండు ||
కంటిమి రెంటికి భూమి గలుగుదృష్టాంతరము
గొంటరిరావణునందు గుహునియందు ||
నీదాస్యము గలనీచజన్మమైన మేలు
యేదియునెఱగనట్టియెక్కువజన్మానకంటే
వాదపుగర్వము లేదు వట్టియాచారము లేదు
సాధించి నైచాన్యుసంధానమేకాని ||
మిమ్ము దలపుచు జేయుమృగయానమైన మేలు
సొమ్ముపోక మీకుగని సుకృతము సేయుకంటె
దిమ్మరిజన్మము లేదు తెగనికోరిక లేదు
పమ్మి నీపై బెట్టినట్టిభారమేకాని ||
దిక్కులు సాధించుకంటె తెలిసి శ్రీవేంకటేశు
దిక్కు నీనామమే కా సాధించుటే మేలు
యెక్కువ తక్కువ లేదు యెఱు కెఱుగమి లేదు
చక్కజాడతో నీకు శరణంటేగాని ||
కంటిరా వింటిరా కమలనాభుని శక్తి
వొంటి నితనిశరణ మొకటే వుపాయము
యీతనినాభి పొడమె యెక్కువైనబ్రహ్మయు
యీతడే రక్షించినాడు యింద్రాదుల
యీతడాకుమీద( దేలె నేకార్ణవమునాడు
యీతడే పో హరి మనకిందరికి దైవము
యీతడే యసురబాధ లిన్నియు( బరి హరించె-
నీతనిమూడడుగులే యీలోకాలు
యీతడే మూలమంటే నేతెంచి కరి(గాచె
నీతనికంటే వేల్పు లిక మరి కలరా
యీతడే వైకుంఠనాథు( డీతడే రమానాథు(-
డీతడే వేదోక్తదైవ మిన్నిటా తానె
యీతడే అంతర్యామి యీ చరాచరములకు
నీతడే శ్రీవేంకటేశు( డీహపరధనము
కంటే సులభమిది కానక యుంటే దుర్లభ
మింటిలోననే వున్న దిహము బరమును ||
హరిదాసులు మెట్టినక్కడే పరమపద
మరయ నిందుకంటె నవల లేదు
తిరమై వీరిపాదతీర్థమే విరజానది
సొరిది నన్నిచోట్లు చూచినట్టే వున్నది ||
మచ్చిక వైష్ణవులమాటలెల్లా వేదములు
యిచ్చల నిందుకంటే నింక లేదు
అచ్చట వీరిప్రసాద మమృతపానములు
అచ్చమై తెలిసేవారి కఱచేత నున్నది ||
చెలగి ప్రపన్నులసేవే విజ్ఞానము
ఫల మిందుకంటే మఱి పైపై లేదు
తలప శ్రీవేంకటేశుదాసులే యాతనిరూపు
లెలమి నెదుట నున్నా రెఱిగినవారికి ||
కందర్ప జనక గరుడ గమన
నంద గోపాత్మజ నకో నమో
వారధి శయన వామన శ్రీధర
నారసింహ కృష్ణ నమో నమో
నీరజనాభ నిగమ గోచర
నారాయణ హరి నమో నమో
పరమ పురుషా భవ విమోచన
వరద వసుధా వధూవర
కరుణా కాంతా కాళిందీ రమణ
నరసఖ శౌరీ నమో నమో
దానవ దమన దామోదర శశి
భాను నయన బల భద్రానుజ
దీన రక్షక శ్రీ తిరు వేంకటేశ
నా నా గుణమయ నమో నమో
ప|| కంబమున వెడలి ఘన నరసింహము | కుంభిని హిరణ్యు గూలిచెను ||
చ|| తొడికి దైత్యు తన తొడపైకి దిగిచి | కడుపు చించి రక్తము చల్లి |
జడియక పేగులు జందెంబులుగా | మెడ దగిలించుక మెరసీ వాడె ||
చ|| పెదవులు చింపుచు పెనుగోళ్ళ నదిమి |వుదుటుబునుక కొరి కుమియుచును |
సదరపు గుండెలు చప్పరించుచును | మెదడు గుండముగ మెత్తీవాడే ||
చ|| దేవతల భయము దీర్చి అంకమున | శ్రీవనితను కృపసేయుచును |
పావనపు టహోబల గిరిదైవము | శ్రీవేంకటగిరి చెలగీ వాడే ||
ప|| కటకటా జీవుడా కాలముదోలుకరాగ | సటవటలనే పొద్దు జరపేవుగా ||
చ|| సమత నన్నియు జదివి కడపటను | కుమతివై అందరి గొలిచేవుగా |
తమిగొని ప్రేమ నెంతయును గంగకు బోయి | తమకించి నూతినీరు దాగేవుగా ||
చ|| తనువు బ్రాయము నమ్మి దానధర్మము మాని | చెనటివై కర్మాలు సేసేవుగా |
వొనరగ మీదనొడ్డినమొగులు నమ్మి | దొనలనీళ్ళు వెళ్ళదోసేవుగా ||
చ|| యెలమితో దిరువెంకటేశు గొలువలేక | పొలమురాజులవెంట బొయ్యేవుగా |
చిలుకకువలె బుద్ధిచెప్పిన గానలేక | పలుమారకే తోజు బాడేవుగా ||
ప|| కటకటా దేహంబు గాసిబెట్టగవలసె | నిటువంటిదెసలచే నిట్లుండవలసె ||
చ|| చంపనొల్లకకదా సంసారమనియెడి- | గంపమోపు గడించె కర్మసంగ్రహము |
లంపటము విరియించ లావుచాలక తుదిని | దింప నొకకొంతైన తెగుదెంపులేదు ||
చ|| మనుపనోపకకదా మాయావిలంబమున | కనుమూసి కాంక్ష మరి కట్టె దైవంబు |
దినభోగములు విడువ దెరగేమిటను లేక | తనివిబొందించ నెంతయు వసముగాదు ||
చ|| తెలుపనోపకదా తిరువేంకటేశ్వరుడు | వెలలేనివేదనల వేచె బ్రాణులను |
బలిమి నజ్ఞానంబు బాయలే కితనినే | తలచి భవబంధముల దాటంగరాదు ||
ప|| కటకటా యిటుచేసె గర్మబాధ | యెటువంటివారికిని నెడయదీబాధ ||
చ|| దినదినము బ్రాణులకు దీపనముచే బాధ | తనుపోషణములు కందర్పబాధ |
మనసుశాంతికి సదా మమకారములబాధ | తవివోనికోర్కులకు దైవగతిబాధ ||
చ|| వెడయాసచూపులకు వేడుకలచే బాధ | కడువేడ్కలకు వియోగములబాధ |
తొడవైనయెఱుకలకు దురితబుద్ధులబాధ | జడియుబరచింతలకు సంసారబాధ ||
చ|| అరిది నిశ్చయమతికి ననుమానములబాధ | సరిలేనిజీవులకు జన్మబాధ |
తిరువేంకటాచలాధిపుని గని మని కొలుచు- | వెరవుచేతనె కాని వీడదీబాధ ||
కటకటా యేమిటాను కడవర గానడిదే
నిటలపువ్రాత యెట్టో నిజము దెలియదు.
బాదలసంసారము పరవంజుకొని తొల్లి
యేది నమ్మి పాటువడె నీజివుడు
గాదెలకొలుచుగాగ గట్టుకొని కర్మములు
యేదెస చొచ్చీనోకాని యీప్రాణి.
కాపురమై తమతల్లికడుపున వచ్చి పుట్టె
యేపని గలిగెనో యీదేహి
కాపాడి నిxఏపాలు కడునాసతో బాతి
యేపదవి దా నుండునో యీజంతువు.
దవ్వుల యమబాదలు దలచి వెరవడిదె
యెవ్వరి నలిగెనమ్మో యీజీవి
రవ్వగా శ్రీవేంకటాద్రిరాయడు మన్నించగాను
యివ్వల బతికెగాక యెవ్వడోయి తాను.
ప|| కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ | తెట్టలాయ మహిమలే తిరుమలకొండ ||
చ|| వేదములే శిలలై వెలసినది కొండ | యేదెస బుణ్యరాసులే యేరులైనది కొండ |
గాదిలి బ్రహ్మాదిలోకముల కొనల కొండ | శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ ||
చ|| సర్వదేవతలు మృగజాతులై చరించేకొండ | నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ |
వుర్విదపసులే తరువులై నిలచిన కొండ | పూర్వటంజనాద్రి యీ పొడవాటి కొండ ||
చ|| వరములు కొటారుగా వక్కాణించి పెంచే కొండ | పరగు లక్ష్మీకాంతుసోబనపు గొండ |
కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ | విరివైన దదివో శ్రీవేంకటపు గొండ ||
ప|| కడగనుటే సౌఖ్యముగాక యీ- | తడతాకుల నెందరు చనరిట్లా ||
చ|| నిలచినదొకటే నిజమనితెలిసిన- | తెలివే ఘన మింతియకాకా |
కలకాలము చీకటి దవ్వుకొనెడి- | వలలభ్రమల నెవ్వరు వడరిట్లా ||
చ|| పరహిత మిదియే పరమని తెలిసిన- | పరిపక్వమె సంపదగాకా |
దురితవిధుల గొందుల సందుల బడి | ధరలోపల నెందరు చనరిట్లా ||
చ|| ఘనుడీ తిరువేంకటపతియని కని | కొనకెక్కుట తేకువగాకా |
పనిమాలిన యీపలు లంపటముల | తనువు వేచు టెంతటిపని యిట్లా ||
ప|| కడలుడిసి నీరాడగా దలచువారలకు | కడలేని మనసునకు గడమ యెక్కడిది ||
చ|| దాహమణగిన వెనక తత్త్వమెరి గెదనన్న | దాహమేలణగు తా తత్త్వమేమెరుగు |
దేహంబుగల యన్ని దినములకు పదార్థ | మోహమేలుడుగుదా ముదమేల కలుగు ||
చ|| ముందరెరిగిన వెనుకమొదలు మరచెదనన్న | ముందరేమెరుగుదా మొదలేల మరచు ||
అందముగ దిరువేంకటాద్రీశు మన్ననల | కందు వెరిగిన మేలు కలనైన లేదు ||
ప|| కడు జంచలములు కడు నధృవములు | కడునల్పములని కాదందురు ||
చ|| కర్మబోధవికారంబులు | ధర్మతంత్రసంధానములు |
దుర్మదైకసందోహములు | కర్మదూరులివి గాదందుదురు ||
చ|| పరమభాగవతభవ్యమతులు | పరమబోధసంభావకులు |
తిరువేంకటగిరిదేవుసేవకులు | కరుణాధికులివి గాదందురు ||
కడునజ్ఞానపుకరపుకాల మిదె
వెడలదొబ్బి మావెరపు దీర్చవె
పాపపుపొఅసురము బందెలు మేయగ
పోపులపుణ్యము పొలివోయ
శ్రీపతి నీకే చేయి చాచెదము
యేపున మమ్మిక నీడేర్చవె
యిల గలియగమనుయెండలు గాయగ
చెలగి ధర్మమనుచెరు వింకె
పొలసి మీకృపాంబుధి చేరితి మిదె
తెలిసి నాదాహము తీర్చవె
వడిగొని మనసిజవాయువు విసరగ
పొడవగు నెఱకలు పుటమొగసె
బడి శ్రీవేంకటపతి నీశరణము
విడువక చొచ్చితి వెసగావగదే
ప|| కడు అడుసు చొరనేల కాళ్ళు గడుగనేల | కడలేని జన్మసాగర మీదనేల ||
చ|| దురితంబులనెల్లదొడవు మమకారంబు- | లరిదిమమతలకు దొడ వడియాసలు |
గురుతయిన యాసలకు గోరికలు జీవనము | పరగ నిన్నిటికి లంపటమె కారణము ||
చ|| తుదలేని లంపటము దుఃఖహేతువు దుఃఖ- | ముదుటయినతాపమున కుండగ జోటు |
పదిలమగు తాపంబు ప్రాణసంకటము లీ- | మదము పెంపునకు దనమనసు కారణము ||
చ|| వెలయు దనమనసునకు వేంకటేశుడు గర్త | బలిసి యాతనిదలచుపనికి దాగర్త |
తలకొన్న తలపులివి దైవమానుషముగా | దలచి యాత్మేశ్వరుని దలపంగ వలదా ||
ప|| కడుపెంత తాగుడుచు కుడుపెంత దీనికై | పడని పాట్లనెల్ల పడి పొరల నేలా ||
చ|| పరులమనసునకు నాపదలు గలుగగ జేయ | పరితాపకరమైన బ్రతుకేలా |
సొరిదినితరుల మేలు చూచి సైపగలేక | తిరుగుచుండేటి కష్టదేహమిది యేలా ||
చ|| యెదిరికెప్పుడు జేము హితమెల్ల దనదనుచు | చదివిచెప్పని యట్టి చదువులెలా |
పొదిగొన్న యాసలో బుంగుడై సతతంబు | సదమదంబై పడయు చవులు దనకేలా ||
చ|| శ్రీ వేంక్లటేశ్వరుని సేవానిరతి గాక | జీవన భ్రాంతి బడు సిరులెలా |
దేవోత్తముని నాత్మదెలియ నొల్లక పెక్కు | త్రోవలేగిన దేహి దొరతనంబేలా ||
ప|| కదిసి యాతడు మమ్ముగాచుగాక | అదె యాతనికె శరణంటే నంటినేను ||
చ|| ఎవ్వని వుదరమున నిన్నిలోకములుండు | ఎవ్వని పాదము మోచె నిల యలను |
ఎవ్వడు రక్షకుడాయనీ జంతుకోట్లకు | అవ్విభునికి శరణంటే నంటి నిప్పుడు ||
చ|| సభలో ద్రౌపదిగాచె సర్వేశు డెవ్వడు | అభయ హస్తమొసగె నాతడెవ్వడు |
ఇభ వరదు డెవ్వడు యీతనికి వొడిగట్టి | అభినవముగ శరణంటే నంటి నిప్పుడు ||
చ|| శరణు చొచ్చిన విభీషణు గాచె నెవ్వడు | అరిది యజుని తండ్రి యాతడెవ్వడు |
ఇరవై శ్రీవేంకటాద్రి యెక్కి నాతడితడే | అరిసి యితనికే శరణంటే నంటి నిప్పుడు ||
ప|| కనకగిరిరాయ యేగతి నొడబరచేవో | వినవయ్య సతినీకు విన్నవించుమనెను ||
చ|| చెలియకు నీ విచ్చిన చెంగలువ పూదండ | కలికి యెవ్వతె నీకు గానుకిచ్చెనో |
పలుచగా నిందు మీద బసపంటి వున్నదిలె | నెలత యీగురుతులు నీకు జూపుమనెను ||
చ|| కాంతకు నీవు మెడ గప్పినట్టి కంటసరి | చెంతల నీకెవ్వతె వుచిత మిచ్చెనో |
పంతాన నొక దిక్కున బసిడిపూస వున్నది | అంతయు దెలియ నిన్ను నడిగె రమ్మనెను ||
చ|| భామగూడు నీవిచ్చినపైడి వ్రాతచీర యిది | కామించి యెవ్వతె నీకు గట్నమిచ్చెనో |
ఆమీద శ్రీవేంకటేశ అదె విలాసమున్నది | యేమతకమో యిది యెరిగించుమనెను ||
ప|| కనినవాడా గాను కాననివాడా గాను | పొనిగి వొరులకై తే బోధించే నేను ||
చ|| ధరణి గర్మము గొంత తగినజ్ఞానము గొంత | సరికి సరే కాని నిశ్చయము లేదు |
వొరిమె యెంచిచూచితే నొకటివాడా గాను | సరవి దెలియ కేమో చదివేము నేము ||
చ|| యీతల నిహము గొంత యింతలో బరము గొంత | చేతులు రెండు చాచే చిక్కుట లేదు |
యీతెరవులో నొకటి నేరుపరుచుకోలేను | కాతరాన కతలెల్లా గఱచితి నేను ||
చ|| దైవిక మొకకొంత తగుమానుషము గొంత | చేవలుచిగురువలె జేసేను |
యీవల శ్రీవేంకటేశు డిది చూచి నన్ను గాచె | భావించలేక యిన్నాళ్ళు భ్రమసితి నేను ||
ప|| కనియు గాననిమనసు కడమగాక | యెనలేని హరిమహిమకిది గురుతుగాదా ||
చ|| కనుకలిగి హరిగొలిచి ఘనులైరిగాక మును | మనజులే కారా మహరుషులును |
మనసులో నిపుడైన మరిగి కొలిచినవారు | ఘనులౌట కిదియు నిక్కపు గురుతుగాదా ||
చ|| భావించి హరిగొలిచి పదవులందిరిగాక | జీవులే కారా దేవతలును |
కావించి కొలిచినను ఘనపదవు లేమరుదు | యేవలన నిందరికి నిది గురుతుగాదా ||
చ|| పన్ని హరిగొలిచి నేర్పరులైరిగాక ధర- | నున్నవారే కారా యోగివరులు |
యెన్నికల శ్రీవేంకటేశు నమ్మినవార- | లిన్నియును జేకొనుటకిది గురుతుగాదా ||
ప|| కనుగొనగ జీవు డెరుగడుగాక యెరిగినను | అనవరతవిభవంబు లప్పుడే రావా ||
చ|| విసుగ కెవ్వరినైన వేడనోర్చిననోరు | దెసలకును బలుమారు దెరచునోరు |
వసుధాకళత్రు దడవదుగాక తడవినను | యెసగ గోరికలు తనకిప్పుడే రావా ||
చ|| ముదమంది యెవ్వరికి మ్రొక్కనేర్చినచేయి | పొదిగి యధముల నడుగబూనుచేయి |
అదన హరి బూజసేయదుగాక సేసినను | యెదురెదుర గోరికలు యిప్పుడే రావా ||
చ|| తడయకేమిటికైన దమకమందెడిమనసు | అడరి యేమిటికైన నలయుమనసు |
వడి వేంకటేశు గొలువదుగాక కొలిచినను | బడిబడినె చెడనిసంపద లిట్లు రావా ||
కన్నవారెవ్వరు నేడు కాంతజవ్వనమిది
పన్నిన విభుడ నీభాగ్గ్యమాయగాక ||
పట్టబసయేది పడతి నడుము నేడు
బట్టబయలవు అందుభావనే కాదా
అట్టెట్టెనగనేది అంగన తురుము నేడు
పుట్టు మేఘమిట మింపోడవేగాదా ||
యెంచగ జోటేది యింతికనుచూపులివి
కంచుమిచ్చులట చెప్పకధలేకాదా
పొంచి దాచ జోటేది పొలతి కుచములివి
పెంచెపుజక్కవలట బెదరేవే కావా ||
తలపోత యేది కాంతకు శ్రీ వేంకటపతి
వలపట మతిపరవశమే కాదా
తలగ నోటేది తడబడే రతులలో
పలుకు బంతములెల్ల పదరుటే కాదా ||
ప|| కన్నవిన్న వారెల్ల కాకు సేయరా | ఉన్నతుడ వైన నీకీ వొచ్చములేల నయ్య ||
చ|| దేవతల గాచినట్టి దేవుడ నీకు పసుల | నీవల గాచితివనే హీనమేల |
కావించి పాలజలధి కాపురముండినట్టి | నీవు పాల దొంగవవనే నింద నీకు ఏల ||
చ|| కాలమందు బలి దైత్యు గట్టివేసినట్టి నీకు | రోలకట్టు వడినట్టి రోత నీకేల |
పోలించి లోకాల కెల్ల పొడవైన దేవుడవు | బాలుడవు రేపల్లెలో పారాడె నేలనయ్యా ||
చ|| పాము మీద పవ్వళించి పాయకుండి నట్టి నీకు | పాము తల తొక్కినట్టి పగ లేలా |
కామించి శ్రీ వేంకటాద్రి కడపరాయడ | భూమి మాయ లణచి నేర్పుల మాయ లేలయ్యా ||
కన్నులపండుగలాయ గడపరాయనితేరు
మిన్ను నేల శృంగారము మితిమీరినట్లు
కదలె గదలె నదె గరుడధ్వజునితేరు
పొదిగి దేవదుందుభులు మ్రోయగా
పదివేలు సూర్యబింబము లుదయించినట్లు
పొదలి మెరువు వచ్చి పొడచూపినట్లు
వచ్చె వచ్చె నంతనింత వాసుదేవునితేరు
అచ్చుగ దేవకామిను లాడిపాడగా
ముచ్చటతో గరుడుడు ముందట నిలిచినట్టు
మెచ్చుల మెరుగులతో మేఘములు వాలినట్టు
తిరిగె దిరిగె నదె దేవదేవోత్తముతేరు
సరుస దేవతలెల్ల జయవెట్టగా
విరివి గడపలో శ్రీ వేంకటేశుడు తేరుపై
నిరవాయ సింహాసన మిదేయన్నట్లు
ప|| కన్నులెదిటిదే ఘన వైకుంఠము | వెన్నుని గొలిచిన విజ్ఞానికిని ||
చ|| తలచిన దెల్లా తత్త్వ రహశ్యమె | తెలిసిన యోగికి దిన దినము |
పలికిన దెల్లా పరమ మంత్రములె | ఫలియించిన హరి భక్తునికి ||
చ|| పట్టిన దెల్లా బ్రహ్మాత్మకమే | పుట్టును గెలిచిన పుణ్యునికి |
మెట్టిన దెల్లా మిన్నేటి నిధులె | రట్టడి తెగువ మెరయు వానికిని ||
చ|| వినినవి యెల్లా వేదాంతములే | ఘనుడగు శరణాగతునికిని |
యెనసిన శ్రీ వేంకటేశుడె యింతా | కొనకెక్కిన నిజకోవిదునికిని ||
ప|| కపటాలు వద్దు గాక కాంతలతోను | యిపుడు చెల్లదా నీకు యెంత సేసినాను ||
చ|| తమకాన నాపెపేరుతడవితి వింతేకాక | మమకారము నామీద మరచేవా |
భ్రమసితినంతా నాతోబాసలు సేయ గనేల | జమళి నెందరైనా దోసములా నీకేమీ ||
చ|| ననుపున నాతోడ నవ్వితి వింతేకాక | యెనసి నన్ను మన్నించ కేల మానేవు |
పని పరాకంతా నొడంబరచక నింతయేల | తనివి చాలకుండితే తగదా నీకేమీ ||
చ|| సొలసి మోక్కగా నాపె జూచితి వింతేకాక | తలసితివి నన్ను నేకడమున్నదా |
తొలుతటి పొంతులంటా తొరలించ నిపుడేల | చెలితో శ్రీ వేంకటేశ సిగ్గా నీకేమీ ||
ప|| కామించి నీవరుగగలయు నాయకుడ నే- | డేమి భాగ్యము సేసెనే తరుణి ||
చ|| కాగిన గుబ్బల మీద కమ్మజెమటలదొప్ప | దోగిన పయ్యెద కొంగు దూలగును |
వేగైన కొప్పున క్రొవ్విరులు దురిమి విర్ర- | వీగుచు నీవెటు వొయ్యేవే తరుణి ||
చ|| ఒప్పైన శిరసు మీదగుప్పరించిన జవ్వాది | చిప్పిలి చెక్కుల వెంటబొందగను |
అప్పళించిన కస్తూరిలప్పలు రాలగ నీ- | విప్పుడెక్కడికి నేగేవో తరుణి ||
చ|| వీడినది మొలనూలు విరుల చెదరె కొంత | వాడినది కెమ్మోని వన్నెలై |
ఈడులేని తిరువేంకటేశుడిదె నిన్ను గూడె | యీడ గొత్తలివి యేటివే వోతరుణి ||
ప|| కరుణానిధిం గదాధరం | శరణాగతవత్సలం భజే |
చ|| శుకవరదం కౌస్తుభాభరణం | అకారణప్రియ మనేకదం |
సకలరక్షకం జయాధికం సే- | వకపాలక మేవం భజే ||
చ|| వురగశయనం మహోజ్జ్వలం తం | గరుడారూఢం కమనీయం |
పరమపదేశం పరమం భవ్యం | హరిం దనుజభయదం భజే ||
చ|| లంకాహరణం లక్ష్మీరమణం | పంకజసంభవప్రియం |
వేంకటేశం వేదనిలయం శు- | భాంకం లోకమయం భజే ||
కరుణించు మికనైన కాపురమా
కరికరి బెట్టకుమీ కాపురమా
కలలోనిసుఖమైన కాపురమా
కలుషమేచవియైనకాపురమా
కలను బేహారపుకాపురమా
కలడు మా కిదే హరి కాపురమా
గంటవేటలో తగులుకాపురమా
కంటవత్తివెట్టికాచేకాపురమా
గంటుగిందుగా బొరబేకాపురమా
కంటిమి శ్రీపతికృప కాపురమా
కావిరి వెఱ్రిచేరాయి కాపురమా
కావలసినట్లయ్యేకాపురమా
శ్రీవేంకటేశ్వరుడు చేరి నిన్ను నన్ను నొక్క
కైవశము నేనెగదోకాపురమా
కలకాలమిట్లాయ గాపురమెల్లా
అలదైవమెందున్నాడో ఆలకించడుగా.
తనకే సంతసమైతే తన భాగ్యము వొగడు
తనకు జింతవుట్టితే దైవము దూరు
మనుజునిగుణమెల్లా మాపుదాకా నిట్లానె
ఘనదైవ మెందున్నాడో కరుణ జూడడుగా.
విరివి బాపాలు సేసేవేళ నాదాయము లెంచు
నరకమంది పుణ్యము నాడు వెదకు
తిరమైనజీవునితెలివెలా నీలాగె
ధర దైవ మెందున్నాడో దయ జూడడుగా.
వేళతో నిద్దిరింపుచు విరక్తునివలె నుండు
మేలుకొన్నవేళ నన్ని మెడ బూనును
యీలీల దేహిగుణము యెంచి శ్రీవేంకటేశుడు
యేలి దైవ మెందున్నాడో యిట్టే మన్నించడుగా.
కలడా ఇంతటిదాత కమలనాభుడే కాక
కలడన్న వారిపాలగలిగిన దైవము
యిచ్చెను సంపదలు ఇతడింద్రాదులకునెల్ల
యిచ్చెను శుకాదుల కిహపరాలు
యిచ్చెను వాయుజునికి యిటమీది బ్రహ్మపట్ట-
మిచ్చల ఘంటాకర్ణుని కిచ్చె కుబేరత్వము
కట్టెను ధృవపట్టము కమలజు కంటే మీద
కట్టె విభీషణుకు లంకారాజ్యము
కట్టియిచ్చె నజునికి గతచన్నవేదాలు
కట్టెను శ్రీసతి చేత కంకణ సూత్రములు
పెట్టెను దేవతలకు పేరినమృతపువిందు
వెట్టెను భక్తవత్సల బిరుదితడు
యిట్టె శ్రీవేంకటాద్రి నిందరికిఁ బొడచూపి
పెట్టె తన ప్రసాదము పృథివి జీవులకు
ప|| కాకున్న సంసారగతులేల | లోకకంటకములగు లోభములేల ||
చ|| వినికిగనవలసినను విష్ణుకీర్తన చెవికి | వినికిచేసిన నదియె వేదాంతబోధ ||
మనికిగనవలసినను మధువైరిపై భక్తి | వునికి ప్రాణులకు బ్రహ్మోపదేశంబు ||
చ|| చదువు గనవలసినను శౌరినామము దిరుగ | జదువుటే సకలశాస్త్రముల సమ్మతము |
నిదుర గనవలసినను నీరజాక్షునికి దన- | హృదయమర్పణ సేయుటిది యోగనిదుర ||
చ|| ఆస వలసిన వేంకటేశ్వరునికృపకు- | నాససేయుటే పరమానందసుఖము |
వాసి గనవలసినను వైష్ణవాగారంబు | వాసి సేయుట తనకు వైభవస్ఫురణ ||
ప|| కలదింతె మాట కంతుని యాట | తెలుసుకో నీలోనిదియె పూట పూట ||
చ|| అలమేలుమంగా హరియంతరంగా | కలితనాట్యరంగ కరుణాపాంగ |
చెలువుడు వీడె చేకొను నేడె | వలరాజు తూపులివి వాడిమీద వాడి ||
చ|| అలినీలవేణి యంబుజ పాణి | వెలయంగ జగదేక విభునిరాణి |
కలయు నీపతి వచ్చె గక్కన నిన్నిదె మెచ్చె | పలికీని చిలుకలు పచ్చిమీదబచ్చి ||
చ|| సిత చంద్రవదనా సింగారసదనా | చతుర దాడిమ బీజచయరదనా |
యితవైన శ్రీవేంకటేశుడు నిన్నిదె కూడె | తతి దలపోతలు తలకూడెగూడె ||
కలదిదివో సుఖము గలిగినను గర్బము నిలువక మానునా
మలసి కామ్యకర్మములకుజొచ్చినమగుడ బుట్టువులు మానునా
పరగ నింద్రజిత్తుడు హనుమంతుని బ్రహ్మాస్త్రంబున గట్టి
అరయ సందుపై మోకులు గట్టిన నలబ్రహ్మాస్త్రము వదలె
పరిపరివిధముల నిటువలెనే హరి బ్రపత్తి నమ్మిననరుడు
తిరుగ గర్మమార్గమునకు జొచ్చిన దేవుడు దనవాత్సల్యము
అలరిన సంసారభ్రమ విడిచి యడవిలోన జడభరతుడు
తలపుచు నొకయిఱ్రి బెంచినంతనే తనకును నారూపు దగిలె
ములుగుచు లంపటములు దెగ విడిచి మోక్షము వెదకెడినరుడు
వలపనిదుస్సంగతులు పెంచినను వాసన లంటక మానునా
అటుగన తా బట్టిసవ్రత ముండగ సవ్యమతము చేపట్టినను
నటనల నెందున బొందక జీవుడు నడుమనె మోరుడైనట్లు
తటుకన శ్రీవేంకటపతి నొక్కని దాస్యము భజియించిననరుడు
ఘటనల నాతనికైంకర్యములకు కడుబాత్రుడుగాక మానునా
ప|| కలలోని సుఖమే కలియుగమా- వెన్న | కలిలో నెక్కడిదె కలియుగమా ||
చ|| కడిగడి గండమై కాలము గడిపేవు | కడుగ గడుగ రొంపి కలియుగమా |
బడలికె వాపవు పరమేదొ చూపవు | గడిచీటియును నీవు కలియుగమా ||
చ|| కరపేవు కరతలే మరపేవు మమతలే | కరకర విడువవు కలియుగమా |
తెరచీర మరగింతే తెరువేల మూసేవు | గరుసేల దాటేవో కలియుగమా ||
చ|| కానిదె మెచ్చేవు కపటాలే యిచ్చేవు | కానీలే కానీలే కలియుగమా |
పైనిదే వేంకటపతి దాసులుండగ | కానవా నీవిదేమి కలియుగమా ||
|ప|కలశా పురముకాడ కందువ చేసుకోని అలరుచున్నవాడు
హనుమంతరాయడు
1.సహజానన ఒక జంగచాచి సముద్రము దాటి మహిమ మీరిగ హనుమంతరాయడు
ఇహమున రాము బంటై ఇప్పుడూ ఉన్నవాడు అహరహము హనుమంతరాయడు
2.నిండూ నిధానపు లంక నిమిషాన నీరు సేసే మండితమూరితి హనుమంతరాయడు
దండితొ మగిడీవచ్చే తగ సీత శిరోమని అండ రఘుపతికిచ్చే హనుమంతరాయడు
3.వదలని ప్రతాపాన వాయుదేవుసుతుడై మది ఇంచినాడు హనుమంతరాయడు
చదరక ఏ ప్రొధు శ్రీ వేంకతేశు వాకిట అదిగో కాచుకున్నాడు హనుమంతరాయడు
ప|| కలిగినది యొక్కటే కమలాపతిసేవ | తెలుప కొంగిచ్చేను దిబ్బెము దొడికేను ||
చ|| హరియే పరతత్త్వ మతడొక్కడే గతి | ధరలోన దేవతలెందరైనా గలుగనీ |
మురహరనామము ముంచి యొక్కటే యెక్కుడు | యిరవైన మంత్రము లెన్నియైనా నుండనీ ||
చ|| గోవిందుదాసులే పెక్కువఘను లిందరిలో | వేవేలు పెద్దలటు వేలసంఖ్య లుండనీ |
కైవసపు విష్ణు కైంకర్యమే సాధనము | యీవలనావల పుణ్యమెంతైన గలుగనీ ||
చ|| పట్టిన శ్రీవేంకటేశు భక్తియొక్కటే ఘనము | యిట్టే శాస్త్రజ్ఞాన మెట్లున్నను |
వొట్టినయాతని ముద్రలొక్కటికి మూలము | యెట్టి లాంఛనములిల నెన్నియైనా నుండనీ ||
ప|| కలిగినమతి వృధాగాకుండా | అలరుటె పుణ్యంబగు ఫలము ||
చ|| ఒనరిన ఈ భవ ముసు రనకుండ | ఘనుడే జీవుడు గల ఫలము |
తనువుమోచి చైతన్యాత్ముని మతి | గనుటే వివేకముగల మతి ||
చ|| చేసిన పుణ్యము చెడిపోకుండ | శ్రీ సంపద మెరసిన ఫలము |
ఈసుల రేసుల యితర దూషణల | బాసుటె అపురూపపు ఫలము ||
చ|| హరి గొలిచియు మిథ్యగాకుండ | విరసముడిచి చదివిన ఫలము |
తిరువేంకటగిరి దేవుని సరిగా | పరుల గొలవనిదె బహుఫలము ||
ప|| కలిగెనిది మాకు కైవల్యం | కలకలాము హరికథా శ్రవణం ||
చ|| ఆచింత్య మద్భుత మానందం | ప్రచురం దివ్యం పావనం |
సుచరిత్రం శ్రుతిశోభితం | అచలం బిదివో హరికీర్తనం ||
చ|| నిరతం నిత్యం నిఖిల శుభకరం | దురితహరం భవదూరం |
పరమమంగళం భావాతీతం | కరివరదం నిజకైంకర్యం ||
చ|| సులభం సుకరం శోకనాశనం | ఫలదం లలితం భవహరణం |
కలితం శ్రీవేంకటేశ శరణం | జలజోదర నిత్యస్తోత్రం ||
కలిగెనిదె నాకు కైవల్యము
తొలుతనెవ్వరికి దొరకనిది
జయపురుషోత్తమ జయ పీతాంబర
జయజయ కరుణాజలనిధి
దయ యెఱంగ నే ధర్మము నెఱగ నా
క్రియ యిది నీదివ్యకీర్తనమే
శరణము గోవింద శరణము కేశవ
శరణు శరణు శ్రీజనార్ధన
పరమ మెఱంగను భక్తి యెఱంగను
నిరతము నాగతి నీదాస్యమే
నమో నారాయణా నమో లక్ష్మీపతి
నమో పుండరీకనయనా
అమిత శ్రీవేంకటాధిప యిదె నా
క్రమమెల్లను నీకయింకర్యమే
ప|| కలియుగ మెటులైనా గలదుగా నీకరుణ | జలజాక్ష హరిహరి సర్వేశ్వరా ||
చ|| పాప మెంత గలిగిన బరిహరించేయందుకు | నాపాల గలదుగా నీనామము |
కోపమెంత గలిగిన కొచ్చి శాంతమిచ్చుటకు | చేపట్టి కలవుగా నాచిత్తములో నీవు ||
చ|| ధర నింద్రియా లెంత తరముకాడిన నన్ను | సరి గావగద్దుగా నీశరణాగతి |
గరిమ గర్మబంధాలు గట్టినతాళ్ళు వూడించ | నిరతి గలదుగా నీభక్తి నాకు ||
చ|| హితమైనయిహపరా లిష్టమైనవెల్లా నియ్య | సతమై కలదుగా నీసంకీర్తన- |
తతి శ్రీవేంకటేశ నాతపము ఫలియింపించ | గతి గలదుగా నీకమలాదేవి ||
కలియుగంబునకు గలదిదియే
వెలసిన పంచమ వేదమె కలిగె ||
పరమగు వేదము బహుళము చదివియు
హరి నెరిగిన వారరుదనుచు
తిరువాయిముడియై దివ్య మంత్రమై
వెలసిన పంచమ వేదమె కలిగె ||
బింకపు మనుజులు పెక్కులు చదివియు
సంకెదీర దెచ్హుట ననుచు
సంకీర్తనమే సకల లోకముల
వేంకటేశ్వరుని వేదమె కలిగె ||
ప|| కల్లగాదు నీవు మాకు గలిగితే జాలు | తొల్లిటి నీవు యింకా దోడుక వచ్చేను ||
చ|| తగిలి నీ వెదుటను తలవంచకుండగాను | నగితేను మొగమెత్తి నన్ను జూచేవు |
మగువ నెవ్వతె నీవు మనసున దలచేవో | బెగడ కానతీవయ్య పిలిచి తెచ్చేను ||
చ|| యెక్కడికో నీ విప్పుడెదురులు చూడగాను | మొక్కితే వేడుకొని నాచెక్కు నొక్కేవు |
అక్కడ నెవ్వతె మీది ఆస నీకు నున్నదో | తక్క కానతీవయ్య దండకు దెచ్చేను ||
చ|| యెందుకో నీపాయము మీదెత్తుకొని వుండగాను | అంది నిన్నుగూడితే నన్నాదరించేవు |
ముందు శ్రీ వేంకటేశ నీ మోహమెందు నుండునో | యిందే ఆనతీవయ్యా యింటికి దెచ్చేను ||
కల్లమాడ దొడ్డముద్ర కటకటా
చెల్లుబడికల్లలు చెప్పేరు లోకులు
యిప్పుడేలేబ్రహ్మదేవుడిట్టే వుండగ మీదటి
వొప్పగుబ్రహ్మపట్టము వొకరికి వెచ్చపెట్టి
అప్పటి మూడుమూర్తులయందులో నీతని సరి
చెప్పబొయ్యె రీమాట చెల్లునా లోకులకు
కైలాసము రుద్రుడుగల బ్రహ్మాండకోట్లు
పోలించి చిష్ణుడు కడుపున నించుకుండగాను
చాలి మూడుమూర్తులలో సరి యీతడంటాను
కూళలై యాడేరుగాక కూడునా లోకులకు
ఘనుడీతనిపాదము గడిగె బ్రహ్మదేవుడు
మునుముట్టి శిరసున మోచె శివుడు
వొనర మూడుమూర్తులం దొకడు శ్రీవేంకటేశు
డనుమాట యిది తగవవునా లోకులకు
కాంతల మానమనేటి కరవటాలకు దిగె
మంతనాన జీవుడనే మంచిమరకాడు ||
అరిది సంసారమనే యంబుధిలోన దిరిగి
వురుగతి దేహిపుటోడ మీద
సరి బాపుణ్యముల సరకులు నించుకొని
దరిచేరెజీవుడనే తల మరకాడు ||
కడలేని నిట్టూర్పు గాలి విసరగాను
జడియు గోరికలనె చాపలెత్తి
అడి బరవుగ మాయ అందునిండా నించుకొని
యెడ తాకె జీవుడనే యీమరకాడు ||
అలర శ్రీవేంకటేశుడనియేటి మాలిమి
నలుదిక్కులకు నోడ నడపగాను
ములిగె ధర్మార్ధకామ మోఖ్శ ధనము గదించి
పలుమాఋ జీవుడనే బలుమరకాడు ||
ప|| కాకమరి యింతేల కలుగు దమకేతమకు | చేకొన్న కోరికలు చేరునందాకా ||
చ|| దొరతనములన్నియును దొరసినందాక | నెరతనములన్నియును నెరపినందాకా |
గరిగరికలన్నియును కలసినందాకా | విరసంబులన్నియును విసుగునందాకా ||
చ|| యెడమాటలన్నియును యెనసినందాకా | అడియాసకోరికలు అదుకునందాకా |
జడిగొన్నగుక్కిళ్ళు చవిగొన్నయందాకా | వొడలోముటలు మోహముడుగు నందాకా
చ|| యీవెల్ల దమయాత్మ యిచ్చగించినదాక | శ్రీవేంకటేశుకృప చేరునందాక |
లోవెలతులన్నియును లోగొన్నయందాక | వేవేగ బంధములు వీడునందాకా ||
కాకుంటే యీశూన్యవాదకంఠినచిత్తులచేత
పైకొని వివేకులకు బ్రదుకగవచ్చునా.
అల్లనాడు నిరాకారమనెడిమాటలచేత
వెల్లిబోయ లోకములో విజ్ఞానమెల్లా
కల్లని మీత్రివిక్రమాకారము చూపి మీరు
చెల్లబెట్టితిరి వేదశిఖలందు మరియు.
ఆలకించి యహంబ్రహ్మనెడిబుద్దులచేత
గాలిబోయ భక్తి యల్లా కాలమందే
యేలి ప్రహ్లాదునికిగా హిరణ్యకశిపునొద్ద
యేలికబంటువరుస లిందె చూపితిరి
అంతా నొక్కటియనే అధర్మవిధులచేత
గుంతబడె బుణ్యమెల్లా గొల్లబోయి
ఇంతట శ్రీ వేంకటేశ యెక్కుడు నేనని కొండ
వింతగాగ లొడవెక్కి విఱ్రవీగితివి.
ప|| కాకున్న సంసారగతులేల | లోకకంటకములగు లోభములేల ||
చ|| వినికిగనవలసినను విష్ణుకీర్తన చెవికి | వినికిచేసిన నదియె వేదాంతబోధ ||
మనికిగనవలసినను మధువైరిపై భక్తి | వునికి ప్రాణులకు బ్రహ్మోపదేశంబు ||
చ|| చదువు గనవలసినను శౌరినామము దిరుగ | జదువుటే సకలశాస్త్రముల సమ్మతము |
నిదుర గనవలసినను నీరజాక్షునికి దన- | హృదయమర్పణ సేయుటిది యోగనిదుర ||
చ|| ఆస వలసిన వేంకటేశ్వరునికృపకు- | నాససేయుటే పరమానందసుఖము |
వాసి గనవలసినను వైష్ణవాగారంబు | వాసి సేయుట తనకు వైభవస్ఫురణ ||
ప|| కానరటె పెంచరటె కటకట బిడ్డలను | నేను మీవలెనే కంటి నెయ్యమైన బిడ్డని ||
చ|| బాయిట బారవేసిన పాలు వెన్నలును | చేయి వెట్టకుందురా చిన్నిబిడ్డలు |
మీయిండ్లు జతనాలు మీరుసేసికొనక | పాయక దూరేరేల ప్రతిలేని బిడ్డను ||
చ|| మూసిన కాగులనే యీముంగిట పెరుగులూ | ఆసపడకుందురా ఆబిడ్డలు |
వోసరించి మోసపోక వుండలేక మీరు | సేసేరింతేని దూరు చెప్పరాని బిడ్డని ||
చ|| చొక్కమైన కొప్పెరల జున్నులు జిన్నులును | చిక్కిన విడుతురా చిన్నిబిడ్డలు |
మిక్కిలి పూజలుసేసి మెచ్చ్చించదగదా | యెక్కువైన తిరువేంకటేశుడైన బిడ్డని ||
ప|| కానవచ్చె నిందులోన కారుణ్య నరసింహా | తానకమై నీకంటే దాస్యమే పో ఘనము ||
చ|| ఎనసి ప్రహ్లాదుడు ఎక్కడ చూపునోయని | ననిచి లోకమెల్ల నరసింహ గర్భములై |
పనిపూని వుంటివి అటు భక్త పరతంత్రుడవై |తనిసి నీ వధికమో దాసులే అధికమో ||
చ|| మక్కువ బ్రహ్మాదులు మానుపరాని కోపము | ఇక్కువై ప్రహ్లాదుడు ఎదుట నిలిచితేను |
తక్కక మానితి వట్టేదాసుని యాధీనమై | నిక్కి నీ కింకరుడే నీకంటే బలువుడు ||
చ|| అరసి కమ్మర ప్రహ్లాద వరదుడని | పేరువెట్టు కొంటి విట్టి బెరసి శ్రీవేంకటేశ |
సారె నీ శరణాగత జనుని కాధీనమైతి- | వీరీతి నీదాసునికే ఇదివో మొక్కేము ||
ప|| కామధేను విదే కల్పవృక్ష మిదే | ప్రామాణ్యముగలప్రపన్నులకు ||
చ|| హరినామజపమె ఆభరణంబులు | పరమాత్మునినుతి పరిమళము |
దరణిదరుపాదసేవే భోగము | పరమంబెరిగిన ప్రపన్నులకు ||
చ|| దేవునిధ్యానము దివ్యాన్నంబులు | శ్రీవిభుభక్తే జీవనము |
ఆవిష్ణుకైంకర్యమే సంసారము | పావనులగుయీప్రపన్నులకు ||
చ|| యేపున శ్రీవేంకటేశుడే సర్వము | దాపై యితనివందనమే విధి |
కాపుగ శరణాగతులే చుట్టాలు | పై పయి గెలిచినప్రపన్నులకు ||
ప|| కామధేనువై కలిగె నీధరణి | వాములు వలసినవారికి విధులు ||
చ|| అందరు జీవులే ఆయాకర్మము | బొంది బుద్ధు లెప్పుడు వేరు |
కొందరు స్వర్గము గోరి సుఖింతురు | కొందరు నరకాన గూలుదురు ||
చ|| దేవు డిందరికి దిక్కై యుండును | భావాభావమే బహువిధము |
దేవత లమృతాధీనమై మనిరి | తోవనె దనుజులు దురిత మందిరి ||
చ|| పుట్టుగందరికి పొంచి కలిగినదె | దట్టపుమనసులే తమకొలది |
యిట్టే శ్రీవేంక్టేశుడు సేసిన- | యట్టౌ నాతడు అదివో యెదుట ||
ప|| కామయాగము చేసెగలికి తన | ప్రేమమే దేవతా ప్రీతిగాను ||
చ|| పొలుపలర సురత తాంబూల రసపానంబు | నళినాక్షి సోమపానంబు గాను |
కలకలంబుల మంచి గళరవంబులమోత | తలకొన్న వేద మంత్రములుగాను ||
చ|| పడతి తనవిరహ తాపమున బుట్టినయగ్ని | అడరి దరికొన్న హోమాగ్నిగాను |
ఒడబడిక సమరతుల నుదయించిన చెమట | దడియుటే యవబృథంబుగాను ||
చ|| తనరగుచముల రుచులు దంతాక్షతక్రీడ | నునుపైన పశుబంధనంబుగాను |
యెనసి శ్రీవేంకటేశ్వరుని పొందు | ఘనమైన దివ్య భోగంబుగాను ||
ప|| కామించి నీవరుగగలయు నాయకుడ నే- | డేమి భాగ్యము సేసెనే తరుణి ||
చ|| కాగిన గుబ్బల మీద కమ్మజెమటలదొప్ప | దోగిన పయ్యెద కొంగు దూలగును |
వేగైన కొప్పున క్రొవ్విరులు దురిమి విర్ర- | వీగుచు నీవెటు వొయ్యేవే తరుణి ||
చ|| ఒప్పైన శిరసు మీదగుప్పరించిన జవ్వాది | చిప్పిలి చెక్కుల వెంటబొందగను |
అప్పళించిన కస్తూరిలప్పలు రాలగ నీ- | విప్పుడెక్కడికి నేగేవో తరుణి ||
చ|| వీడినది మొలనూలు విరుల చెదరె కొంత | వాడినది కెమ్మోని వన్నెలై |
ఈడులేని తిరువేంకటేశుడిదె నిన్ను గూడె | యీడ గొత్తలివి యేటివే వోతరుణి ||
కాయమనే వోరికి గంతలు తొమ్మిదియాయ
పాయక తిరిగాడేరు పాపపు తలారులు ||
కాముడనియెడిరాజు గద్దె మీద నుండగాను
దీముగోపపు ప్రధావి దిక్కులేలీని
కోమలపు జ్గ్యానమెల్లా గొల్ల బోయ నాడనాడ
గామిడులై రింద్రియపుగాపు లెల్లా నిదివో ||
చిత్తమనే దళవాయి చింతలనే పొఊజు వెట్టె
యిత్తల విషయములు యెన్నికిచ్చిరి
తుత్తుమురై కోరికెల దొండెము డేగగ జొచ్చె
జొత్తుల వెరగుపడి చూచి బుట్టుగులు ||
బలు సంసారమనేటి భండారము ఘనమాయ
కదీగ జవ్వనపు కైజీతము
యిలలో శ్రీవేంకటేశుడింతలో జీవుడనేటి
బలువుని రాజుజేసి పాలించె నన్నును ||
ప|| కాయము జీవుడుగలనాడే తెలియవలె | యీయత్నములు దనకెన్నడు ||
చ|| సతతము సంసారజడుడు దానట యాత్మ- | హితవు దెలుసుకాల మెన్నడు |
రతిరసముల వూరకే ప్రాయ మెడలంగ | యితరసుఖము దనకెన్నడు ||
చ|| యెడవక ద్రవ్యమోహితుడై తిరుగ దన- | యిడుమపాటు మాను టెన్నడు |
కడలేనిపొలయలుకలుచేత దనదేహ- | మిడియగ నిజసుఖ మెన్నడు ||
చ|| శ్రీవేంకటేశుని జేరి తక్కినసుఖ- | మేవగించుకాల మెన్నడు |
శ్రీవల్లభునికృప సిరిగా దలచి జీవు- | డీవైభవము గాంచు టెన్నడు ||
కాలమలారును గలిగెనీ కునిదె
బాలకి యందే పైపైనీకు ||
సతి కొప్పువిరులు జలజల రాలిన
లతల వసంతకాలము నీకు
కతగా దనమై కాకలు చూపిన
అతివేసవి కాలమప్పుడే నీకు ||
కాగిటి చెమటల కడునినుదడపిన
కాగల తొలకరి కాలమదీ
వీగని చూపుల వెన్నెల చల్లిన
రాగినమతికి శరత్కాలంబు ||
లంచపు బులకల లలననీ రతుల
కంచపు హేమంత కాలమది
యెంచగ శ్రీ వేంకటేశ వలపు సతి
వంచ శిశిరకాలవైభవ మాయ ||
ప|| కాలము కాలముగాను కపటాలే తఱచాయ | చాలునింక దీనితోడీజాలి మానరే ||
చ|| పిన్ననాటనుండి తనపెంచినయీదేహము | మున్నిటివలెగాదు ముదిసీని |
యెన్నికదినాలచేత నెప్పుడేడ బడునో | కన్నవారిచేతికి గక్కున నియ్యరే ||
చ|| తోలునెముకలచేత దొడ్డైనయాదేహము | గాలిచేత దాలిమీద గాగీని |
కీలుగీలు యెప్పుడేడ కింద వీడిపడునో | మేలుగీడు లేనిచొట మేటిజేసిపెట్టరే ||
చ|| కింకపుకినరుచేత కీడైనదేహము | వంకవంకతెరవుల వడిసీని |
యింక నీవిధిచేత నెప్పుడేడ బడునో | వేంకటేశు జేర బడవేయగదరే ||
ప|| కాలవిశేషమో లోకముగతియో సన్మార్గంబుల- | కీలు వదలె సౌజన్యము కిందయిపోయినది ||
చ|| ఇందెక్కడిసంసారం బేదెస జూచిన ధర్మము | కందయినది, విజ్ఞానము కడకు దొలంగినది, |
గొందులు దరిబడె, శాంతము కొంచెంబాయ, వివేకము | ముందుకు వెదకిన గానము మంచితనంపుబనులు ||
చ|| మరి యిక నేటివిచారము, మాలిన్యంబైపోయిన- | వెరుకలు, సంతోషమునకు నెడమే లేదాయ |
కొరమాలెను నిజమంతయు, కొండలకేగెను సత్యము | మరగైపోయను వినుకలు, మతిమాలెను తెలివి ||
చ|| తమకిక నెక్కడిబ్రదుకులు, తనబడె నాచారంబులు, | సమమైపోయిన వప్పుడె జాతివిడంబములు, |
తిమిరంబింతయు బాపగ దిరువేంకటగిరిలక్ష్మీ- | రమణుడు గతిదప్పను కలరచనేమియు లేదు ||
ప|| కాలాంతకుడను వేటకాడెప్పుడు దిరిగాడును | కాలంబనియెడి తీవ్రపుగాలివెర వెరిగి ||
చ|| పరమపదంబనుచేనికి పసిగొనురనమృగములకును | తరమిడి, సంసారపుటోదములనె యాగించి |
వురవడి జేసినకర్మపుటురులు దరిద్రంబనువల | వొరపుగ మాయనుపోగులు వొకవెరవున వేసీ ||
చ|| కదుముకవచ్చేటి బలురోగపుగుక్కల నుసికొలిపి, | వదలక ముదిసినముదిమే వాకట్టుగ గట్టి, |
పొదలుచు మృత్యువు పందివోటై నల్లెట నాడగ, | పదిలముగా గింకరులనుచొప్పరుల బరవిడిచీ ||
చ|| ఆవోదంబుల జిక్కక, ఆవురులను దెగనురికి, | ఆవేటకాండ్ల నదలించాచేనే చొచ్చి, |
పాపమతి బొరెవొడిచి పరమానందము బొందుచు | శ్రీవేంకటపతి మనమున జింతించీ నరమృగము ||
ప|| కిం కరిష్యామి కిం కరోమి బహుళ- | శంకాసమాధానజాడ్యం వహామి ||
చ|| నారాయాణం జగన్నాథం త్రిలోకైక- | పారాయణం భక్తపావనం |
దూరీకరోమ్యహం దురితదూరేణ సం- | సారసాగరమగ్నచంచలత్వేన ||
చ|| తిరువేంకటాచలాధీశ్వరం కరిరాజ- | వరదం శరణాగతవత్సలం |
పరమపురుషం కృపాభరణం న భజామి | మరణభవదేహాభిమానం వహామి||
ప|| కింకదీర ’నదైవం కేశవాత్పర’మని | ఉంకువైననాలో నీవుపమలివే ||
చ|| కంటి నీవొక్కడివే లోకములకు దైవమని | వొంటి మరి నిన్నుబోల నొకరిగాన |
వింటినీవే ఘనమని వేదాంతమందు నీ- | కంటె నితరము విన గరుణానిధీ ||
చ|| తోచె నాకు నీసేవే తుదిపదమని, మరి | తోచదీబుద్ధికి, సరితూగ దెందును |
పూచి నాగురుడు నిన్నే బోధించేగాని మరి | దాచడాయ నీమహిమ ధరణీధరా ||
చ|| సమ్మతించె నామతి జవియైనీకథలె | సమ్మతించ దెక్కడోరచ్చలసుద్దులు |
నమ్మిక శ్రీవేంకటేశ నంటున నీపాదాలే | నమ్మితి నేమియు నమ్మ నారాయణా ||
ప|| కిన్నజానేऽహం కేశవాత్పర మహో | సన్నుతాకర మమాచరణాయ తస్మై ||
చ|| వేదాంతవేద్యాయ విశ్వరూపాయ నమో | ఆదిమధ్యాంత రహితాధికాయ
భేదాయ పునరప్యభేదాయ నమో నమో | నాదప్రియాయ మమ నాథాయ తస్మై||
చ|| పరమపురుషాయ భవబంధహరణాయ నమో | నిరుపమానందాయ నిత్యాయ
దురితదూరాయ కలిదోషవిధ్వస్తాయ | హరియేऽచ్యుతాయ మమ ఆత్మాయ తస్మై ||
చ|| కాలాత్మకాయ నిజకరుణాకరాయ నమో | శ్రీలలామాకుచాశ్రితగుణాయ |
హేలాంక శ్రీవేంకటేశాయ నమో నమో | పాలితాఖిల మమాభరణాయ తస్మై ||
ప|| కుడుచుగాక తనకొలదిగాని మేలు | దడవీనా నోరు తగినయెంతయును ||
చ|| చంపవచ్చిన కర్మసంగ్రహంబగు బుద్ధి | గంప గమ్మక తన్ను గాచీనీ |
పంపుడు దయ్యమై బాధ బెట్టెడుయాస |కొంపలోన నుండ నీగోరీనా ||
చ|| శ్రీవేంకటగిరి శ్రీనాథుడిందరి | గావబ్రోవగ నున్నఘనుడు |
దేవోత్తముని నాత్మ దెలియ కితరములయిన | త్రోవ లెన్నిన మేలు దొరికీనా ||
కులుకక నడవరో కొమ్మలాలా (రాగం – దేసాళం)
కులుకక నడవరో కొమ్మలాలా
జలజల రాలీని జాజులు మాయమ్మకు
ఒయ్యనే మేను గదలీ నొప్పుగా నడవరో
గయ్యాళి శ్రీపాదతాకు కాంతులాలా
పయ్యెద చెఱగు జారీ భారపు గుబ్బల మిద
అయ్యో చెమరించె మా యమ్మకు నెన్నుదురు
చల్లెడి గందవొడియై జారీ నిలువరో
పల్లకి వట్టిన ముద్దు బణతులాల
మొల్లమైన కుందనపు ముత్యాల కుచ్చులదర
గల్లనుచు గంకణాలు గదలీమాయమ్మకు
జమళి ముత్యాల తోడి చమ్మాళిగ లిడరో
రమణికి మణుల నారతు లెత్తరో
అమరించి కౌగిట నలమేలు మంగనిదె
సమకూడె వేంకటేశ్వరుడు మా యమ్మకు
ప|| కూడు వండుట గంజికొరకా తనకు | వేడుకలు గల సుఖము వెదుకుటకు గాక ||
చ|| కుప్ప నురుచుట కసవుకొరకా తనువు | గొప్పయవుటిది మదము కొరక |
ఒప్పయిన వేడుకల నొరసి మనసు | నెప్పునకు రాదివియ నేరవలె గాక ||
చ|| కొలుచు దంచుట పొట్టకొరకా తా- | గులజుడై మూఢుండౌ కొరకా |
తలపోసి యిన్నిట దగిలి మీదు | తెలిసి సుఖదుఃఖముల దెలియవలెగాక ||
చ|| కొండ దవ్వుట యెలుకకొరకా తా- | గొండ యెక్కుట దిగుట కొరకా |
కొండల కోనేటిపతి గొలిచి తనకు | నిండి నాపదలెల్ల నీగవలె గాక ||
ప|| కూడులేక యాకటికి గూర దిన్నట్లు | ఆడనీడ మోవిచిగురాకు దినేరయ్య ||
చ|| దుండపుబగవాడు దోచగానే తమకాన | కొండలెక్కినట్లు సిగ్గు గొల్లబోగాను |
దుండువెళ్ళేమదనునిదాడికి సతులచన్ను- | గొండలెక్కి సారెసారె గోడనేరయ్య ||
చ|| పొదిగొన్నయలపుతో బొదలుతీగెలక్రింద | తుదలేనిభయముతో దూరినట్లు |
మృదువైనతరుణుల మెఱగుబాహులతల- | పొదలెల్ల దూరితూరి వుంగడయ్యేరయ్య ||
చ|| వలసగంపలమోపువలె లంపటము మోచి | తలకుచు బారలేక దాగినయట్లు |
యిల వేంకటేశ నిన్నెఱగ కింద్రియముల | తలవరులిండ్లనే దాగేరయ్య ||
ప|| కూరిమి గల్గితే జాలు కోపించినా మేలువో | అరయ నోరమణుడ అంతాను మేలువో ||
చ|| మనసున నీవు నన్ను మఱవకున్నా జాలు | యెనసి నీ వేడ నున్నా వియ్యకోలే పో |
ననువు వలపు నీవు నాపై జల్లితే జాలు | వెనక నీవేమన్నా వేడుకవే పో ||
చ|| పాయము నీమేని మీద పచ్చిగా నుండితే జాలు | రాయడి విరహమైన రాజ్యపదవి |
యే యెడ నీ రూపొక మాటిటు పై బారితే జాలు | నాయములు దప్పి నీవు నడచినా మేలువో ||
చ|| పానుపుపై కూడి నాకు పంతమిచ్చితే జాలు | కానని కన్నుల నీ బింకాలు మేలేపో |
ఆనిన శ్రీ వేంకటేశ అంతలో నన్నేలితివి | కోనల నీ కొనగోరి గుఱుతులు మేలువో ||
కేశవ దాసినైతి గెలిచితి నన్నిటాను
యీ శరీరపు నేరా లికనేల వెదక
నిచ్చలు కోరికలియ్యగ నీ నామమే చాలు
తెచ్చి పునీతునిజేయగ నీ తీర్థమే చాలు
పచ్చి పాపాలణచ నీ ప్రసాదమే చాలు
యెచ్చుకొందు వుపాయాలు ఇంకనేల వెదక
ఘనుని జేయగను నీ కైంకర్యమే చాలు
మొనసి రక్షించను నీ ముద్రలే చాలు
మనిపి కావగా తిరుమణి లాంఛనమే చాలు
యెనసెను దిక్కుదెస ఇంకనేల వెదక
నెలవైన సుఖమియ్య నీ ధ్యానమే చాలు
అలదాపు దండకు నీ యర్చనే చాలు
యిలపై శ్రీవేంకటేశ యిన్నిటా మాకు గలవు
యెలమి నితరములు యింకనేల వెదక
ప|| కొంచెమును ఘనము గనుగొననేల హరిదలచు- | పంచమహాపాతకుడే బ్రాహ్మణోత్తముడు ||
చ|| వేదములు చదివియును విముఖుడై హరికథల- | నాదరించని సోమయాజికంటె |
యేదియునులెని కులహీనుడైనను విష్ణు- | పాదసేవకుడువో బ్రాహ్మణోత్తముడు ||
చ|| పరమమగు వేదాంతపఠన దొరకియు సదా | హరిదలచలేని సన్న్యాసికంటె |
మరిగి పసురముదినెడిమాలయైనను వాడె | పరమాత్ము గొలిచినను బ్రాహ్మణోత్తముడు ||
చ|| వినియు జదివియు రమావిభుని దలపక వృథా | తనువు వేపుచు దిరుగుతపసికంటె |
చనువుగల వేంకటెశ్వరుదాసులకు వెంట | బనిదిరుగునధముడే బ్రాహ్మణోత్తముడు ||
ప|| కొండ దవ్వుట యెలుక గోరిపట్టుట దీన | బండాయ సంసారబంధము ||
చ|| వెలయ జిత్తంబునకు వేరుపురువై బుద్ధి | గలగించె మోహవికారము |
కలకాలమునకు లింగముమీదియెలుకయై | తలకొనియె నాత్మపరితాపము ||
చ|| అరయ జంచలముచే నాలజాలంబువలె | దిరుగదొరకొనియె దనదేహము |
తిరువేంకటాచలాధిపుని మన్ననగాని | పరిపాటి బడదు తనభావము ||
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కుమ్మర దాసుడైన కురువరతినంబి
యిమ్మన్న వరములెల్ల నిచ్చినవాడు
దొమ్ములు సేసినయట్టి తొండమాం చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు
అచ్చపు వేడుకతోడ ననంతాళువారికి
ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు
మచ్చిక దొలక దిరుమలనంబి తోడుత
నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చినవాడు
కంచిలోన నుండ దిరుకచ్చినంబి మీద
కరుణించి తనయెడకు రప్పించిన వాడు
ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు
మంచివాడై కరుణ బాలించినవాడు
కొండలో గోవిల గుయ్యగుండె వగిలె నీ
యండకురాగా బ్రాణమంతలో బ్రదికెరా ||
వలచి నిన్ను వెదకి వడి నేరాగాను
పులివలె మగడుండె బోనియ్యక
తలచి నాకంతలోనే తల నొవ్వగాను
చిలుకుబులక లెత్తి సిగ్గుమాలె వలపు ||
ఏమరించి ఇంటివారి నెడసి నే రాగాను
గామైన బిడ్డ యేద్చెగదలనీక
తామసించి యుండలేక తల్లడించగాను
చీమలు మైవాకినట్టు చిమ్మిరేగె వలపు ||
వుండలేక ఇప్పుడు నీ వొద్దికి నే రాగాను
కొండవలె మరదుండె గోపగించుక
బొండుమలె పరపుపై బొరలేటి ఇట్టినన్ను
కొండలరాయడ నిన్ను గూడించె నా వలపు ||
కొండవంటి దొరవు నీ గుణమేల విడిచేవు
వుండరాదా నీవుండే వొడికానను
కడుతగవు చెప్పేవు కట్టకానికలు వెట్టి
అడిగితిమా నిన్ను నయ్యోనేడు
బడిబడినీవు చెప్పే పండితనాయానకు
తొడిబడనెవ్వతైనా తుచ్చమాడకుండునా
వెట్టిసాకిరి చెప్పేవు విత్తూదిమ్మిరివేసి
నెట్టన గరి గోరేమా నేడు నిన్నును
బెట్టిమాటలాడి నీవు పిరిదూరి రాగాను
గుట్టుచెడ నెవ్వతైనా కోపగించకుండునా
నీతులు చెప్పవచ్చేవు నిను పెద్దతనమిచ్చి
ఆతలనడిగితిమా అప్పటినిన్ను
కాతరాన నన్ను శ్రీవేంకటనాథ కూడితివి
ఘాత రతి లోపల నా కాలు దాకకుండునా
కొండవేలనెత్తినట్టి గోవిందా గోవిందా
నిన్ను గొండించేరు యశోదకు గోవిందా
గొల్లెతలు మొక్కేరు గోవిందా నీ-
కొల్లల చీరలిమ్మని గోవిందా
గొల్లు వెన్న దొంగిలగ గోవిందా నిన్ను
కొల్లున నవ్వేరు వీరె గోవిందా
గోవుల గాచేవేళ గోవిందా పిల్ల(-
గోవిని వలచిరి గోవిందా
గోవాళులై యమునలో గోవిందా నీకు
కోవరమున్నారురా గోవిందా
కొట్టేటి వుట్లకింద గోవిందా నీతో-
గొట్టెవాటై పెనగేరు గోవిందా
గుట్టుతో శ్రీవేంకటాద్రిగోవిందా కూడి
గొట్టాన( బెట్టేరు బత్తి గోవిందా
ప|| కొండో నుయ్యో కుమతులాల | తండుముండు తట్టుముట్టు తాకైన గనుడీ ||
చ|| కాకివోటు జముచేత కందుకుందు మరుచేత | మా కాపని గాదు మనుజులాల |
పోకుమని యాపరాదు పొమ్మని చెప్పగరాదు | మీకుమీకే చూచుకొండు మీరే కనుడు ||
చ|| గాములిల్లు పుట్టమీదికప్పు తోలు పైకప్పు | నేమా యెరుగము నిపుణులాల |
పామునోరికడి మీప్రాణపుటూరుపుగాలి | జాము జాము మేలుగీడు చక్కజేయ గనుడు ||
చ|| రచ్చమానిచింతకిందు రాపులకూటమిపొందు | ముచ్చో చిచ్చో మూఢులాల |
యెచ్చరికతోడ వేంకటేశుదాసుల గూడి | పచ్చిగచ్చుమేనితోడ భయమెల్ల బాయడు ||
ప|| కొందరి కివి సమ్మతియైతే కొందరి కవి గావు | యిందరిలోపల నీవెడమాయలు యేగతి దెలిసే నేనయ్యా ||
చ|| దూరము కర్మమునకు జ్ఞానము: తోడునే వొండొకటికిని | దూరము: పరమునకు బ్రపంచము తొలుత విరుద్ధంబు: |
దూరము విరతికి సంసారము: తుదమొదలే లేదు : | యీరీతుల నీ వెడమాయలు యేగతి దెలిసెద నేనయ్యా ||
చ|| కూడదు దేహమునకు నాత్మకు గోత్రవిరోధం: బెన్నడును | కూడదు కోపమునకు శాంతము గుణావగుణములను: |
కూడదు బంధమునకు మోక్షము కోరికలే కట్లుగాన: | యేడ గొలదిగా శ్రీహరిమాయలు యేగతి దెలిసెద నేనయ్యా ||
చ|| శ్రీవేంకటపతి నన్నీగతి జిక్కించితి నీజగమునను: | భావింపగాను నీమహిమ బహుముఖములయర్థముగాన: |
యేవిధమును నేటికి నాకిక యెందెందని తగిలెద నేను | దైవికమగు నీదాసానుదాస్యము దక్కినదే నాకు ||
ప|| కొనరో కొనరో మీరు కూరిమి మందు | వునికి మనికి కెల్ల నొక్కటే మందు ||
చ|| ధృవుడు గొనినమందు తొల్లియు బ్రహ్లాదుడు | చవిగా గొనినమందు చల్లని మందు |
భవరోగములు వీడి పారగ బెద్దలు మున్ను | జవకట్టికొనిన నిచ్చలమైన మందు ||
చ|| నిలిచి నారదుండు గొనినమందు జనకుండు | గెలుపుతో గొని బ్రదికిన యామందు |
మొలచి నాలుగుయుగముల రాజులు ఘనులు | కలకాలము గొని కడగన్నమందు ||
చ|| అజునకు బరమాయువై యొసగినమందు | నిజమై లోకములెల్ల నిండినమందు |
త్రిజగములు నెరుగ తిరువేంకటాద్రిపై | ధ్వజ మెత్తె గోనేటిదరి నున్నమందు ||
ప|| కొనుట వెగ్గళము దాదినుట యల్పము మీదు- | గనుట వినుట లేక దా కడచన్న భవము ||
చ|| ఆపద వడ్డికినిచ్చి అనుభవింపబోయిన | యేపున నెవ్వరికి నిందేమిగలదు |
పాపపుపైరువిత్తిన పండినపంటలలోన | రూపింపగ నిందు రుచి యేమిగలదూ ||
చ|| ఘనుడైన తిరువేంకట నాథుడిన్నిటికి- | యును భోక్తయు గర్మియును నైనవాడు |
పనిలేదు నిష్ఠూరపరుడు దానై వుండు | తనకుదానె కర్తతనమౌట గాన ||
కొమ్మ తన ముత్యాల కొంగు జారగ బగటు
కుమ్మరింపుచు దెచ్చు కొన్నదీ వలపు
ఒయ్యారమున విభుని వొరపు గనుగొని రెప్ప
మయ్యు నేరక మహా మురిపెమునను
కయ్యంపు గూటమికి గాలు దువ్వుచు నెంతె
కొయ్యతనమున దెచ్చు కొన్నదీ వలపు
పైపైనె ఆరగింపకుము పన్నీరు గడు
తాపమవునని చెలులు దలకగానే
తోపు సేయుచు గెంపు దొలకు గన్నుల కొనల
కోపగింపుచు దెచ్చు కొన్న దీవలపు
ఎప్పుడును బతితోడ నింతేసి మేలములు
ఒప్పదని చెలిగోర నొత్తగానే
యెప్పుడో తిరువేంకటేశు కౌగిట గూడి
కొప్పుగులుకుచు దెచ్చు కొన్నదీవలపు
ప|| కొమ్మ దన ముత్యాలకొంగు జారగ బగటు | కుమ్మరింపుచుం దెచ్చుకొన్నది వలపు ||
చ|| ఒయ్యారమున విభుని వోరపు గనుంగొని రెప్ప | ముయ్యనేరక మహామురిపెమునను |
కయ్యపుం గూటమికి కాలుద్రువ్వుచు నెంత | కొయ్యతనమునం దెచ్చుకొన్నది వలపు ||
చ|| పైపైనె ఆరగింపకుము పన్నీరు గడు | తాపమవునని చెలులు దలంక గానె |
తొప్పలియుచుం గెంపు తొలంకు గన్నులకొనల | కోపగింపుచుం దెచ్చుకొన్నది వలపు ||
చ|| ఎప్పుడునుం బతితోడ నింతేసి మేలములు | వొప్పరని చెలిగోర నొత్తంగానె |
యెప్పుడో తిరువేంకటేశు కౌగిటం గూడి | వొకొప్పు గులుకుచుం దెచ్చుకొన్నది వలపు ||
కొమ్మలాలా ఎంతవాడె గోవింద రాజు
కుమ్మరించీ రాజసమే గోవింద రాజు
ఉలిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పవళించి
కొలువు సేయించుకొనీ గోవింద రాజు
జలజాక్షు లిద్దరును సరి పాదాలొత్తగాను
కొలది మీర మెచ్చేనీ గోవింద రాజు
అదె నాభికమలాన అజుని పుట్టించి తాను
కొద లేక ఉన్న వాడు గోవింద రాజు
చెదరక తన వద్ద సేవ సేసే సతులకు
గుదిగుచ్చీ వలపులు గోవింద రాజు
ఒప్పుగా వామకరము ఒగిచాచి వలకేల
కొప్పు కడునెత్తినాడు గోవింద రాజు
ఇప్పుడు శ్రీ వేంకటాద్రి నిరవై శంఖుచక్రాలు
కుప్పె కటారము(లు) పట్టె గోవింద రాజు
ప|| కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు | కుల స్వామికిని గొబ్బిళ్ళో ||
చ|| కొండ గొడుగుగా గోవుల గాచిన | కొండొక శిశువునకు గొబ్బిళ్ళో |
దండగంపు దైత్యుల కెల్లను తల | గుండు గండనికి గొబ్బిళ్ళో ||
చ|| పాప విధుల శిశుపాలుని తిట్టుల | కోపగానికిని గొబ్బిళ్ళో |
యేపున కంసుని యిడుమల బెట్టిన | గోప బాలునికి గొబ్బిళ్ళో ||
చ|| దండివైరులను తరిమిన దనుజుల | గుండె దిగులునకు గొబ్బిళ్ళో |
వెండిపైడి యగు వేంకట గిరిపై | కొండలయ్యకును గొబ్బిళ్ళో ||
కొలనిలోనమునుగోపికలు
మొలకనవ్వులతో మ్రొక్కిరి నీకు
పిరుదులు దాటిన పింఛపు టలకల
తురుములు వీడగ తొయ్యెలులు
అరిది నితంబులందునెదాచుక
మురిపెపు కరముల మ్రొక్కిరినీకు
నిద్దపు మానము నెలతలు లోగుచు
గద్దరి తొడలనె గట్టుచును
ముద్దుటుంగరంబుల కరములతో
ముద్దులు గునియుచు మ్రొక్కిరి నీకు
పాలిండ్ల పెనుభారంబుల
మూలపు మెరుగులు ముంచగను
వేలపు ప్రియముల వేంకటేశనిను
మూలకుపిలుచుచు మ్రొక్కిరి నీకు
కొలిచి బిందెల దోసుకొనుగాక యీ
మలయు గోరికనెడి మాడలే పండె ||
పొలతి సిగ్గులపోడు వొదిచి చిత్తపుటడవి
తొలుచూపు బదనుననె దున్నగాను
తలపోత విత్తగా తను చెమటవానలనె
బలువైన తమకమను బంగారువండె ||
ఇచ్చకపు జిరునగవు లింటిలోపలి తోట
మచ్చు జీకట్లె పలుమరు దవ్వగా
ఎచ్చుకుందుల సొలపు లేతపుజలము వారి
నచ్చుగాకల పైడినక్కులే పండె ||
తగిలి వేంకట విభుని తనివోని కొఊగిటను
జగడంపు గూర్మి సరసము చల్లగా
నిగనిగని పలుకుదేనియలు వేమఋబారి
నిగుడు విరహాగ్ని మాణికములే పండె ||
ప|| కొలిచిన వారల కొంగుపైడితడు | బలిమి తారక బ్రహ్మమీతడు ||
చ|| ఇనవంశాంబుధి నెగసిన తేజము | ఘనయజ్ఞంబుల గల ఫలము |
మనుజరూపమున మనియెడి బ్రహ్మము | నినువుల రఘుకుల నిధానమీతడు ||
చ|| పరమాన్నములోపలి సారపుజవి | పరగినదివిజుల భయహరము |
మరిగినసీతా మంగళసూత్రము | ధరలో రామావతారంబితడు ||
చ|| చకితదానవుల సంహారచక్రము | సకల వనచరుల జయకరము |
వికసితమగు శ్రీవేంకట నిలయము | ప్రకటిత దశరథ భాగ్యంబితడు ||
ప|| కొలువరో మొక్కరో కోరిన వరము లిచ్చీ | సులభు డిన్నిటాను వీడె సుగ్రీవ నరహరి ||
చ|| కంబములోన పుట్టి కనకదైత్యుని కొట్టి | అంబరపు దేవతలకు అభయమిచ్చి |
పంబి సిరిదన తొడపై బెట్టుక మాటలాడి | అంబుజాక్షుడైనట్టి ఆదిమ నరహరి ||
చ|| నానా భూషణములు ఉన్నతి తోడ నిడుకొని | పూనికతో ప్రహ్లాదుని బుజ్జగించి |
మానవులకెల్లను మన్నన చాలా నొసగి | ఆనందముతో నున్నాడు అదిగో నరహరి ||
చ|| మిక్కిలి ప్రతాపముతో మించిన కాంతులతోడ | అక్కజపు మహిమల నలరుచును |
తక్కక శ్రీవేంకటాద్రి తావుకొని వరాలిచ్చీ | చక్కదనములకెల్లా చక్కని నరహరి ||
ప|| కొలువుడీ భక్తి కొండలకోనేటి- | నిలయుని శ్రీనిధి యైనవాని ||
చ|| ఆదిదేవుని నభవుని సామ- | వేదనాద వినోదుని నెర- |
వాది జితప్రియు నిర్మలతత్త్వ- | వాదులజీవనమైన వాని ||
చ|| దేవదేవుడైన దివ్యుని సర్వ- | భావాతీత స్వభావుని |
శ్రీవేంకటగిరి దేవుడైన పర- | దేవుని భూదేవతత్పరుని ||
కొలువై ఉన్నాడు వీడె గోవింద రాజు
కొల కొల నేగి వచ్చే గొవింద రాజు
గొడుగుల నీడల గొవింద రాజు
గుడికొన్నా పడెగల ఫోవింద రాజు
కుడి యెడమ కాంతల గోవింద రాజు
కొడిసాగె పవుజుల గోవింద రాజు
గొప్ప గొప్ప పూదండల గోవింద రాజు
గుప్పేటి వింజామరల గోవింద రాజు
కొప్పు పై చుంగుల తోడి గోవింద రాజు
కుప్పి కటారము తోడి గోవింద రాజు
గొరబు సింగారాల గోవింద రాజు
కురులు దువ్వించు కొని గోవింద రాజు
తిరుపతిలొనను తిరమై శ్రీ వేంకటాద్రి
కురిసీ వరములెల్ల గోవింద రాజు
కొసరనేల నా గుణములివి
రసికత నీ విన్నిటా రక్శించుకొనుమా ||
నేరమి నాది నేరుపునీచే
దూరు నాది బంధుడవు నీవు
కోరుదు నేను కొమ్మని యిత్తువు
కారుణ్యాత్మక గతి నీవు సుమా ||
నేను యాచకుడ నీవే దాతవు
దీనుడ నే బరదేవుడవు
జ్గ్యానరహితుడను సర్వజ్గ్యనిధివి
శ్రీనిధి యిక ననుకేరి కావుమా ||
అరయ నే జీవుడ నంత్ర్యామివి
యిరవుగ దాసుడ నేలికవు
చిరజీవిని నే శ్రీ వేంకటపతివి
వరదుడ నను జేవదలకుమా ||
ప|| కోటి మన్మథాకార గోవింద కృష్ణ | పాటించి నీమహిమలే పరబ్రహ్మము ||
చ|| ఆకాశమువంటిమేన నమరేమూర్తివిగాన | ఆకాశనదియే నీకు నభిషేకము |
మేకొని నీవే నిండుమేఘవర్ణుడవుగాన | నీకు మేఘపు పుష్పాలే పన్నీరుకాపు ||
చ|| చంద్రుడు నీమనసులో జనించె నటుగాన | చంద్రికలు కప్రకాపై సరి నిండెను |
ఇంద్రనీలపుగనుల యిలధరుడవుగాన | తంద్రలేని యీపెచూపే తట్టుపునుగాయను ||
చ|| లక్ష్మీపతిగాన లాగుల నీవురముపై | లక్ష్మి యలమేలుమంగే లలి నీతాళి |
సూక్ష్మమై శ్రీవేంకటేశ చుక్కలపొడవు గాగ | పక్ష్మనక్షత్రములే యాభరణహారములు ||
కోడెకాడె వీడె వీడె గోవిందుడు
కూడె ఇద్దరు సతుల గోవిందుడు
గొల్లెతల వలపించె గోవిందుడు
కొల్లలాడె వెన్నలు గోవిందుడు
గుల్ల సంకుఁజక్రముల గోవిందుడు
గొల్లవారింట పెరిగె గోవిందుడు
కోలచే పసులగాచె గోవిందుడు
కూలగుమ్మె కంసుని గోవిందుడు
గోలయై వేల కొండెత్తె గోవిందుడు
గూళెపుసతులఁ దెచ్చె గోవిందుడు
కుందనపు చేలతోడి గోవిందుడు
గొందులు సందులు దూరె గోవిందుడు
కుందని శ్రీవేంకటాద్రి గోవిందుడు
గొందిఁ దోసె నసురల గోవిందుడు
కోరికలు కొనసాగె గోవిందరాజు
మేరమీర ఇట్లానే మెరసితివా ||
బాలుడవై రేపల్లెలో బాలుదాగేవేళ
యీలీలనే పవళించి యిరవైతివా
గోలవై తొట్టెలలోన గొల్లత లూచిపాడగా
ఆలకించి విని పాట లవధరించితివా ||
కొంచక మధురలోన గుబ్జయింట నీలాగుల
మంచాలపై బవళించి మరిగితివా
చంచుల ద్వారకలోన సత్యభామ తొడమీద
ముంచి యీరీతి నొరగి ముచ్చటలాడితివా ||
పదియారువేలింతుల పాలిండ్లు తలగడలై
పొదల నిటువలెనే భోగించితివా
యెదుట శ్రీ వేంకటేశ ఇట్టె తిరుపతిలోన
నిదిరించక శ్రీభూమి నీళల్ గూడితివా ||
ప|| కోరికె దీరుట యెన్నడు గుణమును నవగుణమును జెడి | వూరక యీమది నీపైనుండుట యెన్నడొకో ||
చ|| చిత్తం బాకలి దీరదు, చింత దలంపున బాయదు | యెత్తినపరితాపమునకు నేదీ మితిమేర |
హత్తినపుణ్యము బాపము నప్పటిసుఖములకొరకే | వత్తికి నూనెకు గొలదై వడి జనె దివసములు ||
చ|| జీవుడె పరతంత్రుడుగన చింతింపడు నిన్నెప్పుడు | చావును బుట్టుగు సహజము శరీరధారులకు |
శ్రీవనితాహృదయేశ్వర శ్రీవేంకటగిరివల్లభ | పావనమతిమై ప్రాణులు బ్రదుకుట యెన్నడొకో ||
ప|| కోరు వంచరో కొటారు | అరసి మనసా అంతరాత్మకు ||
చ|| కొండలపొడవులు కోరికకుప్పలు | పండినపంటలు భవములివి |
నిండినరాసులు నిజకర్మంబులు | అండనె యివె మాయారంభములు ||
చ|| వెలిధాన్యంబులు విషయపు రాసులు | పొలివారేటి వూరుపుగములు |
కలుషపుమదమున కావుగప్పినవి | అలవిమీర మాయారంభములు ||
చ|| బడి నింద్రియములబంతులు నురిపి | కడురతుల దండగట్టలతో |
యెడనెడ శ్రీవేంకటేశు మహిమలవే | అడియాలపు మాయారంభములు ||
ప|| కోరుదు నామది ననిశము గుణధరు నిర్గుణు కృష్ణుని | నారాయణు విశ్వంభరు నవనీతాహారుని ||
చ|| కుండలి మణిమయ భూషణు కువలదళ వర్ణాంగుని | అణ్డజపతి వాహనుని అగణిత భవహరుని |
మణ్డన చోదకదమనుని మాలాలంకృత వక్షుని | నిండు కృపాంబుధి చంద్రుని నిత్యానందుని ||
చ|| ఆగమపుంజ పదార్థుని ఆపత్సఖ సంభూతుని | నాగేంద్రాయుత తల్పుని నానా కల్పుని |
చాగుబ్రహ్మ మయాఖ్యుని సంతతగాన విలోలుని | వాగీశ సంస్తోత్రుని వైకుంఠోత్తముని ||
చ|| కుంకుమ వసంతకాముని గోపాంగన కుచలిప్తుని | శంకర సతీమణి నుతుని సర్వాత్ముని సముని |
శంఖ నినాద మృదంగుని చక్రాయుధ విదీప్తుని | వేంకటగిరి నిజవాసుని విభవ విధాయకుని ||
కౌసల్యానందన రామకమలాప్తకుల రామ
భాసురవరద జయ పూర్ణ రామ
మునుప దశరధరాముడవై తమ్ములు నీవు
జనించి తాటక జంపి జన్నము గాచి
వెనుకొని హరువిల్లు విరిచి సీత బెండ్లాడి
అనుమతి పరశురామునిచే గైకొంటివి ||
సుప్పనాతి శిక్శించి సొరిది రుశుల గాచి
అప్పుడే ఖరదూశణాదుల గొట్టి
చొప్పుతో మాయామ్రుగము సోదించి హరియించి
కప్పిహనుమంతు బంటుగానేలుకొంటివి ||
సొలసి వాలినడచి సుగ్రీవు గూడుక
జలధి బంధించి లంకసాధించి
వెలయ రావణుగెల్చి విభీశణుని మన్నించి
చెలగితివయోధ్యలో శ్రీవేంకటేశుడా ||
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం
జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం
చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం
పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం
గ
ప|| గంధము పూసేవేలే కమ్మని మేనయీ | గందము నీ మేనితావి కంటి నెక్కుడా ||
చ|| అద్దము చూచే వేలే అప్పటికిని | అద్దము నీ మోముకంటె నపురూపమా |
ఒద్దిక తామర విరి నొత్తేవు కన్నులు నీ | గద్దరి కన్నుల కంటె కమలము ఘనమా ||
చ|| బంగారు పెట్టేవేలే పడతి నీమెయినిండా | బంగారు నీతనుకాంతి ప్రతివచ్చీనా ||
ఉంగరాలేటికి నే వొడికపు వేళ్ళ | వెంగలి మణుల నీ వేలిగోరబోలునా ||
చ|| సవర మేటికినే జడియు నీనెరులకు | సవరము నీకొప్పుసరి వచ్చీనా |
యివలజవులు నీకు నేలే వేంకటపతి | సవరని కెమ్మోవి చవికెంటేనా ||
ప|| గడ్డపార మింగితే నాకలి దీరీనా యీ- | వొడ్డినభవము దన్నువొడ కమ్ముగాక ||
చ|| చించుక మిన్నులబారే చింకలను బండిగట్టి | వంచుకొనేమన్న నవి వశమయ్యేనా |
యెంచరాని యింద్రియము లెవ్వరికి నేల చిక్కు | పొంచి పొంచి వలపుల బొండబెట్టుగాక ||
చ|| మంటమండేయగ్గి దెచ్చి మసిపాత మూటగట్టి | యింటిలోపల దాచుకొన్న నితవయ్యీనా ||
దంటమమకార మిట్టే తన్నునేల సాగనిచ్చు | బంటుజేసి ఆసలనే పారదోసుగాక ||
చ|| పట్టరాని విషములపాము దెచ్చి తలకింద | బెట్టుకొన్నా నది మందపిలి వుండీనా |
వెట్టసంసారమిది వేంకటేశు గొలువని- | వట్టిమనుజుల పెడవాడ బెట్టుగాక ||
పల్లవి: గతులన్ని ఖిలమైన కలియుగమందును |
గతి ఈతడే చూపె ఘన గురుదైవము ||
చ1: ఈతని కరుణనేకా ఇల వైష్ణవులమైతి |
మీతని వల్లనే కంటిమీ తిరుమణి |
ఈతడే ఉపదేశమిచ్చెను అష్టాక్షరి మంత్రము |
ఈతడే రామానుజులు ఇహపర దైవము ||
చ2: వెలయించె నీతడేకా వేదపు రహస్యములు |
చలమి నీతడే చూపె శరణాగతి |
నిలిపినాడీతడేకా నిజముద్రా ధారణము |
మలసి రామానుజులు మాటలాడే దైవము ||
చ3: నియమములు ఈతడేకా నిలిపె ప్రపన్నులకు |
దయతో మోక్షము చూపె తగనీతడు |
నయమై శ్రీవేంకటేశు నగమెక్కె వాకిటను |
దయచూచి మమ్మునిట్టే తల్లిదండ్రి దైవము ||
ప|| గద్దరి జీవుడు కామధేనువు మాని | యెద్దు బిదుక జొచ్చె నేది దెరగు ||
చ|| మట మాయముల దనమనసె చంచలమంది | ఇటినటు దిరిగిన నేది దెరగు |
కట కట వూరేలు కర్తే దొంగలగూడి | యెటువలె జేసిన నేది దెరగు ||
చ|| కల్లలాడగ జొచ్చె గలుషపు మతి సత్య | మిల్లు వెడలగొట్టె నేది దెరగు |
చెల్లబో నోరే చేదు మేయగ జొచ్చె | నెల్లవారికి నింకనేది దెరగు ||
చ|| తియ్యని వేంకటాధిపు బాసి పరసేవ | కియ్య కొనెడి జిత్తమేది దెరగు |
అయ్యొ చక్కని బతినాలు విడిచిపోయి | యెయ్యెడ దిరిగిన నేది దెరగు ||
ప|| గరుడ గమన గరుడధ్వజ |
నరహరి నమోనమో నమో ||
చ|| కమలాపతి కమలనాభా |
కమలజ జన్మకారణిక |
కమలనయన కమలాప్తకుల |
నమోనమో హరి నమో నమో ||
చ|| జలధి బంధన జలధిశయన |
జలనిధి మధ్య జంతుకల |
జలధిజామాత జలధిగంభీర |
హలధర నమో హరి నమో ||
చ|| ఘనదివ్యరూప ఘనమహిమాంక |
ఘనఘనా ఘనకాయ వర్ణ |
అనఘ శ్రీవేంకటాధిపతేహం |
నమో నమోహరి నమో నమో ||
గరుడధ్వజం బెక్కె కమలాక్షు పెండ్లికి
పరుష లదివో వచ్చె బైపై సేవించను
పాడిరి సోబాన నదే భారతియు గిరిజయు
ఆడిరి రంబాదులైనఅచ్చరలెల్ల
కూడిరి దేవతలెల్ల గుంపులై శ్రీవేంకటాద్రి
వేడుకలు మీరగ శ్రీవిభునిపెండ్లికిని
కురిసె బువ్వులవాన కుప్పలై యెందు చూచిన
మొరసె దేవదుందుభిమోతలెల్లను
బెరసె సంపదలెల్ల పెంటలై శ్రీవేంకటాద్రి
తిరమైమించిన దేవదేవుని పెండ్లికిని
వేసిరి కానుకలెల్ల వేవేలు కొప్పెరలు
పోసి రదే తలబాలు పుణ్యసతులు
ఆసల శ్రీవేంకటేశుడలమేలుమంగదాను
సేసలు వెట్టినయట్టిసింగారపు పెండ్లికి
ప|| గరుడాద్రి వేదాద్రి కలిమి ఈపె | సిరులొసగీ చూడరో చింతామణి ఈపె ||
చ|| పాలజలధిపుట్టిన పద్మాలయ ఈపె | లాలిత శ్రీనారసింహ లక్ష్మి ఈపె |
మేలిమి లోకమాతయై మించిన మగువ ఈపె | ఈలీలా లోకములేలే ఇందిర ఈపె ||
చ|| ఘనసంపదలొసగు కమలాకాంత ఈపె | మనసిజుగనిన రమాపతి ఈపె |
అనిశము పాయని మహాహరిప్రియ ఈపె | ధనధాన్యరూపపు శ్రీతరుణి ఈపె ||
చ|| రచ్చల వెలసినట్టి రమావనిత ఈపె | మచ్చికగల అలమేల్మంగ ఈపె |
ఇచ్చట వేంకటాద్రి నీ అహోబలమునందు | నిచ్చలూ తావుకొనిన నిధానము ఈపె ||
ప|| గాలినే పోయ గలకాలము | తాలిమికి గొంతయు బొద్దులేదు ||
చ|| అడుసు చొరనే పట్టె నటునిటు గాళ్ళు | గుడుగుకొననే పట్టె గలకాలము |
ఒడలికి జీవుని కొడయడైనహరి | దడవగా గొంతయు బొద్దులేదు ||
చ|| కలచి చిందనే పట్టె గడవగ నించగ బట్టె | కలుషదేహపుబాధ గలకాలము |
తలపోసి తనపాలి దైవమైన హరి | దలచగా గొంతయు బొద్దులేదు |
చ|| శిరము ముడువబట్టె చిక్కుదియ్యగ బట్టె | గరిమల గపటాల గలకాలము |
తిరువేంకటగిరి దేవుడైనహరి | దరిచేరా గొంతయు బొద్దులేదు ||
ప|| గుఱ్ఱాల గట్టనితేరు కొంక కెందైనా బారీ | విఱ్ఱవీగుచు దీసీని వేడుకతో జీవుడు ||
చ|| సరి పిఱుదే రెండు జంటబండికండ్లు | సరవితో బాదాలు చాపునొగలు |
గరిమ జూపులు రెండు గట్టిన పగ్గములు | దొరయై దేహరథము దోలీబో జీవుడు ||
చ|| పంచభూతములు పంచవన్నెకోకలు | పంచల చేతులు రెండు బలుటెక్కేలు |
మించైన శిరసే మీదనున్న శిఖరము | పంచేంద్రియ రథము పఱపీబో జీవుడు ||
చ|| పాపపుణ్యములు రెండు పక్కనున్న చీలలు | తోపులయన్నపానాలు దొబ్బుదెడ్లు |
యేపున శ్రీవేంకటేశు డెక్కి వీధుల నేగగ | కాపాడిన రథము గడపీబో జీవుడు ||
గుఱుతెఱిగిన దొంగ కూగూగు
వీడెగుఱిలోనె దాగీనీ కూగూగు
నెలతల దోచీనీ నీళ్ళాడగానే
కొలని దరిని దొంగ కూగూగు
బలువైన వుట్ల పాలారగించీనీ
కొలది మీఱిన దొంగ కూగూగు
చల్లలమ్మఁగ చనుకట్టు దొడకీని
గొల్లెతలను దొంగ కూగూగు
యిల్లిల్లు దప్పక ఇందరి పాలిండ్లు
కొల్లలాడిన దొంగ కూగూగు
తావుకొన్న దొంగ దగిలి పట్టుఁడిదె
గోవులలో దొంగ కూగూగు
శ్రీ వేంకటగిరి చెలువుఁడో యేమో
కోవుదుడగు దొంగ కూగూగు
ప|| గుఱ్ఱాల గట్టనితేరు కొంక కెందైనా బారీ | విఱ్ఱవీగుచు దీసీని వేడుకతో జీవుడు ||
చ|| సరి పిఱుదే రెండు జంటబండికండ్లు | సరవితో బాదాలు చాపునొగలు |
గరిమ జూపులు రెండు గట్టిన పగ్గములు | దొరయై దేహరథము దోలీబో జీవుడు ||
చ|| పంచభూతములు పంచవన్నెకోకలు | పంచల చేతులు రెండు బలుటెక్కేలు |
మించైన శిరసే మీదనున్న శిఖరము | పంచేంద్రియ రథము పఱపీబో జీవుడు ||
చ|| పాపపుణ్యములు రెండు పక్కనున్న చీలలు | తోపులయన్నపానాలు దొబ్బుదెడ్లు |
యేపున శ్రీవేంకటేశు డెక్కి వీధుల నేగగ | కాపాడిన రథము గడపీబో జీవుడు ||
గెలిచితి భవములు గెలిచితి లోకము
యెలమి నీదాసుల కెదురింక నేది
జయ జయ నరసింహా జయ పుండరీకాక్ష
జయ జయ మురహర జయ ముకుంద
భయహరణము మాకు పాపనాశనము
క్రియతోడి నీ సంకీర్తన గలిగె
నమో నమో దేవ నమో నాగపర్యంక
నమో వేదమూర్తి నారాయణా
తిమిరి మమ్ము గావగ దిక్కయి మాకు నిలువ జమళీభుజముల శంకుజక్రములు గలిగె
రక్ష రక్ష పరమాత్మ రక్ష శ్రీవేంకటపతి
రక్ష రక్ష కమలారమణ పతి
అక్షయసుఖ మియ్యగల వటు దాపుదండగా
పక్షి వాహనుడ నీ భక్తి మాకు గలిగె
గోవింద నందనందన గోపాలక్రుశ్ణ నీ
భావము మాకుంజిక్కె గోపాలక్రుశ్ణ ||
కొంగువట్టినదేమోయి గోపాలక్రుశ్ణ మా
వంగెన కోవుదువా గోపాలక్రుశ్ణ
దొంగతనాల నవ్వేవు గోపాలక్రుశ్ణ
బంగారు కాళితోడి గోపాలక్రుశ్ణ ||
కొమ్మల చీరలంటిన గోపాలక్రుశ్ణ
పమ్మి నిన్నుం దిట్టేము గోపాలక్రుశ్ణ
కుమ్మరించేవేల సిగ్గు గోపాలక్రుశ్ణ
బమ్మెర పోతిందుల గోపాలక్రుశ్ణ ||
గోవిందాది నామోచ్ఛారణ కొల్లలు దొరకెను మనకిపుడు
ఆవలనీవల నోర(గుమ్మలుగ నాడుద మీతని పాడుదము
సత్యము సత్యము సకలసురలలో
నిత్యుడు శ్రీహరి నిర్మలుడు
ప్రత్యక్షమిదే ప్రాణులలోపల
అత్యంతము శరణనరో యితని
చాటెడి చాటెడి సకలవేదములు
పాటించినహరి పరమమని
కూటస్ఠుడితడు గోపవధూపతి
కోటికి యీతని గొలువరో జనులు
నిలుచున్నాడిదె నేడును నెదుటను
కలిగిన శ్రీవేంకటవిభుడు
వలసినవారికి వరదుండీతదు
కలడు గలడితనిగని మనరో
గోవిందాశ్రిత గోకులబౄందా
పావన జయజయ పరమానంద
జగదభిరామ సహస్రనామ
సుగుణధామ సంస్తుతనామ
గగనశ్యామ ఘనరిపు భీమ
అగణిత రఘువంశాంబుధి సోమ
జననుత చరణా శరణ్యు శరణా
దనుజ హరణ లలిత స్వరణా
అనఘ చరణాయత భూభరణా
దినకర సన్నిభ దివ్యాభరణా
గరుడ తురంగాకారోత్తుంగా
శరధి భంగా ఫణి శయనాంగా
కరుణాపాంగా కమల సంగా
వర శ్రీ వేంకట గిరిపతి రంగా
ఘ
ప|| ఘనమనోరాజ్యసంగతి చెలగినగాని | జనులకెప్పుడు నాత్మ సౌఖ్యంబు లేదు ||
చ|| ప్రతిలేని ధైర్యంబు పదిలపరచినగాని | మతిలొనిపగవారిమద మణపరాదు |
మితిలేనినిశాంతమను మేటికైదువగాని | కృతకంబువిషయముల గేలుపెరుగరాదు |
చ|| సొరిది నిర్మొహమనుజోడు దొడిగినగాని | వెరపుడిగి మమతచే వెళ్ళబడరాదు |
యిరవై నవిజ్ఞానపింట నుండినగాని | అరసి జగమెల్ల తానై యేలరాదు ||
చ|| యిన్నియును దిరువేంకటేశు డిచ్చినగాని | తన్నుదానెరిగి యాతని గొలువరాదు |
కన్నులను వెలి లోను గలయజూచినగాని | సన్నంబుఘనమనెడిజాడ గనరాదు ||
ప|| ఘను డీతడొకడు గలుగగగదా వేదములు | జననములు గులము లాచారములు గలిగె ||
చ|| కలుషభంజను డితడు గలుగగగదా జగతి | గలిగె నిందరిజన్మగతులనెలవు |
మలసి యితడొకడు వొడమగగదా యిందరికి | నిలువ నీడలు గలిగె నిధినిధానములై ||
చ|| కమలాక్షు డితడు గలుగగగదా దేవతలు | గుమిగూడి రిందరును గండిగడచి |
ప్రమదమున నితడూ నిలుపగగదా సస్యములు | అమర ఫలియించె లోకానందమగుచు ||
చ|| గరిమె వేంకటవిభుడొకడు గలుగగగదా | ధరయు నభమును రసాతలము గలిగె |
పరమాత్ముడితడు లోపల గలుగగగదా | అరిది చవులును హితవు లన్నియును గలిగె ||
ప|| ఘనుడాతడే మము గాచుగాక హరి | అనిశము నేమిక నతనికె శరణు ||
చ|| యెవ్వని నాభిని యీ బ్రహ్మాదులు | యెవ్వడు రక్షకుడిన్నిటికి |
యెవ్వని మూలము యీ సచరాచర | మవ్వల నివ్వల నతనికే శరణు ||
చ|| పురుషోత్తముడని పొగడి రెవ్వరిని | కరి నెవ్వడు గాచె |
ధర యెవ్వడెత్తి దనుజుల బొరిగొనె | అరుదుగ మేమిక నతనికె శరణు ||
చ|| శ్రీసతి యెవ్వని జేరి వురమునను | భాసిల్లె నెవ్వడు పరమంబై |
దాసుల కొరకై తగు శ్రీవేంకట | మాస చూపి నితడతనికె శరణు ||
ఘమ్మని యెడి శృతి గూడగను
కమ్మని నేతులు కాగగ జెలగె
నీలవర్ణుడని నీరజాక్షుడని
బాలుని నతివలు పాడేరో
పాలు పిదుకుచును బానల కాగుల
సోలిపెరుగు త్రచ్చుచు జెలరేగి
మందరధరుడని మాధవుడని గో
విందుని బాడేరు వెలదులిదే
నందవ్రజమున నలుగడనావుల
మందల బేయల మంచిరవముల
వెంకటపతియని వేదనిలయుడని
పంకజనాభుని బాడేరు
అంకుల చేతను నలరు రవంబుల
బింకపు మాటల బృందావనమున
ప|| ఘోర విదారణ నారసింహనీ | నీ రూపముతో నెట్లుండితివో ||
చ|| ఉడికెడి కోపపుటూర్పుల గొండలు | పొడిపొడియై నభమున కెగయ |
బెడిదపు రవమున పిడుగులు దొరుగగ | యెడనెడ నీవపుటెట్లుండితివో ||
చ|| కాలానలములు గక్కున యన | జ్వాలల నిప్పులు చల్లుచును |
ఫాలాక్షముతో బ్రహ్మాణ్డ కోట్ల | కేలికవై నేవెటులుండితివో ||
చ|| గుటగుట రవములు కుత్తిక గులుకుచు | గిటగిట బండ్లు గీటుచును |
తటతట బెదవులు దవడల వణకగ | ఇటువలె నీవపుడెట్లుండితివో ||
చ|| గోళ్ళ మెరుగుల కొంకుల పెదపెద | వేళ్ళ దిక్కులు వెదుకుచును |
నీళ్ళ తీగలు విగుడగ నోరను- | చ్చిళ్ళు గమ్మగ నెట్లుండితివో ||
చ|| హిరణ్యకశిపుని నేపడచి భయం- | కర రూపముతో గడుమెరసి |
తిరు వేంకట గిరి దేవుడ నీవిక | యిరవు కొన్న నాడెట్లుండితివో ||
ప|| ఘోరదురితములచే గుణవికారములచే- | నీరీతిబడునాకు నేది దెరువు ||
చ|| హరి జగన్నాథు లోకారాధ్యు- | నెరగలేనివాని కేది దెరువు |
పరమపురుషుని జగద్భరితు నంతర్వ్యాప్తి- | నిరవుకొలుపనివాని కేది దెరువు ||
చ|| శ్రీవేంకటేశు దలచినవెనుక సకలంబు- | నేవగింపనివాని కేది దెరువు |
దేవోత్తముని మహిమ దెలిసితెలియగలేని- | యీవివేకంబునకు నేది దెరువు ||
చ
చంచలపడగ వద్దు సారె సారె గోరవద్దు
పొంచుకున్న దైవమే బుద్దులు నేర్పీని
లోకరక్షకుడు నాలోననే వున్నాడిదే
నాకు నభయములిచ్చి నన్ను గాచుమ
శ్రీకాంతు డీతడే నాచిత్తములొ మలసీని
దాకొని శుభములెల్లా దానే వొసగును
చంచ
పరపురుషుడు నాప్రాణనాథుడైనాడు
పరగ నాపాలివాడై బ్రదికించును
ధరణీశు డీతడే నాదాపుదండైల్ కడగీని
నిరతి నేపొద్దును మన్నించును మమ్మెపుడు
చంచ
శ్రీ వేంకటేశుడు నా జిహ్వ దగిలి వున్నాడు
పావనుని జేసి నాకు ఫల మిచ్చును
గోవిందు డీస్వామి నన్ను గొలిపించుకొన్నవాడు
యీవలనావల నాకు నిహపరా లిచ్చును
చంచ ||
చందమామ రావో జాబిల్లి రావో
కుందనపు పైడికోర వెన్నపాలు తేవో॥
నగుమోము చక్కనయ్యకు నలువపుట్టించిన తండ్రికి
నిగమములందుండే అప్పకు మా నీలవర్ణునికి
జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిర మగనికి
ముగురికి మొదలైన ఘనునికి మాముద్దుల మురారి బాలునికి॥
తెలిదమ్మి కన్నులమేటికి మంచి తియ్యని మాటల గుమ్మకు
కలికిచేతల కోడెకు మా కతలకారి ఈబిడ్డకు
కులముద్దరించిన పట్టెకు మంచి గుణములు కలిగిన కోడెకు
నిలువెల్ల నిండబొయ్యారికి నవనిధుల చూపుల చూచేసుగుణునకు॥
సురలగాచిన దేవరకు చుంచు గరుడునెక్కిన గబ్బికి
నెరవాది బుద్దుల పెద్దకు మా నీటు చేతల పట్టికి
విరుల వింటివాని అయ్యకు వేవేలురూపుల స్వామికి
సిరిమించునెరవాది జాణకు మా శ్రీ వేంకటనాధునికి॥
ప|| చక్కదనముల వారసతులార | యెక్కువ తక్కువల మీరు ఏందుబోయేరికను ||
చ|| ఒప్పుగా నరకము మాకు బలిచ్చి మనమెల్ల | కప్పము గొంటిరిగా అంగనలార |
అప్పుడే గోవిందునికి ఆహివెట్టితి జిత్తము | యిప్పుడు యెమ్మెల మీరేమి సేసేరికను ||
చ|| పంచమహా పాతకాలబారి దోసి మాసిగ్గులు | లంచము గొంటిరిగా నెలతలారా |
వంచనతోడుత హరివారమైతి మికమీ- | యించుక గుట్టుల మీరెందు జొచ్చేరికను ||
చ|| దొంగిలి మాగుట్టులెల్ల దోవ వేసి మరుబారి | భంగ పెట్టితిరిగా వో భామలార |
చెంగలించి వెంకటేశు సేవకు జొచ్చితిమి | యెంగిలి మోపులను మీరేడబడే రికను ||
చక్కని తల్లికి చాంగుభళా తన
చక్కెర మోవికి చాంగుభళా
కులికెడి మురిపెపు కుమ్మరింపు తన
సళుపు జూపులకు చాంగుభళా
పలుకుల సొంపుల బతితో గసరెడి
చలముల యలుకకు చాంగుభళా
కిన్నెరతో పతి కెలన నిలుచు తన
చన్ను మెఱుగులకు చాంగుభళా
ఉన్నతి బతిపై నొరగి నిలుచు తన
సన్నపు నడిమికి చాంగుభళా
జందెపు ముత్యపు సరులహారముల
చందన గంధికి చాంగుభళా
విందయి వెంకట విభుబెన చినతన
సంది దండలకు చాంగుభళా
చక్కని మానిని మీసరి యెవ్వరె
యెక్కువైన నీ భావమెంచి చూడవసమా ||
కోమలి నీకుచముల కొండలకొనల పొంత
వోముచు మించి నిలిచెనొక సింహము
కాముడు జఘ్హనమనే కట్టుబండిమీద బెట్టి
దీమముతో వేటలాడిదేరి చూడ వసమా ||
పడతిలే జిగురుల పాదపుటడవిలోన
నడవుల యేనుగలు నటిఇంచగా
తొడలరటి కంబాలతో గట్టి దీములుగా
బడిబడి వేటలాడ భావించ వసమా ||
అంగనముఖ్హమనేటి అంబుజాకరము పొంత
ముంగిట జూపుల లేళ్ళు మోహరించగా
కంగని శ్రీవేంకటేశు కౌగిటి భావానగట్టి
చెంగటనే వేటలాడి జిత్తగించ వసమా ||
చక్రమా హరి చక్రమా
వక్రమైన దనుజుల వక్కలించవో
చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని
చట్టలు చీరిన ఓ చక్రమా
పట్టిన శ్రీహరి చేత పాయక ఈ జగములు
ఒట్టుకొని కావ గదవొ ఓ చక్రమా
పానుకొని దనుజుల బలు కిరీట మణుల
సానల దీరిన ఓ చక్రమా
నానా జీవముల ప్రాణములు గాచి ధర్మ-
మూని నిలువ గదవో ఓ చక్రమా
వెఱచి బ్రహ్మాదులు వేద మంత్రముల నీ
వుఱుట్లు కొనియాడే రో చక్రమా
అఱిముఱి తిరు వేంకటాద్రీశు వీధుల
ఒఱవుల మెఱయుదువో చక్రమా
చదివితి దొల్లి కొంత చదివేనింకా గొంత
యెదిరి నన్నెఱగను యెంతైన నయ్యో ||
వొరుల దూషింతుగాని వొకమారైన నా
దురిత కర్మములను దూషించను
పరుల నవ్వుదుగాని పలుయోనికూపముల
నరకపు నా మేను నవ్వుకోను ||
లోకుల గోపింతు గాని లోని కామాదులనేటి
కాకరి శత్రువుల మీద కడు కోపించ
ఆకడ బుద్దులు చెప్పి అన్యుల బోధింతుగాని
తేకువ నాలోని హరి దెలుసుకోలేను ||
యితరుల దుర్గుణము లెంచి,యెంచి రోతుగాని
మతిలో నాయాసలు మానలేను
గతిగా శ్రీవేంకటేశుగని బ్రతికిగాని
తతి నిన్నాళ్ళ దాకా దలపోయలేను ||
ప|| చదివెబో ప్రాణి సకలము యీ- | చదువుమీదివిద్య చదువడాయగాని ||
చ|| సిరులు చంచలమని చేత లధృవమని | పరగుసంసారము బయలని |
తొరలినసుఖమెల్ల దుఃఖమూలమని | యెరిగి లోభమువీడ నెరగడాయగాని ||
చ|| తలకొనిధర్మమే తలమీదమోపని | వలసీనొల్లమి దైవవశమని |
కలిమియు లేమియు గడవగ రాదని | తెలిసి లోభము వీడ దెలియడాయగాని ||
చ|| యేచిన పరహితమెంతయు దమదని | వాచవులిన్ని నెవ్వగలని |
యీచందమున వేంకటేశుచేతలని | చూచి లోభమువీడ జూడడాయగాని ||
ప|| చదువులోనే హరిని జట్టిగొనవలెగాక | మదముగప్పినమీద మగుడ నది గలదా ||
చ|| జడమతికి సహజమే సంసారయాతన యిది | కడు నిందులో బరము గడియించవలెగాక |
తొడరి గాలప్పుడు తూర్పెత్తక తాను | విడిచి మఱచిన వెనక వెదకితే గలదా ||
చ|| భవబంధునకు విధిపాపపుణ్యపులంకె | తివిరి యిందునే తెలివి తెలుసుకోవలెగాక |
అవల వెన్నెలలోనే అల్లునేరే ళ్లింతే | నివిరి నిన్నటివునికి నేటికి గలదా ||
చ|| దేహధారికి గలదే తెగనియింద్రియబాధ | సాహసంబున భక్తి సాధించవలెగాక |
యిహలను శ్రీవేంకటేశుదాసులవలన | వూహించి గతిగానక వొదిగితే గలదా ||
ప|| చలపాది రోగమీ సంసారము నేడు | బలువైన మందు విష్ణు భక్తి జీవులకు ||
చ|| కీడౌట మదినెరింగియు మోహ మెడలదిది | పాడైన విధికృతము బలవంతము |
ఈడనే ఇది మాన్ప హితవైన వజ్రాంగి | జోడువో హరి దలంచుట జీవులకును ||
చ|| హేయమని తెలిసి తా నిచ్చగించీ యాత్మ | పాయదీ రతి సుఖము బలవంతము |
మాయ నుగ్గులు చేయ మాధవుని దంచనపు | రాయివో వైరాగ్య రచన జీవులకు ||
చ|| పొలయు దురితంపు రొంపులు దన్నువడి ముంచ | పలుమారు జన్మమీ బలవంతము |
నెలవుకొని సకలంబు నిర్మలముగా కడుగు | జలధివో వేంకటేశ్వరుడు జీవులకు ||
ప|| చల్లనై కాయగదో చందమామ | వెల్లిగా తిరి వేంకటేశు నెదుట ||
అప|| మొల్లమిగ నమృతంపు వెల్లిగొలుపుచు లోక- | మెల్ల నిను కొనియాడగా ||
చ|| పొందైన హితులు నాప్తులు రసికులు కవులు | అందముగ నును మాటలాడ నేర్చిన ఘనులు |
చిందులకు నాడేటి సీమంతి మణులు | చెలగి ఇరుగడ కొలువగాను |
వంది మాగధులు కైవారింప తన దివ్య | మందిరో పాంత మార్గమున కోనేటి |
ముందుటను కడు మంద మంద ప్రయాణముల | ఇందిరాపతి మెరయగాను ||
చ|| ఏకాంత సుఖగోష్ఠి నేప్రొద్దు మానవా- | నీకంబు లెడ గలిసి నిలిచి సేవింప గాం- |
తా కదంబములు హస్తముల కంకణ ఝణ- | త్కారములు నిగుడ చామరము లిడగ |
జోకైన మణిగణ స్తోమాంకితంబులై | సొంపుపొందు నాలవట్టములు కరములు దాల్చి |
యేకాంతు లిరువంక నెదిరి కొలువగ సకల | లోకేశ్వరుడు మెరయగాను ||
చ|| బంగారు ప్రతిమలకు వ్రతులైన దివిజ లో- | కాంగనలు ఘన విమానాంగణంబున నుండి |
చెంగలువలును మంచి చేమంతి రేకులును | చెలగి యిరుగడ చల్లగాను |
మంగళాత్మకము లగు మహిత వేదాంత వే- | దాంగ విద్యలకు ప్రియమంది చేకొనుచు తిరు- |
వేంగళేశుండు కడు వేడుకల తోడ తిరు- | వీధులను విహరింపగాను ||
చవినోరికేడ బెట్టు సంపదేడ బెట్టు దీని
సవరించుటేల సంపదిది కాదా
పచ్చడాలెక్కడ బెట్టు పట్టుచీరలేడ బెట్టు
వెచనిందేండ్ల బెట్టు వెంట వెంటను
తెచ్చిన ఈ పచ్చడము దేహమిది వెంట వెంట
వచ్చి గాక తన్ను దానే వద్దనక వచ్చునా
దొరతనమేడ బెట్టు దొడ్డసొమ్ము లేడ బెట్టు
నెరవుల సిరులనేనేడ బెట్టు
వెరవున నేనెవ్వరిని వేసరించ జాలక
దరిచేరుటే దొరతనమిది కాదా
తొడబుట్టువుల నేడ తొడిచెట్టు చుట్టలా
నేడ బెట్టు సుతుల పొందేడ బెత్తును
వేడుకైన పొందు శ్రీవేంకటేశు తలచుటే
ఈడులేని బంధుకోటి ఈతడె కాదా
చాటెద నిదియే సత్యము సుండో
చేటు లేదీతని సేవించినను
హరినొల్లనివారసురులు సుండో
సుర లీతనిదాసులు సుండో
పరమాత్ముడితడె ప్రాణము సుండో
మరుగక మఱచిన మఱి లేదికను ||చాటెద||
వేదరక్షకుడు విష్ణుడు సుండో
సోదించె శుకుడచ్చుగ సుండో
ఆదిబ్రహ్మగన్నాతడు సుండో
యేదెస వెదకిన నితడే ఘనుడు ||చాటెద||
యిహపర మొసగను యితడే సుండో
వహి నుతించె బార్వతి సుండో
రహస్య మిదియే రహి శ్రీవేంకట
మహీధరంబున మనికై నిలిచె ||చాటెద||
ప|| చాల నొవ్విసేయునట్టి జన్మమేమి మరణమేమి | మాలుగలసి దొరతనంబు మాన్పుటింత చాలదా ||
చ|| పుడమి బాపకర్మమేమి పుణ్యకర్మమేమి తనకు | కడపరానిబంధములకు గారణంబులైనవి |
యెడపకున్న పసిడిసంకెలేమి యినుపసంకెలేమి | మెడకు దగిలియుండి యెపుడు మీదుచూడరానివి ||
చ|| చలముకొన్న ఆపదేమి సంపదేమి యెపుడు దనకు | అలమిపట్టి దుఃఖములకు నప్పగించినట్టిది |
యెలమి బసిడిగుదియయేమి యినుపగుదియయేమి తనకు | ములుగ ములుగ దొలితొలి మోదుటింత చాలదా ||
చ|| కర్మియనయేమి వికృతకర్మియైననేమి దనకు | కర్మఫలముమీదకాంక్ష గలుగుటింత చాలదా |
మర్మమెరిగి వేంకటేశుమహిమలనుచు దెలిసినట్టి- | నిర్మలాత్ము కిహము బరము నేడు గలిగె జాలదా ||
ప|| చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు | జాలెల్ల నడగించు సంకీర్తనం ||
చ|| సంతోష కరమైన సంకీర్తనం | సంతాప మణగించు సంకీర్తనం |
జంతువుల రక్షించు సంకీర్తనం | సంతతము దలచుడీ సంకీర్తనం ||
చ|| సామజము గాంచినది సంకీర్తనం | సామమున కెక్కుడీ సంకీర్తనం |
సామీప్య మిందరికి సంకీర్తనం | సామాన్యమా విష్ణు సంకీర్తనం ||
చ|| జముబారి విడిపించు సంకీర్తనం | సమ బుద్ధి వొడమించు సంకీర్తనం |
జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం | శమదమాదుల జేయు సంకీర్తనం ||
చ|| జలజాసనుని నోరి సంకీర్తనం | చలిగొండ సుతదలచు సంకీర్తనం |
చలువ గడు నాలుకకు సంకీర్తనం | చలపట్టి తలచుడీ సంకీర్తనం ||
చ|| సరవి సంపదలిచ్చు సంకీర్తనం | సరిలేని దిదియపో సంకీర్తనం |
సరుస వేంకట విభుని సంకీర్తనం | సరుగనను దలచుడీ సంకీర్తనం ||
ప|| చాలదా మాజన్మము నీ- | పాలింటివారమై బ్రదుకగగలిగె ||
చ|| కమలాసనాదులుగాననినీపై | మమకారముసేయ మార్గము గలిగె |
అమరేంద్రాదులకందరానినీ- | కొమరైన నామము కొనియాడగలిగె ||
చ|| సనకాదులును గానజాలనినిన్ను | తనివోవ మతిలొన దలపోయగలిగె |
ఘనమునీంద్రులకు నగమ్యమైవున్న- | నిను సంతతమును వర్ణింపగలిగె ||
చ|| పరమమై భవ్యమై పరగిననీ- | యిరవిట్టిదని మాకు నెఱుగంగగలిగె |
తిరువేంకటాచలాధిప నిన్ను యీ- | ధరమీద బలుమారు దరిసింపగలిగె ||
చాలదా హరి నామ సౌఖ్యామృతము దమకు
చాలదా హితవైన చవులెల్లనొసగ
ఇది యొకటి హరి నామ మింతైన చాలదా
చెదరకీ జన్మముల చెరలు విడిపించ
మదినొకటె హరినామ మంత్రమది చాలదా
పదివేల నరక కూపముల వెడలింప
కలదొకటి హరినామ కనకాద్రి చాలదా
తొలగుమని దారిద్ర్యదోషంబు చెరుచ
తెలివొకటి హరినామదీప మది చాలదా
కలుషంపు కఠిన చీకటి పారద్రోల
తగువేంకటేశు కీర్తనమొకటి చాలదా
జగములో కల్పభూజంబు వలె నుండ
సొగిసి యీవిభుని దాసుల కరుణ చాలదా
నగవు జూపులను నున్నతమెపుడు జూప
ప|| చాలదా హరిసంకీర్తనాంగల- | మేలిది దీననే మెరసిరి ఘనులు ||
చ|| తలప వేదశాస్త్రములు గానక | అలరుచు వాల్మీకాదులు |
తలకొని హరిమంత్రమే దగబేర్కొని | అలవిమీర గడునధికములైరి ||
చ|| యితరదైవముల నెరుగనేరక | ప్రతిలేని మహిమ బార్వతి |
మతి దలపుచు హరిమంత్రమె పేర్కొని | సతతము హరులొ సగమై నిలిచె ||
చ|| చదువులు బలుమరు జదువనోపక | అదివో నారదాదులు |
పదిలపు వేంకటపతి హరినామమే | వదలకిదియ జీవనమై మనిరి ||
ప|| చాలు చాలు నీ జాజర నన్ను | జాలి బరచేనీ జాజర ||
చ|| వలపు వేదనల వాడెమ యీ- | తలనొప్పుల చే దలకేను |
పులకల మేనితో బొరలేను కడు | జలిగొని చల్లకు జాజర ||
చ|| ఒల్లని నినుగొని వుడికేను నీ- | చిల్లర చేతుల జిమిడేను |
కల్లగంద వొడిగా గేనుపై | జల్లకు చల్లకు జాజర ||
చ|| తివిరి వేంకటాధిప నేను నీ- | కవుగిట కబ్బితిగడు నేను |
రవరవ చమట గరగినేడు యిదె | చవులాయెను నీ జాజర ||
చాలుచాలును భోగసమయమున మైమఱపు
పాలుపడునట యేటి బ్రతుకురా ఓరీ
ఇందుముఖినిను కౌగిలించి లోపలి జగము
కందునని నీ బిగువు కౌగిలే వదలె
పొందైన వారితో పొసగ కౌగిట జేర్ప
పొందుగాదట యేటి పొందురా ఓరీ
నెలత నీ వాలు కన్నులు మూసి జగమెల్ల
కలయ చీకట్లైన గక్కనను వదలె
వలచిన అంగనలు తమ వలసిన విలాసముల
వలను నెఱపనిదేటి వలపురా ఓరీ
కొమ్మ నీ ఉరముపై గోరు దివియుచునాత్మ
నిమ్మైన ననుతాక నిద్దరిని తాకె
దిమ్మరివి కోనేటి తిమ్మ నీపై ప్రియము
కుమ్మరించని దేటి కోర్కిరా ఓరీ
చాలునిదే నావిరతి సకసామ్రాజ్యము
నాలోనిపని యెంతైనా నాకు గలదు
వడబడి పరులిండ్లవాకిలిగాచే నేను
వడి నాలో హరియున్న వాకిలి గాచేను
బడి నొకరి గొలిచి బహురాజ్యమేలేనేను
యెడ నామనోరాజ్యమింతా నేలేను
చాలు
చేరి యొరులకు బనిసేసి యలసేనేను
సారె నాయోగాభ్యాసాన నలసేను
అరిసి నే నడుగగ నన్యులిచ్చేయీవులు
తారి పూర్వకర్మాదిదైవమే యిచ్చీని
చాలు
అందు సంతోషమే ఫల మిందు సంతోషమే ఫల
మందును మాయాకల్పిత మిందును మాయే
అందు నిందు శ్రీవేంకటాధీశుడే కర్త
అందైతే బరతంత్రు డిందు నే స్వతంత్రుడ
చాలు ||
చింతలు రేచకు మమ్ము చిత్తమా నీవు
పంతముతో మముగూడి బతుకుమీ నీవు.
తల్లి శృఈ మహాలక్ష్మి తండ్రి వాసుదేవుడు
ఇల్లు మాకు బ్రహ్మాండమింతా నిదె
జల్లిదపుహరిభక్తి పాడీ బంటా నాకు
వొల్లము కర్మఫలము లొకటి నేము.
జ్ఞానమే మాకు ధనము సర్వవేదములు సొమ్ము
పూనినవైరాగ్యమే వుంబళి మాకు
ఆనినగురుసేవలు ఆడుబిడ్డలు నాకు
మేనితోనే తగులాయ మేలు మాకు జేరెను.
యేలికె శ్రీ వేంకటేశు డింటిదేవపూజ మాకు
పాలుగలబంధువులు ప్రపన్నులు
కీలు మాకు నీతని సంకీర్తన మోక్షమునకు
యేల ఇంకా మాకు నేమిటితో గొడవ.
చింతాపరంపరలు చిత్తంబునకుదొడవు
ఇంతి సౌభాగ్యంబులిన్నిటికిదొడవు ||
కలికి నెమ్మోమునకు గబరీ భరముతొడవు
తళుకుజూపులు చక్కదనమునకు దొడవు
ఎలమి చెక్కుల మించులిరువంకలకు దొడవు
మొలకనగవులు సొబగు మురిపెముల తొడవు ||
కరమూల రుచులు బంగారంబునకు దొడవు
గురిగాని కౌదీగె గుబ్బలకు దొడవు
సిరిదొలకు జఘ్హనంబు చిన్నినడవుల దొడవు
నిరతంపు బాదములు నిలువునకు దొడవు ||
శ్రీ వేంకటేశుక్రుప చెలియకెప్పుడు దొడవు
భావ సంగతులకును బరవశమె తొడవు
ఈ వెలది నును బలుకులించు విలుతుని తొడవు
లావణ్యములకు నీలలన దా దొడవు ||
చిక్కువడ్డపనికి జేసినదే చేత
లెక్కలేనియప్పునకు లేమే కలిమి
తగవులేమి కెదిరిధనమే తనసొమ్ము
జగడగానికి విరసమే కూడు
తెగుదెంపులేమికి దీనగతే దిక్కు
బిగువుగూటికి వట్టిబీరమే తగవు
చిక్కు
పతిలేనిభూమికి బలవంతుడే రాజు
గతిలేనికూటికి గన్నదే కూడు
సతిలేనివానికి జరగినదే యాలు
కుతదీరుటకు రచ్చకొట్టమే యిల్లు
చిక్కు
యెదురులేమికి దమకేదైనదలపిది
మదమత్తునకు దనమఱపే మాట
తుదిపదమునకు జేదొడై నవిభవము
పదిలపుశ్రీవేంకటపతియే యెఱుక
చిక్కు
ప|| చిత్త మతిచంచలము చేత బలవంతంబు | తిత్తితో జీవుడిటు దిరిగాడుగాక ||
చ|| కదిసి జీవుడు పుట్టగా బుట్టినటువంటి- | మొదలు దుదియునులేని మోహపాశములు |
వదలు టెటువలె దారు వదలించు టెటువలెను | పదిలముగ వీనిచే బడి పొరలుగాక ||
చ|| కడలేని జన్మసంగ్రహములై యెన్నడును | గడుగవసములుగాని కర్మపంకములు |
విడుచు టెటువలె దారు వదలించు టెటువలెను | విడువని విలాపమున వేగుటలుగాక ||
చ|| యిందులోపల జీవుడెన్నడే నొకమాటు | కందువెఱిగి వివేకగతుల భాగ్యమున |
అందముగ దిరువేంకటాద్రీశు సేవించి | అందరాని సుఖంబు లందుగాక ||
చిత్తగించి రక్షించు శ్రీహరి నీవు
యిత్తల మానేరములు యెన్ని లేవయ్యా
అంగము యేడు జానలు ఆన కొండలపొడవు
యెంగిలిమేను ఆచార మెంతైనా గద్దు
జంగిలింతే సంసారము సాధించేది లోకమెల్లా
అంగడిబడి జీవుని కలపు లేదయ్యా
మఱి నల్లెడునాలికె మాటలు గంపెడేసి
యెఱుక గొంచె మఙ్నాన మెంచగరాదు
గుఱిలేనిది బరుకు కొలది లేదు భోగము
నెఱవనిజీవునిక వేసట లేదయ్యా
పట్టరానిది మనసు బయలువందిలి చేత
చుట్టుకొన్నది కర్మము వట్టిది గుట్టు
యిట్టె యలమేలమంగ నేలె శ్రీవేంకటేశుడు
నెట్టన నీబంటుజీవునకి మితిలేదయ్యా
చిత్త
చిత్తగించుమిదె చెలియ వికాసము
పొత్తులు గలపీ భోగంబులకు
వెన్నెలరేకులు వెదచల్లీనిదె
సన్నల సెలవుల సకియా
కన్నులమొక్కులు కానుకలొసగీ
నిన్నుజూచి యిదె నివ్వెరగులను
జక్కవపిట్టల సంతము సేసీ
అక్కున గప్పుచు నతివా
చక్కని మోవిని చవులటు గొలిపీ
నెక్కొని నీపై నేస్తంబులను
పలుకుతేనియలు పలుమరుజిలికీ
మెలుపురతుల నలమేల్మంగ
యెలమిని శ్రీవేంకటేశ గూడితివి
అలరీ నీతో నదె సరసములా
చిత్తజ గరుడ నీకు శ్రీమంగళం నా
చిత్తములో హరి నీకు శ్రీమంగళం ||
బంగారు బొమ్మవంటి పడతి నురముమీద
సింగారించిన నీకు శ్రీమంగళం
రంగుమీర పీతాంబరము మొలగట్టుకొని
చెంగిలించే హరినీకు శ్రీమంగళం ||
వింత నీలమువంటి వెలదిని పాదముల
చెంత బుట్టించిన నీకు శ్రీమంగళం
కాంతుల కౌస్తుభమణి గట్టుక భక్తులకెల్లా
చింతామణివైన నీకు శ్రీమంగళం ||
అరిది పచ్చల వంటి యంగన శిరసుమీద
సిరుల దాల్చిన నీకు శ్రీమంగళం
గరిమ శ్రీవేంకటేశ ఘనసంపదలతోడి
సిరివర నీకు నివే శ్రీమంగళం ||
ప|| చిత్తజగరుడ శ్రీనరసింహ | బత్తి సేసేరు మునులు పరికించవయ్య ||
చ|| సకలదేవతలును జయవెట్టు చున్నారు | చకితులై దనవులు సమసిరదె |
అకలంకయగు లక్ష్మి అటు నీతొడపై నెక్కె | ప్రకటమైన నీకోపము మానవయ్య ||
చ|| తుంబురు నారదులు దొరకొని పాడేరు | అంబుజాసనుండభయమ డిగీనదె |
అంబరవీధి నాడేరు అచర లందరు గూడి | శంబరరిపు జనక శాంతము చూపవయ్యా ||
చ|| హత్తి కొలిచేరదె యక్షులును గంధర్వులు | చిత్తగించు పొగడేరు సిద్ధ సాధ్యులు |
సత్తుగ నీ దాసులము శరణుజొచ్చితిమిదె | ఇత్తల శ్రీవేంకటేశ ఏలు కొనవయ ||
ప|| చిత్తజు వేడుకొనరే చెలియలా | తత్తరించి పతిమీది తలపోత నున్నది ||
చ|| అతివపై మదనుడు అనలాస్త్ర మేయబోలు | కతలుగ విరహాగ్నిగాగీనదే |
యితవుగా వరుణాస్త్ర మేయబోలు నప్పటిని | తతి జెమటవానల దడియుచునున్నది ||
చ|| అమరగ నంతలో వాయవ్యాస్త్రమేయబోలు | వుమరబడి నిట్టూర్పులొగి రేగెను |
జమళిగూడగ నట్టె శైలాస్త్రమేయబోలు | భ్రమసి చనుగొండలు బాయిటగాన్పించెను ||
చ|| మునుకొని పంతాన సమ్మోహనాస్త్రమేయబోలు | మనసు పరవశాన మరపందెను |
అనిశము రక్షగా నారాయణాస్త్రమేయబోలు | ఘన శ్రీవేంకటేశుడు కాగిటిలోగూడెను ||
ప|| చిత్తములో నిన్ను జింతింపనేరక | మత్తుడనై పులుమానిసినైతి ||
చ|| ఆరుత లింగము గట్టి యది నమ్మజాలక | పరువత మేగినబత్తుడ నైతి |
సరుస మేకపిల్ల జంకబెట్టుక నూత- | నరయుగొల్లనిరీతి నజ్ఞాని నైతి ||
చ|| ముడుపు కొంగునగట్టి మూలమూలల వెదికే | పెడమతినై నేవ్యర్థుడనైతి |
విడువకిక్కడ శ్రీవేంకటేశ్వరుడుండ | పొడగానక మందబుద్ధి నేనైతి ||
ప|| చిత్తమెందుండెనో యంటా సిబ్బితిపడే నేను | కొత్తలేమిగలిగినా గోరి తెలుసుకొమ్మీ ||
చ|| నివ్వటిల్లి కొలువరో నీవున్న భావము చూచి | యెవ్వతె యేమాడునో యేమి సేసునో |
పువ్వువలె బొదుగుదు భోగించువేళ నేను | నవ్వుల నీ మైరేకలు నావిగావు సుమ్మీ ||
చ|| వూరు వారి సొమ్ములెల్ల నొగిబెట్టుక రాగాను | యేరీతి నున్నాడవో నాకెట్టు దెలుసు |
నేరుపుతో సింగారింతు నీ మేను సోకేటి వేళ | భారపు దండలు నాకు బనిలేదు సుమ్మీ ||
చ|| సందడి నీ మోమునకు సరికళలు రేగెను | యెందు గలదో మోహమెరుగుదునా |
పొందితి శ్రీ వేంకటేశ పొరపొచ్చెము లేకుండ | విందుల నీ మోవితేనె వేరుసేయసుమ్మీ ||
ప|| చిత్తమో కర్మమో జీవుడో దేవుడో | వొత్తినయీచేత లొకరివి గావు ||
చ|| పదిలమైన మోహపాశంబులు దెచ్చి | మెదలకుండగ నాకు మెడ జుట్టి |
యెదిరివారు నవ్వ నింటింట దిరిగించి | తుదలేనియాసల దుఃఖాంతరుని జేసె ||
చ|| కొలదిమీర జన్మకోట్ల బెనగొని | తొలగని నాలోని దురితము |
తొలగింప నాలుకతుదకు నీపేరిచ్చి | తెలుపు మింతియు చాలు దిరువేంకటేశా ||
చిన్ని శిశువు చిన్ని శిశువు
ఎన్నడు చూడమమ్మ ఇటువంటి శిశువు॥
తోయంపు కురులతోడ తూగేటిశిరసు, చింత
కాయలవంటి జడలా గములతోడ
మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాలతోడ
పయక యశోద వెంట పారాడు శిశువు॥
ముద్దుల వ్రేళ్ళతోడ మొరవంక యుంగగాల
నిద్దపు చేతుల పైడి బొద్దుల తోడ
అద్దపు చెక్కులతోడ అప్పలప్పలనినంత
గద్దించి యశోదమేను కౌగిలించు శిశువు॥
బలుపైన పొట్ట మీది పాల చారలతోడ
నులివేడి వెన్నతిన్న నోరితోడ
చ్లగి నేడిదే వచ్చి శ్రీ వేంకటాద్రిపై
నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువు॥
ప|| చిరంతనుడు శ్రీవరుడు | పరమం భవ్యం పావనం ||
చ|| వేదమయుడు కోవిదు డమలుడు పరు- | డాదిపురుషుడు మహామహుడు |
యేదెస నేమని యేది దలచిన న- | భేద మవాది మఖిలసమ్మతం ||
చ|| నిఖిలనిలయుడు మునివరదు డధికుడు | మఖముఖశుకాభిమతరతుడు |
శిఖిరం శివం సుశీలన మతిశయ | ముఖరం ముఖ్యం మూలమిదం ||
చ|| అనేకప్రదు డనాదినిధనుడు | ఘను డీతిరువేంకటవిభుడు |
దినందినం సముదితరవికోటిభ- | జనం సిద్ధాంజనం ధనం ||
చీ చీ వివేకమా చిత్తపువికారమా
యేచి హరి గొలువక హీనుడాయ జీవుడు
బతికేనంటా బోయి పయిడి పుచ్చుక తన
పతియవసరముల బ్రాణమిచ్చీని
బతు కందులోన నేది పసిడి యెక్కడ నుండు
గతిహరి గొలువక కట్టువడె జీవుడు
దొడ్డవాడనయ్యేనని దొరల గొలిచి వారి
కడ్డము నిడుపు మొక్కు నతిదీనుడై
దొడ్డతన మేది యందు దొర యాడనున్న వాడు
వొడ్డి హరి గొలువక వోడుపడె జీవుడు
చావనేల నోవనేల సారె గిందుపడనేల
యీవల శ్రీవేంకటేశుడింట నున్నాడు
దేవుడాతడే నేడు తెలిసి కొలిచేగాని
భావించ కిన్నాళ్ళదాకా భ్రమ బడె జీవుడు
ప|| చీచీ వోబదుకా సిగ్గులేనిబదుకా | వాచవికి బతిమాలి వడబడ్డబదుకా ||
చ||| ఆసలకు జోటు గద్దు అంతరంగాన నెంతైన | వీసమంతా జోటు లేదు విరతికి |
యీసున సంసారమున కెందరైనా గలరు | వోసరించి మోక్షమియ్య నొకరు లేదు ||
చ|| భోగించ వేళ గద్దు పొద్దువొడపుగుంకును | వెగమే హరిదలచ వేళలేదు |
వోగులలంపటమున కోపి కెంతైనా గద్దు | యోగపుసత్కర్మాన కొకయింత లేదు ||
చ|| యెదుట ప్రపంచాన కెఱు కెంతైనా గద్దు | యిదివో యాత్మజ్ఞాన మించుకా లేదు |
మది శ్రీవేంకటేశుడు మమ్ము నిట్టె కాచెగాని | పదరి నా నేరములు పాప మఱి లేరు ||
ప|| చూచితి దనసరిత సుద్దు లేటికో యమ్మ | చేచేత నిక బొంక జెల్లదో యమ్మ ||
చ|| జడిసి లోతుమాటల జాణతనా లాడీ నన్ను | తడివితే దలదీసి తక్కించీ నమ్మ |
చిడుముడి చిల్లరపు సేతల మమ్ము జెనకీ | పడుచు మాటల వాని పసయేమిటమ్మా ||
చ|| ఆ రీతి నాఱడి బెట్టి యంతలో నడుగుకొనీ | గోర బొయ్యేదాని కింత గొడ్డ లేలమ్మ ||
సారెకు మాట పట్లు సాధించి నడచీని | తీరకుండా జగడాలు తిద్ద బొయ్యీ నమ్మా ||
చ|| పొందుగాని తమకాల బోధించ వచ్చీని | యిందరిలో నెక్కుడాయనిక నేలమ్మా |
అందపు శ్రీ వేంకటేశుడాదరించి కూడెనన్ను | నింద లెల్ల బాసె నెమ్మదినే యమ్మా ||
ప|| చూచే చూపొకటి సూటి గురి యొకటి | తాచి రెండు నొకటైతే దైవమే సుండీ ||
చ|| యేనుగ దలచితే యేనుగై పొడచూపు | మాను దలచిన నట్టే మానై పొడచూపు |
పూని పెద్దకొండ దలపోయ గొండై పొడచూపు | తానే మనోగోచరుడు దైవమే సుండీ ||
చ|| బట్టబయలు దలచ బయలై పొడచూపు | అట్టె యంబుధి దలచ నంబుధియై పొడచూపు |
పట్టణము దల్చిన పట్టణమై పొడచూపు | తట్టి మనోగోచరుడు దైవమే సుండీ ||
చ|| శ్రీ వేంకటాద్రిమీది శ్రీపతి దలచితేను | శ్రీవేంకటాద్రిమీది శ్రీపతై పొడచూపు |
భావమే జీవాత్మ ప్రత్యక్షము పరమాత్మ | తావు మనోగోచరడు దైవమే సుండీ ||
ప|| చూడ జూడ మాణిక్యాలు చుక్కలవలె నున్నవి | యీడులేని కన్నులెన్నులవె యినచంద్రులు ||
చ|| కంటి గంటి వాడె వాడె ఘనమైనముత్యాల | కంటమాలలవే పదకములు నవె |
మింటిపొడవై నట్టిమించుగిరీటం బదె | జంటల వెలుగు శంఖచక్రాలవె ||
చ|| మొక్కు మొక్కు వాడె వాడె ముందరనే వున్నాడు | చెక్కులవే నగవుతో జిగిమోమదె |
పుక్కిట లోకములవె భుజకీర్తులును నవె | చక్కనమ్మ అలమేలు జవరాలదె ||
చ|| ముంగైమురాలును నవె మొల కఠారును నదె | బంగారునిగ్గులవన్నె పచ్చబట్టదె |
ఇంగితమెరిగి వేంకటేశుడిదె కన్నులకు | ముంగిట నిధానమైన మూలభూత మదే ||
చూడ వేడుకలు సొరిది నీమాయలు
తోడనే హరి హరి దొరసీ నిదివో
పుట్టేటిజీవులు పొదలేటిజీవులు
జట్టిగొని రిదియే జగమెల్లా
కట్టిడికర్మము కాయజుమర్మము
నెట్టుకొన్న దిదెనిఖిలంబెల్లా
ములిగేటిదనములు మోచేటిధనములు
కలిమి మెరసె లోకంబెల్లా
పొససి వేగుటలు పొద్దు గుంకుటలు
కలిగిన విదివో కాలంబెల్లా
లేటిపురుషులు తమకపు కాంతలు
బగివాయని దీబదుకెల్లా
అగపడి శ్రీవేంకటాధిప నీకృప
దెగనీజివనము దినదినమెల్లా।
ప|| చూడరమ్మ యిటువంటి సుదతులుతులేరెందు | యేడనైన నిటువంటి యింతులు వుట్టుదురా ||
చ|| ముదిత నడపులలోని మురిపెమే వెయిసేసు | కొదమ గుబ్బల తీరు కోటివేలు సేసు |
సుదతి బిత్తరిచూపు సొన్నటంకాలే సేసు | అదర బింబము తీరు ఆరువేలు సేసు ||
చ|| సన్నపు నడుములోని సైకమే లక్ష సేసు | పన్నుగా బిరుదు వన్నె పదివేలు సేసు |
యెన్నిక మెఱుగుదొడలెంత ధనమైనజేసు | నున్నగా దువ్వినకొప్పు నూరువేలు సేసునే ||
చ|| అంగన భాగ్యమెట్టిదో అతిమోహమై తిరు- | వెంగళరాయనికృప వేవేలు సేసునే |
బంగారు చవికెలోబడతి గూడిన సొంపు | రంగుగా జెలియరూపు రాజ్యమెల్లజేసునే ||
ప|| చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ |
కూడున్నది పతి చూడికుడుత నాంచారి ||
చ|| శ్రీమహాలక్ష్మియట సింగారాలకేమరుదు |
కాముని తల్లియట చక్కదనాలకేమరుదు |
సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు |
కోమలాంగి ఈ చూడికుడుత నాంచారి ||
చ|| కలశాబ్ధి కూతురట గంభీరాలకేమరుదు |
తలపలోక మాతయట దయ మరియేమరుదు |
జలజనివాసినియట చల్లదనమేమరుదు |
కొలదిమీర ఈ చూడికుడుత నాంచారి ||
చ|| అమరవందితయట అట్టే మహిమయేమరుదు |
అమృతము చుట్టమట ఆనందాలకేమరుదు |
తమితో శ్రీవేంకటేశు తానె వచ్చి పెండ్లాడె |
కొమెర వయస్సు ఈ చూడికుడుత నాంచారి ||
ప|| చూడరమ్మా చెలులాల సుదతి చక్కదనాలు | కూడుకొన్న పతి కాంతి గురులే పోలెను ||
చ|| మొగము చందురు బోలె ముంచిన యీ యిందిరకు | తగిన తోడ బుట్టుగా నాతడే కనక |
నగ నమృతము బోలె నలినాక్షి కదియును | తగిన పుట్టిన యింటి ధనమే కనక ||
చ|| సతి గుణ మింతాను సముద్రమునే పోలె | తతి నాతడీకెకు తండ్రి గనక |
మితిగా గన్నులు గండు మీసముల బోలె నవి | గతి గూడి తమ వారి కడవే కనక ||
చ|| తరుణి పాదాలు కల్పతరువు చిగురు బోలె | పరగగ దనవెను బల మంటాను |
గరిమ శ్రీ వేంకటేశు గైకొని పెండ్లాడి యీపె | సరవు లాతని బోలె సరసుడంటాను ||
ప|| చూడరెవ్వరు దీనిసోద్యంబు పరికించి | చూడజూడగ గాని సుఖమెరుగ రాదు ||
చ|| ఎడతెగనిమమత వేయగరానిపెను మోపు | కడలేని ఆశ చీకటి దవ్వుకొనుట |
నిడివైనకనుచూపు నీడనుండిన ఎండ | వడి చెడని తమకంబు వట్టితాపంబు ||
చ|| బుద్ధి మానిన చింత పోని యూరికి దెరువు | పొద్దు వోవని వలపు పొట్ట పొంకంబు |
ఎద్దుబట్టిన శివంబెరుక మాలిన ప్రియము- | లొద్దిక విహారంబు లుబ్బు గవణంబు ||
చ|| తీపు లోపలి తీపు తిరు వేంకటేశ్వరుని | చూపు పొడగనని చూపులో చూపు |
ఆపదలువాయు నెయ్యపు దలపులీ తలపు | రూపైన రుచిలోని రుచి వివేకంబు ||
ప|| చూడవమ్మ యశోదమ్మ | వాడ వాడల వరదలివిగో ||
చ|| పొంచి పులివాలు పెరుగు | మించు మించు మీగడలు |
వంచి వారలు వట్టిన | కంచపుటుట్ల కాగులివో ||
చ|| పేరీ బేరని నేతులు | చూరల వెన్నల జున్నులును |
ఆరగించి యట నగుబాళ్ళు | పార వేసిన బానలివిగో ||
చ|| తెల్లని కను దీగల సోగల | చల్ల లమ్మేటి జవ్వనుల |
చెల్లినట్లనె శ్రీ వేంకటపతి | కొల్లలాడిన గురుతు లివిగో ||
ప|| చూడవయ్య నీసుదతి విలాసము | వేడుకకాడవు విభుడవు నీవు ||
చ|| పున్నమివెన్నెల పోగులు వోసి | సన్నపు నవ్వుల జవరాలు |
వన్నెల కుంకుమ వసంత మాడే | ఇన్నిటా కళలతో ఈ మెరుగుబోడి ||
చ|| పాటించి తుమ్మెద పౌజులు దీర్చీ | కాటుక కన్నుల కలికి యిదే |
సూటి జక్కవల జోడలరించీ | నాటకపు గతుల నాభి సరసి ||
చ|| అంగజురథమున హంసలు నిలిపి | కంగులేని ఘన గజగమన |
ఇంగితపు శ్రీవేంకటేశ నిన్నెనసె | పంగెన సురతపు పల్లవాధరి ||
ప|| చూడు డిందరికి సులభుడు హరి- | తోడునీడయగుదొరముని యితడు ||
చ|| కైవల్యమునకు గనకపుతాపల- | త్రోవై శ్రుతులకు దుదిపదమై |
పావన మొకరూపమై విరజకు | నావైయున్నాడిదె యితడు ||
చ|| కాపాడగ లోకములకు సుజ్ఞాన- | దీపమై జగతికి దేజమై |
పాపా లడపగ భవపయోధులకు | తేపైయున్నాడిదే యితడు ||
చ|| కరుణానిధిరంగపతికి గాంచీ- | వరునకు వేంకటగిరిపతికి |
నిరతి నహోబలసృకేసరికి ద- |త్పరుడగు శఠగోపముని యితడు ||
ప|| చూతమే యీ సంతోసాలు సొరిదినుండి | ఐతేనేమే సవతుల మది మనమేలే||
చ|| సతి తిట్టులతనికి చవులై వుండగాను | మతిలోన వగవగ మనకేల |
యితవై యీపె గుంపెన కితడు లోగుచుండగా | కుతిల కుడువ నేలే కొమ్మలాల మనము ||
చ|| ఆపెసేసే ఉద్దండాలు ఆతడోరుచుకుండగా | కోపమేలే మనకును కోపులనుండి |
వోపి యాలియాజ్ఞ మగడొట్టి జవదాటడు | ఆపసోపాలేలే మనమందరిలో వారము ||
చ|| కొంగాపెవట్టి తియ్యగా కూచుండాతడు లోగాగా | పంగించనేలే మనము పలుమారును |
యెంగిలిమోవిచ్చె నాపె యెనసి శ్రీ వేంకటేశు | డంగదేలేయేలిద్దరట్టే మనములను ||
చూపజెప్పగలభక్తసుజనుడవు మాకు
దాపైనహరి యిట్టె తప్పె దారెననక
కోరి పాండవులయింట గూర లారగించినట్టు
సారపుశబరివిందు చవిగొన్నట్టు
వూరకే మా యింట నీవు వొదవినపాటి నీ
వారగించవయ్య చవు లౌగాములెంచక
తొల్లియు రేపల్లె గొల్లదోమటి దొడికినట్టు
తల్లి అనసూయపాల దనిసినట్టు
చిల్లరైనమాయింట జేసినపా టారగించు
చల్లతోడిబొనమైన చాలు జాలదనక
అంకెల శ్రీవేంకటాద్రి నారగించినయట్టు
కొంకులేక సిరితోడ గోనేటిరాయ
లెంకనయిననాయింటిలేశమైన నారగించు
అంకిమ్చి నీనాలోనిఅంతరము లెంచకా
ప|| చెక్కిటి చే యిక నేల చింతలేల | అక్కరతో నాపె నీ యలపారిచీ గాక ||
చ|| జవ్వనపు సతి తోడి సరసము | చివ్వన నీ మేనెల్లా జెమరింపించె |
పువ్వుల వసంతాలు పొలయాటలూ | నవ్వి నవ్వి నీ మనసు నాము లెక్కింపించె ||
చ|| చక్కెర బొమ్మవంటి యీ సతి పొందులు | చిక్కించి నీకు వలపు చిమ్మిరేగించె |
నిక్కి నిక్కి యాపె జూచె నీ వేడుకలు | చెక్కుల చెనకులయి సిగ్గు విడిపించె ||
చ|| అలమేలు మంగతో నెయ్యపు రతులు | నిలువెల్ల సింగారమై నీకు నమరె |
నెలవై శ్రీ వేంకటేశ నీ తమకము | అలరిన చుట్టరికమై తగిలించె ||
ప|| చెదరక వెలుగే చేనుమేయగజొచ్చె | అదలించి తగదు నీకనువారు వేరీ ||
చ|| చిత్త మింద్రియములచే జిక్కి కడు మద- | మెత్తిన వద్దన నిక వేరీ |
హత్తినమనసు మోహాదులతో గూడి | తత్తరించిన మాన్పదగువారు వేరీ ||
చ|| జీవుడిన్నిటికి దాజిక్కి పోయినత్రోవ | బోవజొచ్చిన బుద్ధిపొలమేది |
శ్రీవేంకటేశుని చింతాపరత గాని | కావగ నాత్మకు గతి దానేది ||
చెప్పినంతపని నేజేయగలవాడనింతే
అప్పటి నపరాధమా ఆదరించవలదా ||
నీ యాజ్గ్య దేహము నేమోచితి నింతే
యీయెడ విగ్యానమేల యియ్యవయ్యా
వేయి వేలై వేగుదాక వెట్టిసేసి సొలసితి
వోయయ్య కొంతైన వూరడించవలదా ||
నీవు సేసే కర్మము నేజేయువాడ నింతె
యీవల నానంద సిఖమియ్యవయ్యా
కోవురమై వెంట వెంట గొలిచిన బంట్లకు
టవుల గొంత వదైనా దప్పిదీర్చ వలదా ||
మతిలో శ్రీవేంకటేశ మనికయినవాడ నింతే
తతి నా ఫటుకు దయదలచ వయ్య
వెతదీర బాలార్చి పెడ్డువెట్టదగదా ||
ప|| చెప్పినంతపని నేజేయగలవాడ నింతే | అప్పటి నపరాధమా ఆదరించవలదా ||
చ|| నీయాజ్ఞ దేహము నేమోచితి నింతే | యీయెడ విజ్ఞానమేల యియ్యవయ్యా |
వేయివేలై వేగుదాకా వెట్టిసేసి యలసితి | వొయ్యన కొంతైన వూరడించ వలదా ||
చ|| నీవుసేసే కర్మము నేజేయువాడ నింతే | యీవల నానాందసుఖ మియ్యవయ్యా |
కోవరమై వెంటవెంట గొలిచినబంట్లకు | తావుల గొంతవడైనా దప్పిదీర్చవలదా ||
చ|| మతిలో శ్రీవేంకటేశ మనికైనవాడ నింతే | తతి నాపాటుకు దయదలచవయ్యా |
యితవై పనిసేసేటి యింటిపసురమునకు | వెతదీర్చ బాలార్చి వెడ్డువెట్టదగదా ||
ప|| చెప్పుడు మాటలే చెప్పుకొనుటగాక | చెప్పినట్ల దాము సేయరెవ్వరు ||
చ|| దొడ్డయిన శరీరదోషమైనయట్టి- | జడ్డు దొలగవేయజాల రెవ్వరును |
గడ్డబడి యీతకాండ్లౌటగాని | వొడ్డునడుమ నీద నోపరెవ్వరును ||
చ|| శ్రీవేంకటేశుపై జిత్తమర్పణసేసి | యీవిధులన్నియు నెడయ రెవ్వరును |
చావుబుట్టుగులేని జన్మముగల సర్వ- | దేవతామూర్తులై తిరుగ రెవ్వరును ||
చెలగి నా కిందుకే చింతయ్యీని
తెలిసినదాకా నిది ద్రిష్టమయ్యీనా.
హరి పుట్టించినదేహి హరినే కొలువక
నరుల గొలుచుట అన్యాయమయ్యా
గరిమ నేరు గుడిచి కాలువ బొగడబోతే
యెరవెరవేకాక యితవయ్యీనా.
దేవుడిచ్చినట్టిబుద్ది దేవునిపయి బెట్టక
భావ మింద్రియాలకియ్య బాపమయ్యా
జీవిత మొకరిసొమ్ము జీవించి యొకరివెంట
ఆఅవల బరువులిడు టందమయ్యీనా.
అరిది శ్రీవేంకటేశు డంతరాత్మయి వుండగాను
శరణనకుండుటనాచారమయ్యా
ధర దనయింట గోటిధన మట్టేవుండగాను
మరలి తిరియబోతే మట్టుపడీనా.
చెలి నీవు మొదలనే సిగ్గరి పెండ్లి కూతురవు
ఇలనింత పచ్చిదేరీ ఇదివో నీ భావము
చెక్కులవెంటా గారె చెమట తుడుచుకోవే
చక్కవెట్టుకొనవే నీ జారిన కొప్పు
అక్కుమీద పెనగొన్న హారాలు చిక్కు దీయవే
ఇక్కువల నీ కోరికె లీడేరెనిపుడు
పెదవి మీద కెంపులబేంట్లు రాలుచుకోవే
చెదరిన ముంగురులు చేత దువ్వవే
వదలిన పయ్యెద చివ్వన బిగించుకొనవే
పదిబదిగా నీనోము ఫలియించె నిపుడు
తిలకము కరగెను దిద్దుకోవే నొసలను
కలసిన గురుతులు గప్పుకొనవే
యెలమి శ్రీవేంకటేశు( డేలె నలమేలుమంగవు
తలచిన తలపులు తలకూడె నిపుడు
ఛ
ఛీ ఛీ నరులదేటి జీవనము కాచుక శ్రీహరి నీవే కరుణింతుగాక
అడవిలో మృగజాతియైన గావచ్చుగాక వడినితరుల గొలువఁగ వచ్చునా
వుడివోని పక్షియైవుండనైనవచ్చుగాక విడువకెవ్వరినైనా వేడవచ్చునా
పసురమై వెదలేని పాటుపడవచ్చుగాక కసివో నొరుల బొగడగావచ్చునా
వుసురుమానై పుట్టి వుండనైనవచ్చుగాక విసువక వీరివారి వేసరించవచ్చునా
యెమ్మెల బుణ్యాలుసేసి యిల యేలవచ్చుగాక కమ్మి హరిదాసుడు గావచ్చునా
నెమ్మది శ్రీ వేంకటేశ నీ చిత్తమేకాక దొమ్ముల కర్మములివి తోయవచ్చునా
జ
జగడపు చనువుల జాజర, సగినల మంచపు జాజర
మొల్లలు తురుముల ముడిచిన బరువున, మొల్లపు సరసపు మురిపెమున
జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే రతివలు జాజర
భారపు కుచముల పైపై కడు సింగారము నెరపేటి గంధవొడి
చేరువ పతిపై చిందగ పడతులు, సారెకు చల్లేరు జాజర
బింకపు కూటమి పెనగేటి చెమటల, పంకపు పూతల పరిమళము
వేంకటపతిపై వెలదులు నించేరు, సంకుమ దంబుల జాజర
ప|| జగతి వైశాఖ శుద్ధ చతుర్దశి మందవార- | మగణితముగ కూడె నదె స్వాతియోగము ||
చ|| పక్కన నుక్కు కంభము పగిలించుక వెడలి | తొక్కి హిరణ్యకశిపు తొడికిపట్టి |
చక్కగా గడపమీద సంధ్యాకాలమున | వక్కలుసేసె నురవడి శ్రీనరసింహుడు |
చ|| పిప్పిగాగ చప్పరించి పేగులు జందేలు వేసి | తొప్పదోగుచు నెత్తురు దోసిట జల్లె |
రొప్పుచు కోపముతో తేరుచు పకపక నవ్వి | తప్పకచూచె వాని నుదగ్ర నరసింహుడు ||
చ|| ఎదుట ప్రహ్లాదుజూచి ఇందిర తొడపైనుంచె | అదన అందరికిని అభయమిచ్చె |
కదిసి శ్రీవేంకటాద్రి గద్దెమీద కూచుండె | వెదచల్లె కృపయెల్ల వీరనరసింహుడు ||
జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు
వెగటునాసోదంబు ఇది నీవెలితో నావెలితో
యెన్నిమారులు సేవించిన కన్నులూ తనియవు
విన్ననీకథామృతమున వీనులు తనియవు
సన్నిధిని మిమ్ము నుతియించి సరుస జిహ్వయు తనియదు
విన్న కన్నది కాదు ఇది నావెలితో నీవెలితో
కడగి నీప్రసాదమే కొని కాయమూ తనియదు
బడి ప్రదక్షిణములు సేసి పాదములు నివి తనియవు
నుడివి సాష్టాంగంబు చేసి నుదురునూ తనియదు
వెడగు(దన మిది గలిగె నిది నావెలితో నీవెలితో
చెలగి నిను నే పూజించి చేతులూ తనియవు
చెలువు సింగారంబు తలచి చిత్తమూ తనియదు
అలరి శ్రీ వేంకటగిరీశ్వర ఆత్మ నను మోహించజేసితి
వెలయ నిన్నుయు దేరె మును నీవెలితో నావెలితో
ప|| జడమతిరహం కర్మజంతురేకో౨హం | జడధినిలయాయ నమో సారసాక్షాయ ||
చ|| పరమపురుషాయ నిజభక్తజనసులభాయ | దురితదూరాయ సింధురహితాయ |
నరకాంతకాయ శ్రీనారాయణాయ తే | మురహరాయ నమో నమో ||
చ|| నగసముద్ధరణాయ నందగోపసుతాయ | జగదంతరాత్మాయ సగుణాయ |
మృగనరాంగాయ నిర్మితభవాండాయ ప- | న్నగరాజశయనాయ నమో నమో ||
చ|| దేవదేవేశాయ దివ్యచరితాయ బహు- | భావనాతీతాయ పరమాయ |
శ్రీవేంకటేశాయ జితదైత్యనికరాయ | భూవల్లభాయ నమో పూర్ణకామాయ ||
ప|| జనులు నమరులు జయలిడగా | ఘనుడదె వుయ్యాలగంభముకాడ ||
చ|| వదలక వలసినవారికి వరములు | యెదురెదురై తానిచ్చుచును |
నిదురలేక పెనునిధినిధానమై | కదల డదే గరుడగంభముకాడ ||
చ|| కోరినవారికి కోరినవరములు | వోరంతప్రొద్దు నొసగుచును |
చేరువయై కృపసేసీ నిదివో | కూరిముల నడిమిగోపురమాడ ||
చ|| వడి వేంకటపతి వరములరాయడు | నుడుగు గాళ్ళు గన్నులు సుతుల |
బడిబడి నొసగును బ్రాణచారులకు | కడిమి నీడదిరుగనిచింతాడ ||
జయ జయ రామా సమరవిజయ రామా
భయహర నిజభక్తపారీణ రామా
జలధి బంధించిన సౌమిత్రిరామా
సెలవిల్లు విరిచిన సీతారామా
అలసుగ్రీవునేలిన అయోధ్యరామా
కలగి యజ్ఞముగాచే కౌసల్యరామా
అరిరావణాంతక ఆదిత్యకులరామా
గురుమౌనులను గాచే కోదండరామా
ధర నహల్యపాలిటి దశరథరామా
హరురాణినుతుల లోకాభిరామా
అతిప్రతాపముల మాయామృగాంతక రామా
సుతకుశలవప్రియ సుగుణ రామా
వితత మహిమల శ్రీవేంకటాద్రిరామా
మతిలోన బాయని మనువంశ రామా
జయజయ నృసింహ సర్వేశ
భయహర వీర ప్రహ్లాదవరద॥
మిహిర శశినయన మృగనరవేష
బహిరంతస్థల పరిపూర్ణ
అహినాయక సింహాసన రాజిత
బహుళ గుణగణ ప్రహ్లాదవరద॥
చటుల పరాక్రమ సమఘనవిరహిత
నిటలనేత్ర మౌని ప్రణుత
కుటిలదైత్యతతి కుక్షి విదారణ
పటు వజ్రనఖ ప్రహ్లాదవరద॥
శ్రీ వనితా సంశ్రిత వామాంక
భావజకోటి ప్రతిమాన
శ్రీ వేంకటగిరిశిఖరనివాస
పావనచరిత ప్రహ్లాదవరద॥
జయమంగళము నీకు సర్వేశ్వరా
జయమంగళము నీకుజలజవాసినికి ||
శరణాగతపారిజాతమా
పొరి నసురలపాలిభూతమా
అరుదయిన సృష్టికి ఆదిమూలమా వో
హరి నమో పరమపుటాలవాలమా ||
సకల దేవతా చక్రవర్తి
వెకలివై నిండిన విశ్వమూర్తి
అకలంకమైన దయానిధీ వో
వికచముఖా నమో విధికివిధి ||
కొలిచినవారల కొంగుపైడి
ములిగినవారికి మొనవాడి
కలిగిన శ్రీవెంకటరాయా
మలసి దాసులమైన మాకు విధేయా ||
ప|| జయము జయము ఇక జనులాల | భయములు వాసెను బ్రదికితి మిపుడు ||
చ|| ఘన నరసింహుడు కంభమున వెడలె | దనుజులు సమసిరి ధరవెలసె |
పొనిసె నధర్మము భూభారమడగె | మునుల తపము లిమ్ముల నీడేరె ||
చ|| గరిమతో విష్ణుడు గద్దెపై నిలిచె | హిరణ్య కశిపుని నేపడచె |
అరసి ప్రహ్లాదుని అన్నిటా మన్నించె | హరుడును బ్రహ్మయు అదె కొలిచేరు ||
చ|| అహోబలేశుడు సిరి నంకమున ధరించె | బహుగతి శుభములు పాటిల్లె |
ఇహపరము లొసగె నిందును నందును | విహరించెను శ్రీవేంకటగిరిని ||
జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి
ప్రియురాలవై హరికిఁ బెరసితివమ్మా
పాలజలనిధిలోని పసనైనమీఁగడ
మేలిమితామరలోని మించువాసన
నీలవర్ణునురముపై నిండిననిధానమవై
యేలేవు లోకములు మమ్మేలవమ్మా
చందురుతోడఁ బుట్టిన సంపదలమెఱుఁగవో
కందువ బ్రహ్మలఁ గాచేకల్పవల్లి
అందినగోవిందునికి అండనే తోడునీడవై
వుందానవు మాఇంటనే వుండవమ్మా
పదియారువన్నెలతో బంగారుపతిమ
చెదరనివేదములచిగురుఁబోడి
యెదుట శ్రీవేంకటేశునిల్లాలవై నీవు
నిదుల నిలిచేతల్లి నీవారమమ్మా
ప|| జలజనాభ హరి జయ జయ | యిల మానేరము లెంచకువయ్యా ||
చ|| బహుముఖముల నీప్రపంచము | సహజగుణంబుల చంచలము |
మహిమల నీ విది మరి దిగవిడువవు | విహరణ జీవులు విడువగ గలరా ||
చ|| పలునటనలయీప్రకృతి యిది | తెలియగ గడునింద్రియవశము |
కలిసి నీ వందే కాపురము | మలినపు జీవులు మానగగలరా ||
చ|| యిరవుగ శ్రీవేంకటేశుడ నీమాయ | మరలుచ నీవే సమర్థుడవు |
శరణనుటకే నే శక్తుడను | పరు లెవ్వరైనా బాపగలరా ||
జవ్వాది మెత్తినది అది తన
జవ్వనమే జన్నె వట్టినది
ముద్దుల మాటలది అది చెక్కు
టద్దముల కాంతి నలరినది
గద్దరి చూపులది అది తన
వొద్ది చెలియమీద నొరగున్నది
పుత్తడి బోలినది అది తన
చిత్తము ని సొమ్ము చేసినది
గుత్తపు గుబ్బలది అది అల
చిత్తజుని లెక్క సేయనిది
ఎమ్మెలు యెఱుగనిది అది తన
కెమ్మోవి జిరునవ్వు గెరలున్నది
కమ్ముకొనగ వెంకటరాయా నీ
కమ్మని కౌగిట గలశున్నది
ప|| జీవు డెంతటివాడు చిత్త మెంతటిది తన- | దైవికము గడప నెంతటివాడు దాను ||
చ|| విడిచిపోవనియాస విజ్ఞానవాసనల | గడచి మున్నాడె నెక్కడివివేకములు |
వుడుగనియ్యనిమోహ ముబ్బి పరమార్థముల | మెడవట్టి నూకె నేమిటికింక నెరుక ||
చ|| పాయనియ్యనిమహాబంధ మధ్యాత్మతో | రాయడికి దొడగై సైరణలేల కలుగు |
మాయనియ్యనికోపమహిమ కరుణామతిని | వాయెత్తనియ్య దెవ్వరికి జెప్పుదము ||
చ|| సరిలేనియాత్మచంచల మంతరాత్మకుని- | నెరగనియ్యదు దనకు నేటిపరిణతులు |
తిరువేంకటాచలాధిపునిమన్ననగాని | వెరసి యిన్నిటి గెలువ వెరవు మఱిలేదు ||
జోఅచ్యుతానంద జోజో ముకుంద
రావె పరమానంద రామ గోవింద
నందు నింటను జేరి నయము మీఱంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగ
నందముగ వారిండ్ల నాడుచుండంగ
మందలకు దొంగ మా ముద్దురంగ
పాలవారాశిలో పవళించినావు
బాలుగా మునుల కభయమిచ్చినావు
మేలుగా వసుదేవు కుదయించినావు
బాలుడై యుండి గోపాలుడైనావు
అట్టుగట్టిన మీగ డట్టె తిన్నాడే
పట్టి కోడలు మూతిపై రాసినాడే
అట్టె తినెనని యత్త యడగ విన్నాడే
గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే
గొల్లవారిండ్లకు గొబ్బునకుబోయి
కొల్లలుగా త్రావి కుండలను నేయి
చెల్లునా మగనాండ్ర జెలిగి యీశాయీ
చిల్లతనములు సేయ జెల్లునటవోయి
రేపల్లె సతులెల్ల గోపంబుతోను
గోపమ్మ మీ కొడుకు మా యిండ్ల లోను
మాపుగానే వచ్చి మా మానములను
నీపాపడే చెఱిచె నేమందుమమ్మ
ఒకని యాలినిదెచ్చి నొకని కడబెట్టి
జగడములు కలిపించి సతిపతులబట్టి
పగలు నలుజాములును బాలుడై నట్టి
మగనాండ్ర చేపట్టి మదనుడై నట్టి
అంగజుని గన్న మా యన్న యిటు రారా
బంగారు గిన్నెలో పాలు పోసేరా
దొంగ నీవని సతులు గొంకుచున్నారా
ముంగిట నాడరా మోహనాకార
గోవర్ధనంబెల్ల గొడుగుగా పట్టి
కావరమ్మున నున్న కంసుపడగొట్టి
నీవు మధురాపురము నేలచేపట్టి
ఠీవితో నేలిన దేవకీపట్టి
అలిగి తృణావర్తు నవని గూల్చితివి
బలిమిమై బూతన బట్టి పీల్చితివి
చెలగి శకటాసురుని జేరి డొల్చితివి
తలచి మద్దులు రెండు ధరణి వ్రాల్చితివి
హంగుగా తాళ్ళపా కన్నయ్య చాల
శృంగార రచనగా చెప్పెనీ జోల
సంగతిగ సకల సంపదల నీవేళ
మంగళము తిరుపట్ల మదనగోపాల
జోజో దీనజనావనలోలా
జోజో యదుకుల తిలకా గోపాలా // పల్లవి //
వేదములు రత్నాల గొలుసులై యమర
వేదాంత మపరంజి తొట్లగా నమర
నాదము ప్రణవము పాను పై యమర
ప్రణవార్థమై యిచ్చట పవ్వళింపు స్వామీ // జోజో //
అతి చిత్రముగఁబది యవతారములబ్రోవ
అమరుచు పదినాల్గు జగములఁ బ్రోవఁ
బ్రతి యుగమున జనియించు మిగుల
ప్రబలి జన్మరహితుండనుకొన్న స్వామీ // జోజో //
శాంతియు మణిమయ మకుటమై మెఱయ
శక్తులు మహాహారంబులై మెఱయ
దాంతియుఁ గుసుమమాలికయై మెఱయ
ధరలో శ్రీవేంకటేశ రమణుడౌస్వామీ ! // జోజో //
ప|| జ్ఞానయజ్ఞమీగతి మోక్షసాధనము | నానార్థములు నిన్నే నడపె మాగురుడు ||
చ|| అలరి దేహమనేటి యాగశాలలోన | బలువై యజ్ఞానపుపశువు బంధించి |
కలసి వైరాగ్యపుకత్తుల గోసికోసి | వెలయు జ్ఞానాగ్నిలో వేలిచె మాగురుడు ||
చ|| మొక్కుచు వైష్ణవులనేమునిసభ గూడపెట్టి | చొక్కుచు శ్రీపాదతీర్థ సోమపానము నించి |
చక్కగా సంకీర్తనసామగానము చేసి | యిక్కువతో యజ్ఞము సేయించెబో మాగురుడు ||
చ|| తదియ్యగురు ప్రసాదపు పురోడాశమిచ్చి | కొదదీర ద్వయమనుకుండలంబులు వెట్టి |
యెదలో శ్రీవేంకటేశు నిటు ప్రత్యక్షముచేసె | యిదివో స్వరూపదీక్ష యిచ్చెను మా గురుడు ||
జ్ఞానులాల యోగులాల సకలవిరక్తులాల
నానావిహాల విని నమ్మేరు సుండి
అలరియింతులయధరామృతము లివియెల్ల
కాలకూటవిషములకరణి సుండి
శీలముతో వీరలచెట్టలు వట్టుటలెల్లా
బాలనాగాల దొడికి పట్టుట సుండి
కాంతలు నవ్వుచునైనా గన్నుల జూచినచూపు
పంతమున నలుగులపాతర సుండి
బంతుల నెదుటనున్న పడతులచన్ను లివి
కంతల నొడ్డినబడిగండ్లు సుండి
జవ్వనపుగామినులసరసపుమాటలెల్లా
మవ్వమైనయట్టిచొక్కు మంత్రాలు సుండి
యివ్వలను శ్రీవేంకటేశ్వరుదాసుల కివి
చివ్వన జెప్పినట్టు చేసేవి సుండి
డ
డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం ॥పల్లవి॥
మీనకూర్మ వరాహా మృగపతిఅవతారా
దానవారే గుణశౌరే ధరణిధర మరుజనక ॥డోలా॥
వామన రామ రామ వరకృష్ణ అవతారా
శ్యామలాంగా రంగ రంగా సామజవరద మురహరణ ॥డోలా॥
దారుణ బుద్ద కలికి దశవిధఅవతారా
శీరపాణే గోసమాణే శ్రీ వేంకటగిరికూటనిలయ 2 ॥డోలా॥
త
ప||
తందనాన ఆహి తందనాన పురె |
తందనాన భళా తందనాన ||
చ||
బ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే |
పరబ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే ||
చ||
కందువగు హీనాధికము లిందు లేవు |
అందరికి శ్రీహరే అంతరాత్మ |
ఇందులో జంతుకులమింతా నొకటే |
అందరికి శ్రీహరే అంతరాత్మ ||
చ||
నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే |
అండనే బంటునిద్ర అదియు నొకటే |
మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటే |
చండాలు డుండేటి సరిభూమి యొకటే ||
చ||
అనుగుదేవతలకును అలకామ సుఖమొకటే |
ఘనకీట పశువులకు కామ సుఖమొకటే |
దినమహో రాత్రములు తెగి ధనాఢ్యునకొకటే |
వొనర నిరుపేదకును వొక్కటే అవియు ||
చ||
కొరలి శిష్టాన్నములు గొను నాకలొకటే |
తిరుగు దుష్టాన్నములు తిను నాకలొకటే |
పరగ దుర్గంధములపై వాయువొకటే |
వరుస బరిమళముపై వాయువొకటే ||
చ||
కడగి యేనుగు మీద గాయు యెండొకటే |
పుడమి శునకము మీద బొలయు నెండొకటే |
కడు బుణ్యులను బాప కర్ములను సరిగావ |
జడియు శ్రీ వేంకటేశ్వర నామమొకటే ||
తగిలనమును లేయాతని గందురంటా
మగువ యెవ్వరితోడ మాటాడదిపుడు ||
అతుల నిరాహరులాతనికి బ్రియులంటా
అతివ నిన్నటినుండి యారగించను
తతినడపుల నుండి తపసు లేయతనికి
హితులంటా వనములో నెడయ దీ తరుణి ||
తలకొన్న యతనిపై తలపే పరమంటా
చెలియ చెక్కిటనున్న చెయి దియ్యదు
వలనైన యాతడు దేవతల కొడయడంటా
కలికి రేయిబగలు కనుముయ్యదిపుడు ||
అడరిజలములోన నతడుండునంటా
వడియు జెమట దుడువదు మేనను
కడు మంచియతడు వేంకటగిరి విభుడంటా
పడతి యాతనినె గుబ్బలనోత్తనిపుడు ||
ప|| తగుతగు నీ దొరతనము లిక | వెగటు లన్నియును వేడుకలాయ ||
చ|| విరసపు తిట్లు వేవేలు దిట్టిన | సరసపు వేళల చవులాయ |
యెరవుల చేత నీ వేమి సేసినా | సరినా కౌగుట చందములాయ ||
చ|| బొమ్మ జంకెనలు పొరి నెన్నైనా | నమ్మితి చితే చవులాయ |
దిమ్మరివై యెందు దిరిగి వచ్చినా | నెమ్మి నన్నేలగా నేరుపులాయ ||
చ|| అంగము లలయగ నంటబెనగినా | సంగడి రతులను చవులాయ |
రంగు శ్రీ వేంకటరమణ నన్నెనసితి- | వెంగిలి మోవుల కిచ్చకమాయ ||
తగుదువమ్మ నీ వందపుమరుతండ్రికి
మొగిదచ్చి నమృతము మోవి నుంది గాన
కోమలి నీ జవ్వనము కొలదివెట్టగరాదు
ప్రేమమున మీద మీద పెరిగీ గాన
ఆమని నీ సింగార మంతైంత అనరాదు
వేమారు నీ చూపు వెల్లివిరిసీ గాన
తొయ్యలి నీ వొరపులు తులదూచి చెప్పరాదు
నెయ్యపు నీ తురుమిదె నిక్కీ గాన
చయ్యన నీ సొబగులిచ్చుట నియమించరాదు
అయ్యన నీ పిరుదునకలవి లేదు గాన
వనిత నీ భావమింక వర్ణించి పలుకరాదు
కొన నీ పాదములు చిగురులు గాన
తనరు నీ భాగ్యము తలచ నలవి కాదు
ఘనుడు శ్రీవేంకటేశు కలసితివి గాన
ప|| తతిగని తతినేల తమకించరే | మతిలోని నొప్పి గొంత మాన నియ్యరే ||
చ|| పతిబాసి వున్నదాన బలువిరహపు వేళ | యితవంటా విరులు నాకేల యిచ్చేరే |
రతిరాజు నమ్ములివి రంట దెప్పరపు వెళ | కతుకున నాటుజేసు గవిశన నిడరే ||
చ|| కందువ జవ్వనమున గావరించి వున్నవేళ | యిందమంటా గందము నాకేల పూసేరే |
మంద మారుతాన కవి మచ్చు చల్లే చొక్కుమందు | యిందుకేల పెట్టె గట్టి యింటిలోన నిడరే ||
చ|| శ్రీ వేంకటేశువొద్ద సిగ్గుపడి వున్నదాన | చేవదేర నిప్పుడేమి సింగారించేరే |
యీవల నాతడు గూడె యీసొమ్ము లిన్నియును | వేవే లాతడిచ్చినవె వేగిర పడకురే ||
తత్తాడి గుడి ధింధిం తకధింధిం
తిత్తి తిత్తితి తితి తితి తితి||
దానవవదన వితానదాన సం-
ధాన రుధిర నిజపాన మిదం |
నానా భూత గణానాం గానం
దీన జనానాం తిత్తితి తితి ||
విమత దనుజమత విభవపరిభవిత
సమధికం తవ శౌర్య మిదం |
ప్రమదా భవ్యం ప్రమదాభరణం
తిమిర నిరసనం తిత్తితి తితి ||
తిరువేంకటగిరి దేవనిధానం
పరమామృతరస భాగ్యమిదం |
కరుణావరణం కమలా ధటనం
తిరొ తిరొ తిత్తితి తితి తితి ||
తన మేలెచూచు గాక తరుణుల యెడలను
యెనలేని మగవాని నేమనగ వచ్చును ||
మంత నాన నాకె నీవు మాటలాడే చోటికి
వింతది రా సిగ్గుగాదా విచారించితే
చెంత నీ వెదెర గక చెలి నిందుకు బిల్చేవు
యెంతైనా మగవాని కెక్కడిది తగవు ||
గారవాన నాకె నీవు కాగిలించ కుండ గాను
మారు సతితో తొంగిచూడ గోరము గాదా
ఆరీతి వాకిట నుంటే ఆపె దెమ్మనేవు వీడె
మారజవు మగవాడు ఆదికెకు లోగునా ||
శ్రీవేంకటేశుడ ఆకె చెయి పట్టి పెండ్లాడగా
సేవ సేయ నొకతెకు సెగ్గెము గాదా
యీ వల నన్నేలితివి యీపె నాపె గూడితివి
కావరపు మగవాని కతలిట్టే కాదా ||
ప|| తనకర్మమెంత చేతయు నంతే | గొనకొన్న పని యంత కూలే నంతే ||
చ|| తలపులో హరి నెంత దలచె నేడే వాని- | కలిమియు సుఖమును గలదంతే |
తలదూచ బైడెంత తూకము నంతే | నెలకొన్నపిండెంత నిప్పటీ నంతే ||
చ|| సిరివరుపూజెంత సేసె నేడే వాని- | దరియును దాపు నెంతయు నంతే |
పురిగొన్న యీవెంత పొగడూ నంతే | నరపతిచనవెంత నగవూ నంతే ||
చ|| శ్రీ వేంకటపతి చింత యంత నేడే | భావపరవశము పలుకూ నంతే |
దైవము కృప యంత తానూ నంతే | యేవంక జయమెంత యిరవూ నంతే ||
ప|| తనకర్మవశం బించుక, దైవకృతం బొకయించుక, | మనసువికారం బించుక, మానదు ప్రాణులకు ||
చ|| ఈదైన్యము లీహైన్యము లీచిత్తవికారంబులు | యీదురవస్థలు గతులును యీలంపటములును |
యీదాహము లీదేహము లీయనుబంధంబులు మరి | యీదేహముగలకాలము యెడయవు ప్రాణులకు ||
చ|| యీచూపులు యీతీపులు నీనగవులు నీతగవులు- | నీచొక్కులు నీసొక్కులు నీవెడయలుకలును |
యీచెలుములు నీబలువులు నీచనువులు నీఘనతలు- | నీచిత్తముగలకాలము యెడయవు ప్రాణులకు ||
చ|| యీవెరవులు నీయెరుకవులు యీతలపులు నీతెలుపులు | దైవశిఖామణితిరుమల దేవునిమన్ననలు |
దైవికమున కిటువగవక తనతల పగ్గలమైనను | దైవము తానౌ తానే దైవంబవుగాన ||
ప|| తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు | మనసు చంచల బుద్ధి మానీనా ||
చ|| జడ్డు మానవుడు చదువ జదువు నాస | వడ్డివారుగాక వదలీనా |
గుడ్డికుక్క సంతకుబోయి తిరిగిన | దుడ్డు పెట్లే కాక దొరకేనా ||
చ|| దేవదూషకుడై తిరిగేటి వానికి | దేవతాంతరము తెలిసీనా |
శ్రీవేంకటేశ్వరు సేవాపరుడుగాక | పావనమతియై పరగీనా ||
ప|| తనదీగాక యిందరిదీగాక | తనువెల్ల బయలై దరిచేరదు ||
చ|| కడుపూ నిండదు కన్నూ దనియదు | కడగి లోనియాకలియు బోదు |
సడిబడి కుడిచినకుడుపెల్ల నినుము- | గుడిచిననీరై కొల్లబోయె ||
చ|| చవియూ దీరదు చలమూ బాయదు | లవలేశమైన నొల్లకపోదు |
చివచివ నోటికడవలోనినీరై | కవకవ నవియుచు గారీని ||
చ|| అలపూ దోపదు అడవీ నెండదు | యెలయించుభంగమయిన బోదు |
తెలిసి వేంకటగిరిదేవుని దలపించు- | తలపైన దనకు ముందర నబ్బదు ||
తనలోనుండిన హరిఁ దాగొలువడీ దేహి
యెనలేక శరణంటే నితడే రక్షించును
కోరి ముదిమి మానుపుకొనేయాస మందులంటా
వూరకే చేదులుదిన నొడబడును
ఆరూఢి మంత్రసిధ్ధుడనయ్యేననే యాసలను
ఘోరపు పాట్లకు గక్కున నొడబడును
యిట్టె యక్షిణిఁ బంపు సేయించుకొనేయాసలను
వొట్టి జీవహింసలకు నొడబడును
దిట్టతనమున తా నదృశ్యము సాధించేయాస
జట్టిగ భూతాల పూజించగ నొడబడును
చాపలపు సిరులకై శక్తి గొలిచేయాసను
వోపి నిందలకునెల్లా నొడబడును
యేపున శ్రీవేంకటేశు డేలి చేపట్టినదాకా
ఆపరానియాస నెందుకైనా నొడబడును
ప|| తనవారని యాస దగిలి భ్రమయనేల | తనువు బ్రాణునికంటె తగులేది ||
చ|| తనువు బ్రాణుడు రెండు తగిలి గర్భమునందు | వొనర నేకమై యుదయించి |
దినములు చెల్లిన తివిరి యాప్రాణుడు | తనువు విడిచిపోయ దయలేక ||
చ|| ప్రాణికై దేహము పాపపుణ్యముసేయు | ప్రాణి వెంటనె బొంది పాశుండగు |
ప్రాణి యచ్చటనైన బాధల బడకుండ | ప్రాణి రక్షించు బొందిబడి దా బోయనా ||
చ|| యెరవుల దేహాలివి నిజమని నమ్మి | యెరిగీనెరుగలే రిది యాలా |
అరయ బరమునకు నాదిపురుషుడై | పరగు శ్రీ వేంకటపతి గలిగుండగా ||
ప|| తనవారలు పెరవారలు దాననియెడి వాడెవ్వడు | తమగుణముల దిగవిడిచిన ధన్యుడాతడెపో ||
చ|| తెగబడి మదనసముద్రము దేహముతోడనె దాటిన- | విగతభయుండత డెవ్వడు వీరుండెవ్వడొకో |
పగగొని పంచేంద్రియముల ప్రాణముతోడనె బతికి | జగదేకప్రీతుండగు చతురుండాతడెపో ||
చ|| యేచినపరితాపాగ్నుల నేమియు నొవ్వక వెడలిన | ధీచతురుండతడెవ్వడు ధీరుండెవ్వడొకో |
చూచినమోహపుజూపుల జురుచూండ్ల కెడమియ్యని | రాచరికపు నెరజాణుడు రసికుండాతడెపో ||
చ|| చావుకుసరియగు ద్రవ్యవిచారపు తగులుల బాసిన- | పావనుడెవ్వడు బహుజన్మ బాంధవుడెవ్వడొకో |
శ్రీవేంకటగిరినాథుని చిత్తములోపల నిలిపిన- | దేవసమానుడు నాతడె ధీరుడు నాతడెపో ||
తనసొమ్మీడేరించక తా మానీనా
పెనగుచు నేమూరకే బిగిసేముగాక.
భూమితో బ్రపంచమెల్ల బుట్టించిన దేవుడు
ఆమీదిపారుపత్యాన కందుకోపడా
నామమాత్రజీవులము నడుమంతరాల వచ్చి
నేము గర్తలమనుచు నిక్కేముగాక.
యెనలేక యెదిరికి ఇనుమడిచేవారికి
తనతగర మడువ దడవయ్యీనా
గునిసి సంసారపుకొండనే మోచేనంటా
తినికేమిదియు వట్టి దీమసముగాక.
చిత్తములో నున్నట్టి శ్రీవేంకటేశ్వరుడు
మత్తిల్లి నను గావక మానబోయ్యీనా
కొత్తగా నీతని నేడు కొలిచేమనుచు నేము
తత్తరపుస్వతంత్రాన దగిలేముగాక.
ప|| తనివి దీరక నను తమకమున నెంతేని | చెనకేవు వద్దు నీ చిత్తమిక నోరి ||
చ|| దంటవై నాచేత దలపించు కొనగ దొర- | కొంటి వింక నిది నీకు కొలది బడునా |
నంటున నాప్రియము నాటిలను నిన్ను నా- | వెంట ద్రిప్పక నిన్ను విడుతునా వోరి ||
చ|| గబ్బివై నావాలు గనుగొనల నవ్వులకు | నుబ్బేవు నీవు నీ వొడబడికల |
నిబ్బరపు నా వలపు నెలకొన్నయపుడేని | అబ్బురంబగు గర్వమణచనా వోరి ||
చ|| మెట్టుకొని నీవు నా మెఱుగు బయ్యద చెఱగు | పట్టేవు నీకు నీ పరిణామమా |
దిట్టవై కూడితివి తిరువేంకటేశ్వరుడ | యిట్టట్టు నిన్ను బోనిత్తునా వోరి ||
ప|| తనిసితి నన్నిటాను తాలిమే మేలిమాయ | యెనసిన సంతసములిక నెన్నడే ||
చ|| ఆసలనే కొంతవద్దు అంగమంటి కొంతవొద్దు | బాసజేసి కొంతవొద్దు భ్రమయించెను |
వాసికి సరసమాడ వయసు వోయీనేమో | యీసు దీర మన్నించేదిక నెన్నడే ||
చ|| మోము చూపి కొంత వొద్దు మొక్కులాడి కొంత వొద్దు | నాముదేర నవ్వి కొంత నాలి సేసెను |
ఆమని గుంటెన మాటలాడగనే తెల్లవారె | యీమేర నన్నుగూడేదిక నెన్నడే ||
చ|| చేయివేసి కొంత వొద్దు సేసవెట్టి కొంతవొద్దు | యీయెడ గాగిట గూడె నీపొద్దు |
పాయపు శ్రీ వేంకటాద్రిపతి కింతా సెలవాయ | యేయెడ జొక్కదుగాక యిక నెన్నడే ||
ప|| తప్పదు తప్పదు దైవముకృప యిది | ముప్పిరి నింతా ముకుందుడే ||
చ|| వెక్కసపుమతి వెలుతులుదీరిన- | నెక్కడ చూచిన నీశ్వరుడే |
గుక్కక యాసలు గోసివేసినను | నిక్కమడుగడుగు నిధానమే ||
చ|| పొంచి శరీరపుభోగము లుడిగిన | చుంచుబాపములు సుకృతములే |
దంచెడి విషయపు తగులము బాసిన | యెంచిచూచినను యిహమే పరము ||
చ|| శ్రీవేంకటపతి సేవే కలిగిన | వేవేలువగలు వేడుకలే |
చేవదీరె సందియము లేదిదే | భావమునమ్మిన ప్రపన్నులకు ||
ప|| తప్పదోయవే దైవశిఖామణీ | యిప్పుడు నీకృప నెనసితి నేను ||
చ|| అనలము బొడగని యటునిటు మిడుతలు | కినిసి యందు మగ్గినయట్లు |
అనువగువిజ్ఞాన మాత్మ వెలుగగ | మొనసి యింద్రియములు మూగీ నాకు ||
చ|| అఱిమురి గమలము లటు వికసించిన | మెఱసి తుమ్మిదలు మించుగతి |
తఱి నాహృదయము తగవికసించిన | తఱమీ నజ్ఞానతమ మది నాకు ||
చ|| యీరీతి శ్రీ వేంకటేశ్వర యిన్నియు | నూరకే యుండగా నొదిగియుండె |
నేరిచి నీభక్తి నిలుపగ మదిలో | చేర గతిలేక చిమిడీ నదివో ||
ప|| తప్పించుకొనరానిదిక దైవమేగతి | యెపుడు నుద్ధరించే వారెవ్వరునులేరు ||
చ|| మలసి దేహానందమే మరిగిన యాత్మకు | తొలుత బ్రహ్మానందము దొరకదు |
అలవాటై క్షుద్రభోగాలందు జిక్కినయాత్మకు | బలిమి విరతి బొంద బలపడదు ||
చ|| సర్వదా బ్రహ్మాండములో జరియించే యాత్మకు | నిర్వహించి వెడలగనేరుపు లేదు |
వుర్విలోపల చింతలుడగని యాత్మకు | నిర్వికారభారము నెలకొనదు ||
చ|| విరస వర్తనలనే వెలసేటియాత్మకు | మరగ బెద్దలమీది భక్తిపుట్టదు |
ధరలో ఆ వేంకటేశుదాసుడు గాని యాత్మకు | వెరపేమిటాలేదు వెదకి చూచినను ||
ప|| తరుణి మేనికిని నీ తనువె మాటు | నిరుతపుటాసకు నిండు జూపె మాటు ||
చ|| చెలియ సిగ్గులకు చెక్కు చేయే మాటు | పలుకులకును మోవి పండే మాటు |
నెలకొన్న చింతలకు నివ్వెరగే మాటు | బలు జవ్వనమునకును పయ్యెదే మాటు ||
చ|| ముంచిన నవ్వులకును మొక్కులివే మాటు | మంచి నడపులకు మట్టెలే మాటు |
వంచిన శిరస్సునకు వాలుగొప్పే మాటు | కొంచని చనులకు కొనగోరే మాటు ||
చ|| పొందుల రతులకును పుక్కిటి విడెమే మాటు | అందిన వేడుకకౌ నాయములె మాటు |
విందుల రతులకు వేవేలు వలపులె మాటు | యిందుముఖికై శ్రీ వేంకటేశ నీ యింపె మాటు ||
తరుణినీయలుకకెంతటిది ఇంతినీ వేళ
కరుణించగదర వేంకటశైలనాథ
ఒకమారు సంసారమొల్ల బొమ్మని తలచు
ఒక మారు విధిసేతలూహించి పొగడు
ఒక మారు తనుజూచి వూరకే తలవూచు
నొకమారు హర్షమున నొందిమేమఱచు
నినుజూచివొకమారు నిలువెల్ల పులకించు
తనుజూచి వొకమారు తలపోసి నగును
కనుదెరచి నినుజూచి కడు సిగ్గువడి నిలిచి
యిన్నియును తలపొసి యింతలో మఱచు
వదలైన మొలనూలు గదియించు నొకమారు
చెదరిన కురులెల్ల చెరుగునొకమారు
అదనెరిగి తిరువేంకటాధీశ పొందితివి
చదురుడవునిను బాయ జాలదొకమారు
ప|| తలగరో లోకులు తడవకురో మమ్ము | కలిగినదిది మాకాపురము ||
చ|| నరహరి కీర్తన నానిన జిహ్వ | వొరుల నుతింపగ నోపదు జిహ్వ |
మురహరు పదముల మొక్కిన శిరము | పరుల వందనకు బరగదు శిరము ||
చ|| శ్రీపతినే పూజించిన కరములు | చోపి యాచనకు జొరవు కరములు |
యేపున హరికడ కేగిన కాళ్ళు | పాపుల యిండ్లకు బారవు కాళ్ళు ||
చ|| శ్రీ వేంకటపతి జింతించు మనసు | దావతి నితరము దలచదు మనసు |
దేవుడతని యాధీనపు తనువు | తేవల నితరాధీనము గాదు ||
ప|| తలచిన హృదయము ఝల్లను తరుణీమణి వొయ్యారము |
కలిగీనా యిక నొకపరి కన్నుల జూడగను ||
చ|| మోమరవాంచీ పాదాంగుట మున నేలనొయ్యన వ్రాయుచును |
కోమలి కన్నీరెడ గ్రక్కును |
వేమరు నాదెస జూచిటు |
వీడ్కొన నొల్లని భావము ||
చ|| చెక్కిట చేయిడి అలసతచే వదనము కడువాడగ |
వెక్కసమగు డగ్గుత్తిక వేడుక నణపుచును |
అక్కర తీరగ నాతోనాడిన సొలపుల మాటలు |
యెక్కువ పొగలుచు ధైర్యంబేగతి నిలుపుదును ||
ప|| తలచినవన్నియు దనకొరకే వెలి | దెలియుట దనలో దెలియుటకొరకే ||
చ|| ఉదయమందుట భవముడుగుటకొరకే | చదువుట మేలువిచారించుకొరకే |
బ్రదుకుట పురుషార్థపరుడౌటకొరకే | యెదిరి గనుట తన్నెరుగుటకొరకే ||
చ|| తగులుట విడివడదలచుటకొరకే | నొగలుట కర్మమనుభవించుకొరకే |
చిగురౌట కొమ్మయి చెలగుటకొరకే | బెగడుట దురితము పెడబాయుకొరకే ||
చ|| యీవల జేయుట ఆవలికొరకే | ఆవలనుండుట యీవలికొరకే |
యీవలనావల నెనయ దిరుగుటెల్ల | శ్రీవేంకటేశ్వరు జేరుటకొరకే ||
ప|| తలప వెనక నుయ్యి తగరు ముందట దీన | దొలగ నాకు దెరువుదోప దేమిసేతు ||
చ|| మమకారము విముక్తిమార్గదూరము నీపై | మమతసేయక నాకు మనరాదు |
మమత మేలో నిర్మమత మేలో దీని- | క్రమమునక్రమము నే గాన నేమిసేతు ||
చ|| కర్మమార్గము జన్మగతికి జేరువు ని- |ష్కర్మము పాతకమునకు దొడవు |
కర్మి గావలెనో నిష్కర్మి గావలెనో యీ- | మర్మంపుమదము మాన దేమిసేతు ||
చ|| శరణాగతరక్షకుడవైనయట్టి- | తిరువేంకటగిరిదేవుడా |
పరిపూర్ణుడవో నీవు పరిచ్ఛిన్నుడవో ని- | న్నరసి భజింపలేనైతి నేమిసేతు ||
ప|| తలపు కామారుతత్త్వముమీద నలవడిన- | నిల నెట్టివారైన నేలాగు గారు ||
చ|| ఓలి నిరువురుసతుల నాలింగనముసేయ | లోలుడటుగాన నాలుగుచేతులాయ |
వేలసంఖ్యలుసతుల వేడుకల రమియింప | బాలుపడెగాన రూపములు పెక్కాయ ||
చ|| పొలయలుక కూటములభోగి దానటుగాన | మలసి యొక్కొకవేళ మారుమొగమాయ |
లలిత లావణ్య లీలావిగ్రహముగాన | కొలదివెట్టగరానిగోళ్ళు నిడుపాయ ||
చ|| చిరభోగసౌఖ్యముల జెంద ననుభవిగాన | తిరువేంకటాచలాధీశ్వరుండాయ |
పరగ సంసారసంపదకు బద్ధుడుగాన | అరుదుగా సకలాంతరాత్మకుడాయ ||
ప|| తలపులోపలితలపు దైవమితడు | పలుమారు బదియును బదియైనతలపు ||
చ|| సవతైనచదువులు సరుగ దెచ్చినతలపు | రవళి దరిగుబ్బలిని రంజిల్లుతలపు |
కవగూడి గోరు భూకాంతముంగిటితలపు | తివిరి దూషకు గోళ్ళ దెగటార్చుతలపు ||
చ|| గొడుగువట్టినవాని గోరి యడగినతలపు | తడబడక విప్ప్రులకు దానమిడుతలపు |
వొడసి జలనిధిని గడగూర్చి తెచ్చినతలపు | జడియక హలాయుధము జళిపించుతలపు ||
చ|| వలపించి పురసతులవ్రతము చెరిచినతలపు | కలికితనములు చూపగలిగున్నతలపు |
యిల వేంకటాద్రిపై నిరవుకొన్నతలపు | కలుషహరమై మోక్షగతిచూపుతలపు ||
ప|| తలపోత బాతె తలపులకు దమ- | కొల దెరంగనిమతి గోడాడగా ||
చ|| ఆపదలు బాతె అందరికిని దమ- | చాపలపుసంపదలు సడిబెట్టగా |
పాపముల బాతె ప్రాణులకును మతి | బాపరానియాస దమ్ము బాధించగా ||
చ|| జగడాలు బాతె జనులకును దమ- | పగలైనకోపాలు పైకొనగా |
పగలుబాతె వలలబెట్టెడి తమ్ము | దగిలించు మమత వేదనముసేయగా ||
చ|| భయములు బాతె పరులకును తమ- | దయలేక అలయించుధనముండగా |
జయములు బాతె సతతమును యింత- | నయగారివేంకటనాథు డుండగాను ||
ప|| తలమేల కులమేల తపమే కారణము | ఎలమి హరిదాసులు ఏజాతి యైననేమి ||
చ|| పంకములో పుట్టదా పరిమళపు తామెర | పొంక కీటములందు పుట్టదా పట్టు |
కొంకక శ్రీ వేంకటేశు కొలిచిన దాసులు | సంకెలేని జ్ఞానులు లెందు జనియించిరి ||
చ|| కాకము వల్ల పుట్టదా ఘన యశ్వర్థము | దాకొని గుల్లలో పుట్టదా ముత్తెము |
చౌకైన విషలతనె జనియించదా నిర్విషయము | యేకడ మహానుభావు లెందు పుట్టిరేమి ||
చ|| చిడిపి రాళ పుట్టవా చెలువైన వజ్రములు | పుడమి నీగల వల పుట్టదా తేనె |
వెడగు పిల్లి మేనను వెళ్ళదా జవ్వాది | పుడివోని పుణ్యులెందు నుదయించి రేమి ||
ప|| తహతహలిన్నిటికి తానే మూలము గాన | సహజాన నూరకున్న సంతతము సుఖము ||
చ|| భారమైపదివేలుపనులు గడించుకొంటే | సారెసారె నలయించకపోవు |
తీరనియాసోదము దేహములో నించుకొంటే | వూరూర దిప్పితిప్పి వొరయకమానవు ||
చ|| వుండివుండి కిందుమీదు వుపమ జింతించుకొంటే | వుండుబో మంచముకింద నొకనూయి |
కొండంతదొరతనము కోరి మీద వేసుకొంటే- | నండనే యాబహురూపమాడకపోదు ||
చ|| మనసురానివైన మంచిని చేసుకొంటే | తినదిన వేమైన దీపవును |
తనిసి శ్రీవేంకటేశు దాసానుదాసుడైతే | యెనయుచు నేపనికెదురే లేదు ||
ప|| తానె తానే యిందరి గురుడు |
సానబట్టిన భోగి జ్ఞాన యోగి ||
చ|| అపరిమితములైన యజ్ఞాల వడిజేయ | బ్రపన్నులకు బుద్ధి వచరించి|
తపముగా ఫల పరిత్యాగము సేయించు |
కపురుల గరిమల కర్మయోగి ||
చ|| అన్నిచేతలును బ్రహ్మార్పణవిధి జేయ | మన్నించు బుద్ధులను మరుగజెప్పి ||
ఉన్నతపదమున కొనరంగ గరుణించు | పన్నగశయనుడే బ్రహ్మయోగి ||
చ|| తనరగ గపిలుడై దత్తాత్రేయుడై |
ఘనమైన మహిమ శ్రీ వేంకటరాయడై |
వొనరగ సంసార యోగము గృపసేయు | అనిమిషగతుల నభ్యాసయోగి ||
తానెంత బ్రదుకెంత దైవమా నీమాయయెంత
మానవుల లంపటాలు మరి చెప్పగలదా ||
చెలగి నేల బారేటి చీమసయితమును
కలసి వూరకే పారుగమ్మర నెందో మరలు
తలమోచి కాపురము ధాన్యములు గూడబెట్టు
యిల సంసారము దనకిక నెంతగలదో ||
యేడో బాయిట బారే యీగ సయితమును
వాడుదేర నడవుల వాలి వాలి
కూడపెట్టు దేనెలు గొందుల బిల్లలబెట్టు
యేడకేడ సంసారమికనెంతో గలదో ||
హెచ్చి గిజిగాండ్లు సయితమెంతో గూడువెట్టు
తెచ్చి మిణుగురు బురువు దీపము పెట్టు
తచ్చి శ్రీవేంకటేశ నీదాసులు చూచినగుచు
రిచ్చలదాని సంసార మికనెంతగలదో ||
ప|| తానెట్లున్నాడో తరుణి వినిపించనే | కానక నినుగన్న నతినిగన్నట్లు నాయనే ||
చ|| కొణతవడి దనపేరు కోరి నాయకదలంతునే | కొంతవడి తనసుద్దులు కొమ్మలచే విందునే |
కొంతవడి తానున్న కొలువు చిత్తరువు చూతు | కొంత యీరీతిబొద్దు గడుపుదునే నేను ||
చ|| మదినొక్కవేళ దనమాట దలపోతునే | కదిసి యొకవేళ దన్నుగలలోన గందునే |
పదములనె వొకవేళ యెదురు నడతునేదనకు | మదినిట్లు దినదినము దొబ్బుదునే నేనూ ||
చ|| నగినములు చూచుచు నే జరపుదునే వొకగదియ | వగలదనుదూరి లేకలువ్రాతు గొంతదడ |
జిగి నింతలో గూడె శ్రీవేంకటేశ్వరుడు | మగిడి యల్లాడ నపుడు మలగుపయినిపుడూ ||
ప|| తానే కాకెవ్వరు మాకు దాతయు దైవము తన- | లోన బెట్టుకొని మాకు లోనైనవాడు ||
చ|| చదివించి కూడువెట్టి జారకుండ నిల్లుగట్టి | బెదురులేని బుద్ధి పిన్ననాడే చెప్పి |
యెదిరి నడిగి ద్రవ్యమిది గొమ్మనుచు నిచ్చి | పదిలమై తమ్ము బాలించినవాడు ||
చ|| మోహవియోగమ్ము మోహానురాగమ్ము | దేహవిభాగంబు దెలిపిన కలికి |
ఐహికమున వేంకటాధీశుడై సర్వ- | దేహరక్షకుడై తిరుగుచున్నాడు ||
ప|| తానే తెలియవలె తలచి దేహి తన్ను | మానుపువారలు మరి వేరీ ||
చ|| కడలేనిభవసాగరము చొచ్చినతన్ను | వెడలించువారలు వేరీ |
కడుబంధములచేత గట్టుపడినతన్ను | విడిపించువారలు వేరీ ||
చ|| కాగినినుమువంటి కర్మపుతలమోపు- | వేగు దించేటివారు వేరీ |
మూగినమోహపుమూకలు తొడిబడ | వీగదోలేటి వారలువేరీ ||
చ|| తిరువేంకటాచలాధిపుని గొలువుమని | వెరవుచెప్పెడువారు వేరీ |
పరివోనిదురితకూపముల బడకుమని | వెరవుచెప్పెడివారు వేరీ ||
ప|| తాపలేక మేడ లెక్కదలచేము | యేపులేని చిత్తముతో యీహీహీ నేము ||
చ|| ఎఱుకమాలినబుద్ధి నెవ్వరైనా బతులంటా | తెఱగెఱగక వీధి దిరిగేము |
పఱచైన జవరాలు పరులెల్లా మగలంటా | వొఱపునిలిపిన ట్లోహోహో నేము ||
చ|| యిందరును హితులంటూ యెందైనా సుఖమంటా | పొందలేనిబాధ బొరలేము |
మందమతివాడు యెండమావులు చెరువులంటా | అందునిందు దిరిగిన ట్లాహాహా నేము ||
చ|| మేటివేంకటేశు బాసి మీదమీద జవులంటా | నాటకపుతెరువుల నడిచేము |
గూటిలో దవ్వులవాడు కొండలెల్ల నునుపంటా | యేటవెట్టి యేగిన ట్లీహీహీ నేము ||
తాము స్వతంత్రులు గారు తమయంతను
ఆమీదటిగురి ఆది నీవు.
యెలమి స్వర్గమేలేటీంద్రునికినైనాను
అలమి కోరేటిఫల మది నీవు
బలిమి గైలాసమేలేపతిరుద్రునికినైనా
నిలుకడైనపదము నీపదము
యెక్కుడు సత్యలోకము యేలేబ్రహ్మకునైనా
ఇక్కువ జేరేచోటు యెందును నీవు
వెక్కసపుబుణ్యముల వేదములకైనాను
అక్కరతో ముఖ్యమైన అర్థమెల్లా నీవు,
నాడు నాడే ముక్తులైన నారదళుకాదులకు
నేడును విహరించేనెలవు నీవు
పోడిమి శ్రీవేంకటేశ పోలించ నెవ్వరూ లేరు
మూడులోకముల నీవే మూలము నీవే
ప|| తారకబ్రహ్మము తానైవున్నాడు | ధారుణిలో చెలువొందె దశరథరముడు ||
చ|| కొండలంతలు వానరకోటులు కొలువగాను | దండితో కొలువున్నాడు తగరాముడు |
అండనే సీతాదేవి అమరి కూచుండగాను | మెండుగ సింహాసనాన మెరసీ రాముడు ||
చ|| వామదేవ కౌశిక వశిష్ఠాదుల విన్నపాలు | ఆముకొని వినుచున్నాడు అదె రాముడు |
గోమున భరత శత్రుఘ్నులు ఛత్రచామరాలు | కామించి పట్టుకుండగా కడుమించే రాముడు
చ|| కనక పుష్పకము చెంగట వీరాసనము తో- | ననిచి ఆనందాన నున్నాడు రాముడు |
ఘన శ్రీ వేంకటాద్రిపై కల్పవృక్షము నీడ | హనుమంతుని చదువులాలకించీ రాముడు ||
తారుకాణ సేసుకొంటే తనే నేను
ఈ రీతి నవ్వుగానీ ఇంటికి రమ్మనవే ||
చెక్కులివె చెమరించె చిత్తమెల్లా జిగిరించె
కుక్కినట్టు కోరికలు కొనసాగెను
తొక్కినాడు నా పాపము తొలుతే సందడిలోన
యెక్కడ పరాకుసేసీ నింటికి రమ్మనవే ||
దప్పిదేరె పెదవుల తమకము దైవారె
కొప్పవీది చన్నులపై కుప్పలాయను
ముప్పిరిగా గట్టినాడు ముంజేతకంకణము
ఈప్పుడేలనించీ సిగ్గులు ఈమ్టికి రమ్మనే ||
ఆయాలంటి నన్నుగూడె అంగమెల్లా బులకించె
చేఇచేఇ సోకె యాసచిమ్మిరేగెను
చాయలా సన్నలా సేసెచల్లె శ్రీ వేంకటేశుడు
ఈ యెడ నన్ను మన్నించీ ఇంటికి రమ్మనవే ||
ప|| తినరాని కొనరాని దేవలోకపుబండు | మనసున దలచితే మరగించే పండు ||
చ|| పంటకెక్కి పాలవెల్లి బండిన పాలపండు | తొంటి గొల్లెతల మోవి దొండపండు |
అంటుకొన్న మేనిచాయ అల్లు నేరేడుబండు | ముంటి సింహపుగోళ్ళ ముండ్లపండు ||
చ|| ఇచ్చల వేదశాస్త్రాలు దెచ్చిన పేరీతపండు | తచ్చిన దైత్యమారి దేవదారుబండు |
పచ్చిదేర మెరసిన బండి గురువిందపండు | యిచ్చవలెనన్న వారియింట నంటిపండు ||
చ|| తెమ్మగా మునులపాలి తియ్యని చింతపండు | తిమ్మల సిరివలపు దేనెపండు |
యిమ్ముల శ్రీ వేంకటాద్రి నింటినింట ముంగిటిపండు | కొమ్మల పదారువేల గొప్ప మామిడిపండు ||
ప|| తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ | సురతబిన్నాణరాయ సుగుణకోనేటిరాయ ||
చ|| సిరులసింగారరాయ చెలువపుతిమ్మరాయ | సరసవైభవరాయ సకలవినోదరాయ |
వరవసంతములరాయ వనితలవిటరాయ | గురుతైన తేగరాయ కొండలకోనేటిరాయ ||
చ|| గొల్లెతలవుద్దండరాయ గోపాలకృష్ణరాయ | చల్లువెదజాణరాయ చల్లబరిమళరాయ |
చెల్లుబడిధర్మరాయ చెప్పరానివలరాయ | కొల్లలైన భోగరాయ కొండలకోనేటిరాయ ||
చ|| సామసంగీతరాయ సర్వమోహనరాయ | ధామవైకుంఠరాయ దైత్యవిభాళరాయ |
కామించి నిన్ను గోరితే గరుణించితివి నన్ను | శ్రీమంతుడ నీకు జయ శ్రీవేంకటరాయ ||
తిరుమలయ్య విందు మంచిదే వుండంటే వుంటినమ్మ
సరవిలేని చెంచువారి సంతయేలె తనకును
పరికిదండ పొగడదండ బండిగురిగింజ దండ
బెరకులేని పికిలిదండ బలిదండలన్నియు
మెరసి కానుకియ్యబోతె మేనిదండలడిగెనమ్మ
మరల చెంచువారితోడి మాటలేలె తనకును
ముసురుతేనె జుంటితేనె ముదిరినట్టి పెరలతేనె
పొసగ మించు పూవుతేనె పుట్టతేనె లన్నియు
వొసగి కానుకియ్యబోతె మోవితేనె లడిగె నమ్మ
యెసగ చెంచువారి యెంగి లేటికమ్మ తనకును
వెలగపండు జీడిపండు వెలలేని మోవిపండు
పలుకుదొండపండు పాలపండు కానుకిచ్చితే
చెలగి పక్కపండు మంట శ్రీవేంకటనాయకుడు
యెలమి కూడెనమ్మ చెంచు లేటికమ్మ తనకును
తిరువీధు లేఁగీని దేవతలు జయవెట్ట
హరి వాఁడె పెండ్లికొడుకై ప్రతాపమున
కనకపుఁగొండవంటిఘనమైనరథముపై
దనుజమర్దనుఁడెక్కెఁ దరుణులతో
వినువీధిఁ బడెగెలు వేవేలు కుచ్చులతోడఁ
బెనగొనఁగఁ గదలె భేరులు మ్రోయఁగను
వరుసఁ జంద్రసూర్యులవంటిబండికండ్లతోడ
గరుడధ్వజుఁ డొరసీఁ గడు దిక్కులు
విరుగువేదరాసులే పగ్గాలు వట్టితియ్యఁగ
సరుగ దుష్టులఁ గొట్టి జయము చేకొనెను
ఆటలుఁ బాటలు వింటా నలమేల్మంగయుఁ దాను
యీటున శ్రీవేంకటేశుఁ డెదురులేక
వాటపుసింగారముతో వాకిటవచ్చి నిలిచీ
కోటానఁగోటివరాలు కొమ్మని ఇచ్చుచును
ప|| తిరువీధుల మెరసీ దేవదేవుడు | గరిమల మించిన సింగారములతోడను ||
చ|| తిరుదండలపై నేగీ దేవుడిదె తొలునాడు | సిరుల రెండవనాడు శేషుని మీద |
మురిపాల మూడవనాడు ముత్యాల పందిరిక్రింద | పొరినాలుగవనాడు పువ్వు గోవిలలోను ||
చ|| గ్రక్కున నైదవనాడు గరుడునిమీద | యెక్కెను నారవనాడు యేనుగుమీద |
చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను | యిక్కువ దేరును గుర్రమెనిమిదవనాడు ||
చ|| కనకపుటందలము కదిసి తొమ్మిదవనాడు | పెనచి పదోనాడు పెండ్లిపీట |
యెనసి శ్రీవేంకటేశు డింతి యలమేల్మంగతో | వనితల నడుమను వాహనాలమీదను ||
ప|| తిరువీధుల మెరసీ దేవదేవుడు |
గరిమల మించిన సింగారములతోడను ||
చ|| తిరుదండలపై నేగీ దేవుడిదె తొలునాడు |
సిరుల రెండవనాడు శేషుని మీద |
మురిపాల మూడవనాడు ముత్యాల పందిరిక్రింద |
పొరినాలుగవనాడు పువ్వు గోవిలలోను ||
చ|| గ్రక్కున నైదవనాడు గరుడునిమీద |
యెక్కెను నారవనాడు యేనుగుమీద |
చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను |
యిక్కువ దేరును గుర్రమెనిమిదవనాడు ||
చ|| కనకపుటందలము కదిసి తొమ్మిదవనాడు |
పెనచి పదోనాడు పెండ్లిపీట |
యెనసి శ్రీవేంకటేశు డింతి యలమేల్మంగతో |
వనితల నడుమను వాహనాలమీదను ||
తిరొతిరొ జవరాల తి తి తి తి
ఈ తరలమైన నీ తారహార మదురే ||
ససని సగస మగస ససని సగస పమగస
ససని సగస మగస ససని సగస పమగస |
సస గగ మ గమపని పప నిని స పనిసగ
మ.గ స.ని ప.మ గ.స నిస గగ సగ మమ||
ధిమి ధింకి తోంగ తొంగ దిద్ధిమిక్కి ఆరే
మమారే పాత్రారావు మజ్జామజ్జా|
కమలనాభుని తమకపుటింతి నీకు
అమరె తీరుపు ఇదె అవథరించగదో||
ససని సగస మగస ససని సగస పమగస
ససని సగస మగస ససని సగస పమగస |
సస గగ మ గమపని పప నిని స పనిసగ
మ.గ స.ని ప.మ గ.స నిస గగ సగ మమ||
ఝుక జక్క జంఝుం ఝణకిణాని
ప్రకటపు మురువొప్పె భళా భళా |
సకలపతికి సరసపు కొమ్మ
నీ మొకసిరి మెరసె చిమ్ముల మురిపెముల ||
సగస మగస పమగస నిపమగస
సగస మగస పమగస నిపమగస
సగస సమగ సపమ సనిప ససని సనిపమగ నిపమగస
ని.స గ.గ స.గ మ.మ
మాయిమాయి అలమేలు మంగనాచారి
మతి బాయని వేంకటపతి పట్టాపురాణి
మ్రోయ చిరుగజ్జెల నీ మ్రోతలానేని
సోయగమైన నీ సొలపు చూపమరె ||
ప|| తీపనుచు చేదు తెగదని వెనక బడరాని- | ఆపదలచేత బొరలాడేము గాన ||
చ|| అప్పుదీరినదాకా నలవోకకైనవా- | రెప్పుడును దనవార లేలౌదురు |
అప్పటప్పటికి బ్రియ మనుభవింపుచు మమత | చెప్పినటువలె దాము సేయవలెగాక ||
చ|| పొందైన వారమని పొద్దు వోకకు దిరుగు- | యిందరును దమవార లేలౌదురు |
కందువగు తమకార్యగతులు దీరినదాక | సందడింపుచు బ్రియము జరపవలెగాక ||
చ|| తెగనికర్మము దమ్ము దిప్పుకొని తిరిగాడ | అగడుకోరిచి పెక్కులాడ నేమిటికి |
తగువేంకటేశ్వరుని దలచియిన్నిటా దాము | విగతభయులయి భ్రాంతి విడువవలె గాక ||
తుద సమస్తమును దుర్లభమే
అదె సులభుడు మాహరి యొకడే
సురలును నరులును సొంపగుసిరులను
వొరసిన నిన్నియు నుపాధులే
నిరుపాధికుడును నిజకరుణావిధి
అరయగ నిదె మాహరి యొకడే
అందరియీవులు నఖిలకర్మములు
అందగరానిప్రయాసములే
యిందిరారమణి నేచినసేవిది
చెందరు సుజనులు చెప్పంగలదే
యితరోపాయము లేవి చూచిన
శ్రుతివిరహితములు శూన్యములే
రతి శ్రీవేంకటరమణునిమతి యిది
హితపరిపూర్ణం బిది యొకట
ప|| తుదిలేని బంధము తోడునీడై నేను | వదలినా వదలదేమి సేతు ||
చ|| గులిమికొలుచు దీరగుడువనియ్యక కొత్త- | కొలుచు మీదమీద గొలువగా |
కలసినకర్మపు గలిమిచేత దృష్ణ | వెలితిగాక యిల్లువెడల దేమిసేతు ||
చ|| అన్నియు నొకమాటే యనుభవింపగ జేసి | కొన్నివెచ్చము లొనగూడించి |
యిన్నిటా దిరువేంకటేశ నిర్మలునిగా | నన్నుజేసి నీవు నాకు గలుగవయ్య ||
ప|| తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు | ఎప్పుడు లోకములెల్ల నేలేటివాడు ||
చ|| మోతనీటి మడుగులో యీతగరచినవాడు | పాతగిలే నూతిక్రింద బాయనివాడు |
మూతిదోసిపట్టి మంటిముద్ద పెల్లగించువాడు | రోతయైన పేగుల పేరులు గలవాడు ||
చ|| కోడికూత నోరివాని కుర్రతమ్ముడైనవాడు | బూడిద బూసినవాని బుద్ధులవాడు |
మాడవన్నె లేడివెంట మాయలబడినవాడు | దూడల నావులగాచి దొరయైనవాడు ||
చ|| ఆకసానబారే వూరి అతివల మానముల | కాకుసేయువాడు తురగముపైవాడు |
ఏకమై వేంకటగిరి నిందిరారమణి గూడి | యేకాలముబాయని యెనలేనివాడు ||
ప|| తెలియక వూరక తిరిగేము | చలమరి కగునా సంతతసుఖము ||
చ|| హేయము కడుపున నిడుకొని యింకా | చీ యనినమాకు సిగ్గేది |
పాయము పిడికిట బట్టుచునుండేటి- | కాయధారులకు గలదా విరతి ||
చ|| అంగనలరతులయాసలనీదేటి- | యెంగిలిమనుజుల కెగ్గేది |
ముంగిట నార్గురుముచ్చులగూడిన- | దొంగగురుని కిందుల నిజమేది ||
చ|| జననమరణములు సరిగని కానని | మనుజాధమునకు మహిమేది |
యెనగొని శ్రీవేంకటేశు శరణమిటు | గని మనకుండిన గతి యిక నేది ||
ప|| తెలియదెవ్వరికిని దేవ దేవేశ యీ | నెలత భావంబెల్ల నీవెఱుగు దికనూ ||
చ|| నిలుచు దలయూచు గన్నీరు వాలిక గోళ్ళ | జినుకు నివ్వెఱగుపడు జింతించును |
పులకించు నలయు దలపోయు నిను జిత్తమున | నిలుపు నంగన విధము నీ వెఱుగు దికను ||
చ|| కమలంబు చెక్కుతో గదియించు నెన్నుదుట | చెమట బయ్యెద దుడుచు సెలవి నగును |
తమకంపు గోరికలు తరుణి యిదె నిను బాసి | నిమిష మోర్వగలేదు నీవెఱుగు దికను ||
చ|| వెక్కసపు నును దురుము వెడవ దలనేరదు | చిక్కుదేరగ గొంత సిగ్గు వడును |
ఇక్కువల దిరువేంకటేశ నిను గూడె నిదె | నిక్క మీచెలి వగల నీ వెఱుగ దికనూ ||
ప|| తెలియని వారికి తెరమరుగు | తెలిసిన వారికిదిష్టంబిదియే ||
చ|| కన్నుల యెదుటను గాంచిన జగమిది | పన్నిన ప్రకృతియు బ్రహ్మమే |
ఇన్నిటనుండగ ఇది గాదని హరి | కన్న చోట వెదకగ బోనేల ||
చ|| ఆగపడి యిరువది యైదై జీవుని | తగిలిన వెల్లా తత్త్వములే |
నగవుల నిదియును నమ్మగ జాలక | పగటున తమలో భ్రమయగ నేలా ||
చ|| అంతరంగుడును నర్చావతారము | నింతయు శ్రీ వేంకటేశ్వరుడే |
చెంతల నీతని సేవకులకు మరి | దొంతి కర్మముల తొడసిక నేలా ||
ప|| తెలియరాదు మాయాదేహమా మమ్ము | పలువికారాలబెట్టి పనిగొన్న దేహమా ||
చ|| దినమొక్కవయసెక్కే దేహమా సారె | పెనుమదముగురిసేబెండు దేహమా |
దినదినరుచిగోరే దేహమా నన్ను | ఘనమోహపాశాల గట్టెగదె దేహమా ||
చ|| తెలివినిద్రలుగల దేహమా నీ- | పొలము పంచభూతాలపొత్తు దేహమా |
తిలకించి పాపపుణ్యాల దేహమా | బలుపుగలదాకా బదుకవో దేహమా ||
చ|| తీరనిసంసారపు దేహమా యిట్టె | వూరట లేనిభోగాల వోదేహమా |
కూరిమి శ్రీవేంకటేశు గొలిచితినిక నాకు | కారణజన్మమవై కలిగిన దేహమా ||
తెలియా చీకటికి దీపమెతక
పెద్ద వెలుగులోపలికి వెలుగేలా
అరయా ఆపన్నునికి అభయ మీవలెగాక
ఇరవైనసుఖినీ కావనేల
వరదా బోయనివాని వడి దీయవలెగాక
దరివాని తివియంగ తానేలా
ఘనఖర్మారంభుని కట్లు విదవలె గాక
యొనసి ముక్తూని కవనేలా
అనయమూ దుర్బలునికి అన్నా మిడవలెగాక
తనిసినా వానికి తానేలా
మితిలేని పాప కర్మికి తావలెగాక
హితబెరుగు పున్యునికి తానేలా
ధ్రుతిహీను క్రుపజూచి తిరువేంకటేశ్వరుడు
తతి గావకుండిన తానేలా
ప|| తెలిసి చెప్పేనంటే తేటతెల్లమి నాగుట్టు | కలసిన వాడవు కరుణించవయ్యా ||
చ|| మోము చూచిన వాడవు మోహించక మానేవా | కోమలపు దాననై కొసరే గాక |
చేముట్టిన వాడవు సేవగొనక మానేవా | దామెన కోరికలతో దమకించే గాక ||
చ|| సేసవెట్టిన వాడవుచెనకక మానేవా | ఆసపడ్డదాననై యడిగే గాక |
బాస యిచ్చిన వాడవు పైకొనక మానేవా | చేసూటి వలపుల జిమ్మిరేగే గాక ||
చ|| యీడ నన్నేలిన వాడవింటికి రాక మానేవా | జోడైన దాననయి సొలసే గాక |
కూడితి విట్టె నన్ను గొబ్బున శ్రీవేంకటేశ | జాడెఱగక మానేవా చాటి చెప్పే గాక ||
తెలిసితేమోక్షము తెలియకున్న బంధము
కలవంటిది బతుకు ఘనునికిని
అనయము సుఖమేడది అవల దు:ఖమేడది
తనువుపై ఆశలేనితత్వమతికి
పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు
వొనర ఫలమునొల్లన యోగికిని
తగిన అమృతమేది తలపగ విషమేది
తెగి నిరాహారియైనధీరునికిని
పగవారనగ వేరె బంధులనగ వేరె
వెగటుప్రపంచమెల్ల విడిచే వివేకికి
వేవేలువిధులందు వెఱపేది మఱపేది
దైవము నమ్మినయట్టిధన్యునికిని
శ్రీవేంకటేశ్వరుడు చిత్తములో నున్నవాడు
యీవలేది యావలేది యితనిదాసునికి
ప|| తెలిసిన తెలియుడు తెలియని వారలు | తొలగుడు బ్రహ్మాదులె యెరుగుదురు ||
చ|| వరదు డఖిలదేవతలకు వంద్యుడు | గరుడు డసురులకు కంటకుడు |
పరమాత్ముడంబుజ భవ శివాదులకు | పరుల కెల్ల మువ్వురిలో నొకడు ||
చ|| దేవుడు సనకాది మునులకును పర- | దైవమఖిల వేదములకును |
కైవల్యమొసగు ఘననిధికి | మహానిధి జడులకు యాదవకులుడు ||
చ|| ఆద్యుడు అచలుడు మహాభూతమితడు | అభేద్యుడసాధ్యుడు భీకరుడు |
సద్యఃఫలదుడు సకల మునులకును | వేద్యుడితడెపో వేంకటవిభుడు ||
ప|| తెలిసిన బ్రహ్మోపదేశ మిదె | సులభ మనుచు నిదే చూచీగాక ||
చ|| పుట్టించినహరి పూరి మేపునా | గట్టిగా రక్షించుగా కతడు |
కట్టడిజీవుడు కానక నోళ్ళు | తెట్టదెరువునకు తెఱచీ గాక ||
చ|| అంతరాత్మ తనునట్టే మఱచేనా | చింత లో బెరరేచీగాక |
పంతపుజీవుడు భ్రమసి సందుసుడి | దొంతలు దొబ్బుచు దూరీగాక ||
చ|| నొసల వ్రాసినవి నోమించుగా కత- | డెసగిన శ్రీవేంకటేశ్వరుడు |
విసుగక జీవుడు వీరిడిమాయల- | నసురసురయి తా నలసీగాక ||
తెలిసిన వారికి దేవుండితడే
వలవని దుష్టుల వాదములేల
పురుషులలోపల పురుషోత్తముడు
నరులలోన నరనారాయణుడు
పరదైవములకు పరమేశ్వరుడు
వరుసమూఢుల కెవ్వరోయితడు
పలుబ్రహ్మలకును పరబ్రహ్మము
మలయునీశులకు మహేశుడితడు
ఇలనాత్మలలో నిటుపరమాత్ముడు
ఖలులకెట్లుండునో కానము యితడు
వేదంబులలో వేదాంతవేద్యుడు
సోదించకరిగాచుచో నాదిమూలము
యీదెస శ్రీ వేంకటేశుడిందరికి
గాదిలి మతులను గైకొనడితడు
తెలిసినవాడా గాను తెలియనివాడా గాను
యిల నొకమాట నీ కెత్తిచ్చితిగాని
పుట్టించేవాడవు నీవే బుద్దిచ్చేవాడవు నీవే
యెట్టున్నా నపరాదా లేవి మాకు
అట్టూ నన్నవారముగా మనగా నీచిత్తమెట్టో
కిట్టి వొక మాట మడిగితి నింతేకాని
మనసులోపల నీవే మరి వెలుపల నేవే
యెనసి అపరాధాలు యేవి మాకు
నిను నౌగాదనలేము నీసరివారము గాము
అనవలసినమాట అంటి మింతేకాని
అంతరాత్మవును నీవే అన్నిటా గావగ నీవే
యెంతైనా నపరాధా లేవి మాకు
వింత లేక శ్రీవేంకటవిభుడ నీబంట నింతే
వంతుకు నే నొకమాట వాకుచ్చితిగాని
ప|| తెలిసినవారికి తెరువిదే మరిలేదు | నళినాక్షు పొగడెడి నామములో నున్నది ||
చ|| ఆకసాన లేదు మోక్ష మటుపాతాళాన లేదు | ఈకడ భూలోకమందు ఎందులేదు |
పైకొని ఆసలెల్ల పారద్రోలి వెదకితే | శ్రీకాంతు పొగడేటి చిత్తములో నున్నది ||
చ|| సురల వద్ద లేదు సోదించ నమృతము | సరిభీకులందు లేదు జలధిలో లేదు |
శరణాగతుల పాద జలముల జేర్చికొనే | హరిదాసుల పూజించే అరచేత నున్నది ||
చ|| రాజసాన సుఖమేది రాసి కర్మమందునేది | వోజతోడ నియతుడై వుండినా నేది |
సాజాన శ్రీ వేంకటేశు సరి ముద్రలు ధరించే | తేజముతో విజ్ఞన దేహములొ వున్నది ||
ప|| తెలిసియు నత్యంతదీనుడై తన్ను | దెలియగగోరేటితెలివే పో తెలివి ||
చ|| వలచినసతి దన్ను వడి గాలదన్నిన | అలరి యెట్లా నుబ్బు నటువలెనే |
తలక కెవ్వరు గాలదవ్వినా మతిలోన | అలుగక ముదమందునదివో తెలివి ||
చ|| అరిదిమోహపు వనిత ఆలిపై దిట్టిన- | నరవిరై చొక్కినయటువలెనే |
పరులు దన్ను వెలుపల నిట్ల బలికిన | అరలేక రతి జొక్కునదివో తెలివి ||
చ|| తనివోక ప్రియకాంత తమ్ములపురస మాన- | ననయమును నటు గోరునటువలెనే |
తనర వేంకటపతి దాసుల ప్రసాదంబు | అనిశమును గొనగోరునదివో తెలివి ||
ప|| తెల్లవారనియ్యరో తెరువు యీ- | పల్లదపుదొంగలెల్ల బారాడుతెరువు ||
చ|| దొంతరపూవులతోట తూరుపుదెరువు | చింతపూవుదేనెలచెమ్మతెరువు |
సంతులేనిసతియింటిచాయతెరువు | యింతలోనె చలిబడి యెండదాకేతెరువు ||
చ|| పముపుట్టగొంటిమీదిపడుమటితెరువు | చీమకదొంతరలోనిచిన్నతెరువు |
గాములుగాచుకయుండే గాలితెరువు | యేమిటా నెక్కడవుత నెరగనితెరువు ||
చ|| అన్నిదిక్కులును దానేయైవున్న్నతెరువు | పన్నీటికాలువలబాటతెరువు |
కన్నుల వేంకటపతి గన్నతెరువు | మిన్నునేలగూడినమీదితెరువు ||
ప|| తే శరణంమహం తే శరణమహం | శైశవకృష్ణ తే శరణం గతోస్మి ||
చ|| దశవిధావతార ధర్మరక్షణమూర్తి | దశమస్తకాసురదశన |
దశదిశాపరిపూర్ణ తవనీయస్వరూప | దశావరణ లోకతత్త్వాతీత ||
చ|| సహస్రలోచన సంతతవినుత | సహస్రముఖ శేషశయనా |
సహస్రకరకోటిసంపూర్ణతేజా | సహస్రాదిత్య దివ్యచక్రాయుధా ||
చ|| అనంతచరణ సర్వాధారధేయ | అనంతకరదివ్యాయుధా |
అనంతనిజకల్యాణగుణార్ణవ | అనంత శ్రీవేంకటాద్రినివాసా ||
ప|| తొక్కనిచోట్లు దొక్కెడిమనసు | యెక్కడ గతిలే దింకనో తెరువు ||
చ|| పాపము వాయదు పైపై మనసున | కోపము దీరదు కొంతైనా |
దీపనబాధయు దీరదు కొంతైనా | యేపున బెనగొనె నింకనో తెరువు ||
చ|| యెవ్వనమదమును నెడయదు కోరికె | కొవ్వును నణగదు కొంతైనా |
రవ్వగుమమకారము బెడబాయదు | యెవ్విధియును లేదింకనో తెరువు ||
చ|| వెఱపును విడువదు వెడమాయలబడి | కొఱతయు దీరదు కొంతైనా |
తెఱగొసగేటి శ్రీతిరువేంకటపతి- | నెఱిగీనెఱగలే మికనో తెరువు ||
ప|| తొలుబాపపుణ్యాలతోడ బుట్టితినట | బలువైనభవముల భడలేనా ||
చ|| గాములయింటినే కాపనయితినట | పాముపుట్టనుండియైన బతుకలేనా |
గోమున హేయపుగుండకూడు నించితినట | గామిడినేగారేతిత్తి గానోపనో ||
చ|| కట్లైనగుణములచే కట్టువడితినట | చుట్టపుబంధాలరొచ్చుకు నోపనా |
దట్టపుటాసల నేదాల్చితినట నా- | వెట్టకాయము మోవవెరచేనా ||
చ|| నిగిడినలోపల నీ వుండుదువట | పగవారికి నే బగిలేనా |
తగువేంకటేశ నీదయవాడనట యీ- | వగల నిన్నిట గెలువగలనా ||
ప|| తొల్లి కలవే యివియు తొల్లి తాను గలడే | కల్లయునుగాదు కడు నిజము గాదు ||
చ|| కనుదెరచి నంతనే కలుగునీజగము | కనుమూసి నంతనే కడుశూన్యమౌను |
కనురెప్ప మరుగుననే కలిమియును లేమియును | తన మనోభావనల తగిలి తోచీనీ ||
చ|| తలచినంతనె యెంత దవ్వైన గాన్పించు | తలపు మరచిన మదికి దట్టమౌమదము |
పొలసి మతి మరుగుననె పుట్టుటలు బోవుటలు | పలుచంచల వికార భావమీగుణము ||
చ|| ముందు తాకలిగితే మూడు లోకములు గల- | వెందు దా లేకుంటె నేమియును లేదు |
అంది శ్రీ వేంకటేశు నాత్మలో ననె వీడె | కందువల నీతని సంకల్ప మీపనులు ||
ప|| తొల్లింటి వలె గావు తుమ్మెదా యింక | వొల్లవుగా మమ్మువో తుమ్మెదా ||
చ|| తోరంపు రచనల తుమ్మెదా కడు | దూరేవు గొందులే తుమ్మెదా |
దూరినా నెఱుగవు తుమ్మెదా మమ్ము | వోరగా చూడకు వో తుమ్మెదా ||
చ|| తొలి ప్రాయపు మిండ తుమ్మెదా కడు | తొలిచేవు చేగలే తుమ్మెదా |
తొలకరి మెరుగువే తుమ్మెదా ఇంక | ఉలికేవు మముగని వో తుమ్మెదా ||
చ|| దొరవు వేంకటగిరి తుమ్మెదా మా | తురుమేల చెనకేవు తుమ్మెదా |
దొరకెనీ చనవులు తుమ్మెదా ఇంక | ఒరులెఱింగిరి గదవో తుమ్మెదా ||
ప|| తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూగెగన | చెల్లుబడి నూగీని శ్రీరంగశిశువు ||
చ|| కలికి కావేరి తరగల బాహులతలనే | తలగ కిటు రంగ మధ్యపు తొట్టెలను |
పలుమారు దనునూచి పాడగా నూగీని | చిలుపాల సెలవితో శ్రీరంగశిశువు ||
చ|| అదివో కమలజుని తిరువారాధనం బనగ | అదన గమలభవాండమను తొట్టెలను |
ఉదధులు తరంగముల నూచగా నూగీని | చెదరని సిరులతోడ శ్రీరంగశిశువు ||
చ|| వేదములే చేరులై వెలయంగ శెషుడే | పాదుకొను తొట్టెలై పరగగాను |
శ్రీదేవితో గూడి శ్రీవేంకటేశుడై | సేదదీరెడి వాడె శ్రీరంగశిశువు ||
ప|| తోరణములే దోవెల్లా | మూరట బారట ముంచినలతల ||
చ|| కూరిమిమటములు గోపురంబులును | తేరుపడగెలే తెరువెల్లా |
కోరినపండ్లుగురి సేటితరువులు | తోరములైన వెదురుజొంపములు ||
చ|| ఆటలు దిరుపులు నందపుటురుపులు | పాటలు వనవైభవమెల్లా |
కూటువనెమళ్ళ కోవిలగుంపుల | పేటల దేటలపెనుగూటములు ||
చ|| వింజామరలును విసనకర్రలును | గొంజెగొడుగులే కొండెల్లా |
అంజనగిరిరాయడు వేంకటపతి | సంజీవని పరుషల కొదవగను ||
త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీజగన్నాథా
వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీ సతీశ సరసిజనేత్రా
భూసురవల్లభ పురుషోత్తమ పీత- కౌశేయవసన జగన్నాథా
బలభద్రానుజ పరమపురుష దుగ్ధ జలధివిహార కుంజరవరద
సులభ సుభద్రా సుముఖ సురేశ్వర కలిదోషహరణ జగన్నాథా
వటపత్రశయన భువనపాలన జంతు- ఘటకారకరణ శృంగారాధిపా
పటుతర నిత్యవైభవరాయ తిరువేంకటగిరినిలయ జగన్నాథా
ద
ప|| దండనున్న చెలుల మిందరము సాక్షి | నిండు దొర యీతనికి నేరమేమి లేదు ||
చ|| వట్టి చలములుమాని వాకిలి దెరవరాదా | యిట్టె విభుడు వచ్చి యీడనున్నాడు |
వొట్టినట్టు కొలువై వుండిన దొక్కటేకాని | నెట్టన నితని వల్ల నేరమేమి లేదు ||
చ|| దిచ్చరి కోపము మాని తెర దియ్యరాదా | చొచ్చి వచ్చి రమణుడు చూచీ నిదే |
అచ్చముగ సరసము లాడిన దొక్కటే కాని | నిచ్చలు నితని వల్ల నేరమేమీ లేదు ||
చ|| పంతపు వేసాలు మాని పయ్యె దెడలించరాదా | చెంత శ్రీ వేంకటేశుడు చేయిచాచీనీ |
యింతలోన నిన్నుగూడె నిదియొక్కటే గాని | నింతము సేసలితని నేరమేమీ లేదు ||
దయజూడవయా తతిగాని మొక్కేము
ప్రియురాంద్లము నినుబెండ్లాడితిమి ||
చలములు నీతో సాదించేమా
వలచిన వారము వనితలము
బలుములు నీతో బచరించేమా
కొలిచినవారము గోలలము ||
పెనగుచు నీతో బిగిసేమా మీ
ననుపుల వారము నాతులము
పనివడి నేరమి పైవేసేమా
చనవరివారము సాదులము ||
యీవేళ గూడితి మెలయించేమా
దేవుళ్ళము నీ తెఅవలము
శ్రీ వేంకటేశ్వర చెలగి నగేమా
బూవపువారము భోగులము ||
దాచుకో నీపాదాలకుదగ నే జేసినపూజ లివి
పూచి నీకీరీతిరూపపుష్పము లివి యయ్యా
వొక్క సంకీర్తనె చాలు వొద్దికై మమ్ము రక్షించగ
తక్కినవి భాండారాన దాచి వుండనీ
వెక్కసమగునీ నామము వెల సులభము ఫల మధికము
దిక్కై నన్నేలితి విక నవి తీరని నా ధనమయ్యా
నానాలికపైనుండి నానాసంకీర్తనలు
పూని నాచే నిన్ను బొగడించితివి
వేనామాల వెన్నుడా వినుతించ నెంతవాడ
కానిమ్మని నా కీపుణ్యము గట్టితి వింతేయయ్యా
యీమాట గర్వము గాదు నీ మహిమే కొనియాడితిగాని
చేముంచి నాస్వాతంత్ర్యము చెప్పినవాడగాను
నేమాన బాడేవాడను నేరము లెంచకుమీ
శ్రీమాధవా నే నీదాసుడ శ్రీవేంకటేశుడవయ్యా
ప|| దిక్కిందరికినైనదేవుడు కడు | దెక్కలికాడైనదేవుడు ||
చ|| కొత్తపెండ్లికూతు గోరి చూడబోయి | యెత్తి తేరిమీద నిడుకొని |
నెత్తికన్ను మానినవాని పెండ్లికి | దెత్తిగొన్న యట్టి దేవుడు ||
చ|| గొప్పయిన పెద్దకొండమీద నుండి | దెప్పరముగా దిగబడి |
కప్పి రెండుదునుకలు గూడినవాని | తిప్పుదీరులాడే దేవుడు ||
చ|| బెరసి మేనమామబిడ్డకునై పోయి | నిరతంపుబీరాలు నెరపుచు |
యిరవైనమాయపుటెద్దుల బొరిగొన్న- | తిరువేంకటగిరిదేవుడు ||
దాసోహ మనుబుద్ది దలచరు దానవులు
యీసులకే పెనగేరు యిప్పుడూ గొందరు
హరిచక్రముదూషించేయట్టి వారే యసురులు
అరయ దామేదైవమన్న వారు నసురలే
ధర నరకాసురుడు తానే దైవమని చెడె
యిరవై యిది మానరు యిప్పుడూ గొందరు
పురుషోత్తముని పూజపొంత బోరు అసురలు
సరవి విష్ణుని జపించనివారు నసురలే
హిరణ్యకశిపుడును యీతని నొల్లక చెడె
యిరవై యీతని నొల్ల రిప్పుడూ గొందరు
సురలును మునులును శుకాదియోగులును
పరమము శ్రీవేంకటపతి యనుచు
శరణని బ్రదికేరు సరి నేడు వైష్ణువులు
యెరపరికాన బొయ్యేరప్పుడూ గొందరు
|| దిక్కిందరికినైనదేవుడు కడు | దెక్కలికాడైనదేవుడు ||
చ|| కొత్తపెండ్లికూతు గోరి చూడబోయి | యెత్తి తేరిమీద నిడుకొని |
నెత్తికన్ను మానినవాని పెండ్లికి | దెత్తిగొన్న యట్టి దేవుడు ||
చ|| గొప్పయిన పెద్దకొండమీద నుండి | దెప్పరముగా దిగబడి |
కప్పి రెండుదునుకలు గూడినవాని | తిప్పుదీరులాడే దేవుడు ||
చ|| బెరసి మేనమామబిడ్డకునై పోయి | నిరతంపుబీరాలు నెరపుచు |
యిరవైనమాయపుటెద్దుల బొరిగొన్న- | తిరువేంకటగిరిదేవుడు ||
|| దిక్కిందరికినైనదేవుడు కడు | దెక్కలికాడైనదేవుడు ||
చ|| కొత్తపెండ్లికూతు గోరి చూడబోయి | యెత్తి తేరిమీద నిడుకొని |
నెత్తికన్ను మానినవాని పెండ్లికి | దెత్తిగొన్న యట్టి దేవుడు ||
చ|| గొప్పయిన పెద్దకొండమీద నుండి | దెప్పరముగా దిగబడి |
కప్పి రెండుదునుకలు గూడినవాని | తిప్పుదీరులాడే దేవుడు ||
చ|| బెరసి మేనమామబిడ్డకునై పోయి | నిరతంపుబీరాలు నెరపుచు |
యిరవైనమాయపుటెద్దుల బొరిగొన్న- | తిరువేంకటగిరిదేవుడు ||
దిక్కునీవే జీవులకు దేవ సింహమా
తెక్కుల గద్దియమీది దేవసింహమా
సురలెల్లా గొలువగ సూర్యచంద్రులకన్నుల
తిరమైన మహిమల దేవసింహమా
నిరతి ప్రహ్లాదుడు నీయెదుట నిలిచితే
తెరదీసితి మాయకు దేవసింహమా
భుజములుప్పొంగగాను పూచిన శంఖుచక్రాల
త్రిజగములు నేలేటి దేవసింహమా
గజభజింపుచు వచ్చి కాచుక నుతించేటి
ద్విజముని సంఘముల దేవసింహమా
ముప్పిరి దాసులకెల్లా ముందు ముందే యొసగేటి
తిప్పరాని వరముల దేవసింహమా
చిప్పల నహోబలాన శ్రీవెంకటాద్రి మీద
తెప్పల దేలేటి యట్టి దేవసింహమా
దినము ద్వాదశి నేడు తీర్థదివసము నీకు
జనకు(డ అన్నమాచార్యు(డ విచ్చేయవే
అనంతగరుడ ముఖ్యులైన సూరిజనులతో
ఘననారదాది భాగవతులతో
దనుజ మర్దనుండైన దైవశిఖామణితోడ
వెనుకొని యారగించ విచ్చేయవే
వైకుంఠాన నుండి యాళువారలలోపల నుండి
లోకపు నిత్యముక్తులలోన నుండి
శ్రీకాంతతోడ నున్న శ్రీవేంకటేశు(గూడి
యీకడ నారగించ నింటికి విచ్చేయవే
సంకీర్తనముతోడ సనకాదులెల్ల(బాడ
పొంకపు శ్రీవేంకటాద్రి భూమి నుండి
లంకె శ్రీవేంకటగిరి లక్ష్మీవిభు(డు నీవు
నంకెల మాయీంటి విందు లారగించవే
ప|| దేవుడుగలవారికి దిగులు జింతయు లేదు | శ్రీవిభుడే అన్నిటా రక్షించుగనక ||
చ|| యేలికగలబంటుకు యేవిచారములేదు | వోలి మగడుగలాలికి వొప్పమి లేదు |
పోళిమి దండ్రిగలపుత్రుని కంగద లేదు | మేలుగా బండినభూమికి గరవులేదు ||
చ|| బలముగలరాజుకు భయమేమియు లేదు | కలిమిగలవాని కక్కర లేదు |
యిల నాచారవంతుని కేపాపమును లేదు | తలపుబుణ్యముగల ఆతనికి జేటు లేదు ||
చ|| గురువుగలవానికి గొఱత యేమియు లేదు | పరముగలవానికి భ్రాంతులు లేవు |
యిరవై శ్రీవేంకటేశు డిన్నిటా మాకు గలడు | అరయ దాసులము మా కడ్డాకే లేదు ||
ప|| దిబ్బలు వెట్టుచు దేలిన దిదివో | ఉబ్బు నీటిపై నొక హంస ||
చ|| అనువున గమల విహారమె నెలవై | ఒనరియున్న దిదె ఒక హంస |
మనియెడి జీవుల మానస సరసుల | వునికి నున్న దిదె ఒక హంస ||
చ|| పాలు నీరు నేర్పరచి పాలలో | నోలలాడె నిదె యొక హంస |
పాలుపడిన యీ పరమహంసముల | ఓలి నున్న దిదె యొక హంస ||
చ|| తడవి రోమరంధ్రంబుల గ్రుడ్ల | నుడుగక పొదిగీ నొక హంస |
కడు వేడుక వేంకటగిరి మీదట | నొడలు పెంచెనిదె యొక హంస ||
ప|| దీనుడను నేను దేవుడవు నీవు | నీ నిజరూపమే నెరపుటగాక ||
చ|| మతి జననమెరుగ మరణంబెరుగను | యితవుగ నినునింక నెరిగేనా
క్షితి బుట్టించిన శ్రీపతివి నీవు | గతి నాపై దయ దలతువు గాక ||
చ|| తలచపాపమని తలచపుణ్యమని | తలపున యిక నిన్ను దలచలేనా ||
అలరిననాలో అంతర్యామివి | కలుషమెడయ నను గాతువుగాక ||
చ|| తడవనాహేయము తడవనా మలినము | తడయక నీమేలు తడవేనా
విడువలేని శ్రీవేంకట విభుడవు | కడదాక నికగాతువు గాక ||
ప|| దురితదేహులే తొల్లియును శ్రీ- | హరి భజించి నిత్యాధికులైరి ||
చ|| అనంతకోటి మహామునులు ఈ- | సనకాదులు నిశ్చలయశులు |
ఇనశశినయనుని నితనిని మును- | గని భజించి గతకల్మషులైరి ||
చ|| అతిశయమతులు మహామహులు సుఖ- | రతివిముఖులును చిరంతనులు |
హితవిచారమతి నితనిని స- | తతమును భజించి ధన్యులైరి ||
చ|| దేవతాధిపులు దివ్యులును కడు- | బావనులును తగ బరహితులు |
యీవేంకటపతి నితనిని | సేవించి సుఖాంచితమతులైరి ||
దృష్టితాకు మాఅయ్యకు తెరవేయరే
దృష్టించెదరెవరైనా దరిచేరనీయకురే
చప్పుడు సేయుటకవసరము కాదనరే
అప్పుడు మజ్జనము ఆడుననీ తెలుపరే
కప్పురంపు సురటుల కొలిచెదరనరే
అప్పుడు సతుల తోనూ ఆరగించినాడనరే
దంతపు చవికెలో ఏకాంతమాదేననరే
అంతరంగమున నృత్యము ఆడెదరని తెలుపరే
దొంతి పూలతోటలోన తమిగూడి యున్నాడనరే
చెంత కేళాకూళి లోన చిత్తగించి యున్నాడనరే
పట్టంపు రాణియు తాను పవ్వళించియున్నాడనరే
రట్టుసేయనిందెవరైనా రానీయకురే
పట్టపు అలమేలుమంగపతి శ్రీవేంకటేశ్వరుడు
సృష్టిలోకకర్త గాన సేవించి పొమ్మనరే
దేవ దేవం భజే దివ్యప్రభావం
రావణాసురవైరి రణపుంగవం రామమ్
రాజవరశేఖరం రవికులసుధాకరం
ఆజానుబాహు నీలాభ్రకాయం
రాజారి కోదండ రాజ దీక్షాగురుం
రాజీవలోచనం రామచంద్రం రామమ్
నీలజీమూత సన్నిభశరీరం
ఘనవిశాలవక్షం విమల జలజనాభం
తాలాహినగహరం ధర్మసంస్థాపనం
భూలలనాధిపం భోగిశయనం రామమ్
పంకజాసనవినుత పరమనారాయణం
శంకరార్జిత జనక చాపదళనం
లంకా విశోషణం లాలితవిభీషణం
వేంకటేశం సాధు విబుధ వినుతం రామమ్
దేవ దేవోత్తమ తే నమోనమో
రావణ దమన శ్రీ రఘురామా
రవికులాంబుధి సోమ రామలక్ష్మనాగ్రజ
భువి భరతశత్రుఘ్న పూర్వజ
సవన పాలక కౌసల్యానంద వర్ధన
ధవలాబ్జ నయనా సీతా రామా
దనుజ సమ్హారక దశరథ నందన
జనక భుపాలక జామాత
వినమిత సుగ్రీవ విభిషణ సమేత
ముని జన విముఖ సుముఖ సుచరిత్ర
అనిలజ వరద అహల్య శాపమోచన
సనకాది సేవిత చరణాంబుజ
కలతార శ్రీవేంకట గిరినివాస
అనుపమోదార విహరా గంభిరా
దేవా నమో దేవా
పావన గుణగణభావా ॥పల్లవి॥
జగదాధారా చతుర్భుజ
గగననీల మేఘశ్యామ
నిగమపాదయుగ నీరజనాభ
అగణిత లావణ్యాననా ॥దేవ॥
ఘనవేదాంతై ర్గణన వుదార
కనకశంఖ చక్ర కరాంకా
దినమణి, శశాంక దివ్యవిలోచన
అనుపమ రవిబింబాధరా
భావజకంజ భవజనక
శ్రీవనితా హృదయేశ
శ్రీవేంకటగిరి శిఖరవిహార
పావన గుణగణభావా ॥దేవ॥
దేవ నీదయ యెంతునో దివ్యసులభ మెంతునో
కావించి అంటగటుక కాచుకుండె విదివో
వెదక నావసమా వేగుదాకా నిన్ను నేను
కదిసి నీమూరితి కానవసమా
యెదుట శంఖుచక్రాల యెట్టిదైవమ నేనని
పొదుగుచు నీకునీవే పొడచూపేవుగాక
పొగడ నావసమా పురుణించి నీగుణాలు
తగుల నావసమా నీతలపెఱిగి
విగిడి వేదశాస్త్రాల నిన్ను నీవే చెప్పుకొని
పగటుమాయజ్ఞానము పాపే వింతేకాక
కొలువ నావసమా గుఱుతెఱిగి నీవెంట
చెలగి నాచేతుల బూజించవసమా
నిలిచి శ్రీవేంకటేశ నీవే నాయదలో నుండి
మలసి పెరరేపుచు మన్నించేవుగాక
ప|| దేవ నీమాయతిమిర మెట్టిదో నా- | భావము చూచి గొబ్బన గావవే ||
చ|| వెడదుఃఖమపుడెల్ల వేసరుచుండుదుగాని | తడవి విరతిబొంది తలగలేను |
అడియాసల దిరిగి అలయుచుండుదుగాని | మడి దొసగుల నివి మానలేను ||
చ|| హేయము స్త్రీసుఖమని యెరుగుచుండుదుగాని | పాయపుమదముచేత బాయలేను |
పాయనిపాపాలు చూచి భయమందుచుందుగాని | వోయమ్మ యివి సేయకుండలేను ||
చ|| కలకాల మిన్నియును గందువిందు గానిమరి | యెలమి నొక్కటనైన యెచ్చరలేను |
బలిమి శ్రీవేంకటేశ బంధముక్తుని జేసి | తలపులో నెలకొని దయజూడవయ్యా ||
ప|| దేవ నీవిచ్చేయందుకు దీనికిగా నింతయేల | యేవేళ మాయెరుకలు యెందుకు గొలుపును ||
చ|| యెవ్వరివసములు బుద్దెరిగినడచేమన | యివ్వల నారాయణ నీవియ్యక లేదు |
దవ్వుచేరువ మనసుతనయిచ్చయితే గనక | రవ్వగ మృగాదులెల్ల రాజ్యమేలనేరవా ||
చ|| సారెకు నిన్నుదలపించ జంతువులవసమా | కేరి నీవు జిహ్వ బరికించగాగాక |
యీరీతి లోకమెల్లా దమయిచ్చకొలదులనయితే | దూరాన గొక్కెరలు చదవవా వేదాలు ||
చ|| యిందరిపాపపుణ్యాలు యిన్నియు నీచేతలే | కందువ స్వతంత్రులు గారు గాన |
చందపుశ్రీవేంకటేశ శరణంటి నిదె నీకు | చెంది నీవే కాతువుగా చేతలూను వలెనా ||
ప|| దేవ యీ తగవు దీర్చవయ్యా | వేవేలకు నిది విన్నపమయ్యా ||
చ|| తనువున బొడమినతతి నింద్రియములు | పొనిగి యెక్కడికి బోవునయా |
పెనగి తల్లికడ బిడ్డలు భువిలో | యెనగొని యెక్కడి కేగుదురయ్యా ||
చ|| పొడుగుచు మనమున బొడమిన యాసలు | అదన నెక్కడికి నరుగునయా |
వొదుగుచు జలములనుండు మత్స్యములు | పదపడి యేగతి బాసీనయ్యా ||
చ|| లలి నొకటొకటికి లంకెలు నివే | అలరుచు నేమని యందునయా |
బలు శ్రీవేంకటపతి నాయాత్మను | గలిగితి వెక్కడి కలుషములయ్యా ||
దేవతలు గెలువరో తెగి దైత్యులు పారరో
భావించ నింతలో భూభారమెల్ల నణగె ||
నేడు క్రుశ్ణుడు జనించె నేడే శ్రీజయంతి
నేడే రేపల్లెలోన నెలవైనాడు
వేడుక ఉఅశొదకు బిడ్డడైనాడిదె నేడే
పోడిమి జాతకర్మ మొప్పుగనాయ నేడు ||
ఇప్పుడిదె గోవుల నిచ్చెను పుత్రోత్సవము
ఇప్పుడు తొట్టెలనిడి రింతు లెల్లాను
చెప్పరాని బాలలీల సేయగల దెల్లా జేసి
కప్పెను విశ్ణుమాయలు గక్కన నేడిపుడు ||
ఇదివో వసుదేవుని ఇంటిచెరలెల్లబాసె
ఇదివో దేవకి తప మిట్టెఫలించె
చెదరక తా నిలిచె శ్రీవెంకటాద్రిపై నిదె
యెద నలమేలుమంగ యెక్కివున్న దిదివో ||
ప|| దేవదేవు డెక్కెనదె దివ్యరథము | మావంటివారికెల్ల మనోరథము ||
చ|| జగతి బాలులకై జలధులు వేరజేసి | పగటున దోలెనదె పైడిరథము |
మిగులగ గోపగించి మెరయురావణమీద | తెగ యెక్కి తోలెనదె దేవేంద్రరథము ||
చ|| దిక్కులు సాధించి సీతాదేవితో నయోధ్యకు | బక్కన మరలిచె బుష్పరథము |
నిక్కి నరకాసురునిపై నింగిమోవ నెక్కి తోలె | వెక్కసపు రెక్కలతో విష్ణురథము ||
చ|| బలిమి రుక్మిణి దెచ్చి పరులగెలిచి యెక్కె | అలయేగుబెండ్లి కల్యాణరథము |
యెలమి శ్రీవేంకటాద్రి నలమేలుమంగ గూడి | కలకాలమును వేగె ఘనమైనరథము ||
ప|| దేవదేవోత్తముని తిరుతేరు | దేవతలు గొలువగా తిరుతేరు ||
చ|| తిరువీధి లేగీని తిరుతేరు | తిరుపు గొన్నట్లాను తిరుతేరు |
తెరలించె దనుజుల దిరుతేరు | తిరిగె దిక్కులనెల్ల తిరుతేరు ||
చ|| ధిక్కరించీ మోతల దిరుతేరు | దిక్కరి కుంభాలదర దిరుతేరు |
తిక్కు ముత్తేల కుచ్చుల తిరుతేరు | తెక్కుల బ్రతాపించీ తిరుతేరు ||
చ|| తీరిదె గలకలెల్ల దిరుతేరు | ధీర గరుడవాహపు దిరుతేరు |
చేరి యలమేలుమంగతో శ్రీ వేంకటేశ్వరుని | తీరున నెలకొన్నట్టి తీరుతేరు ||
దేవర చిత్తం దివ్య నిధి
దేవనిర్మిత నిధీ యవధానం ||
అతివలు నాట్యంబాడెదమని వు
న్నతి మెఅయుచు నున్నారిదివో
ప్రతినలతో రంధయు మేనకయును
ధ్రుతి విద్య తమకంబున వినుమని ||
గానవిద్య తమకంబున వినుమని
కానుకలివె సురకాంతలవి
కానుపించుకో గంధర్వ సతులను
ధీనుత పంపుసుధీ యవధానం |
రియంకంబున బవళించెదవో
సిరుల విభవముల జెలగెదవో
తిరువేంకటగిరిదేవ యన్నిటా
తిరమందితి విటు ధీ యవధానం |
ప|| దేవరగుణములు దెలియవు | నీవే మాకును నేరుప వయ్యా||
చ|| వదలక నీతో వాసికి బెనగిన | యెదుటనె నీ మన సెట్టుండునో |
కదిసి నీరీతికి గడు దమకించిన | యిది వేసాలని యెంతువో నీవు ||
చ|| చెనకగ నీ యెడ సిగ్గులు నెరపిన | పనులవి యేమని భావింతువో |
ననిచి నీ యెదుట నవ్వులు నవ్విన | తనివి లేనిదని తగ నాడుదువో ||
చ|| కూడుదు నిన్నిట గుబ్బల నొత్తిన | వోడ దనుచు గో రూదుదువో |
యీడనె శ్రీ వేంకటేశ యేలితివి | వీడెమిచ్చితే వెరగందుదువో ||
ప|| దేవశిఖామణి దివిజులు వొగడగ | వేవేలు గతుల వెలసీ వాడే ||
చ|| వీధుల వీధుల వెసతురగముపై | భేదిల బల్లెము బిరబిర దిప్పుచు |
మోదము తోడుత మోహన మూరితి | ఏ దెస జూచిన నేగీ వాడే ||
చ|| కన్నులు దిప్పుచు కర్ణములు కదల | సన్నల రాగెకు చౌకళింపుచును |
అన్నిటా తేజియాడగ దేవుడు | తిన్నగ వాగేలు తిప్పీవాడే ||
చ|| వలగొని దిరుగుచు వాలము విసరుచు | నిలిచి గుఱ్ఱమటు నేర్పులు చూపగ |
బలు శ్రీ వేంకటపతి అహోబలపు | పొలమున సారెకు పొదలీవాడే ||
ప : దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు
ఈవల నీబంట నాకు నెదురింక ఏది
చ : కామధేనువు పిదుకగల కోరికెలివెల్ల
కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట
కామించి నీ బంటనట కమ్మినిన్ను దలచితి
ఏమి మాకు కడమయ్యా ఇందిరా రమణ
చ : ఎంచ కల్పవృక్షమును ఇచ్చు సిరులెల్లాను
మించి కల్పవృక్షముల నీడలా కృష్ణుడవట
అంచల నీ బంటనట ఆత్మలొ నిను నమ్మితి
వంచించ కడమయేది వసుధాధీశ
చ : తగనొక్క చింతామణి తలచినట్లచేసు
మిగుల కౌస్తుభమణి మించినా కృష్ణుడవట
పగటు శ్రీవేంకటేశ భక్తుడ నీకట నేను
జగములో కొరతేది జగదేకవిభుడ
ప|| దైవము పుట్టించినట్టి తనసహజమే కాక | కోవిదునికైనా జాలిగుణమేల విడుచు ||
చ|| ఆరయ బంచదార నద్దుక తినబోతే | చేరరానిముష్టిగింజ చేదేల మాను |
సారమైన చదువులు సారె సారె జదివినా | గోరపుదుష్టునికి కోపమేల మాను ||
చ|| నిప్పు దెచ్చి వొడిలోన నియమాన బెట్టుకొంటే | యెప్పుడును రాజుగాక యిది యేల మాను |
ముప్పిరి బాతకుడైనమూఢు డెన్నియాచారాలు | తప్ప కెంతసేసినాను దయయేల కలుగు ||
చ|| యింటిలోన గొక్కు దెచ్చి యిరవుగ బెట్టుకొంటే | దంటయై గోడలు పడదవ్వ కేలమాను |
గొంటరై శ్రీవేంకటేశు గొలువకుండినవాడు | తొంటిసంసా రవుగాక దొర యేటికౌను ||
ప : దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు
ఈవల నీబంట నాకు నెదురింక ఏది
చ : కామధేనువు పిదుకగల కోరికెలివెల్ల
కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట
కామించి నీ బంటనట కమ్మినిన్ను దలచితి
ఏమి మాకు కడమయ్యా ఇందిరా రమణ
చ : ఎంచ కల్పవృక్షమును ఇచ్చు సిరులెల్లాను
మించి కల్పవృక్షముల నీడలా కృష్ణుడవట
అంచల నీ బంటనట ఆత్మలొ నిను నమ్మితి
వంచించ కడమయేది వసుధాధీశ
చ : తగనొక్క చింతామణి తలచినట్లచేసు
మిగుల కౌస్తుభమణి మించినా కృష్ణుడవట
పగటు శ్రీవేంకటేశ భక్తుడ నీకట నేను
జగములో కొరతేది జగదేకవిభుడ
ప|| దేవుడుగలవారికి దిగులు జింతయు లేదు | శ్రీవిభుడే అన్నిటా రక్షించుగనక ||
చ|| యేలికగలబంటుకు యేవిచారములేదు | వోలి మగడుగలాలికి వొప్పమి లేదు |
పోళిమి దండ్రిగలపుత్రుని కంగద లేదు | మేలుగా బండినభూమికి గరవులేదు ||
చ|| బలముగలరాజుకు భయమేమియు లేదు | కలిమిగలవాని కక్కర లేదు |
యిల నాచారవంతుని కేపాపమును లేదు | తలపుబుణ్యముగల ఆతనికి జేటు లేదు ||
చ|| గురువుగలవానికి గొఱత యేమియు లేదు | పరముగలవానికి భ్రాంతులు లేవు |
యిరవై శ్రీవేంకటేశు డిన్నిటా మాకు గలడు | అరయ దాసులము మా కడ్డాకే లేదు ||
-ప|| దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ | వేవేల మొక్కులు లోకపావని నీకమ్మా ||
చ|| ధర్మార్థకామ మోక్షతతులు నీ సోపానాలు | అర్మిలి నాలుగువేదాలదె నీ దరులు |
నిర్మలపు నీ జలము నిండు సప్తసాగరాలు | కూర్మము నీ లోతు వోకోనేరమ్మా ||
చ| తగని గంగాది తీర్థమ్ములు నీకడళ్ళు | జగతి దేవతలు నీ జల జంతును |
గగనపు బుణ్యలోకాలు నీ దరిమేడలు | మొగి నీచుట్టు మాకులు మునులోయమ్మా ||
చ|| వైకుంఠ నగరము వాకిలే నీ యాకారము | చేకొను పుణ్యములే నీ జీవభావము |
యేకడను శ్రీ వేంకటేశుడే నీ వునికి | దీకొని నీ తీర్థమాడితిమి కావవమ్మా ||
ప|| దేహము దా నస్థిరమట దేహి చిరంతనుడౌనట | దేహపుమోహపుసేతలు తీరుట లెన్నడొకో ||
చ|| కన్నుల బుట్టినకాంక్షలు కప్పికదా దుర్బోధల | కన్నులు మనసును దనియక గాసిబడిరి జనులు |
తన్నిక నెరుగుట లెన్నడు తలపుల దొలగుట లెన్నడు | తిన్ననిపరవశములచే దిరుగుట లెన్నడొకో ||
చ|| సిగ్గులుదొలగనియాశల జిక్కికదా దుర్మానపు- | సిగ్గులయెగ్గులచేతను చిక్కువడిరి జనులు |
సిగ్గులు దొలగుట యెన్నడు చిత్తములోనౌటెన్నడు | తగ్గులమొగ్గులసేతలు తలగుట లెన్నడొకో ||
చ|| మనసునబుట్టినయాతడు మనసున బెనగొని తిరుగగ | మనసే తానగుదైవము మరచిరి యందరును |
అనయము తిరువేంకటపతి యాత్మ దలచి సుఖింపుచు | ఘనమగు పరమానందము కలుగుట లెన్నడొకో ||
దేహినిత్యుడు దేహము లనిత్యాలు
యిహల నా మనసా యిది మరువకుమీ ||
ముది బాతచీరమాని కొత్త చీరగట్టినట్టు
ముదిమేను మాని దేహముమొగి గొత్తమేను మోచు
అదన జంపగలేవు ఆయుధము లితని
గదసి యగ్నియు నీరు గాలి జంపగ లేవు ||
ఈతడు నరకు వడ డీతడగ్ని గాలడు
యీతడు నీటమునుగ డీతడు గాలిబోడు
చేతనుడై సర్వగతుండొఊ చెలియించ డేమిటను
యీతల ననాది యీ తడిరపు గదలడు ||
చేరికానరానివాడు చింతించరానివాడు
భారపు వికారాల పాసిన వాడీ ఆత్మ
ఆరయ శ్రీవేంకటేశునాధీన మీతడని
సారము తెలియుటే సత్యం జ్ఞానము || ||దేహినిత్యుడు||
ప|| దైవకృతంబట చేతట తనకర్మాధీనంబట | కావలసినసౌఖ్యంబులు గలుగక మానీనా ||
చ|| ఎక్కడిదుఃఖపరంపర లెక్కడిసంసారంబులు | యెక్కడిజన్మము ప్రాణులకేలా కలిగినది |
యెక్కడిమోహవిడంబన యెక్కడియాశబంధము | యెక్కడికెక్కడ నిజమై యివి దానుండీనా ||
చ|| యీకాంతలు నీద్రవ్యము లీకన్నులవెడయాసలు | యీకోరికె లీతలపులు యిట్టే వుండీనా |
యీకాయం బస్థిరమన కీదుర్దశలకు లోనై | యీకల్మషముల బొరలగ నివి గడతేరీనా ||
చ|| దేవశిఖామణి తిరుమల దేవునికృపగల చిత్తము | పావనమై దురితంబుల బాయక మానీనా |
ఆవిభుకరుణారసమున నతడే తను మన్నించిన | ఆవేడుక లీవేడుక లాసలు సేసీనా ||
దైవక్రుతమెవ్వరికి దప్పింపరాదనుచు
భావించి జనులాడుపలుకు నిజమాయ ||
కందునకు బెడబాసి చందురుదింతి ముఖ్హ
చందురుడైన నది అందును గలిగె
కందువగు చెలినొసలి కస్తూరి తిలకమను
కందు ముఖ్హచంద్రునకుగడు నందమాయ ||
జలజములు శశిచేత నులికి యీకాంతకుచ
జలజంబులైన నది సరుసనే కలిగె
లలితమగు ప్రాణవల్లభుని సురతాంకమున
విలువనేయగరాని విదియ చందురులు ||
తీగె బహుజలజములకు దెమలి కామినిమేను
దీగె యయ్యిన నదియుదిరుగ మరికలిగె
ఈ గతుల దిరువేంకటేశ్వరుని సమసురత
యోగంబు వలన ఘ్హర్మోదకశ్రీలు ||
ప|| దైవమా నీకు వెలితా తలపువెలితేకాక | వేవేలు కర్మల వేసారగవలనె ||
చ|| హరియంటే బాపేటి అన్నిపాపాలు సేసిన | పొరినందుపై నమ్మిక పుట్టుదుగాక |
నరసింహాయంటే వచ్చే నానాపుణ్యాలకు | తిరముగా ఋణములు దీర్చుకొనగలనా ||
చ|| దేవ జగన్నాథయంటే తెగనిజన్మములేవి | కైవశము నామనసు గాదుగాక |
గోవిందయనియంటే గూడని పదవులేవి | కావిరిగాలమూరకె కడపేము నేము ||
చ|| వేదనారాయణయంటే వీడేటి బంధములు | ఆదిగా మూడులోకాలనైనా నున్నదా |
శ్రీదేవిపతియైన శ్రీవేంకటేశ్వరుడా | యేదెసా నీవే నన్ను యీడేర్తువుగాక ||
దైవమా నీమాయ తామొలెఱగనీదు
కావరపువిషయాలకట్లు వదలవు
గక్కున బెరిగివచ్చీ కాలము మీదమీద
వొక్కనాటికొక్కనాటి కొత్తు కొత్తుక
నిక్కి తుమ్మిదలవంటినెరులెల్లా దెల్లనాయ
కక్కరమాయ మేను కాంక్షలూ నుడుగవు
చిన్ననాడుమోహించినచెలులు నేజూడగానే
పన్నినవయసుమీరి ప్రౌడలైరి
వన్నెకుబెట్టినసొమ్ము వడి రాసి యెత్తుదీసె
మున్నిటివే వెనకాయ ముచ్చటా దొలగదు
సిగ్గులెల్లా బెడబాసె చేరి యవ్వరు నవ్వినా
యెగ్గుపట్టదు మనసు యెఱుకతోనే
నిగ్గులశ్రీవేంకటేశ నీవు నన్ను నేలుకొని
దగ్గరి నాలోనుండగా తలపూగైవాలదు
ప|| దైవమా పరదైవమా | యేవగింతలు నాకు నెట్టు దెచ్చేవో ||
చ|| పాపకర్ముని దెచ్చి పరమియ్యదలచిన | మేపులకే పోక మెయికొనీనా |
తీపులు రూపులు దివిరి నావెనువెంట- | నేపొద్దు నీవేడ దెచ్చేవో ||
చ|| అధమాధముని దెచ్చి యధికుని జేసేనంటే | విధినిషేధములు వివరించునా |
నిధినిధానములు నిచ్చనిచ్చలు బెక్కు- | విధముల నెటువలె వెదచల్లెదవో ||
చ|| అతికష్టుడగునాకు నలవిగానియీ- | మత మొసగిన నేను మరిగేనా |
ప్రతిలేని వేంకటపతి నీదునామా- | మృత మిచ్చి నను నీవే మెరయింతుగాక ||
ప|| దైవమా పరదైవమా | యేవగింతలు నాకు నెట్టు దెచ్చేవో ||
చ|| పాపకర్ముని దెచ్చి పరమియ్యదలచిన | మేపులకే పోక మెయికొనీనా |
తీపులు రూపులు దివిరి నావెనువెంట- | నేపొద్దు నీవేడ దెచ్చేవో ||
చ|| అధమాధముని దెచ్చి యధికుని జేసేనంటే | విధినిషేధములు వివరించునా |
నిధినిధానములు నిచ్చనిచ్చలు బెక్కు- | విధముల నెటువలె వెదచల్లెదవో ||
చ|| అతికష్టుడగునాకు నలవిగానియీ- | మత మొసగిన నేను మరిగేనా |
ప్రతిలేని వేంకటపతి నీదునామా- | మృత మిచ్చి నను నీవే మెరయింతుగాక ||
దైవము నీవే యిక దరి చేరుతువుగాక
జీవులవసము గాదు చిక్కిరి లోలోననే
పుట్టుట సహజ మిది పొదలేజీవులకెల్ల
గట్టిగా జగమునందు కలకాలము
నట్టేటివరదవలె నానాటినీమాయ
కొట్టుక పారగజొచ్చె కూడినవిజ్ఞానము
పాపమే సహజము బద్దసంసారులకెల్ల
కాపురపువిధులలో కలకాలము
తేపలేనిసముద్రమురెరగున కర్మమెల్లా
మాపురేపు ముంచజొచ్చె మతిలోనిధైర్యము
లంపటమే సహజము లలి దేహధారులకు
గంపమోపు కోరికెలకలకాలము
యింపుల శ్రీవేంకటేశ ఇదె నీదాసులని
పంపుసేసి బ్రదికించె ప్రపన్నసుగతి
ప|| దైవము పుట్టించినట్టి తనసహజమే కాక | కోవిదునికైనా జాలిగుణమేల విడుచు ||
చ|| ఆరయ బంచదార నద్దుక తినబోతే | చేరరానిముష్టిగింజ చేదేల మాను |
సారమైన చదువులు సారె సారె జదివినా | గోరపుదుష్టునికి కోపమేల మాను ||
చ|| నిప్పు దెచ్చి వొడిలోన నియమాన బెట్టుకొంటే | యెప్పుడును రాజుగాక యిది యేల మాను |
ముప్పిరి బాతకుడైనమూఢు డెన్నియాచారాలు | తప్ప కెంతసేసినాను దయయేల కలుగు ||
చ|| యింటిలోన గొక్కు దెచ్చి యిరవుగ బెట్టుకొంటే | దంటయై గోడలు పడదవ్వ కేలమాను |
గొంటరై శ్రీవేంకటేశు గొలువకుండినవాడు | తొంటిసంసా రవుగాక దొర యేటికౌను ||
ప|| దొరకునా యితనికృప తుదిపదంబు | అరిదివిభవము లొల్లమనినా బొదలు ||
చ|| సొంపలర నితడు కృపజూచు టరుదనికాక | యింపు సామాన్యమా యితనికరుణ |
లంటమైనఘనమైన లక్ష్మీకటాక్షములు | సంపదలు తోడనే చల్లువెదలాడు ||
చ|| తగ నితనిపై భక్తి తగులు టరుదనికాక | నగుట సామాన్యమా ననిచి యితడు |
జగదేకహితములుగ సరసతలు సౌఖ్యములు | దిగులువాయగ నితడు దిప్పు దీరాడు ||
చ|| తిరువేంకటాద్రి సిద్ధించు టరుదనికాక | మరుగ దను నిచ్చునా మరియొకరిని |
యిరవైన భోగములు యిష్టసామ్రాజ్యములు | విరివిగొని యితనిదయవెంటనే తిరుగు ||
దొరకె మాపాలికి గందువయర్థము
దరిదాపైయుండినతత్వార్థము
తిరముగ నల్లదీవి దెచ్చినయర్థ మిదివో
విరజవోడరేవున వెళ్ళినర్థము
పరమభాగవతులు పాతినర్థ మిదివో
పురుషోత్తముడనేటిపురుషార్థము
చందపువేదముల శసనము వేసినర్థము
ముందు సముద్రలకెల్లా మొదలర్థము
అందరియాత్మలనేటిఅంగళ్ళలోనియర్థము
యెందు సహస్రనామపుటెన్నికర్థము
కొలచి బ్రహ్మాండముల కొప్పెరలోనర్థము
యిల నిహపరముల కెక్కినర్థము
యెలమి హీనునినైన యెక్కుడుసేసేయర్థము
అలరి శ్రీవేంకటేశుడైనయర్థము
ప|| దొరకెగా పూజ కందువ పూజ నీ | విరహపు తనుతావి విరవాది పూజ ||
చ|| కలికి నీ కనుచూపు కలువరేకుల పూజ | లలన నీ నగవు మొల్లల పూజ |
తలపోత చింత చిత్తపు గమలపు పూజ | చలివేడి వూర్పు నీ సంపంగి పూజ ||
చ|| కనుల జెక్కిన జేయి కరపల్లవపు పూజ | తను పులకలు జాజి ననల పూజ |
తనరు నీ వలపులు దొంతర పూవుల పూజ | యెనయు జెమట మల్లె మొగ్గల పూజ ||
చ|| చెనకు నీగోళ్ళే చిరి గేదగుల పూజ | గునియు గుబ్బలు పూవు గుత్తుల పూజ |
ఘనతమై గూడి వేంకటపతి మోము సో- | కిన నీదు మోవి మంకెన పూవు పూజ ||
ప|| దొరతో సంగాతము దొరికిన పాటే చాలు | వొరసి మీరగ బోతే నొక్కరీతి నుండునా ||
చ|| యేకతాన లోన నుండి యేలనన్ను బిలిచేవు | వాకిటికి రావయ్యా వలసితేను |
చేకొని యొకతె యుంటె సిగ్గువడి వెళ్ళి వచ్చి | కూకులు వత్తులుగాను కూళదాననా ||
చ|| మరగించి మరగున మాట లేలాడించేవు | తెఅదియ్యవయ్య అంత తీట గలిగితె |
వరుసకు వచ్చి నాపె వాదు నాతో బెట్టుకొంటె | విరసమై యూరకుండ వెఱ్ఱిదాననా ||
చ|| పట్టె మంచముపై నుండి పైగాలు చాచనేల | యిట్టె వుర మెక్కవయ్య యింత గలిగె |
జట్టిగా శ్రీ వేంకటేశ సరినొకతె గూచుంటె | వట్టి యితవు సేసుకో వాసిలేని దాననా ||
ప|| దోమటి వింతెరుగరా తొల్లిటివారు | వామదేవవసిష్ఠవ్యాసాదులు ||
చ|| తానే దైవమైతే తపమేల జపమేల | పూని సారె బూజించేపూజలేల |
కూనువంగి యింటింట గోరనేల వేడనేల | యీనెపాన లోకమెల్లా నేలరాదా తాను ||
చ|| తగ దా స్వతంతుడైతే దరిద్రదుఃఖములేల | నొగలి వ్యాధులచేత నొవ్వనేల |
నగుబాటులైన జననమరణములేల | ముగురువేల్పులదండ మొనచూపరాదా ||
చ|| శ్రీ వేంకటేశుడే శేఖరపుదైవమని | సావధాను డితనికి శరణుజొచ్చి |
భావములోపల దనపాపబంధములు బాసి | తావుల నాతనికృప దండ చేరరాదా ||
ద్రువవరదా సంస్తుతవరదా
నవమైనయార్తుని నన్ను గావవే
కరిరాజవరదా కాకాసురవరదా
శరణాగతవిభీష్ణవరదా
సిరుల వేదాలు నిన్ను జెప్పగా వినీని
మరిగి మఱుగుచొచ్చే మమ్ము గావవే
అక్రూరవరదా అంబరీషవరదా
శక్రాదిదివిజనిచయవరదా
విక్రమించి యిన్నిటా నీవే ఘనమని నీకు
చక్రధర శరణంటి సరి గావవే
చక్రధర శరణంటి సరి గావవే
ద్రౌపదీవరదా తగ నర్జునవరదా
శ్రీపతీ ప్రహ్లాదిశిశువరదా
యేపున శ్రీవేంకటాద్రి నిటు నేను నాగురుడు
రూపగా గొలిచే నచ్చుగ గావవే
ధ
ప|| ధృవవరదా సంస్తుతవరదా | నవమైనయార్తుని నను గావవే ||
చ|| కరిరాజవరదా కాకాసురవరదా | శరణాగతవిభీషణవరదా|
సిరుల వేదాలు నిన్ను జెప్పగా వినీని | మరిగి మఱుగుచొచ్చే మమ్ము గావవే ||
చ|| అకౄరవరదా అంబరీషవరదా | శక్రాదిదివిజనిచయవరదా |
విక్రమించి యిన్నిటా నీవే ఘనమని నీకు | చక్రధర శరణంటి సరి గావవే ||
చ|| ద్రౌపదీవరదా తగ నర్జునునివరదా | శ్రీపతీ ప్రహ్లాదిశిశువరదా |
యేపున శ్రీవేంకటాద్రి నిటు నేను నాగురుడు | చూపగా గొలిచే నచ్చుగ గావవే ||
న
నంతలే చొచ్చితిగాని సరకు గాననైతి
యింతట శ్రీహరి నీవే యిటు దయజూడవే
కాంతచనుగొండలు కడకు నెక్కితి గాని
యెంతైనా మోక్షపుమెట్లు యెక్కలే నైతి
అంతట జవ్వనమనే అడవి చొచ్చితిగాని
సంతతహరిభక్తెనేసంజీవి గాననైతి
తెగి సంసారజలధి దిరుగులాడితిగాని
అగడై వైరాగ్యరత్న మది దే నైతి
పొగరుజన్మాలరణభూములు చొచ్చితిగాని
పగటుగామాదులపగ సాధించనైతి
తనువనియెడికల్పతరువు యెక్కితిగాని
కొనవిజ్ఞానఫలము గోయలేనైతి
ఘనుడ శ్రీవేంకటేశ కమ్మర నీ కృపచేత
దనిసి యేవిధులను దట్టుపడనైతి
ప|| నంద నందన వేణునాద వినోదము- | కుంద కుంద దంతహాస గోవర్ధన ధరా ||
చ|| రామ రామ గోవింద రవిచంద్ర లోచన | కామ కామ కలుష వికార విదూరా |
ధామ ధామ విభవత్ప్రతాప రూప దనుజ ని- | ర్ధూమ ధామ కరణ చతుర భవభంజనా ||
చ|| కమల కమలవాస కమలా రమణ దేవో- | త్తమ తమోగుణ సతత విదూర |
ప్రమదత్ప్రమదానుభవ భావ కరణ | సుముఖ సుధానంద శుభరంజనా ||
చ|| పరమ పరాత్పర పరమేశ్వరా | వరద వరదామల వాసుదేవ |
చిర చిర ఘననగ శ్రీవేంకటేశ్వర | నరహరి నామ పన్నగ శయనా ||
ప|| నందకధర నంద గోపనందన | కందర్ప జనక కరుణాత్మన్ ||
చ|| ముకుంద కేశవ మురహర | సకలాధిప పరమేశ్వర దేవేశ |
శుకవరద సవితృ సుధాంశు లోచన | ప్రకట విభవ నమో పరమాత్మన్ ||
చ|| ధృవపాంచాలీ స్తుతివత్సల మా- | ధవ మధుసూదన ధరణీధరా |
భువనత్రయ పరిపోషణ తత్పర | నవనీతప్రియ నాదాత్మన్ ||
చ|| శ్రీమాన్ వేంకట శిఖిరనివాస మ- | హామహిమాన్ నిఖిలాణ్డపతే |
కామిత ఫల భోగప్రదతే నమో | స్వామిన్ భూమన్ సర్వాత్మన్ ||
ప|| నగధర నందగోప నరసింహ వో- | నగజవరద శ్రీ నారసింహ ||
చ|| నరసింహ పరంజ్యోతి నరసింహా వీర- | నరసింహ లక్ష్మీనారసింహా |
నరసుఖ బహుముఖ నారసింహా వో- | నరకాంతక జేజే నారసింహా ||
చ|| నమో నమో పుణ్డరీక నారసింహ వో- | నమిత సురాసుర నారసింహా |
నమకచమకహిత నారసింహా వో- | నముచిసూదన వంద్య నారసింహా ||
చ|| నవరసాలంకార నారసింహా వో- | నవనీతచోర శ్రీ నారసింహా |
నవగుణ వేంకట నారసింహా వో- | నవమూర్తి మండెము నారసింహా ||
ప|| నగవులు నిజమని నమ్మేదా |
వొగినడియాసలు వొద్దనవే ||
చ|| తొల్లిటి కర్మము దొంతల నుండగ |
చెల్లబోయిక జేసేదా |
యెల్ల లోకములు యేలేటి దేవుడ |
వొల్ల నొల్లనిక నొద్దనవే ||
చ|| పోయిన జన్మము పొరుగులనుండగ |
చీయనక యిందు జెలగేదా |
వేయినామముల వెన్నుడమాయలు |
ఓ యయ్య యింక నొద్దనవే ||
చ|| నలి నీనామము నాలికనుండగ |
తలకొని యితరము చదవేదా |
బలు శ్రీ వేంకటపతి నిన్నుగొలిచి |
వొలుకు చంచలము లొద్దనవే ||
ప|| నగు మొగము తోడి వో నరకేసరి | నగ రూప గరుడాద్రి నరకేసరి ||
చ|| అమిత దానవ హరణ ఆదినరకేసరి | అమిత బ్రహ్మాది సుర నరకేసరి |
కమలాగ్ర వామాంక కనక నరకేసరి | నమో నమో పరమేశ నరకేసరి ||
చ|| రవిచంద్ర శిఖ నేత్ర రౌద్ర నర కేసరి | నవ నారసింహ నమో నర కేసరి |
భవనాశినీ తీర భవ్య నర కేసరి | నవరసాలంకార నర కేసరి ||
చ|| శరణాగత త్రాణ సౌమ్య నరకేసరి | నరక మోచన నామ నరకేసరి |
హరి నమో శ్రీ వేంకటాద్రి నరకేసరి | నరసింహ జయ జయతు నరకేసరి ||
ప|| నగుబాట్లబడేనాజిహ్వా | పగటున నిదివో పావనమాయ ||
చ|| ఇల నిందరి నుతియించి పెంచువలె | నలినలియైనది నాజిహ్వా |
నలినోదరుశ్రీనామము దలచిన- | ఫలమున కిదివో పావనమాయ ||
చ|| భ్రమపడి మాయపుపడతులతమ్మలు | నమలి చవులుగొనె నాజిహ్వా |
అమరవంద్యుడగుహరి నుతియించగ | ప్రమదము చవిగొని పావనమాయ ||
చ|| నెలతలయోనిద్రవనదులను | నలుగడ నీదెను నాజిహ్వా |
అలసి వేంకటనగాధిపయనుచును | పలికినయంతనె పావనమాయ ||
ప|| నటనల భ్రమయకు నా మనసా |
ఘటియించు హరియే కలవాడు ||
చ|| ముంచిన జగమిది మోహినీ గజము |
పొంచిన యాస పుట్టించేది |
వంచనల నిజమువలెనే వుండును |
మంచులు మాయలె మరునాడు ||
చ|| సరి సంసారము సంతలకూటమి |
సొరిది బజారము చూపేది |
గరిమ నెప్పుడు గలకల మనుచుండును |
మరులగు విధమే మాపటికి ||
చ|| కందువ దేహముగాని ముదియదిది |
అందిన బహు రూప మాడేదిది |
యెందును శ్రీ వేంకటేశ్వరుండును |
డిందు పడగనిదె తెరమరుగు ||
ప|| నడువరో జడియక సవ్యమార్గమిది | మడుగరి వైష్ణవ మార్గమిది ||
చ|| ఘన శుకముఖ్యులు గన్న మార్గమిది | జనకాదుల నిశ్చల మార్గమిది |
సనత్కుమారుడు జరపు మార్గమిది | మనువుల వైష్ణవ మార్గమిది ||
చ|| నలుగడ వసిష్ఠు నడుచు మార్గమిది | యిల వేదవ్యాసుల మార్గంబిది |
బలిమిగలుగు ధృవపట్టపు మార్గమిది | మలసినవైష్ణవ మార్గమిది ||
చ|| పరమ మార్గంబిదె ప్రపంచ మార్గమిది | గురు మార్గంబిదె గోప్యమిదే |
గరిమెల శ్రీ వేంకటపతి మాకును | మరిపెను వైష్ణవ మార్గమిదే ||
ప|| నదులొల్లవు నాస్నానము కడు- | సదరము నా కీస్నానము ||
చ|| ఇరువంకల నీయేచినముద్రలు | ధరియించుటె నాస్నానము |
ధరపై నీనిజదాసులదాసుల- | చరణధూళి నాస్నానము ||
చ|| తలపులోన నినుదలచినవారల | దలచుటే నాస్నానము |
వలనుగ నినుగనువారల శ్రీపాద- | జలములే నాస్నానము ||
చ|| పరమభాగవత పాదాంబుజముల- | దరుశనమే నాస్నానము |
తిరువేంకటగిరిదేవ నీకథా- | స్మరణమే నాస్నానము ||
నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ
అన్నిటా రక్షించకపో దంతర్యామి
సొమ్ము వోవేసినవాడు చుట్టిచుట్టి వీథులెల్లా
కమ్ముక వెదకీనత కన్నదాకాను
నమ్మిన అజ్ఞానములో నన్ను బడవేసుకొని
అమ్మరో వూరకుందురా అంతర్యామి
వోడబేరమాడేవాడు వొకదరి చేరితి కూడినయర్థము గాచుకొనీనట
యీడనే ప్రపంచములో నిట్టె నన్ను దరిచేర్చి
వోడక కాచుకోరాదా వోయంతర్యామి
చేరి పుప్పమ్మేవాడు చిట్లు వే గనడట
వూరకే శ్రీవేంకటేశ వోపికతోడ
అరయ నన్ను బుట్టించినట్టివాడవు నాభార
మేరీతి నైన మోవు మిక నంతర్యామి
నన్ను నెవ్వరు గాచేరు నాటిపగెంతురుగాక
నిన్న నేడీరోతలైతే నీతియౌనా నాకును.
దేవుడ నేనేయంటా తిరిగే నాస్తికుడనా
దేవతలకు మొక్కబోతే నిక నగరా
కావించి యింద్రియములే గతెని యిన్నాళ్లు నుండి
ఆవల జితేంద్రియుడనంటే నవి నగవా.
కర్మము దొల్లి సేయక కడుదూరమైన ఇక నా
కర్మము సేయగబోతే కర్మమే నగదా
దుర్మతి సంపారినై తొయ్యలులకు మోహించి ఆర్మిలి దూషించితేను అటె వారు నగరా.
నేనే స్వతంత్రుడనంటా నిండుదానాలెల్ల మాని
పూని యిక జేయబోతే పొంచి యవి నగవా
నే నిన్నిటా సిగ్గువడి నీమరగు చొచ్చితిని
అనుకొని శ్రీవేంకటాధిపుడ కావవే.
ప|| నమామ్యహం మానవ సింహం | ప్రమదాంక మహోబల నరసింహం ||
చ|| దానవ దైత్య విదారణ సింహం | నానాయుధ కర నరసింహం |
భూ నభోంత రాపూరిత సింహం | ఆనన వహ్ని లయాంతక సింహం ||
చ|| ప్రళయ నృసింహం బహుముఖ సింహం | సలలిత గరుడాచల సింహం |
కులిశ నఖర ముఖ ఘోషిత సింహం | తిలకిత బహురవి దీపిత సింహం ||
చ|| శాంత నృసింహం శౌర్య నృసింహం | సంతత కరుణా జయ సింహం |
కాంత శ్రీ వేంకట గిరి సింహం | చింతిత ఘన సంసిద్ధి నృసింహం ||
ప|| నమామ్యహం మానవసింహం | ప్రమదాంక మహోబల నరసింహం ||
చ|| దానవదైత్య విదారణ సింహం | నానాయుధకర నరసింహం |
భూనభోంతరాళ పూరిత సింహం | ఆనన వహ్నిలయాంతక సింహం ||
చ|| ప్రళయ నృసింహం బహుముఖ సింహం | సలలిత గరుడాచల సింహం |
కులిశ నఖరముఖ ఘోషిత సింహం | తిలకిత బహు రవిదీపిత సింహం ||
చ|| శాంత నృసింహం శౌర్య నృసింహం | సంతత కరుణా జయసింహం |
కాంతం శ్రీవేంకటగిరి సింహం | చింతిత ఘన సంసిద్ధ నృసింహం ||
ప|| నమిత దేవం భజే నారసింహం | సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం ||
చ|| విజయ నరసింహం వీర నరసింహం | భుజబల పరాక్రమ స్ఫుట నరసింహం |
రజని చర విదళన విరాజిత నృసింహం | సుజన రక్షక మహాశూర నరసింహం ||
చ|| దారుణ నరసింహం ప్రతాప నరసింహం | చారు కల్యాణ నిశ్చల నృసింహం |
ధీర చిత్తావాస దివ్య నరసింహం | సార యోగానంద చతుర నరసింహం ||
చ|| విమల నరసింహం విక్రమ నృసింహం | కమనీయ గుణగణాకర నృసింహం |
అమిత సుశ్రీ వేంకటాద్రి నరసింహం | రమణీయ భూషాభిరామ నరసింహం ||
ప|| నమో నమో జగదేకనాథ తవ సర్వేశ | విమల విశ్రుత లసద్విఖ్యాత కీర్తే ||
చ|| రామ రఘువర సిత రాజీవలోచన | భూమిజా రమణ త్రిభువన విజయ |
కోమలాంగ శ్యామ కోవిద రణరంగ | భీమ విక్రమ సత్యబిరుద ప్రవీణ ||
చ|| దళిత దైతేయ కోదండ దీక్షాదక్ష | జలజాప్తకుల విభీషణరక్షక |
కలిత దశరథ తనయ కౌసల్యానంద | సులభ వానర ముఖ్య సుగ్రీవ వరద ||
చ|| చారులక్ష్మణ భరతశతృఘ్న పూర్వజ | తారకబ్రహ్మ నిత్యస్వరూప |
ధీరశ్రీవేంకటాధిప భక్తవత్సల | భూరిగుణ సాకేతపుర నివాస ||
ప|| నమో నమో దశరథ నందన మము రక్షించు | కమనీయ శరణాగత వజ్రపంజర ||
చ|| కోదండ దీక్షా గరుడ రామచంద్ర | ఆదిత్యకుల దివ్యాస్త్ర వేది |
సోదించు మారీచుని తలగుండుగండ | ఆది నారాయణ అసుర భంజన ||
చ|| ఖరదూషణ శిరఃఖండన ప్రతాప | శరథి బంధన విభీషణ వరద |
అరయ విశ్వామిత్ర యాగ సంరక్షక | ధరలో రావణ దర్పాపహరణ ||
చ|| పొలుపొంద నయోధ్యా పురవరా ధీశ్వర | గెలుపొందిన జానకీ రమణ |
అలఘు సుగ్రీవ అంగదాది కపి సేవిత | సలలిత శ్రీ వేంకటశైల నివాసా ||
ప|| నమో నమో దానవవినాశక చక్రమా | సమర విజయమైన సర్వేశు చక్రమా ||
చ|| అట్టె పదారు భుజాల నమరిన చక్రమా | పట్టిన ఆయుధముల బలు చక్రమా |
నెట్టన మూడుగన్నుల నిలచిన చక్రమా | రట్టుగా మన్నించవే మొరయుచు చక్రమా ||
చ|| అరయ నారుగోణాల నమరిన చక్రమా | ధారలు వేయిటి తోడి తగు చక్రమా |
ఆరక మీదికి వెళ్ళే అగ్ని చక్రమా | గారవాన నీదాసుల గావవే చక్రమా ||
చ|| రవిచంద్రకోటి తేజరాసియైన చక్రమా | దివిజ సేవితమైన దివ్య చక్రమా |
తవిలి శ్రీ వేంకటేశు దక్షిణకర చక్రమా | యీవల నీదాసులము యేలుకోవే చక్రమా ||
ప|| నమో నమో రఘుకుల నాయక దివిజవంద్య | నమో నమో శంకర నగజానుత ||
చ|| విహిత ధర్మ పాలక వీర దశరథ రామ | గహన వాసిని తాటక మర్దన- |
అహల్యా శాప విమోచన అసురకుల భంజన | సహజ విశ్వామిత్ర సవన రక్షక ||
చ|| హర కోదణ్డ హర సీతాంగనా వల్లభ | ఖర దూషణారి వాలి గర్వాపహ |
ధరణి దనుజాది దనుజుల పాలక | శరధి రంగ కృత్య సౌమిత్రి సమేత ||
చ|| బిరుద రావణ శిరో భేదక విభీషణ వరద | సాకేత పురవాస రాఘవ నిరుపమ |
శ్రీ వేంకట నిలయ-నిజ సకల | పురవర విహార, పుండరీకాక్ష ||
నమో నమో లక్ష్మీ నరసింహా
నమో నమో సుగ్రీవనరసింహా
వరద సులభ భక్త వత్సల నరసింహా
నరమృగవేష శ్రీనరసింహా
పరమపురుష సర్వ పరిపూర్ణ నరసింహా
గిరిగుహావాస సుగ్రీవనరసింహా
భయహర ప్రహ్లాదపాలన నరసింహా
నయనత్రయారవింద నరసింహా
జయ జయ సురముని సంస్తుత నరసింహా
క్రియాకలాప సుగ్రీవనరసింహా
అతికృపానిలయ మోహనరూప నరసింహా
నతపితామహ ఉగ్ర నరసింహా
సతతశ్రీవేంకటేశ్వర దివ్యనరసింహా
కితవారిభంజన సుగ్రీవనరసింహా
నమో నారాయణ నావిన్నపమిదివో
సమానుడగాను నీకు సర్వేశ రక్షించవే
మనసు నీయాధీనము మాటలు నీవాడేటివే
తనువు నీపుట్టించినధన మిది
మును నీవంపున నిన్ని మోచుకున్నవాడనింతే
వెనక నన్ను నేరాలు వేయక రక్షించవే
భోగములెల్లా నీవి బుధ్ధులు నీవిచ్చినవి
యీగతి నాబతుకు నీవిరవైనది
చేగదీర నీవునన్ను జేసినమానిసి నింతే
సోగల నాయజ్ఞానము చూడక రక్షించవే
వెలినీవె లోనీవే వేడుకలెల్లా నీవే
కలకాలమును నీకరుణే నాకు
యిల శ్రీవేంకటేశ నీవేలుకొన్నబంట నింతే
నెలవు దప్పించక నీవే రక్షించవే
ప|| నమో నారాయణాయ నమః | సమధికానందాయ సర్వేశ్వరాయ ||
చ|| ధరణీసతీఘన స్తనశైలపరిరంభ- | పరిమళ శ్రమజల ప్రమదాయ |
సరసిజ నివాసినీ సరసప్రణామయుత- | చరణాయతే నమో సకలాత్మకాయ ||
చ|| సత్యభామాముఖాంచన పత్రవల్లికా- | నిత్య రచనక్రియా నిపుణాయ |
కాత్యాయనీ స్తోత్రకామాయ తే నమో | ప్రత్యక్ష నిజపరబ్రహ్మ రూపాయ ||
చ|| దేవతాధిప మకుటదివ్య రత్నాంశుసం- | భావితామల పాదపంకజాయ |
కైవల్య కామినీకాంతాయ తే నమో | శ్రీవేంకటాచల శ్రీనివాసాయ ||
నమ్మిన దొకటే నాకు నీశరణము
యెమ్మెలసంసార మింతే యిందేమి గలదు
యేటికర్మము నా కేటిధర్మము
యేటిదో నే జేయుగా నీ కేమి గూడెను
నాటకపుతొంటివారు నడిచినమార్గమని
యీటుకు జేసేగాక యిందేమి గలదు
యేడతపము నా కేడజపము నే
వాడిక జేయగ నీకు వచ్చినదేమి
బెడిదపుబెద్దలెల్లా బెట్టినతిట్టములంటా
యీడుకు జేసెగాక యిందేమి గలరు
యెక్కడిపుణ్యము నా కెక్కడిభోగములు
యిక్కువ నన్నిట్ల జేసి యేమిగంటివి
నిక్కెపుశ్రీవేంకటేశ నిన్ను గనుటగాక
యెక్కడి కెక్కడిమాయ లిందేమి గలదు
నరసింహ రామకృష్ణ నమో శ్రీవేంకటేశ
సరుగ నా(నా) శత్రుల సంహరించవే
బావతిట్లకు శిశుపాలుని జంపిన
యేవ కోపకాడవు నేడెందు వోతివి
నీవాడనని నన్ను నిందించే శత్రువును
చావగొట్టి వాని నిట్టే సంహరించవే
దాసుని భంగించేటి తరి కస్యపు జంపిన
యీసుకోపగాడ విపు డెందువోతివి
మేసుల నీలాంఛనాలు మించి నన్ను దూషించే
సాసించి శత్రువును సంహరింపవే
కల్లలాడి గూబయిల్లు గైకొన్న గద్ద జంపిన
యెల్లగాగ కోపకాడ వెందువోతివి
యిల్లిదె శ్రీవేంకటేశ యీ నీ మీది పాటలు
జల్లన దూషించు శత్రు సంహరింపవే
ప|| నరులారా నేడువో నారసింహ జయంతి | సురలకు ఆనందమై శుభము లొసగెను ||
చ|| సందించి వైశాఖ శుద్ధ చతుర్దశీ శనివార- | మందు సంధ్యాకాలమున ఔభళేశుడు |
పొందుగా కంభములో పొడమి కడప మీద | కందువ గోళ్ళ చించె కనక కశిపుని ||
చ|| నరమృగరూపము నానాహస్తముల | అరిది శంఖచక్రాది ఆయుధాలతో |
గరిమ ప్రహ్లాదుని గాచి రక్షించి నిలిచె | గురుతర బ్రహ్మాండ గుహలోనను ||
చ|| కాంచనపు గద్దెమీద గక్కున కొలువైయుండి | మించుగ ఇందిర తొడమీద బెట్టుక |
అంచె శ్రీవేంకటగిరి ఆదిమ పురుషుండై | వంచనసేయక మంచి వరాలిచ్చీ నిదివో ||
ప|| నరులాల మునులాల నానాదేవతలాల | పరబ్రహ్మమీతడే ప్రత్యక్షమై వున్నాడు ||
చ|| భావించి చూడరో వీడె ప్రహ్లాద వరదుడు | సేవించరో తొడమీది శ్రీసతిని |
వావిరి నుతించరో వర శంఖచక్రాలనె | కోవిదుడు గద్దెమీద కొలువై వున్నాడు ||
చ|| చెలగి మొక్కరో వీడె శ్రీనరసింహుడు | తెలియరో ఈతని తేజోరూపము |
అలరి పూజించరో అనంత హస్తములవె | కొలదిమీర విష్ణుడు కొలువై వున్నాడు ||
చ|| ఇదె శరణనరో హిరణ్యదైత్యహరుని | అదన జపించరో ఈ హరినామము |
ఎదుట శ్రీవేంకటాద్రిని అహోబలమునందు | కొదలేక ఆదిమూరితి కొలువై వున్నాడు ||
ప|| నల్లని మేని నగవు చూపుల వాడు | తెల్లని కన్నుల దేవుడు ||
చ|| బిరుసైన దనుజుల పింఛమణచినట్టి | తిరుపు కైదువ తోడి దేవుడు |
సరిపడ్డ జగమెల్ల చక్క ఛాయకు దెచ్చి | తెరవు చూపినట్టి దేవుడు ||
చ|| నీటగలసినట్టి నిండిన చదువులు | తేట పరచినట్టి దేవుడు |
పాటిమాలినట్టి ప్రాణుల దురితపు | తీట రాసినట్టి దేవుడు ||
చ|| గురుతువెట్టగరాని గుణముల నెలకొన్న | తిరువేంకటాద్రిపై దేవుడు |
తిరముగ ధృవునికి దివ్యపదంబిచ్చి | తెరచి రాజన్నట్టి దేవుడు ||
ప|| నవనారసింహా నమో నమో | భవనాశితీర యహోబలనారసింహా ||
చ|| సతతప్రతాప రౌద్రజ్వాలా నారసింహా | వితతవీరసింహవిదారణా |
అతిశయకరుణ యోగానంద నరసింహ | మతిశాంతపుకానుగుమానినారసింహ ||
చ|| మరలి బీభత్సపుమట్టెమళ్ళనరసింహ | నరహరి భార్గోటినారసింహ |
పరిపూర్ణశృంగార ప్రహ్లాదనరసింహ | సిరుల నద్భుతపులక్ష్మీనారసింహ ||
చ|| వదనభయానకపువరాహనరసింహ | చెదరనివైభవాల శ్రీనరసింహా |
అదన శ్రీవేంకటేశ అందు నిందు నిరవైతి | పదివేలురూపముల బహునారసింహ ||
ప|| నవనీతచోర నమోనమో | నవమహిమార్ణవ నమోనమో ||
చ|| హరినారాయణ కేశవాచ్యుతకృష్ణ | నరసింహ వామన నమోనమో |
మురహర పద్మనాభ ముకుంద గోవింద | నరనారాయణ నమోనమో ||
చ|| నిగమగోచర విష్ణు నీరజాక్ష వాసుదేవ | నగధర నందగోప నమోనమో |
త్రిగుణాతీతదేవ త్రివిక్రమ ద్వారక | నగరాధినాయక నమోనమో ||
చ|| వైకుంఠ రుక్మిణీ వల్లభ చక్రధర | నాకేశవందిత నమోనమో |
శ్రీకర గుణనిధి శ్రీవేంకటేశ్వర | నాకజననుత నమోనమో ||
నవనీతచోర నమో నమో
నవమహిమార్ణవ నమో నమో
హరి నారాయణ కేశవాచ్యుత శ్రీకృష్ణ
నరసింహ వామన నమో నమో
మురహర పద్మ నాభ ముకుంద గోవింద
నరనారాయణరూప నమో నమో.
నిగమగోచర విష్ణు నీరజాక్ష వాసుదేవ
నగధర నందగోప నమో నమో
త్రిగుణాతీత దేవ త్రివిక్రమ ద్వారక
నగరాధినాయక నమో నమో.
వైకుంఠ రుక్మిణీవల్లభ చక్రధర
నాకేశవందిత నమో నమో
శ్రీకరగుణనిధి శ్రీ వేంకటేశ్వర
నాకజనననుత నమో నమో.
ప|| నవరసములదీ నళినాక్షి | జవకట్టి నీకు జవి సేసీని ||
చ|| శృంగార రసము చెలియ మొకంబున | సంగతి వీరరసము గోళ్ళ |
రంగగు కరుణరసము పెదవులను | అంగపు గుచముల నద్భుత రసము ||
చ|| చెలి హాస్యరసము చెలవుల నిండీ | పలుచని నడుమున భయరసము |
కలికి వాడుగన్నుల భీభత్సము | అల బొమ జంకెనల నదె రౌద్రంబు ||
చ|| రతి మరపుల శాంతరసంబదె | అతి మోహము పదియవరసము |
ఇత్వుగ శ్రీవేంకటేశ కూడితివి సతమై యీపెకు సంతోస రసము ||
ప|| నవరూప ప్రహ్లాద నరసింహ | అవిరళతేజ ప్రహ్లాద నరసింహ ||
చ|| పగరపై కోపము బంటుజూచి మరచితి | నగుమొగము ప్రహ్లాదనరసింహ |
ఎగువ నీకోపము కితడే మాటుమందు | అగుపడె మాకును ప్రహ్లాదనరసింహ ||
చ|| అంట ముట్టరాని కోపము అంగనజూచి మానితి- | నంటు చెల్లు ప్రహ్లాద నరసింహ |
జంటి నీబుద్ధి తిప్ప సతియె అంకుశము | అంటువాయ మికను ప్రహ్లాదనరసింహ ||
చ|| ధర మొరవెట్ట దేవతలే మొక్కితే మానితి | గరుడాద్రి ప్రహ్లాదనరసింహ |
ఇరవై శ్రీవేంకటాద్రి నిందు అందు నీదె సుద్ధి | అరసితి మిదివో ప్రహ్లాదనరసింహ ||
ప|| నవ్వవే యెక్కడి సుద్ది నయముగా నతనితో | రవ్వలు చేసుకొంటేను రాపు కెక్కదా ||
చ|| సరసములాడగానే చనవులెల్ల బుట్టుగాక | యెరవులు చేసుకొంటే నెనసుండునా |
మరిగి వుండగానే మనసు లెనసు గాక | వొరటలు చూపితేను వొడబాటు గలదా ||
చ|| ఇచ్చకాలు సేయగానే ఇంపులు రేగుగాక | మచ్చరాన బెనగితే మట్టు పడునా |
మచ్చికలు చూపఘానే మర్మములు సోకుగాక | పచ్చిగా గాతాళించితే భావాలు గరగునా ||
చ|| చుట్టరికాన మించితే సులభమౌగాక మేలు | ఱట్టులు చేసుకొంటే మఱగు సేయవచ్చునా |
ఇట్టే శ్రీ వేంకటేశు డెనసె దానే నిన్ను | గుట్టులు చూపకుండితే కొంకుదేరునా ||
నాకు నందు కేమివోదు నన్ను నీ వేమి చూచేవు
నీకరుణ గలిగితే నించి చూపవయ్యా
ఘోరమైన దేహపుదుర్గుణ మేమిగలిగిన
అరసి బ్రకృతిబోయి అడుగవయ్యా
నేరనినాజన్మముతో నేరుపేమిగల్లా నన్ను
ధారుణి బుట్టించిన విధాత నడుగవయ్యా
పంచేంద్రియములలోనిపాప మేమిగలిగినా
అంచెల గామునిబోయి అడుగవయ్యా
ముంచిననాకర్మములో మోసమేమి గలిగినా
మంచితనాన జేయించేమాయ నడుగవయ్యా
అన్నిటా నా వెనకటిఅపరాధ మేమిగల్లా
మన్నించి నాగురు జూచి మానవయ్యా
మిన్నక శ్రీవేంకటేశ మీదిపను లేమిగల్లా
నిన్ను జూచుకొని నన్ను నీవే యేలవయ్యా
ప|| నాటకమింతా నవ్వులకే | పూటకు బూటకు బొల్లైపోవు ||
చ|| కోటి విద్యలును గూటి కొరకే పో | చాటున మెలగేటి శరీరికి |
తేటల నాకలి దీరిన పిమ్మట | పాటుకు బాటే బయలై పోవు ||
చ|| మెరసేటి దెల్లా మెలుతల కొరకే | చెరల దేహముల జీవునికి |
అర మరవుల సుఖమందిన పిమ్మట | మెరుగుకు మెరుగే మొయిలై పోవు |
చ|| అన్ని చదువులును నాతని కొరకే | సన్నెరిగిన సుజ్ఞానికిని |
యిన్నిట శ్రీ వేంకటేశు దాసునికి | వెన్నెల మాయలు విడివిడి పోవు ||
ప|| నాటికి నాడు గొత్త నేటికి నేడు గొత్త | నాటకపుదై వమవు నమో నమో ||
చ|| సిరుల రుక్మాంగదుచేతికత్తిధార దొల్లి | వరుస ధర్మాంగదుపై వనమాలాయ |
హరి నీకృపకలిమి నట్లనే అరులచే | కరిఖద్గధార నాకు గలువదండాయ ||
చ|| మునుప హరిశ్చంద్రమొనకత్తిధార దొల్లి | పొనిగి చంద్రమతికి బూవుదండాయ |
వనజాక్ష నీకృపను వరశత్రులెత్తినట్టి- | ఘనఖడ్గధార నాకు గస్తూరివాటాయ ||
చ|| చలపట్టి కరిరాజు కరణంటే విచ్చేసి | కలుషము బెడబాసి కాచినట్టు |
అలర శ్రీవేంకటేశ ఆపద లిన్నియు బాసి | యిలనన్ను గాచినది యెన్న గతలాయ ||
ప|| నాటికి నాడే నాచదువు | మాటలాడుచును మరచేటిచదువు ||
చ|| ఎనయ నీతని నెరుగుటకే పో | వెనకవారు చదివినచదువు |
మనసున నీతిని మరచుటకే పో | పనివడి యిప్పటి ప్రౌఢలచదువు ||
చ|| తెలిసి యితనినే తెలియుటకే పో | తొలుత గృతయుగాదుల చదువు |
కలిగియీతని గాదననే పో | కలియుగంబులో గలిగిన చదువు ||
చ|| పరమై వేంకటపతి గనుటకే పో | దొరలగు బ్రహ్మాదుల చదువు |
సిరుల నితని మరచెడికొరకే పో | విరసపుజీవుల విద్యలచదువు ||
ప|| నాతప్పు లోగొనవే ననుగావవే దే- | వ చేతలిన్ని జేసినిన్ను జేరి శరణంటి ||
చ|| అందరిలోన అంతర్యామివై నీవుండగ | ఇందరి పనులు గొంటిని ఇన్నాళ్ళు |
సందడించి యిన్నిట నీచైతన్యమై యుండగ | వందులేక నేకొన్ని వాహనాలెక్కితిని ||
చ|| లోఅక పరిపూర్ణుడవై లోనా వెలి నుండగాను | చేకొని పూవులు బండ్లు చిదిమితివి |
గైకొని ఈ మాయలు నీ కల్పితమై వుండగాను | చౌక లేక నే వేరే సంకల్పించితిని ||
చ|| ఎక్కడ చూచినా నీవే యేలికవై యుండగాను | యిక్కడా తొత్తుల బంట్ల నేలితి నేను |
చక్కని శ్రీ వేంకటేశ సర్వాపరాధి నేను | మొక్కితి నన్ను రక్షించు ముందెరుగ నేను ||
నానాటి బతుకు నాటకము
కానక కన్నది కైవల్యము
పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్టనడిమి పని నాటకము
యెట్ట నెదుట గల దీ ప్రపంచము
కట్ట గడపటిది కైవల్యము
కుడిచే దన్నము కోక చుట్టెడిది
నడ మంత్రపు పని నాటకము
వొడి గట్టుకొనిన వుభయ కర్మములు
గడి దాటినపుడె కైవల్యము
తెగదు పాపము తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము
యెగువనె శ్రీ వేంకటేశ్వరుడేలిక
గగనము మీదిది కైవల్యము
ప|| నానాదిక్కుల నరులెల్లా | వానలలోననె వత్తురు గదలి ||
చ|| సతులు సుతులు పరిసరులు బాంధవులు | హితులు గొలువగా నిందరును |
శతసహస్రయోజనవాసులు సు- | వ్రతములతోడనె వత్తురు గదలి ||
చ|| ముడుపులు జాళెలు మొగి దలమూటలు | కడలేనిధనము గాంతలును |
కడుమంచిమణులు కరులు దురగములు | వడిగొని చెలగుచు వత్తురు గదలి ||
చ|| మగుటవర్ధనులు మండలేశ్వరులు | జగదేకపతులు జతురులును |
తగువేంకటపతి దరుశింపగ బహు- | వగలసంపదల వత్తురు గదలి ||
ప|| నాపాలిఘన దైవమవు నీవే నన్ను | నీపాల నిడుకొంటి నీవే నీవే ||
చ|| ఒలిసి నన్నేలే దేవుడవు, యెందు | దొలగని నిజబంధుడవు నీవే |
పలు సుఖమిచ్చే సంపదవు నీవే, యిట్టే | వెలయ నిన్నియు నీవే నీవే ||
చ|| పొదిగి పాయని యాప్తుడవు నీవే, నాకు | నదన దోడగు దేహమవు నీవే |
మదమువాపెడి నామతియు నీవే, నాకు | వెదక నన్నియును నీవే నీవే ||
చ|| ఇంకా లోకములకు నెప్పుడు నీవే, యీ- | పంకజభవాది దేవపతివి నీవే |
అంకిలి వాపగ నంతకు నీవే, తిరు- | వేంకటేశ్వరుడవు నీవే నీవే ||
నామోము చూచిచూచి నడుమ నేలకొంకేవు
ఆముకొని మెచ్చగానే నడ్డమాడేనా ||
బత్తిగలవాడవు పడతి పాటివింటివి
చిత్తము రంజించి నీకు చెవిబట్టెనా
యిత్తల మే చెమరించె నెంతగరగెనో మతి
పొత్తుల వాకుచ్చి యాకె బొగడగరాదా ||
సరినిడుకొంటివి చదివించితి వాపెను
తిరమైన యాయర్ధము తెలిసితివా
నిరతి బులకలెల్లా నిండెను సంతోసమెంతో
అరుదైన వుడుగరట్టె ఇయ్యరాదా ||
శ్రీ వేంకటేశుడవు చెలియాట చూచితివి
భావించి నీకు గన్నుల పండుగాయనా
యీవల నన్నేలితివి ఇదెంత జాణతనమో?
సేవసేసే మిద్దరము సేసచల్ల రాదా ? ||
నారాయ ణాచ్యుతానంత గోవిందా
నేరరాదు విజ్ఞానము నీ వియ్యక లేదు
నిగమాంతవిదులైతే నిన్నెఱుగుదురుగాక
మృగసమానులకేల మీమీదిభక్తి
వెగటుగా గృపతోడ విశ్వరూపు చూసినాను
సగటుదుర్యోధనుడు బహురూప మనడా
చిరపుణ్యులైతే మీ సేవలు సేతురుగాక
దురితచిత్తులకు మీత్రోవ యేటికి
గరిమ బ్రత్యక్షమై కంబములో గలిగినా
హిరణ్యకశిపుడు మి మీంచి శరణనెనా
దేవతలయితే మిమ్ము దెలియనేర్తురుగాక
యేవల నసురలు మిమ్మెఱిగేరా
శ్రీవేంకటాద్రిమీద సిరితో నీవుండగాను
కేవలసంసారు లెఱిగియును మఱవరా
ప|| నారాయణ నీనామము బుద్ధి- | జేరినా జాలు సిరు లేమిబాతి ||
చ|| ననుపైనశ్రీవిష్ణునామము పేరు- | కొనగానే తేకువమీరగా |
ఘనమైనపుణ్యాలు గలుగగా తమ- | కనయము బర మది యేమిబాతి ||
చ|| నలువైన శ్రీహరినామము మతి- | దలచిన నాబంధము లూడగా |
యెలమి దీని బఠియించినా యీ- | కలుషములేల కలుగు నెవ్వరికి ||
చ|| వేంకటపతినామవిభవము కర్మ- | పంకములెల్ల బరిమార్పగా |
బింకమై తలపెడి ప్రియులకు యెందు- | నింక నీసుఖ మిది యేమిబాతి ||
ప|| నారాయణ నీనామమెగతి యిక | కోర్కెలు నాకు కొనసాగుటకు ||
చ|| పైపై ముందట భవజలధి | దాపు వెనక చింతాజలధి |
చాపలము నడుమ సంసారజలధి | తేపయేది యిది తెగనీదుటకు ||
చ|| పండె నెడమ పాపపు రాశి | అండ గుడిని పుణ్యపు రాశి |
కొండను నడుమ త్రిగుణ రాశి ఇవి | నిండ కుడుచుటకు నిలుకడ యేది ||
చ|| కింది లోకములు కీడు నరకములు | అందెటి స్వర్గాలవె మీద |
చెంది యంతరాత్మ శ్రీ వేంకటేశ నీ- | యందె పరమపద మవల మరేది ||
నారాయణతే నమో నమో
నారద సన్నుత నమో నమో॥
మురహర భవహర ముకుంద మాధవ
గరుడ గమన పంకజనాభ
పరమ పురుష భవబంధ విమోచన
నరమృగశరీర నమో నమో॥
జలధిశయన రవిచంద్రవిలోచన
జలరుహభవనుత చరణయుగ
బలిబంధన గోపవధూవల్లభ
నళినోధ్ధర తే నమో నమో॥
ఆదిదేవ సకలాగమ పూజిత
యాదవకుల మోహనరూప
వేదోద్ధర శ్రీ వేంకటనాయక
నాదప్రియ తే నమో నమో॥
నారాయణాచ్యుతానంత గోవింద హరి
సారముగ నీకునే శరణంటిని
చలువయును వేడియును నటల సంసారంబు
తొలకు సుఖమొకవేళ దుఃఖమొకవేళ
ఫలములివె యీ రెండు పాపములు పుణ్యములు
పులుసు దీపును గలపి భుజియించినట్లు
పగలు రాత్రులరీతి బహుజన్మ మరణాలు
తగుమేను పొడచూపు తనుదానె తొలగు
నగియించు నొకవేళ నలగించు నొకవేళ
వొగరు కారపు విడెము ఉబ్బించినట్లు
యిహము పరమును వలెనె యెదిటికల్లయు నిజము
విహరించు భ్రాంతియును విభ్రాంతియును మతిని
సహజ శ్రీ వేంకటేశ్వర నన్ను కరుణింప
బహువిధంబుల నన్ను పాలించవే
ప|| నారాయణాయ నమో నమో నానాత్మనే నమో నమో |
యీరచనలనే యెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ||
చ|| గోవిందాయ నమో నమో గోపాలాయ నమో నమో |
భావజగురవే నమో నమో ప్రణవాత్మనే నమో నమో |
దేవేశాయ నమో నమో దివ్యగుణాయ నమో యనుచు |
యీవరుసలనే యెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ||
చ|| దామోదరాయ నమో నమో ధరణీశాయ నమో నమో |
శ్రీమహిళాపతయే నమో శిష్టరక్షిణే నమో నమో |
వామనాయ తే నమో నమో వనజాక్షాయ నమో నమో |
యీమేరలనే యెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ||
చ|| పరిపూర్ణాయ నమో నమో ప్రణవాగ్రాయ నమో నమో |
చిరంతన శ్రీ వేంకటనాయక శేషశాయినే నమో నమో |
నరకధ్వంసే నమో నమో నరసింహాయ నమో నమో |
యిరవుగ నీగతి నెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ||
నారాయణుడీతడు నరులాల
మీరు శరణనరో మిమ్ము గాచీని
తలచిన చోటను తానే ఉన్నాడు
వలెనను వారికి కైవసమెపుడు
కొలచెను మూడడుగుల జగమెల్లాను
కొలిచినవారిని చేకొనకుండునా
యెక్కడ పిలిచినా ఏమని పలికీ
మొక్కిన మన్నించు మునుముగను
రక్కసుల నణచి రక్షించు జగములు
దిక్కని నమ్మిన తిరముగా నేలడా
చూచిన యందెల్ల చూపును రూపము
వోచిక పొగడిన వుండు నోటను
యేచిన శ్రీవేంకటేశుడే యితడట
చేచేత పూజింప సేవలుగొనడా
నాలం వా తవ నయవచనం
చెలం త్యజతె చెటి భవామి
చలచలమమనం సస్కటనె కిం
కులిష హృదయ బహుగుణ విభవ
పులకిత తనుసంభృత వెదనయా
మలినం వహామి మదం త్యజామి || నాలం ||
భజభజ తె ప్రియభామాం సతతం
సుజనస్త్వం నిజ సుఖనిలయ
భుజరెఖా రతి భోగ భవసి కిం
విజయీభవ మద్విధిం వదామి || నాలం ||
నయనయ మామనునయనవిదంతె
ప్రియ కాంతాయాం ప్రేమభవం
భయహర వెంకటపతె త్వం
మద్విలొ భవసి షోభిత భవామి || నాలం ||
నిండు మనసే నీపూజ
అండగోరకుండుటదియు నీపూజ
యిందు హరిగలడందు లేడనేటి
నిందకు బాయుటే నీపూజ
కొందరు చుట్టాలు కొందరు పగనే
అందదుకు మానుటదియే నీపూజ
తిట్టులు గొన్నని దీవెనె గొంతని
నెటుకోనిదే నీపూజ
పెట్టిన బంగారు పెంకును నినుమును
అట్టే సరియనుటదియు నీపూజ
సర్వము నీవని స్వతంత్రముడిగి
నిర్వహించుటే నీపూజ
పర్వి శ్రీవేంకటపతి నీ దాసుల
పూర్వమనియెడి బుద్ధి నీపూజ
ప|| నిందలేని పతివిదె నీవు నాసొమ్ము | కందువ సొమ్ముల మీద గలిగెను సొమ్ము ||
చ|| సూటిగా నీవు చూచేటి చూపు నాసొమ్ము | పాటించి నీవు పలికే పలుకు నాసొమ్ము |
కూటమి రతుల కొనగోరు నాసొమ్మును | యీటున నీమేని సొమ్ము లిఛ్ఛెవు నాకు ||
చ|| చవిగా నాడే నీ సరసము నాసొమ్ము | జవకట్టక యిచ్చే నీచనువు నాసొమ్ము |
నవకమైన నీ నవ్వు నాసొమ్ము | యివల నింకా సొమ్ములిచ్చేవు నాకు ||
చ|| కింకలేని దిది నీకౌగిలి నాసొమ్ము | లంకెలైన నీమతి వలపు నాసొమ్ము |
అంకెల శ్రీ వేంకటేశ అట్టె నన్నుగూడితివి | యింకా సొమ్ములిచ్చేవు యెన్నియైన నీవు ||
ప|| నిక్కించీ గర్ణములు మానిసిమెకము | నిక్కపుగరుణతో మానిసిమెకము ||
చ|| కొండ తనకు గద్దెగా గోరి కూచుండిన దదే | నిండురాజసమున మానిసిమెకము |
గండుమీరి దానవునికండలు చెక్కుచు నూర్పు | నిండించీ నాకసము మానిసిమెకము ||
చ|| కరములువేయింటా గైకొని యాయుధములు | నిరతి జళిపించీ మానిసిమెకము |
సురలను నసురల జూచిచూచి మెచ్చిమెచ్చి | నెరపీని నవ్వులు మానిసిమెకము ||
చ|| యెక్కించి తొడమీద నిందిరతో మేలమాడీ | నిక్కపుగాగిటను మానిసిమెకము |
అక్కడ శ్రీవేంకటాద్రి నహోబలమునందు | నెక్కొని మమ్మేలెను మానిసిమెకము ||
ప|| నిగమనిగమాంతవర్ణిత మనోహర రూప- | నగరాజధరుడా శ్రీనారాయణా ||
చ|| దీపించు వైరాగ్యదివ్య సౌఖ్యం బియ్య- | నోపకరా నన్ను నొడబరపుచు |
పైపైనె సంసారబంధముల గట్టేవు | నాపలుకు చెల్లునా నారాయణా ||
చ|| చికాకుపడిన నా చిత్తశాంతము సేయ- | లేకకా నీవు బహులీల నన్ను |
కాకుసేసెదవు బహుకర్మల బడువారు | నాకొలదివారలా నారాయణా ||
చ|| వివివిధ నిర్బంధముల వెడలద్రోయక నన్ను | భవసాగరముల నడబడ జేతురా |
దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాద్రీశ | నవనీత చోర శ్రీనారాయణా ||
ప|| నిచ్చనిచ్చ సోబనాలు నెలమూడు సోబనాలు | హెచ్చునీకు నింతలోను ఇవి గదవయ్యా ||
చ|| చెలియ మొహములే సేసపాలు | వెలచు సిగ్గులే మీకు పెండ్లితెర |
కలగోను చూపులే కంకణాలు | సులబాన నీకు నబ్బె సుఖియించవయ్యా ||
చ|| మగువ మాటలే నీకు మంత్రాలు | పొగరు మోవి తేనెలు బువ్వాలు |
వెగటు బొమ్మ జంకెలే విడేలు | జిగినీకు నేడబ్బె చిత్తగించ వయ్యా ||
చ|| కాంత సరసములే కప్పురాలు | పొంతనున్న కుచములే పూజకుండలు |
చెంతల గూడితి విట్టె శ్రీవేంకటేశా యివి | సంతస మాయను నీకు జయమందవయ్యా ||
ప|| నిజమో కల్లో నిముషములోననె | భజించువారల భాగ్యము కొలది ||
చ|| వొకడు కనుదెరచి వున్నది జగమను | వొకడు కన్నుమూసొగి లేదనుచు |
సకలము నిట్లనె సర్వేశ్వరుడును | వెకలి నరులు భావించినకొలది ||
చ|| కడుపు నిండొకడు లోకము దనిసె ననును | కడుపు వెలితైన గడమను నొక్కడు |
తడవిన నిట్లనే దైవమిందరికి | వెడగు నరులు భావించినకొలది ||
చ|| ముదిసి యొకడనును మోక్షము చేర్వని | తుద బుట్టొకడది దూరమనును |
యెదుటనే శ్రీవేంకటేశ్వరు డిట్లనే | వెదకి నరులు భావించినకొలది ||
నిత్య పూజలివిగో నేరిచిన నోహో
ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి || నిత్య ||
తనువే గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హరి పీఠమట
కనుగొ్ను చూపులే ఘనదీపములట తనలోపలి అంతర్యామికిని
పలుకే మంత్రమట పాదయిన నాలికే కలకలమను పిడిఘంటయట
నలువైన రుచులే నైవేద్యములట తలపులోపలనున్న దైవమునకు
గమన చేష్టలే అంగరంగ గతియట తమి గల జీవుడే దాసుడట
అమరిన ఊర్పులే ఆలవట్టములట క్రమముతో శ్రీ వేంకటరాయునికి
నిత్య సుఖానంద మిదె నీ దాస్యము
సత్యము లేని సుఖాలు చాలు జాలునయ్య ||
కన్ను చూపుల సుఖము నీ చక్కని రూపె
యెన్నగ వీనుల సుఖమిదె నీపేరు
పన్ని నాలుక సుఖము పాదపు నీ తులసి
వున్న సుఖముల తెరువొడ బడమయ్యా ||
తనువు తోడి సుఖము తగు నీ కైంకర్యము
మనసులో సుఖము నీ మంచి ధ్యానము
పనివి నీ యూర్పు సుఖము పాదపద్మము వాసన
యెనయని పెర సుఖమేని సేసేనయ్యా ||
పుట్టుగుకెల్ల సుఖము పొల్లులేని నీ భక్తి
తొట్టి కాళ్ళ సుఖము పాతుర లాడుట
జట్టి శ్రీవేంకటెశ మాచనవోలి చెన్నుడవై
వొట్టుకొని మమ్మేలితివోహో మేలయ్యా ||
ప : నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు
సత్యాత్ముడై యుండి సత్యమై తానుండు
ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సం-
స్తుత్యుడీ తిరువేంకటాద్రివిభుడు
చ : ఏమూర్తి లోకంబులెల్ల నేలెడునాత-
డేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాత-
డేమూర్తి నిజమోక్షమియ్య జాలెడునాత-
డేమూర్తి లోకైకహితుడు
యేమూర్తి నిజమూర్తి యేమూర్తియును గాడు
యేమూర్తి త్రైమూర్తు లేకమైనయాత-
డేమూర్తి సర్వాత్ము డేమూర్తి పరమాత్ము-
డామూర్తి తిరువేంకటాద్రివిభుడు
చ : యేదేవుదేహమున నిన్నియును జన్మించె
నేదేవుదేహమున నిన్నియును నణగె మరి
యేదేవువిగ్రహం బీసకల మింతయును
యేదేవునేత్రంబు లినచంద్రులు
యేదేవు డీజీవులిన్నింటిలో నుండు
నేదేవుచైతన్య మిన్నిటికి నాధార-
మేదేవు డవ్యక్తు డేదేవు డద్వంద్వదు-
డాదేవుడీ వేంకటాద్రివిభుడు
చ : యేవేల్పుపాదయుగ మిలయునాకాశంబు
యేవేల్పుపాదకేశాంతం బనంతంబు
యేవేల్పునిశ్వాస మీమహామారుతము
యేవేల్పునిజదాసు లీపుణ్యులు
యేవేల్పు సర్వేశు డేవేల్పు పరమేశు-
డేవేల్పు భువనైకహితమనోభావకుడు
యేవేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కడుఘనము
ఆవేల్పు తిరువేంకటాద్రివిభుడు
ప|| నిత్యానంద ధరణీధర ధరారమణ | కాత్యాయనీస్తోత్ర కామ కమలాక్ష ||
చ|| అరవిందనాభ జగదాధార భవదూర | పురుషోత్తమ నమో భువనేశ |
కరుణాసమగ్ర రాక్షసలోక సంహార- | కరణ కమలాధీశ కరిరాజవరద ||
చ|| భోగీంద్రశయన పరిపూర్ణ పూర్ణానంద | సాగరనిజావాస సకలాధిప |
నాగారిగమన నానావర్ణనిజదేహ | భాగీరథీజనక పరమ పరమాత్మ ||
చ|| పావన పరాత్పర శుభప్రద పరాతీత | కైవల్యకాంత శృంగారరమణ |
శ్రీవేంకటేశ దాక్షిణ్యగుణనిధి నమో | దేవతారాధ్య సుస్థిరకృపాభరణ ||
ప|| నమో నారాయణాయ | నమో నారాయణాయ ||
అనుప|| నారాయణాయ సగుణబ్రహ్మణే సర్వ-| పారాయణాయ శోభనమూర్తయే నమో ||
చ|| నిత్యాయ విబుధసంస్తుత్యాయ నిత్యాధి- | పత్యాయ మునిగణ ప్రత్యయాయ |
సత్యాయ ప్రత్యక్షాయ సన్మానససాం- | గత్యాయ జగదావనకృత్యాయ తే నమో ||
చ|| ఆక్రమోద్ధతబాహువిక్రమాతిక్రాంత- | శుక్రశిష్యోన్మూలనక్రమాయ |
శక్రాదిగీర్వాణవక్రభయభంగని- | ర్వక్రాయ నిహతారిచక్రాయ తే నమో ||
చ|| అక్షరాయాతినిరపేక్షాయ పుండరీ- | కాక్షాయ శ్రీవత్సలక్షణాయ |
అక్షీణవిజ్ఞానదక్షయోగీంద్రసం- | రక్షానుకంపాకటాక్షాయ తే నమో ||
చ|| కరిరాజవరదాయ కౌస్తుభాభరణాయ | మురవైరిణే జగన్మోహనాయ |
తరుణేందుకోటిరతరుణీ మనస్స్తోత్ర- | పరితోషచిత్తాయ పరమాయ తే నమో ||
చ|| పాత్రదానోత్సవప్రథిత వేంకటరాయ | ధాత్రీశకామితార్థప్రదాయ |
గోత్రభిన్మణిరుచిరగాత్రాయ రవిచంద్ర- | నేత్రాయ శేషాద్రినిలయాయ తే నమో ||
ప|| నిత్యులు ముక్తులు నిర్మలచిత్తులు నిగమాంతవిదులు వైష్ణవులు|
సత్యము వీరల శరణనిబ్రదుకరో సాటికి బెనగక జడులాల ||
చ|| సకలోపాయశూన్యులు సమ్యగ్జ్ఞానులు |
అకలంకులు శంఖచక్రలాంఛనులన్నిట బూజ్యులు వైష్ణవులు |
వొకటీ గోరరు వొరుల గొలువరు వొల్లరు బ్రహ్మాదిపట్టములు |
అకటా వీరలసరియన భపంబారుమతంబుల పూతతోకలన్ ||
చ|| మంత్రాంతరసాధానాంతరంబులు మానినపుణ్యులు విరక్తులు |
యంత్రపుమాయల బొరలుపరులకు యెంతైనా మొక్కరు వైష్ణవులు |
తంత్రపుకామక్రోధవిదూరులు తమనిజధర్మము వదలరు |
జంత్రపుసంసారులతో వీరల సరియని యెంచగ బాపమయ్య ||
చ|| తప్పరు తమపట్టినవ్రత మెప్పుడు దైవమొక్కడే గతియనుచు |
వొప్పగుతమపాతివ్రత్యంబున నుందురు సుఖమున వైష్ణవులు |
కప్పినశ్రీవేంకటపతిదాసులు కర్మవిదూరులు సాత్వికులు |
చెప్పకుడితరులసరిగా వీరికి సేవించగ నేధన్యుడనైతి ||
ప|| ఏ నిన్ను దూరక నెవ్వరి దూరుదు నీ- | వాని నన్నొకయింత వదలక నను నేలవలదా ||
చ|| అపరాధిగనక నన్నరసి కావుమని | అపరిమితపు భయమంది నీకు శరణంటిగాక |
నెపములేక నన్ను నీకు గావగనేల | అపవర్గరూప దయాంబుధి తిరువేంకటాధిపా ||
చ|| ఘనపాపిగనక నీకరుణ గోరి నీ- | వనవరతము నాయాతును విహరించమంటిగాక |
యెనసి నన్ను గాచుటేమి యరుదు నీకు- | ననఘుడ పరమతత్త్వానంద తిరువేంకటాధిప ||
ప|| నిన్నుదలచి నీపేరు దలచి | నన్ను కరుణించితే నెన్నికగాక ||
చ|| అధికుని గాచుటేమరుదు నన్ను- | నధముని గాచుట యరుదుగాక నీకు |
మధురమౌ టేమరుదు మధురమూ, చేదు | మధురమౌటే మహిలో నరుదుగాక ||
చ|| అనఘుని గరుణింప నరుదుగాదు నీకు | ఘనపాపుని నన్ను గాచు టరుదుగాక |
కనకము గనకము గానేల, యినుము | కనకమవుటే కడు నరుదుగాక ||
చ|| నెలకొన్న భీతితో నిన్ను జెనకితిగాక | తలకొన్న సుఖినైన దలచనేల నిన్ను |
యెలమితో దిరువేంగళేశుడ నాపాల | గలిగి నీకృప గలుగజేతువుగాక ||
ప|| నిన్నుబాసినయట్లు నెలతకు వియోగదశ | లెన్నడును దోప విదియేమోకాని ||
చ|| నిను దలచి లలితాంగి నీరూపమాత్మలో | గని నీవు సవి బయలు కౌగలించినది |
తనర నాకాశ తత్త్వము నీమహాత్త్వమని | వనిత యెవ్వరి చేత వినెనో కాని ||
చ|| నిను బొగడి నీరూపు కనుదోయి కెదురైన | తనివిదీరక బయలు తగ జూడ దొడగె |
మునుకొన్న సర్వతోముఖుడ వనగా నిన్ను | వెనకకే భావమున వినెనోకాని ||
చ|| తలపునను వాక్కునను తలప దలపగ నీవు | కలసి యాకమలాక్షి గౌగలించితివి |
తెలిసితిమి వేంకటాధిపతి నీ విన్నింట | గలవనెడి మాట నిక్కంబులో కాని ||
నిముషమెడతెగక హరి నిన్ను తలచి
మమత నీ మీదనే మరపి బ్రతుకుటగాక
నిదురచే కొన్నాళ్ళు నేరముల కొన్నాళ్ళు
ముదిమిచే కొన్నాళ్ళు మోసపోయి
కదిసి కోరినను గతకాలంబు వచ్చునే
మది మదినె యుండి ఏమరక బతుకుట గాక
కడు తనయులకు కొంత కాంతలకు నొక కొంత
వెడయాసలకు కొంత వెట్టిసేసి
అడరి కావలెననిన అందు సుఖమున్నదా
చెడక నీ సేవలే సేసి బతుకుటగాక
ధనము వెంట తగిలి ధాన్యంబునకు తగిలి
తనవారి తగిలి కాతరుడైనను
కను కలిగి శ్రీ వేంకటనాథ కాతువే
కొనసాగి నిన్నునే కొలిచి బతుకుటగాక
నిలు నిలు దగ్గరకు నీయాన నీకు
వలచితినని మావారెల్లనగరా ||
వద్దు వద్దు కొండలలో వారికి మాకింతేసి
పెద్ద పెద్ద ముత్యాల పేరులిన్నేసి
అద్దము చూచిదె మాకు నంతకంటె సిగ్గయ్యీని
గద్దరి మాచెంచువారుగని నన్ను నగరా ||
చాలు జాలు బంగారు సరుపణులుంగరాలు
నీలపుగంటసరులు నీకే ఉండనీ
మూలనుండే వారుగాక ముత్యాలచెరగుల
చేలంగట్టు కొన్న నన్ను చెంచెతలు నగరా ||
నిలుపుటద్దములోన నీడనల్లదివో కంటె
చలివాసె దనకేలే సటకాడు క్రుస్ఃణుడు ||
యెఅగనట్టె విచ్చేసి యిదెనామలగు మీద
నొఇగి వెనకవంక నున్నవాడు
మఇ చెలులు నవ్వితే మానుమని సన్నసేసీ
మఅగులింకా నేలే మాయాకాడు క్రుష్ణుడు ||
మాటలాడక నావద్ద మంచము నాకోటిమీద
యేటవెట్టుకొని మమ్ము నెలయించీని
పాటించి లంచము లిచ్చీ పంజరము చిలుకకు
తూటరి యీవిద్దెలే దొమ్మికాడు క్రుష్ణుడు ||
నీ నామమే మాకు నిధియు నిధానము
నీ నామమే ఆత్మ నిధానాంజనము
నమో నమో కేశవ నమో నారాయణ
నమో నమో మాధవ నమో గోవింద
నమో నమో విష్ణు నమో మధుసూదన
నమో త్రివిక్రమ నమో వామనా
నమో నమో శ్రీధర నమో హృషీకేశ
నమో పద్మనాభ నమో దామోదర
నమో సంకర్షణ నమో వాసుదేవ
నమో ప్రద్యుమ్న తే నమో యనిరుద్ధా
నమో పురుషోత్తమ నమో యధోక్షజ
నమో నారసింహ నమోస్తు యచ్యుత
నమో జనార్దన నమోస్తు ఉపేంద్ర
నమో శ్రీ వేంకటేశ నమో శ్రీకృష్ణా
నీ విభుడు వచ్చు దాక నిచ్చ్లాన నుండ వే
వేవేలకును రేయి వేగించవేమే ||
పూయకు కస్తూరి మేన బొద్దుగూకె జీకటంటా
నోయమ్మ చందురుడుదయించెను
చాయల వెన్నెలదాకి చల్లజంపు యెండలంటా
ఆ యెడ నీవు వేగగ నది చూడ్లేమే ||
గందము పుయ్యకువే కలికి నీ కుచములే
చందనపు గొండలంటా జల్లీగాలి
అందులో పూవు తావిదాకి అమ్ము మొనలంటెనంటా
మందమై మేను మరువగ మందులు దేలేమే ||
వద్దేలే కుంకుమలు వనంతపు జిగురంటా
నద్దితే గోవిల భూతమని లోగేవు
నిద్దపు శ్రీ వేంకతాద్రి నిలయుడిత్తె కూదె
యిద్దరి మీ వలపులు యింకనెంచలేమే ||
ప|| నీ వేలికవు మాకు నీదాసులము నేము | ఆవల నితరుల నే మడుగబొయ్యేమా ||
చ|| పసురమై వుండి యిచ్చీ బక్కన గామధేనువు | యెసగి మానైవుండి యిచ్చీ గల్పవృక్షము |
వెస రాయైవుండి యిచ్చీ వేడుక చింతామణి | మసలనిశ్రీపతివి మాకు నిచ్చే టరుదా ||
చ|| గాలి యావటించి యిచ్చీ గారుమేఘము మింట | వీలి జీర్ణమై యిచ్చీ విక్రమార్కునిబొంత |
కాలినపెంచై వుండి కప్పెర దివ్యాన్నమిచ్చీ | మైలలేనిశ్రీపతివి మాకు నిచ్చే దరుదా ||
చ|| అండనే కామధేనువ వాశ్రితచింతామణివి | పండినకల్పకమవు భక్తులకెల్లా |
నిండిన శ్రీవేంకటేశ నీవు మమ్ము నేలితివి | దండిగా నమ్మితే నీవు దయజూచు టరుదా ||
ప|| నీకథామృతము నిరతసేవన నాకు | చేకొనుట సకల సంసేవనంబటుగాన |
చ|| ఇదియే మంత్రరాజము నాకు నే ప్రొద్దు | ఇదియే వేద సంహిత పాఠము |
ఇదియె బహుశాస్త్ర మెల్ల చదువుటనాకు | ఇదియె సంధ్య నాకిదియె జపమటుగాన ||
చ|| ఇదియె బ్రహ్మవిద్యోపదేశము నాకు | ఇదియె దుఃఖవిరహిత మార్గము |
ఇదియె భవ రోగరహిత భేషజమునాకు | ఇదియె ఉపనిషద్వ్యాక్య పద్ధతి ||
చ|| ఇదియె దాన ఫలమీ జాలినది నాకు | ఇదియె తలప పరహిత మార్గము |
ఇదియె తిరువేంకటేశ నీసంస్మరణ- | మిదియె ఇదియె యిన్నియును నటుగాన ||
ప|| నీకేమయ్య నీకు నీవే దొడ్డవాడవు | చేకొని చెట్టడిచితే చేటడేసి వాపులు ||
చ|| తలపోత లొక్కటైతే తమకమినుమడాయ | నిలువుకు నీవే బేరము |
కొలిచినందే కొలిచి గోపికల్ల కెల్లాను | వలప్వ దీసితిగా వలపులనీవు ||
చ|| నగవులు మానెడైతే నునుపులడ్డె డేశాయ | నిగిడే నన్నిచోట్లా నీ బేరము |
అగడుగా నాగిచ్చి అంగనల కెల్లాను | జిగి వడ్డికొంటివి సిగ్గులెల్లా నీవు ||
చ|| మోవితేనగ్గువలైతే ముదములు లాభమాయ | నీవు నన్ను గూడినదే నీ బేరము |
భావించి శ్రీ వేంకటేశ పడతుల కెల్లాను | వావాత నమ్మితివిగా వయసులు నీవు ||
ప|| నీకేల భయము నీకునీకే యులికేవు | చేకొన్న నీచేతలందు జెరిగున్నావా ||
చ|| చనువు సేసుక ఆపె సారె నీమోము చూచితే | చెనక జాలక యేల సిగ్గుపడేవు |
కనుగొనబోతే నందు కళలింతే వుండేనవి | వెనుకొని కాంతలెల్లా వేలుకాడేరా ||
చ|| మచ్చిక చేసుక ఆపెమాటలు నిన్నాడించితే | కొచ్చికొచ్చి నీవేల కొంక జూచేవు |
కచ్చుపెట్టి తోచేవి కల్లనిజములేకాక | అచ్చమై పొందిన సతులంటుకున్నారా ||
చ|| చుట్టముసేసుక యింతి సొరిది నిన్నుగూడితే | యిట్టె శ్రీ వేంకటేశ నీవేల మొక్కేవు |
గుట్టునను కొనగోళ్ళ గురుతులుండీ గాక | ముట్టిన కాంతలు మేన మూగుకున్నారా ||
ప|| నీదాసుల భంగములు నీవుజూతురా | ఏదని జూచేవు నీకు నెచ్చరించవలెనా ||
చ|| పాల సముద్రము మీద పవ్వళించ్చినట్టి నీకు | బేలలై సురలు మొరవెట్టిన యట్టు |
వేళతో మామనువులు విన్నవించితిమి నీకు | ఏల నిద్దిరించేవు మమ్మిట్టే రక్షించరాద ||
చ|| ద్వారకా నగరములో తగ నెత్తమాడే నీకు | బిరాన ద్రౌపది మొరవెట్టిన యట్టు |
ఘోరపు రాజసభల కుంది విన్నవించితిమి | ఏరీతి పరాకు నీకు నింక రక్షించరాద ||
చ|| ఎనసి వైకుంఠములో నిందిర గూడున్న నీకు | పెనగి గజము మొరవెట్టిన యట్టు |
చనువుతో మాకోరికె సారె విన్నవించితిమి | విని శ్రీవేంకటేశుండ వేగ రక్షించరాద ||
నీదాస్యమొక్కటే నిలిచి నమ్మగలది
శ్రీదేవుడవు నీచిత్తము నాభాగ్యము
అనుష్ఠానములు గతియని నమ్మి చేసితినా
తనువిది మలమూత్రములప్రోగు
జనులలో నుత్తమపుజన్మమే నమ్మితినా
వొనర గర్మమనేవోదాన బడినది
చదువుల శాస్త్రములజాడలు నమ్మితినా
పొదలినమతములపోరాట మది
మదిమదినుండిననామనకే నమ్మితినా
అదియును నింద్రియాల కమ్ముడువోయినది
పుత్రదారధనధాన్యభూములు నమ్మితినా
పాత్రమగురుణానుబంధములవి
చిత్రముగ నను గావు శ్రీవేంకటేశ నీవే
పత్రపుష్పమాత్రమే నా భక్తియెల్లా నీకు
ప|| నీపాపమే కాదు, ఇది నిండిన లోకము జాడ | పైపై వచ్చిన వలపు పాటించరెవ్వరును ||
చ|| అట్టే మంచిమాటలాడే అతివ బాతి పడగ | చిట్టకములాడే యింతిజెనకేవు |
అట్టే కాదా పంచదార అండనెంత వుండినాను | పట్టి పెనగేటి నిమ్మపంటికి నోరూరును ||
చ|| చేతులెత్తి మొక్కేటి చెలి గాచుకుండగాను | ఆతలిమోమైన వారి కాసపడేవు |
జాతితో బాలపండ్లు సంగడినే వుండగాను | ఘాత బెరిగే బూరుగు గాయలు చూపట్టును ||
చ|| నెట్టన బెండ్లాడిన నేనే నీ కుండగాను | ఱట్టు గొల్లెతలచే నాఱడి బొందితి |
ఇట్టేనిన్ను గూడితిని యిందాకా శ్రీ వేంకటేశ | వొట్టితే పాలును జల్లా నొక్కరీతి నుండును ||
ప|| నీమహత్త్వంబు లోనికి వెలుపలికి గప్పి | కామింప నిట్టిదని కానారా దటుగాన ||
చ|| నిండి యిన్నిటిలోన నీవు గలవని భ్రాంతి- | నుండుదువుగాని నీ వొకటియును గావు |
దండిగలగిరి ప్రతిధ్వని దోచుగాని యది | కొండలోపల లేదు కొండయును గాదు ||
చ|| బలసి యిన్నిటిలోపలను జైతన్యమై | మెలగుదువుగాని యేమిట నీవు లేవు |
పలుదెరగులైన దర్పణమునం దొకనీడ | వొలయుగాకందు దలపోయ నదిలేదు ||
చ|| వుడుగకన్నిటిలోన నుండుటయు లేదు నీ- | వుడివోయి యందుండకుండుటయు లేదు |
చెడనితేజముగాన శ్రీవేంకటేశ నీ- | పొడవు పరిపూర్ణమై పొలుపొందు ||
నీమహి మది యెంత నీవు చేసేచేత లెంత
దీమసపునీమాయలు తెలియరాదయ్యా.
నిపాదతీర్థము నెత్తి మోచె నొకడు
పూపకొడుకై యొకడు బొడ్డునబుట్టె
యేపున నింతటివారి కెక్కుడైనదైవమవు
మోపుచు ధర్మరాజుకు మొక్కుటెట్టయ్యా
నీలీల జగమెల్లా నిండియున్న దొకవంక _
నోలి నీలో లోకా లున్న వొకవంక
యేలీలజూచినాను యింతటిదైవమవు
బాలుడై రేపల్లెలో బారాడితి వెట్టయ్యా.
శ్రీసతికి మగడవు భూసతికి మగడవు
యీసరుస శ్రీవేంకటేశుడవు
రాసికెక్కి నీవింతటి రాజసవుదైవమవు
దాసులము మాకెట్ల దక్కితివయ్యా.
నీమహిమో నాలోన నిండిన వలపు జాడో
యేమి సేతు నన్నెప్పుడు నెడపకుమయ్యా ||
యెనసి తో నేన యెంత పది మాటాడినా
తనియదు నా మనసు తమి యెట్టిదో
వినయముతో రెప్పలు వేయక చూచినాను
నినుపులై మమతలు నిచ్చ కొత్తలు ||
చలపట్టి నీ తోను సారె సారె బెనగిన
నలయదు నా మేను ఆశ యెట్టిదో
కొలువులో నీ వద్ద గూచుండి యెంత నవ్విన
తలపులో కోరికలు తరగని ధాన్యాలు ||
కరగి యందాకా నిన్ను గాగిలించుచుండినాను
విడువవు చేతులు వేడుకెట్టిదో
అడరి శ్రీ వేంకటేశ యలమేల్ మంగను నేను
తొడరి యేలితివి రతులు తరితీపులు ||
ప|| నీయంత వాడనా నేను నేరము లే మెంచేవు | యీయెడ నిరుహేతుక కృప జూడు నన్నును ||
చ|| నిరతి నిన్నెఱుగను నీవు నన్నెఱుగుదువు | ధర యాచకుడ నేను దాతవు నీవు |
వరుస నీచుడ నేను వైకుంఠపతివి నీవు | నరుడ నేను నీవు నారాయణుడవు ||
చ|| సారె నలసుడ నేను సర్వశక్తివి నీవు | ధీరుడవు నీ వతి దీనుడ నేను |
కారుణ్య మూర్తివి నీవు కఠిన చిత్తుడ నేను | మేరతో నీ వేలికవు మీ దాసుడ నేను ||
చ|| జనక శీలుడ నేను జనకుడవు నీవు | ఘనవేదాంత నిధివి కర్మిని నేను |
అనిశము శ్రీ వేంకటా చలేంద్రుడవు నీవు | పనుల నీ సంకీర్తన పరుడ నేను ||
నీయంతటివా రెవ్వరు నీకు నెదురేది యెందు
చాయల నీసుద్ది విని శరణంటి నేను
కావలెనంటే దొల్లి కంభము చించుకవెళ్ళి
కైవశమై ప్రహ్లాదు గావవా నీవు
తేవలనంటే బ్రహ్మ దేవునికి వేదములు
సోవల సముద్రమయిన చొచ్చి తేవా నీవు
పట్టియెత్తవలెనంటే బాతాళాన బడ్డకొండ
తట్టియెత్తి పాలవెల్లి దచ్చవా నీవు
మట్టుపెట్టవలె నంటే మరి భూమి చాపగాగ
చుట్టుకపోతే దెచ్చి సొంపుగ నిలుపవా
పక్షపామయ్యేనంటే బాండవుల గెలుపించి
యీక్షితి యేలించి చనవియ్యవా నీవు
రక్షించేనంటే గాతరాన శ్రీవేంకటాద్రి బ్ర
త్యక్షమై మావంటివారి దగ గరుణించవా
నీయంతవారు గారు నిండుసామర్థ్యము లేదు
యీయహంకారపుముక్తి యీడేరీనా తమకు.
నీసేవలే సేసి నీకృప రక్షించగాను
ఆసల బొందేముక్తి అదిచాలక
నీసరివారలై నీవే తామనుకొని
యీసుల బొందేముక్తి యీడేరీనా తమకు
పొంచిన రాక్షసులెల్ల పూర్వదేవతలమంటా
యెంచుక పెట్టినమద మీగర్వము
అచెల గర్మమే సేసేరాయాదేవతల గూర్చి
ఇంచుకంతలోనే ముక్తి యీడేరీ నా తమకు.
హరిలాంఛనపుభక్తి కందుకు నొడబడరు
సరి రోగికి బథ్యము చవిగానట్టు
గరిమ శ్రీవేంకటేశు గైన్ మననివారికి
యెరవులనే ముక్తి యీడేరీనా తమకు.
ప|| నీయాజ్ఞ దలమోచి నీదేహధారి నైతి | యీయెడ గోవిందుడ నే నీడేరేదెట్లో ||
చ|| తనువు వేసరినాను తలపు వేసరదు | ధనము గడించెడితరితీపున |
చెనకి మగడు విడిచిన మామ విడువని- | పనియాయ హరి నాబదుకుజాడ యెట్లో ||
చ|| పాయము ముదుసినాను భావము ముదియదు | వేయైన సంసార విషయాలను |
వోయయ్య కలివోసినావెట్లదిక్కు చూచేది | మాయదాయ నిక నామనసుజాడెట్లో ||
చ|| కడలేని నావిధులు కన్నులార జూచి నీవు | నడుమ శ్రీవేంకటేశ నన్ను నేలితి |
నొడుగులు దప్పినాను నోముఫలము దప్పని- | అడియాలమబ్బె నాకు నానతిచ్చితెట్లో ||
నీయాధీనము లింతే నిఖిలప్రపంచమును
మాయాకృతము నీవు మానుమంటే మానదా.
నీకు నరుహంబైన నిండినయీమనసు
కాకువిషయాలపాలుగా నరుహమా
చేకొని నీవు పెరరేచినయీచైతన్యము
పైకొని అకర్మములపాలు సేయదగునా.
అంచల నీవంతర్యామివైనయీదేహము
పంచేంద్రియముల కొప్పనసేతురా
యెంచగ నీకుక్షిలోన నెత్తిన యీజన్మము
కొంచెపుభోగములకు గురిసేయవలెనా.
శ్రీవేంకటేశ నీకు జక్కినయీదాస్యము
యీవల సంసారమున కియ్యవలెనా
దేవుడవు నీవేయని తెలిస్పితి విదే మాకు
జీవులము మమ్ము నిక చిమ్మిరేచనేటికి
ప|| నీరువట్టు గొన్నవేళ నేయి మందదవునా | కూరిమి మమ్మిద్దరిని గూరుచరే చెలులు ||
చ|| నెలత చెక్కులే నాకు నిలువుటద్దములు | అలరుల తావి వూర్పులాల వట్టాలు |
సె;అవుల నగవులే చేతికిచ్చే కప్పుఆలు | చలిమందు లిక నన్నీ జాలునే నాకు ||
చ|| వనిత మాటలే నాకు వలరాచ మంత్రాలు | నినుపు జెమటలే పన్నీటి సోనలు |
ఘనమైన సరశాలే గందపు కస్తూరి పూత | యెనలేని వుపచారా లివియేలే నాకు ||
చ|| సతితోడి పానుపే చంద్రకాంతపు వేది | యితవుగ గూడించితి రిందరూ మమ్ము |
రతుల శ్రీ వేంకటాద్రి రాయడ నేనది వో | మితిమీర నూచకురే మేలాయ బనులు ||
ప|| నీవనగ నొకచోట నిలిచివుండుటలేదు | నీవనుచు గనుగొన్ననిజమెల్ల నీవే ||
చ|| తనయాత్మవలెనె భూతములయాతుమలెల్ల- | ననయంబు గనుగొన్నయతడే నీవు |
తనుగన్నతల్లిగా తగనితరకాంతలను | అనఘుడై మదిజూచునతడే నీవు ||
చ|| సతతసత్య వ్రతాచార సంపన్నుడై | అతిశయంబుగ మెలగునతడే నీవు |
ధృతిదూలి ద్రవ్యంబు తృణముగా భావించు- | హతకాముకుడైన యతడే నీవు ||
చ|| మోదమున సుకదుఃఖములు నొక్కరీతిగా | నాదరింపుచున్నయతడే నీవు |
వేదోక్తమతియైన వేంకటాచలనాథ | ఆదియును నంత్యంబు నంతయును నీవే ||
నీవెంత నేనెంత నీకు నాకు నెంతదవ్వు
దైవమా సిగ్గుపడక తగిలే నేగాకా
చెంది నీకు బ్రహ్మాదులు సేవలు సేయుగాను
యిందు మాసేవలు నీకు నేడకువచ్చు
పొంది వసిష్ఠాదులట్టే పూజలు సేయగాను
సందడి మాపూజలు సరకా నీకు
సనకాదియోగులు సారె నిన్ను దలచగా
యెనసి మాతలపు నీ కేడకెక్కును
నునుపుగా శేషాదులు నుతులు నిన్ను జేయగా
పనివడి మానుతులు బాతేయనా నీకు.
కిట్టి నారదాదులు నీకింకరులై వుండగాను
యిటె నీదాసుడనను టెంత కెంత
వొట్టి శ్రీవేంకటేశ మాకొకవుపాయము గద్దు
పట్టి నీదాసులబంటుబంట నయ్యేనికను.
ప|| నీవెరగనిది లేదు నీయాజ్ఞ మోచితి నింతే | నీవాడ నింతే హరి నేనన జోటేది ||
చ|| కన్నుల కెందైన జూపుకలది స్వభావము | యెన్నగ నాయందు బాపమెంచజోటేది |
విన్ననై చెవులకింపు వినుట స్వభావము | పన్నిన కర్మాలు నన్ను బైకొన జోటేది ||
చ|| నాలికకు జవియైతే నమలుటే సహజము | నాలి అభోజ్యపునింద నాకు బనేమి |
మూల వాసనగొనేది ముక్కుకు సహజము | జోలిబంధములు నన్ను జుట్టగజోటేది ||
చ|| కాయము కాయముపొంత గరగుటే ఆగుణము | సేయనిచేతలు నాపై జెప్ప జోటేది |
యీయెడ శ్రీవేంకటేశ యిన్నిటిలో నన్ను బెట్టి | పాయక నాలో నుందువు పట్టగ జోటేది ||
ప|| నీవే కావింక నేనన్య మెరగ యే- | త్రోవ చూపి నాకు దోడయ్యెదవయ్య ||
చ|| అపరాధశత కోట్లయినవి వొక్క- | నెపమున నను గవనేరవా |
అపరిమితదురితా లైనవి యే- | ఉపమచేత నన్ను నుద్ధరించెదవయ్య ||
చ|| అతిశయముగ గర్మినైతిని నీ- | మతము నాకొకయింత మరపవా |
ఇతరకర్మారంభహితుడను | గతి మోక్షమెటువలె గల్పించెదవయ్య ||
చ|| తిరువేంకటాచలాధీశ్వరా నీ- | శరణాగతుల బ్రోవజాలవా |
పరమదయానందపరుడవు యే- | వెరవున భవములు వెడలద్రోచెదవయ్య ||
నీవే నేరవుగాని నిన్ను బంధించేము మేము
దైవమా నీకంటే నీదాసులే నేర్పరులు
వట్టిభక్తి నీమీద వళుకువేసి నిన్ను
బట్టితెచ్చి మతిలోన బెట్టుకొంటిని
పట్టెడుదులసి నీపాదములపై బెట్టి
జట్టిగొనిరి మోక్షము జాణలు నీదాసులు
నీవు నిర్మించిన వేనీకే సమర్పణ సేసి
సోవల నికృపయెల్ల జూరగొంటిమి
భావించొకమొక్క మొక్కి భారము నీపై వేసిరి
పావనపునీదాసులే వంతపుచతురులు
చెరువులనీళ్ళు దెచ్చి చేరడు నీపైజల్లి
వరము వడసితిమి వలసినటు
యిరవై శ్రీవేంకటేశ యిటువంటివిద్యలనే
దరిచేరి మించిరి నీదాసులే పో ఘనులు
ప|| నీవే మూలమువో నేరిచినపెద్దలకు | దేవుడు నీయందులోనే తిరమాయ నిదివో ||
చ|| బాపురే వో దేహమా బాపురే వో నీవు | వోపి నే బెట్టినకొద్ది నుందువుగా |
రూపు నీవు గలిగితే రుచులెల్ల గానగద్దు | చాపలాన ధర్మములు సాధింపగలదు ||
చ|| మెచ్చితి నోమనసా మెచ్చితివో నీవూ నా- | యిచ్చకొలది నెందైనా నేగుదువుగా |
అచ్చపునీకతమున నవుగాము లెంచగవద్దు | పచ్చిగా యేమూర్తినైనా భావించగలదు ||
చ|| మేలు మేలు నాలికె మేలు మేలు నీవు | వోలి యేమాటకునైనా నొనరుదుగా |
చాలి నీవు మెలగంగ చదువు చదువగద్దు | పోలించి శ్రీవేంకటేశు బొగడగగలదు ||
ప|| నీవేకా చెప్పజూప నీవె నీవెకా | శ్రీవిభుప్రతినిధివి సేనమొదలారి ||
చ|| నీవేకా కట్టెదుర నిలుచుండి హరివద్ద | దేవతల గనిపించే దేవుడవు |
యేవంక విచ్చేసినాను యిందిరాపతికి నిజ- | సేవకుడవు నీవెకా సేనమొదలారి ||
చ|| పసిడిబద్దలవారు పదిగోట్లు గొలువ | దెసల బంపులువంపే ధీరుడవు |
వసముగా ముజ్జగాలవారి నిందరిని నీ- | సిసువులగా నేలిన సేనమొదలారి ||
చ|| దొరలైన యసురుల తుత్తుమురుసేసి జగ- | మిరువుగా నేలితివేకరాజ్యమై |
పరగుసూత్రవతీపతివై వేంకటవిభు- | సిరులపెన్నిధి నీవే సేసిమొదలారి ||
ప|| నీవేకాని యింక నేనన్య మెరుగనే | త్రోవజూసి నాకు తోడయ్యెద వయ్య ||
చ|| అపరాధ శత కోట్లయిన నీ వొక్క | నెపమున ననుగావ నేరవా |
అపరిమిత దురితా లైనవి యే- | వుపుమ చేత నన్ను ఉద్ధరించెద వయ్య ||
చ|| అతిశయముగ కర్మి నైతిని నీ- | మతము నాకొక యింత మఱపవా |
ఇతర కర్మారంభ హితుడనే నాకింక | గతి మోక్ష మెటువలె కల్పించెద వయ్య ||
చ|| తిరు వేంకటాచలాధీశ్వర నీదు | శరణాగతులను బ్రోవగరాదా |
పరమ దయానంద పరుడవు నీవు యే- | వెరవున భవములు వెడల ద్రోచెద వయ్య ||
ప|| నీవేమి సేతువయ్య నీవు దయానిధి వందువు | భావించలేనివారి పాపమింతే కాని ||
చ|| పరమపద మొసగి పాపమడచేనని | చరమశ్లోకమునందు చాటితివి తొలుతనె |
నిరతిని భూమిలోన నీవల్ల దప్పులేదు | పరగ నమ్మనివారి పాపమింతే కాని ||
చ|| నీపాదములకు నాకు నెయ్యమైన లంకెని | యేపున ద్వయార్థమున నియ్యకొంటివి తొలుత |
దాపుగా నీవల్ల నింక దప్పులేదు యెంచిచూచి | పైపై నమ్మినవారి పాపమింతే కాని ||
చ|| బంతి బురాణములను భక్తసులభుడ నని | అంతరాత్మ నీమాట ఆడితివి తొలుతనే |
ఇంతట శ్రీవేంకటేశ యేమిసేతువయ్య నీవు | పంతాన నమ్మినవారి పాపమింతే కాని ||
ప|| నీవేల సిగ్గుపడేవు నెట్టన దలవంచుక | భావించి నిన్ను బైకొని మెచ్చీని ||
చ|| వాడలు దిరిగి నీవు వచ్చిన రాకచూచి | వేడుకలు వెదచల్లీ వెలది |
జాడలతో నీ మోము చంద్రకళలు చూచి | వీడెపు నోటనే వేమారు బొగడీని ||
చ|| విదుటు దమకమున వుండే నీవునికి చూచి | కదిసి నవ్వులు నవ్వీ గలికి |
పొదిగిన నీశిరసు పువ్వులదండలు చూచి | యెదుట నిలుచుండి చేయెత్తి మొక్కీని ||
చ|| గక్కున వస్తా వచ్చి కౌగిట గూడగా చూచి | చెక్కులు నొక్కి నిన్ను దెలియ |
నిక్కి శ్రీ వేంకటేశుడ నీ మన్ననలెల్లా జూచి | పక్కన నీమీదటి పదాలు వాడీని ||
నూతులు దవ్వగబోతే బేతాళములు పుట్టె
కాతాళపులోకులాల కంటిరా యీసుద్దులు
మీఱినపుత్రకామేష్టి మించి లంకకు బై వచ్చె
ఆఱడి రామావతార మసురబాధ
తూఱి సీతపెండ్లి హరుదొడ్డ వింటిపండుగాయ
పాఱి పాఱి నమ్మనెటువలెవచ్చు వీరిని
చూడ కేకయరాజ్యము చుప్పనాతిపాపమాయ
వేడుక మాయామృగమువేటాయను
వాడికె సుగ్రీవుమేలు వాలికి గండాన వచ్చె
యీడుగానిరాచపుట్టు యెట్టు నమ్మవచ్చును
వుమ్మడి గోతులకూట ముదధికి గట్లు వచ్చె
తమ్మువిబుద్ది రావణుతల వోయను
పమ్మి శ్రీ వేంకటేశునిపట్టానకే యింతానాయ
యిమ్ముల నిట్టిదేవర నెట్టు నమ్మవచ్చును
ప|| నెయ్యని పోసుకోరాదు నీళ్ళని చల్లగరాదు | చెయ్యార గంటిమి నేడు చేరి నీతో పొందుట |
చ|| ప్రేమము చాలాజేసి పెక్కు సతులతోను | మోము చూడ సిగ్గుపడి ముసుగుతో నున్నదాన |
జామువోయి వచ్చినీవు సరసములాడేవు | యేమని నేనియ్యకుందు నేటిజన్మమయ్య ||
చ|| పలుమారు నీతోనవ్వి పరాకై వుండిన నీతో | పలుకగ సిగ్గుపడి భావింపుచు నున్నదాన |
కలగన్నట్లా వచ్చి కందువలంటేవు నన్ను | బలిమి యేమున్నది నాబదుకు నీ చేతిది ||
చ|| మచ్చికతో నిన్నుగూడి మన్నించిన నీతోను | పచ్చిసేయ సిగ్గుపడి వదరక వున్నదాన
యెచ్చుగా శ్రీ వేంకటేశ యిట్టెనన్ను నేలితివి | విచ్చన విడాయ నా విభవము లెల్లను ||
ప|| నెయ్యములలో నేరెళ్ళో | వొయ్యన వూరెడి వువ్విళ్ళో ||
చ|| పలచని చెమటల బాహుమూలముల | చెలములలోనా జెలువములే |
ధళధళమను ముత్యపు జెరగు సురటి | దులిపేటి నీళ్ళ తుంపిళ్ళో ||
చ|| తొటతొత గన్నుల దొరిగేటినీళ్ళ | చిటిపొటి యలుకలు చిరునగవే |
వట ఫలంబు నీ వన్నెల మోవికి | గుటుకల లోనా గుక్కిళ్ళో ||
చ|| గరిగరికల వేంకటపతి కౌగిట | పరిమళములలో బచ్చనలు |
మరునివింటి కమ్మనియంప విరుల | గురితాకులినుప గుగ్గిళ్ళో ||
ప|| నెరవాది సాహసులు నిత్యశూరులు | దురిత విదూరులు ధృవాదులు ||
చ|| తక్కక శ్రీహరిభక్తితపాలుసేసి యెక్కిరి | చక్కగా వైకుంఠము సనకాదులు |
వొక్కట విష్ణుకథలు వోడసేసుక దాటిరి | పెక్కు సంసారజలధి భీష్మాదులు ||
చ|| కడువిరక్తి యనేటి కత్తులనే నరకిరి | నడుమ భవపాశముల నారదాదులు |
బడినే హరిదాసులపౌజులు గూడుకొనిరి | నుడివడ కిహమందే శుకాదులు ||
చ|| పరమశాంతములనే పట్టపేనుగులమీద || వరుసల నేగేరు వ్యాసాదులు |
సిరుల శ్రీవేంకటేశు జేరి సుఖము బొందిరి | బెరసి దాస్యమున విభీషణాదులు ||
ప|| నెలత చక్కదనమే నిండు బండారము నీకు | గలిగె గనకలక్ష్మీ కాంతుడవైతివి ||
చ|| పడతి నెమ్మోమునకు బంగారు కళలుదేరీ | వెడలే సెలవి నవ్వే వెండిగనులు |
అడియాలమగు మోవినదె పగడపుదీగె | నిడువాలుదనమే నీలముల రాశి ||
చ|| తరుణి పాదపు గోళ్ళు తళుకుల వజ్రములు | పరగు జేతిగోళ్ళె పద్మరాగాలు |
అంది కన్నుల తేటలాణి ముత్తెపు సరులు | సరి బచ్చల కొండలు చనుమొనలు ||
చ|| చెలితేనె మాటలు జిగి బుష్యరాగాలు | వలపు తెరసిగ్గులు వైడూర్యాలు |
తొలకు ననురాగాలే దొడ్డ గోమేధికాలు | కలసితీకెను శ్రీవేంకటేశు కౌగిటను ||
ప|| నెలమూడు శోభనాలు నీకు నతనికిదగు | కలకాలమును నిచ్చకల్యాణమమ్మా ||
చ|| రామనామమతనిది రామవు నీవైతేను | చామన వర్ణమతడు చామవు నీవు |
వామనుడందురతని వామనయనవు నీవు | ప్రేమపుమీ యిద్దరికి పేరుబలమొకటే ||
చ|| హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు | కరిగాచెదాను నీవు కరియానవు |
సరి జలధిశాయి జలధికన్యవు నీవు | బెరసి మీయిద్దరికి బేరుబలమొకటే ||
చ|| జలజ నాభుడతడు జలజముఖివి నీవు | అలమేలుమంగవు నిన్నెలమెదాను |
ఇలలో శ్రీవేంకటేశుడిటు నిన్నురానమోచె | పిలిచి పేరుచెప్పెబేరుబలమొకటే ||
నే ననగా నెంతవాడ నెయ్యపుజీవులలోన
యీనెపాన రక్షించీ నీశ్వరుడేకాక
యెవ్వరు బుద్దిచెప్పిరి యిలపై జీమలకెల్లా
నెవ్వగ బుట్టల గొల్చు నించుకొమ్మని
అవ్వల సంసారభ్రాంతి అనాదినుండియు లోలో
దవ్వించి తలకెత్తేయంతర్యామేకాని
చెట్టుల కెవ్వరు బుద్దిచెప్పేరు తతికాలాన
బుట్టి కాచి పూచి నిండా బొదలుమని
గుట్టుతో జైతన్యమై గుణములన్నిటికిని
తిట్టపెట్టి రచించినదేవు డింతేకాక
బుద్దు లెవ్వరు చెప్పిరి పుట్టినట్టిమెకాలకు
తిద్ది చన్ను దాగి పూరి దినుమని
పొద్దువొద్దు లోన నుండి భోగములు మఱపిన
నిద్దపుశ్రీవేంకటాద్రినిలయుండేకాక
ప|| నే నేమిసేయుదును నీవు నాలోపలనుండి | శ్రీనాథుడవు నీచేత ఇంతేకాక ||
చ|| తనువేమిసేయును తనువులోపలయున్న- | చెనటియింద్రియములచేతలుగాక |
మనసేమిసేయును మనసులోపలనున్న- | నినుపుగోర్కులు చేసేనేరములుగాక ||
చ|| జీవుడేమిసేయును జీవునిబొదుగుకున్న- | భావపుప్రకృతి చేసేపాపముగాక |
చేవదేర బుట్టు వేమిసేయు ముంచుకొన్నట్టి- | దైవపుమాయలోనిధర్మ మింతేకాక ||
చ| కాలమేమిసేయును గక్కన శ్రీవేంకటేశు- | డేలి మన్నించేమన్నన యిదియేకాక |
యేల యేల దూర నింక నెవ్వరు నేమిసేతురు | మేలిమి నిను దలచి మెచ్చుటేకాక ||
నే నొక్కడ లేకుండితే నీకృపకు బాత్ర మేది
పూని నావల్లనే కీర్తి బొందేవు నీవు
అతి మూడులలోన నగ్రేసరుడ నేను
ప్రతిలేనిఘనగర్వపర్వతమను
తతి బంచేంద్రియములధనవంతుడను నేను
వెతకి నావంటివాని విడువగ జెల్లునా
మహిలో సంసారపుసామ్రాజ్యమేలేవాడ నేను
యిహమున గర్మవహికెక్కితి నేను
బహుయోనికూపసంపద దేలేవాడ నేను
వహించుక నావంటివాని దేనోపేవా
భావించి నావంటినీచు బట్టి కాచినప్పుడుగా
యేవంక నీకీర్తి గడువెంతురు భువి
నావల్ల నీకు బుణ్యము నీవల్లనే బ్రదుకుదు
శ్రీవేంకటేశుడ యింత చేరె జుమ్మీ మేలు
నేడు దప్పించుకొంటేను నేరుపున్నదా
పేడుక భోగించుతానే పెనగ జోటున్నదా.
తనువు మోచిననాడే తప్పులెల్లా జేసితిని
వెనక మంచితనాలు వెదక నేది
ననిచి సంసారినైననాడే నిష్టూరానకెల్ల
మునుప నే గురియైతి మొరగ జోటున్నదా.
సిరులు చేకొన్ననాడే సిలుగెల్లా గట్టుకొంటి
తరగాతిపను లింక దడవనేల
నరలోకముచొచ్చిననాడే పుణ్యపాపముల
పొరుగుకు వచ్చితిని బుద్దు లింక నేల
వూపిరిమోచిననాడే వొట్టికొంటి నాసలెల్లా
మాపుదాకా వేసరిన మాన బొయ్యీనా
యేపున శ్రీవేంకటేశుడింతలో నన్ను గావగా
పైపై గెలిచితిగాక పంతమాడగలనా.
ప|| నేనెంత చిన్ననైనా నీకే సులభము గాని | పూని నా సరివారికి బొడవే సుమ్మీ ||
చ|| యిచ్చకపు పతివి నీవేమన్నా నితవే నాకు | కొచ్చికొచ్చి తిట్టినాను కోపమున్నదా |
తెచ్చుకొన్న నీసతులు తేనె మాటాడినాను | మచ్చరములై పెరిగి మర్మములు నాటురా ||
చ|| నీటున బ్రాణవిభుడ నీవేమి సేసినా | వాటమై మొక్కుదు గాక వాసి వట్టేనా |
పాతకపు సవతులు నయగారాలు సేసినా | యీటెల పోట్లే కాక యింతకోపేనా ||
చ|| చేరినిన్ను నేలినట్టి శ్రీ వేంకటేశ నీవు | యేరీతి నుండినాను యెరవున్నదా |
సారెకు నీవు ముట్టిన సవతులు వద్దనున్నా | నీరసమె రేగు గాని యీయకోలు గాదురా ||
ప|| నేనెంత నీవెంత నిక్కె మా యిది | కానీ లేరా యిది యొక్క కాకు నేనే జాడలా ||
చ|| కోరివేడి తగిలిన గోపసతు లుండ గాను | అరయ నాకొంగు పట్టే వలసితినా |
మేరతో బెండ్లాడిన రుక్మిణిదేవి వుండగాను | యేరా నాతో నవ్వేవు యెగసక్కెమా ||
చ|| చనవిచ్చి మన్నించిన సత్యభామ వుండగాను | చెనకేవు నే నీకు జిక్కితినా |
పనివడి తెచ్చుకొన్న పదారువేలుండగాను | నను జెక్కు నొక్కేవు నాటకములా ||
చ|| గందమిచ్చి మెప్పించిన కలికి యొకతె యుండ | అంది నను గాగిలించే వాగడములా |
కందున శ్రీ వేంకటేశ కలసితి విటు నన్ను | చిందేవు మోహము నాపై చిత్తమింత వచ్చెనా ||
ప|| నేనెంతవాడను నిన్నడిగి నంటే | వీనుల నీకథలెల్లా వినుటేగా ||
చ|| అలిగిన అలుగక అన్యులు మరిదూరి | పలికినను మారు పలుకక వాదు |
తలచిన కలుగకసరి కొట్టినను గాని | మూలుగనివాడే గదా ముక్తికి నర్హుడు ||
చ|| నగినను తానగక నాతులెవ్వరైన | తగిలి పెసగిన తగులక |
వగచినా వగవక వ్రతము చేరిచె మంటే | మొగమోడకున్నవాడే ముక్తికి నర్హుడు ||
చ|| విరిచినా విరువక విష్ణుభక్తియె దాటున | వెరపించిన మరి వెడవక |
నెరవై శ్రీ వేంకటేశ నీ పాదములె నమ్మి | మెరుగు లేనివాడె ముక్తికి నర్హుడు ||
నేనెందువోయె తానెందువోయీ రానీలే రానీలే రానీలే ||
మీనైన నాటి తన మిడుకెల్ల దిగవలె కానీలె కానీలె కానీలె ||
తలచూపేనాటి తలపెల్ల దిగవలె తలచనీ తలచనీ తలచనీవే ||
కిరికియైననాటి తన కిటుకెల్లదిగవలె తిరుగనీ తిరుగనీ తిరుగనీవే||
హరియైననాటి అదటెల్ల దిగవలె జరగనీ జరగనీ జరగనీవే||
వడుగైననాటి(తన) వస విడువంగవలె తడవకు తడవకు తడవకువే||
కలుషించే నాటి కడమెల్ల దిగవలె అలుగనీ అలుగనీ అలుగనీవే||
సతిబాసేనాటి చలమెల్ల దిగవలె తతిగానీ తతిగానీ తతిగానీలే||
ముసలైన నాటి ముసుపెల్ల దిగవలె విసుగనీ విసుగనీ విసుగనీవే||
మానైననాటి (తన) మదమెల్ల దిగవలె పోనీవే పోనీవే పోనీవే||
కలికైన నాటి గజరెల్ల దిగవలె చెలగనీ చెలగనీ చెలగనీవే||
వేడుకతో నాటి వేంకటపతి నన్ను కూడనీ కూడనీ కూడనీవే||
నేనెయనగనేలా నీ మనసూ నెరగదా
ఆనవెట్టి చెప్పే జుమ్మీ ఆసగింతు నీకు
చిగిరించే కోపమున చేదైన వలపు
తగనట్టి తమకాన దీపాయరా
వొగరు గాకల చేత నుడికేటి దేహము
సగము మొగమాటాన జల్లనాయరా
చిమ్మిరేగే జగడాల చీకటైన మోహము
దిమ్మరి యెడమాటల దేటవారెరా
సమ్మతిగా నీ వొట్ల సైంచని పొందులు
యెమ్మెల కోరికలచే నితవాయరా
చెదని రేసుల చిన్నబోయే మోములు
కదిసి మేను సోకితే గళ రేగెరా
వెదకి నీవు నేనూ శ్రీవెంకటనాథ కూడగా
మదిలోని మచ్చికలు మక్కళించెరా
నేనే బ్రహ్మము కోనేరము॥ నేము
కామించిన స్వతంత్రము గడు లేదుగాన
క్షణములోపలనె సర్వజీవావస్థలూను
గణుతించేవా డొకడు గలడు వేరే
అణుమహత్త్వములందు నంతర్యామైనవాని
ప్రణుతించి దాసులమై బ్రదికేముగాని
పనిగొని యేలుటకు బ్రహ్మాదిదేవతల
గనిపించేవా డోకడు గలడు వేరే
ననిచి సిరుల లక్ష్మీనాథుడైనవాని
అనులవారము నేము బ్రదికేముగాని
సతతరక్షకుడయి శంఖచక్రధరుడయి
గతి శ్రీవేంకటపతి గలడు వేరే
అతనిమఱగు చొచ్చి యానందపరవశాన
బ్రతిలేక యిందరిలో బ్రదికేము గాని
ప|| నేరిచిబ్రదికేవారు నీదాసులు | నేరమి బాసినవారు నీదాసులు ||
చ|| కామము గ్రోధము రెంటీ గాదని విడిచి మంచి- | నేమము పట్టినవారే నీదాసులు |
దోమటి బాపపుణ్యాల దుంచివేసి చూడగానే | నీమాయ గెలిచినవారు నీదాసులు ||
చ|| కిక్కిరించినయాసల గిందవేసి మోక్షము | నిక్కినిక్కి చూచేవారు నీదాసులు |
వెక్కసపుభక్తితోడ వెఱపు మఱపు లేక | నెక్కొన్నమహిమవారు నీదాసులు ||
చ|| అట్టె వేదశాస్త్రముల అర్థము దేటపఱచి | నెట్టుకొని మించినవారు నీదాసులు |
యిట్టె శ్రీవేంకటేశ యితరమార్గములెల్లా | నెట్టువడ దోసినవారు నీదాసులు ||
ప|| నేరుపరి ననుకోను నెరజాణ ననుకోను | యీరీతి నాహావ భావాలింతెఱగడా ||
చ|| మలసి తనతో నేను మాటలాడనని దూరి | నెలవుల నవ్వితేనే సేన మాటలే |
పిలిపించనని తాను బిగువులు నెరపీని | తలుపు దెరచితేనే తగుసన్న గాదా ||
చ|| దగ్గర గూచుండనంటా తమకించి నంతలోనె | సిగ్గువడి వుండితేనే చేరి వుండుటే |
వొగ్గి తన్ను జూడనంటా వొరట్లు వట్టీని | అగ్గమై యెదుట నుంటే అన్నియును గాదా ||
చ|| ముందు కౌగిలించనంటూ మొనలెల్ల జూపీని | ఇందమని విడేమిచ్చుటదియే అది |
అందపు శ్రీ వేంకటేశుడలమేలుమంగ నేను | పొందితిమిద్దరమివి పోదులెల్లా గావా ||
ప|| నేర్పుకంటె బెన్నిధి గద్దా | ఓర్పుకంటె సుఖమొకటి గద్దా ||
చ|| కరుణకు నెక్కుడు గతి యిక గద్దా | సరసత కెక్కుడు సరిగద్దా |
గురుమతి జిత్తము కూరిమి నిలిపిన | నెరవుకంటె విధమిక గద్దా ||
చ|| కలిమికంటె జీకటి మరి కద్దా | బలిమి కంటె నాపద గద్దా |
గెలుపు(గ) దెలెసి లంకించిన మతితో | జెలగుకంటె నిజనీతి యిక గద్దా ||
చ|| పాయము కంటె నపాయము గద్దా | కాయపు రోతకు గడ గద్దా |
పాయక వేంకట పతికృప గోరిన | యీ యభిమతమున కెదురిక గద్దా ||
ప|| నేల మిన్ను నొక్కటైననీబంటు వొక్క- | వేలనే యక్షుని దెగవేసెగా నీబంటు ||
చ|| ఉంగర మెగరవేసి యుదధిలో బడకుండ | నింగికి జెయిజాచి నీబంటు |
చంగున జలధిదాటి జంబుమాలి నిలమీద | కుంగదొక్కి పదముల గుమ్మెగా నీబంటు ||
చ|| వెట్టగా రావణు రొమ్మువిరుగ జేతనే గుద్దె | నిట్టతాడువంటివాడు నీబంటు |
దిట్టయై మందులకొండ తేజమున నడురేయి | పట్టపగలు దెచ్చె బాపురే నీబంటు ||
చ|| అలరనన్నియు జేసి అజునిపట్టానకు | నిలుచున్నాడదివో నీబంటు |
బలువేంకటేశ ఈ పవననందనుడు | కలిగి లోకములెల్ల గాచెగా నీబంటు ||
ప
ప|| పంకజాక్షులు సొలసిపలికి నగగా- | నింకా నారగించు మిట్లనే అయ్యా ||
చ|| కలవంటకములు పులుగములు దుగ్ధాన్నములు | పలుదెరగులైన అప్పములగములు |
నెలకొన్ననేతులును నిరతంపుచక్కెరలు | గిలుకొట్టుచును నారగించవయ్యా ||
చ|| పెక్కువగు సైదంపు పిండివంటలమీద | పిక్కిటిలు మెఱుగుబొడి బెల్లమును |
వొక్కటిగ గలుపుకొని వొలుపుబప్పులతోడ | కిక్కిరియ నిటు లారగించవయ్యా ||
చ|| కడుమధురమైన మీగడపెరుగులను మంచి- | అడియాల వూరుగాయల రుచులతో |
బడిబడిగ నవకంపు బళ్ళెరంబులతోడ | కడునారగించు వేంకటగిరీంద్రా ||
పంటల భాగ్యులు వీరా బహువ్యవసాయులు
అంటిముట్టి యిట్ల గాపాడుదురు ఘ్హనులు ||
పొత్తుల పాపమనేటి పోడు నఇకివేసి
చిత్తమనియెడు చేను చేనుగా దున్ని
మత్తిలి శాంతమనే మంచి వానపదనున
విత్తుదురు హరిభక్తి వివేకులు ||
కామక్రోధాదులనే కలుపు దువ్వివేసి
వేమురు వైరాగ్యమనే వెలుగు వెట్టి
దోమటి నాచార విధుల యెరువులువేసి
వోముచున్నారు జ్గ్యానపు బైరుద్యోగజనులు ||
యెందు చూచిన శ్రీవేంకటేశుడున్నాడనియెడి
అందిన చేని పంట లనుభవించి
సందడించి తమవంటి శరణాగతులు దాము
గొంది నిముడుకొందురు గురుక్రుప జనులు ||
ప|| పండియు బండదు చిత్తము పరిభవ మెడయదు కాంక్షల | యెండలచే కాగితి మిక నేలాగోకాని ||
చ|| పదిగోట్ల జన్మంబుల బాయనికర్మపుబాట్లు | వదలక వొకనిమిషములో వడి దీరుచు నితడు |
చెదరని నిజదాసులకును శ్రీహరి, మాకిపుడంతక | హృదయము నిలువదు చంచల మేలాగోకాని ||
చ|| కూపపుబహునరకంబుల కోట్లసంఖ్యల బొరలేటి- | పాపము లొకనుమిషములో బాపగగల డితడు |
కాపాడగ దలచిన యీకమలాపతి, నేమీతని- | యేపున గని మనలేమిక నేలాగోకాని ||
చ|| జడిగొని యెన్నడు బాయని సంసారపు బంధంబుల | విడుమని వొకనిమిషములో విడిపించును యితడు |
కడుగొలిచినవారికి వేంకటపతి, నేమీతని- | నెడయక కొలువగలేమిక నేలాగోకాని ||
పంతగాడు మిక్కిలి నీ పవనజుడు రంతుకెక్కె మతంగ పర్వత పవనజుడు
వాలాయమై ఎంత భాగ్యవంతుడో దేవతలచే బాలుడై వరములందె పవనజుడు
పాలజలనిధి దాటి పరగ సంజీవి దెచ్చి ఏలిక ముందర బెట్టే ఈ పవనజుడు
సొంటులు శోధించిదెచ్చె సుగ్రీవుడు రాఘవునికి బంటుగాగ పొందు సేసె పవనజుడు
ఒంటినె రాముని ముద్ర ఒసగి సీత ముందర మింటి పొడవై పెరిగే మేటి పవనజుడు
ఇట్టి శ్రీ వేంకటేశ్వరు కృపచే ముందరి బ్రహ్మ పట్టమేల నున్నవాడు పవనజుడు
చుట్టి చుట్టి తనకు దాసులైన వారికి గట్టి వరములిచ్చే నీ ఘన పవనజుడు
పంతములాడెదమా వసంతములాడెదమా
వేంకటరమణుని లీలలు పాడుచు కొంతసేపు హరి గోవిందాయని
బృందావనమే చేరి గోపబృందముతో జతగూడి
నల్లనయ్యతో కోలాటాలలో కోలుకోలుయని పదములు పాడుచు
యమునా తీరములో చల్లని వెన్నెల గాలులలో
మురళీగానములో అల్లరి కృష్ణుని చేతలలో చల్లని స్వామికి జోతలలో
ఇహపరసాధన మార్గం ఇల వేంకట రమణుని గానం
దివ్యదర్శన లీలల డోలల ఘల్లు ఘల్లని యడదలు పొంగగ
ప|| పటుశిష్టప్రతిపాలకుడ వనగ | ఘటన నఖిలమును గాతువుగా ||
చ|| తుత్తుమురుగ దైత్యుల దనుజుల నని | మొత్తిమోది చలమున జెలగి |
జొత్తుపాపలుగ సొరిది విరోధుల | నెత్తురు వడుతువు నీవేకా ||
చ|| తళతళమెరుచు సుదర్శనాయుధం- | బలరుచు నొకచే నమరగను |
బలుదైత్యులదొబ్బలు బేగులు నని | నిలువున జెండుదు నీవేకా ||
చ|| దిట్టవు సూత్రవతీపతి వసురల | జట్టలు చీరగ జతురుడవు |
రట్టడి వేంకటరమణుని వాకిట- | పట్టపుసేనాపతివటకా ||
ప|| పట్టము గట్టితివింక బ్రతుకరయ్యా | చిట్టకాలు లేవు మీకు శ్రీ వేంకటేశుడా ||
చ|| అలమేలు మంగకు సింహాసనము నీవురము | కలిత హారములే సింగారపు దండలు |
తొలుత నీహస్తములే తోరణ గంభములు | చెలి రాజ్యమే నీవు శ్రీ వేంకటేశుడా ||
చ|| పరగు తులసీదండ పచ్చ తోరణమాపెకు | మెరుగు గౌస్తుభమణి మించుటద్దము |
గరిమ నీసొబగులు కప్పములు గానికలు | సిరులు నీ కూరిమలు శ్రీ వేంకటేశుడా ||
చ|| సంతతమైన విందులు సారె నీమోవి తేనెలు | వింత రతి భోగములు వినోదాలు |
కొంత నియ్యారును బొడ్డు కుంచెయు గాళాణి | చెంతలనన్నీ నమరె శ్రీ వేంకటేశుడా ||
పట్టరో వీదుల బరువులు వెట్టి
పుట్టుగులతో హరి పొలసీ వీడే
వేవేలు నేరాలు వెదకేటిదేవుడు
ఆవుల గాచీ నలవాడే
పోవుగ బ్రాహ్మల బుట్టించుదేవుడు
సోవల యశోదసుతుడట వీడే
ఘనయజ్ఞములకు గర్తగుదేవుడు
కినిసి వెన్న దొంగిలె వీడే
మునులచిత్తములమూలపుదేవుడు
యెనసీ గొల్లెతలయింటింట వీడే
నుడిగి నారదుడు నుతించుదేవుడు
బడిరోలగట్టువడె వీడే
వుడివోనివరము లొసగెడుదేవుడు
కడగిన శ్రీ వేంకటగిరి వీడే
ప|| పట్టవసముగాని బాలుడా పెను- | బట్టపుబలువుడ బాలుడా ||
చ|| ఇరుగడ బ్రహ్మయు నీశ్వరుడును నిన్ను | సరుస నుతింప జఠరమున |
అరుదుగ నుండి ప్రియంబున వెడలిన- | పరమమూర్తివా బాలుడా ||
చ|| తల్లియు దండ్రియు దనియనిముదమున | వెల్లిగ లోలో వెరవగను |
కల్లనిదురలో గనుమూసుక రే- | పల్లెలో బెరిగిన బాలుడా ||
చ|| యేదెస జూచిన నిందరిభయముల- | సేదలు దేరగ జెలగుచును |
వేదపల్లవపు వేంకటగిరిపై | పాదము మోపిన బాలుడా ||
పట్టిన వారల భాగ్యమిదే
గుట్టు తెలిసితే గురుతులివే
కామ ధేనువును కల్పవృక్షమును
దామోదర నీ దర్శనం
భూమీశత్వము భువనేశత్వము
సామజ వరద నీ శరణ్యము
పరుస వేదియును పరమైశ్వర్యము
హరి నిను గొలిచే అను భవము
నిరత భోగములు నిధి నిధానములు
గరిమ మెరయు మీ కైంకర్యములు
నిండు భొగములు నిత్య శోభనము
కొండలయ్య నీ గుణ కధలు
అండనె శ్రీ వేంక టాధిప సర్వము
మెండు కొన్నదిదె మీ కరుణ
ప|| పట్టినచోనే వెదకి భావించవలెగాని | గట్టిగా నంతర్యామి కరుణించును ||
చ|| యింటిలోనిచీకటే యిట్టే తప్పకచూచితే | వెంటనే కొంతవడికి వెలుగిచ్చును |
అంటి కానరాని తనయాతుమ తప్పకచూచు- | కొంటే దనయాతుమయు గొబ్బున గాన్పించును ||
చ|| మించి కఠినపురాతిమీద గడప వెట్టితే | అంచెల దానే కుదురైనయట్టు |
పొంచి హరినామమే యేపొద్దు నాలికతుదను | యెంచి తలచదలచ నిరవౌ సుజ్ఞానము ||
చ|| వొక్కొక్కయడుగే వొగి ముందర బెట్టితే | యెక్కువై కొండైనా నెక్కు గొనకు |
యిక్కువ శ్రీవేంకటేశు నిటు దినదినమును | పక్కన గొలిచితే బ్రహ్మపట్ట మెక్కును ||
ప|| పట్టినదెల్లా బ్రహ్మము | దట్టపుజడునికి దైవంబేలా ||
చ|| ఘనయాచకునకు కనకమే బ్రహ్మము | తనువే బ్రహ్మము తరువలికి |
యెనయు గాముకున కింతులే బ్రహ్మము | తనలోవెలిగేటితత్త్వం బేలా ||
చ|| ఆకటివానికి నన్నమే బ్రహ్మము | లోకమే బ్రహ్మము లోలునికి |
కైకొని కర్మికి కాలమే బ్రహ్మము | శ్రీకాంతునిపై జింతది యేలా ||
చ|| భువి సంసారికి పుత్రులె బ్రహ్మము | నవ మిందరి కిది నడచేది |
యివలను శ్రీవేంకటేశుదాసులకు | భవ మతనికృపే బ్రహ్మము ||
ప|| పదిలము కోట పగవారు | అదన గాచుకొందు రారుగురు ||
చ|| ఇమ్మై జెప్ప యిందరిచేత | తొమ్మిదినెల్ల దోగినది |
కొమ్మతీరున గుదురైనకోట | దొమ్మికాండ్లైదుగు రుందురు ||
చ|| వొంటికాడు రాజు వుడుగక తమలోన | వొంటనీనిమంత్రు లొకయిద్దరు |
దంటతనంబున దమయిచ్చ దిరిగాడు- | బంటు లేడుగురు బలవంతులు |
తెలిసి కొనేటితిమ్మినాయడు చొచ్చె | బలిసె యీకోట భయమేల ||
ప|| పనిమాలినట్టి వట్టిపరదుగాక మాకు | ననిచి యిదియు నొక్కనగుబాటా ||
చ|| కన్నవారినెల్లా వేడేకష్టమే దక్కుటగాక | పన్ని దైవమియ్యనిది పరులిచ్చేరా |
యెన్నికతో దేహమిచ్చె నిహమెల్లా జెందనిచ్చె | వున్నవారింతటిపని కోపగలరా ||
చ|| బడలి తానెందైనా బడ్డపాటేదక్కెగాక | కడగి రానిదిదే నొక్కరివసమా |
కడుపులో నుండగానే కలవి నుదుట వ్రాసె | తడవి దైవముచేత దాటవసమా ||
చ|| దెప్పరపుసంపదకు దిమ్మటలే దక్కెగాక | యెప్పుడూ శ్రీవేంకటేశు డీకమానీనా |
చప్పుడుగా నతనికే శరణన్న జాలుగాక | తప్పులును వొప్పులు నాతనివేకావా ||
ప|| పనిలేనిధనవాంఛ బడిపొరలిన నిట్టి- | కనుమాయలేకాక కడ నేమిగలదు ||
చ|| కనుచూపుకాకల గలయట వెడయాస- | లనుభవింపుటగాక యందేమిగలదు |
తనువల్లిసోకుల దగులుట మమతల- | నెనయగోరుటగాక యిందేమిగలదు ||
చ|| ఎలమి నధర మానుటెరిగి యెంగిలి నోర- | నలుముకొనుట గాక యందేమిగలదు |
పలులంపటములచే బడుట దుఃఖంబులు | తలజుట్టుటేకాక తనకేమి గలదు ||
చ|| శ్రీవేంకటాద్రీశు జేరనిపనులెల్ల | నేవగింతలేకాక యిందేమిగలదు |
ఆవల సురతభోగ మనుభవింపబోయి | రావలయుటగాక రచనేమిగలదు ||
ప|| పనివడి యింద్రియాలే పరువులు వెట్టుగానీ | ఎడయని చుట్టరికాలెవ్వరికీ లేవు ||
చ|| వన్నె సతుల రూపులు వారివద్దనె నుండగా | కన్నులజూచే వారికి కళరేగును |
ఎన్నివారి గుణాలెడ మాటలాడగాను | విన్నవారికి వూరకేను వేడుకలుబుట్టు ||
చ|| అంతానింతా గమ్మవిరులు అంగళ్ళలో నుండగా | సంత వారలూరకే వాసనగొందురు |
బంతివారి కంచాలలో పలురుచు లుండగాను | వింతవార లందుకుగా వెసనోరుదురు ||
చ|| వెరవిడి దేహాలు వేరె వుండగాను | సురతాన సోకితేనే చొక్కుదురు |
ఇరవై శ్రీ వేంకటేశు యిన్నిటికీ సూత్రధారి | నరినితనీ దాసులు జడియరిందుకును ||
ప|| పరగీ నిదివో గద్దెపై సింహము వాడె | పరమైన ఔభళనారసింహము ||
చ|| తెల్లనిమేనిసింహము దేవసింహము | మెల్లని చిరునవ్వుల మేటిసింహము |
చల్లేటి ఉరుపులతో జయసింహము వాడె | బల్లిదుడైవెలసే ఔభళనారసింహము ||
చ|| నిలుచున్న సింహము నిత్య సింహము | అలరు కొండలమీది అది సింహము |
వెలుపలి కడపపై వీరసింహము | పలుకు పంతముల ఔభళనారసింహము ||
చ|| పుట్ట జడల సింహము పూర్ణసింహము | ఱట్టడి ఆర్పుల ఆఱడి సింహము |
జట్టిగొన్న దాసులకు శాంతసింహము | పట్టపు శ్రీవేంకట ఔభళనారసింహము ||
ప|| పరగుబహుజన్మ పరిపక్వహృదయుడై | మరికదా వేదాంతమార్గంబు గనుట ||
చ|| కలుషహరమగు వివేకమ్ము గలిగినయట్టి- | ఫలముగాదా కృపాపారీణుడౌట |
తలపోసి సకలభూతదయావిశేషంబు | కలిగికదా గుణవికారంబు గనుట ||
చ|| యెదిరి దనవలెనె తా నెఱగనేర్చినఫలము | అదిగదా ద్రవ్యమోహంబు గడచనుట |
పదిలమగునాశానుభవము పాపినయట్టి- | తుదగదా తాను సంతోషంబు గనుట ||
చ|| రతిపరాఙ్ముఖ మహారాజ్యమబ్బినఫలము | మతిగదా తాను కర్మత్యాగియౌట |
తతితోడ ఫలపరిత్యాగిచిత్తవ్యాపి- | ధృతిగదా వేంకటాధిపుదాసుడౌట ||
ప|| పరదేశిపట్టణమున పదుగురునేగురు గూడుక | పరగగ వరి చెడ నూదర బలిసినయట్లాయ ||
చ|| ఊరేలెడియత డలసత నూరకయుండగ నడుమల- | వారలు నిక్కపుగర్తలవలె నుండినగతిని |
ధీరత చెడి తను జీవుడు దెలియగనేరక యుండిన | ధారుణిలోపల దొంగల ధర్మాసనమాయ ||
చ|| వొడలంతంతకు జిక్కగ నుబ్బినరోగము సుఖమున- | కెడమియ్యక నానాటికి నేచినచందమున |
తడబడువిజ్ఞానము గతిదప్పగ బలుపగుపట్నము | కడుజెడగా మాలవాడ్ ఘన్మైనట్లాయ ||
చ|| పొసగగ నిది గని యధికుడు పుక్కటకాండ్ల నందరి | బసమారిచి మొదలికర్త బాలించినగతిని |
పసగలతిరువేంకటగిరిపతి నాదేహపుబురి నీ- | వసమై వెన్నుకు బండ్లు వచ్చినయట్లాయ ||
ప|| పరమ పురుష హరి పరాత్పర | పరరిపు భంజన పరిపూర్ణ నమో ||
చ|| కమలా పతి కమల నాభ కమలాసన వంద్య | కమల హితానంత కోటి ఘన సముదయ తేజా |
కమలామల పత్రనేత్ర కమలవైరి వర్ణగాత్ర | కమలషట్క యోగీశ్వర హృదయతేహం నమో నమో ||
చ|| జలనిధి మధన జలనిధి బంధన జలధి మధ్య శయనా | జలధి యంతర విహార మచ్ఛకచ్ఛప యవతారా |
జలనిధి జామాత జలనిధి శోషణ జలనిధి సప్తకగమన | జలనిధి కారుణ్య నమో తేహం జలనిధి గంభీర నమో నమో ||
చ|| నగధర నగరిపు నందిత నగచర యూథపనాథా | నగ పారిజాత హర సారస పన్నగ పతిరాజ శయనా |
నగకుల విజయ శ్రీ వేంకట నగ నాయక భక్త విధేయా | నగధీరాహంతే సర్వేశ్వర నారాయణ నమో నమో ||
పరమ పురుష నిరుపమాన శరణు శరణు రే
ఇందిరా నిజమందిరా
కమలనాభ కమల నయన కమల చరణు రే
అమిత సురముని నాధ్యూధప నాయకా వరదాయకా
చతుర మూరితి చతుర బాహు శంఖ చక్రధరా
అతిశయ శ్రీ వెంకటాధిప అంజనాకృతి రంజనా
పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు
మురహరుడు ఎదుట ముద్దులాడీనిదివో
వేదపురాణాలలో విహరించేదేవుడు
ఆదిమూలమైనట్టి అల బ్రహ్మము
శ్రీదేవి పాలిటి చెలగే నిధానము
సేదదీరి యశోదకు శిశువాయ నిదివో
మొక్కేటి నారదాదుల ముందరి సాకారము
అక్కజపు జీవులలో అంతర్యామి
గక్కన బ్రహ్మకొడుకుగా గన్న పరమము
అక్కరతో వెన్నముచ్చై ఆటలాడీ నిదివో
దేవతలగాచుటకు దిక్కైన విష్ణుడు
భావములు ఒక్కరూపైన భావతత్వము
శ్రీ వేంకటాద్రి మీద చేరియున్న ఆ వరదుడు
కైవసమై గొల్లెతల కౌగిళ్ళ నిదివో
ప|| పరమ యోగీశ్వరుల పద్ధతియిది |
ధరణిలో వివేకులు దలపోసుకొనుట ||
చ|| మొదలనాత్మ ఙ్ణానము దెలిసి పిమ్మట |
హృదయములోని హరినెరుగుట |
వుదుటైన యింద్రియాల నొడిసి వంచుకొనుట |
గుదిగొన్న తనలో కోరికలుడుగుట ||
చ|| తన పుణ్యఫలములు దైవముకొసగుట |
పనివడి యతనిపై భక్తి చేసుట |
తనివితో నిరంతర ధ్యాన యోగపరుడౌట |
మనసుతో ప్రకృతి సంబంధము మరచుట ||
చ|| నడమ నడమ విఙ్ణానపు కథలు వినుట |
చిడిముడినాచార్య సేవసేయుట |
యెడయక శ్రీ వేంకటేశుపై భారమువేసి |
కడు వైష్ణవుల కృప గలిగి సుఖించుట ||
ప|| పరమజ్ఞానులకు ప్రపన్నులకు | మరుగురుని మీద మనసుండవలదా ||
చ|| ఆకలి గొన్నవానికి అన్నముపై నున్నట్లు | యేకత నుండవలదా యీశ్వరునిపైని |
కాకల విటుల చూపు కాంతలపై నున్నట్లు | తేకువ నుండవలదా దేవుని మీద ||
చ|| పసిబిడ్డలకు నాస పాల చంటిపై నున్నట్లు | కొసరి భక్తి వలదా గోవిందు పైని |
వెస తెరువరి తమి విడి తలపై నున్నట్లు | వసియించ వలదా శ్రీ వల్లభు మీదటను ||
చ|| నెప్పున ధనవంతుడు నిధి గాచి యుండునట్లు | తప్పక శ్రీ వేంకటేశు తగుల వద్దా |
అప్పనమైన భ్రమ ఆలజలాల కున్నట్లు | ఇప్పుడే వుండ వలదా ఈతని మీదను ||
ప|| పరమపాతకుడ భవబంధుడ శ్రీ- | హరి నిను దలచ నే నరుహుడనా ||
చ|| అపవిత్రుడ నే నమంగళుడ గడు- | నపగతపుణ్యుడ నలసుడను |
కపటకలుష పరికరహృదయుడ నే- | నపవర్గమునకు నరుహుడనా ||
చ|| అతిదుష్టుడ నే నధికదూషితుడ | హతవివేకమతి నదయుడను |
ప్రతిలేనిరమాపతి మిము దలచలే- | నతులగతికి నే నరుహుడనా ||
చ|| అనుపమ విషయ పరాధీనుడ నే- | ననంత మోహభయాతురుడ |
వినుతింపగ తిరువేంకటేశ ఘను- | లనఘులుగాక నే నరుహుడనా ||
ప|| పరమాత్మ నిన్నుగొల్చి బ్రతికేము | విరసపు జాలివెత బడనోపము ||
చ|| మగడు విడిచినా మామ విడువని యట్లు | నిది నా మనసు రోసినా లోకులు మానరు |
తగిలేరు పొగిలేరు దైన్యమే చూపేరు | మొగమోటాలను నేను మోసపోవ నోపను ||
చ|| పొసగ దేవుడిచ్చినా పూజారి వరమీడు | విసిగినే విడిచినా విడువరు వీరేలోకులు |
కొసరేరు ముసరేరు కోరిక దీర్చుమనేరు | పసలేని పనులకు బడలనే నోపను ||
చ|| నుడుగుట దప్పినా నోము ఫల మిచ్చినట్లు | కడగి వేడుకొన్నాగానిమ్మనరు లోకులు |
తడవేరు తగిలేరు తామె శ్రీ వేంకటేశ | బుడి బుడి సంగతాలయబొరల నే నోపను ||
ప|| పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు | ధరమము విచారించ తగునీకు అమ్మ ||
చ|| కమలజుగన్న తల్లివి కామునిగన్న తల్లి | అమరులగన్న తల్లి ఆదిమ లక్ష్మి |
విమలపు నీపతికి విన్నపము జేసి మమ్ము | నెమకి ఏలితి దయ నీకే తగునమ్మ ||
చ|| కామధేను తోబుట్టుగ కల్పకము తోబుట్టుగ | దోమటి చల్లిన చంద్రు తోబుట్టుగ |
నీమగని పంపునను నిజసిరులిచ్చితివి | నేమపు వితరణము నీకే తగునమ్మ ||
చ|| పాలజలధి కన్యవు పద్మాసినివి నీవు | పాలపండే శ్రీవేంకటపతి దేవివి |
ఏలిన యితని బంట్లకు యిహపరాలిచ్చి మా | పాల గలిగితివి సంబంధము మేలమ్మ ||
ప|| పరమాత్ముని నోరబాడుచును యిరు- | దరులు గూడగదోసి దంచీ మాయ ||
చ|| కొలదిబ్రహ్మాండపుకుందెనలోన | కులికి జీవులనుకొలుచు నించి |
కలికిదుర్మోహపురోకలి వేసి | తలచి తనవులను దంచీ మాయ ||
చ|| తొంగలిరెప్పలు రాత్రిబగలును | సంగడికనుగవ సరిదిప్పుచు |
చెంగలించి వెస జేతులు విసరుచు | దంగుడుబియ్యముగా దంచీ మాయ ||
చ|| అనయము దిరువేంకటాధీశ్వరుని | పనుపడి తనలో బాడుచును |
వొనరి విన్నాణిజీవులనియెడిబియ్యము | తనర నాతనికియ్య దంచీ మాయ ||
ప|| పరిపూర్ణగరుడాద్రిపంచాననం | పరమం సేవే పంచాననం ||
చ|| కౄరదంష్ట్రాగ్నికణఘోరపంచాననం | పారీణచక్రధర పంచాననం |
వీరపంచాననం విజయపంచాననం | భారభూభారహరపంచాననం ||
చ|| దివిజపంచాననం తీవ్రనఖకాననం | భవనాశినీతీరపంచాననం |
కువలయాకాశసంఘోషపంచాననం | పవిశబ్దదంతరవపంచాననం ||
చ| శ్రీవేంకటాఖ్య ఘనశిఖరిపంచాననం | పావనం పంచముఖపంచాననం |
సేవితప్రహ్లాదసిద్ధిపంచాననం | భావితం శ్రీయుక్తపంచాననం ||
పరిపూర్ణుడవు నీవు పరాకున్నదా నిన్ను
మరిగి వుండనిదే మావల్ల దప్పు గాకా
వినవా నీ వేమియైనా విశ్వమెల్లా వీనులే
యెనసి విన్నవించని యెడ్డతన మింతే కాక
కనవా నీ విన్నియు నీ కన్నులే యెందు చూచినా
పనితో నా భావము చూపని నేరమి గాకా
పలుకవా నీ వేమియైనా బహుశబ్దమయుడవు
అలరి పిలువని నా యవివేక మింతే కాక
నిలువవా నా ముందర నిఖిలస్వరూపడవు
తెలిసి చూడలేని సందేహ మింతే కాక
మన్నించవా నీవేమి మఱగు చొచ్చితి నంటే
పన్ని మత్తుడనై యున్న నా కర్మము గాక
యిన్నిట శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
యిన్నాళ్ళెఱుగని భాగ్యమిట్టుండెగాకా
ప|| పరులకైతే నిదే పాసముగాదా | పురిగొని నీవంక బుణ్యమాయగాక ||
చ|| పరమపురుష నీవు పట్టినదే ధర్మము | అరసి నీవు చెల్లించినదే సత్యము |
ధరలోన నీరెంటికి తండ్రితో విరోధించగ | దొరసి ప్రహ్లాదునకు దోడైనదే గురుతు ||
చ|| నారాయణుడ నీవు నడపినదే తగవు | ఆరూఢి నీవౌనన్నదే ఆచారము |
సారెకు దమయన్నతో చండిపడి పెనగగ | కోరి సుగ్రీవు వహించుకొన్నదే గురుతు ||
చ|| శ్రీవేంకటేశ నీవు చేసినదే నీతి | చేవతో నీవొడబరచినదే మాట |
కావించి తాతతో బోరగా నీవు చక్రమెత్తి | ఆవేళ నడ్డమైనందుకు అర్జునుడే గురుతు ||
ప|| పరులసేవలు చేసి బ్రదికేరటా | సిరివరుదాసులు సిరులందు టరుదా ||
చ|| కోరి వొకనరుని గొలిచనవారలు | ధీరులై సలిగెల దిరిగేరట |
కూరిమి బ్రహ్మాండకోటులేలేడివాని- | వారలింతట జనవరులౌ టరుదా ||
చ|| చేకొన్నతుమ్మిదచేపడ్డకీటము- | లాకడ దుమ్మిదలయ్యీనట |
శ్రీకాంతుని పాదసేవకులగువార- | లేకులజులయినా నెక్కుడౌ టరుదా ||
చ|| ధరణీశునాజ్ఞల తమదేశములందు | సిరులనాణెపుముద్ర చెల్లీనట |
తిరువేంకటాద్రి శ్రీదేవునిముద్రలు | ధరియింపగా నింతట జెల్లుటరుదా ||
పరుసము సోకక పసిడౌనా
పురుషోత్తముడే బుద్దిచ్చుగాక.
ఘవి భోగములకు బుట్టినదేహము
వివరపు మోxఅము వెదకీనా
యివల సకలమును యేలేతిదేవుడు
తవిలి రxఇంపుట ధర్మముగాక
బెరసి యాసలనే పెరిగేటిదేహము
ధర గొంతయినా దనిసీనా
అరుదుగ నంతర్యామగుదేవుడు
పొరి బెరరేచుటే పొందౌగాక.
ఘనమగుసంసార కారణజీవుడు
తనసుజ్ఞానము దలచీనా
వెనకమునుప శ్రీవేంకటపతియే
కనుగొని మమ్మిటు కాచుటగాక.
ప|| పరుసము సోకియు బ్రదుకవద్దా | తిరిగి కర్మము లింక తీదీపులా ||
చ|| పడిగాలువడియున్న ప్రాణాచారముల- | పడతుల నధముల బాలించితి |
యిడుమల బెడబాప నింకనేల తెగికొంత | గడిచీటిచ్చియు నింక గడమున్నదా ||
చ|| మితిలేనిధనములు మెరసి కానుకగొని | అతిపుణ్యులిందరి నలరించితి |
ధృతిహీనులకునెల్ల దిక్కయి కాతువుగాక | వ్రతముచెల్లిన నింక వట్టగట్లా ||
చ|| పాలించి నావిన్నపమున వేంకటరాయ | లాలించితివి నే నీలలనగానా |
యీలాగుననె లోకమింతా గాతువుగాక | పాలుదాగినమీద బైకుడుపులా ||
ప|| పరుసమొక్కటే కదా పైడిగా జేసేది | అరయలోహ మెట్లున్నా అందుకేగాని ||
చ|| వనజనాభుని భక్తి వదలకుండిన జాలు | మనసు యెందు తిరిగినా మఱియేమి |
మొనశి ముద్రలు భుజముల నుండితే చాలు | తనువెంత హేయమైన దానికేమి ||
చ|| శ్రీకాంతు నామము జిహ్వతగిలితే చాలు | ఏకులజుడైనను హీనమేమి |
సాకారుడైన హరి శరణుజొచ్చిన చాలు | చేకొని పాపము చేసిన నేమి ||
చ|| జీవు డెట్లున్న నేమి జీవునిలో యంతరాత్మ | శ్రీ వేంకటేశున కాచింత యేమి |
యేవల నంబరమైన యిహమైన మాకు చాలు | కైవశమాయె నతండు కడమ లింకేమి ||
పలపారగించవమ్మ వనిత నీ
యలుక చిత్తమున కాకలి సేసినది ||
అడియాసలనె పక్వమైన సోయగపు
వెడయలుకల మంచి వేడివేడి రుచులు
ఎడసేసి తాలిమి నెడయించి పైపైనె
పొడమిన తమకంపు బోనము పెట్టినది ||
ఆ మంచి మధురంపు అధరామ్రుతముల
కేసూరి దావుల చల్లు వెన్నెల బయటను
కోమలపుదరి తీపు కోరిక కుమ్మరించి
భామకు పూబానుపు పబళ్ళెము పెట్టినది ||
కన్నులు కాంక్షలనెడి కళకళము దీరె
నన్నపు నవ్వులనెడి చనవగ్గలించెను
అన్ననపు మరపు నీకంతవింత కలిగెనే
డన్నియును దిరువేంకటేశుని మన్ననలు ||
ప|| పలికెటి వేదమె ప్రమాణము | తలచిన వారికి తత్త్వము సుండి ||
చ|| నరహరి యజాండ నాయకుడు | సురలితనినె సంస్తుతించిరి |
పురుషోత్తముడిదె భూమికి యీ | హరి గొలువని వారసురలు సుండి ||
చ|| కమలా రమణుడె ఘనుడు | అమరులె మ్రొక్కుదు రాతనికి |
విమతుల దునిమె విష్ణుడు | తమి బూజించక తగు గతి లేదు ||
చ|| భావజ జనకుడు బ్రహ్మము | పోవగ గొలిచిరి శుకాదులు |
శ్రీ వేంకటపతి చెలువుడు | దైవ శిఖామణి దలచరొ బుధులు ||
పలుకు దేనెల తల్లి పవళించెను
కలికి తనముల విభుని గలసినది గాన
నిగనిగని మోముపై నెఱులు గెలకుల జెదర
పగలైన దాక జెలి పవళించెను
తెగని పరిణతులతో తెల్లవారినదాక
జగదేక పతి మనసు జట్టి గొనె గాన
కొంగు జారిన మెఱుగు గుబ్బ లొలయగ దరుణి
బంగారు మేడపై బవళించెను
చెంగలువ కనుగొనల సింగారములు దొలక
అంగజ గురునితోడ నలసినదిగాన
మురిపెంపు నటనతో ముత్యాల మలగుపై
పరవశంబున దరుణి పవళించెను
తిరు వేంకటాచలా ధిపుని కౌగిట గలసి
అరవిరై నును జెమలు నంటినదిగాన
పలుకుతేనియలను పారమియ్యవే
అలరువాసనల నీ అధరబింబాలకు
పుక్కిటి లేనగవు పొంగుఁబాలు చూపవే
చక్కని నీ వదనంపు చందమామకు
అక్కరొ నీవాలుగన్ను లారతిగా నెత్తవే
గక్కన నీచెక్కు తొలుకరి మెరుపులకు
కమ్మని నీమేని తావి కానుకగా నియ్యవే
వుమ్మగింత చల్లెడి నీవూరుపులకు
చిమ్ముల నీచెమటలఁ జేయవే మజ్జనము
దిమ్మరి నీమురిపెపు తీగమేనికి
పతివేంకటేశుగూడి పరవశమియ్యవే
యితవైన నీమంచి హృదయానకు
అతనినే తలచగ నానతియ్యగదవె
తతితోడ నీలోని తలపోతలకు
పలుమరు వుట్ల పండుగను
చిలుకు చిడుక్కని చిందగను
ఊళ్ళవీధుల వుట్లు కృష్ణుడు
తాళ్ళు దెగిపడ దన్నగను
పెళ్ళు కఠిల్లు పెఠిల్లని
పెళ్ళుగ మ్రోసె పెనురవము
బంగా(గ)రు బిందెల బాలు బెరుగులు
ముంగిట నెగయుచు మోదగను
కంగు కళింగు కఠింగు ఖణింగని
రంగు మీరు పెను రవములై
నిగ్గుగ వేంకట నిలయుడుట్టిపా
లగ్గలిక బగుల నడువగను
భగ్గు భగిల్లని పరమామృతములు
గుగ్గిలి పదనుగ గురియగను
పలువిచారములేల పరమాత్మనీవు నాకు
కలవు కలవు ఉన్న కడమలేమిటికి
నీపాదముల చెంత నిబిడమైతే చాలు
యేపాతకములైన ఏమిసేసును
యేపార నీభక్తి ఇంత గలిగిన చాలు
పై పై సిరులచ్చట పాదుకొని నిలుచు
సొరిదినీ శరణము జొచ్చితినంటే చాలు
కరుణించి యప్పుడట్టే కాతువు నీవు
సరుస నీముద్రలు భుజములనుంటే చాలు
అరుదుగా చేతనుండు అఖిలలోకములు
నేరకవేసిన చాలు నీమీద ఒక పువ్వు
కోరిన కోరికలెల్ల కొనసాగును
మేరతో శ్రీవేంకటేశ నిన్నుగొలిచితి నేను
యేరీతినుండిన గాని యిన్నిటా ఘనుడను
ప|| పసలేని యీబ్రదుకు | ఆసలు చొచ్చిచొచ్చి అలసినట్టాయె ||
చ|| తొల్లిటిజన్మాదుల గానినరరూపు | వల్లించుకొన్న యీబ్రదుకు |
కల్లసుఖములచే కనలి కమ్మర | ముల్లుదీసి కొర్రు మొత్తినట్టాయ ||
చ|| బూటకములనెల్ల బొరలి సంసారంపు- | పాటుదెచ్చిన యీబ్రదుకు |
నీటుగ నెద్దు దన్నీనని గుర్రము- | చాటుకేగిన యట్టిచందమాయె ||
చ|| పగగొన్న పొగకోపక మంట బడిపది | పగలు రేలైన బ్రదుకు |
తగువేంకటేశ్వరు దలచి నేలనుండి | యెగసి మేడమీద కేగినట్టాయె ||
ప|| పసిడి చీరవాడావు పాలు దచ్చితివి గాన | పసిడి బోలినది చేపట్టెను నీ కరము ||
చ|| తొలుతనే చందురుని తోడబుట్టు గనుక | పొలుపు జందురు మోము పోలికైనది |
కళల చింతామణి కందువ చెల్లెలు గాన | తళుకుమానికపు దంతముల బోలినది ||
చ|| మంచి యైరావతముతో మగువ సైదోడు గాన | ముంచిన కరిగమనము బోలినది |
పంచల బారిజాతపు భావపు సోదరి గాన | యెంచగ చిగురుబోలె నీకె పాదములు ||
చ|| తామెర తొట్టెలలోన తగిలి తానుండు గాన | తామెర కన్నులబోలి తనరినది |
యీమేర నిన్నిటాబోలి యిన్ని లక్షణములతో | నీమేన శ్రీవేంకటేశ నెలవై నిల్చినది ||
పసిడియక్షంతలివె పట్టరో వేగమె రారో
దెసల పేరంటాండ్లు దేవుని పెండ్లికిని
శ్రీవేంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి
దైవికపు పెండ్లిముహూర్తము నేడు
కావించి భేరులు మ్రోసె గరుడధ్వజంబెక్కె
దేవతలు రారో దేవుని పెండ్లికిని
కందర్ప జనకునకి కమలాదేవికి పెండ్లి
పందిలిలోపల తలంబాలు నేడు
గంధమూ విడెమిచ్చేరు కలువడాలు గట్టిరి
అందుక మునులు రారో హరి పెండ్లికిని
అదె శ్రీ వేంకటపతికి అలమేలు మంగకును
మొదలి తిరుణాళ్ళకు మ్రొక్కేము నేడు
యెదుట నేగేరు వీరెయిచ్చేరు వరములివె
కదలిరారో పరుష ఘనుల పెండ్లికిని
పసులు గాచేటి కోల పసువుజేల
పొసగ నీ కింత యేల బుద్దుల గోల ||
కట్టిన చిక్కపు బుత్తి కచ్చ కాయల తిత్తి
చుట్టిన పించపు బాగ చుంగుల సోగ
ఇట్టి సింగారము సేయ నింత నీకు బ్రియమాయ
వెట్టి నీ చేతల మాయ విట్టల రాయ ||
పేయల బిలుచు కూత పిల్ల గోవి బలుమోత
సేయ రాని గొల్లెతల సిగ్గుల చేత
ఆయెడల దలపోత యమున లోపలి యీత
వేయరాని మోపులాయ విట్టలరాయ ||
కొంకులేని పొలయాట కూరిములలో తేట
అంకెల బాలులతోడి యాట పాట
పొంకపు తత్తురు కొమ్ము పొలువైన నీసొమ్ము
వేంకట నగము చాయ విట్టలరాయ ||
పాటించి నమ్మిన వారి భాగ్యముగాదా
కోటిసుద్దులేల యిదె కోరి చేకొనేది.
స్వామిద్రోహియైనచండిరావణాసురుడు
కామించి శరణంటేను కాచే నంటివి
యేమని నీదయ యెంతు నెంతని నీమహిమెంతు
ఆమాటకు సరియౌ నఖిలవేదములు.
దావతి సీతాద్రోహము దలచి కాకాసురుడు
కావుమని శరణంటే గాచితివి
ఆవల నీపని యెట్టు అట్టె నీమన్నన యెట్టు
యీవల నీశరణనే ఇందుసరే తపము.
చిక్కు లిన్నీ నికనేల చేరి యేపాటివాడైన
గక్కన నీశరణంటే గాతువు నీవు
అక్కరతో నిన్ను శరణంటిమి శ్రీవేంకటేశ
యెక్కువ నీబిరుదుకు యీడా పుణ్యములు.
పాటెల్లా నొక్కచో నుండు; భాగ్య మొక్కచోనుండు
యీటు వెట్టి పెద్దతనా లెంచబనిలేదు ||
సరవి గలకాలము జదువుచుండు నొకడు
గరిమ నీ క్రుప నిన్ను గను నొకడు
ధర బ్రయాసముతోడ దపముసేయు నొకడు
శరణుచొచ్చి నీకు జనవరౌ నొకడు ||
వొక్కడు మోపుమోచు నొక్కడు గొలువు సేయు
వొక్కడు పొగడీ త్యాగ మూరకే యందు
వొక్క డాచారము సేయు నొక్కడూ మోక్షముగను
యెక్కడా నీకల్పన సేయవచ్చును ||
భావించ నటుగాన ఫలమెల్లా నీ మూలము
యేవలనైనా నీవు యిచ్చితేగద్దు
జీవులు నిన్నెఋఅగక చీకటి దవ్వగనేల
శ్రీవేంకటేశ్వర నిన్ను సేవించేదే నేరుపు
ప|| పాడరే సోబనాలు పడతులారా | వేడుక లిద్దరిని వెలసెజూడరే ||
చ|| కొండలే పీటలుగా కూచున్నారెదురుబడి | అండనే నారసింహుడు ఆదిలక్ష్మియు |
వెండిపైడి నిండుకొన్న వేదాద్రి గరుడాద్రుల | పెండిలాడే రిద్దరును ప్రియమున చూడరే ||
చ|| భవనాశిజలముల పాయక తోడనీళ్ళాడిరి | ఇవలా నవలా తాము ఏటిదరుల |
జవళి మంచిపూవుల సరిసేసలు వెట్టుచు | తవిలి సుముహూర్తాన తప్పక చూచేరు ||
చ|| పొందుగ కనకావతి భోగవతి నదుల | సందడి వసంతముగా జల్లులాడుచు |
అందమై శ్రీవేంకటాద్రి అహోబలాన ఒక | చందమున కూడి సరసములాడేరు ||
పాడేము నేము పరమాత్మ నిన్నును
వేడుక ముప్పదిరెండువేళల రాగాలను ||
తనువే వొళపు తలయే దండెకాయ
ఘనమైన వూర్పులు రెండుకట్టిన తాళ్ళు
మనసే నీ బుద్దితాడు మరి గుణలే జీవాళి
మొనసి పుట్టుగే మూలమైన కరడి ||
పాప మెఱగను పుణ్యఫల మెఱగను
యేపనులు నీకు నెల విన్నియును గావా
మునుప నీవిషయముల ముద్ర మానునులగా
నునిచితివి నామీద నొకటొకటినే
అనిశంబు నవి చెప్పినట్లు జేయకయున్న
ఘనుడ నీయాజ్ఞ నే గడచుటే కాదా
కలిమిగల యింద్రియపుగా పులుండినవూరు
యెలమి నా కొనగితివి యేలు మనుచు
అలసి వీరల నేను నాదరించక కినిసి
తొలగద్రోచిన నదియు ద్రోహమే కాదా
కుటిలముల బెడబాపి కోరినచనవులెల్ల
ఘటన జెల్లించితివి॥ ఘనుడ నేను॥
అటుగనక శ్రీవేంకటాద్రీశ నీదాసి
నెటుచేసినా నీకు నితవేకదా
ప|| పాపపుణ్యముల పక్వ మిదెరుగను | నా పాలిటి హరి నమో నమో ||
చ|| మానస వాచక కర్మంబుల | తానకముగ నీ దాసుడను |
పూని త్రిసంధ్యల భోగ భాగ్యముల | నానా గతులను నమో నమో ||
చ|| వలనుగ జాగ్రద్స్వప్న సుషుప్తుల | ఇలలో నీకే హితభటుడ |
వెలుపల లోపల వేళావేళల | నలినాక్ష నీకె నమో నమో ||
చ|| పుట్టుక తొలుతను పుట్టిన మీదట | అట్టె నీ శరణాగతుడ |
గట్టిగ శ్రీ వేంకటపై నీకృప | నట్ట నడుమైతి నమో నమో ||
ప|| పాపపుణ్యముల రూపము దేహమిది దీని | దీపసంబరగింప తెరవెందు లేదు ||
చ|| అతిశయంబైన దేహాభిమానము దీర | గతిగాని పుణ్యసంగతి బొందరాదు |
మతిలోని దేహాభిమానంబు విడుచుటకు | రతిపరాఙ్ముఖుడు గాక రవణంబు లేదు ||
చ|| సరిలేని మమకార జలధి దాటినగాని | అరుదైన నిజసౌఖ్యమిది వొందరాదు |
తిరువేంకటాధిపుని గొలిచినగాని | పరగు బ్రహ్మానంద పరుడుతాకాడు ||
పాపపుణ్యముల రూపము దేహమిది దీని
దీపనంబణగింప తెరువెందులేదు
అతిశయంబైన దేహాభిమానము దీర
గతిగాని పుణ్యసంగతి బొందరాదు
మతిలోని దేహాభిమానంబు బిడుచుటకు
రతిపరా~జ్ముఖుడు గాక రవణంబు లేదు
సరిలేని మమకారజలధి దాటినగాని
అరుదైన నిజసౌఖ్యమది వొందరాదు
తిరువేంకటాచలాధిపుని గొలిచినగాని
పరగు బ్రహ్మానంద పరుడుతాకాడు
ప|| పాపములే సంబళమెపుడూ యీ- | యాపదబడి నే నలవనా ||
చ|| ఎన్నిపురాణము లెటువలె విన్నా | మన్నమనువు దిమ్మరితనమే |
నన్ను నేనే కానగలేనట నా- | విన్నవినుకులకు వెఱచేనా ||
చ|| యెందరుపెద్దల నెట్ల గొలిచినా | నిందల నామతి నిలిచీనా |
కందువెఱిగి చీకటికి దొలగనట | అందపుబరమిక నందేనా ||
చ|| తిరువేంకటగిరి దేవుడే పరమని | దరిగని తెలివిక దాగీనా |
తిరముగ నిను జింతించినచింతే | నిరతము ముక్తికి నిధిగాదా ||
ప|| పాపమెరంగని బ్రాహ్మడు యెందు | జూపరానిచోటు చూపీనయ్యా ||
చ|| తనివోక జీవముతలకాయ నంజుడు | పనివడి తిని తిన్నబ్రాహ్మడు |
యెనసి యెదిరి దన్నునెరగక విభుడై | ఘనవంశము మంట గలపీనయ్యా ||
చ|| ఎవ్వారు నెరగనియెముకల యింటిలో | పవ్వళించుచున్న బ్రాహ్మడు |
జవ్వనమదమున జడిసేటికోమలి | బువ్వులతోటలో బొదిగీనయ్యా ||
చ|| చెలగి కన్నెరికము చెడనిపడచు దెచ్చి | పలువేదనల బెట్టేబ్రాహ్మడు |
తెలసి వేంకటాధిపుని దాసుడై | పులుగు పంజరాన బొదిగీనయ్యా ||
ప|| పాపినైన నాపాల గలిగితోవ | చూపుమన్న నెందు జూపరు ||
చ|| ధృతిదూలి జగమెల్ల దిరిగి వేసరితి | యితరాలయముల కేగియేగి వేసరితి |
గతిమాలి పరులపై గనలి వేసరితి | మతిమాలి కులవిద్య మాని వేసరితి ||
చ|| విసిగి యాచారంబు విడిచి వేసరితి | పసచెడి ప్రియములు పలికి వేసరితి |
కొసరి ద్రవ్యముపై గోరి వేసరితి | మతిమాలి కులవిద్య మాని వేసరితి ||
చ|| కోవిదులగువారి గొలిచి వేసరితి | దైవములందరి దడవి వేసరితి |
శ్రీవేంకటేశునిసేవ మాని వట్టి- | సేవలన్నియు నేజేసి వేసరితి ||
ప|| పాయక మతినుండి పరగ మేలుగీడును | సేయించి కర్మి దాజేయుటెవ్వరిది ||
చ|| వెలయ జరాచరవిభుడైన విభునాత్మ | దలచుగాక ప్రాణి దానేమి సేయు |
తెలిసి నిర్మలభక్తి దీవించి తనుజేర | గొలిపించుకొనలేమి కొరత యెవ్వరిది ||
చ|| కొందరు సుఖులై కొదలేక మెలగగ | కొందరిదుఃఖపుకొరత యెవ్వరిది |
అందరిమతి వేంకటాద్రివల్లభ నీవు | చెంది కర్మముల జేయుచేత యెవ్వరిది ||
ప|| పాయని కర్మంబులె కడుబలవంతము లనినప్పుడె | కాయమునకు జీవునకును గర్తృత్వము లేదు ||
చ|| ఆతుమ సకలవ్యాపకమని తలపోసినపిమ్మట | జాతియు గులాభిమానము జర్చింపనెరాదు |
భూతవికారములన్నియు బురుషోత్తము డనినప్పుడు | పాతకములపుణ్యంబులపని తనకే లేదు ||
చ|| పదిలంబుగ సర్వాత్మభావము దలచినపిమ్మట | ముదమున నెవ్వరి జూచిన మొక్కకపోరాదు |
కదిసినయిప్పటిసుఖమువలె కడుదుఃఖములని తెలిసిన | చెదరక సంసారమునకు జేసాపనెరాదు ||
చ|| పరిపూర్ణుడు తిరువేంకటపతియనగా వినినప్పుడు | యెరవులహీనాధికములు యెగ్గులు మరి లేవు |
పరమాత్ముండగునీతనిభక్తులం దలచినయప్పుడు | తిరముగ నీతనికంటెను దేవుడు మరి లేడు ||
ప|| పాయపుమదములబంధమా మము | జీయని యిక గృపసేయగదో ||
చ|| ధనధాన్యములై తనులంపటమై | పనిగొంటివి నను బంధమా |
దినదినంబు నునుతీదీపుల బెను- | గనివైతివి యిక గావగదో ||
చ|| సతులై సుతులై చలమై కులమై | పతివైతివి వోబంధమా |
రతి బెరరేపుల రంతులయేపుల | గతిమాలితివిక గావగదో ||
చ|| పంటై పాడై బలుసంపదలై | బంటుగ నేలితి బంధమా |
కంటిమిదివో వేంకటగిరిపై మా- | వెంటరాక తెగి విడువగదో ||
ప|| పారకుమీ వోమనసా పంతము విడువకుమీ మనసా |
పారిన నీవే బడగయ్యెదవు చేరువ నాడే చెప్పనె మనసా ||
చ|| చింతించకుమీ శివునివైరిచే చిక్కువడకుమీ వోమనసా |
కంతువారకము వయసు బ్రాయములు కావటి కుండలు వోమనసా |
యెంతోమేలూ గీడే కాలము ఎప్పుడు నుండదు వోమనసా |
సంతరించుకో వానిని మనసున సంతోషముగా వోమనసా ||
చ|| ఎన్నికలే తలపోయకుమీ యేమరకుండుమీ వోమనసా |
కన్న విన్న వారిలో నెప్పుడూ కాకుపడకుమీ వోమనసా |
పున్నమమాసలు పుడమిలో బదుకులు పోయివచ్చేవి వోమనసా |
మిన్నో నేలనిమన్నదినములో మీదుచూడకుమి వోమనసా ||
చ|| కన్నులసంగాతము సేయకుమీ కళవళించకుమి వోమనసా |
వన్నెలమాటలు చెవులబెట్టక వాసివిడువకుమి వోమనసా |
మున్నిటసురలు బ్రహ్మాదులకైనను ముక్తిసాధనము వోమనసా |
వెన్నుని వేంకటగిరిపతి దలచుము వేసారకుమీ వోమనసా ||
ప|| పారితెంచి యెత్తివేసి పారవెళ్ళితివి | నీరసపు టెద్దవైననీకు నేముద్దా ||
చ|| ఎద్దవై నన్నేల తొక్కి యేమిగట్టుకొంటివి | వొద్దనైన వచ్చి వూరకుండవైతివి |
వొద్దిక భూమెత్తిన యాయెద్దుకు నే ముద్దుగాక | నిద్దురచిత్తముతోడి నీకు నేముద్దా ||
చ|| కాపురపు బాపపునాకర్మమును ధరించి | వీపువగులగదాకి విర్రవీగితి |
ఆపగ నెద్దేమెరుగు నడుకులచవి మూట- | మోపరివి నీకు నాముదము ముద్దా ||
చ|| మచ్చరించి అల్లనాడు మాలవాడు కాలదన్ని | తెచ్చినయప్పటి ధర్మదేవతవు |
యెచ్చరించి తిరువేంకటేశు దాసుడని నన్ను | మెచ్చి తాకితివి నామేను నీకుముద్దా ||
ప|| పాలదొంగవద్ద వచ్చి పాడేరు తమ- | పాలిటిదైవమని బ్రహ్మాదులు ||
చ|| రోల గట్టించుక పెద్దరోలలుగా వాపోవు | బాలునిముందర వచ్చి పాడేరు |
ఆలకించి వినుమని యంబరభాగమునందు | నాలుగుదిక్కులనుండి నారదాదులు ||
చ|| నోరునిండా జొల్లుగార నూగి ధూళిమేనితో | పారేటిబిడ్డనివద్ద బాడేరు |
వేరులేనివేదములు వెంటవెంట జదువుచు | జేరిచేరి యింతనంత శేషాదులు ||
చ||ముద్దులు మోమునగార మూలలమూలలదాగె|
బద్దులబాలుని వద్ద బాడేరు |
అద్దివో శ్రీతిరువేంకటాద్రీశుడితడని |
చద్దికి వేడికి వచ్చి సనకాదులు ||
ప|| పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత | పెడమరలి నవ్వీనె పెండ్లి కూతురు ||
చ|| పేరుకల జవరాలె పెండ్లి కూతురు పెద్ద | పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు |
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు | పేరుకుచ్చ సిగ్గువడీ బెండ్లి కూతురు ||
చ|| బిరుదు పెండము వెట్టె బెండ్లి కూతురు నెర | బిరుదు మగని కంటె బెండ్లి కూతురు |
పిరిదూరి నప్పుడే పెండ్లి కూతురూ పతి | బెరరేచీ నిదివో పెండ్లి కూతురు ||
చ|| పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడె | పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు |
గట్టిగ వేంకటపతి కౌగిటను | పెట్టిన నిధానమయిన పెండ్లి కూతురు ||
ప|| పిలువా గదరే ప్రియునిని | చలువా లాతడు చల్లీ గానీ ||
చ|| తలపా రాదింతి తమకము రేగి | చెలపా చెమటాయ చెక్కులను |
పొలపా వెన్నెల పోగులకు మతి | గొలుపా దీకె కెక్కుడు విరహమునా ||
చ|| కెరలి మును మరిగిన పొందూ, లోలో | మరలీ కాకలై మనసుననూ |
పొరలీ బూబానుపున నీపెకు, వాడు | దొరలీ దియ్యరె తొలు విరులెల్లా ||
చ|| అలసె మోహపు టాసల, కడు | బలిసె జన్నులు పైపైనే |
కలసె శ్రీ వేంకట పతి మారు | మలసే విదివో మరు బలములకూ ||
పిల్ల(గ్రోవి పట్టమంటూ( బెరరేచీనీ మా
గొల్లవారి పిల్ల(గ్రోవి కోరో చల్లా
పాడుమంటూ దండెమీటె( బలుమారునుం దా
వేడుక నెవ్వెతెపాట వినవచ్చెనో
వాడలో( జల్లలమ్మే వనిత నింతే శ్రుతి
గూడినే( బాడేటిచల్ల కోరో చల్లా
చేరి నన్ను నాడుమంటా( జెక్కు నొక్కీని తా
గారవాన నెవ్వతాట గనివచ్చెనో
మారుకు మారాడేటి మందవారము మేము
కోరికి నాడేటిచల్ల కోరో చల్లా
కిన్నెర మీటుమంటా( గెలసీని తన్ను(
గిన్నెర మీట్ల నేది గిలిగించెనో
కన్నుల కలికి వేంకటపతిపై వెట్టి
గొన్న కిన్నెరగుబ్బల కోరో చల్లా.
ప|| పుండు జీవులకెల్ల బుట్టక మానదు | పుండుమాన మందువోయగదయ్య ||
చ|| నెత్తురునెమ్ములు నిండినపుంటికి | తిత్తిలో సోదించనేరా |
నిత్తెమూ వేనీళ్ళ గడిగినాను | మత్తిలి వుబ్బు మానదేలయ్యా ||
చ|| చల్లగూడు వెట్టి చల్లగా పొత్తు- | లెల్ల బెట్టి బిగియించగాను |
కల్లగాదు చీము గారు తొమ్మిదిగండ్ల | పిల్లలా జాల బెట్టెగదయ్యా ||
చ|| ఆదినుండి పాకమైనది యెవ్వ- | రేదిరో మొకమేరుపడదు |
ఆదరించి వేంకటాధిప నీవింక | సోదించి మానజూడగదయ్యా ||
పుట్టించేవాడవు నీవే పోరులు వెట్టేవు నీవే
యెట్టు నేరుచుకొంటి విది నీవినోదమా
కొందరు దేవతలును కొందరు రాక్షసులును
ఇందరి కంతర్యామి వెప్పుడు నీవు
అంది కోప మొకరిపై అట్టె ప్రసాద మొకరి __
కిందులోనే పక్షపాత మిది నీకే తగును
నరకమనుచు గొంత నగి స్వర్గమని కొంత
నిరతి గురిసేసేవు నీకుక్షిలోనే
ధర జీక టొకవంక తగ వెన్నె లొకవంక
నెరపేవు నీమాయ నీకే తెలుసును
దానిపరిపాలనము తగు దుష్టశిక్షణము
వాసిగైకొంటివి నీకు వశమై రెండు
దోసము నీవల్ల లేదు తొలుతే శ్రీవేంకటేశ
సేసినవారిపుణ్యమే చిత్తాన బెట్టితివి
పుట్టినట్టె వున్న వాడ పోలేదు రాలేదు
ఇట్టె నీదాసుడనైతి యెంగిలెల్ల బాపె
వెలినున్న జగమెల్ల విష్ణుడ నీమహిమే
అలరి నాలోన నీవే అంతరాత్మవు
తెలిసి నేనున్న చోటే దివ్యవైకుంఠము
వెలలేనినరకములవెరపెల్ల దీరె
తనువుతోనుండేది నీతల చినతలపేనా
మనుపుసంసారము నీమాయచేతిదే
పనులనాకర్మము నీపంచినట్టి పనుపే
మనసులోపలియనుమానమెల్ల బాసె
తెరమరుగుదినాలు వుడ నీకల్పితమే
సొరిది యీసురలెల్ల చుట్టాలే నాకు
నిరతి శ్రీ వేంకటేశ నీ మరగు చొచ్చి నేడు
గురునియానతిచేత గొంకులెల్లా బాసె
ప|| పుట్టుగులమ్మీ భువి గొనరో | జట్టికిని హింసలే మీధనము ||
చ|| ఆపద లంగడి నమ్మీ గొనరో | పాపాత్ములు పై పయి బడగా |
కైపుల బుణ్యులగని కోపించే- | చూపులు మీకివి సులభపుధనము ||
చ|| కడుగంభీర పాతకంబులు గొనరో | బడిబడి నమ్మీ బాలిండ్ల |
తొడరు బరస్త్రీ ద్రోహపుధనములె | తడవుటె మీకివి దాచినధనము ||
చ|| లంపుల చండాలత్వము గొనరో | గంపలనమ్మీ గలియుగము |
రంపపువేంకటరమణునికథ విన- | నింపగు వారికి నిదేధనము ||
ప|| పుట్టుభోగులము నేము భువి హరిదాసులము | నట్టనడిమి దొరలు నాకీయవలెనా ||
చ|| పల్లకీలు నందనాలు పడివాగె తేజీలు |
వెల్లివిరి మహాలక్ష్మీ విలాసములు |
తల్లియాకె మగనినే దైవమని కొలిచేము |
వొల్లగే మాకే సిరులు వొరులీయవలెనా ||
చ||గ్రామములురత్నములు గజముఖ్య వస్తువులు |
ఆమని భూకాంతకు నంగభేదాలు ||
భామిని యాకె మగని ప్రాణధారి లెంకలము |
వోమి మాకాతడే యిచ్చీ వొరులీయవలెనా ||
చ||పసగల పదవులు బ్రహ్మ నిర్మితములు |
వెస బ్రహ్మ తండ్రి శ్రీ వేంకటేశుడు |
యెసగి యాతడే మమ్మునేలి యిన్నియు నిచ్చె |
వొసగిన మాసొమ్ములు వొరులీయవలెనా ||
ప|| పుట్టుభోగులము మేము భువి హరిదాసులము | నట్టనడిమి దొరలు నాకియ్యవలెనా ||
చ|| పల్లకీలు నందనాలు పడివాగె తేజీలు | వెల్లవిరి మహాలక్ష్మీ విలాసములు |
తల్లియాకె మగనినే దైవమని కొలిచేము | వొల్లగే మాకే సిరులు వొరులియ్యవలెనా ||
చ|| గ్రామములు వస్త్రములు గజముఖ్య వస్తువులు | ఆమని భూకాంతకు నంగభేదాలు ||
భామిని యాకె మగని ప్రాణధారి లెంకలము | వోలి మాకాతడే యిచ్చీ వొరులియ్యవలెనా ||
చ|| పసగల పదవులు బ్రహ్మ నిర్మితములు | వెస బ్రహ్మతండ్రి శ్రీ వేంకటేశుడు |
యెసగి యాతడే మమ్మునేలి యిన్నియు నిచ్చె | వొసగిన మాసొమ్ములు వొరులియ్యవలెనా ||
ప|| పుట్టుమాలినబరుబోకివి నన్ను | దిట్టే నదేమోసి దిమ్మరిమాయ ||
చ|| ఒరపులాడక పోవె వోసి మాయ నాతో | దొరలేవు నిను ముట్ట దోసము |
వెరపించే వేమోసి విష్ణుభక్తినంటూ- | నెరగనటే నీయేతు లిన్నియును ||
చ|| పుదుట చెల్లదు పోపో వోసి మాయ నా- | యెదుర నాటలు నీకు నికనేలే |
వదరేవు హరిభక్తివనిత, తెలియరు, నే- | నిదురపుచ్చినవారు నీవు నా కెదురా ||
చ|| వొల్లనటే జీవ మోసిమాయ నీ- | కల్లలిన్నియును లోక మెరుగును, |
నల్లనివిభునిమన్నన భక్తినంటూ | జెల్లబో పాపపుచేదు మేయకువే ||
చ|| వూరకుండవుగా వోసిమాయ నిన్ను | బేర బిలువము గుంపెనలాడేవు, |
నారాయణభక్తినాతి, నన్నును నిన్ను | గోరి యిందరు నెరుగుదు రేల పోవే ||
చ|| వోవవు ననుజూచి వోసి మాయ నా- | తోవ వచ్చినను నొత్తువు నీవు |
శ్రీ వేంకటగిరి దేవునిభక్తి నా- | హావళికే నిన్ను నలమి రిందరును ||
ప|| పుడమి నిందరి బట్టెభూతము కడు- | బొడవైన నల్లనిభూతము ||
చ|| కినిసి వోడమింగెడి భూతము | పునుకవీపు పెద్దభూతము |
కనలి కవియు చీకటిభూతము | పొనుగు సోమపుమోము భూతము ||
చ|| చేటకాళ్ళ మించినభూతము | పోటుదారల పెద్దభూతము |
గాటపుజడల బింకపుభూతము | జూటరినల్లముసుగు భూతము ||
చ|| కెలసి బిత్తలేతిరిగేటి భూతము | పొలుపుదాంట్ల పెద్దభూతము |
బలుపు వేంకటగిరిపై భూతము | పులుగుమీది మహాభూతము ||
ప|| పురుషుండని శ్రుతి వొగడీనట ఆపురుషుడు నిరాకారమట |
విరసవాక్యము లొండింటికి విని వింటే నసంబద్ధములు ||
చ|| మొగమున బ్రాహ్మలు మొలచిరట ఆమూరితి అవయవరహితుడట |
తగుబాహువులును రాజులట ఆతత్త్వమే యెంచగ శూన్యమట |
పగటున తొడలను వైశ్యులట ఆబ్రహ్మము దేహము బయలట |
ఆగపడి పాదాల శూద్రులట ఆతని రూపము లేదట ||
చ|| తనవందనమును గలదట దైవము తనుజూడ గన్నులు లేవట |
తనవిన్నపమును జేయునట ఆతనికిని వీనులు లేవట |
తనయిచ్చినదే నైవేద్యంబులట దైవము నోరే లేదట |
తనయిచ్చేటి ధూపంబును గలదట దైవము ముక్కును లేదట ||
చ|| అంతా దానే దైవమటా: యజ్ఞము లొరులకు జేయుటట |
సంతతమును దాస్వతంత్రుడటా జపముల వరముల చేకొంటట |
చింతింప దానే యోగియటా చేరువ మోక్షము లేదట |
పంతపు శ్రీవేంకటపతి మాయలు పచారించినవివియట ||
పురుషోత్తముడ నీవు పురుషాధముడ నేను
ధరలో నాయందు మంచితన మేది
అనంతాపరాధములు అటు నేము సేసేవి
అనంతమయినదయ అది నీది
నిను నెఱగకుండేటినీచుగుణము నాది
నను నెడయకుండేగుణము నీది
సకలయాచకమే సరుస నాకు బని
సకలరక్షకత్వము సరి నీపని
ప్రకటించి నిన్ను దూరేపలుకే నా కెప్పుడూను
వెకలివై ననుగాచేవిధము నీది
నేర మింతయును నాది నేరు పింతయును నీది
సారెకు నజ్ఞాని నేను జ్ఞానిని నీవు
యీరీతి శ్రీ వేంటేశ యిట్టే నన్ను నేలితివి
ధారుణిలో నిండెను ప్రతాపము నీది
పురుషోత్తముడ నీవే పుణ్యము గట్టుక నన్ను
రదిచేర్చి రక్షించి దయజూడగదవే
ధరలో యాచకునకు ధర్మాదర్మము లేదు
సిరుల గాముకునికి సిగ్గు లేదు
పరమపాతకునకు భయ మించు కాలేదు
విరసపునాకై తే వివేకమే లేదు
మించినకృతఘ్నునికి మే లెన్నడును లేదు
చంచలచిత్తునకు నిశ్చయమే లేదు
అంచల నాస్తికునకు నాచారమే లేదు
కొంచనిమూర్ఖుడ నాకు గుణమే లేదు
మదించినసంసారికి మరి తనివే లేదు
పొదిగొన మూర్ఖునకు బుద్దేలేదు
అదన శ్రీ వేంకటేశ అలమేల్మంగదాసుడ
నిదివో చనవరి నాకెదురే లేదు
ప|| పురుషోత్తామ నీవే బుద్ధిచ్చి గాచుటగాక |శిరసెత్తుకొని నవ్వసిగ్గు కాదా నాకు ||
చ|| పొసగ పంచేంద్రియములు పుట్టిన దేహమే మోచి | యెసగి జితేంద్రియుడను ఎట్లైతి నేను |
పసగొని కోరికల వలలోన జిక్కుకొని | ఇసుమంతలో ముక్తుడ నెట్లైతి నేను ||
చ|| తొల్లిటి కర్మము చేత దొడ్డ యైన పుట్టు పుట్టి | యెల్ల వారిలో జ్ఞాని నెట్టయ్యె నేను |
మల్లడి సంసారము మరుగు వాడనై యుండి | యిల్లదిగో విరక్తుండ నెట్టయ్య నేను ||
చ|| పాపపుణ్యపు లోకుల పంక్తిలోననే వుండి | యేపున నీ భక్తి వాడ నెట్టయ్యె నేను |
రాపుల శ్రీ వేంకటేశ రక్షించి కీర్తి బొందు | ఈ పాటివాడ ధీరుండ నెట్టయ్యె నేను ||
పులుగు చెప్పెడి నదె పొంచి మాగురుడు నీకు
తలచుకో నేడు నీవు దాచినర్థము
యిలమీద తమసొమ్ము లెవ్వరివద్ద నుండినా
తలపిడి కొలుపిడి తగిలినట్టు
తొలుత పంచేంద్రియపుదొంగలవద్ద నున్నాడ
వెలా నీసొమ్మనుచు విడిపించుకొనవే
చేరి తమవూరివారి చెఱపటుకొని పోతే
కోరి కుయివోయి తెచుకొన్నట్టు
వూరక నీకుక్షిలోనవున్న నన్ను నీమాయ
వీరాన బెఱవట్టెను విడిపించుకొనవే
బడిదప్పి తిరిగేటిపడుచుల తమవారు
తడయక తెచ్చుక ఆదరించినట్టు
వెడబుద్ది దిరిగేను వెఱ్రిని శ్రీవేంకటేశ
విడువక అజ్ఞానినన్ను విడిపించుకొనవే
పూచిన యీదేహము పువ్వుగాని పిందెగాని
చేచేత నెవ్వరికి జెప్పనోప బ్రియము
పుట్టించినదైవము పూరి మేపునా మమ్ము
బట్టిన పూర్వకర్మము పాసిపొయ్యీనా
మెట్టినసంసారము మెదిగినపాటే చాలు
తొట్టి కన్నవారినెల్ల దూరనోప మిందుకు
నొసల వ్రాసిన వ్రాలు నునిగితే మానినా
కొసరి జగము నాకే కొత్తలయ్యీనా
వుసురుతోడిసుఖము వుందినపాటే చాలు
కొసరి జన్మము లింకా గోరనోప నేను
యేలినవాడు శ్రీ హరి యేమిసేసినా మేలె
వేళతో నాతడే శ్రీవేంకటేశుడు
పాలించె నాతడు మమ్ము పదివేలులాగులను
యీలాగులనే సుఖించేము నేము
ప|| పృథుల హేమ కౌపీన ధరః | ప్రథిత వటుర్మేబలం పాతు ||
చ|| సూపా సప్తః శుచిస్సులభః | కోప విదూరః కులాధికః |
పాప భంజనః పరాత్ప రోయం | గోపా లోమే గుణం పాతు ||
చ|| తరుణః ఛత్రీ దండ కమండలు | ధరః పవిత్రీ దయాపరః |
సురాణాం సంస్తుతి మనోహరః | స్థిరస్సుధీర్మే ధృతిం పాతు ||
చ|| త్రివిక్రమః శ్రీ తిరువేంకటగిరి | నివాసోయం నిరంతరం |
ప్రవిమల మసృణ కబళ ప్రియోమే | దివా నిశాయాం ధియం పాతు ||
ప|| పెంచబెంచ మీద బెరిగేటిచెలిమి | ఇంచుకించుక తాలిముల కెడలేనిచెలిమి ||
చ|| అంటుముట్టులేక మనసులంటుకొన్న చెలిమి | కంటగంట నవ్వించే ఘనమైన చెలిమి |
వెంటవెంట దిరిగాడు వెర్రిగొన్న చెలిమి | యింటివారి చిత్తములకు నెడరైన చెలిమి ||
చ|| చెక్కుచెమటపెక్కు వలెనే చిక్కనైన చెలిమి | యెక్కడౌటా తమ్ముదమ్ము నెరగనీని చెలిమి |
చక్కదనమే చిక్క మేనుచిక్కినట్టి చెలిమి | లెక్కలేనియాసలెల్లా లేతలయిన చెలిమి ||
చ|| అంకురించినట్టితలపు లధికమయిన చెలిమి | అంకెలయిన యాసలెల్లా లావుకొన్న చెలిమి |
వేంకటాద్రివిభుని గూడి వేడుకయిన చెలిమి | పంకజాననలకెల్ల బాయరాని చెలిమి ||
పెంచి తమపెట్టుజెట్టు పెరికివేయ రెవ్వరు
మంచివాడ గాకున్న మన్నించకుండేవా
తెరువు దప్పి యడవి దిరిగేటివారి దెచ్చి
తెర్వున బెట్టుదురు తెలిసినవారలు
నరుడనై నేరక నడిచేటినన్ను నీవు
మరిగించి కావక మానవచ్చునా.
దిక్కుమాలినట్టివారి దెచ్చి దయగలనారు
దిక్కయి కాతురు వారి దిగదోయరు
తక్కక మాయలోబడి దరిదాపులేనినన్ను
వెక్కసాన రxఇంచక విడిచేవా నీవు.
ఆవల బయపడ్డవా రంగడిబడితే దొర_
లోవల విచారించి వూరడింతు రంతలోనే
శ్రీవేంకటేశ నీవు సృష్టికల్లా నేలికవు
వేవేలు మామొర నీవు విచారించకుండేవా.
ప|| పెక్కులంపటాల మనసుపేదవైతివి నీకు | నెక్కడా నెవ్వరు లేరు యేమిసేతువయ్యా ||
చ|| కన్నుమూయ బొద్దులేదు, కాలుచాచ నిమ్ములేదు | మన్నుదవ్వి కిందనైన మనికిలేదు |
మున్నటివలెనే గోరుమోపనైన జోటులేదు | యిన్నిటా నిట్లానైతి వేమిసేతువయ్యా ||
చ|| అడుగిడుగ నవ్వల లేదు, అండనైన నుండలేదు | పుడమి గూడు గుడువనైన బొద్దులేదు |
వెడగుదనము విడువలేదు, వేదమైన జదువలేదు | యెడపదడప నిట్ల నీకు నేమిసేతువయ్యా ||
చ|| వుప్పరములు మానియైన నుండలేదు లోకమందు | నిప్పుడైన నీవిహార మిట్ల నాయను |
చెప్పనరుదు నీగుణాలు శ్రీవేంకటేశ యిట్ల- | నెప్పుడును ఘనుడవరయ నేమిసేతువయ్యా ||
ప|| పెట్టిననీ వెఱుగుదు పెనుదిక్కు | జట్టిగా శ్రీహరి నీకు శరణు చొచ్చితిమి ||
చ|| కర్మమూలమైనట్టికాయము మోచి నేను | కర్మము విడువబోతే కడుసంగతా |
మర్మమెఱిగిననీవే మాయల గట్టుండగాను | పేర్మి నే విడువబోతే బిగియదా కట్టు ||
చ|| బంధమూలమైనట్టిప్రపంచమందు నుండి | బంధము బాసేనంటే బాసునా అది |
అంధకారమైనట్టి అజ్ఞానాన దోసితివి | అంధకారమున వెలు గరసితే గలదా ||
చ|| నిచ్చలు నీసంసారపునీరధిలోన మునిగి | చొచ్చి వెళ్ళి చేరేనంటే జోటు గలదా |
యిచ్చట శ్రీవేంకటేశ యిహమందే పరమిచ్చి | అచ్చు మోపి యేలగా నే నన్నియు దెలిసితి ||
పెట్టిననీ వెఱుగుదు పెనుదిక్కు
జట్టిగా శ్రీహరి నీకు శరణు చొచ్చితిమి
కర్మమూలమైనట్టికాయము మోచి నేను
కర్మము విడువబోతే కడుసంగతా
మర్మమెఱిగిననీవే మాయల గట్టుండగాను
పేర్మి నే విడువబోతే బిగియదా కట్టు
బమ్ధములమైనట్టిప్రపంచమందు నుండి
బంధము బాసేనంటే బాసునా అది
అంధకారమైనట్టిఅజ్ఞానాన దోసితివి
అంధకారమున వెలు గరసితే గలదా
నిచ్చలు నీ సంసారపునీరధిలోన మునిగి
చొచ్చి వెళ్ళి చేరేనంటే జోటు గలదా
యిచ్చట శ్రీవేంకటేశ యిహమందే పరమిచ్చి
అచ్చు మోపి యేలగా నే నన్నియు దెలిసితి
ప|| పెద్దలు మీరంతేసి పెనగనేల | వుద్దండవు నీ చేతలు వుట్టిబెట్టవయ్యా ||
చ|| మోవిపండు గానుకిచ్చె మొక్కె నీకు జేతులను | సేవలింకా నేమి యాపె సేసునయ్యా |
కావిరించి దగ్గరితే కాలుదాకు జేయిదాకు | దేవరవంటి నీ కంతేసి తగదయ్యా ||
చ|| గోరంట పూవంది ఇచ్చె కొలువున నిలుచుండె | పేరి యిచ్చకము లేమి పెంచునయ్యా |
వేరె మాటలాడబోతే వెంగమౌనో వెగటౌనో | ఆరీతి దొరవు నీకవి చెల్లవయ్యా ||
చ|| ఆరతిచ్చె నానాంగాల నన్నిటికి సమ్మతించె | కూరిమి నిన్నెట్లాను కొసరునయ్యా |
యీరీతి శ్రీ వేంకటేశ యింపు లేదో సొంపులేదో | ఆరితేరినట్టి నీకు ఆస మానదయ్యా ||
పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు
పరగి నానా విద్యల బలవంతుడు ||
రక్కసుల పాలిటి రణరంగ శూరుడు
వెక్కసపు ఏకాంగ వీరుడు
దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు
అక్కజమైనట్టి ఆకారుడు ||
లలిమీరిన యట్టి లావుల భీముడు
బలు కపికుల సార్వభౌముడు
నెలకొన్న లంకా నిర్థూమధాముడు
తలపున శ్రీరాము నాత్మారాముడు ||
దేవకార్యముల దిక్కువరేణ్యుడు
భావింపగల తపః ఫల పుణ్యుడు
శ్రీవేంకటేశ్వర సేవాగ్రగణ్యుడు
సావధానుడు సర్వశరణ్యుడు ||
ప|| పెరుగపెరుగ బెద్దలుగాగ పెనువెఱ్ఱి వట్టు బుద్దెఱిగితే |
మరులు మఱచితేనే యిన్నిటిగెలిచేమర్మముసుండీ జ్ఞానులకు ||
చ|| జననమందినయప్పుడు దేహి సన్యాసికంటే నిరాభారి |
తనర గౌపీనకటిసూత్రములతగులములేనిదిగంబరి |
తను దా నెఱుగడు యెదిరి యెదిరి నెఱగడు తత్త్వధ్యానాలయ నిర్మలచిత్తుడు |
పెనగేకోరిక యించుకంత లేదు పేరులేనివాడు వీడువో యమ్మా ||
చ|| నిద్దురవొయ్యేటియప్పుడు దేహి నిత్యవిరక్తునివంటిఘనుడు |
బుద్ధి సంసారముపై నించుకా లేదు భోగమేమీ నొల్లడు |
వొద్దనే యేపనులకు జేయబోడు వున్నలంపటాల కేమియు జొరడు |
కొద్దిలేనియాస యెందువోయనొకో కోప మేమిలేదు వీడివో యమ్మా ||
చ|| హరి శరణన్నయప్పుడు దేహి అమరులకంటే కడునధికుడు |
పరమునిహము నఱచేతిదే ప్రయాస మించుక లేదు |
దురితము లేదు దుఃఖములు లేవు తోడనే వైకుంఠ మెదురుగా వచ్చు |
గరిమ శ్రీవేంకటేశుడు వీడివో కానరైరిగా యిన్నాళ్ళమ్మా ||
ప|| పేరంటాండ్లు పాడరే పెండ్లివేళ | సారెసారె నిద్దరికి సంతోషవేళ ||
చ|| చిత్తజు తల్లికి వేగ సింగారించరె మీరు | తత్తరించేరిది ముహూర్తపువేళ |
హత్తి తలబాలు నారాయణుని బోయమనరే | పొత్తుల నిద్దరికిని బువ్వపువేళ ||
చ|| పాలవెల్లి కూతురుకు పసపుల నలచరే | చాలించరేజోలి వీడుచదివే వేళ |
పాలుపడీ పరపులు పరచరే దేవునికి | నాలుగోదినము నేడూ నాగవల్లి వేళ ||
చ|| అంది బాగాలియ్యరే అలుమేలుమంగకును | కందువ శ్రీ వేంకటేశుగలసే వేళ |
గందము గస్తూరి నీరె ఘనరతినలరసరి- | కుండకీ యిద్దరు నికగొలువుండేవేళ ||
పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము
నెడయకవయ్య కోనేటి రాయడా
కోరిమమ్ము నేలినట్టి కులదైవమా, చాల
నేరిచి పెద్దలిచ్చిన నిధానమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా, మాకు
చేరువజిత్తములోని శ్రీనివాసుడా
భావింప గైవసమైన పారిజాతమా, మమ్ము
చేవదేర గాచినట్టి చింతామణీ
కావించి కోరికలిచ్చే కామధేనువా, మమ్ము
తావై రక్షించేటి ధరణీధరా
చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగా
లడచి రక్షించే దివ్యౌషధమా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా, మమ్ము
గడియించినట్టి శ్రీ వేంకటనాథుడా
ప|| పొడవైన శేషగిరి బోయనాయడు | విడువ కిందరి గాచు వెడబోయనాయడు ||
చ|| పొలసి మీసాల పెద్దబోయనాయడు | మలిగి వీపునగట్టేమంకుబోయనాయడు |
పొలమురాజై తిరిగేబోయనాయడు | వెలయ మోటుననుండేవేటబోయనాయడు ||
చ|| పొట్టిపొట్టియడుగులబోయనాయడు యెందు | బుట్టుపగసాధించేబోయనాయడు |
బొట్టులమెకమునే సేబోయనాయడు | పట్టపునెమలిచంగుబలుబోయనాయడు ||
చ|| పొంచి శిగ్గెగ్గెఱగనిబోయనాయడు | మించి రాలమీదదాటేమెండుబోయనాయడు |
అంచెల శ్రీవేంకటేశుడనేబోయనాయడు | పంచ గాలవేలములబలుబోయనాయడు ||
ప|| పొత్తుల మగడవు పొరుగున నుండగ | తత్తరమింతేసి తమకేలనయ్యా ||
చ|| యేపున నీమోము యిటు నేజూచిన | చూపు లాపెమై చురకనెను |
ఆపొద్దు నీతో నాడిన మాటల | తీపులు దనకటు తిన జేదాయ ||
చ|| నడుమ నే నీతో నవ్విన వెన్నెల | కడనాపెకు జీకటులాయ |
చిడుముడు నే నిను జెనకిన సరసము | వెడ వెడ దనకవి విరసములాయ ||
చ|| వెస నా మోవులవిందు నీకిడిన | వసిగొని నాపెకు బగలాయ |
యెసగిన శ్రీ వేంకటేశు మమ్మిద్దరి | గొసరికూడితివి గురి దనకాయ ||
పొదలె నిండు కళల పున్నమి నేడు
అదను దప్పక జాజ రాడుదువు రావయ్యా
జలజాక్షి మోమునను చంద్రోదయమాయ
నెలకొన్న నవ్వుల వెన్నెల గాసెను
కలికి కన్నుల నల్ల కలువలు వికసించె
అలరి యీకెతో జాజ రాడుదువు రావయ్యా
యెనసి జవ్వనమున నేతెంచె వసంతకాల
మొనరి మోవి చిగురు లుప్పతిల్లెను
గొనకొన్న తురుమున కూడె తుమ్మిదమూక
అనుమానించక జాజ రాడుదువు రావయ్యా
కుంకుమ చెమట చను కొప్పెరల నిండుకొనె
కొంకక గోళ్ళే బుఱ్ఱటకొమ్ము లాయెను
లంకెలై శ్రీవేంకటేశ లలనతో కూడితివి
అంకెల నేపొద్దూ జాజ రాడుదువు రావయ్యా
పొద్దికనెన్నడు వొడచునొ పోయిన చెలిరాడాయను
నిద్దుర గంటికి దోపదు నిమిషంబొక యేడు
కన్నుల నవ్వెడి నవ్వులు గబ్బితనంబుల మాటలు
నున్నవి యొయ్యారంబులు నొచ్చిన చూపులును
విన్నదనంబుల మఱపులు వేడుక మీరిన యలపులు
సన్నపు జెమటలు దలచిన ఝల్లనె నా మనసు
ఆగిన రెప్పల నీరును నగ్గలమగు పన్నీటను
దోగియు దోగని భావము దోచిన పయ్యెదయు
కాగిన దేహపు సెకలును కప్పిన పువ్వుల సొరబులు
వేగిన చెలి తాపమునకు వెన్నెల మండెడిని
దేవశిఖామణి తిరుమల దేవుని దలచిన బాయక
భావించిన యీ కామిని భావము లోపలను
ఆ విభుడే తానుండిక నాతడె తానెఱగగవలె
నీ వెలదికి గల విరహంబేమని చెప్పుదము
ప|| పొరి నీకును విరిగి పోయిన దానవులు | బిరుదులుడిగి వోడ బేహారులైరి ||
చ|| మకుటాలుతీసి జటామకుటాలు గట్టుకొని | వెకలిరిపులు ముని వేషులైరి |
మొకములను సోమపు మొకములు పెట్టుకొని | అకటా కొందరు రిపులాట వారైరి ||
చ|| పేరులు విడిచి సంకుబేరులు మెడవేసుక | సారెకు కొందరు శివ సత్తులైరి |
బీరపు సాములు మాని పెద్దగడ సామునేర్చి | తోరపు బగతులెల్ల దొమ్మరులైరి ||
చ|| నాదించ వెరచి సింగి నాదాలూదు కొంటాను | సోదించేరటాగొందరు జోగులైరి |
ఈదెస శ్రీ వేంకటేశ యున్నియు మానికొందరు | దాదాతని శరణనీ దాసులైరి ||
పొలతి జవ్వనామున (బూవక పూచె
యెలమి నిందుకు మనమేమి సేసేదే
సతిచింతాలతలో సంపెంగపూవులు పూచె
మతివిరహపు మేన మల్లెలు పూచె
అతనునితలపోతను అడావిజాజులు పూచె
హితవు తెలియదింకను ఏమిసేసేదే
తొయ్యలిచెమటనీట దొంతితామెరలు పూచె
కొయ్యచూపు కోపముల కుంకుమ పూచె
కయ్యపు వలపుల (జీకటి మాకులు పూచె
నియ్యేడ చెలియభావ మేమి చేసేదె
మగువరతుల లోన మంకెన పువ్వులు పూచె
మొగికొనగోళ్ళానే మొగలి పూచె
పొగరు శ్రీవేంకటేశు పొందుల కప్రము పూచె
ఇగురు(బోండ్ల మింక నేమి సేసేదే
ప|| పోయ గాలం బడవికి గాయు వెన్నెలకరణిని | శ్రీయుతు దలచుడీ నరులు మాయబడి చెడక ||
చ|| చిత్తము చేకూర్చుకొని చిత్తైకాగ్రతను | చిత్తజుగురుని దలచుడీ చిత్తజు జొరనీక ||
చ|| బూరుగుమాకున జెందినకీరము చందమున | ఆరయ నిష్ఫలమగు మరి యన్యుల జేరినను ||
చ|| కూరిమి మాతిరువేంకటగిరిగురు శ్రీపాదములు | చేరినవారికి భవములు చెంద వెపుడు నటుగాన ||
ప|| పోయం గాలము వృథయై పుట్టినమొదలుం గటకట | నీయెడ నామది నిజమై నిలుచుట యెన్నడొకో ||
చ|| కుడిచిన నాకలి దీరదు కుడువగగుడువగ బైపై | కడుబొదలెడుదీపన మిది గడచుట యికనెట్లు |
కుడువకమానుట యెన్నడు కోరికదీరుట యెన్నడు | తడయక నీరూపము నే దలచుట లెన్నడొకో ||
చ|| జీవుడుపుట్టిన మొదలును జేతికి నూఱట చాలక | యేవిధమున భుజియించిన నెడయదు దీపనము |
శ్రీవేంకటపతి నాకిక శ్రీకరుణామృత మియ్యక | పావనమందదు నామది పాలించందగదా ||
పోయగాలం బడవికిగాయు వెన్నెల కరణిని
శ్రీయుతు దలచుడీ నరులు మాయబడి చెడక ||
చిత్తము చేకూరుచుకొని చిత్తెకాగ్రతను
చిత్తజగురుని దలచిడీ చిత్తజు జోరనీక ||
బూరుగు మాకున జెందిన కీరము చందమున
అరయ నిశ్ఫలమగు మరియన్యుల జేరినను ||
కూరిమి మా తిరువేంకటగిరి గురు శ్రీపాదములు
చేరినవారికి భవములు చెందవెపుడు నటుగాన ||
ప|| పోయబోయ గాలమెల్ల పూట పూటకు | రోయని రోతలు చూచి రుచి చూరబోయ ||
చ|| తాడిమానెక్కేటివాని తడయక పట్టి పట్టి | తోడ దోడ నెందాకా దోయవచ్చును |
కాడువడ్డ చిత్తమిది కలకాలము నిట్టే | ఆడి కెలకులోనై తనియకపొయ ||
చ|| మన్నుదిని యేటిదూడ మానుమంటూ మొత్తి మొత్తి | కన్నిగట్టి యెందాక గాయవచ్చును |
సన్నపుటాసలమీద చరిబడ్డ దేహమిది | కన్నపుగత్తుల చూపు కట్టరాకపోయ ||
చ|| హేయము దొక్కకుమన్న యేచితి నేననేవాడు | చాయకు రాకున్న నేమి సేయవచ్చును |
మాయల వేంకటపతి మచ్చుచల్ల నాయాత్మ | పాయక యీతని జేరి భయమెల్లబోయ ||
పోయబోయ గాలమెల్ల పూట పూటకు |
చేయి నోరు నోడాయ చెల్లబో యీరోతలు ||
తిప్పన తొప్పన కేతు దేవన బావన గన్ను
పప్పన బొప్పనగారి బాడిపాడి
కుప్పలుదెప్పలు నైనకోరికెలు మతిలోన
యెప్పుడు బాయకపోయి నెన్ని లేవు రోతలు ||
కాచన పోచన మాచు కల్లప బొల్లప మల్లు
బాచన దేచనగారి బాడిపాడి
యేచినపరసుఖము నిహమును లేకపోయి
చీచీ విరిగితిమి చెప్పనేల రోతలు ||
బుక్కన తిక్కన చెల్లు బూమన కామన పేరి
బక్కల నిందరి నోర బాడిపాడి
యెక్కువైనతిరివేంకటేశుని దలచలేక
కుక్కకాటు జెప్పుటాటై కూడెనిన్ని రోతలు ||
ప|| పోరాక పోయి తలపుననున్నదైవంబు | జేరనొల్లక పరుల జేరదిరిగెదము ||
చ|| వడిబారుపెనుమృగము వలలలోపల దగులు- | వడి వెడల గతిలేక వడకుచున్నట్లు |
చెడనికర్మములులలో జిక్కి భవములబాధ | బడియెదముగాక యేపనికి దిరిగెదము ||
చ|| నీరులోపలిమీను నిగిడి యామిషముకై | కోరి గాలము మ్రింగి కూలబడినట్లు |
జారిపోయిననేల సంసారసౌఖ్యవి- | కారంపుమోహముల గట్టువడియెదము ||
చ|| శ్రీవేంకటేశు నాశ్రితలోకరక్షకుని | భావింప దేవతాపతియైనవాని |
సేవించుభావంబు చిత్తమెడబడక నే- | మీవలావలిపనుల నిట్ల దిరిగెదము ||
ప|| పోరొ పోరొ యమ్మలార బొమ్మలాటవారము | యీరసాన మమ్ము నిట్టే యేమిసేసేరు ||
చ|| ఊరులేనిపొలమేర వొడలుమోచుకొని నేము | తేరదేహ మెక్కుకొని తిరిగేము |
వారువీరనుచు వట్టివావులు సేసుక లేని- | పేరుపెట్టుకొని లోలో బిరువీకులయ్యేము ||
చ|| బుద్ధిలేనిబుద్ధితోడ పొందుసేసుకొని వట్టి- | యెద్దుబండికంటిసంది నీగేము |
నిద్దురలో తెలివంటూ నీడలోని యెండంటా | వుద్దువుద్దులై లేనివొద్దిక నున్నారము ||
చ|| మాటులేనిమాటు దెచ్చి మరుగవెట్టుక వట్టి- | మేటానమేట్లవలె మెరసేము |
గాటమైనతిరువేంకటగిరినిలయుని- | నాటకమే నిజమని నమ్మిక నున్నారము ||
ప్రతిలేని పూజదల పంగకోటి మణుగులై
అతివ పరవశము బ్రహ్మానందమాయె
మానినీమణిమనసు మంచియాసనమాయె
ఆనందబాష్పజల మర్ఘ్యాదులాయె
మీనాక్షి కనుదోయి మించుదీపములాయె
ఆనన సుధారసంబభిషేకమాయె
మగువచిరునవ్వులే మంచి క్రొవ్విరులాయె
తగుమేనితావి చందనమలదుటాయె
నిగనిగనీతనుకాంతి నీరాజనంబాయె
జగడంపుటలుకలుపచారంబులాయె
ననుపైన పొందులె నైవేద్య తతులాయె
తనివోని వేడుకలు తాంబూలమాయె
వనిత శ్రీ వేంకటేశ్వరుని కౌగిట జేయు
వినయ వివరంబు లరవిరిమ్రొక్కులాయె
ప|| ప్రపన్నులకు నిది పరమాచారము | విపరీతాచారము విడువగవలయు ||
చ|| భగవదపచారము భాగవతాపచారము | దగులక దేవతాంతరము మాని |
నగధరు శరణము నమ్మి యాచార్యుని | బగివాయనిదే పరమవైష్ణవము ||
చ|| దురహంకారము దుఃఖము సుఖమును | బొరయక ప్రాకృతుల పొంత బోవక |
దరిశనాభిమానాన ధర్మము వదలక | పరిశుద్ధి నుండుటే పరమవైష్ణవము ||
చ|| ఉపాయాంతరము లొల్లక భక్తిచేపట్టి | యెపుడూ దీర్థప్రసాదేచ్ఛతోడ |
నిపుణత శ్రీవేంకటనిలయుడే గతియని | ప్రపత్తి గలుగుటే పరమవైష్ణవము ||
ప|| ప్రలపనవచనైః ఫలమిహకిం | చల చల కుడ్య క్షాళనయాకిం ||
చ|| ఇతర వధూమోహితం త్వాంప్రతి | హితవచనై రిహ ఫలమివోకిం |
సతతం తవానుసరణ మిదం మమ | గతజల సేతుకరణ మిదానీం ||
చ|| వికల వినయ దుర్విటం త్వా ప్రతి | సుకుమారాద్రస్తుత్యాకిం |
ప్రకట బహల కోపనం మమతే | సకలం చర్విత చర్వత చర్వణమేవ ||
చ|| శిరసానత సుస్థిరం త్వాంప్రతి | విరసాలాపన విధి నాకిలం |
తిరువేంకటగిరి దేవత్వదీయ | విరహ విలసనం వృధా చరణం ||
ప్రాణనాయకుడు వాడె ప్రాణేశ్వరివి నీవు
జాణవు నీవిన్నిటాను చలమేటికే ||
వీడనాడివచ్చుగాని వెనకవేడుకోరాదు
కూడేరు మీకెపోదు కోపమింతేలే
నీడలు వేరైతోచు నిలువొక్కటేకాదా ||
అలుగగవవచ్చుగాని అట్టె కిందుపడరాదు
కలపేరు మీకెపోదు కపటమేలే
పలుకులెన్ననా దోచు బాసవొక్కటెకాదా
పులకలి వేడవంటా పొర్లనేటికే ||
తప్పులెంచవచ్చుగాని తారుకాణించరాదు,
యెప్పుడు మీకెపోదు యెరవేటికే
అప్పుడిదే శ్రీ వేంకటాధిపుడు నిన్నుగూడె
కుప్పశించి నవ్వెనంటా గోర జించనేతికే ||
ప|| ప్రాణులనేరమి గాదిది బహుజన్మపరంపరచే | ప్రాణులుసేసిన తమతమ పాపఫల్ముగాని ||
చ|| హరి సకలవ్యాపకుడని అందరు జెప్పగ నెరిగియు | పరదైవంబుల గొలువకపాయరు మానవులు |
నరపతి భూమేలగ భూవరు భజియింపగనొల్లక | పరిసరవర్తులబెంబడి బనిసేసినయట్లు ||
చ|| పొందుగ తమతమ సేసినపూజలు మ్రొక్కులు గైకొన | అందముగా బురుషోత్తము డాతడే కలడనియు |
అందరు నెరిగియు యితరుల జెందుదు రున్నతశైలము- | నందక చేరునతరువుల నందుకొనినయట్లు ||
చ|| శ్రీ వేంకటపతి యొక్కడె చెప్పగ జగములకెల్లను | దైవము నాతములోపలి ధనమనగా వినియు |
సేవింపరు పామరులీదేవుని మధురంబొల్లక | వావిరి బులుసులు చేదులువలె ననికొనునట్లు ||
ఫ
ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీనారసింహా
ప్రళయమారుత ఘోర భస్త్రీకాపూత్కార లలిత నిశ్వాసడోలా రచనయా
కులశైలకుంభినీ కుముదహిత రవిగగన- చలన విధినిపుణ నిశ్చల నారసింహా
వివరఘనవదన దుర్విధహసన నిష్ఠ్యూత- లవదివ్య పరుష లాలాఘటనయా
వివిధ జంతు వ్రాతభువన మగ్నౌకరణ నవనవప్రియ గుణార్ణవ నారసింహా
దారుణోజ్జ్వల ధగద్ధగిత దంష్ట్రానల వికార స్ఫులింగ సంగక్రీడయా
వైరిదానవ ఘోరవంశ భస్మీకరణ- కారణ ప్రకట వేంకట నారసింహా
బ
పల్లవి:
బండి విరిచి పిన పాపలతోనాడి
దుండగీడు వచ్చె దోబూచి
చరణం:1
పెరుగు వెన్నలు ప్రియమున వే
మరు ముచ్చిలించు మాయకాడు
వెరవున తన విధము దాచుకొని
దొరదొంగ వచ్చె దోబూచి
చరణం2
పడుచు గుబ్బెత పరపుపై పోక
ముడి కొంగు నిద్ర ముంపునను
పడియుత వద్ద పవళించినట్టి
తొడుకుదొంగ వచ్చె దోబూచి
చరణం3:
గొల్ల పల్లెలొఇల్లిల్లు చొచ్చి
కొల్లలాడిన కొడెకాదు
యెల్లయిన వేంకటేశుడు ఇదె
తొల్లిటి దొంగ వచ్చె దోబూచి
బడలెను పానుపు పరచరే
అడుగరే యిదియేమని చెలులు
చెలప చెమటలు మై( జిప్పిలీని
అలసి వచ్చినాడు నేడదే విభుడు
చలువగా( గప్రము పై చల్లగదరే
వెలయ సురటిగొని విసరరే
పొనుగు నిట్టూరుపుల బుసకొట్టీని
పనిసేసి వచ్చినా డప్పటి విభుడు
తనివార చల్లనిగంధము మెత్తరే
నినుపుగ పన్నీరు నించరే
దాగక దప్పి మోవులు దడిపీని
కాగి వచ్చినాడు శ్రీవేంకటవిభుడు
పాగి వాసించినబాగాలియ్యరే
చేగదేర నన్నునేలె సేవలెల్లా జేయరే
ప : బడి బడి తిరిగాడీ బాలకృష్ణుడు
ఎడయని జాణగదే ఈ బాలకృష్ణుడు
చ : చొక్కుచు సోలుచువచ్చి సుదతులు ఎత్తుకుంటే
పక్కన నవ్వులు నవ్వీ బాలకృష్ణుడు
ఇక్కువకూ చేయిచాచి ఏడనైన తొంగిచూచి
ఎక్కుడు గామిడికద ఈ బాలకృష్ణుడు
చ : చన్నులంటి సారె సారె చవిగా ముద్దులువెట్టి
పన్నీకదే మోహమెల్ల బాలకృష్ణుడు
సన్నలనే మొక్కు మొక్కి సమ్మతిపై ఎదదీసి
ఎన్నేసి నేర్చినాడే బాలకృష్ణుడు
చ : నిండుకాగిట నించి నేరుపులు పచరించీ
పండు మాటలాడీకదే బాలకృష్ణుడు
అండనే శ్రీవేంకటాద్రి న్యాయమెరిగి తాకూడే
ఎండనీడ కన్నులతో బాలకృష్ణుడు
ప|| బయలు పందిలి వెట్టి పరగ జిత్తము గలిగె | దయమాలి తిరుగ నాత్మ డొక్కడు గలిగె ||
చ|| కనుచూపు వలన నుడుగని కోరికలు గలిగె | తనుకాంక్ష వలన బరితాపంబు గలిగె |
అనుభవమువలన మోహాంధకారము గలిగె | తనివిదీరమి వలన తలపోత గలిగె ||
చ|| అడియాసవలన పాయనిచలంబును గలిగె | కడుమమత వలన చీకటి దవ్వ గలిగె |
కడలేని తమకమున గాతాళమును గలిగె | నడుమ నంతటికి మాననిప్రేమ గలిగె ||
చ|| తరితీపువలన చిత్తభ్రాంతి తగ గలిగె | విరహంబువలన పురవేదనలు గలిగె |
తిరువేంకటాచలాధిపుని కరుణామృతము | పరిపూర్ణమైన యాపద నీద గలిగె ||
ప|| బలుపుడు హరి జేపట్టితిని | తలచినదెల్లా దక్కెను నాకు ||
చ|| దురిత ధ్వంసుడు దుఃఖవిదారుడు | అరిభయంకరు డచ్యుతుడు |
సిరివరు డితనిని జేకొని కొలిచిన | పరమసుఖమెపో భయ మెక్కడిది ||
చ|| దానవాంతకుడు దైవశిఖామణి | మానరక్షకుడు మాధవుడు |
నానాముఖముల నాపాల గలడు | యేనెపముల నా కెదురే లేడు ||
చ|| అనయము నిర్మలు డఖిలానందుడు | ఘను డీశ్రీవేంకటవిభుడు |
కనుకొని మము నిటు గాచుక తిరిగీ | యెనయగ నేలికె యితడేమాకు ||
ప|| బలువగు దనరూపము చూపెన్ | కలదింతయు దనఘన తెరిగించెన్ ||
చ|| పాండవ రక్షణపరుడై నరునకు | నండనే తెలిపె మహామహిమ |
దండి విడిచి తనదయతో నర్జును- | డుండగ మగటిమి నొడబడ బలికె ||
చ|| మగుడగ కులధర్మములు బుణ్యములు | తెగి పార్థున కుపదేశించెన్ |
నగుచు నతనితో నానాగతులను | నిగమమునియమమునిజ మెరిగించెన్ ||
చ|| వెరవుమిగుల నావిజయునిమనుమని | పరీక్షిత్తు దగ బ్రదికించెన్ |
తిరువేంకటగిరిదేవుడు దానై | గరిమల భారతకథ గలిగించెన్ ||
ప|| బలువగుకర్మము లివివో జీవులప్రారబ్ధంబులు సంచితంబులును |
బలిసి తీరవివి పెరుగనేకాని బ్రహ్మలబహు కల్పంబులదాక ||
చ|| పాయనిజన్మంబులకర్మంబులు పాయక జీవులప్రారబ్ధములై |
యేయెడజూచిన నెదిటికొలుచులై యిచ్చట నిటు భుజియించగను ||
కాయపుబెడతటిగండడు విధి, దనుగడదేర్చిన తనకడకర్మములు |
పోయి సంచితంబుల గలసిన, నవి పొదలుచు గొండలపొడవై పెరుగు ||
చ|| పొదలి సంచితంబులు వడిబెరుగును పొలియును జీవునిపుణ్యము జాలక |
యెదిగినపుణ్యం బిగురును కాగినయినుముమీది జలమువలెను |
పదిలములై కడుబాపకర్మములే బరువై పరగగ బ్రాణికి నెన్నడు |
తుదయు మెదలు నెందును లేక, వడి దొలగక భవములతొడవై తిరుగు ||
చ|| తలుపులో నవయదలచినజంతువు, కలుషహరుడు వేంకటగిరిపతి దను- |
దలచుభాగ్యమాత్మకు నొసగిన, జిత్తము పరిపక్వంబై యెపుడు |
జలజోదరుదలచగ బ్రారబ్ధంబులు సంచితంబులు బొలిసి పుణ్యులై |
చెలువగునిత్యానందపదంబున జెలగి సుఖించగ జేరుదు రపుడు బలు ||
ప|| బాపు దైవమా మాపాలిభవమా | తీపు రాకాసినెత్తురు దీం దోందోం దోందోం దోందోం ||
చ|| కాలనేమిపునుకిది కంచువలె లెస్స వాగీ | తాళ మొత్తరే తత్త తత తత్తత్త |
కాలమెల్ల మాభూతగణమెల్ల వీడె కాచె | నేలబడి నేడును ధీం ధీం ధీం ధీం ధీం ధీం ధీం ||
చ|| పగగొని మానక పచ్చినెత్తు రెప్పుడును | తెగి కొను దానె తిత్తి తిత్తి తిత్తితి |
తగుమహోదరువీవు ధణధణమని వాగీ | బిగియించరో తోలు బింభిం బింభిం బింభింభిం ||
చ|| మురదనుజునిపెద్దమొదలియెముక దీసి | తురులూదరే తుత్తు తుత్తు తుత్తుత్తు |
తిరువేంకటగిరిదేవుడు గెలిచిన స- | మరమునను మమ్మ మమ్మ మమ్మ మమ్మమ్మ ||
ప|| బాలులతో వీథుల్లో బారాడువాడు | కోలలెత్తుక వుట్లు గొట్టీజుండీ ||
చ|| నారికడపువక్కలు నానినసనగలు | చారపప్పు దేనెలు చక్కరెలును |
పేరిననేతులు నానబియ్యాలు నుట్లనవే | చేరి యశోదబిడ్డకు జెప్పేరుసుండీ ||
చ|| చక్కిలాలు నడుకులు సనిగెపప్పులును | చెక్కినమెత్తని తూటచెఱకులును |
పెక్కువగా నుట్లలో బిందెల నించినవవే | చక్కనెశోదబిడ్డకు జాటేరుసుండీ ||
చ|| నువ్వులు జిటిబెల్లాలు నున్నని చిమ్మిలులు | నువ్వుటిడియును జిన్నినురుగులును |
యెవ్వారు వేంకటపతి కెఱుగించ నారగించి | కివ్వకివ్వ నవ్వ నణకించీజుండీ ||
ప|| బృవంతి బౌద్ధా బుద్ధ ఇతి | స్తువంతి భక్తా సులభ ఇతి ||
చ|| గదంతికిల సాంఖ్యాస్త్వాం పురుషం | పద వాక్యజా పదమితి చ |
విదంతి త్వా వేదాంతిన- | స్సదా బ్రహ్మ లసత్పదమితి చ ||
చ|| జపంతి మీమాంసకా స్త్వాంచ | విపుల కర్మణో విభవ ఇతి |
లపంతి నయన సకలా- | స్సతతం కృపాళు కర్తా కేవలమితి చ ||
చ|| భణంతి వెంకటపతే మునయో | హ్యాణిమాదిప్రద మతులమితి |
గుణవంతం నిర్గుణం పునరితి | గృణంతి సర్వే కేవలమితి చ ||
ప|| బోధకు లెవ్వరు లేక భోగినైతిని | శ్రీధరుడే మాకు దిక్కు చింతింప నికను ||
చ|| పట్టి దిగంబరినై పాలే యాహారముచేసి | తొట్టినపంచేంద్రియములతోవ విడిచి |
పుట్టితి సన్యాసినై బుద్ధెఱిగీనెఱగక | అట్టె నడుమ సంసారినైతి నేనూ ||
చ|| గచ్చుల నన్నీ మఱచి గాలే ఆవటించుకొని | అచ్చపుబరమయేకాంతసమాధి |
నిచ్చలు నిద్రాభ్యాసనిర్మలయోగినైతి | కచ్చుపెట్టి మేలుకొని ఘనకర్మనైతి ||
చ|| భావము పారవిడిచి బ్రహ్మాండమెల్ల నిండి | వేవేలుగోరికల వేడుకతోడ |
జీవన్ముక్తుడనైతి శ్రీవేంకటేశ్వరు జేరి | ధావతు లిన్నియు మాని తన్మయుడనైతి ||
బోధింపరే యెరిగినబుధులాల పెద్దలాల
శ్రీధరునిమాయలలో జిక్కితిమి నేము.
దైవమును నొల్లము ధర్మమును నొల్లము
దావతిసంసారముతో తగులేకాని
భావపుభవవంధాలభయమూ నెరగము
వేవేలు విధులే కాని వెగిలేచి నేము.
ముందు విచారించము మొదల విచారించము
పొందేటిసతులతోడిభోగమే కాని
చెందినమనసులోని చింతలను బాయము
మందపుమదమే కాని మాపుదాకా నేము.
పరమూ దడవము భక్తి దడవము
అరిది ధనముమీది ఆసలేకాని
ఇరవై శ్రీవేంకటేశు డేలుకొనె దానే నన్ను
నిరతి నెరగనైతి నేనించుకంతాను.
ప|| బ్రహ్మకడిగిన పాదము |
బ్రహ్మము దానె నీ పాదము ||
చ|| చెలగి వసుధ గొలిచిన నీ పాదము |
బలితల మోపిన పాదము |
తలకక గగనము తన్నిన పాదము |
బలరిపు గాచిన పాదము ||
చ|| కామిని పాపము కడిగిన పాదము |
పాముతల నిడిన పాదము |
ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము |
పామిడి తురగపు పాదము ||
చ|| పరమ యోగులకు పరి పరి విధముల |
వర మొసగెడి నీ పాదము |
తిరు వేంకటగిరి తిరమని చూపిన |
పరమ పదము నీ పాదము ||
భ
భక్త సులభుడును పరతంత్రుడు హరి
యుక్తిసాధ్య మిదె యొకరికీ గాడు
నినుపగులోకముల నిండిన విష్ణుడు
మనుజుడ నాలో మనికియయ్యె
మునుకొని వేదముల ముడిగినమంత్రము
కొననాలికలలో గుదురై నిలిచె
యెలమి దేవతలనేలినదేవుడు
నలుగడ నదముని నను నేలె
బలుపగు లక్ష్మీపతియగుశ్రీహరి
యిల మాయింటను యిదివో నిలిచె
పొడవుకు బొడవగు పురుషోత్తముడిదె
బుడిబుడి మాచేత బూజగొనె
విడువ కిదివో శ్రీ వేంకటేశ్వరుడు
బడివాయడు మాపాలిట నిలిచి
భక్తికొలది వాడే పరమాత్ముడు
భుక్తిముక్తి తానెయిచ్చు భువి పరమాత్ముడు
పట్టినవారిచే బిడ్డ పరమాత్ముడు
బట్టబయటి ధనము పరమాత్ముడు
పట్టపగటి వెలుగు పరమాత్ముడు
యెట్టనెదుటనే వున్నాడిదె పరమాత్ముడు
పచ్చిపాలలోనివెన్న పరమాత్ముడు
బచ్చనవాసినరూపు పరమాత్ముడు
బచ్చుచేతివొరగల్లు పరమాత్ముడు
యిచ్చుకొలదివాడువో యీ పరమాత్ముడు
పలుకులలోనితేట పరమాత్ముడు
ఫలియించునిందరికి పరమాత్ముడు
బలిమిశ్రీ వేంకటాద్రి పరమాత్ముడు
యెలమి జీవులప్రాణమీ పరమాత్ముడు
భక్తినీపై దొకటె పరమసుఖము
యుక్తిజూచిన నిజం బొక్కటేలేదు
కులమెంత గలిగెనది కూడించు గర్వంబు
చలమెంత గలిగెనది జగడమే రేచు
తలపెంత పెంచినా తగిలించు కోరికలు
యెలమి విజ్ఞానంబు యేమిటాలేదు
ధనమెంత గలిగెనది దట్టమౌలోభంబు
మొనయు చక్కదనంబు మోహములు రేచు
ఘనవిద్య గలిగినను కప్పు పై పై మదము
యెనయగ పరమ పద మించుకయులేదు
తరుణులెందరు అయిన తాపములు సమకూడు
సిరులెన్ని గలిగినను చింతలేపెరుగు
యిరవయిన శ్రీవేంకటేశు నినుకొలువగా
పెరిగె నానందంబు బెళకులికలేవు
ప|| భళి భళి రామ పంతపు రామ నీ- | బలిమి కెదురు లేరు భయహర రామ ||
చ|| విలువిద్య రామా వీర విక్రమ రామా | తలకొన్న తాటకాంతక రామా రామా |
కొలయై బరుని తలగుండు గండ రామా | చలమరి సమరపు జయ రామా రామా ||
చ|| రవికుల రామా రావణాంతక రామా | రవిసుత ముఖ కపిరాజ రామా రామా |
సవరగా కొండలచే జలనిధి గట్టిన రామా | జవ సత్త్వ సంపన్న జానకి రామ ||
చ|| కౌసల్య రామ కరుణానిధి రామ | భూసుర వరద సంభూత రామ |
వేసాల పొరలే శ్రీవేంకటాద్రి రామ | దాసుల మమ్ము గావ తలకొన్న రామ ||
ప|| భామ శృంగారించు భావమే యందము | కాముని రతిసాటి కాంతులీలాగు ||
చ|| పూవొకటి వికసించె పున్నమి చంద్రుని వలెనే | పూవుమీద మరిరెండు పూలుబూసె |
రెండు పూవుల నడుమ పూసెనొకపువ్వు | పూవు కింద ముప్పదిరెండు మొగ్గలెత్తె ||
చ|| పక్షి యొక్కటి వాలె భద్రేభమనగాను | పక్షిమీదను రెండు పక్షులాయెను |
రెండు పక్షుల నడుమనే వ్రాలె నొక పక్షి | పక్షితో జోడుగా పలికే నొకపక్షి ||
చ|| చిగురునే రెంటి చెందామరో యనగ | చిగురు మీదను రెండు చిగురులెత్తె |
చిగురుబోణి యింట శ్రీ వేంకటేశుడు | చిగురు లోపలి తేనె చెలగి చవిచూచె ||
ప|| భామనోచిన నోము ఫలము సఫలముగాను | కామతాపంబునకు కాండవమునోమె ||
చ|| కొమ్మ చలిమందులకు గొంతిదామెర నోమె | కమ్మదావులకు మును గౌరి నోమె |
నెమ్మతిని కన్నీట నిండు గొలకులు నోమె | ముమ్మడించిన వగల ముచ్చింత నోమె ||
చ|| చెదరు గందంబునకు చిట్టిబొట్టు నోమె | కదియు పులకులకు మొలకుల నోము నోమె |
ముదిత మాటాడకిదె మోనదాగెలు నోమె | పొదలు చెమటలకు నినువుల నోము నోమె ||
చ|| నెలత మొగమునకు వెన్నెల మించులటు నోమె | వెలయుగాంతికి వీధివెలుగు దా నోమె |
ఎలమితోదిరు వేంకటేశుగూడి | లలితాంగి నిచ్చకల్యాణంబు నోమె ||
ప|| భారమైన వేపమాను పాలువోసి పెంచినాను | తీరని చేదేకాక దియ్యనుండీనా ||
చ|| పాయదీసి కుక్కతోక బద్దలు వెట్టి బిగిసి | చాయ కెంతగట్టినాను చక్కనుండీనా |
కాయపు వికారమిది కలకాలము జెప్పినా | పోయిన పోకలే కాక బుద్ధి వినీనా ||
చ|| ముంచిముంచి నీటిలోన మూల నానబెట్టుకొన్నా | మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యి నా |
పంచమహాపాతకాల బారి బడ్డచిత్తమిది | దంచి దంచి చెప్పినాను తాకి వంగీనా ||
చ|| కూరిమితో దేలుదెచ్చి కోకలోన బెట్టుకొన్నా | సారె సారె గుట్టుగాక చక్కనుండీనా |
వేరులేని మహిమల వేంకటవిభుని కృప | ఘోరమైన ఆస మేలుకోర సోకీనా ||
ప|| భావమున బరబ్రహ్మమిదె | కైవసమై మాకడ చూడన్ ||
చ|| నీలమేఘ ముపనిషార్థం బదె | పాలుదొంగిలెడి బాలులలో |
చాలు నదియ మాజన్మరోగముల- | చీల దివియు మము జెలగించన్ ||
చ|| తనియని వేదాంత రహస్యం బదె | వొనర గోపికలవుట్లపై |
పనుపడి సకలాపజ్జాలంబుల- | పనులు దీర్చ మము బాలించన్ ||
చ|| భయములేని పెనుబరమపదం బదె| జయమగు వేంకట శైలముపై |
పయిపడు దురితపు బౌజుల నుక్కున | లయముసేయు మము లాలింపన్ ||
భావములోనా బాహ్యమునందును
గోవింద గోవిందయని కొలువవో మనసా
హరి యవతారములే యఖిల దేవతలు
హరి లోనివే బ్రహ్మాండంబులు
హరి నామములే అన్ని మంత్రములు
హరి హరి హరి హరి యనవో మనసా
విష్ణుని మహిమలే విహిత కర్మములు
విష్ణుని పొగడెడి వేదంబులు
విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు
విష్ణువు విష్ణువని వెదకవో మనసా
అచ్యుతుడితడే ఆదియు నంత్యము
అచ్యుతుడే యసురాంతకుడు
అచ్యుతుడు శ్రీవేంకటాద్రి మీదనిదె
అచ్యుత యచ్యుత శరణనవో మనసా
భావమెరిగిన నల్లబల్లి చెన్నుడా
నావద్దనే వుండుమీ నల్లబల్లి చెన్నుడా
వేసరక నీవు నాతో వేమారు జేసినట్టి
బాసలు నమ్మితి నల్లబల్లి చెన్నుడా
వాసికి వన్నెకు నీకు వలచి చొక్కితి నేను
నా సూటికే మన్నించు నల్లబల్లి చెన్నుడా
క్రియ గూడ నేను నీ కేలువట్టి పెండ్లాడితి
బయలీదించకు నల్లబల్లి చెన్నుడా
ప్రియములు రెట్టింప బెనగితి నిందాకా
నయములు చూపుమీ నల్లబల్లి చెన్నుడా
యెనసితి విటు నన్ను నియ్యకోలు సేసుకొని
పనుపడె రతి నల్లబల్లి చెన్నుడా
ఘన శ్రీవేంకటాద్రిపై కందువ నేలుకొంటివి
నను నిందరిలోపల నల్లబల్లి చెన్నుడా
ప|| భావయామి గోపాలబాలం మన- | స్సేవితం తత్పదం చింతయేయం సదా ||
చ|| కటి ఘటిత మేఖలా ఖచిత మణి ఘంటికా- | పటల నినదేన విభ్రాజమానం |
కుటిల పద ఘటిత సంకుల శింజితేనతం | చటుల నటనా సముజ్జ్వల విలాసం ||
చ|| నిరతకర కలితనవనీతం బ్రహ్మాది- | సుర నికర భావనా శోభిత పదం |
తిరువేంకటాచల స్థిత మనుపమం హరిం | పరమ పురుషం గోపాలబాలం ||
ప|| భావించి తెలుసుకొంటే భాగ్యఫలము | ఆవలీవలి ఫలము లంగజ జనకుడె ||
చ|| దానములలో ఫలము, తపములలో ఫలము | మోసములలో ఫలము ముకుందుడె |
జ్ఞానములలో ఫలము జపములలో ఫలము | నానా ఫలములును నారాయణుడె ||
చ|| విమతులలో ఫలము వేదములలో ఫలము | మనసులోని ఫలము మాధవుడె |
దినములలో ఫలము తీర్థ యాత్రల ఫలము | ఘనపుణ్య ఫలము కరుణాకరుడె ||
చ|| సతత యోగఫలము చదువులలో ఫలము | అతిశయోన్నత ఫలము యచ్యుతుడె |
యతులలోని ఫలము జితకామిత ఫలము | క్షితి మోక్షము ఫలము శ్రీవేంకటేశుడె ||
భావించి నేరనైతి పశుబుద్ది నైతిని
యీవల నాయపచార మిది గావవయ్యా
హరి నీవు ప్రపంచమందు బుట్టించితి మమ్ము
పరము నే సాధించేది బలుద్రోహ మవుగాదో
నీరులనేలేటివాడు చెప్పినట్టు సేయక
విరసాలు బంట్లకు వేరే సేయదగునా
పంచేద్రియములు నాపై బంపువెట్టితివి నీవు
యెంచి వాని నే దండించే దిది నేరమౌగాదో
పెంచేటితల్లిదండ్రులు ప్రియమైవడ్డించగాను
కంచము కాలదన్న సంగతియా బిడ్డలకు
మిక్కిలిసంసారము మెడగట్టితివి నాకు
అక్కర నే వేసారేది అపరాధ మవుగాదో
దిక్కుల శ్రీవేంకటాద్రిదేవుడ నీవియ్యగాను
యెక్కడో జీవుడ నేను యెదురాడదగునా
భూమిలోన గొత్తలాయ బుత్రోత్సవ మిదివో
నేమవుకృష్ణజయంతి నేడే యమ్మా
కావిరి బ్రహ్మాండము కడుపులోనున్న వాని
దేవకి గర్భమున నద్దిర మోచెను
దేవతలెల్ల వెదకి తెలిసి కాననివాని
యీవల వసుదేవుడు యెట్టు గనెనమ్మా
పొడవుకు బొడవైన పురుషోత్తముడు నేడు
అడరి తొట్టెలబాలుడాయ నమ్మ
వుడుగక యజ్ఞ భాగమొగి నారగించేవాడు
కొడుకై తల్లిచన్నుగుడిచీనమ్మా
పాలజలధియల్లుండై పాయకుండేయీతనికి
పాలవుట్లపండుగ బాతే యనటే
అలరి శ్రీవేంకటాద్రి నాటలాడనే మరిగి
పేలరియై కడు పెచ్చువెరిగీనమ్మా
భోగము నేను నీకు భోగివి నీవు
శ్రీ గురుడ విన్నిటాను చిత్తగించు నన్నును ||
చక్కని జన్మపు సంసార వ్రుక్శమునకు
పక్కున ఫలము నీవు భావించగా
మక్కువ గర్మమనేటి మత్తగజమునకును
యెక్కిన మావటీడవు యెంచగ నీవు ||
నెట్టిన దేహమనేటి నిర్మల రాజ్యమునకు
పట్టమేలుచుండిన భూపతివి నీవే
దిట్టయైన చిత్తమనే తేజిగుఅమునకు
వొట్టుక రేవంతుడవు వుపమింవనీవు ||
సంతతమైన భక్తి చంద్రోదయమునకు
రంతుల జెలగు సముద్రమవు నీవు
చెంతల శ్రీవేంకటేశ జీవుడనే మేడలోన
అంతర్యామివి నీవు అంకెల జూచినను ||
ప|| భోగి శయనమును బుసకొట్టెడినీ | యోగ నిద్ర పాయును మేల్కొనవే ||
చ|| కన్నులు దెరవక కమల బాంధవుడు | వెన్నెల రేణువు వెలయ దిదే |
అన్నువ మలసీ నరుణోదయమిదే | మిన్నక నీవిటు మేలు కొనవే ||
చ|| తెల్లని కన్నులు దెరవక విరియగ | నొల్లక జలజము లున్నవివే |
కల్ల నిదుర నిను గవియగనియ్యక | మెల్లనాయ నిటు మేలు కొనవే ||
చ|| తెరవగు రెప్పల దెల్లవారవలె| తెరవక చీకటి దీరే దీదే |
తెరగు వేంకటాధిప నీ వెరుగుదు | మెరుగులు చల్లుచు మేలుకొనవే ||
ప|| భోగీంద్రులును మీరు బోయి రండు | వేగగ మీదటి విభవాలకు ||
చ|| హరుడ పోయిరా అజుడ నీవును బోయి | తిరిగిరా మీదటి తిరునాళ్ళకు |
సురలు మునులును భూసురలు బోయిరండు | అరవిరి నిన్నాళ్ళు నలసితిరి ||
చ|| జముడ పోయిరా శశియు నీవును బోయి | సుముఖుడవై రా సురల గూడి |
గుములై దిక్పతులు దిక్కులకు బోయిరండు | ప్రమదాన నిన్నాళ్ళు బడలితిరి ||
చ|| నారద సనక సనందాదులు | భూరివిభవముల బోయిరండు |
దూరముగా బోకిట్టే తొరలి వేంకటగిరి | జేరి నన్నిట్లనే సేవించుడీ ||
మ
ప|| మంగళము గోవిందునకు జయమంగళము గరుడధ్వజునకును |
మంగళము సర్వాత్మునకు ధర్మస్వరూపునకూ, జయజయ ||
చ|| ఆదికినినాదైనదేవున కచ్యుతున కంభోజణాభున- |
కాదికూర్మంబై నజగదాధారమూర్తికిని |
వేదరక్షకునకును సంతతవేదమార్గ విహారునకు బలి- |
భేదికిని సామాదిగానప్రియవిహారునకు ||
చ|| హరికి బరమేశ్వరునకును శ్రీధరునకును గాలాంతకునకును |
పరమపురుషోత్తమునకును బహుబంధదూరునకు|
సురమునిస్తోత్రునకు దేవాసురగణశ్రేష్ఠునకు కరుణా- |
కరునకును గాత్యాయనీనుతకలితనామునకు ||
చ|| పంకజాసనవరదునకు భవపంకవిచ్ఛేదునకు భవునకు |
శంకరున కవ్యక్తునకు నాశ్చర్యరూపునకు |
వేంకటాచలవల్లభునకుమ విశ్వమూర్తికి నీశ్వరునకును |
పంకజాకుచకుంభకుంకుమ పంకలోలునకు ||
పల్లవిః
మంగాంబుధి హనుమంతా నీ శరణ
మంగవించితిమి హనుమంతా
చరణం;
బాలార్క బింబము ఫలమని ప ట్టిన
ఆలరి చేతల హనుమంతా
తూలని బ్రహ్మాదులచే వరములు
ఓలి చేకొనినా హనుమంతా
ప పమగమ మగరిగ గరిసరి రిసనిస సరిసని
సరిగ రిసా రిగామ గరీ గమాప మగరిగమప
పమగమపద దపమపదని నిదపదనిస సనిదనిసరి
గరినిద మదనీద నినిదమ గమదామ నిదమగరిగ “మ0గా”
చరణం
జలధి దాట నీ సత్వము కపులకు
అలరి తెలిపితివి హనుమంతా
ఇలయు నాకసము నేకముగా, నటు
బలిమి పెరిగితివి భళి హనుమంతా
చరణం
పాతాళము లోపలి మైరావణు
ఆతల జంపిన హనుమంతా
చేతులు మోడ్చుక శ్రీ వేంకటపతి
నీ తల గోలిచే హిత హనుమంతా
ప తకితతామ్ తకితజామ్ తకితజుమ్ తకితతొమ్ తరితజుమ్
సరిగ తజుమ్ రిగమ తజుమ్ గమప కితకు గమప కుకుమ్ గమపద
ఝనకు పదని సరిత ఝనుత ఛనుత నిసరి కుకుమ్ ఘనుకుత నీద
తనకు తరితగామ తరితఝనుత “మ0గ”
మంచి ముహూర్తమున శ్రీమంతులిద్దరు
చంచుల పూవుదండలు చాతుకొనేరదివో
సొరిది పేరంటాండ్లు సోబాన పాడగాను
హరియు సిరియు పెండ్లి ఆడేరదే
తొరలి యంతటా దేవదుందుభులు మెరయగ
గరిమ బాసికములు కట్టుకునేరదివో
మునులు మంగళాష్టకములు చదువుచుండగ
పెనగుచు సేసలు పెట్టే రదే
ఘనులు బ్రహ్మాదులు కట్నములు చదువగ
వొనరి పెండ్లిపీటపై నున్నారదివో
అమరాంగనలెల్లాను ఆరతులియ్యగాను
కొమరార విడే లందుకొనే రదివో
అమరి శ్రీవేంకటేశుడలమేలుమంగగూడి
క్రమముతో వరములు కరుణించేరదివో
ప|| మంచిదివో సంసారము మదమత్సరములు మానిన | కంచును బెంచును నొకసరిగా దాచూచినను ||
చ|| ఆపదలకు సంపదలకు నభిమానింపక యుండిన | పాపము బుణ్యము సంకల్పములని తెలిసినను |
కోపము శాంతము తమతమగుణాములుగా భావించిన | తాపము శైత్యమునకు దా దడబడకుండినను ||
చ|| వెలియును లోపలయును నొకవిధమై హృదయంబుండిన | పలుకునుబంతము దానొక భావన దోచి
తలపున దిరువేంకటగిరిదైవము నెలకొనియుండిన | సొలపక యిన్నిటికిని దా సోకోరుచెనైనా ||
ప|| మందరధర మధుసూదన | నందగోపనందనా ||
చ|| నరసింహ గోవింద నవనీతానంద | హరిముకుంద నయనారవింద |
కరివరద గరుడగమనరూప- | గురుచాపా యదుకులదీపా ||
చ|| భవదూర భయహర పరిపూర్ణామృత | భువనపాలన సురపాలన |
భువనభూషణ పరమపురుష పురాతన | నవభోగా కరుణాయోగా ||
చ|| పంకజాసననుత భవ్యనిర్మలపాద- | పంకజ పరమ పరాత్పర|
వేంకటశైలనివేశ శు- | భంకరా క్షేమంకరా ||
ప|| మందులేదు దీనికి మంత్రమేమియు లేదు | మందు మంత్రము దనమతిలోనే కలదు ||
చ|| కదలకుండగ దన్ను గట్టివేసిన గట్టు | వదలించుకొన గొంత వలదా |
వదలించబోయిన వడిగొని పైపైనే | కదియుగాని తన్ను వదలదేమియును ||
చ|| మనసులోపలనుండి మరి మీద దానుండి | యెనసినతిరువేంకటేశుని |
తనరినతలపున దలప దుష్కృతములు | తనకుదానే వీడు దలకవలదుగాన ||
మగవానికేడ సిగ్గు మగువలకింతేకాక
యెగసక్కేలాడేనంటా యేలనవ్వేవిపుడు ||
మంతనాన నిద్దరము మాటలాడుకొన్నవెల్లా
యింతలోనే ఆపెనేడు యెట్టెరిగెను
చెంతల నీవెమ్మెలకు చెప్పితివేమోకాక
వింతగా నీ చెవులనే వినవయ్యా ముద్దులు ||
చేరియింటిలో మనము చేసుకొన్న బాసలు
వారించి యాపెకు నే డవ్వరు చూపిరి
మేరమీరి మురిపెము మెరిసితివేమో కాక
ఆరీతి నీవే యడుగవయ్యా యీ సుద్దులు ||
పానుపువ్పై నిద్దరము పైకొన్న కూటములెల్లా
తానకమై యే రీతిగా దలచినది
కానీలే నీవే పెద్దరికము చూపేవే మోకాక
మేన శ్రీవేంకటేశుడ మెచ్చవయ్యా సుద్దులు ||
మచ్చ కూర్మ వరాహ మనుష్య సింహ వామనా
యిచ్చ రామ రామ రామ హిత బుధ్ధ కలికీ
నన్నుగావు కేశవ నారాయణ మాధవ
మన్నించు గోవింద విష్ణు మధుసూదన
వన్నెల త్రివిక్రమ వామనా శ్రీధరా
సన్నుతించే హృషికేశ సారకు పద్మనాభ
కంటిమి దామోదర సంకర్షణ వాసుదేవ
అంటేజాలు ప్రద్యుమ్నుడా అనిరుధ్ధుడా
తొంటే పురుషోత్తమ అథోక్షజా నారసింహమా
జంటవాయుకు మచ్యుత జనార్దన
మొక్కేము వుపేంద్ర హరి మోహన శ్రీకృష్ణరాయ
యెక్కితి శ్రీవేంకట మిందిరానాథ
యిక్కువ నీ నామములు యివియే నా జపములు
చక్కగా నీ దాసులము సర్వేశ అనంత
మచ్చికతో నేలవయ్య మదన సామ్రాజ్యలక్శ్మీ
పచ్చి సింగారాల బండారాలు నిండెను ||
కొమరె తురుమునను గొప్పమేఘ ముదయించి
చెమట వాన గురిసె జెక్కులవెంట
అమర బులకపైరు లంతటాను జెలువొంది
ప్రమదాల పలవుల పంట లివె పండెను ||
మించుల చూపుల తీగె మెఅ గులిట్టె మెరిచి
అంచె గోరికల జళ్ళవె పట్టెను
సంచితవు కుచముల జవ్వని రాసులు మించె
పొంచి నవ్వుల యామని పోదిగొనె నిదిగో ||
మతంగ పర్వతామాడ మాల్యవంతము నీడ
అతిశయిల్లిన పెద్ద హనుమంతుడు ఇతడ
ఈతడా రాముని బంటు ఈతడా వాయు సుతుడు
ఆతతబలాడ్యూలందురు ఆతడితడా
సీతను వెదకి వచ్చి చెప్పిన ఆతడితడా
ఘాతల లంకలోని రాక్షస వైరి ఇతడ
ఆంజనాసుతడితడా అక్షమర్ధనుడు ఇతడ
సంజీవిని కొండ దెచ్చే సారె నితడా
భంజిన్‌చె గాలనేమిని పంతముననితడా
రంజితప్రతాప కపిరాజ సఖుడితడా
చీరజీవి ఈతడ జీతేంద్రీయుడు ఇతడ
సురలకు ఉపకారపు చుట్టము ఈతడ
నిరతి శ్రీ వేంకటాద్రీని వి నగరములో
నరిది వరములిచ్చి అందరికి ఇతడ
ప|| మదమత్సరము మనసుపేదైపో | పదరిన యాసలవాడవో వైష్ణవుడు ||
చ|| ఇట్టునట్టు దిరిగాడి యేమైనా జెడనాడి | పెట్టరంటా బోయరంటా బెక్కులాడి |
యెట్టివారినైనా దూరి యెవ్వరినైన జేరి | వట్టియాసల బడనివాడువో వైష్ణవుడు ||
చ|| గడనకొరకు జిక్కి కాముకివిద్యల జొక్కి | నిడివి నేమైనా గని నిక్కి నిక్కి |
వొడలిగుణముతోడ వుదుట విద్యల జాల | వడదాకి బడలనివాడవో వైష్ణవుడు ||
చ|| ఆవల వొరుల జెడనాడగ వినివిని | చేవమీర యెవ్వరిని జెడనాడక |
కోవిదు శ్రీవేంకటేశు గొలిచి పెద్దలకృప | వానివర్తనల వాడువో వైష్ణవుడు ||
మదము దొలకెడి యట్టి మంచి వయసున మనకు
తుదలేని వెడుకలు దొరకుటెన్నడురా ||
ఉదుటు జనుదోయి నీవురముపై దనివార
నదిమి మోమును మోము నలమియలమి
వదలైన నీవితో వాలుగన్నుల జంకె
లొదవ నీ మీద నేనొరగు టెన్నడురా ||
కతికి తనమున నాదు కప్పురపు దమ్ములము
కులికి నీ వదనమున గుమ్మరించి
పలచనగు గోళ్ళ నీ పగడనాతెర నొక్కి
చెలుపమగు నునుగంటి సేయుటెన్నడురా ||
గరగరని కురులతో కస్తూరి వాసనలు
విరితావులతోద విసరగాను
తిరువేంకటాధిపుడ నిను గూడి నే
నరమరచి సమదము లౌట యెన్నడురా ||
మనవి చెప్పితిని మఱవకుమీ
కనుగొని నామాట కడువకుమీ
యిచ్చక మాడితి వీడనె వుంటివి
మచ్చిక నామేలు మఱవకుమీ
వచ్చి వేరొకతె వలపులు చల్లిన
పచ్చిదేరి మరి పదరకుమీ
సరసమాడితివి చనవు లిచ్చితివి
మరిగిన నాపొందు మానకుమీ
సరిగా మరొకతె సందులు దూరిన
తొరలి యపుడు మరి తొలచకుమీ
కలసితి విప్పుడు కాగిలించితివి
పొలసి యిట్లనె భోగించుమీ
యెలమిని శ్రీవేంకటేశ్వర మరొకతె
పిలిచితేను మరి పెనగకుమీ
ప|| మనసిజ గురుడితడో మరియు గలడో వేద- | వినుతుడు డితడుగాక వేరొకడు గలడో ||
చ|| అందరికి నితడెపో అంతరాత్ముడనుచు- | నందురితడో మరియు నవలడొకడో |
నందకధరుడు జగన్నాథుడచ్చుతుడు గో- | విందుడీతడు గాక వేరొకడు గలడో ||
చ||| తనర నిందరికి జైతన్యమొసగిన యాత- | డొనర నితడో మరియు నొకడు గలడో |
దినకరశతతేజుడగు దేవదేవుడు త- | ద్వినుతుడితడు గాక వేరొకడు గలడో ||
చ|| పంకజభవాదులకు బరదైవ మీతడని | అంకింతు రితడో అధికుడొకడో |
శాంకరీస్తోత్రములు సతతమును గైకొనెడి | వేంకటవిభుడో కాక వేరొకడు గలడో ||
మనసిజ సముద్ర | మధనమిదే ||
కనుగొను మింతట |కాంతుడ నీవు ||
సతి చింతామతి |జలనిధి తరువగ
అతిగరళపు విర |హము వొడమే ||
తతి నా పిమ్మట |తమకపు కోర్కులు
లతల కల్పకపు |లాకలు వొడమె||
పొలతి కూటములు |పొంగులు పొంగగ
పులకల తారలు |పోడమె నవి
ఫలమై సాత్విక |భావపు చంద్రుడు
నిలువుగ పొడమగ |నేరుపు లలరె ||
సుదతి తానె నీ | చొక్కపు కౌగిట
నదుమన నిందిర |యై పొడమె ||
కదిసిన శ్రీవేం |కటపతి నీదెస
అధరామృతమ |య్యతివకు పొడమె ||
ప|| మనసు బండారము మగువమేను | పొదిగొన్న వలపులబొసగెగాన ||
చ|| మరుని యాయుధశాల మరునికొప్పు | తొరలించి విరులెల్లాదురిమెగాన |
యిరవై కీరములాయ మీపెగళము | సరసపుమాటలెల్లా జరపె గాన ||
చ|| కాముని సాము గరిడి కాంత వురము | ఆమని చను సంగడా లమరెగాన |
ప్రేమపుగేళాకూళి గంభీరనాభి | తేమ చెమటల చేత దిగుపారెగాన ||
చ|| కాంతుని వేట పొలము కన్నె పిఱుదు | బంతి మొలనూళ్ళ పోగు వారెగాన |
అంతటివానితల్లి యీయలమేల్మంగ | యింతలో శ్రీవేంకటేశు నెనసెగాన ||
ప|| మనసుకు మనసె మర్మముగాక | వినికివలె దనకు విన్నవించ గలనా ||
చ|| తలుపులో తమకము తానె యెరగడట | యెలమిదన్ను గొసరె నేలె నాకూ |
కలిమి జంద్రుని రాక కలువ పువ్వులకును | తెలిపిరా యెవ్వరైన దినదినమునకు ||
చ|| తప్పక వరుసెరిగి తానె విచ్చేయడట | యిప్పుడు విలువనంప నేలె నాకూ |
వుప్పతిల్లు గోవిలకు నొగి వసంతకాలము | చెప్పుదురా యెవ్వరైన జెలగి యేటేటను ||
చ|| దగ్గరి వచ్చినవాడు తానె యెరుగు గాక | యెగ్గుసిగ్గులిటు దీర్చనేలె నాకు |
అగ్గమై శ్రీ వేంకటేశుడాదరించి నిన్నుగూడె | నిగ్గు నిలువుకు నీడ నేర్పిరా యితరులు ||
ప|| మనసున నెప్పుడు మానదిది | దినబాధెటువలె దీరీనో ||
చ|| చిత్త్తవికారము జీవులపాపము | తత్తరపరచక తడయదిది |
కత్తులబో నీకాయపువయసున- | నెత్తినమదమున కేదిగతో ||
చ|| అసలుగంబ మీయాశాదోషము | విసిగిన నూరక విడువదిది |
వసులమూట మోవగ బడవేయగ | వసము గాని దెటువలెనౌనో ||
చ|| పాముచెలిమి రంపపుసంసారము | గాములమోచినగంప యిది |
కామించుచు వేంకటపతి దలపక | యేమరి వుండిన నేమౌనో ||
మనుజుడై పుట్టి మనుజుని సేవించి
అనుదినమును దుఃఖమందనేలా
జుట్టెడు గడుపుకై చొరనిచోట్లు చొచ్చి
పట్టెడుగూటికై బతిమాలి
పుట్టినచోటికే పొరలి మనసు వెట్టి
వట్టిలంపటము వదలనేరడుగాన
అందరిలో బుట్టి అందరిలో బెరిగి
అందరి రూపము లటుదానై
అందమైన శ్రీవేంకటాద్రీశు సేవించి
అందరానిపదమందెనటుగాన
ప|| మరచితిమంటే మరిలేదు |
తరితో దలచవో దైవము మనసా ||
చ|| పుట్టుచునున్నది పోవుచునున్నది |
పట్టపు జీవుల ప్రపంచకము |
నట్టనడుమనే నరహరి నామము |
గుట్టున దలచవో కొనగొని మనసా ||
చ|| పొద్దు వొడుచు నదె పొద్దు గుంకు నదె |
తిద్దిన జగముల దిన దినము |
అద్దపు నీడల అంతర్యామిని |
వొద్దనె తలచవొ ఒనరగ మనసా ||
చ|| లోపల వెలుపల లోగొని ఉన్నది |
శ్రీపతి మహిమల సృష్టి యిదే |
యేపున శ్రీ వేంకటేశ్వరు డితడే |
దాపని నమ్ముచు దలచవొ మనసా ||
మరలి మరలి జయమంగళము
సొరిదినిచ్చలును శుభమంగళము
కమలారమణికి కమలాక్షునకును
మమతల జయజయ మంగళము
అమరజననికిని అమరవంద్యునకు
సుముహూర్తముతో శుభమంగళము
జలధికన్యకును జలధిశాయికిని
మలయుచును శుభమంగళము
కలిమికాంత కాకలికి విభునికిని
సుళువుల యారతి శుభమంగళము
చిత్తజు తల్లికి శ్రీ వేంకటపతికి
మత్తిల్లిన జయ మంగళము
యిత్తల నత్తల యిరువురకౌగిటి
జొత్తుల రతులకు శుభమంగళము
ప|| మరిగి వీరెపో మాదైవంబులు | కెరలిన హరిసంకీర్తనపరులు ||
చ|| వినియెడివీనులు విష్ణుకథలకే | పనిగొందురు మాప్రపన్నులు |
కనియెడి కన్నులు కమలాక్షునియం- | దనువుపరతు రటు హరిసేవకులు ||
చ|| పలికెడి పలుకులు పరమాత్మునికై | యలవరుతురు శరణాగతులు |
తలచేటి తలపులు ధరణీధరుపై | తలచెడి రతిదివ్యులు ||
చ|| కరముల శ్రీపతికైంకర్యములే | మురియుచు జేతురు ముముక్షువులు |
యిరవుగ శ్రీవేంకటేశ్వరుమతమే | సిరుల నమ్ముదురు శ్రీవైష్ణవులు ||
ప|| మరుడు సేసిన మాయ మగలకు నాండ్లకు | విరసాలు పుట్టవు వేడుకే కాని ||
చ|| యెంత దూరి మాటాడినా యింపులయ్యే వుండుగాని | పంతము రేగ దింతిపై బతికి |
పొంత నుండి సారె బొమ్మల జంకించినాను | వింతలు దోచవు మరి వేడుకే గాని ||
చ|| చలపట్టి సరసము జరయుచు నాడినాను | అలయిక పుట్టదు దేహమునకును |
పెలుచుదనాన మరి పెనగులా టాడినాను | వెలయ వేసట గాదు వేడుకే కాని ||
చ|| మిన్నక కొసరి మందెమేళ మెంత సేసినాను | అన్నిటాలోలో నెగ్గులై మించవు |
యెన్నగ శ్రీ వేంకటేశుడే నలమేలు మంగను | విన్నప్పుడే కూడె మాకు వేడుకలె కాని ||
మరుని నగరిదండ మాయిల్లెరగవా
విరుల తావులు వెల్ల విరిసేటి చోటు
మఱగు మూక చింతల మాయిల్లెరగవా
గురుతైన బంగారు కొడల సంది
మఱపుఁ దెలివి యిక్క మాయిల్లెరగవా
వెరవక మదనుడు వేటాడేచోటు
మదనుని వేదసంత మాయిల్లెరగవా
చెదరియు జెదరని చిమ్మఁ జీకటి
మదిలోన నీవుండేటి మాయిల్లెరగవా
కొదలేక మమతలు కొలువుండేచోటు
మరులుమ్మెత్తల తోట మాయిల్లెరగవా
తిరువేంకటగిరి దేవుడ నీవు
మరుముద్రల వాకిలి మాయిల్లెరగవా
నిరతము నీసిరులు నించేటి చోటు
ప|| మర్ద మర్ద మమ బంధాని | దుర్దాంత మహాదురితాని ||
చ|| చక్రాయుధ రవిశత తేజోంచిత | సక్రోధసహస్ర ప్రముఖ |
విక్రమక్రమా విస్ఫులింగకణ | నక్రహరణ హరినవ్యకరాంక ||
చ|| కలితసుదర్శన కఠినవిదారణ | కులిశకోటిభవ ఘోషణా |
ప్రళయానలసంభ్రమ విభ్రమకర | రళితదైతగళ రక్తవికీరణా ||
చ|| హితకరశ్రీవేంకటేశప్రయుక్త | సతతపరాక్రమ జయంకర |
చతురోऽహంతే శరణమ్ గతోऽస్మి | యితరాన్ విభజ్య యిహ మాం రక్ష ||
మఱి యేపురుషార్థము మావంకలేదు మీకు
అఱువడము మాకెంత అత్తువో నీవు.
హరి నీవు నాకు నంతర్యామివైనఫలము
తిరిగినందే మావెంట దిరిగెదవు
ఇరవుగ నీవు మాకు నేలికవైనఫలము
గరిమె మాపాపమెల్ల గట్టుకొంటివి.
భువిలోన నీవు నన్ను బుట్టించినఫలము
ఇవల రక్షించేతొడుసిదొకటాయ
తివిరి నన్ను నీకుక్షి దెచ్చిడుకొన్నఫలము
జవళ నా నేరములు చక్క బెట్టబడెను.
గారవాన నన్ను వెనకవేసుకొన్నఫలము
చేరి నన్ను బుణ్యునిగా జేయవలసె
అరసి నాకు బ్రత్యక్షమైనఫలమున నన్ను
యీరీతి శ్రీవేంకటేశ ఇముడుకోబడెను.
మఱి హరిదాసుడై మాయల జిక్కువడితే
వెఱపించబోయి తనే వెఱచినట్లువును
శూరుడైనవాడేడజొచ్చిన నడ్డము లేదు
ఆరీతిజ్ఞానికి విధు లడ్డము లేవు
కారణాన నప్పటినీ గలిగెనా నది మరి
తేరిననీళ్ళ వండు దేరిన ట్లవును
సిరులరాజై తే నేమిసేసిన నేరమి లేదు
పరమాధికారియైతే బాపము లేదు
అరసి తనకుదానే అనుమానించుకొనెనా
తెరువే పో?సుంకరి దెలిపినట్లవును
భూమెల్ల మేసినా నాబోతుకు బందె లేదు
నేమపుబ్రపన్నునికి నింద లేదు
యీ మేర శ్రీవేంకటేశ్వరుని శరుణుని
సోమరి కర్మమంటితే జుంటీగ కతవును
ప|| మఱియు మఱియు నివె మాపనులు | మెఱసితి మిందే మిక్కిలివి ||
చ|| నారాయణునకు నమస్కారము | ధారుణీపతికిని దండము |
శ్రీరమణునకును జేరి శరణ్యము | వారిధిశాయికి వరుస జోహారు ||
చ|| రామకృష్ణులకు రచనలబంటను | దామోదరునకు దాసుడను |
వామనమూర్తికి వాకిటిగొల్లను | సోమార్కనేత్రునిసొరిదిలెంకను ||
చ|| గోవిందునికే కొలువులు సేతుము | దేవోత్తముబడి దిరుగుచును |
భావజగురునకు పంపునడతుము | శ్రీవేంకటపతి సేవింతుము ||
ప|| మలసీ జూడరో మగసింహము | అలవి మీరిన మాయల సింహము ||
చ|| అదివో చూడరో ఆదిమ పురుషుని | పెద యౌబళముమీది పెనుసింహము |
వెదికి బ్రహ్మాదులు వేదాంతతతులు | కదిసి కానగ లేని ఘనసింహము ||
చ|| మెచ్చి మెచ్చి చూడరో మితిమీరినయట్టి | చిచ్చరకంటితోడి జిగిసింహము |
తచ్చిన వారిధిలోని తరుణిగౌగిటజేర్చి | నచ్చిన గోళ్ళ శ్రీ నరసింహము ||
చ|| బింకమున జూడరో పిరితీయక నేడు | అంకపుదనుజ సంహార సింహము |
వేంకటనగముపై వేదాచలముపై | కింకలేక వడి బెరిగిన సింహము ||
ప|| మహి నింతటివారువో మనవారు | బహుమహిమలవారు ప్రపన్నులు ||
చ|| జయమంది జననజరామరణముల- | భయములేనివారు ప్రపన్నులు |
క్రియలెల్ల నుడిగి మూగినకర్మపుటడవి | బయలుచేసినవారు ప్రపన్నులు ||
చ|| ధీరులై మాయాంధకారంబు నెదిరించి | పారదోలినవారు ప్రపన్నులు |
సారమయ్యినసంసారసాగరము | పారముగన్నవారు ప్రపన్నులు ||
చ|| అండ నిన్నిటా దనిసి యాసలెల్లా దెగగోసి | పండినమనసువారు ప్రపన్నులు |
దండిగా శ్రీవేంకటేశుదాసులై పరముతోడ | బండినబాట చేసినారు ప్రపన్నులు ||
మహినుద్యోగి కావలె మనుజుదైన వాడు
సహజి వలె నుండి ఏమి సాధించలెడు.
వెదకి తలచుకుంటే విష్ణుడు కానవచ్చు
చెదరి మరచితే సృష్టి చీకటౌ
పొదలి నడిచితేను భూమెల్లా మెట్టి రావచ్చు
నిదిరించితే కాలము నిమిషమై తోచు
వేడుకతో చదివితే వేదశాస్త్ర సంపన్నుడౌ
జాడతో నూరకుండితే జడుడౌను
వోడక తపసియైతే వున్నతోన్నతుడౌ
కూడక సోమరి ఐతే గుణహీనుడౌను
మురహరు గొలిచితే మోక్షము సాధించవచ్చు
వెరవెరగక ఉండితే వీరిడియౌను
శరణంటే శ్రీవేంకటేశ్వరుడు రక్షించును
పరగ సంశయించితే పాషండుడౌను
ప|| మహిమెల్లా దొప్పదోగె మజ్జనవేళ | సహజశృంగారాలు జడిసె శ్రీపతికి ||
చ|| మొత్తేలవానలెల్ల ముంచి కురిసినయట్టు | హత్తి పన్నీట జలకమాయ హరికి |
తత్తరాన దెల్లమొయిలు తను ఒదిగినయట్లు | కొత్తగా గప్పురకాపు గుప్పిరి దేవునికి ||
చ|| నీలపుబేరులెల్లా నిండా గట్టినయట్టు | తేల దట్టపుణుగు మెత్తిరి పతికి |
అలరిమెఱుగుదీగె లలముకొనినయట్టు | కోలుముందై సొమ్ములెల్లా గుప్పిరి విష్ణునికి ||
చ|| పెక్కునవరత్నములు పెద్దరాసి వోసినట్టు | యెక్కువదండలు గట్టిరి మూరితికి |
వొక్కట నలమేలుమంగ నురమున గట్టిరిదె | చిక్కనినవ్వులు మించె శ్రీవేంకటేశునకు ||
ప|| మాకెల్ల “రాజనుమతో ధర్మ” యిది నీ- | యీకడ గలుగుటకేమరుదు ||
చ|| అలగరుడగమన మహిశయనంబును | కలిసి నీయందె కలిగెనటా |
పొలసినపాపము బుణ్యము నరులకు | యెలమి గలుగుటకు నేమరుదు ||
చ|| యిదె నీడకన్ను యెండకన్ను మరి | కదిసి నీయందె కలిగెనట |
సదరపునరులకు జననమరణములు | యెదురనె కలుగుటకేమరుదు ||
చ|| శ్రీకాంత వొకదెస భుకాంత వొకదెస | కైకొని నీకిటు గలిగెనట |
యీకడ శ్రీవేంకటేశ యిహపరము | యేకమై మాకగుటేమరుదు ||
మాటలేల మనసుకు మనసేసాక్షి
యేటికి బరాకు సేసే వింతిగానవయ్యా ||
కామిని తాపమునకు గప్పిన పయ్యద సాక్షి
చేమిరి చింతకు చెక్కు చేయే సాక్షి
వాముల వూరుపులకు వాడిన మోవే సాక్షి
యేమరిపాటు విచ్చేసి ఇంతి జూడవయ్యా ||
వడియు గన్నీటికిని వట్రువ గుబ్బలే సాక్షి
తడుపు జెమటలకు తనువే సాక్షి
చిడుముడి యలతకు చెదరు గురులే సాక్షి
యెడసేయక విచ్చేసి ఇంతిగానవయ్యా ||
నే కెదురు చూచుటకు నిట్టు చూపులే సాక్షి
పైకొన్న యవస్థలకు పానుపులే సాక్షి
చేకొని శ్రీ వేంకటేశ చేరి కూదిటి వింతట
యీకడ నిట్టే కరుణ నింతి జూడవయ్యా ||
ప|| మాదృశానాం భవామయదేహినాం | యీదృశం జ్ఞానమితి యేऽపి న వదంతి ||
చ|| వాచామగోచరం వాంఛా సర్వత్ర | నీచకృత్యేరేవ నిబడీకృతా |
కేచిదపి వా విష్ణుకీర్తనం ప్రీత్యా | సూచయంతో వా శ్రోతుం న సంతి ||
చ|| కుటిలదుర్బోధనం కుహకం సర్వత్ర | విటవిడంబనమేవ వేద్మ్యధీతం |
పటువిమలమార్గసంభావనం పరసుఖం | ఘటయితుం కష్టకలికాలే న సంతి ||
చ|| దురితమిదమేవ జంతూనాం సర్వత్ర | విరసకృత్యైరేవ విశదీకృతం |
పరమాత్మానం భవ్యవేంకటనామ- | గిరివరం భజయితుం కేవా న సంతి || ||
మాధవా కేశవా మధుసూధనా ౨ విష్ణు
శ్రీధరా పదనకం చింతయామి యూయం ||
వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్నా
రామ రామ కృష్ణ నారాయనాచ్యుతా ౨
దామోదరానిరుద్ద దైవ పుండరీకాక్ష ౨
నామ త్రయాదీశ నమో నమో ||
పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య
హరిసంకర్షనా అధోక్షజా ౨
నరశింహ హృషీకేష నగధరా త్రివిక్రమ
శరణా గత రక్ష జయ జయ సేవే ||
మహిత జనార్ధనా మత్స్య కూర్మ వరాహ
సహజ భార్గవ బుద్ధ జయ తురగ కల్కి ౨
విహిత విజ్ఞాన శ్రీ వేంకటేశ శుభ కరం అహ
మిహ తవ పద దాస్యం అనిశం భజామి ||
ప|| మాధవా భూధవా మదన జనక | సాధు రక్షణ చతుర శరణు శరణు ||
చ|| నారాయణాచ్యుతానంత గోవింద శ్రీ | నారసింహా కృష్ణ నాగశయన |
వారాహ వామన వాసుదేవ మురారి | శౌరీ జయజయతు శరణు శరణు ||
చ|| పుండరీకేక్షణ భువన పూర్ణగుణ | అండజగమన నిత్యహరి ముకుంద |
పండరి రమణ రామ బలరామ పరమ పురుష | చండభార్గవ రామ శరణు శరణు ||
చ|| దేవదేవోత్తమ దివ్యావతార నిజ | భావ భావనాతీత పద్మనాభ |
శ్రీవేంకటాచల శృంగారమూర్తి నవ | సావయవ సారూప్య శరణు శరణు ||
ప|| మాధవునకు మంగళం | సాధు ప్రియునకు జయ మంగళం ||
చ|| మదన గురునకు మంగళము మా | మతిలేలె హరికిని మంగళము |
మధురిపు హరునకు మంగళము | చటువులుమూర్తికి మంగళము ||
చ|| మహిమాధికుణకు మంగళము | మహామహునకు మంగళము |
మహీధవునకు మంగళము | సహజ తేజునకు మంగళము ||
చ|| మాయారహితునికి మంగళము | మాయింటి పతికిని మంగళము |
యీ యెడ శ్రీ వేంకటేశ్వరు దీటు | ఛాయ శ్రీపతికి మంగళము ||
ప|| మాన డెన్నడు శరీరి దు- | ర్మానసబోధితుడుగాన ||
చ|| పంచభూతవికారంబులు | పంచేంద్రియములూ |
పంచమహా పాతకములకును | పంచివేసినవిగాన ||
చ|| త్రైగుణ్యవికారంబులు | త్రైగుణ్యపుదనువులు |
శ్రీగురుడగు శ్రీవేంకటపతి- | భోగయోగ్యములుగాన ||
ప|| మానుషము గాదు మరి దైవికము గాని | రానున్నా అది రాకుమన్న బోదు ||
చ|| అనుభవముకు బ్రాప్తమైనది | తనకుదానె వచ్చి తగిలికాని పోదు ||
చ|| తిరువేంకటగిరి దేవుని | కరుణచేత గాని కలుషమింతయు బోదు ||
ప|| మాపుదాకా రేపకాడ మాటకు మాటాడగాను | యేపున దెగని పనికేల పెట్టేవాన ||
చ|| నవ్వినవ్వి మానేవు నడుమ నడుమ నీవు | జవ్వని యెవ్వతేమైనా సన్న సేసెనా |
వువ్విళ్ళూర నీనిజము వొరసి చూచే నింతే | యెవ్వరిందుకు గురయ్యేరేల పెట్టేవాన ||
చ|| చప్పిచెప్పి కొంకేవు సిగ్గులు పడుతా నీవు | వుప్పటించనీడ నెవ్వరున్నారు నీకు |
రెప్పలెత్తి చూచి నిన్నురేచి వెదకేనింతే | యెప్పటి వాడవే నీవు యేల పెట్టేవాన ||
చ|| ముట్టిముట్టి చూచేవు మొరగి నాకుచములు | యిట్టె యెవ్వతెవైనా యీడు వచ్చెనా |
నెట్టన శ్రీ వేంకటేశ నిరతి మెచ్చితినింతే | యెట్టకేలకైన పనికేల పెట్టేవాన ||
మాపులే మరణములు రేపులే పుట్టువులు
చాపలాలు మాని విష్ణు శరణను మనసా
చాలునంటే ఇంచుకంతే చాలును జన్మమునకు
చాలకున్న లోకమెల్ల చాలదు
వీలిన యీ ఆశా(సా) వెఱ్ఱివానిచేతిరాయి
చాలు నింక హరి నిట్టె శరణను జీవుడా
పాఱకున్న పశుబాలై(1) బడలదు మనసు
పాఱితే జవ్వనమున పట్టరాదు
మీఱిన నీరుకొద్దిదామెర యింతె యెంచి చూడ
జాఱ విడిచి దేవుని శరణను జీవుడా
సేయకున్న కర్మము శ్రీపతిసేవనే వుండు
సేయబోతే కాలమెల్లా సేనాసేనా
వోయయ్య యిది యెల్లా వుమినాకే చవుతాలు(2)
చాయల శ్రీవేంకటేశు శరణను జీవుడా
ప|| మాయపుదనుజుల మదవైరి కపి- | రాయడు వీడివో రామునిబంటు ||
చ|| పెట్టినజంగయు పెంపుమిగుల మొల | గట్టినకాసెయు గర్వమున |
నిట్టనిలిచి పూనినచేత నడిమి- | దిట్ట వీడువో దేవునిబంటు ||
చ|| నవ్వుచు లంకానగరపుదనుజుల- | కొవ్వణచిన కపికుంజరుడు |
మువ్వురువేల్పుల మొదలిభూతియగు- | రవ్వగు సీతారమణునిబంటు ||
చ|| పంకజసంభవుపట్టముగట్టగను | వుంకించిన తనవొడయనిచే |
పొంకపు కలశాపుర హనుమంతుడు | వేంకటరమణునివేడుకబంటు ||
మాయలేల సేసేవు మన్నించరాదా
బాయిట (బడె నీగుట్టు ప్రహ్లాదవరద
వొరసివలపు తొల్లే వొడి( గట్టుకొన్నందుకు
అరుదైనతొడపై తొయ్యలి సాకిరి
సరుసనే మాతోను జాణతనాలడేవు
యిరవై నీయాసోద మేమిచెప్పే దికను
మొనసి చుట్టరికము తొల్లి మోపు గట్టుకొన్నందుకు
యెనలేని వీపుమీది యింతి సాకిరి
ననుపు నాతోనే నవ్వులెల్లా నవ్వేవు
నినుపులై గజరెల్లా నిండె నీమై నిపుడు
తమకమెల్లా దవ్వి తలకెత్తుకున్నందుకు
కొమరైనశిరసుపై కొమ్మసాకిరి
మమత శ్రీవేంకటేశ మరిగి నన్నేలితివి
జమళి నీపొందులు సతమాయ నేడు
మాయామోహము మానదిది
శ్రీ యచ్యుత నీచిత్తమే కలది ||
యెంత వెలుగునకు నంతే చీకటి
యెంత సంఒఅదకు నంతాపద
అంతటానొఊశధ మపధ్యామును సరి
వింతే మిగిలెను వేసటేకలది ||
చేసిన కూలికి జీతమునకు సరి
పూసిన కర్మభోగము సరి
వాసులజన్మము వడిమరణము సరి
ఆసల మిగిలిన దలపే కలది ||
మొలచిన దేహము ముదియుటకును సరి
తలచిన దైవము తనలోను
యిలలో శ్రీవేంకటేశ నీ కరుణ
గలిగిన మాకెల్ల ఘనతేగలది ||
ప|| మాఱు మోవిదేటికి మంకుదన మేటికి | జాఱువడ నే నవ్వితే సంతసించవలదా ||
చ|| వడి నీకెమ్మోవి మీది వన్నెదీసినది చూచి | తొడరి వీడెమిచ్చితే దోసమాయిది |
కడుచెమటల నీపై గందవొడి చల్లితేను | జడియక నీవిందుకు సంతసించవలదా ||
చ|| కులికి నీకన్నులపై కుంకుమ వన్నెలుచూచి | బలిమి బన్నీరిచ్చితే పాపమాయిది |
కలసిన వేడి వేడి కాకలమే నటుచూచి | చలిగా నే విసరితే సంతసించవలదా ||
చ|| పిప్పియైన నీమేని పెక్కులాగులటు చూచి | ముప్పిరి గళలంటితే మోసమాయిది |
అప్పటి శ్రీ వేంకటేశ అలమితి విటునన్ను | చప్పుడు గాకియ్యకుంటే సంతసించవలదా ||
ప|| మిక్కిలి మేలుది అలమేలుమంగ | అక్కరతో నిన్నుజూచీ నలమేలుమంగ ||
చ|| కొచ్చి కొచ్చి యాలాపించి కూరిమితో బాడగాను | మెచ్చీ నిన్నునిదె యలమేలుమంగ |
నెచ్చెలులతోడ నెల్లా నీగుణాలు సారె సారె | అచ్చలాన నాడుకొనీ నలమేలుమంగ ||
చ|| వాడల వాడల నీవు వయ్యాళి దోలగాను | మేడలెక్కి చూచీ నలమేలుమంగ |
వీడెము చేతబట్టుక వెస నీవు పిలువగా | ఆడనుండి వచ్చె నీకడ కలమేలుమంగ ||
చ|| ఈలీల శ్రీవేంకటేశ ఇంత చనవియ్యగాను | మేలములాడీ నలమేలుమంగ |
యేలిన నీ రతులను ఇదె తన నేరుపెల్లా | ఆలోచనలు సేసీ నలమేలుమంగా ||
ప|| మిక్కిలి విచ్చి చెప్పితే మేడిపండు బోన మిది | తొక్కు మెట్టు సందడెల్ల తో దోపులే కావా ||
చ|| చాయలకే మాటలాడి చనవులు మెఱసేవు | యీ యెడ దెలుసునే మీకిద్దరికిని |
నాయమే మడిగేవే నన్ను నీ వింతటి లోనే | మాయదారి సుద్దులెల్ల మఱగులే కావా ||
చ|| గిలిగింత నవ్వు నవ్వి కిందు మీదు జూచేవు | నిలువుల నున్నవే మీనేరుపు లెల్లా |
మలసి మీ సరితలు మాకేమి అప్పగించేరే | కొలది లేని వలపు గుమితమే కాదా ||
చ|| భావపు రతి గరగి పై జేయి వేసేవు | వావిరి దేటుపడె మీ పగలెల్లను |
శ్రీ వేంకటేశుడు నీవు సిగ్గు లిందేల పడేరే | కూవలై వున్నవి మీగుట్లింతే కావా ||
ప|| మిక్కిలిపుణ్యులు హరి మీదాసులే హరి | తక్కినవారు మీకృపదప్పినవారు హరి ||
చ|| వున్నతపుసంపదల నోలలాడేయట్టివాడు | మున్నిటజన్మాన నీకు మొక్కినవాడు హరి |
పన్ని పడనిపాట్ల బరులగొలిచేవాడు | వున్నతిమిము సేవించనొల్లనివాడు హరి ||
చ|| పూని దేవేంద్రాదులై పొడవుకెక్కినవారు | శ్రీనాథ మిమ్మునే పూజించినవారు హరి |
నానారకముల నలగుచుండేవారు | నానాడే నీమహిమ నమ్మినవారు హరి ||
చ|| పావనులై నిజభక్తి బ్రపన్నులయ్యినవారు | శ్రీవేంకటేశ మిమ్ము జేరినవారె హరి |
వేవేలుదేవతలవెంట దగిలేటివాడు | కావించి మిమ్మెరుగనికర్మి యాతడే హరి ||
ప|| మిన్నక వేసాలుమాని మేలుకోవయ్యా | సన్నల నీయోగనిద్ర చాలు మేలుకోవయ్యా ||
చ|| ఆవులు పేయలకుగా నరచీ బిదుకవలె | గోవిందుడ యింక మేలుకోవయ్యా |
ఆవలీవలపడుచు లాటలు మరిగివచ్చి | త్రోవగాచుకున్నారు ప్రొద్దున మేలుకోవయ్యా ||
చ|| వాడల గోపికలెల్లా వచ్చి నిన్ను ముద్దాడ | గూడియున్నారిదే మేలుకోవయ్యా |
తోడనే యశోద గిన్నెతో బెరుగు వంటకము | యీడకు దెచ్చి పెట్టె నిక మేలుకోవయ్యా ||
చ|| పిలిచీ నందగోపుడు పేరుకొని యదె కన్ను- | గొలుకులు విచ్చి మేలుకోవయ్యా |
అలరిన శ్రీవేంకటాద్రిమీది బాలకృష్ణ | యిల మామాటలు వింటివిక మేలుకోవయ్యా ||
ప|| మీకుమీకునమరును మిక్కిలివేడుకలెల్లా | కైకొని నేమెల్లా చూడగంటిమిగదె ||
చ|| సింగారరాయడుగదే చిత్తజుగురుడుగదే | అంగవించి నిన్ను పెండ్లాడినాడు |
బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు | అంగన నీవు దేవులవైతివి గదే ||
చ|| కాంచనపు దట్టివాడు కౌస్తుభము మణివాడు | మంచితనమున నీకు మగడుగదే వాడు |
మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు | ఎంచగ నితని వురము ఎక్కితివిగదవే ||
చ|| చేతులు నాల్గింటివాడు శ్రీవేంకటేశ్వరుడు | ఆతుమగా నిన్నునేలి అలరెగదేవాడు |
ఈతల శ్రీకాంతవు ఇన్నిటా నేరుపరివి | ఈతని కెప్పుడు నీవు ఇరవైతివి గదే ||
ప|| మీదమీద వలపెక్కె మేలు మేలోయి | చీదర రేచేవు నన్ను చెల్లు లేవోయి ||
చ|| నిద్దురో నివ్వెరగో నేనేమో చెప్పగాను | వొద్దనుండే వూకొనవు వోయి మేలోయి |
పెద్దరికమో బీరమో బెట్టి వీడెమడిగితే | కద్దనవు లేదనవు గర్వమేలోయి ||
చ|| కాకలో వీకలో కడు నేను నవ్వినను | మాకువలె నున్నాడవు మతకమౌనోయి |
వేకమో వెరపూ వేగమే జేయి వేసితే | కేకరించి ములిగేవు గేలి యేలోయి ||
చ|| ఆసలో వాసులో అండ నేను నిలుచుంటే | మేనుల గాగలించేవు మెస్తిలేవోయి |
బాసతో శ్రీ వేంకటేశ పంతాన నన్ను గూడితి | వేసములెల్లా దీరె వింతలాయ నోయి ||
ప|| ముంచినవేడుకతోడ మొక్కుటగాక | కంచములోపలికూడు కాలదన్నేటికి ||
చ|| వేదార్థములు నీవేవిహరించినసుద్దులే | కాదని అవునని కొన్నివాదములేల |
యేది నీవు సేసినాను యిన్నియును నియ్యకోలే | సోదించనేటికి యందు సొట్టు లెంచనేటికి ||
చ|| కర్మము లిన్నియును నీకైంకర్యసాధనాలే | అర్మిలి దారతమ్యము లడుగనేల |
నిర్మితము నీదింతే నెరసు లెంచగనేల | ధర్మమందు నింక గజదంతపరీక్షేటికి ||
చ|| భక్తియింతా నొక ఘంటాపథము నీశావలే | యుక్తి బాత్రపాత్రములు యూహించనేల |
ముక్తికి శ్రీవేంకటేశ మూలము నీపాదములు | సక్తులము నమ్ముటగాక చలపదమేటికి ||
ప|| ముగురువేలుపులకు మూల మీతడు | జగిమీరి నెదుటను సేవించరే ||
చ|| అంచల బన్నీటిబిందె లందుకొని యిందరును | నించి మజ్జనము దేవునికి జేయగా |
వంచి సముద్రముమీద వానలు గురిసినట్టు | పొంచి యన్నిటాను ఉప్పొంగుచున్నాడు ||
చ|| పచ్చకప్పురము మేన బలుమారు మెత్తగాను | తచ్చి పున్నమచంద్రుడే తానై వున్నాడు |
అచ్చపుదట్టుపుణుగు ఆమీద బుయ్యగాను | నిచ్చ గల్పకతరువునీడయై వున్నాడు ||
చ|| అలమేలుమంగతోడ నన్నిసొమ్ములు నించగా | పలుపంచవన్నెలసంపద యైనాడు |
యెలమి శ్రీవేంకటేశు డిన్నిటా బ్రతాపించి | కులికి పుణ్యాలకెల్లా గురియైనాడు ||
ప| ముచ్చుగన్నతల్లి చేరి మూలకు నొదిగినట్టు | తెచ్చినసంబళమెల్ల దీరుబో లోలోనె ||
చ|| దప్పముచెడినవానితరుణి కాగిట జేరి | అప్పటప్పటికి నుస్సురనినయట్టు |
వొప్పయినహరిభక్తివొల్లని వానియింటి- | కుప్పలైనసంపదలు కుళ్ళుబో లోలోనె ||
చ|| ఆకలిచెడినవాని అన్నము కంచములోన | వోకిలింపుచు నేల నొలికినట్లు |
తేకువైనహరిభక్తి తెరువుగాననివాని- | వేకపుసిరులు కొంపవెళ్ళుబో లోలోనె ||
చ|| వొడలుమాసినవాని వొనరుజుట్టములెల్ల | బడిబడినే వుండి పాసినయట్టు |
యెడయక తిరువేంకటేశు దలచనివాని- | అడరుబుద్ధులు పగలౌబో లోలోనె ||
సూచన: ఈ పదమున అన్నమాచార్యులవారు శ్రీకృష్ణలీలలను నవరత్నములతొ పోల్చుచున్నారు.
ముద్దుగారే యశోద ముంగిటి ముత్తెము వీడు
తిద్దరాని మహిమల దేవకీ సుతుడు
అంత నింత గొల్లెతల అరచేతి మాణికము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ బూస
చెంతల మాలో నున్న చిన్ని కృష్ణుడు
రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము
గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు
కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము
యేలేటి శ్రీ వేంకటాద్రి యింద్రనీలము
పాల జలనిధి లోన బాయని దివ్య రత్నము
బాలునివలె దిరిగీ బద్మ నాభుడు
ముద్దులు మోమున ముంచగను
నిద్దపు కూరిమి నించీని
మొలచిరుగంటలు మువ్వలు గజ్జెలు
గలగలమనగా కదలగను
ఎలనవ్వులతో ఈతడు వచ్చి
జలజపు చేతులు చాచీనీ
అచ్చపు గుచ్చు ముత్యాల హారములు
పచ్చల చంద్రాభరణములు
తచ్చిన చేతుల తానె దైవమని
అచ్చట నిచ్చట ఆడీని
బాలుడు కృష్ణుడు పరమపురుషుడు
నేలకు నింగికి నెరి పొడవై
చాల వేంకటాచలపతి తానై
మేలిమి చేతల మించీని
మునులతపము నదె మూలభూతి యదె
వనజాక్షుడే గతి వలసినను
నరహరి నామము నాలుకనుండగ
పరమొకరి నడుగ(బని యేల
చిరపుణ్యము నదె జీవరక్ష యదె
సరుగగాచు నొకసారె నుడిగినా
మనసులోననే మాధవుడుండగ
వెనుకొని యొకచో వెదకగనేటికి
కొనకుగొన యదే కోరెడి దదియే
తను(దారక్షించు తలచినను
శ్రీవెంకటపతి చేరువ నుండగ
భావకర్మముల భ్రమయగనేటికి
దేవుడు నతడే తెరువూ నదియే
కావలెనంటే కావకపోడు
ప|| మూడేమాటలు మూడుమూండ్లు తొమ్మిది | వేడుకొని చదవరో వేదాంత రహస్యము ||
చ|| జీవస్వరూపము చింతించి యంతటాను | దేవుని వైభవము తెలిసి |
భావించి ప్రకృతి సంపదయిది యెరుగుడే | వేవేలు విధముల వేదాంత రహస్యము ||
చ|| తనలోని విజ్ఞానము తప్పకుండా దలబోసి | పనితోడ నందువల్ల భక్తినిలిపి |
మనికిగా వైరాగ్యము మరవకుండుతే | వినవలసిన యట్టి వేదాంత రహస్యము ||
చ|| వేడుకతో నాచార్య విశ్వాసము గలిగి | జాడల శరణాగతి సాధనముతో |
కూడి శ్రీవేంకటేశుగొలిచి దాసుడౌటే | వీడని బ్రహ్మానంద వేదాంత రహస్యము ||
ప : మూల మూల నమ్ముడు చల్ల – ఇది
రేలు పగలు కొనరే చల్ల
చ : పిక్కటిల్లు చన్నుల గుబ్బెత ఒక్కతి – కడు
చక్కనిది చిలికిన చల్ల
అక్కున చెమటగార నమ్మీని – ఇది
యెక్కడ పుట్టదు కొనరే చల్ల
చ : వడ చల్లుమేని జవ్వని ఒక్కతి – కడు
జడియుచు చిలికిన చల్ల
తడబడు కమ్మని తావులది – మీ
రెడయ కిపుడు కొనరే చల్ల
చ : అంకుల కరముల వొయ్యారొక్కతి – కడు
జంకెనల చిలికిన చల్ల
వేంకటగిరిపతి వేడుకది – ఇది
ఇంకా నమ్మీ కొనరే చల్ల
ప|| మూసిన ముత్యాన కేలే మొరగులు | ఆశల చిత్తాన కేలే అలవోకలు ||
చ|| కందులేని మోమున కేలే కస్తూరి | చిందు నీకొప్పున కేలే చేమంతులు |
మందయానమున కేలే మట్టెల మోత | గంధమేలే పై కమ్మని నీమేనికి ||
చ|| భారపు గుబ్బల కేలే పయ్యద నీ | బీరపు జూపుల కేలే పెడమోము |
జీరల భుజాల కేలే చెమటలు నీ | గోరంట గోళ్ళ కేలే కొనవాండ్లు ||
చ|| ముద్దుల మాటల కేలే ముదములు నీ | యద్దపు జెక్కుల కేలే అరవిరి |
వొద్దిక కూటమి కేలే వూర్పులు నీకు | నద్దమేలే తిరువేంకటాద్రీశు గూడి ||.
|| మెచ్చెనొక రాగంబు మీద మీద కడు | నిచ్చె నొక రాగంబు యింతులకు నెల్ల ||
చ|| చేసె నొక రాగంబు చెలియెదుట గన్నులనె | మూసె నొక రాగంబు ముదిత మతినె |
పూసె నొక రాగంబు పొలతి పులకలమేన | వ్రాసె నొక రాగంబు వనిత నినుబాసి ||
చ|| పట్టె నొక రాగంబు ప్రాణములపై నలిగి | తిట్టె నొక రాగంబు తిరిగి తిరిగి |
పుట్టె నొక రాగంబు పొలతి డెందమునకును | మెట్టె నొక రాగంబు మెరయుచునె కదలి ||
చ|| కురిసె నొక రాగంబు కొప్పు పువ్వులనె సతి | మురిసె నొక రాగంబు ముంచి మేన |
తిరువేంకటేశ్వరుడ తెలిసికో నినుబొంది | పొరసె నొక రాగంబు పొలతి కుచములనే ||
ప|| మెరుగు వంటిది యలమేలుమంగ | అరిమురి నవ్వీని అలమేలుమంగ ||
చ|| పలుచని యెలుగున బాడీ నీ మీది పాట | మెలుపు గూరిమి నలమేలుమంగ |
చెలులతో నీ సుద్ది చెప్పిచెప్పి కరగీని | అలయుచు సొలయుచు నలమేలుమంగ ||
చ|| ఈడుగా నీ రాకకు నెదురెదురుచూచీ | మేడ మీద నుండి యలమేలుమంగ |
వాడు మోముతో నీపై వలపు చల్లి చల్లి | ఆడీ నాట్యము సారె నలమేలుమంగ ||
చ|| పేరుకొని పిలిచీని ప్రియములు చెప్పి చెప్పి | మేరమీర నిన్ను నలమేలుమంగ |
యీరీతి శ్రీవేంకటేశ నిన్ను గూడె నేడు | ఆరితేరి నన్నిటాను అలమేలుమంగ ||
ప|| మేడలెక్కి నిన్ను జూచి కూడెననే యాసతోడ |
వాడు దేరి వుస్సురందురా వెంకటేశ ||
అప|| యాడానుంటి విందాకనురా ||
చ|| పిక్కటిల్లు చమ్ములపై చొక్కపు నీ వుంగరము |
గక్కన నే నద్దుకొందురా వెంకటేశ |
లక్కవలె ముద్ర లంటెరా ||
చ|| నిండ బూచిన మావిపై గండుగోవిల గూయగా |
నిండిన నీయెలు గంటాను వెంకటేశ |
అండకు నిన్ను రమ్మంటినా ||
చ|| నీవు వలచిన వలపు- లాకలొత్తె నామతిని |
వాకున నేజెప్ప జాలరా వెంకటేశ |
లోకమెల్ల నెరిగినదే ||
చ|| పాయము నీకొకనికే చాయగా మీదెత్తితిని |
యీయెడ గైవాలకుండాను వెంకటేశ |
మాయింటనే పాయకుండరా ||
చ|| ముమ్మాటికి నీ బాసలే నమ్మివున్నదాన నేను |
కుమ్మరించరా నీకరుణ వెంకటేశ |
చిమ్ము జీకటెల్ల బాయను ||
ప|| మేదిని జీవుల గావ మేలుకోవయ్యా | నీదయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా ||
చ|| తగుగోపికల కన్నుదామరలు వికసించె | మిగుల సూర్యనేత్రుడ మేలుకోవయ్యా |
తెగువ రాక్షసులనే తిమిరము విరియగ | నెగడిన పరంజ్యోతి నిద్ర మేలుకోవయ్యా ||
చ|| ఘనదురితపు గలువలు వికసించె | మినుకు శశినేత్రుడ మేలుకోవయ్యా |
పనివడి వేదాలనే పక్షులెల్లా బలుకగ | జనక! యాశ్రితపారిజాత మేలుకోవయ్యా ||
చ|| వరలక్ష్మీ కుచచక్రవాకము లొండొంటి రాయ | మెరయుదోషరహిత మేలుకోవయ్యా |
పొరసి నీవు నిత్యభోగములు భోగించ | నిరతి శ్రీవేంకటేశ నేడు మేలుకోవయ్యా ||
మేర లేని వల పిది మీ కేల తెలుసునే
యీ రసమయ్యే బుద్ధులేల చెప్పేరే
ఆట దెంత గబ్బి యన్నా ననుడ మీ రిక వేయి
మాటలన్నా వాని నేను మాన లేనే
వేటలాడే మదనుడు విరహుల బొడగంటే
యీటెలవంటి పూబాణా లేమరుండీనా
అమ్మరోయంతటి కల్ల యన్నానంటిరి గాని
వమ్మువోని వాని పొందు వదలలేనే
కమ్మటి జందురుడు కాకల బొరలేవారిపై
కుమ్ము వంటి వెన్నెలలు గుప్పకుండీనా
అతివ మారాడ జెల్ల దన్నానంటిరి గని
వెతలేని వాని రతి విడువలేనే
కతకారై నన్ను శ్రీవెంకటనాథు(డె)గూడె
ఇతవైన కళలెల్లా హెచ్చకుండీనా
ప|| మేలు లేదు తేలు లేదు మించీ నిదే హరిమాయ | కాలమందే హరి గంటి మొకటే ||
చ|| సురలును జీవులే నసురలును జీవులే | ధర నిందు బ్రకృతిభేదమేకాని |
సురలకు స్వర్గ మసురలకు నరకము | పరగ నీరెంటిగతి పాపపుణ్యములే ||
చ|| పొలతులు జీవులే పురుషులు జీవులే | తలప భావభేదములేకాని |
బలిమి స్వతంత్రము బరతంత్ర మొకరికి | యెలమి నిందులో జెల్లే హీనాధికములే ||
చ|| రాజులును జీవులే రాసిబంట్లు జీవులే | వోజతో సంపద చెల్లే దొకటే వేరు |
సాజపుశ్రీవేంకటేశు శరణ మొక్కటే గతి | బాజు గర్మ మొండొకటి బంధమోక్షములు ||
మేలుకొనవే నీలమేఘ వర్ణుడా
వేళ తప్పకుండాను శ్రీవేంకటేశుడా
మంచము పై నిద్ర లేర మల్లెల వేసేరు
ముంచి తురుము ముడువ మొల్లల వేసేరు
కంచము బొత్తారగించ కలువలవేసేరు
పించపు చిక్కు తీర సంపెంగలు వేసేరు
కలసిన కాక దీర గన్నెరుల వేసేరు
వలపులు రేపి విరజాజుల వేసేరు
చలువుగా వాడుదేర జాజులవేసేరు
పులకించ గురువింద పువ్వుల వేసేరు
తమిదేర గొపికలు తామరలు వేసేరు
చమటార మంచి తులసిని వేసేరు
అమర శ్రీ వేంకటేస అలమేలుమంగ నీకు
గమత పన్నీటితో చేమంతుల వేసేరు
ప|| మేలుకో శృంగారరాయ మేటి మదనగోపాల | మేలుకోవె నాపాల ముంచిన నిధానమా ||
చ|| సందడిచే గోపికల జవ్వనవనములోన | కందువందిరిగే మదగజమవు |
యిందుముఖి సత్యభామ హృదయ పద్మములోని | గంధము మరిగినట్టి గండు తుమ్మెద ||
చ|| గతిగూడి రుక్మిణికౌగిట పంజరములో | రతిముద్దు గురిసేటి రాచిలుకా |
సతుల పదారువేల జంట కన్నుల గలువల- | కితమై పొడిమిన నా యిందు బింబమ ||
చ|| వరుసం గొలనిలోని వారి చన్నుంగొండలపై | నిరతి వాలిన నా నీలమేఘమా |
శిరనురమున మోచి శ్రీ వేంకటాద్రి మీద | గరిమ వరాలిచ్చే కల్పతరువా ||
మేలే చెలియా మేలుగాల మిది
తాలిమి లేదిదె తతిపో నాకు ||
వెన్నెలగాసి వెలది నేడిపుడు
పున్నమచంద్రుడు పొడచెనటే
కన్నె కోవిలలకలకల మయ్యా
వన్నె వసంతము వచ్చెనటే ||
కడగి చక్రవాకంబులు మూగీ
పుడమి బొద్దివుడు పొడచెనటే
ముడివడి చకోరములు కడుబోలసీ
అడరి సంద్వేళాయ నటే ||
చినుకులు రాలీ చిత్తజునెండల
కనుగొన వానల కాలమటే
యెనసితి శ్రీవేంకటేశుడనే నిటు
వనిత నీరతికి వరుసిది యటవే ||
మైలవాసి మణుగాయ మాటలేలరా
చాలుజాలు బనులెల్ల జక్కనాయరా ||
టొడిబడ నవ్వితిని తోదుత నే మొక్కితిని
చిదుముది నిక నేమి చేసేవురా
అడరి నేదిట్టితిని అంతలో బంతమిచ్చితి
వదిగా బైపైనాతో వాదులేలరా ||
కోపగించి చూచితివి గొబ్బన నే మెచ్చితిని
మాపుదాకా నింత జోలిమాట లేలరా
రేపకాడ నెడసితి మాపటమ్త గూడితివి
యీపాటి వాసికిని యెగ్గులేలరా ||
మోవి గంటి సేసితి నామోవి తేనెలిచ్చితివి
దేవుడ శ్రీ వేంకటేశ తెగువేలరా
భావమెల్ల గరగితి పక్కన మెప్పించ్తిని
చేవదేరె బనులెల్ల జింత లేలరా ||
మొక్కేటి గోపాంగనల మోహనాకారము
చిక్కని నవ్వులు నవ్వీ శ్రీ వేంకటేశ్వరుడు
సత్యభామ ఉరముపై చల్లని కస్తూ రి పూత
తత్త రించె రుక్మిణి చే తామర పూవు
హత్తి న భూకాంతకు యంగపు పయ్యెద కొంగు
చిత్తగించరమ్మా వీడె శ్రీ వేంకటేశ్వరుడు
పంతపు పదారువేల బంగారు ఉంగరము
బంతినే కుట్టబడిన పసిడి తాళి
వింతగా రాధాదేవి వేసిన కలువదండ
చెంతలను వీడె అమ్మ శ్రీ వేంకటేశ్వరుడు
ఆసల తులసీదేవి అరచేతిలో అద్దము
భాసురపు నీళాదేవి పట్టుగొమ్మ
శ్రీ సతి ఎక్కిన యట్టి సింహాసనపు గద్దె
సేస పెట్టించుకొన్నాడు శ్రీవేంకటేశ్వరుడు
మొత్తకురే అమ్మలాల ముద్దులాడు వీడె
ముత్తెమువలె నున్నాడు ముద్దులాడు
చక్కని యశోద తన్ను సలిగతో మొత్తరాగా
మొక్క బోయీ గాళ్ళకు ముద్దులాడు
వెక్కసాన రేపల్లె వెన్నలెల్లమాపుదాక
ముక్కున వయ్యగ దిన్న ముద్దులాడు
రువ్వెడి రాళ్ళదల్లి రోల దన్ను గట్టెనంట
మువ్వల గంటల తోడి ముద్దులాడు
నవ్వెడి జెక్కుల నిండ నమ్మిక బాలునివలె
మువ్వురిలో నెక్కుడైన ముద్దులాడు
వేల సంఖ్యల సతుల వెంట బెట్టుకొనిరాగా
మూల జన్నుగుడిచీని ముద్దులాడు
మేలిమి వెంకటగిరి మీదనున్నాడిదె వచ్చి
మూలభూతి దానైన ముద్దులాడు
ప|| మొదలుండ గొనలకు మోచి నీళ్ళు వోయనేల | యెదలో నీవుండగా నితరము లేలా ||
చ|| నిగమ మార్గముల నే నడచే నంటే | నిగము లెల్లను నీమహిమే |
జగము లోకుల జూచి జరిగెద నంటే | జగములు నీ మాయ జనకములు ||
చ|| మనసెల్ల నడ్డపెట్టి మట్టున నుండే నంటే | మనసు కోరికెలు నీ మతకాలు |
తనువు నింద్రియములు తగ గెలెచే నంటే | తనువు నింద్రియములు దైవము నీ మహిమా ||
చ|| ఇంతలోని పనికిగా యిందు నందు జొరనేల | చెంత నిండు చెరువుండ చెలమ లేలా |
పంతాన శ్రీవేంకటేశ పట్టి నీకే శరణంటి | సంత కూటాల ధర్మపు సంగతి నాకేలా ||
ప|| మొఱపెట్టెదము మీకు మొగసాలవాకిటను | మఱగుచొచ్చితి మీకు మము గావరో ||
చ|| యేపున మనసనియేటిమాపెంపుడు లేడి | పాపమనేయడవి బడినది |
రాపున హరికింకరపువేకకాండ్లాల | పైపైని మాకింక బట్టియ్యరో ||
చ|| అంచెల మావిజ్ఞానమనెడి కామధేనువు | పంచేంద్రియపు రొంపి బడినది |
మించి వైకుంఠానకేగే మేటితెరువరులాల | దించక యెత్తెత్తి వెళ్ళదియ్యరో ||
చ|| అండనే మోహాంధకారమనెడి మాదిగ్గజము | దండి మీదయయనేటివో దాన బడెను |
ప|| మోపుల చిగురుల చిమ్ములవేదము | ఆవుల మందలలోని ఆవేదము ||
చ|| మంచముపై చదివేది మరవకుమీ | కొంచెపు లేబలుకుల కొనవేదము |
పించపు శిరసుతోడ బిన్ననాడే చదివిన | తుంచి తుంచిన మాటల తొలివేదము ||
చ|| చల్లలమ్మే గొల్లెతల చక్కని జంకెనలకు | గొల్లపల్లెలోన దొరకొన్న వేదము |
తల్లి బిడ్డ లనక యందరి నొక్క వావిగా | పిల్లగ్రోవి నేరిపిన పెనువేదము ||
చ|| పంకజభవాదులు బడిబడి జదివించే | లంకెలు చెలగిన మెలపువేదము |
వేంకటనగము మీద వెలయు నిందిరగూడి | కొంకొక చదివిన చొక్కుల వేదము ||
ప|| మోసమున మాయావిమోహితుడైపోయి | కాసుసేయనిపనికి గాసిబడె బ్రాణి ||
చ|| కన్నులనియెడి మహాకల్ప భూజములివి | తన్ను బుణ్యునిజేయ దగిలి వచ్చినవి |
వున్నతోన్నతబుద్ధి నొనగూర్ప కది దేహి | కన్నచోటికి బరపి గాసిబడె బ్రాణి ||
చ|| చిత్తమనియెడి మహాచింతామణి దనకు | తొత్తువలె వలసి దోడుతేగలది |
హత్తించి హరిమిద నలరింప కది వృథా | తిత్తిలో సుఖమునకు తిరిగె నీప్రాణి ||
చ|| కామతత్త్వంబనెడి కామధేనువు దనకు | వేమారు గోరికెల వెల్లిగొలిపెడిది |
యీమేను తిరువేంకటేశు జేరకపోయి | కామాంధుడై మిగుల గతిమాలె బ్రాణి ||
ప|| మోహంపు రతిముదము ముద్దుజూపుల మదము | దేహంపు సొబగెల్లదెలిపె సదమదము ||
చ|| మించు మట్టెల గిలుకు మెరుగు గుబ్బల కులుకు | వంచు జూపుల చిలుకు వసివాడు బలుకు |
మంచుజెమటల తళుకు మనసు లోపలి యళుకు | అంచుటదరపు బెళుకు అలమేటి జళుకు ||
చ|| కరమూలములగరగు కదలు బయ్యెద చెరగు | సిరుల చెలువపు మొరగు చెక్కుపై మరగు |
గరిగరికె తతులెరుగు ఘాతలంటిన తెరగు | గరిమతో చెలియునికి కప్పురపుటరగు ||
చ|| కలికి తనము పోగు కమ్మదావుల వేగు | వలపు తమకముల పరవశము పెనుజాగు |
కలకంటి బాగు వేంకటపతి జెలరేగు | చెలియ సమరతుల మించిన వింతబాగు ||
ప|| మోహము విడుచుటే మోక్ష మది | దేహ మెరుగుటే తెలివీ నదే ||
చ|| ననిచినతనజన్మము గర్మము దన- | పనియు నెరుగుటే పరమ మది |
తనకు విధినిషేధములు బుణ్యముల- | ఘనత యెరుగుటే కలిమి యది ||
చ|| తరిదరి బ్రేమపు తల్లిదండ్రులను | యెరుగనిదే కులహీన తది |
చరుల బొరలి యాచారధర్మములు | మరచినదే తనమలిన మది ||
చ|| కమ్మర గమ్మర గామభోగములు | నమ్మి తిరుగుటే నరక మది |
నెమ్మది వేంకటనిలయుని దాసుల- | సొమ్మయి నిలుచుట సుకృత మది ||
య
యజ్ఞ మూర్తి యజ కర్త యజ్ఞ భోక్తవిన్నిటాను
యజ్ఞాది ఫలరూప మటు నీవై వుండవే
పరికించ జీవులకు ప్రాణమవైన నీకు
నిరతి ప్రాణ ప్రతిష్ఠ నేము సేసేమా
మరిగి మా పూజలంది మమ్ము గాచుట కొరకు
హరి నీ మూర్తి ప్రాణమావహించవే
జగతికి నీ పాద జలమే సంప్రోక్షణ
జిగి నీకు సంప్రోక్షణ సేయువారమా
పగటున నన్ను నీవు పావనము సేయుటకు
అగు పుణ్య తీర్థముల అభిషేక మందవే
వేదములు తెచ్చిన శ్రీ వేంకటేశనేమునీకు
వేద మంత్రముల పూజా విధి సేసేమా
యీదెస నీ దాసులమైన మము గాచుటకొరకు
వేదమూర్తి యిందే విచ్చేసి ఉండవే
యజ్ఞ మూర్తి యజ కర్త యజ్ఞ భోక్తవిన్నిటాను
యజ్ఞాది ఫలరూప మటు నీవై వుండవే
పరికించ జీవులకు ప్రాణమవైన నీకు
నిరతి ప్రాణ ప్రతిష్ఠ నేము సేసేమా
మరిగి మా పూజలంది మమ్ము గాచుట కొరకు
హరి నీ మూర్తి ప్రాణమావహించవే
జగతికి నీ పాద జలమే సంప్రోక్షణ
జిగి నీకు సంప్రోక్షణ సేయువారమా
పగటున నన్ను నీవు పావనము సేయుటకు
అగు పుణ్య తీర్థముల అభిషేక మందవే
వేదములు తెచ్చిన శ్రీ వేంకటేశనేమునీకు
వేద మంత్రముల పూజా విధి సేసేమా
యీదెస నీ దాసులమైన మము గాచుటకొరకు
వేదమూర్తి యిందే విచ్చేసి ఉండవే
ర
రాధామాధవరతిచరితమితి – బోధావహం శ్రుతిభూషణం
గహనే ద్వావపి గత్వా గత్వా – రహసి రతిం ప్రేరయతి సతి
విహరతస్తదా విలసంతౌ – విహతగృహాశౌ వివశౌ తౌ
లజ్జాశభళ విలాసలీలయా – కజ్జలనయన వికారేణ
హృజ్జావ్యవ(న)హృత (హిత?) హృదయా రతి – స్సజ్జా సంభ్రమచపలా జాతా
పురతో యాంతం పురుషం వకుళైః – కురంటకైర్వా కుటజైర్వా
పరమం ప్రహరతి పశ్చాల్లగ్నా- గిరం వినాసి వికిరతి ముదం
హరి సురభూరుహ మర్హతివస్వ -(మారోహతీవ?) – చరణేన కటిం సంవేష్ట్య
పరిరంచణ సంపాదితపులకై – స్సురుచిర్జాతా సుమలతికేవ
విధుముఖదర్శన వికళితలజ్జా- త్వధరబింబఫలమాస్వాద్య
మధురోపాయనమార్గేణ కుచౌ – నిధివద(ద్ద?) త్వా నిత్యసుఖమితా
సురుచిరకేతక సుమదళ నఖరై- ర్వరచిబుకం సా పరివృత్య (వర్త్య?)
తరుణిమసింధౌ తదీయదృగ్జల-చరయుగళం సంసక్తం చకార
వచన విలాసైర్వశీకృత(త్య?) తం- నిచులకుంజ మానితదేశే
ప్రచురసైకతే పల్లవశయనే- రచితరతికళా రాగేణాస
అభినవకల్యాణాంచితరూపా- వభినివేశ సంయతచిత్తౌ
బభూవతు స్తత్పరౌ వేంకట – విభుణా(నా?) సా తద్విధినా సతయా
సచ లజ్జావీక్షణో భవతి తం – కచభరాం(ర?) గంధం ఘ్రాపయతి
నచలతిచేన్మానవతీ తథాపి – కుచసంగాదనుకూలయతి
అవనతశిరసాప్యతి సుభగం- వివిధాలాపైర్వివశయతి
ప్రవిమల కరరుహరచన విలాసై – ర్భువనపతి(తిం?) తం భూషయతి
లతాగృహమేళనం నవసై – కతవైభవ సౌఖ్యం దృష్ట్వా
తతస్తతశ్చరసౌ (శ్చరతస్తౌ?) కేలీ- వ్రతచర్యాం తాం వాంఛంతౌ
వనకుసుమ విశదవరవాసనయా- ఘనసారరజోగంధైశ్చ
జనయతి పవనే సపది వికారం- వనితా పురుషౌ జనితాశౌ
ఏవం విచరన్ హేలా విముఖ- శ్రీవేంకటగిరి దేవోయం
పావనరాధాపరిరంభసుఖ- శ్రీ వైభవసుస్థిరో భవతి
రామ దశరథరామ నిజ సత్య-
కామ నమో నమో కాకుత్థ్సరామ ||
కరుణానిధి రామ కౌసల్యానందన రామ
పరమ పురుష సీతాపతిరామ
శరధి బంధన రామ సవన రక్షక రామ
గురుతర రవివంశ కోదండ రామ ||
దనుజహరణ రామ దశరథసుత రామ
వినుతామర స్తోత్ర విజయరామ
మనుజావతారా రామ మహనీయ గుణరామ
అనిలజప్రియ రామ అయోధ్యరామ ||
సులలితయశ రామ సుగ్రీవ వరద రామ
కలుష రావణ భయంకర రామ
విలసిత రఘురామ వేదగోచర రామ
కలిత ప్రతాప శ్రీవేంకటగిరి రామ ||
ప|| రామ మిందీవర శ్యామం పరాత్పర | ధామం సుర సార్వభౌమం భజే ||
చ|| సీతావనితా సమేతం | పీత (స్ఫీత) వానర బలవ్రాతం |
పూత కౌసల్యా సంజాతం | వీత భీత మౌని విద్యోతం ||
చ|| వీర రణరంగ ధీరం | సారకులోద్ధారం |
కౄర దానవ సంహారం | శూరాధారాచార సుగుణోదారం ||
చ|| పావనం భక్త సేవనం | దైవిక విహగపథావనం |
రావణానుజ సంజీవనం | శ్రీ వేంకట పరిచిత భావనం ||
రామ రామ రామకృష్ణ రాజీవలోచన నీకు
దీము వంటి బంటననే తేజమే నాది॥
వారధి దాటి మెప్పించ వాయుజుడనే గాను
సారె చవుల మెప్పించ శబరిగాను
బీరాన సీత నిచ్చి మెప్పించ జనకుండగాను
ఏరీతి మెప్పింతు నన్నెట్లా గాచేవో॥
ఘనమై మోచి మెప్పించ గరుడుడనే గాను
కొన కామసుఖమిచ్చు గోపిక గాను
వినుతించి మెప్పించ వేయినోళ్ళ భొగిగాను
నిన్నెట్లు మెప్పింతు నన్ను గాచే దెట్లా॥
నవ్వుచు పాడి మెప్పించ నారదుడనే గాను
అవ్వల ప్రాణమీయ జటాయువు గాను
ఇవ్వల శ్రీ వేంకటేశ యిటునీకె శరణంటి
అవ్వల నా తెరువిదే రక్షించే దెట్లా॥
రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలములీయ గలిగెనిందరికి
గౌతము భార్యపాలిటి కామధేనువితడు
ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
సీతాదేవి పాలిటి చింతామణి యితడు
యీతడు దాసుల పాలిటి యిహపర దైవము
పరగసుగ్రీవుపాలి పరమ బంధువితడు
సరిహనుమంతుపాలి సామ్రాజ్యము
నిరతి విభీషణునిపాలి నిధానము యీతడు
గరిమజనకు పాలి ఘనపారిజాతము
తలప శబరిపాలి తత్వపు రహస్యము
అలరిగుహునిపాలి ఆదిమూలము
కలడన్నవారిపాలి కన్నులెదుటి మూరితి
వెలయ శ్రీవేంకటాద్రి విభుడితడు
ప|| రామభద్ర రఘువీర రవివంశతిలక నీ- | నామమే కామధేనువు నమో నమో ||
చ|| కౌసల్యానందవర్ధన ఘన దశరథసుత | భాసురయజ్ఞరక్షక భరతాగ్రజ |
రాసికెక్కు కోదండరచన విద్యాగురువ | వాసితో సురలు నిను పడి మెచ్చేరయ్యా ||
చ|| మారీచసుబాహు మర్దన తాటకాంతక | దారుణ వీరశేఖర ధర్మపాలక |
కారుణ్యరత్నాకర కాకాసురవరద | సారెకు వేదములు జయవెట్టేరయ్యా ||
చ|| సీతారమణ రాజశేఖరశిరోమణి | భూతలపుటయోధ్యా పురనిలయా |
యీతల శ్రీవేంకటాద్రి నిరవయినరాఘవ | ఘాత నీప్రతాపమెల్లా గడు నిండెనయ్యా ||
రామా దయాపరసీమా అయోధ్యపుర
ధామా మావంటివారితప్పులు లోగొనవే
అపరాధియైనట్టియాతనితమ్మునినే
కృపజూపితివి నీవు కింకలు మాని
తపియించి యమ్ము మొన దారకుజిక్కినవాని
నెపాన గాచి నిడిచి నీవాదరించితివి
సేయరాని ద్రోహము సేసినపక్షికి నీవి
పాయక అప్పటి నభయమిచ్చితి
చాయసేసుకొని వుండి స్వామి ద్రోహి జెప్పనట్టి
తోయపుటేటెని మంచితోవనే పెట్టితివి
నేరము లెంచవు నీవు నీదయే చూపుదుగాని
బీరపు శరణాగరబిరుద నీవు
చేరి నేడు నిలుచుండి శ్రీవేంకటాద్రిమీద
గోరినవరములెల్లా కొల్ల లొసగితివి
ప|| రాము డిదే లోకాభిరాము డితడు | గోమున పరశురాముకోప మార్చెనటరే ||
చ|| యీతడా తాటకి జించె యీపిన్నవాడా | ఆతల సుబాహు గొట్టి యజ్ఞము గాచె |
చేతనే యీకొమరుడా శివునివిల్లు విఱిచె | సీతకమ్మ బెండ్లాడె చెప్ప గొత్త గదవె ||
చ|| మనకౌసల్యకొడుకా మాయామృగము నేసె | దనుజుల విరాధుని తానే చెఱిచె |
తునుమాడె నేడుదాట్లు తోడనే వాలి నడచె | యినకులు డితడా యెంతకొత్త చూడరే ||
చ|| యీవయసుతానే యాయెక్కువజలధి గట్టి | రావణు జంపి సీత మరల దెచ్చెను |
శ్రీవేంకటేశు డితడా సిరుల నయోధ్య యేలె | కావున నాటికి నేడు కంటి మిట్టె కదరే ||
రాముడీతడు లోకాభిరాముడీతడు
కామించిన విభీషణు( గాచినవాడీతడు
శ్రీదైవారినయట్టి సీతారాముడీతడు
కోదండ దీక్షా గురుడీతడు
మోదమున నబ్ధి యమ్ముమొనకు తెచ్చె నీతడు
పాదుకొని సుగ్రీవు పగ దీర్చె నీతడు
ఘోర రావణుని తలగుండు గండడీతడు
వీరాఢి వీరుడైన విష్ణుడీతడు
చేరి యయోధ్యాపతియై చెల్గినవాడీతడు
ఆరూఢి మునుల కభయమ్ము లిచ్చె నీతడు
తగ నందరి పాలిటి తారకబ్రహ్మమీతడు
నిగమములు నుతించే నిత్యుడీతడు
జగములో శ్రీవేంకటేశ్వరుడైనవాడీతడు
పగటున లోకమెల్లా పాలించె నీతడు
రాముడు రాఘవుడు రవికులు డితడు
భూమిజకు పతియైన పురుష నిధానము
అరయ పుత్రకామేష్టి యందు పరమాన్నమున
పరగ జనించిన పర బ్రహ్మము
సురల రక్షింపగ అసురుల శిక్షింపగ
తిరమై ఉదయించిన దివ్య తేజము
చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో
సంతతము నిలిచిన సాకారము
వింతలుగా మునులెల్ల వెదకిన యట్టి
కాంతుల చెన్ను మీరిన కైవల్య పదము
వేద వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు
పాదుకొన పలికేటి పరమార్ధము
ప్రోదితొ శ్రీ వేంకటాద్రి పొంచి విజయ నగరాన
ఆదికి అనాదియైన అర్చావతారము
ప|| రాముడు లోకాభిరాముడందరికి రక్షకు డీతని దెలిసి కొలువరో |
కామిత ఫలదుడు చరాచరములకు గర్తయైన సర్వేశ్వరుడితడు ||
చ|| తలప దశరథుని తనయుడట తానె తారక బ్రహ్మట |
వెలయ మానుషపు వేషమట వెగటు హరువిల్లు విరిచెనట |
అలరగ తానొక రాజట పాదాన నహల్య శాపము మాన్పెనట |
సొలవక దైవిక మానుషలీలలు చూపుచు మెరసీ జూడరో యితడు ||
చ|| జగతి వసిష్ఠుని శిష్యుడట జటాయువుకు మోక్షమిచ్చెనట |
అగచరులే తనసేనలట అంబుధి కొండల గట్టెనట |
మగువ కొరకుగానట కమలాసను మనుమని రావణు జంపెనట |
తగలౌకిక వైదికములు నొక్కట తానొరించీ జూడరో యితడు ||
చ|| వెస నమరుల వరమడిగెనట విభీషణ పట్టము గట్టెనట |
యెసగ నయోధ్యకు నేలికట యింద్రాదులకు గొలువిచ్చెనట |
పొసగ శ్రీ వేంకటగిరి నివసమట భువనము లుదరంబున ధరించెనట |
సుసరపు సూక్ష్మాధికములు తనందు జూపుచునున్నాడు చూడరో యితడు ||
రారా చిన్నన్నా రారా చిన్నన్నా
రారోరి చిన్నవాడ రారా ముద్దులాడ
రారోరి బాలకృష్ణ రారా , కృష్ణ రారా
రారా చిన్నన్నా రారోరి చిన్నవాడ
రారా ముద్దులాడ రారోరి బాలకృష్ణ
కిందిచూపుల గిలిగించి ఆలమందగొల్లెతల మరిగించి
సందడి వలపించి జవరాండ్ల ఊరవిందవైనయట్టి వేడుక కాడ
కొదలు మాటలనె గొణకుచు భూమి సుదతుల శిగ్గులుచూరాడి
చిదుకు చేష్టలనె చెణకుచూ ముద్దు పెదవిచవులు చూపిన జాణకాడ
కలికితనమునె కరగించి కాచి చెలులకాగిటనె చెలగి
లలనామణి యైన లక్కిమమ్మ గలసుక శ్రీవేంకటనాథు డైనవాడ
రావే కోడల రట్టడి కోడల పోవే పోవే అత్త య్య పొందులు నీతో చాలును
రంకెలు వేయుచు రాజులెదుట నీవు కొంకు కోసరు లేని కోడల
పంకజ ముఖినీవు పలుదొడ్ల వారిండ్ల అంకెల దిరిగేవు అత్త య్యా
ఈడాద నలుగురు నేగురు మొగలతో కూడి సిగ్గులేని కోడల
వాడక బదుగురి వలపించు కొని నీవు ఆడాదదిరి గేవు అత్త య్యా
బొడ్డున బుట్టిన పూపనికేనిన్ను గొడ్డేరు తెస్తి నే కోడల
గుడ్డము పయినున్న కోనేటి రాయని నడ్డగించు కుంటి నత్త య్యా
ప|| రూకలై మాడలై రువ్వలై తిరిగీని | దాకొని వున్నచోట దానుండ దదివో ||
చ|| వొకరి రాజుజేసు నొకరి బంటుగ జేసు | వొకరి కన్నెకల వేరొకరికి నమ్మించు |
వొకచోటనున్నధాన్య మొకచోట వేయించు | ప్రకటించి కనకమే భ్రమయించీ జగము ||
చ|| కొందరిజాళెలు నిండు కొందరికి సొమ్ములవు | కొందరి పుణ్యులజేసు గొందరి పాపులజేసు |
కొందరికొందరిలోన కొట్లాట వెట్టించు | పందెమాడినటువలె బచరించు పసిడీ ||
చ|| నిగనిగమనుచుండు నిక్షేపమై యుండు | తగిలి శ్రీవేంకటేశుతరుణియై తా నుండు |
తెగనిమాయై యుండు దిక్కు దెసయై యుండు | నగుతా మాపాల నుండి నటియించు బసిడీ ||
ప|| రెండుమూలికలు రేయిబగలు నున్నవి | అండదేహమం దొకటి ఆతుమలో నొకటి ||
చ|| యిదివో రసబద్ధము, యింద్రియములు మేనిలో | పదిలముగా నిలిపి బంధించుట |
అదివో వేధాముఖ, మంతరంగపుమనసు | చెదరకుండా జొనిపి శ్రీహరిదలచుట ||
చ|| తారవిద్య గంటిమి తగిలి నాసాగ్రమందు | మేరతో ద్రిష్టినిలిపి మేలుబొందుట |
చేరువ సువర్ణవిద్య, చిత్తములో బ్రణవము | ధీరత నాదముసేసి దేవుని బొగడుట ||
చ|| పుటజయమాయ నిట్టె పుణ్యపాపము లందులో | కుటిలపుగోరికల కొన దుంచుట |
యిటులనే శ్రీవేంకటేశు డిందిరయును | అటు ప్రకృతిపురుషునుటొరవచ్చుట ||
రంగ రంగ రంగ పతి రంగనాధా నీ
సింగారాలె తరచాయ శ్రి రంగ నాధా
పట్ట పగలే మాతో పలుచగ నవ్వేవు
ఒట్టులేల టలిగిరించు వడి నీ మాటలు వింటె
రట్టడివి మేరమీరకు రంగనాధా
రంగనాధా శ్రీ రంగనాధా
కావేటి రంగమున కాంతపై పాదాలు సాచి
రావు పోవు ఎక్కడికి రంగ నాధా
శ్రీ వేంకటాద్రి మీద చేరి నను కూడితివి
ఏవల చూచిన నీవేయిట రంగనాధా
రంగనాధా శ్రీ రంగనాధా
ప|| రమ్మనగా దనతో నే రానంటినా | చిమ్మును నింత ప్రియముచెప్ప నేలెనాకు ||
చ|| వెల్లవిరి దనమాట విననైతినా నేను | చెల్లబో నాకేల సేవ సేసీనె తాను |
యెల్లవారి దానేలీ నెవ్వరి బోలుదు నేను | బల్లిదుడు నాకేల బాతిపడె దానూ ||
చ|| చెప్పినట్లెల్లా నేను సేయకుండే దాననా | అప్పటి లేక లేటికి నంపీనె తాను |
కప్పురపు పడిగల కాంతలు గాచుకుండగా | విప్పుచు నాకుగా నేల వేగించీనె తానూ ||
చ|| గక్కన దాగూడగాను కాదు గూడదంటినా | ముక్కుమోప సాగిలేల మొక్కినె తాను |
యెక్కువ శ్రీ వేంకటేశుడెనసె దానన్ను నిట్టె | పెక్కు సతులలోననె పెద్దసేసీ దాను ||
ప|| రమ్మనవే ఇకను నీ రమణునిని | పమ్మి వలపులు చల్లీ బదిమారులు ||
చ|| నెలకొన్నప్పటినుండీ నిన్నే తప్పక చూచీ | తలపోసి తలపోసి తడబడీని |
మొలక నవ్వులతోడ మూతులు గిరిపీనదె | నలువంక పొంచి పొంచి నవ్వులు నవ్వీని ||
చ|| పెనగుచు బలుమారు పెచ్చుపెరిగీ దాను | గునిసి పరులమీద కోపగించీని |
వెనుకొని నీ జాడలే వెదకీ నితడు నేడు | మనసుమర్మాలు చూడమచ్చిక సేసీని ||
చ|| పొరుగు పొంతలనుండి బుద్ధులు చెప్పేనదె | గరిమల మించీ గలికి తనమునను |
యిరవై శ్రీ వేంకటేశుడిన్నిటా నిన్ను గలసె | సరసములాడు తానే చనవు చూపీని ||
ప|| రసికుడ తిరుపతి రఘువీరా | కొసరుగాదు నాలోని కూరిములు గాని ||
చ|| వెలయ నీ విరిచిన విల్లువంటిది గాదు | విలసిల్ల నాబొమ్మల విండ్లు గాని |
చెలగి తపసుచేసీ చిత్రకూటగిరి గాదు | గిలుకొట్టు నా కుచగిరులు గాని ||
చ|| మేటివైన నీవు వేసిన మొకము చూపు గాదు | సూటి దప్పని నా కనుచూపులు గాని |
గాటమై నీవు సేతువుగట్టిన జలధి గాదు | చాటున నా చెమటల జలధులు గాని ||
చ|| తగ నీవు గెలచిన దనుజ యుద్ధము గాదు | దగతోడి నా మదన యుద్ధము గాని |
నగు శ్రీ వేంకటేశ కనకసతి పొందు గాదు | పొగడే సీతనైన నా పొందులు గాని ||
ప|| రాజీవ నేత్రాయ రాఘవాయ నమో |
సౌజన్య నిలయాయ జానకీశాయ ||
చ|| దశరథ తనూజాయ తాటక దమనాయ |
కుశిక సంభవ యజ్ఞ గోపనాయ |
పశుపతి మహా ధనుర్భంజనాయ నమో |
విశద భార్గవరామ విజయ కరుణాయ ||
చ|| భరిత ధర్మాయ శుర్పణఖాంగ హరణాయ |
ఖరదూషణాయ రిపు ఖండనాయ |
తరణి సంభవ సైన్య రక్షకాయనమో |
నిరుపమ మహా వారినిధి బంధనాయ ||
చ|| హత రావణాయ సంయమి నాథ వరదాయ |
అతులిత అయోధ్యా పురాధిపాయ |
హితకర శ్రీ వేంకటేశ్వరాయ నమో |
వితత వావిలిపాటి వీర రామాయ ||
ల
ప|| లంకెలూడుటే లాభము యీ- | కింకరులను నలగెడికంటెను ||
చ|| జంపుల జంపక సరగునబాసేటి- | లంపటమేపో లాభము |
కంపుమోపుతో గనలి శరీరపు- | కొంపలోనవేగుటకంటెను ||
చ|| ఈవలనావల నేనేటియాసల- | లావు దిగుటేపో లాభము |
యేవగింతలకు నిరవగు నరకపు- | కోవులబడి మునుగుటకంటెను ||
చ|| తివిరి వేంకటాధిపుదాసులకృప- | లవలేశమెపో లాభము |
చవులని నోరికి సకలము దినితిని | భవకూపంబుల బడుటకంటెను ||
లక్ష్మీకల్యాణము లలితోంబాడిమిదె నేము
లక్ష్మీనారాయణులే లలనయు నీవును ||
చూపులు చూపులు మీకు సూసకమ్ బాసికము
వూపచన్ను గుబ్బలివి పూజికుండలు
తిపులమోవి తేనెలు తీరనిమధుపర్కము
దాపుగ వెండ్లి యాడరయ్య తగుందగు మీకును ||
మాటలు మీకిద్దఇకి మంత్రములు
మేటి తలంబ్రాలు మీలోమించు నవ్వులు
గాటమైన పులకలు కప్పుర వసంతాలు
నీటునం బెండ్లాడరయ్య నెరవేర మీకును ||
కౌగిలి కౌగిలి మీకు కందువపెండ్లి చవికె
పాగిన కోరికలె పావకొరళ్లు
ఆగిన శ్రీ వేంకటేశ అలమేలుమంగనీవు
వింగక పెండ్లాడరయ్య వేడ్కాయ మాకును ||
లక్ష్మీకల్యాణము లలితోంబాడిమిదె నేము
లక్ష్మీనారాయణులే లలనయు నీవును ||
చూపులు చూపులు మీకు సూసకమ్ బాసికము
వూపచన్ను గుబ్బలివి పూజికుండలు
తిపులమోవి తేనెలు తీరనిమధుపర్కము
దాపుగ వెండ్లి యాడరయ్య తగుందగు మీకును ||
మాటలు మీకిద్దఇకి మంత్రములు
మేటి తలంబ్రాలు మీలోమించు నవ్వులు
గాటమైన పులకలు కప్పుర వసంతాలు
నీటునం బెండ్లాడరయ్య నెరవేర మీకును ||
కౌగిలి కౌగిలి మీకు కందువపెండ్లి చవికె
పాగిన కోరికలె పావకొరళ్లు
ఆగిన శ్రీ వేంకటేశ అలమేలుమంగనీవు
వింగక పెండ్లాడరయ్య వేడ్కాయ మాకును ||
లలిత లావణ్య విలానముతోడ | నెలత ధన్యతగతిగె నేటితోడ ||లలిత||
కుప్పలుగా మైనసలుకొన్న కస్తూరితోడ| తొప్పదోగేటి చెమతతోడ|
అప్పుడటు శశిరేఖలైన చనుగవతోడ| దప్పిదేరేటి మొముదమ్మితోడ ||లలిత ||
కులుకుగబరీభరము కుంతలంబులతోడ | తొలగదోయని ప్రేమతోడ|
మొలకనవ్వులు దొలకుముద్దు జూపులతోడ| పులకలు పొడవైన పొలుపుతోడ || లలిత ||
తిరువేంకటాచలాధిపుని మన్ననతోడ | సరిలేని దివ్యవాసనలతోడ|
పతికించరాని అరవిరిభావముతోడ| సిరిదొలంకెడి చిన్ని సిగ్గుతోడ || లలిత ||
ప|| లాలనుచు నూచేరు లలనలిరుగడల |
బాలగండవీర గోపాలబాల || — (నీలాంబరి)
చ|| ఉదుట గుబ్బల సరసము లుయ్యాల లూగ |
పదరి కంకణరవము బహుగతులమ్రోగ |
వొదిగి చెంపల కొప్పు లొక్కింత వీగ |
ముదురు చెమటల నళికములు తొప్పదోగ || — (మోహన)
చ|| సొలపు తెలిగన్నుగవ చూపులిరువంక |
మలయు రవళులకు బహుమారును బెళంక |
కొలది కోవిగములు క్రోలుమదనాంక- |
ములగ్రేణిసేయు రవములు వడిదలంక || — (హుస్సేని)
చ|| సరుస పదములు జంగ చాపుచే బాయ |
గురులీల మీగళ్ళ గుచ్చెళ్ళరాయ |
కరమూలముల కాంతి కడుజాయజేయు |
సరస నురుకుసుమ వాసన లెదురుడాయ || — (సారంగ)
చ|| కొలది నునుమేనుల కూనలసి యాడ |
మెలకువతో నొకరొకరి మెచ్చి సరిగూడ |
తలలూచి చొక్కి చిత్తరు బొమ్మలాడ |
అలరి యెల్లరు మోహనా కృతులు చూడ || — (కాపీ)
చ|| లలిత తాంబూల రసకలితంబులైన |
తళుకు దంతములు కెంపుల గుంపులీన |
మొలక వెన్నెల డాలు ముసురు కొనితోన |
చెలగి సెలవుల ముద్దు చిరునవ్వులాన || — (లలిత)
చ|| మలయ మారుత గతులు మాటికి జెలంగ |
పలుకు గపురపు తావి పైపై మెలంగ |
పలుగాన లహరి యింపుల రాల్గరగంగా |
బలసి వినువారి చెవి బడలిక దొలంగ || — (మధ్యమావతి)
చ|| లలనా జనాపాంగ రలిత సుమచాప |
జలజలోచన దేవ సద్గుణ కలాప |
తలపు లోపల మెలగు తత్త్వప్రదీప |
భళిర గండపరేశ పరమాత్మరూప || — (సురటి)
లాలి శ్రీ క్రిష్ణయ్య నీల మేఘవర్ణ
నవ నీల మేఘవర్ణ
బాలగోపాలపాల పవ్వళింపరా….
సింగారించిన మంచి బంగారు ఊయలలోన
మరి బంగారు ఊయలలోన
శంఖు చక్రథరస్వామి నిదురపొరా
లలితాంగి రుక్మిణీ లలనాయె కావలెనా
నీకు లలనాయె కావలెనా
పలుకు కోయిల సత్యభామయె కావలెనా
అందెలూ మువ్వలూ సందడిగ మ్రోయగను
అతి సందడిగ మ్రోయగను
అందముగాను నీవు పవ్వలింపరా
పగడాల పతకాలు కంఠనా ధరియించి
నీ కంఠనా ధరియించి
వంగేవు తొంగేవు నిదురపోరా
అలుకలు పోనెల అలవేలు మంగతో
శ్రీ అలవేలు మంగతో
కులుకుచు శయ్యనించు వెంకటేశ్వరుడా
లెండో లెండో మాటాలించరో మీరు
కొండలరాయనినే పేర్కొన్నదిదె జాలి॥
మితిమీరె చీకట్లు మేటితలవరులాల
జతనము జతనము జతనము జాలోజాలి
యితవరులాల వాయించే వాద్యాలకంటె
అతిఘోషముల తోడ ననరో జాలి॥
గాములు వారెడి పొద్దు కావలి కాండ్లాల
జాము జాము దిరుగరో జాలో జాలి
దీమనపు పారివార దీవె పంజులు చేపట్టి
యేమరక మీలో మీరు యియ్యరో జాలి॥
కరుకామ్మె నడురేయి గడచె గట్టికవార
సరె సరె పలుకరో జాలోజాలి
యీ రీతి వేంకటేశుడిట్టె మేలుకొన్నాడు
గారవాన నిక మాన కదరో జాలి॥
|| లేదు బ్రహ్మవిద్యామహాసుఖము తమ- | కీడు తమకర్మ మేమిసేయగవచ్చు ||
చ|| నానావిధుల బొరలి నరుడు దానై వివిధ- | మైనకర్మములే అనుభవించి |
లేనిలంపటములకు లోనై దురితా- | ధీనులై క్రమ్మర దిరిగిపోవుటేకాని ||
చ|| పరగ నిన్నిట బొడమి బ్రాహ్మణుడై | సరిలేని వేదశాస్త్రములు చదివి |
అరుదయినకాంక్షచే నతిపాపపరులై | వెరవున బొడవెక్కి విరుగబడుటేకాని ||
చ|| చేరనిపదార్థములే చేరగోరుటగాని | చేరువనే యామేలు సిద్ధింపదు |
ధీరులై తమలోన దిరువేంకటేశ్వరుని | గోరి యిటు భజియింపగూడు టెన్నడుగాన ||
లేదు భయము మఱి కాదు భవము
ఆదియు నంత్యము దెలిసిన హరియాజ్ఞేకాన
తలపులుగడుగక వొడ లటు తా గడిగిన నేమి
వెలుపలికాంక్షలు వుడుగక విధులుడిగిన నేమి
అలరుచు శ్రీహరిదాస్యము ఆతుమ గలిగినయాతడు
చెలగుచు పనులైన సేసిన మరి యేమి
పొంచిన కోపము విడువక భోగము విడిచిననేమి
పంచేంద్రియములు ముదియక పై ముదిసిన నేమి
వించినదైవము నమ్మిన నిర్భరుడయినయాతడు
యెంచుక యేమార్గంబుల నెట్టుండిన నేమి
వేగమె లోపల గడుగక వెలి గడిగిన నేమి
యోగము దెలియక పలుచదువులు దెలిసిన నేమి
యీగతి శ్రీ వేంకటపతి నెఱిగి సుఖిందేటియాతడు
జాగుల ప్రపమ్చమందును నతమైనా నేమి
ప|| లోకపు నీ చేతలకు లోనేకాదా | నీకు మారుకొని యుండ నేరుపా నాకు ||
చ|| వుడివోని జవ్వనము వొడిగట్టుకొని నీతో | పడిబెట్టి యలుగగ సంగతే నాకు |
చిడిముడి కోరికలు చిత్తములో నుండగాను | తడిసి నిన్ను బాయగ తగునా నాకు ||
చ|| వుప్పతిల్లు జన్నులు వురమున మోచుకొని | చిప్పిలనీ నేరాలెంచ జెల్లునా నాకు |
ముప్పిరి మొగమోటలు మోముమీద నుండగాను | అప్పుడే నిన్నణకించ ననువా నాకు ||
చ|| నించుకొన్న జవ్వనము నిలువున బెట్టుకొని | చండసేసి పెనగగ సరవే నాకు |
అండనే శ్రీవేంకటేశ అంతలో నన్నేలితివి | అందుకాచి దూరదగ నవునా నాకు ||