శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రబాధివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజేవాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్య మిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండనై రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్ నీ కటాక్షంభునన్ జూచితే వేడుకల్ చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాస్వయా దేవ నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై...