Loading...

 

Prime Astrologer's Blog

https://primeastrology.com/wp-content/uploads/2020/04/kali.jpg

శ్రీమన్మహాదేవదేవీ! మహిమండలావాసమైయున్న  యో   దేవతాసార్వాభౌమామణీ! ధీమణీ! లోకసంచారిణీ భక్త  చింతామణీ! దుష్టశిక్షామణీ! మంజుభాషామణీ! పాపసంహారిణీ! పుణ్యసంచారిణీ! ముక్తి కాంతామణీ! పావనీ! నిన్ను వర్ణింపగా బ్రహ్మాశేషాదులు న్నోపలేరునేనెంతవాడన్ ధరన్ మున్నుయాదానవానీక దుర్మార్గముల్ బాపగా పెక్కురూపంబు లంబెక్కు నామంబులన్ నుద్భవంబందవే, తొల్లీఇంద్రాది లోకంబులంజేరి తాజేయు కల్లోలముల్ జూచి భీతాత్ములైనట్టి యా దేవసంఘంబులంద్రుంపగా జూచి మాంసాదికానేక శల్యాపురీషాదులుంగల్గు కూపంబులం ద్రోయగా దేవతానీక మాబాధలన్ జిక్కితాజేయు నద్దేదియుంగాన కోదేవి! యోశాంభవీ! శాంకరీ! కనకదుర్గాంబ! యో కంచి కామాక్షి! యోకాళి! యోపార్వతీ! శంభురాణీ! భవానీ!...